అందరూ అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటారు. కానీ.. ఓ జంట మాత్రం ఏకంగా అగ్నిపర్వతం సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఆశ్చర్యపోతున్నారా..! నిజమే ఈ వింత ఘటన ఫిలిప్పిన్స్‌లో చోటుచేసుకుంది. ఓ జంట తమ వివాహాన్ని ఎప్పటికీ మరిచిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించారు. అప్పుడు వారికి ఫిలిప్పీన్స్‌లోని తాల్ అగ్నిపర్వతం గుర్తుకువచ్చింది. తమ వివాహాన్ని అక్కడే చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అంతే ఆ పర్వతానికి సమీపంలోనే తమ పెళ్లి తంతు ఏర్పాట్లు చేసుకున్నారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడమే తమ పెళ్లికి శుభముహూర్తంగా భావించారు. (ఫిలిప్పీన్స్‌లో తాల్ అగ్ని ప్రర్వతం విస్పోటనం)
అలా పెళ్లికి కాస్త ముందుగా వివాహ ప్రదేశానికి చాలా దగ్గరగా ఉన్న తాల్ అగ్నిపర్వతం హఠాత్తుగా పొగ, బూడిద వెదజల్లటం మొదలెట్టింది. దానితో ఏదో జరుగుతోందని బంధవులంతా బయపడిపోయినా.. వారు వివాహాన్ని రద్దు చేసుకోలేదు. వాయిదా కూడా వేసుకోలేదు. వారికి నచ్చజెప్పి ధైర్యంగా పెళ్లి చేసుకున్నాం. అగ్నిపర్వతానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో వీరి వివాహం జరగడం అద్భుతం. ఈ నిర్ణయం వల్ల 'మేము అత్యద్భుతమైన క్షణాలను సొంతం చేసుకోగలిగాం. ఇది మాకు జీవితమంతా తీపి జ్ఞాపకంగా మిగులుతుంది’ అని ఆ నవ దంపతులు ఆనందంతో అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment