EURO 2024 Qualifiers: Cristiano Ronaldo Scores His 123rd Goal In His 200 Match, See Details - Sakshi
Sakshi News home page

#CristianoRonaldo: రొనాల్డో చరిత్ర.. 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా

Published Wed, Jun 21 2023 1:02 PM | Last Updated on Wed, Jun 21 2023 1:37 PM

EURO 2024 Cristiano Ronaldo-Goal His-200-Match Portugal Beat Iceland-1-0 - Sakshi

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయిని అందుకున్నాడు. పోర్చుగల్‌ తరపున రొనాల్డో 200వ మ్యాచ్‌ ఆడాడు. పురుషుల ఫుట్‌బాల్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రొనాల్డో చరిత్రకెక్కాడు. యూరోకప్‌ 2024 క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా పోర్చుగల్‌ మంగళవారం అర్థరాత్రి ఐస్‌లాండ్‌తో తలపడింది. మ్యాచ్‌లో పోర్చుగల్‌ 1-0 తేడాతో నెగ్గింది.

పోర్చుగల్‌ తరపున వచ్చిన ఏకైక గోల్‌ కూడా క్రిస్టియానో రొనాల్డోదే కావడం విశేషం. ఆట 89వ నిమిషంలో రొనాల్డో జట్టుకు గోల్‌ అందించాడు. ఇక​ రొనాల్డోకు ఇది 123వ అంతర్జాతీయ గోల్. 200వ మ్యాచ్‌ ఆడడంపై క్రిస్టియానో రొనాల్డో స్పందించాడు.

''చాలా సంతోషంగా ఉంది. దేశం తరపున 200 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహిస్తానని ఊహించలేదు. నా కెరీర్‌లో ఇదొక గొప్ప ఘనతగా భావిస్తున్నా'' అంటూ చెప్పుకచ్చాడు. కాగా యూరో 2024 క్వాలిఫయింగ్‌ టోర్నీలో గ్రూప్‌-జెలో ఉన్న పోర్చుగల్‌ తాము ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నాలుగు విజయాలు అందుకొని టాపర్‌గా కొనసాగుతుంది.

చదవండి: మెస్సీని మిస్సయ్యాం!.. అర్జెంటీనా వస్తానంటే భారత్‌ వద్దన్నది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement