Cristiano Ronaldo
-
మెస్సీ కాదు!.. నేనే అత్యుత్తమ ఆటగాడిని: రొనాల్డో
దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఫుట్‌బాల్ ప్రపంచంలో మకుటం లేని మహారాజులుగా వెలుగొందుతున్నారు పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)- అర్జెంటీనా లెజెండ్ లియోనల్ మెస్సీ(Lionel Messi). అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకునే ఈ ఇద్దరికీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే, ఈ వీళ్లిద్దరిలో ఎవరు గొప్ప అన్న చర్చ ఎప్పుడూ ఆసక్తికరమే.ఈ విషయంపై రొనాల్డో స్వయంగా స్పందించాడు. చాలా మంది మెస్సీకే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT) బిరుదు ఇచ్చేందుకు మొగ్గుచూపవచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే, తాను మాత్రం పరిపూర్ణ ఫుట్‌బాలర్‌ని అని పేర్కొన్న రొనాల్డో.. ఫుట్‌బాల్ చరిత్రలో తన కంటే గొప్ప ఆటగాడు లేడని అనడం విశేషం.నేనే ‘కంప్లీట్ ప్లేయర్’స్పానిష్ మీడియా అవుట్లెట్ లాసెక్టా టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టియానో రొనాల్డో మాట్లాడుతూ.. ‘‘నాలాగా ప్రపంచంలో పరిపూర్ణమైన ఫుట్‌బాలర్ మరెవరూ లేరని అనుకుంటా. ఇప్పటి వరకు ఉన్న ఫుట్‌బాల్ ఆటగాళ్లందరిలో నేనే ‘కంప్లీట్ ప్లేయర్’. నేను అన్ని రకాలుగా ఫుట్‌బాల్ ఆడగలను. చాలా మంది మెస్సీ, మారడోనా లేదంటే.. పీలే పేరు చెప్తారేమో!చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడినివాళ్ల అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఏదేమైనా మోస్ట్ కంప్లీట్ ప్లేయర్ మాత్రం నేనే! ఫుట్‌బాల్ చరిత్రలోనే నేను అత్యుత్తమ ఆటగాడిని. నా కంటే మెరుగ్గా ఆడే ఫుట్‌బాలర్‌ను ఇంత వరకూ చూడలేదు. ఇవి నా మనస్ఫూర్తిగా చెబుతున్న మాటలు’’ అని పేర్కొన్నాడు.అదే విధంగా మెస్సీతో తన అనుబంధం గురించి చెబుతూ.. ‘‘మెస్సీతో నాకు ఎప్పుడూ ఎలాంటి సమస్యా లేదు. గత పదిహేనేళ్లుగా మేము అవార్డులు పంచుకుంటున్నాం. మా మాధ్య ఎలాంటి గొడవలు లేవు. అంతా సవ్యంగానే ఉంది.తనకోసం నేను ఆంగ్లాన్ని తర్జుమా చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో భలే సరదాగా ఉండేవాళ్లం. ఇక ఆటగాళ్లుగా మేము ప్రత్యర్థులమే కదా. తను తన క్లబ్‌కి, నేను నా క్లబ్‌కి మద్దతుగా ఉంటాం. జాతీయ జట్ల విషయంలోనూ అంతే. అయితే, ఆటతీరు ఎలా ఉందన్న అంశంపై పరస్పరం చర్చించుకుంటూ.. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. మా మధ్య ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పోటీయే ఉంటుంది’’ అని రొనాల్డో తెలిపాడు.కాగా 2002లో పోర్చుగీస్ క్లబ్ స్పోర్టింగ్ జీపీ తరఫున ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా ఎంట్రీ ఇచ్చిన రొనాల్డో.. క్లబ్, అంతర్జాతీయ స్థాయిలో కలిపి ఓవరాల్‌గా 923 గోల్స్‌తో టాప్ గోల్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించిన రొనాల్డోకు ఫిఫా వరల్డ్‌కప్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 648 మిలియన్ల మంది ఫాలోవర్లుఅయితే, ఈ విషయంలో మెస్సీదే పైచేయి. కెప్టెన్‌గా అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించిన ఘనత అతడికి దక్కింది. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫాలోవర్ల విషయంలోనూ రొనాల్డో- మెస్సీ మధ్య పోటీ ఉంది. అయితే, ఇందులో పోర్చుగీస్ ఆటగాడిదే ఆధిపత్యం. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు రొనాల్డోకు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి ఏకంగా 648 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. మెస్సీకి 504 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్ -
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా..
-
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా
క్రిస్టియానో రొనాల్డో.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ సాకర్ దిగ్గజాల్లో ఒకరిగా ఎదిగిన ఈ పోర్చుగల్ స్టార్ ఫుట్ బాలర్.. తనకంటూ ప్రత్యేకంగా అభిమాన ఘనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మైదానంలోనే కాదు ఆఫ్‌ది ఫీల్డ్‌లో కూడా రికార్డులు కొల్లగొట్టడంలో రొనాల్డోకి మించిన వారే లేరు. ఇటీవలే తన కెరీర్లో 900 గోల్‌లను సాధించి చరిత్ర సృష్టించిన రొనాల్డో.. తాజాగా మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.సోషల్ మీడియా కింగ్..రొనాల్డో తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిలో కలిపి ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 100 కోట్లను దాటింది. తద్వారా సోషల్‌మీడియాలో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు.తాజాగా ఈ విషయాన్ని రొనాల్డోనే అభిమానులతో పంచుకున్నాడు. "మనం చరిత్ర సృష్టించాము. 1 బిలియన్(100 కోట్లు) ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాము. ఇది కేవలం సంఖ్యమాత్రమే కాదు. కోట్లాది మంది ప్రేమకు, అభిమానానికి నిదర్శనం. మదీరా వీధుల్లో ఫుట్‌బాల్ ఆడే స్థాయి నుంచి ప్రపంచంలోని అతిపెద్ద వేదికలపై ఆడగలిగాను. నేను ఎల్లప్పుడూ నా కుటుంబం కోసం, మీ కోసమే ఆడాను. ఇప్పుడు ఏకంగా వంద కోట్ల మంది నా వెనక ఉన్నారు. నా కెరీర్లో నేను చవిచూసిన ఎత్తుపల్లాల్లో, నేను వేసే ప్రతీ అడుగులోనూ మీరున్నారు. అభిమానుల ఆదరాభిమానాలతోనే నా ఈ ప్రయాణం సాధ్యమైంది. మనమంతా కలిస్తే ఏదైనా సాధించగలమని నిరూపించాం. నన్ను సపోర్ట్ చేసి నా జీవితంలో భాగమైనందుకు అందరికి ధన్యవాదాలు. మనం ఇంకా చాలా సాధించాలి. మనమంతా కలిసి ముందుకు సాగుతాం అని ఎక్స్‌లో రొనాల్డో రాసుకొచ్చాడు. కాగా రొనాల్డో ఇటీవలే యువర్ క్రిస్టియానో" పేరుతో యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించగా.. 90 నిమిషాల వ్యవధిలోనే ఇది ఒక మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌ను పొందాడు. ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఖాతాకు 6 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇన్‌స్టాలో ఈ ఫుట్‌బాల్ స్టార్‌ను 63.9కోట్ల మందికి పైగా అనుసరిస్తున్నారు. ‘ఎక్స్’లో 11.3 కోట్ల మంది, ఫేస్బుక్లో 17 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.చదవండి: వాళ్లు వచ్చిన తరువాతే ఆడతామన్నారు... We’ve made history — 1 BILLION followers! This is more than just a number - it’s a testament to our shared passion, drive, and love for the game and beyond.From the streets of Madeira to the biggest stages in the world, I’ve always played for my family and for you, and now 1… pic.twitter.com/kZKo803rJo— Cristiano Ronaldo (@Cristiano) September 12, 2024 -
మెస్సీ, రొనాల్డో లేకుండానే.. ‘బాలన్ డోర్’ అవార్డు నామినేషన్లు
పారిస్: దిగ్గజాలు లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) లేకుండానే ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మక పురస్కారంగా భావించే ‘బాలన్ డోర్’ 2024 అవార్డీల నామినీల జాబితా తయారైంది. యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్లేయర్లకు ప్రతి ఏటా అందించే ఈ అవార్డును ఇప్పటి వరకు 37 ఏళ్ల మెస్సీ 8 సార్లు అందుకోగా... రొనాల్డో ఐదుసార్లు దక్కించుకున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 28న ‘బాలన్ డోర్’ అవార్డులను ప్రదానం చేయనుండగా... దీని కోసం కుదించిన 30 మంది ప్లేయర్ల జాబితాను ప్రకటించారు. ఇందులో మెస్సీ, రొనాల్డోకు చోటు దక్కలేదు. ఫ్రాన్స్ స్ట్రయికర్ ఎంబాపె, ఇంగ్లండ్ స్టార్ హ్యారీ కేన్, స్పెయిన్ యువ స్ట్రయికర్ లామినె తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. మెస్సీ, రొనాల్డో రేసులో లేకపోవడం 2003 తర్వాత ఇదే తొలిసారి. 2006లో మొదటిసారి ‘బాలన్ డోర్’ పురస్కారానికి నామినేట్ అయిన మెస్సీ... 2009లో తొలి అవార్డు దక్కించుకున్నాడు. మరోవైపు 2004లో మొదటిసారి నామినేట్ అయిన రొనాల్డో... ఐదుసార్లు అవార్డు అందుకున్నాడు. కాగా యూరోపియన్ లీగ్‌ల్లో ప్రదర్శన ఆధారంగానే ఈ పురస్కారాన్ని అందించడం ఆనవాయితీ. ప్రస్తుతం మెస్సీ అమెరికా లీగ్‌లలో... రొనాల్డో సౌదీ అరేబియాలోని అల్–నాసర్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకే వీరిద్దరిని బాలన్ డోర్ అవార్డుకు నామినేట్ చేయలేదు. -
అత్యంత అరుదైన మైలురాయికి చేరువలో క్రిస్టియానో రొనాల్డో..!
పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయికి చేరువయ్యాడు. ప్రస్తుతం రొనాల్డో సౌదీ సూపర్ కప్ టోరీ్నలో అల్ నాసర్ క్లబ్‌కు ఆడతున్నాడు. అల్ హిలాల్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్ నాసర్ క్లబ్ 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. అల్ నాసర్ జట్టు చేసిన ఏకైక గోల్ రొనాల్డో ద్వారా వచ్చింది. రొనాల్డో ప్రొఫెషనల్ కెరీర్లో ఇది 898వ గోల్. మరో రెండు గోల్స్ సాధిస్తే రొనాల్డో కెరీర్లో 900 గోల్స్ పూర్తి చేసుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఎర్విన్ హెల్మ్చెన్ (జర్మనీ; 987 గోల్స్), జోసెఫ్ బికాన్ (ఆస్ట్రియా–చెక్ రిపబ్లిక్; 950 గోల్స్), రొనాల్డ్ లెస్లీ రూకీ (ఇంగ్లండ్; 934 గోల్స్) కెరీర్లో 900 గోల్స్ మైలురాయిని దాటారు. -
EURO 2024: పోర్చుగల్ అవుట్.. చివరి మ్యాచ్ ఆడేసిన రొనాల్డో!
యూరో కప్-2024 ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ పోర్చుగల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా రిక్తహస్తాలతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.ఈ క్రమంలో ప్రతిష్టాత్మక యూరో కప్ టోర్నీలో పోర్చుగల్ లెజెండరీ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో శకం ముగిసినట్లయింది. కాగా జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ 2024 ఎడిషన్‌లో స్లొవేనియాను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన పోర్చుగల్.. తాజాగా ఫ్రాన్స్‌తో తలపడింది.ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకనూట ఇరవై నిమిషాల పాటు సాగిన ఈ కీలక మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో పెనాల్టి షూటౌట్లో భాగంగా ఫ్రాన్స్ 5-3తో పోర్చుగల్‌పై పైచేయి సాధించింది. ఈ క్రమంలో కెలియన్ ఎంబాపే బృందం సెమీస్‌కు దూసుకెళ్లింది.మరోవైపు భారీ అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన పోర్చుగల్ ఇంటిబాట పట్టింది. కాగా 39 ఏళ్ల రొనాల్డోకు జాతీయ జట్టు తరఫున ఇదే చివరి మ్యాచ్ కానుంది. ఇందుకు సంబంధించి ఈ పోర్చుగల్ ఆటగాడు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు.ఇక ఆరోసారి యూరో కప్‌లో భాగమైన రొనాల్డో ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో 14 గోల్స్ సాధించాడు. అయితే, ఈసారి మాత్రం షూటౌట్లో మినహా గోల్స్ స్కోర్ చేయలేకపోయాడు.పోర్చుగల్ వీరుడిగానే కాదు..అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో క్రిస్టియానో రొనాల్డో అత్యధిక గోల్స్ వీరుడిగా కొనసాగుతున్నాడు. పోర్చుగల్ తరఫున అతడు 130 గోల్స్ కొట్టాడు.మరోవైపు.. అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ 108 గోల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, మెస్సీ ఖాతాలో వరల్డ్‌కప్ ఉండగా.. రొనాల్డోకు మాత్రం ఆ లోటు అలాగే ఉండిపోయింది. కాగా యూరో కప్-2024లో ఫ్రాన్స్ సెమీ ఫైనల్లో స్పెయిన్‌తో తలపడనుంది. -
Euro Cup 2024: క్వార్టర్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్న ఎంబపే, రొనాల్డో జట్లు
యూరో కప్ 2024లో ఆరు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. స్పెయిన్, జర్మనీ, ఇంగ్లండ్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, ఫ్రాన్స్ జట్లు ఫైనల్-8కు చేరాయి. మరో రెండు బెర్త్‌లు ఖరారు కావల్సి ఉంది.ఇవాళ (జులై 2) జరిగిన మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్.. స్లొవేనియాపై 3-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. నిర్ణీత సమయంతో పాటు (90 నిమిషాలు) అదనపు సమయంలోనూ (30 నిమిషాలు) గోల్స్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ల వరకు వెళ్లింది. పెనాల్టీ షూటౌట్స్‌లో పోర్చుగల్ మూడు అవకాశాలను గోల్స్‌గా మలచగా.. స్లొవేనియా మూడు అవకాశాలను వృధా చేసుకుంది. పోర్చుగల్ గోల్ కీపర్ డియోగో కోస్టా అద్భుతమైన ప్రదర్శన కనబర్చి స్లోవేనియా మూడు ప్రయత్నాలను అడ్డుకున్నాడు. నిర్ణీత సమయంలో లభించిన పెనాల్టీని గోల్‌గా మలచడంలో విఫలమైన క్రిస్టియానో రొనాల్డో.. షూటౌట్స్‌లో ఓ గోల్ చేశాడు. పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్లో కైలియన్ ఎంబపే జట్టు ఫ్రాన్స్‌తో తలపడనుంది.క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్..స్పెయిన్ వర్సెస్ జర్మనీ (జులై 5)పోర్చుగల్ వర్సెస్ ఫ్రాన్స్ (జులై 6)ఇంగ్లండ్ వర్సెస్ స్విట్జర్లాండ్ (జులై 6)నాలుగో క్వార్టర్ ఫైనల్ (జులై 7) -
Euro Cup 2024: బోణీ కొట్టిన రొనాల్డో టీమ్
యూరో కప్ 2024లో దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్ బోణీ కొట్టింది. గ్రూప్-ఎఫ్‌లో భాగంగా ఇవాళ (జూన్ 19) జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్.. చెక్ రిపబ్లిక్‌పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ద భాగంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించలేదు. ద్వితియార్ధంలో తొలుత (62వ నిమిషంలో, లుకాస్ ప్రొవోద్) చెక్ రిపబ్లిక్, ఆతర్వాత పోర్చుగల్ (69వ నిమిషంలో, రాబిన్ హ్రనాక్) గోల్స్ చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. అయితే నిర్ణీత సమయం ముగిశాక 92వ నిమిషంలో ఫ్రాన్సిస్కో అద్భుతమైన గోల్ చేయడంతో పోర్చుగల్ 2-1 తేడాతో విజయం సాధించింది.చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డోచెక్ రిపబ్లిక్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. రొనాల్డో ఆరు యూరో కప్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రొనాల్డో 2004, 2008, 2012, 206, 2020, 2024 ఎడిషన్లలో పాల్గొన్నాడు. రొనాల్డో తర్వాత క్రొయేషియా ఆటగాడు లూకా మోడ్రిక్, పోర్చుగల్ ఆటగాడు పెపె అత్యధికంగా ఐదు యూరో కప్‌లు ఆడాడు.జార్జియాను చిత్తు చేసిన తుర్కియేగ్రూప్-ఎఫ్‌లో భాగంగా నిన్న జరిగిన మరో మ్యాచ్‌లో జార్జియాపై తుర్కియే 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తుర్కియే తరఫున మెర్ట్ ముల్దర్ (25వ నిమిషం), ఆర్దా గులెర్ (65వ నిమిషం), ముహమ్మెద్ కెరెమ్ (97వ నిమిషం) గోల్స్ చేయగా.. జార్జియా తరఫున జార్జెస్ 32వ నిమిషంలో గోల్ చేశాడు.ఇవాల్టి మ్యాచ్‌లు..క్రొయేషియా వర్సెస్ అల్బేనియా (గ్రూప్-బి)జర్మనీ వర్సెస్ హంగేరీ (గ్రూప్-ఏ) -
Viral Video: కన్నీటి పర్యంతమైన క్రిస్టియానో రొనాల్డో
దిగ్గజ ఫుట్‌బాలర్, పోర్చుగల్ స్టార్, అల్ నసర్ క్లబ్ తురుపు ముక్క క్రిస్టియానో రొనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు. కింగ్ కప్ ఫైనల్లో తన జట్టు ఓటమిని జీర్ణించుకోలేని రొనాల్డో భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక వెక్కివెక్కి ఏడ్చాడు. సహచరులు ఎంత ఓదార్చే ప్రయత్నం చేసినా రొనాల్డో కన్నీళ్లు ఆగలేదు. మైదానంలో చాలా సేపు కూర్చుని బాధతో కృంగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. రొనాల్డో బాధను చూసి నెటిజన్లు సైతం భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఆట పట్ల స్టార్ ఫుట్‌బాలర్‌కు ఉన్న కమిట్మెంట్కు జేజేలు పలుకుతున్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహించినా.. క్లబ్ తరఫున ఆడినా రొనాల్డో ప్యాషన్ ఒకే తీరులో ఉంటుందని కితాబునిస్తున్నారు.Nothing hurts a football fan more than seeing Ronaldo cry pic.twitter.com/YSMsZKBE9z— Trey (@UTDTrey) May 31, 2024కాగా, సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నిన్న (మే 31) జరిగిన కింగ్ ఆఫ్ ఛాంపియన్ కప్ ఫైనల్లో రొనాల్డో ప్రాతినిథ్యం వహించిన అల్ నసర్ జట్టు.. చిరకాల ప్రత్యర్ది అల్ హిలాల్ చేతిలో ఓటమిపాలైంది. తొలుత ఈ మ్యాచ్ (ఎక్స్ట్రా సమయం తర్వాత) 1-1తో టై కాగా.. పెనాల్టీ షూటౌట్లో అల్ హిలాల్.. 5-4 తేడాతో అల్ నసర్పై పైచేయి సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. నిర్ణీత సమయంలో అల్ హిలాల్ తరఫున అలెగ్జాండర్ మిత్రోవిచ్ (7వ నిమిషం).. ఆల్ నసర్ తరఫున అయ్మాన్ యాహ్యా (88వ నిమిషం) గోల్స్ చేశారు.ఇదిలా ఉంటే, అల్ హిలాల్ జట్టు ఇటీవల ముగిసిన సౌదీ ప్రో లీగ్‌లో కనీవినీ ఎరుగని ప్రదర్శనలు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఎడిషన్‌లో అల్ హిలాల్ రికార్డు స్థాయిలో 34 మ్యాచ్‌ల్లో 31 విజయాలు సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. క్లబ్ ఫుట్‌బాల్ చరిత్రలో ఏ జట్టు ఈ స్థాయి విజయాలు సాధించలేదు. ఈ లీగ్‌లో కూడా రొనాల్డో జట్టు అల్ నసర్ రన్నరప్‌తో సరిపెట్టకుంది. రొనాల్డో తదుపరి UEFA యూరో ఛాంపియన్షిప్ 2024లో పాల్గొననున్నాడు. ఈ టోర్నీలో క్రిస్ తన జాతీయ జట్టైన పోర్చుగల్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. -
Sunil Chhetri: భారత ఫుట్‌బాల్ దిగ్గజం కీలక ప్రకటన
భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు తొమ్మిది నిమిషాల నిడివితో కూడిన వీడియో సందేశం ద్వారా గురువారం ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫికేషన్ పోటీలో భాగంగా కువైట్‌తో జూన్ 6న జరిగే మ్యాచ్ తన కెరీర్లో చివరిదని సునిల్ ఛెత్రి తెలిపాడు. ‘‘గత 19 ఏళ్ల కాలంలో విధి నిర్వహణ, ఒత్తిడి.. సంతోషాలు.. ఇలా ఎన్నో భావోద్వేగాలను నెమరువేసుకుంటూనే వచ్చాను. దేశం కోసం నేను ఇన్ని మ్యాచ్‌లు ఆడతానని అస్సలు ఊహించలేదు. మంచో.. చెడో.. గత రెండున్నర నెలలుగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నా. ఈ అనుభూతి నాకు కొత్తగా ఉంది. కువైట్‌తో ఆడే మ్యాచ్ నా చివరి మ్యాచ్ అవుతుంది’’ అని సునిల్ ఛెత్రి భావోద్వేగానికి లోనయ్యాడు.రొనాల్డో, మెస్సీ తర్వాత..1984, ఆగష్టు 3న సికింద్రాబాద్‌లో జన్మించిన సునిల్ ఛెత్రి.. ప్రఖ్యాత మోహన్ బగాన్ క్లబ్ తరఫున 2002లో తన ఫ్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు.ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2005లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా జూన్ 12న భారత జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ ఆరంభించాడు. దాయాది జట్టుపై గోల్ కొట్టి ఖాతా తెరిచాడు. అనతికాలంలోనే భారత జట్టు కెప్టెన్‌గా ఎదిగాడు.మొత్తంగా తన ఇంటర్నేషనల్ కెరీర్లో సునిల్ ఛెత్రి 150 మ్యాచ్‌లలో 94 గోల్స్ సాధించాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ఫుట్‌బాలర్లలో క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగీస్), లియోనల్ మెస్సీ(అర్జెంటీనా) తర్వాత ఛెత్రినే అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా ఉండటం విశేషం. అందుకున్న పురస్కారాలు👉అర్జున అవార్డు👉పద్మశ్రీ👉ఖేల్‌రత్న👉ఏఐఎఫ్ఎఫ్ వార్షిక అత్యుత్తమ ఆటగాడిగా ఏడుసార్లు అవార్డు👉మూడుసార్లు ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు👉శాఫ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీచదవండి: Sunil Chhetri Life Story In Telugu: సికింద్రాబాద్‌లో పుట్టిన ఛెత్రీ.. కుటుంబ నేపథ్యం ఇదే! కెప్టెన్ ఫెంటాస్టిక్‌గా ఘనతలు -
Ronaldo Jr: మెస్సీ అంటే ఇష్టం! బాగానే ఉన్నావా.. ముద్దిచ్చి మరీ!
క్రిస్టియానో రొనాల్డో.. పోర్చుగల్ ఫుట్‌బాల్ చరిత్రలో సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్న మేటి ఆటగాడు. అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి గోల్స్.. ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక బాలన్ డి ఓర్ అవార్డులు. ఎన్నో చాంపియన్ లీగ్ మెడల్స్! మూడు దేశాల్లో క్లబ్ టైటిల్స్ గెలిచిన ఫుట్‌బాలర్..అయితే, ఒక్కసారైనా ప్రపంచకప్ గెలవాలన్న రొనాల్డో కల మాత్రం నెరవేరలేదు. సమకాలీకుడు, తనకు పోటీగా ఉన్న ఏకైక ఆటగాడు, అర్జెంటీనా లియోనల్ మెస్సీ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడుతుంటే చూస్తూ భావోద్వేగానికి గురికావడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడీ పోర్చుగల్ స్టార్. ఒకరకంగా మెస్సీతో జరిగిన పోటాపోటీలో తాను ఓడిపోయాననే బాధతోనే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆట పరంగా రొనాల్డో, మెస్సీల మధ్య స్నేహపూర్వక శత్రుత్వం ఉన్నా.. బయట మాత్రం వారిద్దరు గుడ్ ఫ్రెండ్స్! బాలన్ డి ఓర్ అవార్డు-2017 ఫంక్షన్ సందర్భంగా రొనాల్డో తల్లి డొలోర్స్ అవెరో ఈ విషయాన్ని వెల్లడించారు. మెస్సీ ఉన్నత వ్యక్తిత్వం కలవాడని పేర్కొంటూ.. తన మనవడు క్రిస్టియానో రొనాల్డో జూనియర్‌కు తండ్రి ఆట కంటే మెస్సీ ఆట అంటేనే ఎక్కువ ఇష్టం అని తెలిపారు. అందుకు తగ్గట్లుగానే జూనియర్ రొనాల్డో ఆ వేదికపై మెస్సీని చూడగానే ఆనందంతో పొంగిపోయాడు. అయితే, అక్కడున్నది నిజంగా మెస్సీ కాదనే భావనలో ఉన్న జూనియర్ తన తండ్రి చెప్పినా ఆ విషయాన్ని నమ్మలేకపోయాడు. రొనాల్డో తన కుమారుడికి మెస్సీని చూపిస్తూ.. ‘‘అక్కడున్నది ఎవరు? అక్కడ సూట్ వేసుకుని నిల్చుని ఉన్న వ్యక్తి ఎవరు?’’ అని ప్రశ్నించాడు. అంతలోనే మెస్సీ వచ్చి జూనియర్ రొనాల్డోను హగ్ చేసుకుని.. ముద్దు కూడా పెట్టి.. ‘‘నువ్వ బాగానే ఉన్నావు కదా?’’ అని ఆప్యాయంగా పలకరించాడు. When Cristiano Jr. meets Lionel Messi. pic.twitter.com/ydixmN2SyK — Historic Vids (@historyinmemes) March 3, 2024 తాను చూస్తున్నది నిజమని అప్పటికీ నమ్మలేకపోయిన జూనియర్ రొనాల్డోను తండ్రి మళ్లీ దగ్గరకు తీసుకోగా.. మెస్సీ సైతం చిరునవ్వులు చిందించాడు. ఈ ఘటన జరిగినపుడు జూనియర్ రొనాల్డోకు సుమారుగా ఆరేళ్ల వయసు ఉంటుంది. ఇక తండ్రిని కాదని.. మెస్సీనే తన రోల్‌మోడల్ అని చెప్పిన ఆ పిల్లాడు ఇప్పుడు ఓ జట్టును చాంపియన్‌గా నిలిపే స్థాయికి చేరాడు. అండర్ 13 లీగ్ ట్రోఫీలో అల్ నసర్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ట్రోఫీని ముద్దాడాడు. ఈ నేపథ్యంలో రొనాల్డో- మెస్సీ అనుబంధం... జూనియర్ రొనాల్డో టైటిల్ విన్నింగ్ మూమెంట్స్‌కు సంబంధించిన క్షణాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మీరూ ఓ లుక్కేయండి! View this post on Instagram A post shared by 433 (@433) -
మెస్సీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకర ప్రవర్తన.. రొనాల్డోపై నిషేధం
స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు భారీ షాక్ తగిలింది. మెస్సీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను ఇతనిపై ఓ మ్యాచ్ నిషేధం పడింది. వివరాల్లోకి వెళితే.. పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ అయిన రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ అయిన అల్ నస్ర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. స్థానికంగా జరిగే ప్రో లీగ్‌లో భాగంగా అల్ నస్ర్.. రియాద్ క్లబ్ అయిన అల్ షబాబ్‌తో తలపడింది. ఈ మ్యాచ్ సందర్భంగా రొనాల్డో.. మెస్సీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. 🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨 تصرف كارثي جديد من كريستيانو رونالدو ضد جمهور الشباب بعد نهاية اللقاء! 😳😳😳😳😳 pic.twitter.com/Tzt632I20p — نواف الآسيوي 🇸🇦 (@football_ll55) February 25, 2024 మెస్సీ అభిమానులను టార్గెట్ చేస్తూ జుగుప్సాకరమైన సంజ్ఞలు చేశాడు. రొనాల్డో ప్రవర్తనను సీరియస్‌గా తీసుకున్న లీగ్ నిర్వహకులు అతనిపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. అలాగే జరిమానా కింద 20000 సౌదీ రియాల్స్ కట్టాల్సిందిగా ఆదేశించారు. రొనాల్డో వికృత ప్రవర్తనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ ఉదంతంపై రొనాల్డో తాజాగా స్పందించాడు. యూరప్ దేశాల్లో ఇది కామనేనని సమర్ధించుకున్నాడు. కాగా, అల్ నస్ర్ క్లబ్ రెండున్నర సంవత్సరాల కాలానికి గాను రొనాల్డోతో రూ. 4400 కోట్ల మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది. -
మెస్సీ జట్టుకు షాకిచ్చిన రొనాల్డో టీమ్
ఇద్దరు ఫుట్‌బాల్ దిగ్గజాలు ప్రాతినిథ్యం వహిస్తున్న క్లబ్‌ల మధ్య నిన్న ఫెండ్లీ మ్యాచ్ జరిగింది. రియాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ, పోర్చుగల్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంటర్ మయామీ (అమెరికా), అల్ నస్ర్ (సౌదీ అరేబియా) జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రొనాల్డో జట్టు అల్ నస్ర్.. మెస్సీ జట్టు ఇంటర్ మయామీపై 6-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. Messi at full time pic.twitter.com/zvsmiuJqir — Messi Media (@LeoMessiMedia) February 1, 2024 The reaction of Ronaldo and Messi after Al Nassr third goal. https://t.co/DAhcNfTd7Z — CristianoXtra (@CristianoXtra_) February 1, 2024 గాయం కారణంగా క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్ మొత్తంలో పాల్గొనలేదు. మెస్సీ మాత్రం కాసేపు అభిమానులను అలరించాడు. సమయ పరిమితి నిబంధన కారణంగా మెస్సీ గేమ్ చివర్లో కొద్ది నిమిషాలు మైదానంలో కనిపించాడు. రొనాల్డో, మెస్సీ ఆడకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు ఈ మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించాడు. Puskas award 🏅 Goal of the year already🎖️ "Aymeric Laporte " 👑#InterMiami #AlNassr#Ronaldo #Messi #Goal pic.twitter.com/XFW1DJwd5p — Mehran Sofi (@sadistic3232) February 1, 2024 రొనాల్డో స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్‌ను వీక్షించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రొనాల్డో, మెస్సీ ముఖాల్లోని హావభావాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తమ ఆరాథ్య ఆటగాళ్లు మ్యాచ్ ఆడకపోయినా ఈ మ్యాచ్‌ను కొన్ని కోట్ల మంది తిలకించారు. ఈ మ్యాచ్‌లో అల్ నస్ర్ ఆటగాడు, బ్రెజిల్‌కు చెందిన టలిస్క హ్యాట్రిక్ గోల్స్ సాధించగా.. టెల్లెస్, ఆక్టేవియో, లాపోర్టే తలో గోల్ కొట్టారు. Turki Sheikh reminding Lionel Messi his team is losing 6-0 to Cristiano Ronaldo's Al-Nassr. Unbelievable reaction 🤯🤯🤯 #AlNassrvsInterMiamiCF pic.twitter.com/Zy3lw33piq — Farid Khan (@_FaridKhan) February 2, 2024 -
Virat Kohli: రాజు ఎక్కడైనా రాజే! టాప్‌లో కింగ్ కోహ్లి
రన్‌మెషీన్, రికార్డుల రారాజు.. టీమిండియా సూపర్‌స్టార్... విరాట్ కోహ్లి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అద్భుత ఆట తీరుతో ఆధునిక క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న మకుటం లేని మహారాజు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న ఈ ఢిల్లీ బ్యాటర్.. గూగుల్ 25 ఏళ్ల చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. నెట్ ప్రపంచంలో అతిపెద్ద సెర్చ్ ఇంజన్ అయిన గూగుల్‌లో అత్యధికసార్లు సెర్చ్ చేయబడిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. టాప్‌లో కింగ్ కోహ్లి ఈ విషయాన్ని గూగుల్ అధికారికంగా వెల్లడించింది. తన 25 ఏళ్ల ప్రయాణానికి సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఇక అత్యధిక మంది వెదికిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి అగ్రస్థానంలో నిలవగా.. అత్యధికసార్లు సెర్చ్ చేయబడిన అథ్లెట్‌గా పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో నిలిచాడు. అథ్లెట్ల జాబితాలో రొనాల్డో అదే విధంగా మోస్ట్ సెర్చెడ్ స్పోర్ట్ జాబితాలో ఫుట్‌బాల్ టాప్ ర్యాంకు సొంతం చేసుకుంది. కాగా 35 ఏళ్ల విరాట్ కోహ్లి ఇప్పటికే క్రికెట్లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. సొంతగడ్డపై వరల్డ్‌కప్-2023 సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట వన్డేల్లో ఉన్న సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. యాభై ఓవర్ల క్రికెట్లో అత్యధిక సెంచరీ(50)లు చేసిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సోషల్ మీడియాలోనూ హవా ఇదిలా ఉంటే... సోషల్ మీడియాలోనూ విరాట్ కోహ్లి తన హవా కొనసాగిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా అతడు 265 మిలియన్ ఫాలోవర్లు కలిగి ఉన్నాడు. ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తర్వాత అత్యధిక అనుచర గణం కలిగిన ఆటగాడిగా కోహ్లి కొనసాగుతున్నాడు. చదవండి: ఒకవేళ అదే జరిగితే రోహిత్ టాప్ కెప్టెన్ అవుతాడు! పెద్దన్నలపైనే భారం.. If the last 25 years have taught us anything, the next 25 will change everything. Here’s to the most searched moments of all time. #YearInSearch pic.twitter.com/MdrXC4ILtr — Google (@Google) December 11, 2023 -
రొనాల్డో ఖాతాలో మరో ట్రోఫీ
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో రెండేళ్ల తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్లో మరో ట్రోఫీని అందుకున్నాడు. తొలిసారి ఆసియాకు చెందిన అల్ నాసర్ క్లబ్ (సౌదీ అరేబియా) తరఫున బరిలోకి దిగిన రొనాల్డో తన జట్టును అరబ్ క్లబ్ చాంపియన్స్ కప్‌లో విజేతగా నిలిపాడు. అల్ హిలాల్ క్లబ్‌తో జరిగిన ఫైనల్లో రొనాల్డో కెప్టెన్సీ లోని అల్ నాసర్ జట్టు 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. రొనాల్డో రెండు గోల్స్ (74వ, 98వ ని.లో) చేశాడు. -
కోహ్లి రేంజ్ వేరు.. ఒక్కో పోస్టుకు ఏకంగా రూ. 11.45 కోట్లు! ఇక రొనాల్డో, మెస్సీ..
Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి.. ఆటలోనే కాదు సోషల్ మీడియాలోనూ రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 76 సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లికి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ రేంజ్ ఆదాయం అందరు సెలబ్రిటీల మాదిరే.. ఫ్యాన్స్‌తో అనుసంధానమయ్యేందుకు వీలుగా కింగ్.. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటున్నాడు. మరి మిగతా వాళ్లకంటే వందల రెట్లలో ఫాలోవర్లు కలిగి ఉన్న కోహ్లికి ఈ మీడియాల ద్వారా కూడా వచ్చే ఆదాయం కూడా అదే రేంజ్లో ఉంది. వ్యక్తిగత పోస్టులతో పాటు వ్యక్తిగత అప్డేట్లతో అభిమానులను అలరించే ఈ స్టార్ బ్యాటర్‌కు యాడ్స్ ద్వారా ఒక్కో పోస్టుకు సమకూరుతున్న మొత్తం తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే! రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో 256 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో అతడు షేర్ చేసే ఒక్కో పోస్టుకు పదకొండున్నర కోట్ల మేర ఆదాయం లభిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిజంగా షాకింగ్‌గా ఉంది ఈ విషయం గురించి హోపర్ హెచ్‌క్యూ కో- ఫౌండర్ మైక్ బండార్ మాట్లాడుతూ.. ‘‘ఏడాదికేడాది ఈ రేంజ్లో ఒక్కో పోస్టుకు ఆదాయం పెరుగుతూ ఉండటం షాకింగ్‌గా ఉంది. ముఖ్యంగా స్పోర్ట్స్ స్టార్స్ మిగతా వాళ్లకు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. రొనాల్డో, మెస్సీలు మాత్రమే కాదు.. సామాన్యులను కూడా కోటీశ్వరులను చేసేందుకు సోషల్ మీడియా ఉపయోపడటం విశేషం’’అని పేర్కొన్నారు. ఇక రొనాల్డో, మెస్సీ కాగా ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టా ద్వారా ఒక పోస్టుకు అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న వ్యక్తుల జాబితాలో కోహ్లి 20వ స్థానం(ఇండియాలో నంబర్ 1)లో ఉన్నాడు. ఇక ఫుట్‌బాల్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ వరుసగా ఒక్కో పోస్టుకు రూ. 26.75 కోట్లు, 21.49 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ టాప్-2లో కొనసాగుతున్నారు. చదవండి: అయ్యో.. అంబటి రాయుడులాగే అతడి కెరీర్ కూడా అర్ధంతరంగానే! తిరిగి వస్తే అంతే! -
ఎట్టకేలకు గోల్.. దిగ్గజం రికార్డును బద్దలు కొట్టిన రొనాల్డో
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన రికార్డు సాధించాడు. ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ రికార్డు రొనాల్డో పేరిటే ఉంది. ఇప్పటివరకు రొనాల్డో 838 గోల్స్ సాధించాడు. కొంతకాలంగా గోల్స్ కొట్టడంలో విఫలమవుతున్న రొనాల్డో తాజాగా మంగళవారం హెడర్ గోల్‌తో మెరిశాడు. అరబ్ క్లబ్ చాంపియన్స్ క్లబ్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున అల్-నసర్, యూఎస్ మోనాస్టిర్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అల్-నసర్ 4-1 తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా ఆట 74వ నిమిషంలో రొనాల్డో సూపర్ హెడర్ గోల్‌తో మెరిశాడు. రొనాల్డో గోల్ కొట్టడానికి 8 నిమిషాల ముందు ప్రత్యర్థి జట్టు ఒక గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేసింది. అయితే రొనాల్డో 74వ నిమిషంలో హెడర్ గోల్‌తో తన జట్టును 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రొనాల్డో ఫుట్‌బాల్‌లో అత్యధిక హెడర్ గోల్స్ కొట్టిన జాబితాలో జర్మనీ దిగ్గజం గెర్డ్ ముల్లర్‌ను అధిగమించాడు. ఇప్పటివరకు ముల్లర్‌తో కలిసి 144 హెడర్ గోల్స్‌తో సంయుక్తంగా ఉన్న రొనాల్డో తాజా గోల్(145 హెడర్)తో ముల్లర్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు తన కెరీర్లో 839వ గోల్ సాధించి అత్యధిక గోల్స్ విషయంలో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. 22 SEASONS IN A ROW CRISTIANO RONALDO IS ETERNAL 🍷🐐pic.twitter.com/mEPwV62rhn — aurora (@cr7stianos) July 31, 2023 Ronaldooooooo pic.twitter.com/rab2wPkZAQ — AlNassr FC (@AlNassrFC_EN) July 31, 2023 చదవండి: Ricky Ponting: 'బంతిని మార్చడం వల్లే ఆసీస్ ఓటమి.. విచారణ చేపట్టండి' -
'అవతలికి పో'.. కెమెరామన్‌పై రొనాల్డో అసహనం
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కెమెరామన్‌పై అసహనం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం మొదలైన అరబ్ క్లబ్ చాంపియన్స్ క్లబ్లో భాగంగా అల్-నసర్, అల్-సాహబ్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో గోల్ చేయడంలో విఫలమయ్యాడు. మ్యాచ్‌లో కూడా గోల్స్ నమోదు కాకపోవడంతో 0-0తో పేలవ డ్రాగా ముగిసింది. ఈ క్రమంలో మ్యాచ్ డ్రాగా ముగిసిందిన్న బాధలో ఉన్న రొనాల్డో డగౌట్ వైపు నడుచుకుంటూ వస్తున్న సమయంలో వెనకాలే కెమెరామన్ అతన్ని అనుసరించాడు. రొనాల్డో ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుండడం చిరాకు తెప్పించింది. చేతిలో ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి కొన్ని నీళ్లు తాగిన రొనాల్డో ఆ తర్వాత కొన్ని నీళ్లను కెమెరామన్వైపు చల్లుతూ.. ''అవతలికి పో'' అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో కెమెరామన్ సారీ చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అంతేకాదు మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో తన ట్విటర్లో ఒక పోస్టు షేర్ చేశాడు. ''గ్రూప్ స్టేజీలో మొదటి గేమ్ చాలా టఫ్‌గా అనిపించింది.. లీగ్ దశలో మరో రెండు మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. మేం పోరాడుతాం'' అంటూ కామెంట్ జత చేశాడు. 🎥 | مغادرة كريستيانو رونالدو قائد فريق #النصر أرضية الملعب بعد المواجهة "غير راض"، ويطلب من المصور إبعاد الكاميرا عنه. #كأس_الملك_سلمان_للاندية pic.twitter.com/4R2xoB7la7 — الشرق الأوسط - رياضة (@aawsat_spt) July 28, 2023 చదవండి: ధోనిని దొంగచాటుగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్ కావాలనే రోహిత్, కోహ్లి లేకుండా! ఆసియా కప్ తర్వాత జట్టు నుంచి అవుట్ -
'రొనాల్డో, ఫెదరర్‌లానే కోహ్లి కూడా చాలా గొప్పోడు'
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఐపీఎల్లో ఆర్సీబీకి పదేళ్ల పాటు కలిసి ఆడారు. ఆర్సీబీ టైటిల్ కొట్టడంలో విఫలమైనప్పటికి ఈ జోడి మాత్రం తమ ఆటతో అభిమానులను అలరించారు. డివిలియర్స్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినా ఆర్సీబీని మాత్రం వదల్లేదు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన ప్రతీసారి ఆర్సీబీకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక సందేశాన్ని విడుదల చేయడం మిస్టర్ 360కి అలవాటు. పదేళ్ల పాటు ఒకే జట్టుకు కలిసి ఆడిన కోహ్లి, డివిలియర్స్‌లు మంచి మిత్రులన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా వెస్టిండీస్‌తో ముగిసిన రెండో టెస్టులో(కోహ్లికి 500వ అంతర్జాతీయ మ్యాచ్) సెంచరీతో మెరిసిన కోహ్లిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ప్రపంచంలోని గొప్ప క్రీడాకారుల్లో ఒకడని అతను అన్నాడు. గెలవాలనే కసి.. ప్రతిసారి స్కోర్ చేయాలనే ఆకలి గొప్ప ఆటగాళ్లలో కనిపించే లక్షణాలని.. అవన్నీ విరాట్‌లో పుష్కలంగా ఉన్నాయని డివిలియర్స్ తెలిపాడు. ''గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్, ఫుట్‌బాల్ లెజెండ్స్ క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ, టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్.. వీళ్లంతా గెలవాలనే కసితో ఆడతారు. వీళ్లలో పోరాట స్ఫూర్తి అమోఘం. పోటీ ఏదైనా ప్రతిసారి చాంపియన్ అవ్వాలనుకుంటారు. విరాట్ కోహ్లీ కూడా అచ్చం వీళ్లలానే ప్రవర్తిస్తాడు. అంతేకాదు అతడి హృదయం చాలా అందమైనది'' అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. పదేళ్లు ఒకే జట్టుకు మిస్టర్ 360 క్రికెటర్‌గా డివిలియర్స్ అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాడు. మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన ఈ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతను ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ఫ్యాన్స్‌ను అలరించాడు. చదవండి: ICC T20 WC 2024: టి20 ప్రపంచకప్ 2024కు పపువా న్యూ గినియా అర్హత Kuldeep Yadav: సంచలన స్పెల్! కానీ నీకే ఎందుకిలా? కుల్దీప్ యాదవ్ కామెంట్స్ వైరల్ -
ఇంగ్లండ్ స్టార్‌కు కళ్లు చెదిరే మొత్తం.. అవి డబ్బులా ఇంకేమైనా!
ఫుట్‌బాల్‌లో జెర్సీ నెంబర్-7 అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. ప్రస్తుత తరంలో ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్స్‌లో రొనాల్డో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. కాగా ఫుట్‌బాల్ జెర్సీ నెంబర్ 10కు ఎంత క్రేజ్ ఉందో.. ఏడో నెంబర్‌కు కూడా అంతే. రొనాల్డో కంటే ముందు ఇంగ్లండ్ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హమ్ మాత్రమే ఏడు నెంబర్ జెర్సీ ధరించాడు. తాజాగా బుధవారం చెల్సియా క్లబ్ ఫుట్‌బాల్ స్టార్ మాసన్ మౌంట్ మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు సంతకం చేశాడు. అతని ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఏకంగా 55 మిలియన్ పౌండ్స్(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 577 కోట్ల పైమాటే). కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడయిన మాసన్ మౌంట్‌కు రొనాల్డో జెర్సీ నెంబర్ (7)ను మాంచెస్టర్ యునైటెడ్ గిఫ్ట్‌గా అందించింది. ఇకపై మాసన్ మౌంట్ మాంచెస్టర్ క్లబ్ తరపున ఏడో నెంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. ఇక మాసన్ మౌంట్ చెల్సియాతో తన సీనియర్ ఫుట్‌బాల్ క్లబ్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2017-19 మధ్య విటెస్సే, డెర్బీ కౌంటీ తరపున ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం చెల్సియాకు తిరిగి వచ్చిన మాసన్ మౌంట్ నిలకడైన ఆటతీరుతో స్టార్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయంగా ఇంగ్లండ్ తరపున UEFA ఛాంపియన్స్ లీగ్ , UEFA సూపర్ కప్ ,2021లో FIFA ప్రపంచకప్‌లో ప్రాతినిధ్యం వహించాడు. 2020–21, 2021–22 సీజన్లలో మాసన్ మౌంట్ చెల్సియా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. It's time to write a new chapter. #️⃣7️⃣ Mount 🔴#MUFC — Manchester United (@ManUtd) July 5, 2023 చదవండి: విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా #SlapKabaddi: పాకిస్తాన్‌ను షేక్ చేస్తున్న 'స్లాప్' కబడ్డీ.. వీడియో వైరల్ -
రొనాల్డో అరుదైన ఘనత.. గిన్నిస్ రికార్డుతో చరిత్ర! అతడి తర్వాత..
Cristiano Ronaldo World Record- రెక్జావిక్ (ఐస్లాండ్): పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు దిగ్గజం, స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయి అందుకున్నాడు. పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో జాతీయ జట్టు తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూరో–2024 చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా గ్రూప్ ‘జె’లో ఐస్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో బరిలోకి దిగడంద్వారా 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. 38 ఏళ్ల రొనాల్డో ఆట 89వ నిమిషంలో చేసిన గోల్‌తో ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 1–0తో ఐస్లాండ్ను ఓడించింది. గ్రూప్ ‘జె’లో పోర్చుగల్కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు కూడా రొనాల్డో (123 గోల్స్) పేరిటే ఉంది. మ్యాచ్‌కు ముందు రొనాల్డో ఘనతకు గుర్తింపుగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ సంస్థ సర్టిఫికెట్‌ను అందజేసింది. 2003 నుంచి పోర్చుగల్ జాతీయ సీనియర్ జట్టుకు ఆడుతున్న రొనాల్డో వరుసగా ఐదు ప్రపంచకప్‌లలో గోల్స్ చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. రొనాల్డో కెప్టెన్సీలో పోర్చుగల్ 2016 తొలిసారి యూరో చాంపియన్‌గా అవతరించింది. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో స్పోర్టింగ్ సీపీ, మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, యువెంటస్ జట్లకు ఆడిన రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియా ప్రొ లీగ్‌లో అల్ నాసర్ క్లబ్ జట్టుకు ఆడుతున్నాడు. జాతీయ జట్టుకు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్–10 ఆటగాళ్లు ప్లేయర్ - దేశం - మ్యాచ్‌లు రొనాల్డో - పోర్చుగల్ - 200 బదర్ అల్ ముతవా - కువైట్ - 196 సో చిన్ అన్ - మలేసియా - 195 అహ్మద్ హసన్ - ఈజిప్ట్ - 184 అహ్మద్ ముబారక్- ఒమన్ - 183 సెర్జియో రామోస్- స్పెయిన్ - 180 ఆండ్రెస్ గ్వార్డాడో - మెక్సికో - 179 అల్దెయా - సౌదీ అరేబియా - 178 క్లాడియో స్వారెజ్- మెక్సికో - 177 గియాన్లుగి బఫన్ - ఇటలీ - 176 . చదవండి: కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా? -
హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు.. టాప్-4లో సునీల్ ఛెత్రి
భారత ఫుట్‌బాల్ స్టార్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ గోల్స్ పరంగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత జట్టు తరఫున 138వ మ్యాచ్ ఆడిన సునీల్ ఛెత్రి 90 గోల్స్ చేశాడు. ఇక టాప్–3లో క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–123 గోల్స్), అలీ దాయి (ఇరాన్–109 గోల్స్), మెస్సీ (అర్జెంటీనా–103 గోల్స్) ఉన్నారు.2005లో జూన్ 12న భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన 38 ఏళ్ల సునీల్ ఛెత్రి తొలి గోల్ కూడా పాకిస్తాన్ జట్టుపైనే రావడం విశేషం. దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో శుభారంభం చేసింది. పాకిస్తాన్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో భారత్ 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి (10వ, 16వ, 74వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించగా... మరో గోల్‌ను ఉదాంత సింగ్ (81వ ని.లో) అందించాడు. 1952 తర్వాత భారత ఫుట్‌బాల్ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా ఇవ్వకపోవడం ఇదే ప్రథమం. శనివారం తమ తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్ ఆడుతుంది. IND vs PAK sees RED in the first half 🤯 India vs Pakistan is never fully complete without the fireworks and heated emotions 💥#INDvPAKonFanCode #SAFFChampionship2023 pic.twitter.com/xJLZTmcrp5 — FanCode (@FanCode) June 21, 2023 A perfectly placed Penalty by Sunil Chhetri and he gets his hattrick😍😍 pic.twitter.com/i2knCtsiH8 — Shanu 🇦🇷 (@secureboy23) June 21, 2023 -
రొనాల్డో చరిత్ర.. 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయిని అందుకున్నాడు. పోర్చుగల్ తరపున రొనాల్డో 200వ మ్యాచ్ ఆడాడు. పురుషుల ఫుట్‌బాల్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రొనాల్డో చరిత్రకెక్కాడు. యూరోకప్ 2024 క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా పోర్చుగల్ మంగళవారం అర్థరాత్రి ఐస్‌లాండ్‌తో తలపడింది. మ్యాచ్‌లో పోర్చుగల్ 1-0 తేడాతో నెగ్గింది. పోర్చుగల్ తరపున వచ్చిన ఏకైక గోల్ కూడా క్రిస్టియానో రొనాల్డోదే కావడం విశేషం. ఆట 89వ నిమిషంలో రొనాల్డో జట్టుకు గోల్ అందించాడు. ఇక రొనాల్డోకు ఇది 123వ అంతర్జాతీయ గోల్. 200వ మ్యాచ్ ఆడడంపై క్రిస్టియానో రొనాల్డో స్పందించాడు. ''చాలా సంతోషంగా ఉంది. దేశం తరపున 200 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహిస్తానని ఊహించలేదు. నా కెరీర్లో ఇదొక గొప్ప ఘనతగా భావిస్తున్నా'' అంటూ చెప్పుకచ్చాడు. కాగా యూరో 2024 క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్-జెలో ఉన్న పోర్చుగల్ తాము ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నాలుగు విజయాలు అందుకొని టాపర్‌గా కొనసాగుతుంది. "I'm so happy. For me it's an unbelievable achievement" We spoke to Mr 200 @Cristiano Ronaldo... pic.twitter.com/LpaInwxHej — UEFA EURO 2024 (@EURO2024) June 20, 2023 The historical scorer of the teams 🐐🇵🇹⚽️#CR7𓃵 #CR200#CristianoRonaldo pic.twitter.com/i0z0DHaTKA — عمر المدريدي ⓮㉟ (@omar14rmd) June 20, 2023 🙌🙌🙌#EURO2024 @selecaoportugal pic.twitter.com/JydpIv0BSE — UEFA EURO 2024 (@EURO2024) June 20, 2023 చదవండి: మెస్సీని మిస్సయ్యాం!.. అర్జెంటీనా వస్తానంటే భారత్ వద్దన్నది -
రొనాల్డో బాటలోనే మెస్సీ.. కళ్లు చెదిరే మొత్తంతో ఒప్పందం.. ఇక..
పారిస్: గత ఏడాది అంతర్జాతీయ క్రీడా వేదికపై తమదైన ముద్ర వేసిన ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), మహిళా అథ్లెట్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ (జమైకా)లకు ప్రతిష్టాత్మక లారియస్ గ్లోబల్ స్పోర్ట్స్ అవార్డులు లభించాయి. 2022 సంవత్సరానికిగాను పురుషుల విభాగంలో ఉత్తమ క్రీడాకారుడిగా మెస్సీ... మహిళల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణిగా షెల్లీ ఎంపికయ్యారు. మెస్సీ సారథ్యంలో గత ఏడాది అర్జెంటీనా జట్టు 36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఫుట్‌బాల్ ప్రపంచకప్ టైటిల్‌ను మూడోసారి సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మెస్సీ ఏడు గోల్స్ చేయడంతోపాటు సహచరులు మూడు గోల్స్ చేయడానికి సహాయపడ్డాడు. ఈ మెగా ఈవెంట్లో ఉత్తమ ప్లేయర్‌గా నిలిచి ‘గోల్డెన్ బాల్’ పురస్కారాన్ని కూడా దక్కించుకున్నాడు. లారియస్ అవార్డు రావడం మెస్సీకిది రెండోసారి. 2020లోనూ మెస్సీకి ఈ పురస్కారం దక్కింది. మరోవైపు షెల్లీ ఆన్ ఫ్రేజర్ 100 మీటర్ల విభాగంలో ఐదోసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఓవరాల్‌గా షెల్లీ మూడు ఒలింపిక్స్ పసిడి పతకాలను, పది ప్రపంచ చాంపియన్‌షిప్ బంగారు పతకాలను గెల్చుకుంది. స్పెయిన్ టెన్నిస్ యువతార కార్లోస్ అల్కరాజ్కు ‘బ్రేక్‌త్రూ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. గత ఏడాది అల్కరాజ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విజేతగా నిలువడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. 1999 నుంచి లారియస్ గ్లోబల్ స్పోర్ట్స్ అవార్డులను అందజేస్తున్నారు. సౌదీ లీగ్‌లో మెస్సీ! పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో బాటలోనే మెస్సీ నడవనున్నాడు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) క్లబ్‌కు ఆడుతున్న మెస్సీ ఈ సీజన్ తర్వాత పీఎస్జీని వీడి రొనాల్డో ఆడుతున్న సౌదీ అరేబియా లీగ్‌లో అడుగు పెట్టనున్నాడు. ఇప్పటికే సౌదీ అరేబియా లీగ్‌లోని ఒక క్లబ్ మెస్సీతో కళ్లు చెదిరే మొత్తానికి ఒప్పందం చేసుకుందని సమాచారం. ఇది కూడా చదవండి: పతకానికి అడుగు దూరంలో.. తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇద్దరు భారత బాక్సర్లు నిశాంత్ దేవ్ (71 కేజీలు), దీపక్ భోరియా (51 కేజీలు) పతకం ఖరారు చేసుకోవడానికి మరో విజయం దూరంలో ఉన్నారు. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లలో దీపక్ 5–0తో జాంగ్ జియామావో (చైనా)పై గెలుపొందగా... నిశాంత్ దేవ్ పంచ్‌ల ధాటికి అతని ప్రత్యర్థి ఫొకాహా నిదాల్ (పాలస్తీనా) చేతులెత్తేశాడు. నిశాంత్ పంచ్ పవర్‌కు తొలి రౌండ్లోనే ఫొకాహా రింగ్‌లో రెండుసార్లు కూలబడ్డాడు. దాంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి నిశాంత్‌ను విజేతగా ప్రకటించాడు. మరోవైపు భారత్‌కే చెందిన సచిన్ సివాచ్ (54 కేజీలు), ఆకాశ్ సాంగ్వాన్ (67 కేజీలు)ల పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. సచిన్ 0–5తో సాబిర్ ఖాన్ (కజకిస్తాన్) చేతిలో, ఆకాశ్ 0–5తో దులాత్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
కోహ్లి, రోహిత్ శర్మ సహా పలువురు క్రికెట్లరకు షాక్! ఇకపై.. అలా చేస్తేనే మళ్లీ..
#BlueTick Removal: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ టీమిండియా క్రికెటర్లకు షాకిచ్చింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత సారథి రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి తదితరుల అకౌంట్ నుంచి బ్లూ టిక్ తొలగించింది. ఈ మేరకు గురువారం ఈ క్రికెట్ స్టార్ల అకౌంట్ వెరిఫికేషన్ మార్క్ తొలగించింది. మస్క్ రాగానే మార్పులకు శ్రీకారం ప్రముఖ వ్యాపార దిగ్గజం, బిలియనీర్ ఎలన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత సంచలన మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార ఖాతా ధ్రువీకరణకు సంకేతమైన బ్లూ టిక్‌ను ఉచితంగా అందించే సేవలకు స్వస్తి పలికారు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల వ్యక్తిగత అధికారిక ఖాతాలకు బ్లూ టిక్, ప్రభుత్వ రంగ సంస్థలు వాడే ట్విటర్ అకౌంట్‌కు గ్రే టిక్, వ్యాపార సంబంధిత సంస్థలకు గోల్డ్ కలర్ టిక్ అందించనున్నట్లు వెల్లడించారు. అందుకే క్రికెటర్ల ఖాతా నుంచి బ్లూ టిక్ మాయం ఈ క్రమంలో నెలవారీ చార్జీలు చెల్లించిన వారికి మాత్రమే 2023 ఏప్రిల్ 20 నుంచి బ్లూ టిక్ అందిస్తామన్న ప్రకటనను మస్క్ తాజాగా అమల్లోకి తెచ్చారు. కాగా ట్విటర్లో వ్యక్తిగత ఖాతాకు బ్లూ టిక్ పొందాలంటే నెలకు 8 డాలర్ల మేర చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చెల్లించని సెలబ్రిటీల ఖాతాల నుంచి బుధవారం అర్ధరాత్రి నుంచి బ్లూ టిక్ మాయమైనట్లు తెలుస్తోంది. ఇందులో వివిధ రంగాల ప్రముఖులతో పాటు క్రికెట్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ట్విటర్లో యాక్టివ్‌గా ఉండే కోహ్లి, రోహిత్ సహా భారత దిగ్గజం సచిన్ టెండుల్కర్ తదితరుల అకౌంట్ నుంచి బ్లూ టిక్ మాయమైపోయింది. స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. కాగా గురువారం మస్క్ కొత్త విధానం అమల్లోకి తెచ్చిన తర్వాత దాదాపు 3 లక్షల మంది బ్లూ టిక్ కోల్పోయినట్లు సమాచారం. బ్లూ టిక్ ఉంటేనే కాగా సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి పేరిట పుట్టుకొచ్చే ఫ్యాన్ పేజీలు కోకొల్లలు. వీటిలో సదరు సెలబ్రిటీ అధికారిక ఖాతాను సూచించేందుకు బ్లూ టిక్ ప్రామాణికంగా ఉండేది. చార్జీలు చెల్లిస్తే మళ్లీ ఇక ఇప్పుడు మస్క్ పెట్టిన చార్జీలు చెల్లిస్తే బ్లూ టిక్ సౌలభ్యం కోల్పోయిన వాళ్లు తిరిగి తమ ఖాతాలకు టిక్‌లు పునురద్ధరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 సీజన్‌తో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ధోని బిజిబిజీగా ఉన్నారు. ఐపీఎల్‌తో మన స్టార్లు బిజీ ధోని సారథ్యంలోని సీఎస్కే ఐదింట మూడు విజయాలతో మూడో స్థానంలో ఉండగా.. రోహిత్ నేతృత్వంలోని ముంబై ఆరో స్థానంలో కొనసాగుతోంది. కోహ్లి ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన గురువారం నాటి మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలుపొంది పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది బెంగళూరు జట్టు. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి, రోహిత్ తదితరులు ట్విటర్ అకౌంట్లో బ్లూ టిక్ కోల్పోయిన నేపథ్యంలో నెట్టింట వీరి పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్లు వీరిని ట్రోల్ చేస్తున్నారు. ఇక కోహ్లికి ట్విటర్లో 55.1 మిలియన్ ఫాలోవర్లు ఉండగా.. రోహిత్‌కు 21.7 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. సచిన్ , కోహ్లి... ధోని, రోహిత్ శర్మ లే కాదు సైనా నెహ్వాల్, నీరజ్ చోప్రా, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, బాక్సర్ నిఖత్ జరీన్, సానియా మీర్జా, సునీల్ చెత్రి, పీఆర్ శ్రీజేశ్, అంతర్జాతీయ దిగ్గజాలు ఫెడరర్, రాఫెల్ నాదల్ (టెన్నిస్), క్రిస్టియానో రొనాల్డో, ఎంబాపె (ఫుట్‌బాల్), ఖాతాలకు కూడా ‘బ్లూ మార్క్’లు కనిపించవు. ఏమిటీ ‘బ్లూ టిక్’? సచిన్ లేదంటే ఇంకే హీరో పేరుమీద ఇతరులు కూడా నకిలీ ఖాతాలు తెరుస్తారు. కానీ అసలైన సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ ఖాతా ఏదంటే మాత్రం ‘బ్లూ టిక్’తో వెరిఫైడ్ ఐడెంటిటీ తేలిపోతుంది. ఇప్పుడీ అధికారిక ముద్ర కోసం డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. వెరిఫైడ్ ఐడెంటిటీ కావాలంటే వెబ్ పోర్టల్‌కు రూ. 650, మొబైల్ ఫోన్లకు రూ. 900 ప్రతి నెలా చెల్లించాలి. ‘బ్లూటిక్’ మార్క్ తొలగించడంతో సచిన్ తన అధికారిక ఖాతాలో జాతీయ పతాకాన్ని పెట్టుకొని ఇదే నా ‘బ్లూ టిక్ వెరిఫికేషన్’ అని కామెంట్ జత చేశాడు. చదవండి: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. చెన్నైకి గుడ్ న్యూస్! 16 కోట్ల ఆటగాడు రెడీ.. ఎట్టకేలకు దాదా ముఖంలో ఆ నవ్వు! 25 ఏళ్ల క్రితం అప్పుడలా.. మళ్లీ ఇప్పుడు.. Virat kohli without Blue tick😭 pic.twitter.com/QU96OEUITw — Arun Singh (@ArunTuThikHoGya) April 20, 2023 Elon Musk after Removing Blue tick from Celeb’s Account:pic.twitter.com/fLMlYxsJDB — Pulkit🇮🇳 (@pulkit5Dx) April 20, 2023 Blue tick hatane ke bad Elon Musk pic.twitter.com/8F7bMSAOH6 — Desi Bhayo (@desi_bhayo88) April 20, 2023 -
సిరాజ్‌ను పూనిన రొనాల్డో.. వీడియో వైరల్
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ మరో విజయం దిశగా పరుగులు పెడుతుంది. గురువారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 10 ఓవర్లు ముగిసేరికి 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇదిలా ఉంటే ఆర్సీబీ బౌలర్ సిరాజ్ పంజాబ్ బ్యాటర్ హర్‌ప్రీత్ సింగ్ బాటియాను రనౌట్ చేయడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో విజయ్‌కుమార్ వేసిన మూడో బంతిని ప్రబ్‌సిమ్రన్ సింగ్ మిడాఫ్ దిశగా ఆడాడు. సింగిల్ తీసే ప్రయత్నం చేసిన ప్రబ్‌సిమ్రన్ నాన్‌స్ట్రైక్‌లో ఉన్న హర్‌ప్రీత్ బాటియాకు కాల్ ఇచ్చాడు. ప్రబ్‌సిమ్రన్ పిలుపుతో హర్‌ప్రీత్ పరిగెత్తాడు. కానీ బంతిని అందుకున్న సిరాజ్ డైరెక్ట్ త్రో విసిరాడు. హర్‌ప్రీత్ క్రీజులోకి వచ్చేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో అతను రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. డైరెక్ట్ త్రోతో స్టన్నింగ్ రనౌట్ చేసిన సిరాజ్ రొనాల్డో ఫేమస్ 'Sui' సెలబ్రేషన్‌తో మెరిశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. WHAT A THROW, SIRAJ 🔥pic.twitter.com/iFouuBYLpe — Johns. (@CricCrazyJohns) April 20, 2023 -
పిచ్చి ప్రవర్తన.. హీరో కాస్త విలన్ అయిపోతున్నాడు!
క్రిస్టియానో రొనాల్డోకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ మధ్యన రొనాల్డో ప్రవర్తన శ్రుతి మించిపోతుంది. మ్యాచ్ ఓటములను జీర్ణించుకోలేక పిచ్చిగా ప్రవర్తిస్తూ ఇబ్బందుల్లో పడుతున్నాడు. తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించి హీరో అనిపించుకున్న రొనాల్డో విలన్‌గా మారిపోతున్నాడు. తన చర్యతో అభిమానులు షాక్ తింటున్నారు. తాజాగా ఆల్-నసర్ కెప్టెన్ మ్యాచ్ ఓడిపోయామన్న కోపంలో ప్రత్యర్థి ఆటగాడి తలను నేలకేసి కొట్టడం సంచలనం కలిగించింది. విషయంలోకి వెళితే.. సౌదీ ప్రో లీగ్‌లో భాగంగా మంగళవారం అర్థరాత్రి అల్-హిలాల్, అల్-నసర్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో రొనాల్డో సేన 0-2తో అల్-హిలాల్ చేతిలో ఓటమి పాలయ్యింది. ఈ విషయం పక్కనబెడితే.. ఆట 56వ నిమిషంలో అల్-హిలాల్ ఆటగాడు గుస్టావోపైకి దూసుకొచ్చిన రొనాల్డో అతని తలను తన చేత్తో అదిమి పట్టుకొని ఒక్కసారిగా కిందకు పడేశాడు. ఈ క్రమంలో గుస్టావో తల గ్రౌండ్‌కు కాస్త బలంగానే తాకింది. ఈ చర్యతో స్టాండ్స్‌లోని ప్రేక్షకులతో పాటు తోటి ఆటగాళ్లు కూడా షాక్ తిన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆటగాడిని గాయపరిచినందుకు గానూ రిఫరీ రొనాల్డోకు ఎల్గోకార్డు జారీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by نادي الهلال السعودي (@alhilal) చదవండి: 'ఎగతాళి చేసినోళ్లే మెచ్చుకుంటున్నారు' -
70 కోట్ల విలువైన కారు.. కొన్నాడా లేక గిఫ్ట్‌గా వచ్చిందా?
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కార్లంటే పిచ్చ క్రేజ్. తన గ్యారేజీలో ఉన్న కార్ల లెక్కకు కొదువే లేదు. అయితే తాజాగా దాదాపు రూ. 70 కోట్ల విలువైన బుగాట్టి కారులో రొనాల్డో చక్కర్లు కొట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బుగాట్టి.. సెంటోదియాచీ పేరుతో లిమిటెడ్ ఎడిషన్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఖరీదు 80 లక్షల యూరోలు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.71 కోట్లు. తాజాగా ఖరీదైన బుగాట్టి కారులో తన పార్ట్నర్ జార్జినా రోడ్రిగ్స్ తో కలిసి రొనాల్డో రెస్టారెంట్‌కు వచ్చాడు. డిన్నర్ అనంతరం బయటికి వచ్చిన రొనాల్డో బుగాట్టి కారు ఎక్కడం చూసి స్థానిక అభిమానులు ఫోటోలు క్లిక్ మనిపించారు. ఒక వ్యక్తి ఇదంతా తన కెమెరాలో బంధించి వీడియోను షేర్ చేయగా దానికి రొనాల్డో రీట్వీట్ చేయడం విశేషం. గతేడాది ఇదే రెస్టారెంట్ బయట ఒక రోల్స్ రాయిస్ కారులో రొనాల్డో కనిపించాడు. ఆ కారును జార్జినానే రొనాల్డోకు క్రిస్మస్ గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. మరి ఖరీదైన బుగాట్టిని రొనాల్డో కొన్నాడా లేక గిఫ్ట్‌గా వచ్చిందా అని అభిమానులు కామెంట్ చేశారు. 2024 యురోపియన్ ఛాంపియన్షిప్ క్వాలిఫయింగ్ కోసం రొనాల్డో తన సొంతజట్టు పోర్చుగల్ తరపున ఆడుతున్నాడు. ఇక జట్టు తరపున తొలి రెండు మ్యాచ్‌లు కలిపి నాలుగు గోల్స్ చేసిన రొనాల్డో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పోర్చుగల్ తన తర్వాతి రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్ లను జూన్ లో ఆడనుంది. ప్రస్తుతం గ్రూప్ జేలో పోర్చుగల్ టాప్ లో ఉంది. ప్రస్తుతం హాలిడే మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్న రొనాల్డో ఏప్రిల్ మొదటివారంలో అల్-నసర్ క్లబ్‌తో కలవనున్నాడు. ఏప్రిల్ 5న అల్-నసర్ క్లబ్.. అల్ అదాలాతో జరిగే మ్యాచ్‌లో రొనాల్డో ఆడనున్నాడు. Cristiano in Madrid last night. ❤️ pic.twitter.com/RChrK0ewmz — The CR7 Timeline. (@TimelineCR7) March 29, 2023 చదవండి: 'ఆడేది మెగాటోర్నీ.. అలా కుదరదు'; ప్లాన్ బెడిసికొట్టిందా? హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు.. సెంచరీ కొట్టిన మెస్సీ -
దుమ్మురేపిన రొనాల్డో.. పోర్చుగల్ ఖాతాలో రెండో విజయం
యూరో–2024 క్వాలిఫయింగ్ టోర్నీలో మాజీ విజేత పోర్చుగల్ వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్ ‘జె’లో భాగంగా సోమవారం తెల్లవారుజామున లక్సెంబర్గ్‌తో మ్యాచ్‌లో పోర్చుగల్ 6–0తో గెలిచింది. కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తన సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గోల్స్‌తో మెరిశాడు. ఆట 6వ, 31వ నిమిషంలో రొనాల్డో జట్టు తరపున గోల్స్ కొట్టాడు. మిగతావారిలో జావో ఫెలిక్స్(ఆట 15వ నిమిషం), బెనార్డో సిల్వా(ఆట 18వ నిమిషం), ఒటావియో(ఆట 77వ నిమిషం), రాఫెల్ లావో(ఆట 88వ నిమిషం)లో గోల్స్ సాధించారు. కాగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో ప్రస్తుతం రొనాల్డో 122వ గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. లిష్టెన్స్టయిన్తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ రొనాల్డో రెండు గోల్స్ చేశాడు. -
చరిత్ర సృష్టించిన స్టార్ ఫుట్‌బాలర్.. 41 ఏళ్ల వయసులో..!
ప్రముఖ ఫుట్‌బాలర్, స్వీడిష్ స్టార్ స్ట్రయికర్ జ్లాటన్ ఇబ్రహీమోవిచ్ చరిత్ర సృష్టించాడు. అత్యంత పెద్ద వయసులో యూరోపియన్ ఛాంపియన్ క్వాలిఫయర్ ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. యూరో 2024 గ్రూప్ గేమ్‌లో భాగంగా బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో 73వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన ఇబ్రహీమోవిచ్.. 41 సంవత్సరాల 5 నెలల 21 రోజుల వయసులో యూరో క్వాలిఫయర్ మ్యాచ్ బరిలోకి దిగిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు ఇటాలియన్ గోల్‌కీపర్ డినో జోఫ్ పేరిట ఉండేది. 1983, మే 29న స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌లో డినో 41 ఏళ్ల 3 నెలల ఒక్క రోజు వయసులో యూరో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడాడు. క్లబ్ ఫుట్‌బాల్‌లో ఏసీ మిలాన్‌కు ప్రాతినిధ్యం వహించే ఇబ్రహీమోవిచ్ గత వారాంతంలో సీరీ ఏలో గోల్ సాధించి, అత్యంత పెద్ద వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కూడా రికార్డుల్లోకెక్కాడు. వచ్చే ఏడాది జర్మనీలో జరిగే యూరో కప్ ఫైనల్లో ఆడాలని భావిస్తున్న ఇబ్రహీమోవిచ్.. ఇదే జరిగితే అత్యంత పెద్ద వయసులో (42) యూరో కప్ ఫైనల్స్ ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇదిలా ఉంటే, గ్రూప్-ఎఫ్ యూరో క్వాలిఫయర్ 2024లో భాగంగా బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో ఇబ్రహీమోవిచ్ ప్రాతినిధ్యం వహించిన స్వీడన్ ఓటమిపాలైంది. స్టార్ స్ట్రయికర్ రొమేలు లుకాకు హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో బెల్జియం 3-0 తేడాతో స్వీడన్‌ను చిత్తు చేసింది. లుకాకు మెరుపులతో ఇబ్రహీమోవిచ్ రికార్డు కనుమరుగైంది. ప్రస్తుతం ఫుట్‌బాల్‌లో కొనసాగుతున్న స్టార్లలో గేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్లో, మరో దిగ్గజం మెస్సీ కంటే ఇబ్రహీమోవిచ్ వయసులో చాలా పెద్దవాడు. ఫిట్నెస్ విషయంలో రొనాల్డోకు ఇబ్రహీమోవిచ్కు పోటీ ఎక్కువగా ఉంటుంది. రొనాల్డో 38 ఏళ్ల వయసులో ఫిట్నెస్ కారణంగా అవకాశాలు పొందగలుగుతుంటే, ఇబ్రహీమోవిచ్ రొనాల్డోకు మించి అవకాశాలు సాధిస్తూ, రాణిస్తున్నాడు. -
రొనాల్డో ప్రపంచ రికార్డు.. మెస్సీ చూస్తూ ఊరుకుంటాడా?
ప్రస్తుత ఫుట్‌బాల్ తరంలో లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఎవరికి వారే సాటి. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు అందుకున్న ఈ ఇద్దరు సమానంగానే కనిపించినా మెస్సీ ఒక మెట్టు పైన ఉంటాడు. అందుకు కారణం గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను విజేతగా నిలపడమే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ అత్యధిక గోల్స్ చేసి 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనాకు మూడోసారి టైటిల్ అందించాడు. ఈ దెబ్బతో రొనాల్డో కాస్త వెనుకబడినట్లుగా అనిపించాడు. అయితే వ్యక్తిగతంగా చూస్తే మాత్రం ఇద్దరు పోటాపోటీగా ఉంటారు. ఒక రికార్డు రొనాల్డో బద్దలు కొట్టాడంటే వెంటనే మెస్సీ తన పేరిట ఒక రికార్డును లిఖించుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా రొనాల్డో దేశం తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే నీ వెనుకే నేను వస్తా అంటూ మెస్సీ కూడా తన కెరీర్లో 800వ గోల్ సాధించి కొత్త రికార్డు అందుకున్నాడు. బ్రూనస్ ఎయిర్స్ వేదికగా గురువారం అర్జెంటీనా, పనామాల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ సేన 2-0 తేడాతో విజయం సాధించింది. ఆట 89వ నిమిషంలో అర్జెంటీనాకు లభించిన ఫ్రీకిక్‌ను మెస్సీ తనదైన శైలిలో గోల్‌గా మలిచాడు. దీంతో తన కెరీర్లో 800వ గోల్ పూర్తి చేసుకున్న మెస్సీ అర్జెంటీనా తరపున 99వ గోల్ సాధించాడు. వంద గోల్స్ మార్క్‌ను చేరుకోవడానికి మెస్సీ ఇక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇక క్లబ్స్ తరపున 701 గోల్స్ చేసిన మెస్సీ ఓవరాల్‌గా 800 గోల్స్‌తో కొనసాగుతున్నాడు. గతేడాది డిసెంబర్లో ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచిన జట్టుతోనే అర్జెంటీనా బరిలోకి దిగడం విశేషం. Lionel Messi with an incredible free-kick 🇦🇷 We are witnessing greatness once again 🐐 pic.twitter.com/QBPUO7B9LY — SPORTbible (@sportbible) March 24, 2023 చదవండి: ఫుట్‌బాల్‌లో సంచలనం.. చారిత్రాత్మక గోల్ -
చరిత్ర సృష్టించిన రొనాల్డో..
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరొక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో జట్టును గెలిపించడంలో విఫలమైన రొనాల్డో జర్మనీ వేదికగా జరుగుతున్న యూరోకప్ 2024 క్వాలిఫయర్‌లో మాత్రం దుమ్మురేపాడు. గ్రూప్-జెలో భాగంగా గురువారం లిచెన్‌స్టెయిన్, పోర్చుగల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రొనాల్డోకు 197వది కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక దేశం తరపున(పోర్చుగల్) తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రొనాల్డో చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు 196 మ్యాచ్‌లతో కువైట్‌కు చెందిన బాదర్ అల్-ముతావాతో సమంగా ఉన్నాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా మొరాకోతో జరిగిన క్వార్టర్స్ ఫైనల్ రొనాల్డోకు 196వ మ్యాచ్. ఇక మ్యాచ్‌లోనూ రొనాల్డో రెండు గోల్స్‌తో అదరగొట్టాడు. ఆట 51వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన రొనాల్డో ఆట 63వ నిమిషంలో మరో గోల్ చేశాడు. దీంతో పోర్చుగల్ 4-0 తేడాతో లిచెన్స్టెయిన్ను చిత్తుగా ఓడించింది. ఇక ఓవరాల్‌గా పోర్చుగల్ తరపున 197 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో 120 గోల్స్ కొట్టి ఆల్‌టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 💚❤️1⃣9⃣7⃣ Take a bow, @Cristiano 👏👏👏#EURO2024 pic.twitter.com/ArgPz0MEYD — UEFA EURO 2024 (@EURO2024) March 23, 2023 -
ఆడడంలో విఫలం.. తప్పు మీద తప్పు చేస్తూ
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి సహనం కోల్పోయాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గోల్ కొట్టడంలో విఫలమైన రొనాల్డో ఈసారి మరింత కోపం తెచ్చుకున్నాడు. తన కోపం ఎవరిపై చూపించాలో తెలియక ఫుట్‌బాల్‌పై చూపించడం.. అది చూసిన రిఫరీ రొనాల్డోకు ఎల్లో కార్డు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. విషయంలోకి వెళితే.. సౌదీ అరేబియన్ ప్రో-లీగ్‌లో భాగంగా అల్-నసర్, అభాల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో 3-1 తేడాతో రొనాల్డో సేన విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్‌లో రొనాల్డో ఒక్క గోల్ కూడా కొట్టేలేకపోయాడు. రొనాల్డో చేతిలో బంతి ఉండగా ఫస్ట్ హాఫ్ ముగిసినట్లు రిఫరీ విజిల్ వేశాడు. అప్పటికే గోల్ కొట్టలేదన్న కోపంలో ఉన్న రొనాల్డో తన వద్ద ఉన్న బంతిని కాలితో బలంగా తన్నాడు. అంతే ఒక్క ఉదుటన బంతి 60 మీటర్ల దూరంలో పడింది. రొనాల్డో చర్యకు తోటి ఆటగాళ్లు సహా ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇది గమనించిన రిఫరీ రొనాల్డోకు ఎల్లోకార్డు జారీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే రొనాల్డో ఇలా చేయడం ఇది తొలిసారి మాత్రం కాదు. ఇంతకముందు అల్ ఇత్తిహాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-0తో ఓడిపోయామన్న కోపంతో మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో వాటర్ బాటిల్‌ను తన్నడం.. అది ఒక అభిమానికి తగలడం.. ఆ తర్వాత వచ్చి క్షమాపణలు చెప్పడం జరిగాయి. ఇక మార్చి 18(శనివారం) అల్-నసర్.. అభాతో మరో మ్యాచ్ ఆడనుంది. Ronaldo received a yellow card for kicking the ball away in frustration after the referee whistled the end of the first half. pic.twitter.com/xR92h1FmEm — ESPN FC (@ESPNFC) March 14, 2023 చదవండి: చరిత్ర సృష్టించిన యూఏఈ క్రికెటర్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు -
Cristiano Ronaldo: ఇదే తగ్గించుకుంటే మంచిది..
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కోపం ఎక్కువే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్నిసార్లు తన చర్యతో అభిమానుల మనోభావాలను కూడా దెబ్బతీసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఫిఫా వరల్డ్‌కప్ అనంతరం క్రిస్టియానో రొనాల్డో కాస్త కొత్తగా కనిపించాడు. మాంచెస్టర్ యునైటెడ్‌తో తెగదెంపుల తర్వాత అల్-నసర్ క్లబ్‌తో ఒప్పందం చేసుకున్న రొనాల్డో వరుస విజయాలు సొంతం చేసుకుంటూ వచ్చాడు. ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్‌లు ఓడినప్పటికి ఆ తర్వాత అల్-నసర్ వరుస విజయాలతో దుమ్మురేపింది. అయితే సౌదీ ప్రోలీగ్‌లో భాగంగా శుక్రవారం అల్-ఇత్తిహాద్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో సేన 1-0తో ఓటమిపాలైంది. మ్యాచ్ ఓడిపోయామన్న బాధలో పాత రొనాల్డో బయటికి వచ్చేశాడు. సహనం కోల్పోయిన రొనాల్డో పెవిలియన్‌కు వస్తున్న క్రమంలో ఎదురుగా కనిపించిన వాటర్ బాటిల్‌ను కోపంతో తన్నాడు. దెబ్బకు వాటర్ బాటిల్స్ చెల్లాచెదురయ్యాయి. ఒక వాటిర్ బాటిల్ ఎగిరి అభిమానుల మధ్య పడింది. అయితే ఎవరికి ఆ బాటిల్ తగల్లేదు. అయితే రొనాల్డో చర్యను ఫుట్‌బాల్ ఫ్యాన్స్ వ్యతిరేకించారు. ఒక్క మ్యాచ్ ఓడిపోయనంత మాత్రానా ఇలా చేయడం ఏంటని మండిపడుతున్నారు. కోపంలో చేసే పని ఒక్కోసారి చేటు తెస్తుందని.. అందుకే కోపం తగ్గించుకుంటే మంచిదని హితబోధ చేశారు. అయితే రొనాల్డో కోపానికి ఇంకో కారణం కూడా ఉందని తెలిసింది. అదేంటంటే మ్యాచ్ జరుగుతున్నంత సేపు అల్-ఇత్తిహాద్ జట్టు అభిమానులు అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ నామస్మరణ చేశారు. రొనాల్డో కనిపించిన ప్రతీసారి మెస్సీ పేరు అతనికి వినపడేలా గట్టిగట్టిగా అరిచారు. ఈ చర్య కూడా అతని కోపానికి ఒక కారణం కావొచ్చు అని కొందరు పేర్కొన్నారు. అయితే తన చర్యపట్ల సిగ్గుపడిన రొనాల్డో కాసేపటి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి అభిమానులను క్షమాపణ కోరాడు. ఇక మ్యాచ్‌లో ఆట 10వ నిమిషంలో అల్-ఇత్తిహాద్ తరపున బ్రెజిల్‌కు చెందిన రొమారినో గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇరుజట్లు పలుమార్లు గోల్‌పోస్ట్‌పై దాడులు జరిపినప్పటికి మరో గోల్ రాలేదు. pic.twitter.com/26nxt7u4Ak — Out Of Context Football (@nocontextfooty) March 9, 2023 చదవండి: మెస్సీని మెచ్చుకుంటూనే అవమానించాడు -
మెస్సీని మెచ్చుకుంటూనే అవమానించాడు
యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్‌లో మెస్సీ సారధ్యంలోని పీఎస్జీ కథ ముగిసింది. గురువారం తెల్లవారుజామున డిఫెండింగ్ ఛాంపియన్ బెయర్న్ మ్యునిచ్‌తో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో పీఎస్జీ 2-0 తేడాతో ఓటమి పాలై నాకౌట్ అయింది. బెయర్న్ మ్యునిచ్ తరపున ఎరిక్ మాక్సిమ్ మోటింగ్(61వ నిమిషం), సెర్గి గ్నార్బీ(89వ నిమిషం)లో గోల్స్ చేశారు. కాగా బెయర్న్ మ్యునిచ్ యూఈఎఫ్ఏ లీగ్‌లో క్వార్టర్స్ చేయడం ఇది పదమూడోసారి కావడం విశేషం. కాగా 2020లో ఇదే బెయర్న్ మ్యునిజ్.. అప్పటి పీఎస్జీని ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం బెయర్న్ మ్యునిచ్ కెప్టెన్.. జర్మనీ స్టార్ ఫుట్‌బాలర్ థామస్ ముల్లర్ మెస్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెస్సీని ఒకవైపు మెచ్చుకుంటేనే మరోవైపు అవమానించాడు. ''మెస్సీ ఒక రియలిస్టిక్ ఆటగాడు.. మ్యాచ్ గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అర్జెంటీనా స్టార్‌గా అతను ఎన్నో ఘనతలు సాధించాడు. అతనంటే నాకు గౌరవం.. కానీ పారిస్ జెయింట్స్ లాంటి ఫుట్‌బాల్ క్లబ్స్ తరపున మాత్రం మెస్సీ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. క్లబ్స్‌లో తన రియలిస్టిక్ ఆటను చూడలేకపోతున్నాం. దేశం తరపున మాత్రమే మెస్సీ కెప్టెన్‌గా పనికొస్తాడు.. క్లబ్స్ తరపున కెప్టెన్‌గా పనికిరాడు. ఈ ఒక్క విషయంలో క్రిస్టియానో రొనాల్డోతో మెస్సీని పోల్చవచ్చని.. మెస్సీ లాగే రొనాల్డో కూడా ఇటీవలే కాలంలో కెప్టెన్‌గా విఫలమవుతున్నాడనే విషయం గుర్తుపెట్టుకోవాలి.'' అంటూ తెలిపాడు. Thomas Müller: "Against Messi, things always go well at all levels in terms of results. At club level, Cristiano Ronaldo was our problem when he was at Real Madrid. But I have the greatest respect for Messi's World Cup performance" [@georg_holzner] pic.twitter.com/duZ94DgZxw — Bayern & Germany (@iMiaSanMia) March 9, 2023 చదవండి: మెస్సీని భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి -
రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్.. అగ్రస్థానంలోకి! వీడియో వైరల్
Cristiano Ronaldo- Al-Nassr: సౌదీ ప్రొ లీగ్‌లో ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. అద్భుత ఆట తీరుతో అభిమానులకు కనువిందు చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్‌తో తెగదెంపులు చేసుకున్న అనంతరం.. రొనాల్డో దుబాయ్‌కు చెందిన అల్ నజర్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఆ జట్టు పగ్గాలు చేపట్టి సౌదీ ప్రొ లీగ్‌లో ముందుకు నడిపిస్తున్న రొనాల్డో శనివారం నాటి మ్యాచ్‌లో వరుసగా మూడు గోల్స్ సాధించాడు. దీంతో ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ స్టేడియంలో డమాక్‌తో పోరులో అల్ నజర్ గెలుపొందింది. జట్టును గెలిపించి.. అగ్రస్థానానికి మ్యాచ్ 18వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన ఈ పోర్చుగీస్ స్టార్.. 23వ నిమిషంలో రెండో గోల్ సాధించాడు. ఇక తొలి అర్ధ భాగం ముగస్తుందన్న ఆఖరి నిమిషంలో మరో గోల్ కొట్టి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. రెండో అర్ధ భాగంలో ఇరు జట్లకూ గోల్ చేసే అవకాశం రాలేదు. ఈ క్రమంలో రొనాల్డో సారథ్యంలోని అల్ నజర్ 3-0తో విజయఢంకా మోగించింది. కాగా అల్ నజర్ కెప్టెన్‌గా రొనాల్డోను నియమించడం పట్ల సహచర ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేశారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే, వాళ్లు మాత్రం తమకు రొనాల్డోతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కాగా అల్ నజర్ సౌదీ ప్రొ లీగ్‌లో 2022-23 సీజన్లో ఇప్పటి వరకు పద్దెమినిదికి గానూ పదమూడింట గెలిచింది. నాలుగు డ్రా చేసుకుని.. ఒక మ్యాచ్‌లో ఓడింది. ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. చదవండి: వాళ్లకేం ఖర్మ? ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు.. బీసీసీఐని చూసి పీసీబీ నేర్చుకోవాలి: పాక్ మాజీ ప్లేయర్ BGT: దానర్థం జట్టు నుంచి తప్పించినట్లు కాదు! రాహుల్‌కు మరిన్ని అవకాశాలు! వైస్ కెప్టెన్‌గా అతడే సరైనోడు.. కాకపోతే.. 👏 Another milestone day for the 🐐 in Saudi Arabia 2⃣ hat-tricks in 2023 already, as many as his best tally in each of the last 3 calendar years. It's only February!#RoshnSaudiLeague | #CR7𓃵 | @AlNassrFC_EN | @Cristiano pic.twitter.com/AXCE0sPHtx — Roshn Saudi League (@SPL_EN) February 25, 2023 ثلاثيـة #العالمي أمام ضمك 💛 في 90 ثانيـة 🎬 والكواليس الكاملـة تأتيكم الليـلة 🔥🤩 pic.twitter.com/8CjvDQKgDW — نادي النصر السعودي (@AlNassrFC) February 25, 2023 -
కత్తి పట్టిన క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) క్రిస్టియానో రొనాల్డో కత్తి పట్టాడు. సౌదీ అరేబియా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న అల్ నస్ర్ క్లబ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఆర్7 ఈ సాహసానికి ఒడిగట్టాడు. స్థానికంగా ఉండే ఓ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రొనాల్డో కత్తి పట్టడంతో పాటు సౌదీ సంప్రదాయ నృత్యంలోనూ భాగమయ్యాడు. Happy founding day to Saudi Arabia 🇸🇦Was a special experience to participate in the celebration at @AlNassrFC ! pic.twitter.com/1SHbmHyuez— Cristiano Ronaldo (@Cristiano) February 22, 2023 ఈ వేడుకలో సౌదీ సంప్రదాయ దుస్తులు ధరించి ఫోటోలకు పోజిచ్చిన సీఆర్7.. ఆ దేశ జెండాను భుజాలపై వేసుకుని కత్తిని గాల్లోకి లేపుతూ డ్యాన్స్ చేశాడు. ఈ కార్యక్రమంలో అల్ నస్ర్ యాజమాన్యంతో పాటు క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించే ప్లేయింగ్, నాన్ ప్లేయింగ్ సభ్యులంతా పాల్గొన్నారు. దీనికి సంబంధించినర వీడియోను రొనాల్డో స్వయంగా తన సోషల్‌మీడియా ఖాతాల ద్వారా షేర్ చేశాడు. సౌదీ అరేబియాకు వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు.. ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక అనుభూతిని కలిగించిందంటూ కామెంట్స్ జోడించాడు. కాగా, సౌదీ ఫుట్‌బాల్ క్లబ్ అల్ నస్ర్.. 2023 నుంచి 2025 జూన్ వరకు రెండేళ్ల పాటు క్రిస్టియానో రొనాల్డోతో 400 మిలియన్ల యూరోలకు భారీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. భారత కరెన్సీలో ఈ డీల్ విలువ రూ.3500 కోట్లకు పై మాటే. డీల్‌లో భాగంగా రొనాల్డో 2030 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రమోషన్లో భాగం కావాల్సి ఉంటుంది. ఈ ప్రపంచకప్‌కు సౌదీ.. పక్క దేశాలతో కలిసి ఆతిధ్యం ఇచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, సీఆర్7 ఇటీవలే తన క్లబ్ కెరీర్లో 500 గోల్స్ మైలరాయిని అధిగమించాడు. సౌదీ లీగ్‌లో భాగంగా అల్ వెహదా క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 గోల్స్ చేయడం ద్వారా రొనాల్డో ఈ రేర్ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో అల్ నస్ర్ 4-0 తేడాతో గెలుపొందగా.. అన్ని గోల్స్ సీఆర్7 ఖాతాలోకే వెళ్లాయి. 5 సార్లు బాలన్ డి ఓర్ విన్నర్ అయిన రొనాల్డో.. అత్యధిక అంతర్జాతీయ గోల్స్, ఛాంపియన్స్ లీగ్ గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన విషయం విధితమే. -
క్రిస్టియానో రొనాల్డో సీక్రెట్స్ బట్టబయలు
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు అభిమానం గణం ఎక్కువే. ఆరడుగుల అందగాడు ఏం తింటాడు, ఫిట్నెస్ ఎలా మెయింటేన్ చేస్తున్నాడన్న సీక్రెట్స్ తెలుసుకోవాలని అతన్ని ప్రేమించే అభిమానులకు కుతూహులం ఉండడం సహజం. అంతేకాదు మ్యాచ్‌లో కనిపించిన ప్రతీసారి రొనాల్డో చేతులకు రెండు రింగులు కనిపిస్తాయి. అందులో ఒకటి ఫిట్నెస్ రింగ్ అయితే.. మరొకటి బ్రేస్లెట్(Bracelet). బ్రేస్లెట్(Bracelet) అనేది తన పర్సనల్ కాబట్టి దాని గురించి మాట్లాడుకోనవసరం లేదు. కానీ రొనాల్డో ఫుట్ సీక్రెట్ ఏంటి.. ఫిట్నెస్ రింగ్ ఎందుకు ధరించాడనే దానిని ఒక వ్యక్తి బట్టబయలు చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రస్తుతం రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్-నసర్ క్లబ్ న్యూట్రిషనిస్ట్ జోస్ బ్లీసా. స్పానిష్ న్యూస్‌పేపర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో ఫుట్ సీక్రెట్స్‌తో పాటు అతని ఫిట్నెస్ రింగ్ రహస్యాన్ని పంచుకున్నాడు. ''రొనాల్డో తన ఫుడ్‌లో కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలకు ఎక్కువ చోటిస్తాడు. అతను పాటించే స్ట్రిక్ట్ డైట్ ఫిట్‌గా ఉంచేందుకు దోహదపడుతుంది. తినే ఆహారాన్ని బట్టి ఆరోజు ఎన్ని కేలరీలు కరిగించాలనేది రొనాల్డో ముందుగానే నిర్ణయించుకుంటాడు. అందుకు తగ్గట్టుగానే తనను తాను ప్రిపేర్ చేసుకుంటాడు. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలి. ప్రస్తుతం రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్-నసర్ క్లబ్‌లోని ఆటగాళ్లంతా రొనాల్డో కఠినమైన డైట్‌ను ఫాలో అవుతున్నారు. దీనివల్ల ఆటగాళ్లలో 90శాతం మార్పు కనిపిస్తోంది. కొవ్వు తక్కువున్న పదార్థాలను తీసుకుంటూ ఆటగాళ్లు గంటల తరబడి ఎక్సర్సైజులు చేస్తూ తమ ఫిట్నెస్ను రోజురోజుకు మరింత మెరుగుపరుచుకుంటున్నారు. అల్-నసర్ క్లబ్ న్యూట్రిషనిస్ట్ జోస్ బీస్లాతో రొనాల్డో ఇక రొనాల్డో చేతులకు రెండు రింగులు ఉంటాయి. ఒకటి బ్రేస్లెట్.. మరొకటి ఫిట్నెస్ రింగ్. ఈ ఫిట్నెస్ రింగ్ రొనాల్డో ఎంతసేపు నిద్రపోతున్నాడు.. ఎంతసేపు ఫిజికల్ యాక్టివిటీస్‌లో చురుగ్గా ఉన్నాడనేది లెక్కిస్తుంది. అతను పడుకున్నా, కదలికలు ఉన్నా ఫిట్నెస్ రింగ్ పని చేస్తూనే ఉంటుంది. అంతేకాదు హార్ట్‌బీట్‌తో పాటు శ్వాసరేటను, శరీర ఉష్ణోగ్రతను, కదలికలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇక బ్రేస్లెట్ అతని పర్సనల్ విషయం.. దాని గురించి ఆరా తీయలేదు(నవ్వుతూ)'' ముగించాడు. ఇక రొనాల్డో గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పోర్చుగల్ జట్టును విజేతగా నిలపడంలో విఫలమైన రొనాల్డో కేవలం ఒకే ఒక్క గోల్ కొట్టి దారుణ ప్రదర్శన చేశాడు. అటుపై మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో జరిగిన వివాదం తెగదెంపులకు దారి తీసింది. అయితే రొనాల్డో క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదు. అల్-నసర్ ఫుట్‌బాల్ క్లబ్‌తో రొనాల్డో రెండేళ్ల కాలానికి భారీ ఒప్పందం చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Jose Blesa Nutrición (@joseblesanutri) Beautiful 💛🎶 https://t.co/uFWlOgLkQv pic.twitter.com/PgdCK697N0 — AlNassr FC (@AlNassrFC_EN) February 17, 2023 చదవండి: 'కనబడుట లేదు'.. ఐపీఎల్లో ఆడించేందుకే ఈ డ్రామాలు Christian Atsu: టర్కీ భూకంపం.. మృత్యువుతో పోరాడి ఓడిన స్టార్ ఫుట్‌బాలర్ Viswanathan Anand: చదరంగంలో మిస్టర్ మేధావి.. తొలి గురువు ఎవరంటే? -
చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో ఘనత సాధించాడు. ఫుట్‌బాల్ క్లబ్స్ తరఫున 500 గోల్స్ చేశాడు. సౌదీ ప్రో లీగ్‌లో నాలుగు గోల్స్ కొట్టి ఈ రికార్డుకు చేరువయ్యాడు. అల్ వెహ్దాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో చెలరేగిపోయాడు. మునపటి రొనాల్డోను గుర్తు చేస్తూ 30 నిమిషాల వ్యవధిలో బంతిని నాలుగు సార్లు గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దాంతో, అల్-నసర్ క్లబ్ 4-0తో గెలుపొందింది. ప్రస్తుతం అతని ఖాతాలో 503 గోల్స్ ఉన్నాయి. పోర్చుగల్‌లోని సావో పెడ్రో అనే చిన్న ద్వీపంలో పుట్టిన రొనాల్డో మొదట్లో అండోరిన్హా, నసియోనల్ వంటి స్థానిక క్లబ్స్‌కు ఆడాడు. ఆటలో నైపుణ్యం సాధించిన అతను 18 ఏళ్లకే సీనియర్ టీమ్‌కు ఆడాడు. అతను ఇప్పటి వరకు ఐదు క్లబ్స్‌కు ఆడాడు. రియల్ మాడ్రిడ్ తరఫున రొనాల్డో అత్యధికంగా 311 గోల్స్ కొట్టాడు. ఆ తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున 103 గోల్స్ చేశాడు. జువెంటస్ క్లబ్‌కు ఆడిన సమయంలో 81 గోల్స్ చేశాడు. స్పోర్టింగ్ లెబనాన్ క్లబ్ తరఫున మూడు, తాజాగా అల్ నసర్ క్లబ్ తరపున ఐదు గోల్స్ కొట్టాడు. ఓవరాల్‌గా పోర్చుగల్ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు సహా అన్ని క్లబ్‌లు కలిపి 1100 మ్యాచ్‌లకు పైగా ఆడిన రొనాల్డో 820 గోల్స్ కొట్టాడు. Not bad for a 38yr-old… https://t.co/aFZJFwtlH1 — Piers Morgan (@piersmorgan) February 9, 2023 చదవండి: 135 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్.. ఆటగాడిపై జీవితకాల నిషేధం ఆసీస్ కుర్రాడు ఆకట్టుకున్నా.. జడ్డూ, అక్షర్ తొక్కేశారు -
రొనాల్డో వల్ల గెలవడం కష్టమైపోయింది.. సహచరుడి సంచలన కామెంట్స్
స్టార్ ఫుట్‌బాలర్, పోర్చుగల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోపై అతని కొత్త క్లబ్ (సౌదీకి చెందిన అల్ నస్ర్ క్లబ్) సహచరుడు, ఆ జట్టు మిడ్ ఫీల్డర్ లూయిజ్ గుస్తావో సంచలన వ్యాఖ్యలు చేశాడు. రొనాల్డో వచ్చినప్పటి నుంచి తమ జట్టు గెలవడం కష్టంగా మారిందని లూయిజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రొనాల్డో తమ జట్టులో ఉన్నందున ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు రెండొందల శాతం ప్రదర్శన ఇస్తున్నారు.. అందువల్లే తమకు గెలవడం కష్టంగా మారిందని అన్నాడు. ఇక, తమ జట్టు విషయానికొస్తే.. రొనాల్డో తమతో చేరినప్పటి నుంచి జట్టులో చాలా మార్పులు వచ్చాయి. ఫిజికల్‌గా, టెక్నికల్‌గా బలంగా ఉన్న రొనాల్డోను చూసి తాము చాలా నేర్చుకుంటున్నామని అన్నాడు. సవాళ్లు స్వీకరించి, వాటిని అధిగమించడంలో రొనాల్డో దిట్ట, అతని సహవాసంలో తాము కూడా ఈ విషయంలో మెరుగవుతున్నామని గుస్తావో తెలిపాడు. కాగా, సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్ర్ క్లబ్ ఇటీవలే రొనాల్డోతో భారీ డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అల్ నస్ర్ క్లబ్ రెండున్నరేళ్ల కాలానికి గానూ రొనాల్డోకు రూ.4400 కోట్ల భారీ మొత్తం అప్పజెప్పేందుకు డీల్ కుదుర్చుకుంది. ఈ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాక రొనాల్డో ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో గోల్ చేయకుండా నిరాశ పరిచిన GOAT.. శుక్రవారం అల్ ఫతేహీతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో ఓ గోల్ చేశాడు. ఫలితంగా అల్ నస్ర్ టీమ్ 2-2తో మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. అల్ నస్ర్ తరఫున రొనాల్డో చేసిన మొదటి గోల్ ఇదే. సౌదీ ప్రో లీగ్‌లో రూడీ గార్సియా నేతృత్వంలో ఆడుతున్న రొనాల్డో.. అల్ నస్ర్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్క గోల్ మాత్రమే చేశాడు. -
cristiano Ronaldo: ఎట్టకేలకు గోల్.. కనిపించని సెలబ్రేషన్స్
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఎట్టకేలకు అల్-నసర్ తరపున తొలి గోల్ కొట్టాడు. అల్ ఫతేహ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో తన గోల్‌తో అల్-నసర్ను ఓటమి నుంచి గట్టెక్కించి మ్యాచ్‌ను డ్రా చేయడంలో సఫలమయ్యాడు. అదనపు సమయంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన రొనాల్డో ఎప్పుడు గోల్ కొట్టినా సుయ్(Sui) సెలబ్రేషన్ చేయడం చూస్తుంటాం. కానీ తొలిసారి ఎలాంటి సెలబ్రేషన్స్ లేకుండా రొనాల్డో సాదాసీదాగా కనిపించాడు. బహుశా మ్యాచ్‌ను డ్రా చేసుకోవడమే అందుకు కారణమనుకుంటా. కాగా ఫిఫా వరల్డ్‌కప్ జరగుతున్న సమయంలోనే మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో.. సౌదీ అరేబియాకు చెందిన అల్ నసర్ క్లబ్‌తో 200 మిలియన్ యూరోలకు రెండున్నరేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నాడు. అల్ నసర్ క్లబ్‌కు వెళ్లినప్పటి నుంచి రొనాల్డో ఒక్క గోల్ కూడా కొట్టలేదు. తాజాగా క్లబ్ తరపున తొలి గోల్ నమోదు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అల్ ఫతేహ్‌తో మ్యాచ్‌ను అల్ నసర్ 2-2తో డ్రా చేసుకుంది. ఆట 12వ నిమిషంలో మాజీ బార్సిలోనా స్టార్ క్రిస్టియాన్ టెల్లో గోల్ కొట్టడంతో అల్ ఫతేహ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆట 42వ నిమిషంలో టలిస్కా అల్ నసర్‌కు తొలి గోల్ అందించి 1-1తో సమం చేశాడు. తొలి హాఫ్‌ను రెండు జట్లు 1-1తో ముగించాయి. రెండో అర్థభాగం మొదలయ్యాకా 58వ నిమిషంలో అల్ ఫతేహ్ ఆటగాడు సోఫియాఏ బెండెబ్కా గోల్ కొట్టి జట్టును 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి నిర్ణీత సమయంలోగా అల్ నసన్ మరో గోల్ కొట్టలేకపోయింది. అయితే అదనపు సమయంలో రొనాల్డోకు లభించిన పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకొని గోల్‌గా మలచడంతో మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. ఇక 15 మ్యాచ్‌ల తర్వాత అల్ నసర్ లీగ్‌లో తొలి స్థానంలో నిలిచింది. జట్టు ఖాతాలో 34 పాయింట్లతో ఉంది. ఇక అల్ నసర్ గురువారం అల్ వేదాకు బయలుదేరి వెళ్లింది. د90+3' هدف التعادل لـ النصر عن طريق كريستيانو رونالدو الفتح 2 × 2 النصر#الفتح_النصر | #CR7 | #SSC pic.twitter.com/5SYppTQXlU — شركة الرياضة السعودية SSC (@ssc_sports) February 3, 2023 చదవండి: ఎన్బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు -
Lionel Messi: రొనాల్డో అరుదైన రికార్డు బద్దలు కొట్టిన మెస్సీ.. ఏకంగా..
Lionel Messi- Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో- లియోనల్ మెస్సీ.. ఈ ఇద్దరు ఫుట్‌బాల్ దిగ్గజాల మధ్య రికార్డుల పోటీ నువ్వా- నేనా అన్నట్లుగా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దకాలంగా సాకర్ ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తున్న ఈ ఇద్దరు లెజెండ్స్‌లో.. మెస్సీ ఫిఫా ప్రపంచకప్-2022 ట్రోఫీని ముద్దాడి ఓ మెట్టు పైన నిలిచాడు. మరోవైపు.. పోర్చుగల్ స్టార్ రొనాల్టోకు మాత్రం వరల్డ్‌కప్ టైటిల్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఖతర్ టోర్నీలో అర్జెంటీనా సూపర్‌స్టార్ మెస్సీ అద్భుతాలు చేయగా.. రొనాల్డో మాత్రం అవమానకర రీతిలో ఈవెంట్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. రొనాల్డో రికార్డు బద్దలు ఈ క్రమంలో రొనాల్డోకు సాధ్యం కాని పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న లియోనల్ మెస్సీ.. ఈ పోర్చుగల్ స్టార్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. టాప్-5 యూరోపియన్ లీగ్‌లలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా 697 గోల్స్‌తో రొనాల్డోను అధిగమించాడు మెస్సీ. ఫ్రెంచ్ లీగ్‌లో భాగంగా పారిస్ సెయింట్ జర్మనీ(పీఎస్జీ), మాంట్పిల్లర్ మ్యాచ్ సందర్భంగా మెస్సీ ఈ ఫీట్ నమోదు చేశాడు. పీఎస్జీకి ప్రాతినిథ్యం వహించిన ఈ అర్జెంటీనా లెజెండ్.. ఈ మ్యాచ్‌లో గోల్ ద్వారా రొనాల్డోను వెనక్కినెట్టాడు. క్లబ్ కెరీర్లో మొత్తంగా 697 గోల్స్ చేసి టాప్‌లో నిలిచాడు. ఇక ఇందులో ఈ సీజన్లో పీఎస్జీ తరఫున చేసిన గోల్స్ 13. మరోవైపు.. రొనాల్డో ఇప్పటి వరకు రియల్ మాడ్రిడ్ తరఫున 450, మాంచెస్టర్ యునైటెడ్ తరఫున 145, జువెంటస్ తరఫున 101 గోల్స్‌తో కలిపి మొత్తంగా 696 గోల్స్ సాధించాడు. ఇదిలా ఉంటే.. మాంట్పిల్లర్తో మ్యాచ్‌కు ముందు మెస్సీ మాట్లాడుతూ తన రిటైర్మెంట్పై సంకేతాలు ఇచ్చాడు. కోరుకున్నవన్నీ దక్కాయి.. ఇకపై ‘‘జాతీయ జట్టు తరఫున నేనైతే సాధించాలని అనుకున్నానో ఆ కల నెరవేరింది. వ్యక్తిగతంగా.. వృత్తిగతంగా నేను కోరుకున్నవన్నీ నాకు లభించాయి. శిఖరాగ్రంలో ఉన్నపుడే కెరీర్‌ను ముగించడమే మిగిలి ఉంది. నేను ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టినపుడు ఇక్కడి దాకా వస్తానని అస్సలు ఊహించలేదు. కెరీర్లో అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాను. ప్రస్తుతం నా జీవితంలో ఎలాంటి అసంతృప్తి లేదు. మేము 2021లో కోపా అమెరికా, 2022లో వరల్డ్‌కప్ గెలిచాము. ఇంతకంటే సాధించాల్సిందేమీ లేదు’’అని మెస్సీ అర్బన్ప్లేతో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియా ఫుట్‌బాల్ క్లబ్ అల్ నసర్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాడు. చదవండి: Shubman Gill Century: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్‌కు సచిన్ రావాల్సిందే! IND vs NZ: 'తీవ్రంగా నిరాశపరిచాడు.. స్పిన్నర్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలి’ What a Goal by the World Champion Lionel Messi. 🔥🐐 pic.twitter.com/yPJmqUgZda — x3a6y 🇦🇪 (@x3a6y) February 1, 2023 -
క్రిస్టియానో రొనాల్డోకు అవమానం..
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు సొంత అభిమానుల మధ్య అవమానం ఎదురైంది. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో సౌదీ అరేబియా ఫుట్‌బాల్ క్లబ్ అల్ నసర్‌తో భారీ విలువకు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అల్ నసర్ తరపున రొనాల్డో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో పారిస్ సెయింట్స్ జర్మన్(పీఎస్జీ)తో ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా ఉంది. ఆ మ్యాచ్‌లో మెస్సీని డామినేట్ చేసిన రొనాల్డో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. కానీ మ్యాచ్‌లో మాత్రం రొనాల్డో అల్ నసర్ ఓడిపోయింది. తాజాగా రొనాల్డో జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. సౌదీ సూపర్‌కప్‌లో భాగంగా గురువారం అర్థరాత్రి రియాద్ వేదికగా అల్ ఇత్తిహద్, అల్ నసర్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అల్ ఇత్తిహద్ 3-1 తేడాతో అల్ నసర్ జట్టును చిత్తు చేసింది. 90 నిమిషాల పాటు ఆడిన రొనాల్డో ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాడు. కాగా లీగ్‌లో ఇది రెండో ఓటమి కావడంతో సౌదీ సూపర్ కప్ నుంచి అల్ నసర్ జట్టు నిష్క్రమించింది. కాగా రొనాల్డో వచ్చిన తర్వాత అల్ నసర్ కు ఇదే మేజర్ కప్. కానీ కప్ కొట్టకుండానే ఇంటిబాట పట్టింది. ఇక మ్యాచ్‌లో తన ఆటతో నిరాశపరిచిన రొనాల్డోను అభిమానులు అవమానించారు. మ్యాచ్ ముగిశాకా పెవిలియన్‌కు వస్తున్న సమయంలో రొనాల్డోనూ చూస్తూ మెస్సీ.. మెస్సీ అంటూ పెద్ద గొంతుతో అరిచారు. ఇది గమనించిన రొనాల్డో ఏలా స్పందించాలో తెలియక సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రొనాల్డో నేతృత్వంలోని అల్ నసర్ క్లబ్ అల్ ఫెచ్కు ప్రయాణం కానుంది. ఫిబ్రవరి మూడు నుంచి ప్రారంభం కానున్న సౌదీ ప్రో లీగ్‌లో ఆడనుంది. حسرة النجم العالمي ( كرستيانو رونالدو ) بعد الخسارة من #الاتحاد #الاتحاد_النصر pic.twitter.com/zp0g8Uey7l — علاء سعيد (@alaa_saeed88) January 26, 2023 చదవండి: జడేజా రాణించినా.. జట్టు మాత్రం ఓటమి '22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు' -
Cristiano Ronaldo: 'మంచి వంటవాడు కావాలి.. జీతం రూ. 4.5 లక్షలు'
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు అభిమానులు ఎక్కువ. గతేడాది ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ నిరాశజనక ప్రదర్శన చేసినప్పటికి రొనాల్డోకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఆటగాడిగా, వ్యక్తిగా రొనాల్డో చరిత్రకెక్కాడు. అలాంటి రొనాల్డో ఇప్పుడు ఒక మంచి వంటవాడి కోసం ఎదురుచూస్తున్నాడు. భారీగా జీతం ఇస్తానని చెప్పినా ఎవరూ దొరకడం లేదని రొనాల్డో తెగ బాధపడుతున్నాడు. పోర్చుగల్ లోని క్వింటా డాలో రొనాల్డో రూ.170 కోట్లతో ఓ కళ్లు చెదిరే భవంతిని కట్టిస్తున్నాడు.ఈ ఏడాది జూన్ వరకూ ఆ ఇల్లు నిర్మాణం పూర్తవుతుంది. ఆ తర్వాత భార్య జార్జినా రోడ్రిగెజ్, పిల్లలతో కలిసి రొనాల్డో ఆ కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. తమ కుటుంబానికి ఓ పర్సనల్ కుక్ కావాలని రొనాల్డో భావించాడు. నోరూరించే పోర్చుగీస్ ఫుడ్ తోపాటు ప్రపంచంలోని రకరకాల వంటలను చేసి పెట్టే మాస్టర్ చెఫ్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. వంట పని చేసే వ్యక్తికి నెలకు సుమారు 4500 పౌండ్లు(సుమారు రూ.4.5 లక్షలు) జీతం ఇస్తానని ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు ఎవరు ముందుకు రాలేదు. ఈ మధ్యనే రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన అల్ నసర్ క్లబ్‌తో రెండేళ్ల పాటు భారీ డీల్‌కు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా గురువారం అర్థరాత్రి సౌదీ అరేబియాలో పారిస్ సెయింట్స్ జర్మన్(పీఎస్జీ)తో రొనాల్డో జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో పీఎస్జీ 5-4 తేడాతో గెలుపొందింది. పీఎస్జీ జట్టులో మెస్సీ సహా బ్రెజిల్ స్టార్ నెయమర్, ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా మ్యాచ్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న రొనాల్డో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. చదవండి: లైంగిక వేధింపులు.. కటకటాల్లో స్టార్ ఫుట్‌బాలర్ -
ఒక్క చూపు సోషల్ మీడియాను షేక్ చేసింది..
లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్‌లో ఎవరికి వారే సాటి. అయితే మెస్సీ ఇటీవలే అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్‌కప్ అందించి రొనాల్డో కంటే ఒక మెట్టు పైనే ఉన్నాడు. మరో వరల్డ్‌కప్ జరిగేందుకు నాలుగేళ్ల సమయం ఉంది. వచ్చే వరల్డ్‌కప్‌లో ఈ ఇద్దరు ఆడుతారా లేదా అనేది ఆసక్తికరమే. ఈ విషయం పక్కనబెడితే.. మెస్సీ, రొనాల్డోలు ఒకే ఫుట్‌బాల్ క్లబ్‌కు ఆడిన సందర్భాలకంటే ప్రత్యర్థులుగా తలపడిన సందర్భమే ప్రేక్షకులకు ఎక్కువ మజాను అందిస్తుంది. తాజాగా ఫిఫా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు ప్రత్యర్థులుగా మరోసారి తలపడ్డారు. దీనికి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ వేదికైంది. ఇటీవలే వివాదాస్పద రీతిలో మాంచెస్టర్ యునైటెడ్‌ను వీడిన క్రిస్టియానో రొనాల్డో.. సౌదీ అరేబియా ఫుట్‌బాల్ క్లబ్ అయిన అల్-నసర్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇక మెస్సీ, నెయ్మర్, కైలియన్ ఎంబాపెలు పారిస్ సెయింట్స్ జర్మన్(పీఎస్జీ)కి ఆడుతున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఫహద్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో మెస్సీ నేతృత్వంలోని ఆల్‌స్టార్స్ ఎలెవన్ జట్టు 5-4తో గెలుపొందింది. కాగా మ్యాచ్ మధ్యలో మెస్సీ రొనాల్డోవైపు ఒక లుక్ ఇచ్చాడు. కానీ రొనాల్డో మాత్రం మెస్సీని పట్టించుకోనట్లుగానే వ్యవహరించాడు. ఆ సమయంలో మెస్సీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెస్సీ ఇచ్చిన ఒక్క చూపు సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే ఇదంతా కేవలం కామెడీ కోసం మాత్రమే అని తర్వాత అర్థమైంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకున్న వీడియో బయటికి వచ్చింది.ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం రొనాల్డో సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టాడు. ''కొంత మంది పాత స్నేహితులను కలుసుకోవడం సంతోషంగా అనిపించింది.'' అంటూ కామెంట్ చేశాడు. Love someone who looks at you like Messi looks at Cristiano Ronaldo 🥂#CR7𓃵 pic.twitter.com/d4Z5Q5hZAq — Sarah (@_m__sara) January 19, 2023 చదవండి: 24 ఏళ్లపాటు కోమాలోనే.. కన్నుమూసిన సైక్లిస్ట్ బోల్ట్‌కు చేదు అనుభవం.. అకౌంట్ నుంచి 97 కోట్లు మాయం -
అక్కడ అన్ని రికార్డులు బద్దలు కొట్టా! నాకెన్నో ఆఫర్లు వచ్చాయి.. కానీ
Cristiano Ronaldo- Al-Nassr Club: ‘‘యూరోప్‌లో నేను చేయాల్సిందంతా చేశాను... అక్కడ నాకెన్నో ఆఫర్లు వచ్చాయి. బ్రెజిల్, ఆస్ట్రేలియా, అమెరికా సహా పోర్చుగల్‌లోనూ ఎన్నెన్నో అవకాశాలు తలుపుతట్టాయి. చాలా క్లబ్స్ నాతో ఒప్పందం కుదుర్చుకోవాలని భావించాయి. కానీ నేను ఈ క్లబ్‌కు మాట ఇచ్చాను’’ అంటూ పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అన్నాడు. తన ఇంకా కెరీర్ ముగిసిపోలేదని, తన గురించి ఎవరు ఎలా మాట్లాడినా పట్టించుకోనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. తనను తాను విలక్షణ ఆటగాడిగా అభివర్ణించుకున్న రొనాల్డో.. యూరోప్‌లో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టానన్నాడు. ఇప్పుడు ఇక్కడ కొత్తగా రికార్డుల వేట మొదలుపెట్టానని వ్యాఖ్యానించాడు. భారీ డీల్ కాగా ఫిఫా ప్రపంచకప్-2022కు ముందు యునైటెడ్ మాంచెస్టర్‌తో బంధం తెంచుకున్న రొనాల్డో.. సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ ఫుట్‌బాల్ క్లబ్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2023 సీజన్ నుంచి 2025 జూన్ వరకూ ఈ క్లబ్ తరఫున ఆడేందుకు జరిగిన ఈ డీల్ విలువ 200 మిలియన్ యూరోలు. ఈ క్రమంలో సౌదీకి చేరుకున్న 37 ఏళ్ల రొనాల్డోకు ఘన స్వాగతం లభించింది. అల్ నజర్‌కు చెందిన మిర్సూల్ పార్క్ స్టేడియంలో పసుపు, నీలం రంగుల మేళవింపుతో కూడిన జెర్సీలో అతడు రాగానే.. పెద్ద ఎత్తున పటాకాలు కాలుస్తూ వెల్కం చెప్పారు నిర్వాహకులు. అక్కడ అన్ని రికార్డులు బద్దలు కొట్టా ఈ సందర్భంగా రొనాల్డో మాట్లాడుతూ.. ‘‘నేను యూనిక్ ప్లేయర్‌ని. యూరోప్‌లో ఉన్న అన్ని రికార్డులు బద్దలు కొట్టాను. ఇప్పుడు కొత్త సవాళ్లు ఎదుర్కొంటూ మరిన్ని ఘనతలు సాధించేందుకు ఇక్కడకు వచ్చాను. సౌదీ అభివృద్ధిలో భాగం గెలిచేందుకే ఇక్కడకు వచ్చాను. ఆటను ఆస్వాదిస్తాను. ఈ దేశ సంస్కృతీ సంప్రదాయాలు, అభివృద్ధిలో నేను కూడా భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఇక రొనాల్డో గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగెజ్ సైతం సౌదీ మహిళ మాదిరి నలుపు రంగు అభయ ధరించి తమ పిల్లలతో కలిసి రొనాల్డో ఆగమనాన్ని వీక్షించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో మిలియన్ల కొద్ది వ్యూస్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ నిరాశజనక ప్రదర్శనతో ట్రోఫీ గెలవాలన్న రొనాల్డో కల కలగానే మిగిలిపోయింది. అంతేగాక పలు మ్యాచ్‌లకు కెప్టెన్ రొనాల్డోను పక్కనపెట్టడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో సౌదీ అరేబియాలో అతడు కొత్త క్లబ్ తరఫున ఆడనుండటం గమనార్హం. చదవండి: Rishabh Pant: ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి పంత్.. అంబానీ ఆస్పత్రిలో చికిత్స.. ఖర్చు మొత్తం ఎవరిదంటే! Deepak Hooda: అసభ్య పదజాలం వాడిన హుడా! ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ.. Walks of the greatness 🐐💛 pic.twitter.com/7FzLZSchQ5 — AlNassr FC (@AlNassrFC_EN) January 3, 2023 -
Cristiano Ronaldo: కళ్లు చెదిరే రీతిలో.. కాసుల పంట
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు బంపరాఫర్ తగిలింది. ఫిఫా వరల్డ్‌కప్‌కు ముందే మాంచెస్టర్ యునైటెడ్‌తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో అప్పటినుంచి ఏ క్లబ్‌కు సంతకం చేయలేదు. తాజాగా ఆ ఎదురుచూపులకు రొనాల్డో తెరదించాడు. ఇకనుంచి రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ క్లబ్ తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు అల్ నజర్ ఫుట్‌బాల్ క్లబ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2023 సీజన్ నుంచి 2025 జూన్ వరకూ (రెండేండ్లు) రొనాల్డో.. అల్ నజర్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డీల్ విలువ 200 మిలియన్ యూరోలకు పైగా ఉందని సమాచారం. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1770 కోట్లు. ఫిఫా ప్రపంచకప్ సందర్భంలో ఇదే డీల్ పై పలు రకాల కథనాలు వినిపించాయి. అప్పుడు రొనాల్డో వీటిని కొట్టిపారేసాడు. తాను ఎవరితో ఒప్పందం కుదుర్చుకోలేదని చెప్పాడు. కానీ ఇప్పుడు భారీ డీల్‌తో ప్రేక్షకుల ముందు రావడం గమనార్హం. ఇక ఫిఫా ప్రపంచకప్‌లోనూ రొనాల్డో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్‌గా పోర్చుగల్‌ను ఫైనల్ చేరుస్తాడనుకుంటే క్వార్టర్స్‌కే పరిమితమయ్యాడు. అంతేగాక ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో ఐదు మ్యాచ్‌లాడిన రొనాల్డో కేవలం ఒకే ఒక్క గోల్ చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.అంతకముందు ఫిఫా ప్రారంభానికి ముందు పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాంచెస్టర్ యునైటెడ్‌తో తెగదెంపులు చేసుకున్నాడు. అదీగాక మాంచెస్టర్ యునైటెడ్ హెడ్ కోచ్ తో గొడవ ఈ వివాదం మరింత ముదిరేలా చేసింది. History in the making. This is a signing that will not only inspire our club to achieve even greater success but inspire our league, our nation and future generations, boys and girls to be the best version of themselves. Welcome @Cristiano to your new home @AlNassrFC pic.twitter.com/oan7nu8NWC — AlNassr FC (@AlNassrFC_EN) December 30, 2022 చదవండి: Pele: భారత్‌తో అనుబంధం... నాడు సాకర్ మేనియాలో తడిసిముద్దయిన నగరం పీలే క్రేజ్‌కు ఉదాహరణ.. షూ లేస్ కట్టుకున్నందుకు రూ.కోటి -
Rip ‘King’: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం..
Brazil Legend Pele: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే(82) ఇకలేరు. అభిమానులను విషాదంలోకి నెట్టి తాను దివికేగారు. ‘‘నాకేం కాలేదని.. త్వరలోనే తిరిగి వస్తా’’నంటూ కొన్ని రోజుల క్రితం స్వయంగా ప్రకటించిన పీలే.. గురువారం అర్ధరాత్రి తర్వాత కానరాని లోకాలకు వెళ్లిపోయారు. పెద్ద పేగు కాన్సర్‌కు బలైపోయిన ఈ లెజెండ్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫుట్‌బాల్ స్టార్ల నివాళులు ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక ఫిఫా వరల్డ్‌కప్-2022 విజేత అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా రన్నరప్ ఫ్రాన్స్ సారథి కైలియన్ ఎంబాపే, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నేమార్ తదితరులు పీలేను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దిగ్గజ ఆటగాడితో తమ జ్ఞాపకాలు పంచుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ‘‘పీలే ఆత్మకు శాంతి కలగాలి’’ అని మెస్సీ పీలేతో దిగిన ఫొటోలను పంచుకున్నాడు. నేమార్ ఎమోషనల్ నోట్ ‘‘పీలే రాకముందు.. 10 అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే అన్న ఈ వాక్యాన్ని ఎక్కడో చదివాను. ఇదెంతో అందమైనదే అయినా.. అసంపూర్ణమైనదని నేను భావిస్తా. నిజానికి పీలే రాక మునుపు ఫుట్‌బాల్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే. ఆయన వచ్చిన తర్వాత ఈ క్రీడను ఓ కళగా మార్చారు. ఎంతో మంది నిస్సహాయులకు.. ముఖ్యంగా నల్లజాతీయుల గొంతుకగా మారారు. బ్రెజిల్ దిక్సూచిలా పనిచేశారు. ఆయన నేతృత్వంలో సాకర్, బ్రెజిల్ ఒక్కటిగా వెలుగొందాయి. ఇంతటి గొప్ప సేవలు అందించిన కింగ్‌కు ధన్యవాదాలు! ఆయన భౌతికంగా ఈ లోకం నుంచి వెళ్లిపోవచ్చు. కానీ ఆయన చేసిన అద్భుతాల తాలుకు జ్ఞాపకాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. పీలే చిరస్మరణీయుడు’’ అంటూ నేమార్ ఉద్వేగపూరిత నోట్ రాశాడు. కిరీటం ధరించిన పీలే ఫొటోను షేర్ చేస్తూ ‘కింగ్’ పట్ల అభిమానం చాటుకున్నాడు. ఎంబాపే, రొనాల్డో ఉద్వేగం ఫుట్‌బాల్ రారాజు భౌతికంగా దూరమయ్యాడు అంతే! ఆయన సాధించిన విజయాలు మాత్రం ఎల్లప్పటికీ శాశ్వతం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి కింగ్ అని ఎంబాపే ట్వీట్ చేశాడు. ఇక పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కోట్లాది మందికి పీలే స్ఫూర్తిదాయకమని, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. పీలే లేరన్న విషయాన్ని ఫుట్‌బాల్ లోకం జీర్ణించుకోలేకపోతోందని, ఆయన కుటుంబానికి ప్రగాభ సానుభూతి తెలియజేశాడు. అల్విదా కింగ్ ఫుట్‌బాల్ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చే ఆటగాళ్లలో పీలే ముందు వరుసలో ఉంటారనడంలో అతిశయోక్తి కాదు. మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఏకైక ప్లేయర్‌గా ఆయన ఘనత సాధించారు. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలే ముఖ్యపాత్ర పోషించి బ్రెజిల్ ముఖచిత్రంగా మారారు. అంతా స్టార్ ప్లేయర్లు ఉన్న జట్టులో.. 17 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్‌లో ఆడిన ఆయన.. మరో 12 ఏళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగారు. దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందారు. కాగా కెరీర్ మొత్తంలో నాలుగు ఫిఫా ప్రపంచకప్‌లు ఆడిన పీలే మొత్తం 12 గోల్స్ సాధించారు. 10 నంబర్ జెర్సీ ధరించే ఆయన.. ఆ సంఖ్యకు వన్నె తెచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by NJ 🇧🇷 (@neymarjr) View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) The king of football has left us but his legacy will never be forgotten. RIP KING 💔👑… pic.twitter.com/F55PrcM2Ud — Kylian Mbappé (@KMbappe) December 29, 2022 View this post on Instagram A post shared by Leo Messi (@leomessi) -
వరల్డ్‌కప్‌ను పక్కలో పెట్టుకుని పడుకున్న మెస్సీ.. వైరల్ ఫోటో
ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలవాలన్న తన చిరకాల కోరికను ఆఖరి ప్రయత్నంలో నెరవేర్చుకోవడంతో పాటు అర్జెంటీనాను మూడోసారి జగజ్జేతగా నిలిపిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT), అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీకి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఫిఫా వరల్డ్‌కప్-2022 గెలిచాక ఖతార్ నుంచి జట్టుతో పాటు స్వదేశానికి చేరుకున్న మెస్సీ.. తన 17 ఏళ్ల కెరీర్లో వరల్డ్‌కప్ గెలుపుకున్న ప్రాధాన్యత ఏంటో ప్రపంచానికి మరోసారి రుజువు చేశాడు. వరల్డ్‌కప్ గెలిచి రెండు రోజు పూర్తయ్యాక కూడా ఆ మూడ్‌లోనుంచి ఇంకా బయటికి రాని మెస్సీ.. పడుకున్నప్పుడు కూడా ట్రోఫీని తన పక్కలోనే పెట్టుకుని వరల్డ్‌కప్ టైటిల్‌పై తనకున్న మమకారాన్ని చాటుకున్నాడు. మెస్సీ.. వరల్డ్‌కప్ ట్రోఫీపై చేయి వేసుకుని పడుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ ఫోటోను మెస్సీ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ పిక్‌ను చూసిన మెస్సీ అభిమానులు.. తమ ఆరాధ్య ఫుట్‌బాలర్ వరల్డ్‌కప్‌ను పక్కలో పెట్టుకుని పడుకోవడాన్ని చూసి మురిసిపోతున్నారు. దిగ్గజ ఆటగాడికి ఆట పట్ల ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు. మెస్సీ.. వరల్డ్‌కప్ ట్రోఫీని తన బిడ్డల కంటే అధికంగా ప్రేమిస్తున్నాడనడానికి ఇది నిదర్శమని అంటున్నారు. ఈ పోస్ట్ 3 కోట్లకు పైగా లైక్స్ సాధించడం విశేషం. కాగా, డిసెంబర్ 18న జరిగిన ఫిఫా వరల్డ్‌కప్-2022 ఫైనల్లో అర్జెంటీనా 4-2 గోల్స్ తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మెస్సీ 2 గోల్స్ చేయడంతో పాటు మరో గోల్స్ సాధించడంలో డి మారియాకు తోడ్పడ్డారు. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం మెస్సీ ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్ వరల్డ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పోస్ట్‌కు రికార్డు స్థాయిలో 6 కోట్లకు పైగా లైక్స్ వచ్చాయి. గతంలో ఇన్‌స్టాలో అత్యధిక లైక్స్ వచ్చిన రికార్డు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉండేది. తాజాగా మెస్సీ.. రొనాల్డో రికార్డును బద్దలు కొట్టాడు. -
పోర్చుగల్ స్టార్ రొనాల్డోకు అవమానం.. అర్జెంటీనా ఆటగాడు కూడా
ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్ పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు చేదు అనుభవమే మిగిల్చింది. మెగాటోర్నీ ఆరంభం కాకముందే పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ ద్వారా మాంచెస్టర్ యునైటెడ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన ప్రతిష్టను దిగజార్చకున్నాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ రొనాల్డో ఆశించినంత మేర రాణించలేదనే చెప్పాలి. కేవలం ఒకే ఒక్క గోల్ కొట్టిన రొనాల్డో ఆ తర్వాత కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో తొలుత బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఫామ్‌లో లేని రొనాల్డో స్థానంలో వేరేవారికి అవకాశం ఇవ్వాలనే అతన్ని బెంచ్‌కు పరిమితం చేసినట్లు పోర్చుగల్ హెడ్‌కోచ్ ఫెర్నాండో శాంటెజ్ వివరించాడు. అయితే రొనాల్డో తుదిజట్లులో లేకపోవడం పోర్చుగల్‌ను దెబ్బకొట్టిందనే చెప్పొచ్చు. స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో నెగ్గినప్పటికి.. కీలకమైన క్వార్టర్ ఫైనల్లో మొరాకో చేతిలో ఓడి పోర్చుగల్ ఇంటిబాట పట్టింది. ఈ మ్యాచ్‌లోనూ రొనాల్డో తొలుత బెంచ్‌కే పరిమితమయ్యాడు. రెండో అర్థభాగంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఆ తర్వాత క్రిస్టియానో రొనాల్డో కన్నీటిపర్యంతం అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలా రొనాల్డో అవమానభారంతో ఫిఫా వరల్డ్‌కప్‌ను ముగించాడు. 37 ఏళ్ల రొనాల్డో మరో ఫిఫా వరల్డ్‌కప్ ఆడేది అనుమానమే. ఈ నేపథ్యంలోనే రొనాల్డోకు మరోసారి అవమానం జరిగింది. ఫిఫా వరల్డ్‌కఫ్‌లో చెత్త ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో సోఫాస్కోర్ అనే వెబ్సైట్ వరస్ట్ ఎలెవెన్ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో క్రిస్టియానో రొనాల్డో చోటు దక్కించుకున్నాడు. ఒకే ఒక్క గోల్ చేసిన రొనాల్డోకు సోఫాస్కోర్ ఇచ్చిన స్కోర్ రేటింగ్ 6.46. ఇక ఈసారి ఫిఫా వరల్డ్‌కప్ ఛాంపియన్స్‌గా నిలిచిన అర్జెంటీనా జట్టులో నుంచి కూడా ఒక ఆటగాడికి వరస్ట్ ఎలెవెన్ టీమ్‌లో చోటు దక్కింది. అతనే ఫార్వర్డ్ ప్లేయర్ లౌటారో మార్టినెజ్. పైనల్ మ్యాచ్‌లో అదనపు సమయంలో జులియన్ అల్వరేజ్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మార్టినేజ్ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాడు. ఈ వరల్డ్‌కప్‌లో 148 నిమిషాల పాటు యాక్షన్‌లో ఉన్న మార్టినేజ్ గోల్ కొట్టడంలో.. అసిస్ట్ చేయడంలో ఫెయిల్ అవ్వడంతో కోచ్ లియోనల్ స్కలోని అతన్ని రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం చేశాడు. మార్టినేజ్కు 6.35 రేటింగ్ ఇచ్చింది. ఇక వీరిద్దరితో పాటు సెనెగల్ స్టార్ గోల్‌కీపర్ ఎడౌర్డ్ మండీ(6.30) రేటింగ్ ఇచ్చింది. రౌండ్ ఆఫ్ 16లో ఇంగ్లండ్ చేతిలో ఓడి సెనెగల్ ఇంటిబాట పట్టింది. ఇంకా ఈ జాబితాలో సెర్జినో డెస్ట్(అమెరికా, 6.50 రేటింగ్), పోలాండ్‌కు చెందిన కమిల్ గ్లిక్, బార్టోజ్ బెరెస్జిన్స్కిలు ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన జాక్సన్ ఇర్విన్, మాథ్యూ లిక్కీలతో పాటు సౌత్ కొరియాకు చెందిన హవాంగ్ ఇన్ బోయెమ్, రూబెన్ వర్గస్(స్విట్జర్లాండ్)లను మిడ్ఫీల్డింగ్లో చోటు దక్కింది. సోఫాస్కోర్ ఫిఫా వరల్డ్‌కప్ వరస్ట్ ఎలెవెన్ జట్టు: క్రిస్టియానో రొనాల్డో(కెప్టెన్), లౌటారో మార్టినె, హవాంగ్ ఇన్ బోయెమ్, రూబెన్ వర్గస్, జాక్సన్ ఇర్విన్, మాథ్యూ లిక్కీ, ఎడౌర్డ్ మండీ(గోల్ కీపర్), సెర్జినో డెస్ట్, కమిల్ గ్లిక్, బార్టోజ్ బెరెస్జిన్స్కి, అబ్దు డియల్లో చదవండి: శకం ముగిసింది.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా? -
వరల్డ్‌కప్ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలో మరో అరుదైన ఘనత
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ సాధించానన్న ఆనందంలో మునిగి తేలుతున్నాడు. మెస్సీ సంతోషం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో గెలిచిన అర్జెంటీనా టైటిల్ విజేతగా నిలిచింది. 16 ఏళ్ల నిరీక్షణ.. 36 ఏళ్ల అర్జెంటీనా కలను తీర్చాడు కాబట్టే మెస్సీ అంత సంతోషంగా ఉన్నాడు. ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా తర్వాత ఆ లిగసీని కంటిన్యూ చేస్తూ ఎట్టకేలకు అర్జెంటీనాకు మూడో వరల్డ్‌కప్‌ను అందించాడు. ఈ వరల్డ్‌కప్‌లో అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ ఏడు గోల్స్‌తో పాటు మూడు అసిస్ట్‌లు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా గోల్డెన్ బాల్ అవార్డు సొంతం చేసుకున్నాడు. తాజాగా ఫిఫా వరల్డ్‌కప్ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలోనే మెస్సీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సీ 400 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించించాడు. దీంతో క్రిస్టియానో రొనాల్డో తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సెలబ్రిటీగా మెస్సీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక రొనాల్డో 517 మిలియన్ ఫాలోవర్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. అంతేకాదు 500 మిలియన్ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన తొలి వ్యక్తిగా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొత్త చరిత్ర సృష్టించాడు. View this post on Instagram A post shared by Leo Messi (@leomessi) చదవండి: నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె నిరీక్షణ ముగిసింది.. మెస్సీ సాధించాడు -
FIFA WC: మెస్సీ సాధించాడు.. ఘనంగా ‘ముగింపు’! రొనాల్డో సంగతి? అవమానకర రీతిలో..
Lionel Messi- Cristiano Ronaldo: ఏడుసార్లు ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడిగా ‘బాలన్ డీర్’ అవార్డు... ప్రతిష్టాత్మక క్లబ్ బార్సిలోనా తరఫున ఏకంగా 35 టైటిల్స్‌లో భాగం... ఏ లీగ్‌లోకి వెళ్లినా అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా ఘనత... లెక్కలేనన్ని రికార్డులు, అపార ధనార్జన... అపరిమిత సంఖ్యలో అతని నామం జపించే అభిమానులు... మెస్సీ గురించి ఇది ఒక చిన్న ఉపోద్ఘాతం మాత్రమే. ఫుట్‌బాల్ మైదానంలో అతను చూపించిన మాయకు ప్రపంచం దాసోహమంది... ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా గొప్పగా కీర్తించింది... కానీ...కానీ... అదొక్కటి మాత్రం లోటుగా ఉండిపోయింది. మెస్సీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వరల్డ్ కప్ మాత్రం గెలవలేదే అనే ఒక భావన... 2006లో అడుగు పెట్టిన నాటి నుంచి 2018 వరకు నాలుగు టోర్నీలు ముగిసిపోయాయి. కానీ ట్రోఫీ కోరిక మాత్రం తీరలేదు. 2014లో అతి చేరువగా ఫైనల్‌కు వచ్చినా, పేలవ ఆటతో పరాభవమే ఎదురైంది. రొనాల్డోతో ప్రతీసారి పోలిక వరల్డ్ కప్ లేకపోయినంత మాత్రాన అతని గొప్పతనం తగ్గదు... కానీ అది కూడా ఉంటే బాగుంటుందనే ఒక భావన సగటు ఫ్యాన్స్‌లో బలంగా నాటుకుపోయింది. అతని సమకాలీకుడు, సమఉజ్జీ క్రిస్టియానో రొనాల్డోతో ప్రతీసారి ఆటలో పోలిక... కానీ ఇప్పుడు మెస్సీ వరల్డ్ కప్ విన్నర్ కూడా... ఈ విజయంతో అతను రొనాల్డోను అధిగమించేశాడు... అర్జెంటీనా ఫుట్‌బాల్ అంటే మారడోనానే పర్యాయపదం... 1986లో అతను ఒంటి చేత్తో (కాలితో) తమ టీమ్‌ను విశ్వవిజేతగా నిలిపిన క్షణం ఆ దేశపు అభిమానులు మరచిపోలేదు. అంతటివాడు అనిపించుకోవాలంటే వరల్డ్ కప్ గెలవాల్సిందే అన్నట్లుగా ఆ దేశం మెస్సీకి ఒక అలిఖిత ఆదేశం ఇచ్చేసింది! ఎట్టకేలకు అతను ఆ సవాల్‌ను స్వీకరించాడు... తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో పరాజయం ఎదురైన తర్వాత తమను లెక్కలోంచే తీసేసిన జట్లకు సరైన రీతిలో సమాధానమిచ్చాడు. మైదానం అంతటా, అన్నింటా తానై అటు గోల్స్ చేస్తూ, అటు గోల్స్ చేసేందుకు సహకరిస్తూ టీమ్‌ను నడిపించాడు. ప్రపంచ కప్ చరిత్రలో గ్రూప్ దశలో, ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్లో, సెమీస్‌లో, ఫైనల్లో గోల్ చేసిన ఏకైక ఆటగాడు కావడంతో పాటు జట్టును శిఖరాన నిలిపాడు. శాశ్వత కీర్తిని అందుకుంటూ అర్జెంటీనా ప్రజలకు అభివాదం చేశాడు. చివరగా...మెస్సీ భావోద్వేగాలు చూస్తుంటే సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజం కూడా తన కెరీర్లో అన్నీ సాధించిన తర్వాత లోటుగా ఉన్న క్రికెట్ ప్రపంచకప్‌ను ఆరో ప్రయత్నంలో అందుకోవడం, అతడిని సహచరులు భుజాలపై ఎత్తుకొని మైదానంలో తిరిగిన ఘటన మీ కళ్ల ముందు నిలిచిందా! -సాక్షి, క్రీడా విభాగం. మరి రొనాల్డో సంగతి?! గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT).. ప్రస్తుత తరంలో మేటి ఫుట్‌బాల్ ఆటగాడు ఎవరు అంటే.. ఠక్కున గుర్తుకు వచ్చే రెండు పేర్లు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో.. అన్నిటిలోనూ పోటాపోటీ.. అయితే, మెస్సీ ఖాతాలో ఇప్పుడు వరల్డ్‌కప్ టైటిల్ ఉంది. 37 ఏళ్ల రొనాల్డోకు ఇక ప్రపంచకప్ ట్రోఫీ గెలిచే అవకాశమే లేదు. నిజానికి, ఖతర్ ఈవెంట్లో మొదటి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా వంటి చిన్న జట్టు చేతిలో ఓటమి పాలైనా ఏమాత్రం కుంగిపోక.. ఒక్కో మ్యాచ్ గెలుస్తూ జట్టును ఫైనల్ వరకు తీసుకువచ్చాడు మెస్సీ. నాయకుడిగా, ఆటగాడిగా తన అపార అనుభవాన్ని ఉపయోగించుకుంటూ జట్టును ఆఖరి మెట్టు వరకు తీసుకువచ్చాడు. ఉత్కంఠభరిత ఫైనల్లోనూ చిరునవ్వు చెదరనీయక ఎట్టకేలకు ట్రోఫీ ముద్దాడి విజయదరహాసం చేశాడు. కానీ రొనాల్డోకు ఈ మెగా టోర్నీకి ముందే ఎదురుదెబ్బలు తగిలాయి. యునైటెడ్ మాంచెస్టర్‌తో బంధం తెగిపోవడం సహా కీలక ప్రి క్వార్టర్స్‌లో జట్టులో చోటు కోల్పోవడం వంటి పరిణామాలు జరిగాయి. పోర్చుగల్ సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ అతడు ఆలస్యంగా బరిలోకి దిగాడు. ఈ నేపథ్యంలో రొనాల్డో ప్రవర్తన వల్లే కోచ్ అతడిని కావాలనే పక్కనపెట్టాడనే వార్తలు వినిపించాయి. ఏదేమైనా మెస్సీ తన హుందాతనంతో ఘనంగా ప్రపంచకప్ టోర్నీకి వీడ్కోలు పలికితే.. రొనాల్డో మాత్రం అవమానకర రీతిలో నిష్క్రమించినట్లయింది. దీంతో ఇద్దరూ సమఉజ్జీలే అయినా మెస్సీ.. రొనాల్డో కంటే ఓ మెట్టు పైకి చేరాడంటూ ఫుట్‌బాల్ అభిమానులు అంటున్నారు. చదవండి: Mbappe- Messi: మెస్సీ విజయానికి అర్హుడే! కానీ నువ్వు ఓటమికి అర్హుడివి కాదు! గర్వపడేలా చేశావు.. Rohit Sharma: ‘సెంచరీ వీరుడు గిల్ బెంచ్‌కే పరిమితం! రెండో టెస్టులో ఓపెనర్లుగా వాళ్లిద్దరే!’ Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Cristiano Ronaldo: కోచ్ కాదు.. నోటి మాటలే శాపంగా మారాయా?
క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఈ దశాబ్దంలో అత్యున్నత ఆటగాళ్లలో రొనాల్డో ఒకడిగా ఉన్నాడు. మైదానంలో పాదరసంలా కదులుతూ రొనాల్డో చేసే విన్యాసాలు అభిమానులను అలరిస్తుంటాయి. పోర్చుగల్ తరపున 195 మ్యాచ్‌ల్లో 118 గోల్స్ కొట్టిన రొనాల్డోకు ఫిఫా వరల్డ్‌కప్ తీరని కలగా మిగిలిపోయింది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టి ఆ కోరికను నెరవేర్చుకోవాలనుకున్నాడు. కానీ అది సాధ్యపడలేదు. మొరాకో చేతిలో 2-1 తేడాతో ఓడి క్వార్టర్‌లోనే వెనుదిరిగింది. అంతే చిన్న పిల్లాడిలా మారిపోయిన రొనాల్డో వెక్కివెక్కి ఏడ్చాడు. ప్రస్తుతం రొనాల్డో వయస్సు 37 ఏళ్లు. అంటే ఫిట్నెస్ కాపాడుకుంటే తప్ప వచ్చే ఫిఫా వరల్డ్‌కప్ అతను ఆడడం కష్టమే. అయితే కీలకమైన క్వార్టర్ ఫైనల్లో రొనాల్డోను బెంచ్‌కే పరిమితం చేయడంపై పోర్చుగల్ కోచ్ ఫెర్నాండో శాంటోజ్ను అందరూ తప్పుబడుతున్నారు. ఫెర్నాండో చేసింది తప్పే కావొచ్చు.. ఎందుకంటే రొనాల్డో ఒక సూపర్‌స్టార్. పోర్చుగల్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. కీలక మ్యాచ్‌లో ఒక స్టార్‌ను పక్కనబెడితే ఆ ప్రభావం జట్టుపై బలంగా ఉంటుంది. ఈ విషయంలో శాంటోజ్ను తప్పుబట్టడం కరెక్టే. నిజానికి రొనాల్డో ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో పెద్దగా ప్రభావం చూపించింది లేదు. మెగాటోర్నీలో నాలుగు మ్యాచ్‌లాడిన రొనాల్డో కేవలం ఒక్క గోల్‌కే పరిమితమయ్యాడు. రొనాల్డో కొంతమంది అభిమానులు మాత్రం అతని నోటి మాటలే జట్టుకు దూరం చేశాయని.. అదే అతనికి శాపంగా మారిందని పేర్కొనడం ఆసక్తి రేపింది. ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్ కోచ్‌తో గొడవను బయటపెట్టిన రొనాల్డో.. ఆ తర్వాత వారితో జరిగిన అనుభవాలను వరుసగా చెప్పుకొచ్చాడు. ఇవే అతనికి శాపంగా మారాయి. ఆ తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ రొనాల్డోతో బంధం ముగిసిందంటూ లేఖ విడుదల చేయడం.. అప్పటికి తగ్గని రొనాల్డో విమర్శలు చేస్తూ పోవడం అతనికి నెగిటివిటిని తెచ్చిపెట్టింది. ఒకవైపు తన సమకాలీకుడు అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ.. ఆటలో దూసుకుపోతుంటే.. రొనాల్డో మాత్రం వివాదాలతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పరిస్థితులు అతనికి విలన్‌గా మారాయి.. ఎంతలా అంటే స్విట్జర్లాండ్‌తో కీలకమైన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో రొనాల్డోను బెంచ్‌కే పరిమితం చేశారు. అప్పుడు కోచ్ ఫెర్నాండో శాంటెజ్ తన నిర్ణయాన్ని తప్పుబట్టలేదు. రొనాల్డో పక్కనబెట్టడంపై తానేం బాధపడపడడం లేదని చెప్పుకొచ్చాడు. తాజాగా మొరాకోతో మ్యాచ్‌లోనూ మొదట రొనాల్డో బెంచ్‌కే పరిమితమయ్యాడు. తొలి అర్థభాగం ఆటకు దూరంగా ఉన్న రొనాల్డో.. రెండో అర్థభాగంలో వచ్చినప్పటికి పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా మొరాకో చేతిలో ఓడాలని రాసిపెట్టుంటే రొనాల్డో మాత్రం అద్భుతాలు ఏం చేయగలడు. ఏమో రొనాల్డో వ్యాఖ్యలను మనసులో పెట్టుకొని పోర్చుగల్ జట్టు మేనేజ్మెంట్ కావాలనే అతన్ని కీలక మ్యాచ్‌లో తప్పించిందేమోనన్న అనుమానం కలగక మానదు. ఇక మొరాకోతో మ్యాచ్ ఓటమి అనంతరం రొనాల్డో ఇన్స్టాగ్రామ్ ద్వారా తన సమాధానం రాసుకొచ్చాడు. ''మొరాకోతో మ్యాచ్ మాకు ఒక పీడకల. వరల్డ్‌కప్ గెలవాలనే డ్రీమ్‌తో ఖతర్‌లో అడుగుపెట్టా. కానీ ఆ కల నెరవేరకుండానే ఇలా పోర్చుగల్ వెళ్లిపోతానని ఊహించలేదు. కీలక సమయంలో మొరాకో జట్టు బాగా ఆడింది. వారి డిఫెన్స్ పటిష్టంగా ఉంది. కోచ్ శాంటోజ్తో నాకు ఎలాంటి వివాదాలు లేవు. నా అవసరం జట్టుకు లేదు అన్నప్పుడు పక్కనబెట్టడం నాకు బాధ కలిగించలేదు. అయితే ఫిఫా వరల్డ్‌కప్‌ను తీసుకురావాలన్న దేశ ప్రజల కోరికను నెరవేర్చనందుకు బాధగా ఉంది. థాంక్యూ ఖతర్.. ఇక్కడి అభిమానాన్ని ఎప్పటికి మరిచిపోనూ.. థాంక్యూ పోర్చుగల్'' అంటూ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) చదవండి: పోర్చుగల్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్న అడల్ట్ స్టార్ Harry Kane: హీరో అనుకుంటే జీరో అయ్యాడు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పోర్చుగల్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్న అడల్ట్ స్టార్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ కథ క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ఈసారి కచ్చితంగా కప్ కొడుతుందనుకున్న రొనాల్డో సేన అనూహ్యంగా మొరాకో చేతిలో ఓటమి పాలవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక రొనాల్డో అయితే తనకిదే చివరి మ్యాచ్ అన్నట్లుగా వెక్కివెక్కి ఏడ్చాడు. మరోవైపు ఆఫ్రికా దేశమైన మొరాకో ఫిఫా వరల్డ్‌కప్‌లో తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. పోర్చుగల్ ఓటమితో అభిమానులు నిరాశలో ఉంటే.. మాజీ పోర్న్ స్టార్, మోడల్ మియా ఖలీఫా మాత్రం సంబరాల్లో మునిగిపోయింది. రొనాల్డో సేన క్వార్టర్స్‌లో ఇంటిబాట పట్టిన సందర్భంగా మొరాకోకు కంగ్రాట్స్ చెబుతూ ఆసక్తికర ట్వీట్ చేసింది. మొరాకో జెండాను పెట్టిన పక్కన ఆశ్చర్యార్థకం గుర్తులను పెట్టింది. ఆమె చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రపంచ 9వ ర్యాంకర్ పోర్చుగల్ జట్టుతో శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో మొరాకో 1–0 గోల్ తేడాతో గెలిచింది.ఆట 42వ నిమిషంలో ఎడమ వైపు నుంచి అతియత్ అలా అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో యూసుఫ్ ఎన్ నెసిరి అమాంతం గాల్లోకి ఎగురుతూ ‘హెడర్’ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో మొరాకో తొలి అర్ధభాగాన్ని 1–0తో ముగించింది. రెండో అర్థభాగం చివరి 10 నిమిషాల్లో పోర్చుగల్‌కు గోల్ చేసేందుకు రెండుసార్లు అవకాశం వచ్చినా మొరాకో గోల్‌కీపర్ యాసిన్ బోనో వాటిని అడ్డుకున్నాడు. 90+1వ నిమిషంలో రొనాల్డో కొట్టిన షాట్‌ను యాసిన్ అద్భుతంగా నిలువరించాడు. ఇంజ్యూరీ టైమ్‌గా మ్యాచ్‌ను ఎనిమిది నిమిషాలు పొడిగించినా మొరాకో పట్టుదలతో ఆడి పోర్చుగల్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్‌ను ఈసారైనా అందుకోవాలని ఆశించిన రొనాల్డో చివరకు కన్నీళ్లపర్యంతమవుతూ భారంగా మైదానాన్ని వీడాడు. 🇲🇦!!!!! — Mia K. (@miakhalifa) December 10, 2022 చదవండి: FIFA: ఏ టైటిళ్లు, ట్రోఫీలు అక్కర్లేదు.. దేవుడు మాకిచ్చిన వరం.. కోహ్లి భావోద్వేగం FIFA WC 2022: 'ఆ ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా.. పిల్లలు జడుసుకుంటారు' -
FIFA: ఏ టైటిళ్లు, ట్రోఫీలు అక్కర్లేదు.. దేవుడు మాకిచ్చిన వరం.. కోహ్లి భావోద్వేగం
FIFA World Cup 2022- Virat Kohli- Cristiano Ronaldo: ‘‘క్రీడా రంగానికి నువ్వు చేసిన సేవ ఎనలేనిది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులను అలరించిన తీరు మరువలేనిది.. నువ్వు ఆడుతుంటే అలా చూస్తూ ఉండిపోవడం.. కేవలం నాకే కాదు.. నాలాంటి ఎంతో మంది అభిమానులకు దేవుడిచ్చిన వరం అది. ప్రతి మ్యాచ్‌లోనూ నీ కఠోర శ్రమ, నీ అంకితభావం మాకు కనిపిస్తూనే ఉంటుంది. వందకు వంద శాతం ఆటకు న్యాయం చేయడమే పరమావధిగా భావించగలగడం ఆటగాడికి దక్కిన ఆశీర్వాదం లాంటిది. ప్రపంచంలోని ప్రతి ఆటగాడికి అతడు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అవుతాడు. నా దృష్టిలో అత్యుత్తమ ఆటగాడి(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్- GOAT)వి నువ్వే! మా అందరిని ఇంతగా అలరించిన నువ్వు ట్రోఫీ గెలవకపోతేనేం..? టైటిల్ సాధించకపోతేనేం? అదేమీ పెద్ద విషయం కానేకాబోదు. నీ ఆట తీరుతో మా మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న నీ గురించి వర్ణించడానికి ఎలాంటి ట్రోఫీలు, టైటిళ్లు అక్కర్లేదు’’ అంటూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి భావోద్వేగ ట్వీట్ చేశాడు. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను ఉద్దేశించి ఈ మేరకు ఉద్వేగపూరిత నోట్ రాశాడు. కల చెదిరింది! ఫిఫా ప్రపంచకప్-2022లో భాగంగా మొరాకో చేతిలో ఓటమితో.. టైటిల్ దిశగా సాగాలనుకున్న పోర్చుగల్ ఆశలకు గండిపడిన విషయం తెలిసిందే. దీంతో ఖతర్ వేదికగా సాగుతున్న ఈ మెగా ఈవెంట్ క్వార్టర్ ఫైనల్లోనే పోర్చుగల్ కథ ముగిసింది. కాగా ఇంతవరకు ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కన్నీరే మిగిలింది! అదే విధంగా.. ఆ జట్టు కెప్టెన్, మేటి ఫుట్‌బాల్ ఆటగాడు రొనాల్డోకు ఇదే ఆఖరి వరల్డ్‌కప్ టోర్నీ కానుందన్న అభిప్రాయాల నేపథ్యంలో అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రపంచకప్ ట్రోఫీ సాధించాలనుకున్న 37 ఏళ్ల రొనాల్డో కల కలగానే మిగిలిపోయినట్లయింది. ఈ పరాజయాన్ని తట్టుకోలేక అతడు కన్నీటిపర్యంతమైన తీరు అభిమానుల చేత కంటతడి పెట్టించింది. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) రొనాల్డోపై కోహ్లి అభిమానం ఈ క్రమంలో రొనాల్డోపై అభిమానం చాటుకుంటూ కోహ్లి సోషల్ మీడియా వేదికగా అతడికి అండగా నిలబడ్డాడు. ఇన్‌స్టాలోనూ ఈ మేరకు రొనాల్డో ఫొటో పంచుకోగా.. గంటల్లోనే వైరల్‌గా మారింది. నాలుగు గంటల్లోనే 30 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఇక 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన కోహ్లి.. కెప్టెన్‌గా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే. అయితే, టెస్టుల్లో టీమిండియాను నంబర్ 1గా నిలపడం సహా 72 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా ఎన్నో ఘనతలు తన ఖాతాలో ఉన్నాయి. చదవండి: Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! సంజూ శాంసన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన పరాయి దేశం The moment ❤️ Peter Drury's commentary of the moment ❤️🔥 You cannot not replay this special narration of the special night for #Morocco by a special commentator 🎙️#MARPOR #Qatar2022 #FIFAWorldCup #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/Lh03wXs792 — JioCinema (@JioCinema) December 11, 2022 -
FIFA: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! మరీ ఇలాంటి ముగింపా?!
FIFA World Cup 2022- Cristiano Ronaldo: ఇద్దరక్కలు.. ఓ అన్న.. ఇంట్లో నాలుగో సంతానం. నిజానికి అప్పటికే పేదరికంలో మగ్గుతున్న కారణంగా ఆ తల్లి నాలుగో బిడ్డను కనకూడదు అనుకుంది. అబార్షన్ చేయించుకోవాలనుకుంది. కానీ, దేవుడు అలా జరుగనివ్వలేదు. ఆ బిడ్డ భూమ్మీద పడ్డాడు. ఎనలేని కీర్తిప్రతిష్టలు సంపాదించాడు. స్టార్ ఫుట్‌బాలర్‌గా ఎదిగి.. తల్లిని గర్వపడేలా చేశాడు. లెక్కకు మిక్కిలి అభిమానులు, లెక్కలేనంత డబ్బు! తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్నో రికార్డులు సాధించిన రారాజు.. మరీ ఇలా, ఇంత ఘోరంగా తన ప్రయాణం ముగిసిపోతుందని ఊహించి ఉండడు! ఇంతటి అవమానకర పరిస్థితుల్లో ‘ఆఖరి మ్యాచ్’ను ఆడాల్సి వస్తుందనే ఊహ కూడా కనీసం అతడి దరికి చేరి ఉండదు! కెరీర్లో ఒక్క ప్రపంచకప్ టైటిల్ అయినా ఉండాలని అతడు ఆశపడ్డాడు. అందుకు తను వందకు వందశాతం అర్హుడు కూడా! కానీ విధిరాత మరోలా ఉంది! నువ్వు ఎన్ని అంతర్జాతీయ గోల్స్ చేస్తేనేం? ఐదు ప్రతిష్టాత్మక బాలన్ డీఓర్ అవార్డులు గెలిస్తేనేం? ఎన్నెన్ని చాంపియన్స్ లీగ్ మెడల్స్ సాధిస్తేనేం? మూడు దేశాల్లో క్లబ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడివి అయితేనేం? ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఫుట్‌బాలర్‌గా నీరాజనాలు అందుకుంటేనేం? ఈ ఒక్క లోటు నిన్ను, నీ అభిమానులను జీవితాంతం వేదనకు గురిచేయడం ఖాయమన్నట్లుగా.. గుండెకోతను మిగిల్చింది. చిన్నపిల్లాడిలా అతడు వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు చూసి అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. ‘‘మరేం పర్లేదు రొనాల్డో.. నువ్వు ఎప్పటికీ మా దృష్టిలో చాంపియన్‌వే’’ అని పైకి చెబుతున్నా.. హృదయాంతరాల్లో గూడుకట్టుకుని ఉన్న బాధ వాళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు!- సాక్షి, వెబ్‌డెస్క్ తల్లితో రొనాల్డో వీళ్లకు ఉన్నంత పాపులారిటీ ఎవరికీ లేదు! నిజానికి ఆధునిక ఫుట్‌బాల్‌లో స్టార్లు ఎవరంటే ఠక్కున గుర్తుకువచ్చే పేర్లు.. లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. సాకర్ గురించి పెద్దగా తెలియనివాళ్లకు కూడా వీరి పేర్లు సుపరిచితమే అనడంలో సందేహం లేదు. కోట్లాది మంది అభిమానం చూరగొన్న.. చూరగొంటున్న మెస్సీ, రొనాల్డో ఆటలో తమకు తామే సాటి. తమకు తామే పోటీ. ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది మేటి ఫుట్‌బాలర్లు ఉన్నా వీరిద్దరికి దక్కినంత పాపులారిటీ మరెవరికి దక్కలేదనడం అతిశయోక్తి కాదు. గర్ల్‌ఫ్రెండ్, తమ పిల్లలతో ఇలా అదొక్కటే లోటు! చాంపియన్స్ లీగ్ సహా ఇతర క్లబ్ టోర్నీలలో తమదైన ఆట తీరుతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అర్జెంటీనా స్టార్ మెస్సీ, పోర్చుగల్ మేటి ఆటగాడు రొనాల్డో.. తమ కెరీర్లో ఎన్నెన్నో రికార్డులు సాధించారు. అరుదైన ఘనతలు తమ ఖాతాలో వేసుకున్నారు. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు.. ఎందులోనూ వీరికి లోటు లేదు. అయితే, విచిత్రంగా ఈ ఇద్దరు ఫుట్‌బాల్ స్టార్లు తమ కెరీర్లో జాతీయ జట్టు తరపున ఇప్పటి వరకు ఒక్క వరల్డ్‌కప్ టైటిల్ కూడా గెలవకపోవడం గమనార్హం. మెస్సీ, రొనాల్డో మెస్సీ ముందడుగు.. పాపం రొనాల్డో అర్జెంటీనా ఇప్పటి వరకు రెండు సార్లు(1978, 1986) ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడగా.. పోర్చుగల్ ఖాతాలో ఒక్క టైటిల్ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్‌కప్-2022లో ఈ ఇద్దరు కెప్టెన్లు తమ జట్లను ముందుకు నడిపి ఫైనల్లో తలపడితే చూడాలని, ఏ ఒక్కరు గెలిచినా చరిత్ర సృష్టించడం ఖాయమంటూ ఫుట్‌బాల్ అభిమానులు అంచనాలు వేశారు. అంతేగాక 37 ఏళ్ల రొనాల్డో, 35 ఏళ్ల మెస్సీ తమ కెరీర్లో ఇదే ఆఖరి ప్రపంచకప్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎవరో ఒకరికి ఈ ఏడాది టోర్నీ చిరస్మరణీయం కావాలని కోరుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌పై అర్జెంటీనా గెలుపుతో మెస్సీ చిరకాల కల నెరవేరేందుకు ముందుడుగు పడగా.. మొరాకో చేతిలో పోర్చుగల్ ఓటమితో రొనాల్డో వరల్డ్‌కప్ ప్రయాణానికి తెరపడింది. అరుదైన రికార్డు ఫిఫా ప్రపంచకప్-2022లో ఘనాతో ఆరంభ మ్యాచ్‌లో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడం ద్వారా రొనాల్డో తన ఖాతా తెరిచాడు. తద్వారా ఐదు ప్రపంచకప్‌లలోనూ గోల్ చేసిన ఏకైక ఆటగాడు రొనాల్డో. ఈ సాకర్ స్టార్ 2006 మొదలు 2010, 2014, 2018, 2022 ప్రపంచకప్‌లలో గోల్ చేశాడు. ఓవరాల్‌గా 8 గోల్స్ సాధించాడు. ఇక గ్రూప్- హెచ్లో ఉన్న పోర్చుగల్ ఈ మ్యాచ్‌లో 3-2తో విజయం సాధించింది. ఆ తర్వాత మాజీ చాంపియన్ ఉరుగ్వేను 2-0తో ఓడించింది. అనంతరం దక్షిణా కొరియా చేతిలో 2-1 ఓటమి పాలైనప్పటికీ గ్రూప్ టాపఱ్గా ఉన్న పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. అవమానకర రీతిలో.. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా దక్షిణా కొరియా ఆటగాడితో రొనాల్డో వాగ్వాదం వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ప్రిక్వార్టర్స్‌లో భాగంగా స్విట్జర్లాండ్‌తో కీలక మ్యాచ్‌లో కెప్టెన్, స్టార్ స్ట్రయికర్ అయిన రొనాల్డోను పక్కనపెట్టడం ఫ్యాన్స్ అవమానకరంగా భావించారు. ఈ మ్యాచ్‌లో అతడి స్థానంలో వచ్చిన యువ ప్లేయర్ గొంకాలో రామోస్ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరవగా.. స్విస్పై పోర్చుగల్ 6-1తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో స్విస్‌తో మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన రొనాల్డో క్వార్టర్స్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీసుకు డుమ్మా కొట్టినట్లుగా వార్తలు వచ్చాయి. అవమానం తట్టుకోలేకే ఇలా చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కీలక మ్యాచ్‌కు రొనాల్డోను పక్కనపెట్టడం పట్ల అతడి గర్ల్‌ఫ్రెండ్ జార్జినా కూడా అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేయగా.. 50 లక్షలకు పైగా మంది ఆ పోస్టును లైక్ చేసి రొనాల్డోకు మద్దతుగా నిలిచారు. అయినా, మేనేజ్మెంట్ తీరు మారలేదు. మొరాకోతో క్వార్టర్ మ్యాచ్ ఆరంభంలోనూ రొనాల్డోను ఆడించలేదు. 51 నిమిషంలో అతడిని సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా బరిలోకి దించింది. ఈ క్రమంలో తనకు గోల్ కొట్టే అవకాశం రాగా.. మొరాకో గోల్ కీపర్ అడ్డుపడటంతో రొనాల్డోకు నిరాశే మిగిలింది. సెమీస్, ఆపై ఫైనల్ చేరి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలన్న పోర్చుగల్ సారథి కల ఇలా ముగిసిపోయింది. నిజానికి 2014లో ఫైనల్ వరకు వచ్చిన మెస్సీ జట్టుకు ఆఖరి మెట్టుపై అదృష్టం కలసి రాలేదు. అయితే, రొనాల్డో అంత చేరువగా కూడా ఎప్పుడూ రాలేకపోయాడు. ఇప్పుడు కూడా అంతే! ఎంతటి మొనగాడు అయితేనేం?! 18 ఏళ్ల వయసులో ఫిఫా వరల్డ్‌కప్-2003లో తొలిసారిగా మెగా ఈవెంట్లో ఆడిన రొనాల్డోకు టైటిల్ లేకుండానే కెరీర్ ముగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఓ ప్రెస్మీట్లో కూల్‌డ్రింక్ బాటిల్‌ను పక్కకు జరిపి.. వాటర్ గ్లాస్ అందుకున్నందుకే సదరు కంపెనీ బ్రాండ్ వాల్యూ అమాంతం పడిపోయేంత ప్రభావం చూపగల.. పాపులర్ ఆటగాడు ఇలా ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని చిన్నపిల్లాలడిగా కన్నీటిపర్యంతం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు సగటు అభిమాని. ఎంతటి మొనగాడికైనా గడ్డుకాలం అంటే ఇలాగే ఉంటుందేమోననంటూ కామెంట్లు చేస్తున్నారు. -సుష్మారెడ్డి, యాళ్ల చదవండి: Saina Nehwal: తన మొహం కూడా చూడనంటూ పెదవి విరుపులు! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా.. Ishan Kishan: ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్ పోస్ట్ వైరల్! ఇంతకీ ఆమె ఎవరంటే! -
పోర్చుగల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన రోనాల్డో! వీడియో వైరల్
56 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఖతార్ గడ్డపై అడుగు పెట్టిన పోర్చుగల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. తన ఆఖరి ప్రపంచకప్‌లోనైనా జట్టుకు ట్రోఫీని అందించాలన్న రోనాల్డో కల కలగానే మిగిలిపోయింది. శనివారం జరిగిన ఫిఫా ప్రపంచ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్రికా జట్టు మొరాకో చేతిలో ఓటమిపాలైన పోర్చుగల్ ఇంటిముఖం పట్టింది. ఎన్నో గోప్ప ట్రోఫీలను సాధించిన రోనాల్డో.. ప్రపంచకప్ టైటిల్ లేకుండానే తన కెరీర్‌ను ముగించాల్సి వస్తుంది. తన వయస్సు దృష్ట్యా రోనాల్డోకు ఇదే ఆఖరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉంది. కన్నీళ్లు పెట్టుకున్న రోనాల్డో మొరాకో చేతిలో తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేని రోనాల్డో కన్నీటిపర్యంతమయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ రోనాల్డో కన్నీళ్లు పెట్టుకున్నాడు. రోనాల్డోను అటవంటి పరిస్థితుల్లో చూసిన అభిమానులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ట్విటర్ వేదికగా అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. "ప్రపంచకప్ గెలవకపోతేనేమీ.. ఎప్పటికీ నీవు మా సూపర్ హీరోవి"అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా క్రిస్టియానో రొనాల్డోను టీమ్ మేనేజ్మెంట్ ఈ మ్యాచ్‌లోనూ ఆరంభంలో ఆడించలేదు. 37 ఏళ్ల రొనాల్డోను 51వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా బరిలోకి దించారు. అయితే మొరాకో పటిష్ట డిఫెన్స్ ముందు రోనాల్డో తలవంచాడు. మరోవైపు సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి ఆఫ్రికా జట్టుగా మొరాకో చరిత్ర సృష్టించింది. It hurts me to see Ronaldo like this man 💔 pic.twitter.com/MbRGnTcRO2 — WolfRMFC (@WolfRMFC) December 10, 2022 చదవండి: FIFA WC: పోర్చ్‌గల్‌కు షాకిచ్చిన మొరాకో.. సెమీఫైనల్‌కు చేరిన ఆఫ్రికా జట్టు -
పోర్చుగల్‌కు షాకిచ్చిన మొరాకో.. సెమీఫైనల్‌కు చేరిన ఆఫ్రికా జట్టు
ఇప్పటి వరకు 92 ఏళ్ల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీలో ఆఫ్రికా ఖండానికి చెందిన 13 దేశాలు 48 సార్లు బరిలోకి దిగాయి. మూడు దేశాలు కామెరూన్, ఘనా, సెనెగల్ ఒక్కోసారి క్వార్టర్ ఫైనల్ చేరి అక్కడి నుంచే ఇంటిదారి పట్టాయి. ఎట్టకేలకు 49వ ప్రయత్నంలో మొరాకో రూపంలో ఓ ఆఫ్రికా జట్టు క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటి ఈ మెగా ఈవెంట్లో తొలిసారి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఖతర్‌కు వచ్చిన మొరాకో జట్టు క్వార్టర్ ఫైనల్లో పటిష్టమైన పోర్చుగల్ జట్టును ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీఫైనల్లో మొరాకో తలపడుతుంది. దోహా: లీగ్ దశలో ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియం జట్టుపై తాము సాధించిన విజయం... గత రన్నరప్ క్రొయేషియాను 0–0తో నిలువరించడం... గాలివాటమేమీ కాదని ప్రపంచ 22వ ర్యాంకర్ మొరాకో నిరూపించింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆరోసారి పోటీపడిన మొరాకో ఈసారి సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రపంచ 9వ ర్యాంకర్ పోర్చుగల్ జట్టుతో శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో మొరాకో 1–0 గోల్ తేడాతో గెలిచింది. తద్వారా ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా, తొలి అరబ్ దేశంగా రికార్డు నెలకొల్పింది. ఆట 42వ నిమిషంలో ఎడమ వైపు నుంచి అతియత్ అలా అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో యూసుఫ్ ఎన్ నెసిరి అమాంతం గాల్లోకి ఎగురుతూ ‘హెడర్’ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో మొరాకో తొలి అర్ధభాగాన్ని 1–0తో ముగించింది. విఖ్యాత ప్లేయర్, కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోను టీమ్ మేనేజ్మెంట్ ఈ మ్యాచ్‌లోనూ ఆరంభంలో ఆడించలేదు. 37 ఏళ్ల రొనాల్డోను 51వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా బరిలోకి దించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌పై హ్యాట్రిక్ చేసిన గొన్సాలో రామోస్ ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. మొరాకో డిఫెన్స్ కూడా పటిష్టంగా ఉండటంతో పోర్చుగల్ జట్టు ఆటగాళ్లు గోల్‌పోస్ట్‌పై గురి చూసి కొట్టలేకపోయారు. చివరి 10 నిమిషాల్లో పోర్చుగల్‌కు గోల్ చేసేందుకు రెండుసార్లు అవకాశం వచ్చినా మొరాకో గోల్‌కీపర్ యాసిన్ బోనో వాటిని అడ్డుకున్నాడు. 90+1వ నిమిషంలో రొనాల్డో కొట్టిన షాట్‌ను యాసిన్ అద్భుతంగా నిలువరించాడు. ఇంజ్యూరీ టైమ్‌గా మ్యాచ్‌ను ఎనిమిది నిమిషాలు పొడిగించినా మొరాకో పట్టుదలతో ఆడి పోర్చుగల్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్‌ను ఈసారైనా అందుకోవాలని ఆశించిన రొనాల్డో చివరకు కన్నీళ్లపర్యంతమవుతూ భారంగా మైదానాన్ని వీడాడు. -
ప్రాక్టీస్ సెషన్‌కు డుమ్మా.. అవమానం తట్టుకోలేకనేనా?
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మంగళవారం పోర్చుగల్, స్విట్జర్లాండ్ మధ్య ప్రీక్వార్టర్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు పోర్చుగల్ కెప్టెన్.. ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను పక్కనబెట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది. కీలక నాకౌట్ దశలో రొనాల్డో డగౌట్లో కూర్చోవడం చాలా మందిని బాధించింది. అయితే రొనాల్డోస స్థానంలో జట్టులోకి వచ్చిన రామోస్ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరవడం.. ఆపై మరో ముగ్గురు పోర్చుగల్ ఆటగాళ్లు గోల్స్‌తో దుమ్మురేపారు. దీంతో పోర్చుగల్ 6-1 తేడాతో స్విట్జర్లాండ్‌పై ఏకపక్ష విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే తనను జట్టు నుంచి తప్పించారన్న అవమానం తట్టుకోలేక రొనాల్డో ప్రాక్టీస్ సెషన్‌కు డుమ్మా కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తన జూనియర్లతో కలిసి ప్రాక్టీస్ చేయడానికి రొనాల్డో ఇష్టపడలేదని.. రోజు మొత్తం జిమ్‌లో గడపడానికే ప్రాధాన్యం ఇచ్చాడంటూ స్పెయిన్‌కు చెందిన ఒక వార్తపత్రిక తన కథనంలో వెల్లడించింది. ఇక రొనాల్డోను ఆడించకపోవడంపై జట్టు మేనేజర్ ఫెర్నాండో సాంటోస్ స్పందించాడు. ''రొనాల్డోతో విబేధాలున్నాయన్న మాట నిజం కాదు.అతను ఒక స్టార్ ఆటగాడు. రొనాల్డో లేకుండా జట్టు బలాలు, బలహీనతలు తెలుసుకోవాలని ప్రయత్నించాం. రొనాల్డో స్థానంలో జట్టులోకి వచ్చిన గొంకాలో రమోస్ సూపర్‌గా రాణించాడు. అలా అని రొనాల్డోను పక్కనబెట్టలేం. కానీ మొరాకోతో జరగనున్న క్వార్టర్స్‌లోనూ రొనాల్డో ఆడకపోవచ్చు. కొత్త వాళ్లకు అవకాశాలు రావాలి. మేం కరెక్ట్ స్ట్రాటజీతోనే వెళ్తున్నాం.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక స్విట్జర్లాండ్‌తో జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌కు హాజరైన అభిమానులు రొనాల్డో.. రొనాల్డో అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఆట 73వ నిమిషంలో రొనాల్డో గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. జావో ఫెలిక్స్ స్థానంలో వచ్చిన రొనాల్డో గోల్ కొట్టడంలో మాత్రం విఫలమయ్యాడు. ఫిఫా ప్రపంచకప్ లో పోర్చుగల్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న కొద్దిరోజుల క్రితమే మాంచెస్టర్ యునైటెడ్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతో మాంచెస్టర్ యూనైటెడ్ నుంచి బయటకు వచ్చినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పటినుంచి రొనాల్డో ఏ ఫ్రాంచైజీకి సంతకం చేయలేదు. అయితే సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ క్లబ్ కు ఆడనున్నాడనే వార్తలు వస్తున్నాయి. మూడేండ్ల పాటు అల్ నజర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడని.. ప్రతీ యేటా సుమారు రూ. 600 కోట్లకు పైగా రొనాల్డోకు ముట్టజెప్పేందుకు డీల్ ఓకే అయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను రొనాల్డో ఖండించాడు. చదవండి: FIFA WC: నమ్మలేకున్నాం.. ఇంత దారుణంగా మోసం చేస్తారా? -
పోర్చు‘గోల్స్’ మోత
దోహా: ఆరంభం నుంచి సూపర్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోను ఆడించకపోయినా... తమ జట్టులో ప్రతిభావంతులకు కొదవలేదని నిరూపిస్తూ పోర్చుగల్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో కళ్లు చెదిరే ప్రదర్శనతో మెరిసింది. ఆద్యంతం దూకుడుగా ఆడుతూ, పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ రొనాల్డో లేకున్నా పోర్చుగల్ జట్టు భవిష్యత్‌కు ఢోకా లేదని నిరూపించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన చివరి ప్రిక్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ 6–1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్‌ను చిత్తుగా ఓడించి 16 ఏళ్ల తర్వాత మళ్లీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పోర్చుగల్ తరఫున తొలి ప్రపంచకప్‌లో ఆడుతున్న 21 ఏళ్ల గొన్సాలో రామోస్ (17వ, 51వ, 67వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ నమోదు చేయగా... పెపె (33వ ని.లో), రాఫెల్ గెరెరో (55వ ని.లో), రాఫెల్ లియా (90+2వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. స్విట్జర్లాండ్ జట్టుకు మాన్యుయెల్ అకాంజీ (58వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. చివరిసారి 1954లో ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన స్విట్జర్లాండ్ ఆ తర్వాత ఐదుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. మరోవైపు ఎనిమిదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న పోర్చుగల్ మూడోసారి క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. 1966లో మూడో స్థానంలో నిలిచిన పోర్చుగల్, 2006లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఈనెల 10న జరిగే క్వార్టర్ ఫైనల్లో మొరాకోతో పోర్చుగల్ తలపడుతుంది. తొలిసారి సబ్‌స్టిట్యూట్‌గా రొనాల్డో... వరుసగా ఐదో ప్రపంచకప్‌లో ఆడుతున్న పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తొలిసారి తుది 11 మంది జట్టులో చోటు కోల్పోయాడు. రొనాల్డో స్థానంలో గొన్సాలో రామోస్‌ను తొలి నిమిషం నుంచి ఆడించాలని కోచ్ ఫెర్నాండో సాంటోస్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. జాతీయ జట్టుకు ఒక్క మ్యాచ్ ఆడకుండానే నేరుగా ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించిన రామోస్ ఘనా, ఉరుగ్వేలతో మ్యాచ్‌ల్లో సబ్‌స్టిట్యూట్‌గా చివరి నిమిషాల్లో బరిలోకి దిగాడు. అయితే కీలకమైన మ్యాచ్‌లో అత్యంత అనుభవజ్ఞుడు, 37 ఏళ్ల రొనాల్డోను కాదని రామోస్‌ను ఆరంభం నుంచే ఆడించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే తన ఎంపిక సరైనదేనని రామోస్ నిరూపించుకున్నాడు. మూడు గోల్స్ చేయడమే కాకుండా గెరెరో గోల్ చేయడానికి రామోస్ సహాయపడ్డాడు. పోర్చుగల్ ఖాతాలో ఐదు గోల్స్ జమయ్యాక.. 74వ నిమిషంలో రొనాల్డోను జావో ఫెలిక్స్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి పంపించారు. ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో రొనాల్డో రిజర్వ్ బెంచ్‌కు పరిమితమై మ్యాచ్ మధ్యలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
FIFA WC: రొనాల్డోకు ఘోర అవమానం? బెంచ్ మీద కూర్చుని.. సిగ్గు పడండి అంటూ
FIFA World Cup 2022 Portugal Vs Switzerland- Cristiano Ronaldo: ‘‘శుభాభినందనలు పోర్చుగల్! 11 మంది ఆటగాళ్లు జాతీయ గీతం పాడుతున్న సమయంలో అభిమానుల కళ్లన్నీ నీమీదే ఉన్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగడం, ఆ 90 నిమిషాలు నీ ఆటను ఆస్వాదించకుండానే ముగిసిపోవడం నిజంగా సిగ్గుచేటు. అభిమానులు నీకోసం వెదుకుతూనే ఉన్నారు. నీ పేరును కలవరిస్తూనే ఉన్నారు. ఆ దేవుడి దయ వల్ల నీ ప్రియమైన స్నేహితుడు ఫెర్నాండో నీతో కలిసి నడవాలి. మరో మ్యాచ్‌లోనైనా నిన్ను చూసే అవకాశం ఇవ్వాలి’’ అంటూ పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగేజ్ ఆ జట్టు కోచ్ ఫెర్నాండో సాంటోస్ తీరుపై విరుచుకుపడింది. ఫిఫా వరల్డ్‌కప్-2022లో భాగంగా స్విట్జర్లాండ్‌తో కీలక మ్యాచ్‌లో రొనాల్డోను బెంచ్‌కే పరిమితం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మండిపడ్డ జార్జినా.. ఆ తర్వాత తన పోస్టును డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది? ఇంతటి అవమానమా? కెప్టెన్, స్టార్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో లేకుండా స్విట్జర్లాండ్‌తో మ్యాచ్ ఆడింది పోర్చుగల్. అతడి స్థానంలో పీప్ సారథిగా వ్యవహరించగా.. రొనాల్డో ప్లేస్‌ను 21 ఏళ్ల రామోస్‌తో భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో రొనాల్డో అభిమానులు కోచ్ ఫెర్నాండో తీరుపై విరుచుకుపడుతున్నారు. కాగా గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో భాగంగా దక్షిణ కొరియాతో తలపడిన సమయంలో రొనాల్డో ఆ జట్టు ప్లేయర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయం గురించి స్పందిస్తూ.. ‘‘నా స్థానంలో సబ్‌స్టిట్యూట్ వస్తున్న సమయంలో.. సదరు కొరియా వ్యక్తి నన్ను తొందరగా వెళ్లిపోవాలంటూ చెప్పాడు. అదే వివాదానికి దారి తీసింది దీంతో అతడిని సైలెంట్‌గా ఉండాలని చెప్పాను. నన్ను అలా అనడానికి అతడికి అధికారం లేదు కదా. నేను ఎప్పుడు వెళ్లాలో రిఫరీ చూసుకుంటారు. అదే విషయం అతడికి చెప్పాను అంతే’’ అని పేర్కొన్నాడు. అయితే, ఆ సమయంలో మూతి మీద వేలు వేసుకంటూ ష్ అంటూ రొనాల్డో సైగ చేయడం వివాదానికి దారి తీసింది. అయితే, రొనాల్డో మాత్రం ఆ క్షణంలో అలా జరిగిపోయిందని.. ఇందులో వివాదమేమీ లేదని కొట్టిపడేశాడు. కోచ్.. ఫెర్నాండో సైతం.. ‘‘కొరియా ప్లేయర్ అలా అనడంతో రొనాల్డోకు కోపం వచ్చింది. అక్కడ ఏం జరిగిందో ప్రతి ఒక్కరు చూశారు. అతడు రొనాల్డోను అవహేళన చేశాడు. మైదానాన్ని వీడాలని చెప్పాడు’’ అని పేర్కొన్నాడు. అయితే, స్విస్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు ఫెర్నాండో మాట్లాడుతూ.. ఆ వివాదం ముగిసింది.. కానీ నాకైతే అదంతా నచ్చలేదని పేర్కొన్నాడు. ఎందుకు పక్కనపెట్టారు? ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌కు రొనాల్డోను పక్కనపెట్టడం చర్చకు తావిచ్చింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రొనాల్డో గర్ల్‌ఫ్రెండ్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. కాగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎల్లో జెర్సీ వేసుకుని సబ్‌స్టిట్యూట్ బెంచ్ మీద నిర్లిప్తతో రొనాల్డో కూర్చుని ఉన్న దృశ్యాలు చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇక మ్యాచ్ 74వ నిమిషంలో రొనాల్డో.. జొయావో ఫెలిక్స్‌కు సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చాడు. ఆ సమయంలో స్టేడియం పీప్.. రొనాల్డో చేతికి కెప్టెన్ ఆర్మ్‌బ్యాండ్‌ను చుట్టాడు. ఇదిలా ఉంటే.. జట్టు వ్యూహాల్లో భాగంగానే రొనాల్డోను బెంచ్‌కు పరిమితం చేసినట్లు కోచ్ ఫెర్నాండో చెప్పడం కొసమెరుపు. చదవండి: FIFA WC 2022: యువ సంచలనం.. రొనాల్డోను తప్పించి జట్టులోకి తీసుకువస్తే! ఏకంగా 3 గోల్స్‌తో.. IND vs BAN: వారెవ్వా ఉమ్రాన్.. 151 కిమీ వేగంతో బౌలింగ్! బంగ్లా బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్ -
FIFA WC: యువ సంచలనం.. రొనాల్డోను తప్పించి జట్టులోకి తీసుకువస్తే! ఏకంగా 3 గోల్స్
FIFA World Cup 2022 Portugal Vs Switzerland: స్విట్జర్లాండ్‌తో కీలక మ్యాచ్‌లో పోర్చుగల్ ఫుట్‌బాలర్ గొంకాలో రామోస్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసి ఫిఫా వరల్డ్‌కప్-2022 టోర్నీలో ఇప్పటి వరకు ఈ ఫీట్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. తద్వారా బుధవారం నాటి మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రొనాల్డోను తప్పించి.. 21 ఏళ్ల రామోస్ మూడు గోల్స్(17, 51, 67వ నిమిషంలో) సాధించి జట్టును గెలిపించాడు. తద్వారా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను బెంచ్‌కు పరిమితం చేసి.. అతడి స్థానంలో తనను తీసుకువచ్చిన కోచ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక రామోస్‌కు తోడు.. కెప్టెన్ పీప్, రాఫేల్ గెరీరో, రాఫేల్ లియో రామోస్ గోల్స్ చేయడంతో పోర్చుగల్ స్విస్‌ను 6-1తో చిత్తుగా ఓడించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ముచ్చటగా మూడోసారి స్విస్ ఆటగాళ్లలో మాన్యూల్ అకంజీ ఒక గోల్ సాధించాడు. కాగా ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో పోర్చుగల్ క్వార్టర్స్‌కు చేరడం ఇది మూడో సారి. గతంలో 1966, 2006లో ఈ ఫీట్ సాధించింది. ఇక క్వార్టర్స్ ఫైనల్లో పోర్చుగల్.. మొరాకోతో తలపడనుంది. రొనాల్డో ఫ్యాన్స్ ఆగ్రహం ఈ మ్యాచ్ సెకండాఫ్‌లో (74వ నిమిషంలో) రొనాల్డో మైదానంలోకి వచ్చాడు. జొయావో ఫెలిక్స్‌కు సబ్‌స్టిట్యూట్‌గా రొనాల్డోను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రొనాల్డో అభిమానులు కోచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Steps into Ronaldo's shoes & raises the roof 📈 Watch how #Portugal's hat-trick hero Goncalo Ramos 🔥 up the Lusail Stadium in #PORSUI 🙌 Stay tuned to #JioCinema & #Sports18 for all the LIVE action from #FIFAWorldCup 📊#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/H9TaLmy7gh — JioCinema (@JioCinema) December 6, 2022 -
రొనాల్డో కోసం ఏదైనా.. టాప్‌లెస్‌గా దర్శనం
అమెరికాకు చెందిన మాజీ గోల్ఫ్ క్రీడాకారిణి పెయిజ్ స్పిరానక్ పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు వీరాభిమాని. ముఖ్యంగా రొనాల్డో సుయ్ (Sui Celebration)కు పెద్ద ఫ్యాన్. తాజాగా ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్న రొనాల్డో తన జట్టు పోర్చుగల్‌ను విజేతగా నిలిపే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించిన పోర్చుగల్ డిసెంబర్ 7న స్విట్జర్లాండ్‌తో తలపడనుంది. ఇదిలా ఉంటే రొనాల్డో సుయ్ సెలబ్రేషన్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని సెలబ్రేషన్‌ను ఇప్పటికే చాలా మంది అనుసరించారు. క్రికెటర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే రొనాల్డోకు వీరాభిమాని అయిన పెయిజ్ స్పిరానక్ మాత్రం కాస్త వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంది. బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించాకా.. తాను వేసుకున్న టాప్‌ను తొలగించి సుయ్ సెలబ్రేషన్ చేసుకుంది. ఆ తర్వాత ఇన్నర్ వేర్‌పై మోకాళ్లపై కూర్చొని లవ్ యూ రొనాల్డో అంటూ నవ్వులు చిందించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. .@PaigeSpiranac here to give us her best Brandi Chastain celebration How’d she do? pic.twitter.com/TWRbdtZ9VM — PointsBet Sportsbook (@PointsBetUSA) November 30, 2022 చదవండి: FIFA: మ్యాచ్ సమయంలో మెస్సీ ఎందుకు నడుస్తాడో తెలుసా? FIFA WC: మహా తుంటరోడు.. తండ్రి లక్షణాలు ఒక్కటీ రాలేదు! -
60 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన ఫ్రాన్స్ ఫుట్‌బాలర్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లు రికార్డులతో హోరెత్తుతున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె డబుల్ గోల్స్ తో చెలరేగాడు. ఈ టోర్నీలో అతను ఇప్పటికే ఐదు గోల్స్ కొట్టాడు. గత టోర్నీలో నాలుగు సాధించాడు. దీంతో ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా,పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (చెరో 8 గోల్స్)ను అధిగమించాడు. ప్రస్తుతం అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీతో కలిసి సంయుక్తంగా తొమ్మిది గోల్స్‌తో ఉన్నాడు. ఈ రికార్డుతో పాటు బ్రెజిల్ దిగ్గజం పీలే పేరిట 60 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న మరో రికార్డును సైతం ఎంబాపె బద్దలు కొట్టడం విశేషం. అదేంటంటే.. 24 ఏళ్లలోపే ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. తన కెరీర్లో బ్రెజిల్‌కు మూడు ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్స్ అందించిన పీలే 24 ఏళ్లలోపు ఏడు గోల్స్ సాధించాడు. ఈ రికార్డు 60 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు ఎంబాపె 23 ఏళ్లకే తొమ్మిది గోల్స్‌తో కొత్త చరిత్ర సృష్టించాడు. అతనితో పాటు ఒలివర్ గిరౌడ్ కూడా ఓ గోల్ సాధించడంతో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 3–1తో పోలెండ్ జట్టును ఓడించింది. ఒలివర్ గిరౌడ్ 44వ నిమిషంలో గోల్ సాధించగా.. ఎంబాపె 74, 90 1వ నిమిషాల్లో రెండు గోల్స్ రాబట్టాడు. పోలెండ్ తరఫున రాబర్ట్ లావెండోస్కీ అదనపు సమయం తొమ్మిదో నిమిషంలో ఏకైక గోల్ అందించాడు. 𝐓𝐡𝐞 𝐆𝐨𝐥𝐝𝐞𝐧 𝐁𝐨𝐲 👑@KMbappe stole the ⚡ vs #Poland with a brace putting him level with #Messi on 9 #FIFAWorldCup goals 🙌 🎦 the heroics of #LesBleus' 🌟 & follow #FIFAWorldCup, LIVE on #JioCinema & #Sports18 📺📲#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/a3FgOTvLHf — JioCinema (@JioCinema) December 4, 2022 ▪️ 23 years old 🌟 ▪️ 9 goals in 11 #FIFAWorldCup games 🎯 ▪️ More goals than #CR7𓃵 & #Maradona 😮 ▪️ Level with #Messi𓃵 @KMbappe is killing it at the #WorldsGreatestShow 📲📺#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/zFWLsTOdX5 — JioCinema (@JioCinema) December 5, 2022 Kylian Mbappé. 9 World Cup goals in 2 editions. More than legends as Diego Maradona, Cristiano Ronaldo, Suárez, Neymar, Thierry Henry, Rivaldo, Kempes… and more. Same goals as Lionel Messi — but 3 World Cups less than the Argentinian star. …and still counting. He’s 23. pic.twitter.com/YnEJDMHzj3 — Fabrizio Romano (@FabrizioRomano) December 4, 2022 చదవండి: మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన?
సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ జట్టు ఫిఫా వరల్డ్‌కప్‌లో రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే గ్రూప్ దశలో పోర్చుగల్ తమ ఆఖరి మ్యాచ్ సౌత్ కొరియా చేతిలో ఓటమి పాలైంది. అయితే అప్పటికే రెండు విజయాలు సాధించిన పోర్చుగల్ తమతో పాటు దక్షిణ కొరియాను రౌండ్ ఆఫ్ 16కు తీసుకెళ్లింది. అయితే రొనాల్డో లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగేజ్ ఖతర్‌లో సందడి చేసింది. వీరిద్దరు 2016 నుంచి రిలేషిన్‌షిప్‌లో ఉన్నారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లకు జార్జినా హాజరు కాలేదు. సౌత్ కొరియాతో మ్యాచ్‌కు మాత్రం హాజరైన జార్జినా.. తన లవర్ రొనాల్డోకు మద్దతినిస్తూ పోర్చుగల్ గెలవాలని కోరుకుంది. కానీ మ్యాచ్‌లో పోర్చుగల్ ఓటమి పాలయింది. అయితే మ్యాచ్ ముగిశాకా ఖతర్ బీచ్‌కు వచ్చిన జార్జినా రోడ్రిగేజ్ టూ పీస్ బికినీలో అందాల ప్రదర్శన చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను జార్జినా స్వయంగా ట్విటర్లో పంచుకుంది. ఇది చూసిన కొంతమంది రొనాల్డో వీరాభిమానులు.. మ్యాచ్ ఓడిపోయామని రొనాల్డో బాధపడుతుంటే.. బికినీలో అందాల ప్రదర్శన ఏంటి అంటూ కామెంట్ చేశారు. అయితే పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించడంతో జార్జినాపై విమర్శలు రాలేదు. లేదంటే ఆమె చర్యకు అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసేవారు. పోర్చుగల్‌ను విశ్వవిజేతగా నిలపాలని రొనాల్డో కష్టపడుతుంటే.. అతనికి మద్దతు ఇవ్వాల్సింది పోయి ఈమె మాత్రం ఖతర్ వీధుల్లో బికినీలు వేసుకొని ఎంజాయ్ చేయడమేంటని కొంతమంది పేర్కొన్నారు. ఇక పోర్చుగల్ డిసెంబర్ 7న జరగనున్న ప్రీక్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌తో తలపడనుంది. 🌊💚 #georginarodriguez pic.twitter.com/Hc2EvRkbxL — Georgina Rodríguez (@__georginagio) December 3, 2022 -
Cristiano Ronaldo: 'ఇదంతా తొండి.. ఆ గోల్ నాది'
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గ్రూప్-హెచ్లో భాగంగా క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఉరుగ్వేతో తలపడింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 2-0తో గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. ఇక పోర్చుగల్ మిడ్ ఫీల్డర్ బ్రూనో ఫెర్నాండేజ్ రెండు గోల్స్ చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫెర్నాండేజ్ ఆటతీరకు ముగ్దుడైన రొనాల్డో స్వయంగా అభినందించాడు. కానీ మ్యాచ్‌లో ఫెర్నాండేజ్ కొట్టిన ఒక గోల్ విషయమై ఆరోపణలు చేశాడు. ఆట తొలి అర్థభాగంలో ఇరుజట్లు ఎలాంటి గోల్ నమోదు చేయలేకపోయాయి. ఇక రెండో అర్థభాగంలో ఆట 54వ నిమిషంలో రొనాల్డో హెడర్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి కొట్టినట్లు భ్రమపడి సంబరాల్లో మునిగిపోయాడు. అయితే ఆ గోల్ చేసింది రొనాల్డో కాదని.. బ్రూనో ఫెర్నాండేజ్ అని తర్వాత తెలిసింది. అసలేం జరిగేందంటే.. వాస్తవానికి రొనాల్డో హెడర్ గోల్ చేసినట్లు ఎక్కడా కనిపించలేదు. అంతకముందే రొనాల్డోకు క్రాస్‌గా వచ్చిన బ్రూనో ఫెర్నాండేజ్ షాట్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. ఇక బంతి గోల్ పోస్ట్‌లోకి వెళ్లడానికి ముందు రొనాల్డోకు ఎక్కడా తగల్లేదని రిప్లేలో తేలింది. దీంతో బ్రూన్ ఫెర్నాండేజ్ ఖాతాలోకి ఆ గోల్ వెళ్లిపోయింది. అయితే రిఫరీ నిర్ణయంతో షాక్ తిన్న రొనాల్డో.. అంతా తొండి.. ఆ గోల్ నాది.. అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత బ్రూనో ఆట 90+ మూడో నిమిషంలో మరో గోల్ చేయడంతో పోర్చుగల్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లడం.. ఆపై విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ రొనాల్డో ఖాతాలోకి ఆ గోల్ వెళ్లి ఉంటే మాత్రం చరిత్ర సృష్టించేవాడే.. కానీ కొద్దిలో మిస్ అయింది. ఇక ఉరుగ్వేపై విజయంతో ఫిఫా వరల్డ్‌కప్‌లో ప్రి క్వార్టర్స్‌కు చేరిన మూడో జట్టుగా పోర్చుగల్ నిలిచింది. కాగా 2018 చాంపియన్స్ ఫ్రాన్స్‌తో పాటు ఐదుసార్లు చాంపియన్ అయిన బ్రెజిల్ కూడా ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాయి. ఇక పోర్చుగల్ తన తర్వాతి మ్యాచ్ డిసెంబర్ 3న దక్షిణ కొరియాతో ఆడనుంది. #Ronaldo fans, do answer this 👇 Did the ⚽ hit #Ronaldo before it went inside the 🥅 or not? 🤔#PORURU #BrunoFernandes #ManUtd #Qatar2022 #WorldsGreatestShow #FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/58AxS2Bb11 — JioCinema (@JioCinema) November 28, 2022 The goal has officially been ruled as scored by Bruno Fernandes #POR #URU https://t.co/3NN2pbupe0 — FIFA World Cup (@FIFAWorldCup) November 28, 2022 చదవండి: FIFA WC 2022: ఏడు నిమిషాల ముందు గోల్ చేసి.. ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ -
రొనాల్డోకు బంపరాఫర్ .. ఏడాదికి రూ.612 కోట్లు!
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో తెగదింపులు చేసుకున్న సంగతి తెలిసిందే. క్లబ్‌తో పాటు ఆ జట్టు మేనేజర్‌పై తీవ్ర విమర్శలు చేసిన రొనాల్డోను మాంచెస్టర్ యునైటెడ్ ఉద్వాసన పలికింది. అయితే మాంచెస్టర్‌తో బంధం తెంచుకున్న రొనాల్డోకు సౌదీ అరేబియాకు చెందిన ఫుట్‌బాల్ క్లబ్ అల్ నసర్ బంఫర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీబియస్ రిపోర్ట్ ప్రకారం.. రోనాల్డోకు అల్ నసర్ క్లబ్‌కు మూడేళ్లకు 225 మిలియన్ డాలర్లు(అంటే భారత కరన్సీ ప్రకారం సుమారు రూ. 1840 కోట్లు) చెల్లించేందుకుసిద్దంగా ఉంది. అంటే ఏడాదికి 75 మిలియన్ డాలర్లు (భారత కరన్సీ ప్రకారం సుమారు రూ. 612 కోట్లు). కాగా రోనాల్డో ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్-2022లో ఆడుతున్నాడు. అయితే రోనాల్డో కూడా అల్ నసర్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఇక అల్ నసర్ ఆసియాలోని అత్యంత విజయవంతమైన క్లబ్‌లలో ఒకటి. ఇప్పటి వరకూ ఈ క్లబ్ తొమ్మిది లీగ్ టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. చదవండి: Ruturaj Gaikwad: చరిత్ర సృష్టించిన రుతురాజ్.. 7 బంతుల్లో 7 సిక్స్‌లు! ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
ఒక ఫుట్‌బాల్ ఆటగాడి కోసం ఇంతలా వెతికారా?
2022 ఏడాదిలో గూగుల్‌లో ఏ సెలబ్రిటీని ఎక్కువగా వెతికారనే దానిపై ఆసక్తికర విషయం బయటకొచ్చింది. టాప్-10 సెలబ్రిటీ లిస్టులో క్రీడా విభాగం నుంచి ఒక్కడే చోటు సంపాదించాడు. అయితే ఆటకు బ్రాండ్ అంబాసిడర్లయిన కోహ్లి, రొనాల్డో, మెస్సీ లాంటి గొప్ప ఆటగాళ్ల కోసం గూగుల్‌లో ఎక్కువగా వెతుకుతారని వింటుంటాం. కానీ కోహ్లి, రొనాల్డో, మెస్సీలను కాదని పెద్దగా పరిచయం లేని ఆటగాడి కోసం గూగుల్‌లో ఎక్కువగా వెతికారంటూ సెలెబ్‌టాట్లర్ తన కథనంలో పేర్కొంది. మరి ఆ వక్తి ఎవరో తెలుసా.. నేషనల్ ఫుట్‌బాల్ లీగ్(NFL)లో ప్రాచుర్యం పొందిన టామ్ బ్రాడీ అనే ఆటగాడు. అమెరికాలో పాపులర్ గేమ్ అయిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్(ఎన్ఎఫ్ఎల్)లో టామ్ బ్రాడీ స్టార్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. 45 ఏళ్ల టామ్ బ్రాడీ ఓవరాల్ ర్యాంకింగ్స్ నాలుగో స్థానంలో నిలిచాడు. మరి ఇంతలా టామ్ బ్రాడీ కోసం గూగుల్‌లో ఎందుకు వెతికార్రా అని ఆరా తీస్తే.. అదంతా సూపర్ మోడల్‌గా పేరు పొందిన తన భార్య గిసెల్ బుండ్చెన్తో విడాకుల వ్యవహారం అతన్ని టాప్ లిస్ట్‌లో చోటు దక్కేలా చేసింది. మొత్తంగా 2022 ఏడాదిలో టామ్ బ్రాడీ కోసం 4.06 మిలియన్ సార్లు సెర్చ్ చేసినట్లు సెలెబ్‌టాట్లర్ తెలిపింది. ఇక ఓవరాల్‌గా టాప్-10 జాబితాలో తొలి స్థానంలో అంబర్ హెడ్(5.6 మిలియన్).. రెండో స్థానంలో హాలీవుడ్ స్టార్ జానీ డెప్(పైరెట్స్ ఆఫ్ కరీబియన్ ఫేమ్) ఉండగా.. మూడో స్థానంలో దివంగత బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ ఉన్నారు. నాలుగో స్థానంలో టామ్ బ్రాడీ ఉండగా.. కిమ్ కర్దషియన్ ఐదు, పిటే డేవిడ్సన్ ఆరో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా ఎలన్ మస్క్, విల్ స్మిత్, మిల్లీ బ్రౌన్, జెండాయాలు ఉన్నారు. చదవండి: 'కొకైన్ కోసం పిచ్చోడిలా తిరిగా.. అక్కడ నిత్యం నరకమే' -
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
FIFA World Cup 2022: పోర్చ్‌గల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత సాధించాడు. వరుసగా ఐదు వరల్డ్ కప్ టోర్నీల్లో గోల్ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు. ఫిఫా వరల్డ్‌కప్-2022 మెగా ఈవెంట్లో భాగంగా గురువారం ఘనాతో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ కిక్ ద్వారా గోల్ సాధించిన రొనాల్డో ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. రొనాల్డో 2006 ఫిఫా వరల్డ్ కప్ నుంచి వరుసగా, 2010, 2014, 2018, 2022లో గోల్స్ సాధించాడు. కాగా ప్రపంచకప్ టోర్నీల్లో ఇది అతడికి ఎనిమిదో గోల్ కావడం గమనార్హం. అదే విధంగా మరో రికార్డును కూడా రొనాల్డో తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక అంతర్జాతీయ గోల్‌లను సాధించిన ఆటగాడిగా రొనాల్డో(118) నిలిచాడు. అదే విధంగా ఏ క్లబ్‌తోనూ సంబంధం లేకుండా కెప్టెన్‌గా ఫిపా వరల్డ్ కప్‌లో పాల్గొన్న రెండవ ప్లేయర్‌గా నిలిచాడు. ఇక మ్యాచ్‌లో ఘనాపై 3-2 తేడాతో పోర్చుగల్ ఘన విజయం సాధించింది. చదవండి: FIFA WC 2022: పాపం.. గోల్ కొట్టినా సెలబ్రేట్ చేసుకోలేక var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: పోర్చు‘గోల్’ కొట్టింది..!
