valcanos
-
10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు
ఇండోనేషియా బాలీలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో బూడిద కమ్ముకుని పలు విమానాలు రద్దయ్యాయి. బాలీలోని ‘మౌంట్ లెవోటోబి లకీ-లకీ’ అనే అగ్నిపర్వతం రెండోసారి పేలడంతో దాదాపు 10 కిలోమీటర్ల(32,808 అడుగులు) ఎత్తులో దట్టంగా బూడిద కమ్ముకుందని అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రయాణాలు ప్రమాదకరమని చెప్పారు. దాంతో కొన్ని సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసినట్లు పేర్కొన్నారు.బాలీలోని ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో ఉన్న మౌంట్ లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం నవంబర్ 3న మొదట విస్ఫోటనం చెందింది. తిరిగి మంగళవారం పలుమార్లు భారీ స్థాయిలో బద్దలవ్వడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఇండిగో ప్రకటన విడుదల చేసింది. ‘బాలీలో ఇటీవలి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దాంతో వాతావరణంలో భారీగా బూడిద మేఘాలు ఏర్పడ్డాయి. దానివల్ల ఆ ప్రాంతానికి వచ్చిపోయే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని తెలిపింది. ఇండిగో సంస్థ బెంగళూరు నుంచి ఇండోనేషియా బాలీకి రోజువారీ సర్వీసు నడుపుతోంది.ఢిల్లీ-ఇండోనేషియా మధ్య ప్రయాణించే రోజువారీ విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ధ్రువీకరించింది. అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా బుధవారం ఇండోనేషియాకు ప్రయాణించే విమాన ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.ఇదీ చదవండి: గుడ్‌బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటనబాలీ నుంచి దాదాపు 800 కి.మీ దూరంలో ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో నవంబర్ 3న లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం మొదట విస్ఫోటనం చెందింది. దానివల్ల తొమ్మిది మంది మరణించారు. తాజాగా మంగళవారం మళ్లీ పలుమార్లు విస్ఫోటనం చెందింది. మొదటిసారి ఘటన జరిగిన సమయంలో నవంబర్ 4 నుంచి 12 వరకు సింగపూర్, హాంకాంగ్, కొన్ని ఆస్ట్రేలియన్ నగరాల నుంచి బాలీకి ప్రయాణించే 80 విమానాలు రద్దు చేశారు. -
Volcano: ఐస్లాండ్లో బద్దలైన మరో అగ్నిపర్వతం
రెగ్జావిక్: ఐస్లాండ్లో మరోసారి భారీ అగ్నిపర్వతం బద్దలైంది. ఇక్కడ అగ్నిపర్వతం బద్దలవడం మూడు నెలల్లో ఇది నాలుగోసారి. అగ్నిపర్వతం నుంచి కాంతివంతమైన కాషాయ రంగులో ఉన్న లావా, పెద్ద ఎత్తున పొగలు గాల్లోకి ఎగసిపడ్డాయని వాతావరణకేంద్రం తెలిపింది. కరిగిపోయిన రాతితో పాటు లావా పర్వతానికి ఇరువైపులా విరజిమ్మాయి. రాజధాని రెగ్జావిక్ ప్రాంతంలో ఉన్న ఈ అగ్నిపర్వతం బద్దలవబోతోందని అధికారులు కొన్నిరోజుల ముందే హెచ్చరించారు. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. రెగ్జావిక్‌లో పోలీసులు అత్యవసరస్థితి ప్రకటించారు. ఐస్లాండ్లో 30 దాకా యాక్టివ్ అగ్నిపర్వతాలున్నాయి. దీంతో ఇక్కడికి అగ్నిపర్వాతాలను చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇదీ చదవండి.. హౌతీల డ్రోన్‌ను పేల్చేసిన అమెరికా -
అగ్నిపర్వతంలో పడిపోయిన డ్రోన్ కెమెరా.. దానికి ముందు
రేక్జావిక్: డ్రోన్ కెమెరాల వాడకం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. డ్రోన్ గాలిలో చక్కర్లు కొడుతూ.. ప్రతీ ఒక్కదానిని కవర్ చేసే యాంగిల్స్ భలే గమ్మత్తుగా ఉంటుంది. అందుకే సినిమాలు, డాక్యుమెంటరీలు మొదలుకొని చివరికి పెళ్లిలో కూడా డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. అయితే ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి భగభగమండే అగ్నిపర్వతాన్ని డ్రోన్ కెమెరా ఆధారంగా వీడియో తీయాలనుకున్నాడు. అనుకుందే తడవుగా తన పనిని ప్రారంభించాడు. అప్పుడే బద్దలైన అగ్నిపర్వతంలో ఎగజిమ్ముతున్న లావాను చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.అయితే దురదృష్టవశాత్తూ ఆ డ్రోన్ అగ్నిపర్వతంలో పడి కరిగిపోయింది. అయితే అతను తీసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జోయి హెల్మ్స్ అనే య్యూట్యూబర్.. ఐస్‌ల్యాండ్‌లోని జెల్డింగదాలిర్ లోయలో కొత్తగా కనుగొన్న అగ్నిపర్వతాన్ని చిత్రీకరించేందుకు వెళ్లాడు. అయితే ఆ ప్రాంతమంతా లావాతో నిండిపోవడంతో అగ్నిపర్వం బిలం వరకు వెళ్లడం కష్టమని భావించాడు. దీంతో అతడి డ్రోన్‌కు పనిచెప్పాడు. అగ్నిపర్వతం నుంచి విరజిమ్ముతున్న లావా కాలువ మీదుగా.. ఆ డ్రోన్ కదిలింది. చివరికి బిలం వద్దకు చేరుకుంది. ఇక్కడే అతను తప్పు చేశాడు. డ్రోన్‌ను ఇంకా ఎత్తులోకి తీసుకెళ్లకుండా లావాకు మరింత దగ్గరగా తీసుకెళ్లాడు. దీంతో లావా నుంచి వచ్చే వేడికి డ్రోన్ కరిగిపోయింది. ఆ వెంటనే సిగ్నల్ కూడా పోయింది. అగ్నిపర్వతంలో పడిపోతున్న డ్రోన్.. చివరి క్షణంలో చిత్రీకరించిన వీడియోను చూసేందుకు మాత్రం నెటిజన్లు ఆసక్తి చూపారు. ఫలితంగా ఈ వీడియోకు సుమారు 4.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చదవండి: 12 అడుగుల భారీ తిమింగళం.. బీచ్ వద్దకు ఎవరు రావొద్దు ఈ పిల్ల తెలివి మామూలుగా లేదు.. -
ఐస్లాండ్లో పేలిన అగ్ని పర్వతం
బోథ్: అమెరికాలోని ఐస్లాండ్లో అగ్నిపర్వతం పేలి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం గుర్రాలతండాకు చెందిన మయూరి సింగ్ మృతి చెందారు. ఆమె భర్త ప్రతాప్‌సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 9వ తేదీన ఈ ఘటన జరగగా.. ఇక్కడి బంధువులకు ఆలస్యంగా విషయం తెలిసింది. సింగ్ బంధువుల కథనం ప్రకారం.. గుర్రాలతండాకు చెందిన ప్రతాప్‌సింగ్ ఇరవై ఏళ్ల క్రితం అమెరికా వలస వెళ్లాడు. అక్కడ పలు వ్యాపారాలు చేస్తున్నాడు. ఈనెల 9న ఐస్లాండ్ చూసేందుకు భార్యాభర్తలిద్దరూ వెళ్లారు. అక్కడ ఉన్న వాతావరణాన్ని చూస్తున్న క్రమంలో అక్కడే ఉన్న అగి్నపర్వతం ఒక్కసారిగా బద్ధలైంది. ఈ ఘటనలో మయూరిసింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రతాప్‌సింగ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం బుధవారం ఉదయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
బద్దలైన అగ్నిపర్వతం: ఏడుగురి మృతి
ఇండోనేషియా: ఇండోనేషియాలోని గాంబెర్‌లో ఆదివారం సినాబంగ్ అనే అగ్నిపర్వతం బద్దలైంది. దీని ప్రభావంతో సమీప ప్రాంతాల్లో సేద్యం చేసుకుంటున్న ఏడుగురు దుర్మరణం చెందారు. అగ్నిపర్వతం నుంచి భారీ స్థాయిలో లావా వెలువబడుతోంది. అగ్నిపర్వతం నుంచి వెలువడిన తీవ్రమైన వేడి, విషవాయువులతో కూడిన బూడిద పెద్ద ఎత్తునా ఆకాశంలోకి చిమ్మతూ మూడు కిలోమీట్లరకు పైగా ఆవరించింది. గాంబెర్‌లోని సమీప నివాస గృహాలపైనా, వాహనాలపైనా బూడిద విస్తరించింది. అగ్నిపర్వతం విస్పోటనం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా సిబ్బంది వెంటనే సహాయక చర్యల్లో పాల్గొని చిక్కుకున్న వేలమంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 400 సంవత్సరాల పాటు నిద్రాణ స్థితిలో ఉన్న అగ్నిపర్వతం ఒక్కసారిగా విజృంభించింది. గత 2010, 2014 సంవత్సరాలలో సినాబంగ్ అగ్నిపర్వతం విస్ఫోటనం ధాటికి 12 మందికి పైగా ప్రజలు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కాగా, ఇండోనేషియా చుట్టూ 120 క్రియాశీలక అగ్నిపర్వతాలు ఆవరించి ఉన్నాయి.