రెగ్జావిక్: ఐస్‌లాండ్‌లో మరోసారి భారీ అగ్నిపర్వతం బద్దలైంది. ఇక్కడ అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగోసారి. అగ్నిపర్వతం నుంచి కాంతివంతమైన కాషాయ రంగులో ఉన్న లావా, పెద్ద ఎత్తున పొగలు గాల్లోకి ఎగసిపడ్డాయని వాతావరణకేంద్రం తెలిపింది. కరిగిపోయిన రాతితో పాటు లావా పర్వతానికి ఇరువైపులా విరజిమ్మాయి.
రాజధాని రెగ్జావిక్ ప్రాంతంలో ఉన్న ఈ అగ్నిపర్వతం బద్దలవబోతోందని అధికారులు కొన్నిరోజుల ముందే హెచ్చరించారు. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. రెగ్జావిక్‌లో పోలీసులు అత్యవసరస్థితి ప్రకటించారు. ఐస్‌లాండ్‌లో 30 దాకా యాక్టివ్ అగ్నిపర్వతాలున్నాయి. దీంతో ఇక్కడికి అగ్నిపర్వాతాలను చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment