
బోథ్: అమెరికాలోని ఐస్లాండ్‌లో అగ్నిపర్వతం పేలి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం గుర్రాలతండాకు చెందిన మయూరి సింగ్ మృతి చెందారు. ఆమె భర్త ప్రతాప్‌సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 9వ తేదీన ఈ ఘటన జరగగా.. ఇక్కడి బంధువులకు ఆలస్యంగా విషయం తెలిసింది. సింగ్ బంధువుల కథనం ప్రకారం.. గుర్రాలతండాకు చెందిన ప్రతాప్‌సింగ్ ఇరవై ఏళ్ల క్రితం అమెరికా వలస వెళ్లాడు. అక్కడ పలు వ్యాపారాలు చేస్తున్నాడు. ఈనెల 9న ఐస్లాండ్ చూసేందుకు భార్యాభర్తలిద్దరూ వెళ్లారు. అక్కడ ఉన్న వాతావరణాన్ని చూస్తున్న క్రమంలో అక్కడే ఉన్న అగి్నపర్వతం ఒక్కసారిగా బద్ధలైంది. ఈ ఘటనలో మయూరిసింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రతాప్‌సింగ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం బుధవారం ఉదయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.