దోహా: ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో పోర్చుగల్ ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా బోణీ కొట్టింది. గోల్ లేకుండా తొలి అర్ధ భాగం చప్పగా సాగగా... ద్వితియార్ధంలో పెనాల్టీ కిక్ మ్యాచ్‌ను ఉన్నపళంగా మార్చేసింది. చకాచకా గోల్స్‌తో నమోదవడంతో మ్యాచ్‌లో ఆసక్తి అంతకంతకూ పెరిగింది. చివరకు పోర్చుగల్ 3–2తో ఘనాపై గెలిచింది. ఆట 64వ నిమిషంలో స్టార్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డోను మొరటుగా కిందపడేయడంతో రిఫరీ పెనాల్టీ కిక్ ఇచ్చాడు. దీన్ని సులువుగానే రొనాల్డో గోల్‌గా మలిచాడు. కానీ 8 నిమిషాల వ్యవధిలో ఘన ఆటగాడు అండ్రూ అవియు (73వ ని.) ఫీల్డ్ గోల్‌తో స్కోరును 1–1గా సమం చేశాడు. మళ్లీ ఐదు నిమిషాల్లో ఆధిక్యం మారింది. జొవో ఫెలిక్స్ (78వ ని.), రాఫెల్ లియో (80వ ని.) ఫీల్డ్ గోల్స్ చేయడంతో పోర్చుగల్ 3–1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెగ్యులర్ టైమ్ ముగిసే దశలో ఘనా ఆటగాడు ఉస్మాన్ బుకారి (89వ ని.) హెడర్‌తో అద్భుతమైన గోల్ సాధించాడు. ఇంజ్యూరి టైమ్‌లో స్కోరును సమం చేసేందుకు ఘనా ఆటగాళ్లు శక్తికి మించి శ్రమించారు. ఆఖరి క్షణందాకా వారు గోల్‌పోస్ట్‌పై చేసిన దాడుల్ని పోర్చుగల్ డిఫెండర్లు అడ్డుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పదే పదే ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రిఫరీ ఆరు సార్లు ఎల్లో కార్డు ప్రయోగించాడు. పోర్చుగల్ జట్టులో ఇద్దరు, ఘనా బృందంలో నలుగురు ఎల్లో కార్డుకు గురయ్యారు. 5: ఐదు ప్రపంచకప్‌లలోనూ గోల్ చేసిన ఏకైక ఆటగాడు రొనాల్డో. ఈ సాకర్ స్టార్ 2006 మొదలు 2010, 2014, 2018, 2022 ప్రపంచకప్‌లలో గోల్ చేశాడు. ఓవరాల్‌గా 8 గోల్స్ సాధించాడు. -
ఘనాతో పోరు.. రొనాల్డోపై రెండు మ్యాచ్‌ల నిషేధం
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు ఏదీ కలిసి రావడం లేదు. ఇటీవలే మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌పై సంచలన ఆరోపణలు చేయడంతో అతన్ని బయటకు సాగనంపడం అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది. తాజాగా రొనాల్డోకు మరో షాక్ తగిలింది. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ రొనాల్డోకు 50 వేల పౌండ్ల (సుమారు రూ.49.4 లక్షలు) జరిమానా, రెండు మ్యాచ్‌లపై నిషేధం విధించడం షాక్‌కు గురి చేసింది. ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ ఘనాతో పోర్చుగల్ తలపడనుంది. ఈ నేపథ్యంలో రొనాల్డోపై నిషేధం అభిమానులను ఉలిక్కి పడేలా చేసింది. అయితే ఫిఫా వరల్డ్‌కప్‌కు ఈ నిషేధం వర్తించదు. ఒక రకంగా ఇది పోర్చుగల్‌తో పాటు రొనాల్డోకు పెద్ద ఊరట. మాంచెస్టర్ యునైటెడ్ తనను వదిలేసిన తర్వాత ప్రస్తుతం రొనాల్డో ఫ్రీ ఏజెంట్‌గా ఉన్నాడు. రొనాల్డో మళ్లీ ఏదైనా క్లబ్‌కు ఆడితే ఈ నిబంధన వర్తిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రొనాల్డో ఈ మ్యాచ్‌లో ఎలా ఆడబోతోన్నాడన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అర్జెంటీనా, జర్మనీలాంటి టీమ్స్‌కు తొలి మ్యాచ్‌లలోనే షాక్‌లు తగిలిన పరిస్థితుల్లో ఈ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. ఇక గత ఏప్రిల్ 9న గూడిసన్ పార్క్ వేదికగా ఎవర్టన్ ఎఫ్‌సీ, మాంచెస్టర్ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో గాయపడ్డాడు. మ్యాచ్‌ను కూడా 1-0తో ఎవర్టన్ ఎఫ్‌సీ కైవసం చేసుకుంది. దీంతో మ్యాచ్ ఓడిపోయామన్న బాధలో పెవిలియన్ వెళ్తున్న రొనాల్డోను కొంత మంది తన ఫోన్ కెమెరాల్లో బందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవర్టన్ ఎఫ్‌సీ అభిమాని ఒకరు రొనాల్డోను ఫోటో తీయడానికి ప్రయత్నించగా.. చిర్రెత్తికొచ్చిన రొనాల్డో ఆవేశంతో అతని ఫోన్‌ను నేలకేసి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత సదరు వ్యక్తికి క్షమాపణ చెప్పాడు. అతని చర్యను తప్పిదంగా భావించిన బ్రిటీష్ పోలీసులు రొనాల్డో సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టారు. అయితే అప్పట్లోనే పోలీసులు రొనాల్డోను హెచ్చరికతో వదిలేశారు. తాజాగా ఇంగ్లండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ దీనిపై విచారణ జరిపి.. రొనాల్డోకు జరిమానాతో పాటు రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది.రొనాల్డో ప్రవర్తన సరి కాదని, దురుసుగా ఉన్నదని ఓ స్వతంత్ర రెగ్యులేటరీ కమిషన్ తేల్చినట్లు ఇంగ్లండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ వెల్లడించింది. తాను తన భద్రత కోసమే ఇలా చేయాల్సి వచ్చిందని నవంబర్ 8 న ఈ కమిషన్ ముందు హాజరై రొనాల్డో చెప్పాడు. కానీ భయంతో కాకుండా ఓడిన ఫ్రస్ట్రేషన్లో అతడు ఇలా చేసినట్లు కమిషన్ గుర్తించింది. చదవండి: అంతర్యుద్ధంతో కుటుంబం విచ్చిన్నం; అన్న ఘనాకు.. తమ్ముడు స్పెయిన్‌కు దిగ్గజం పీలే సరసన స్పెయిన్ మిడ్ ఫీల్డర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు
మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో బంధం ముగిసింది. ఇటీవలే పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఓనర్స్‌తో పాటు కోచ్ ఎరిక్ టెన్ హగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకు క్లబ్ ద్రోహం చేసిందనీ.. కొత్త మేనేజర్ ఎరిక్ టెన్ హాగ్ పట్ల తనకు ఏమాత్రం గౌరవం లేదని రొనాల్డో పేర్కొన్నాడు. ఈ ఇంటర్య్వూ వివాదాస్పదంగా మారింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న మాంచెస్టర్ యునైటెడ్.. రొనాల్డోను వెంటనే క్లబ్ నుంచి బయటకు పంపుతున్నట్లు ట్విటర్లో తెలిపింది. "పరస్పర అంగీకారం ప్రకారం క్రిస్టియానో రొనాల్డోనూ వెంటనే క్లబ్ నుంచి తొలగిస్తున్నాం. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో రొనాల్డో ఇచ్చిన రెండు స్పెల్స్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.'' అంటూ మాంచెస్టర్ వెల్లడించింది. ఇక రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున 346 మ్యాచ్‌ల్లో 145 గోల్స్ కొట్టాడు. కాగా తొలిసారి రొనాల్డో 2003 నుంచి 2009 వరకు మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత మళ్లీ 2021లో మాంచెస్టర్ యునైటెడ్‌కు తిరిగి వచ్చిన రొనాల్డో ఏడాది వ్యవధిలోనే క్లబ్‌ను వీడాల్సి వస్తోంది. మాంచెస్టర్ యునైటెడ్ తనను తొలగించడంపై రొనాల్డో స్పందించాడు. "ఇది ముందే ఊహించాను. అయితే ఇంతకముందే జరిగిన పరస్పర అంగీకారం మేరకే నేను జట్టును వీడుతున్నా. అయినా నాకు మాంచెస్టర్ యునైటెడ్ అంటే ప్రేమ.. వాళ్లు చూపించే అభిమానం ఎప్పటికి మరిచిపోలేను. నేను వేరే క్లబ్‌కు ఆడినా అవి ఎప్పటికీ మారవు. అయితే కొత్త సవాలును స్వీకరించేందుకు నాకు ఇదే సరైన సమయం . ఈ సీజన్‌తో పాటూ భవిష్యత్తులో కూడా మాంచెస్టర్ యునైటెడ్ విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా" అంటూ తెలిపాడు. ఇక రొనాల్డో ప్రస్తుతం ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు వచ్చాడు. పోర్చుగల్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో ఎలాగైనా జట్టుకు కప్ అందించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక గ్రూప్-హెచ్లో ఉన్న పోర్చుగల్ ఘనా, ఉరుగ్వే, సౌత్ కొరియాలతో ఆడనుంది. గురువారం ఘనాతో పోర్చుగల్ అమితుమీ తేల్చుకోనుంది. రొనాల్డోపై రెండు క్లబ్ మ్యాచ్‌ల నిషేధం అభిమానితో గొడవ పడి అతని ఫోన్‌ను విసిరేసినందుకు మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ మాజీ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోపై ఇంగ్లండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ రెండు క్లబ్ మ్యాచ్‌ల నిషేధంతోపాటు 50 వేల పౌండ్ల జరిమానా విధించింది. గత ఏడాది ఏప్రిల్ 9న ఎవర్టన్తో జరిగిన ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో మాంచెస్టర్ 0–1తో ఓడిపోయిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో రొనాల్డో తెగదెంపులు చేసుకోవడంతో తదుపరి సీజన్లో అతను ఆడే కొత్త క్లబ్ జట్టుకు ఈ నిషేధం వర్తిస్తుంది. Cristiano Ronaldo is to leave Manchester United by mutual agreement, with immediate effect. The club thanks him for his immense contribution across two spells at Old Trafford.#MUFC — Manchester United (@ManUtd) November 22, 2022 "That moment was probably the most difficult moment that I have in my life." Cristiano Ronaldo opens up about the devastating death of his baby son, telling Piers Morgan: "We don't understand why it happened to us."@cristiano | @piersmorgan | @TalkTV | #PMU pic.twitter.com/tOba0WJpBf — Piers Morgan Uncensored (@PiersUncensored) November 15, 2022 చదవండి: 'పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు' FIFA WC: అర్జెంటీనాకు షాకిచ్చిన సౌదీ అరేబియా -
నాకు ద్రోహం చేశారు.. కానీ జట్టుపై అవేమీ ప్రభావం చూపలేవు: రొనాల్డో
Cristiano Ronaldo: ఫిఫా ప్రపంచకప్-2022 ఆదివారం(నవంబర్20)న దోహా వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో అతిథ్య ఖతర్ జట్టును ఈక్వెడార్ 2-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఇక ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం(నవంబర్ 21) రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఇరాన్‌తో ఇంగ్లండ్.. రెండో మ్యాచ్‌లో సెనెగల్, నెదర్లాండ్స్ జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఇక ఇది ఇలా ఉండగా.. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాంచెస్టర్ యునైటెడ్‌తో పాటు ఆ జట్టు కోచ్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మాంచెస్టర్ యునైటెడ్‌తో పాటు ఆ జట్టు మేనేజర్ తనకు ద్రోహం చేశాడంటూ ఆరోపణలు చేశాడు. ఇదే విషయంపై మరోసారి రొనాల్డో స్పందించాడు. మాంచెస్టర్ యునైటెడ్‌తో తన గొడవ ప్రపంచకప్‌లో తమ జట్టుపై ఎటువంటి ప్రభావం చూపదని క్రిస్టియానో రొనాల్డో తెలిపాడు. విలేకరుల సమావేశంలో రొనాల్డో మాట్లాడూతూ.. "మాంచెస్టర్‌తో క్లబ్‌తో విభేదాలు ఆటగాడిగా నన్ను ప్రభావితం చేయవచ్చు. కానీ ఇటువంటి గొడవలు, వ్యక్తిగత విభేదాలు మా జట్టుపై ఏ మాత్రం ప్రభావం చూపవు" అని అతడు పేర్కొన్నాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో భాగంగా పోర్చ్‌గల్ తమ తొలి మ్యాచ్‌లో నవంబర్ 24న ఘనాతో తలపడనుంది. చదవండి: FIFA World Cup 2022: అమెరికా కెప్టెన్‌గా 23 ఏళ్ల టైలర్ ఆడమ్స్ Cristiano Ronaldo: 'పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు' -
ప్రపంచమొక ఫుట్‌బాల్.. జగమంతా ఆడే ఆట
క్రిస్టియానో రొనాల్డో కోసం రాత్రంతా జాగారం చేయడానికి సిద్ధం... లయెనెల్ మెస్సీ మ్యాజిక్ గురించి గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇచ్చేందుకు ఇప్పుడు ఎవరైనా రెడీ... ఏ దేశం వాడైనా ఫర్వాలేదు... వేల్స్ వాడైనా, ట్యునీషియాకు చెందిన స్టార్ అయినా మనకు చుట్టమే. సెనెగల్వాడితో, మొరాకో ప్లేయర్‌తో కొత్తగా బాదరాయణ సంబంధం కలుపుకుందాం... బైసైకిల్ కిక్ చూపించిన వాడే మనకు బాస్... బంతిని మెరుపుకంటే వేగంగా తీసుకెళ్లి గోల్ చేయించేవాడే మన దృష్టిలో మొనగాడు.. 29 రోజుల పాటు ఆ దేశం, ఈ దేశం అని లేకుండా మనందరం ఫుట్‌బాల్ పక్షమే. బరిలోకి దిగే 11 మందిలో సగం పేర్లు తెలియకపోయినా పర్లేదు... బంతి ఎటు వెళితే మన కళ్లు అటు వైపు... ఎవరూ చెప్పకుండానే కాళ్లలో కదలికలు సాగుతుంటాయి... అలా అలా నడుస్తూ బంతి లేని చోట కూడా సరదాగా అలా కిక్ కొట్టేసిన ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. కోట్లలో ఒకడిగా మనమూ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌గా మారిపోదాం... వరల్డ్ కప్ వినోదాన్ని ఆస్వాదిద్దాం...! కాలక్రమంలో మరో నాలుగేళ్లు గడిచిపోయాయి. ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ రూపంలో మరో విశ్వ క్రీడా సంరంభం మొదలుకానుంది. 2018లో రష్యా వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ విజేతగా నిలిచింది. ఈసారి కూడా 32 జట్లు టైటిల్ బరిలో నిలిచాయి. ఎప్పటిలాగే యూరోప్ జట్లు ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నాయి. యూరోప్ దేశాలకు దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి మళ్లీ పోటీ వస్తుందనడంలో సందేహం లేదు. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఖతర్ తొలి రౌండ్ దాటగలిగితే అదే గొప్ప ఫలితంలా భావించాలి. 1966లో ఒకేఒక్కసారి ప్రపంచకప్ సాధించిన ఇంగ్లండ్ ఆ తర్వాత ఒక్కసారీ ఫైనల్ చేరలేకపోయింది. గతంలో మూడుసార్లు ఫైనల్ చేరి మూడుసార్లూ ఓడిపోయిన నెదర్లాండ్స్ తొలిసారి ట్రోఫీని అందుకుంటుందో లేదో వేచి చూడాలి. ఫుట్‌బాల్ అనేది టీమ్ గేమ్. ప్రైవేట్ లీగ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ప్రపంచకప్ వచ్చేసరికి తమ జాతీయ జట్టును గెలిపించలేకపోతున్నారు. జట్టులో ఒకరిద్దరు కాకుండా జట్టు మొత్తం రాణిస్తేనే ఆశించిన ఫలితం లభిస్తుంది. - కరణం నారాయణ వారి కల ఫలించేనా... లయెనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో... ఆధునిక ఫుట్‌బాల్‌లో సూపర్ స్టార్లు. చాంపియన్స్ లీగ్‌తో పాటు ఇతర క్లబ్ టోర్నీలలో తమ ఆటతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంటారు. సాధించిన రికార్డులు, కీర్తి కనకాదులకు లెక్కే లేదు. కానీ వీరిద్దరి కెరీర్లో ఒకే ఒక లోటు తమ జాతీయ జట్టు తరపున ప్రపంచ కప్ గెలవలేకపోవడం. పోర్చుగల్ తరపున రొనాల్డో, అర్జెంటీనా తరపున మెస్సీ ఒక్క వరల్డ్ కప్ విజయంలోనూ భాగం కాలేకపోయారు. 2014లో ఫైనల్ వరకు వచ్చిన మెస్సీ జట్టుకు ఆఖరి మెట్టుపై అదృష్టం కలసి రాకపోగా... రొనాల్డో అంత చేరువగా కూడా ఎప్పుడూ రాలేకపోయాడు. వీరిద్దరూ ఆఖరిసారిగా ప్రపంచ కప్ బరిలోకి దిగబోతున్నారు. ఈ సారైనా వీరు తమ జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తారా లేక ఎప్పుడూ కప్ గెలవలేకపోయిన దిగ్గజాల జాబితాలో చోటుతో ఆటను ముగిస్తారా చూడాలి. జగమంతా ఆడే ఆట ... గత 92 ఏళ్లలో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆదరణ ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయింది. ప్రస్తుతం ‘ఫిఫా’ పరిధిలో 211 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిలో 80 దేశాలు వరల్డ్ కప్‌కు కనీసం ఒక్కసారైనా అర్హత సాధించాయి. 13 దేశాలు ఫైనల్ వరకు చేరగా, ఎనిమిది మాత్రమే విజేతలుగా నిలిచాయి. ప్రపంచకప్ టోర్నీ ముగిసిన ఏడాది తర్వాతే వచ్చే ప్రపంచకప్ కోసం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు మొదలు అవుతాయి. దాదాపు మూడేళ్లపాటు ఈ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. 1978 వరకు 16 జట్లు... 1982 నుంచి 2002 వరకు 24 జట్లు పోటీపడ్డాయి. 2006 నుంచి తాజా ప్రపంచకప్ వరకు 32 జట్లు ప్రధాన టోర్నీలో బరిలో ఉన్నాయి. ప్రపంచకప్‌లో పాల్గొనే దేశాల సంఖ్యపై ఖండాలవారీగా ‘ఫిఫా’ స్లాట్లు కేటాయిస్తుంది. ప్రస్తుతం ఆసియా నుంచి 5... ఆఫ్రికా నుంచి 5... యూరోప్ నుంచి 13... ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ దీవుల నుంచి 4... దక్షిణ అమెరికా నుంచి 4 స్లాట్లు ఉన్నాయి. ఆతిథ్య దేశం ఖతర్ ఆసియా నుంచి కావడంతో ఈసారి ఆసియా స్లాట్ల సంఖ్య ఆరు అయింది. 2026 ప్రపంచకప్‌ను 48 జట్లతో నిర్వహించాలని ‘ఫిఫా’ నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ స్లాట్లలో మార్పు చేర్పులు ఉంటాయి. ఆసియా, ఆఫ్రికా జట్లు అంతంతే... ప్రపంచకప్‌కు ఆదరణ పెంచేందుకు ‘ఫిఫా’ ఆసియా దేశాల్లో ఆటను ప్రోత్సహించే ప్రయత్నం చేసింది. 1938లో ఇండోనేసియా.. వరల్డ్ కప్ ఆడిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. మొత్తం 12 ఆసియా జట్లు ఇప్పటి వరకు టోర్నీలో పాల్గొన్నాయి. 2002లో దక్షిణ కొరియా అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా నిలిచింది. మరోవైపు 13 ఆఫ్రికా దేశాలు కూడా ఈ మెగా టోర్నీలో భాగంకాగా... కామెరూన్, సెనెగల్, ఘనా మాత్రమే క్వార్టర్ ఫైనల్‌కు చేరడం అత్యుత్తమ ప్రదర్శన. ఏ ఆఫ్రికా జట్టూ ఒక్కసారి కూడా సెమీఫైనల్ చేరలేదిప్పటి వరకు. కప్ వెనుక కథ... 1930లో మొదలైన ఫుట్‌బాల్ ప్రపంచకప్.. చాంపియన్స్‌కు ఇచ్చే ట్రోఫీ ఒకసారి మారింది. 1930 నుంచి 1970 వరకు ఒకే రకమైన ట్రోఫీని ఇచ్చారు. మొదట్లో దీనిని ‘విక్టరీ’ పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత ఈ ట్రోఫీకి ‘ఫిఫా’ మాజీ అధ్యక్షుడు ‘జూల్స్ రిమెట్’ పేరు పెట్టారు. 3.8 కిలోల బరువు, 35 సెంటీమీటర్ల ఎత్తు ఉండే ఈ ట్రోఫీని వెండితో తయారు చేసి బంగారు పూత పూశారు. టోర్నీ విజేతలకు దీని ‘రెప్లికా’ను మాత్రమే ఇచ్చేవారు. అయితే 1970లో బ్రెజిల్ మూడోసారి టైటిల్ గెలిచిన తర్వాత నిబంధనల ప్రకారం ‘ఒరిజినల్ ట్రోఫీ’ని బ్రెజిల్‌కు ఇవ్వాల్సి వచ్చింది. దాంతో 1974లో ‘ఫిఫా’ కొత్త ట్రోఫీని రూపొందించింది. రెండు చేతులు గ్లోబ్‌ను మోస్తున్నట్లుగా ఉండే చిత్రంతో ఇది తయారైంది. దీని ఎత్తు 36.5 సెంటీమీటర్లు. బరువు 5 కిలోలు. దీనిని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. దిగువ భాగంలో విజేతల జాబితా ఉంటుంది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఈ ట్రోఫీని ఎవరికీ శాశ్వతంగా ఇవ్వరు. విజేతకు అదే తరహాలో ఉండే కంచు ట్రోఫీని మాత్రం అందజేస్తారు. ఆరుసార్లు ఆతిథ్య జట్టుకు అందలం... ఇప్పటివరకు 21 సార్లు ప్రపంచకప్ టోర్నీ జరిగింది. ఆరుసార్లు ఆతిథ్య జట్టు (1930లో ఉరుగ్వే; 1934లో ఇటలీ; 1966లో ఇంగ్లండ్; 1974లో పశ్చిమ జర్మనీ; 1978లో అర్జెంటీనా; 1998లో ఫ్రాన్స్) విశ్వవిజేతగా అవతరించింది. ‘ఫైవ్ స్టార్’ బ్రెజిల్... ఇప్పటి వరకు 13 దేశాలు మాత్రమే ఫైనల్‌కు చేరుకోగా... అందులో ఎనిమిది దేశాలు ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచాయి. అత్యధికంగా బ్రెజిల్ జట్టు ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002) విజేతగా నిలిచింది. జర్మనీ (1954, 1974, 1990, 2014), ఇటలీ (1934, 1938, 1982, 2006) దేశాలు నాలుగుసార్లు ట్రోఫీని సాధించాయి. అర్జెంటీనా (1978, 1986), ఫ్రాన్స్ (1998, 2018), ఉరుగ్వే (1930, 1950) రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచాయి. ఇంగ్లండ్ (1966), స్పెయిన్ (2010) ఒక్కోసారి ప్రపంచ చాంపియన్ అయ్యాయి. పాపం... నెదర్లాండ్స్ ప్రపంచకప్ చరిత్రలో దురదృష్ట జట్టు ఏదంటే నెదర్లాండ్స్ అని చెప్పవచ్చు. ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కీలక పోరులో తడబడటం నెదర్లాండ్స్‌కు అలవాటుగా మారింది. దాంతో ఇప్పటివరకు 10 సార్లు ప్రపంచకప్‌లో పాల్గొని మూడుసార్లు (1974, 1978, 2010) ఫైనల్ చేరినా ఈ జట్టు ఒక్కసారీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. హంగేరి (1938, 1954), చెక్ రిపబ్లిక్ (1934, 1962) రెండుసార్లు... స్వీడన్ (1958), క్రొయేషియా (2018) ఒక్కోసారి ఫైనల్‌కు చేరి ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి. ప్రతిభకు పట్టం.. ప్రపంచకప్ మొత్తం నిలకడగా రాణించిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేస్తారు. అందులో ముఖ్యమైనవి... గోల్డెన్ బాల్: టోర్నీలో ఉత్తమ ప్లేయర్‌కు అందించే అవార్డు. రెండో ఉత్తమ ప్లేయర్‌కు ‘సిల్వర్ బాల్’... మూడో ఉత్తమ ప్లేయర్‌కు ‘బ్రాంజ్ బాల్’ అందజేస్తారు. గోల్డెన్ బూట్: టోర్నీలో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌కు అందజేస్తారు. రెండో స్థానంలో నిలిచిన వారికి ‘సిల్వర్ బూట్’.. మూడో స్థానంలో నిలిచిన వారికి ‘బ్రాంజ్ బూట్’ ఇస్తారు. గోల్డెన్ గ్లవ్: టోర్నీలో ఉత్తమ గోల్‌కీపర్‌కు అందించే పురస్కారం. ఏ గ్రూప్‌లో ఎవరంటే... గ్రూప్ ‘ఎ’: ఖతర్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్. గ్రూప్ ‘బి’: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, వేల్స్. గ్రూప్ ‘సి’: అర్జెంటీనా, మెక్సికో, పోలాండ్, సౌదీ అరేబియా. గ్రూప్ ‘డి’: ఫ్రాన్స్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, ట్యునీషియా. గ్రూప్ ‘ఇ’: జర్మనీ, స్పెయిన్, జపాన్, కోస్టారికా. గ్రూప్ ‘ఎఫ్’: బెల్జియం, క్రొయేషియా, కెనడా, మొరాకో. గ్రూప్ ‘జి’: బ్రెజిల్, సెర్బియా, కామెరూన్, స్విట్జర్లాండ్. గ్రూప్ ‘హెచ్’: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, దక్షిణ కొరియా. వీరే విజేతలు 1930 ఉరుగ్వే 1934 ఇటలీ 1938 ఇటలీ 1950 ఉరుగ్వే 1954 పశ్చిమ జర్మనీ 1958 బ్రెజిల్ 1962 బ్రెజిల్ 1966 ఇంగ్లండ్ 1970 బ్రెజిల్ 1974 పశ్చిమ జర్మనీ 1978 అర్జెంటీనా 1982 ఇటలీ 1986 అర్జెంటీనా 1990 పశ్చిమ జర్మనీ 1994 బ్రెజిల్ 1998 ఫ్రాన్స్ 2002 బ్రెజిల్ 2006 ఇటలీ 2010 స్పెయిన్ 2014 జర్మనీ 2018 ఫ్రాన్స్ అత్యధిక గోల్స్ చేసిన టాప్–10 జట్లు జట్టు గోల్స్ బ్రెజిల్ 229 జర్మనీ 226 అర్జెంటీనా 137 ఇటలీ 128 ఫ్రాన్స్ 120 స్పెయిన్ 99 ఇంగ్లండ్ 91 ఉరుగ్వే 87 హంగేరి 87 నెదర్లాండ్స్ 86 ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... లక్షల్లో జనాభా ఉన్న చిన్నచిన్న దేశాలు కూడా ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత సాధించి తమ ప్రత్యేకతను చాటుకుంటుంటే.. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ మాత్రం ఏనాడూ ఈ మెగా టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ 106వ స్థానంలో ఉంది. క్రికెట్ ఆదరణ పెరిగాక మన దేశంలో ప్రాభవం కోల్పోయిన ఎన్నో ఆటల్లో ఫుట్‌బాల్ కూడా ఒకటి. ప్రతి నాలుగేళ్లకు ప్రపంచకప్‌లో ఒక్క కొత్త జట్టయినా గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంటే భారత ఫుట్‌బాల్‌లో మాత్రం కదలిక కనిపించదు. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఇండియన్ సూపర్ లీగ్, ఐ–లీగ్ తదితర టోర్నీలతో రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం కనిపించడంలేదు. 1950, 60వ దశకాల్లో భారత జట్టు ఆసియాలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ టీమ్‌లలో ఒకటిగా నిలిచింది. 1951, 1962 ఆసియా క్రీడ్లలో స్వర్ణాలు సాధించిన మన జట్టు 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలవడం మన అత్యుత్తమ ఘనత. అయితే 1970 నుంచి మన తిరోగమనం వేగంగా సాగింది. అప్పుడప్పుడు దక్షిణాసియా (శాఫ్) దేశాల పోటీల్లో మెరుపులు మినహా మిగతాదంతా శూన్యమే. బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రి తదితర స్టార్లు మాత్రమే వ్యక్తిగత ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు. మస్కట్, అధికారిక బంతి, పాటలు... టోర్నమెంట్ అధికారిక మస్కట్ ‘లాయిబ్’. ఇది అరబిక్ పదం... ‘నిష్ణాతుడైన ఆటగాడు’ అని అర్థం. ఈ ఏప్రిల్ 1న మస్కట్‌ను ఆవిష్కరించిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) వెబ్సైట్లో లాయిబ్ గురించి ఇలా రాసింది.. ‘లాయిబ్ యువతలో స్ఫూర్తి నింపుతుంది. అదెక్కడుంటే అక్కడ హుషారు, ఆత్మవిశ్వాసం అంతకంతకూ పెరుగుతాయి’ అని! సృజన, ఆలోచనలతోనే వ్యక్తుల సంకల్పం పెరుగుతుందని తెలిపింది. అధికారిక బంతి ‘అల్ రిహ్లా’ మస్కట్ కంటే ముందు మార్చి 30న టోర్నీలో వాడే అధికారిక బంతి ‘అల్ రిహ్లా’ని ఆవిష్కరించింది. అరబిక్‌లో ‘అల్ రిహ్లా’ అంటే ప్రయాణం. ఖతర్ సంస్కృతి, నిర్మాణశైలి, పడవలు, పతాకం నుంచి ప్రేరణ పొందాలనే ఉద్దేశంతో ఆ పేరును ఖరారు చేశారు. మన్నికకే ప్రాధాన్యమిచ్చి ప్రత్యేకమైన జిగురు, సిరాలతో రూపొందించిన తొలి అధికారిక బంతి ఇది. ఆట పాట గతంలో ప్రతి ప్రపంచకప్‌కు ప్రత్యేక గీతాన్ని స్వరపరిచేవారు. మెగా టోర్నీకి ముందే అది సాకర్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేది. కానీ ఈసారి ఒక పాటతో సరిపెట్టకుండా పాటల ట్రాక్‌ను విడుదల చేశారు. హయ్యా... హయ్యా (కలిసుంటే కలదు సుఖం) పాటతో ఈ ట్రాక్ మొదలవుతుంది. దీన్ని ట్రినిడాడ్, కార్డొన, డేవిడో, ఐషా బృందం ఆలపించింది. ‘అర్హ్బో’, ‘లైట్ ద స్కై’ అనే ఇంకో రెండు పాటలు ఈ ప్రపంచకప్ గానా బజానాలో భాగమయ్యాయి. -
రొనాల్డో... ఆఖరి అవకాశం
క్రీడాభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరు క్రిస్టియానో రొనాల్డో. 2003 నుంచి పోర్చుగల్ జాతీయ సీనియర్ జట్టుకు ఆడుతున్న రొనాల్డో తన కెరీర్లో ప్రొఫెషనల్ లీగ్స్‌లో (ప్రీమియర్ లీగ్, లా లిగా, చాంపియన్స్ లీగ్, సెరియా లీగ్) అందుబాటులో ఉన్న అన్ని గొప్ప టైటిల్స్ సాధించాడు. కానీ ప్రపంచకప్ ఒక్కటే అతడిని అందని ద్రాక్షగా ఊరిస్తోంది. వరుసగా ఐదో ప్రపంచకప్‌లో ఆడుతున్న రొనాల్డో ఆఖరి ప్రయత్నంగా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తన నాయకత్వంలో పోర్చుగల్‌ను 2016లో యూరో చాంపియన్‌గా నిలబెట్టిన రొనాల్డో 2019లో నేషన్స్ లీగ్ టైటిల్ కూడా అందించాడు. ఈసారి పోర్చుగల్ విశ్వవిజేతగా నిలిస్తే క్రిస్టియానో రొనాల్డో దిగ్గజాల సరసన చేరడంతోపాటు తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకుంటాడు. పోర్చుగల్ ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: మూడో స్థానం (1966). ‘ఫిఫా’ ర్యాంక్: 9. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ ప్లే ఆఫ్ విజేత. ఎనిమిదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న పోర్చుగల్ యువ, సీనియర్ ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. రికార్డుస్థాయిలో ఐదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో జట్టుకు వెన్నెముకలాంటి వాడు. పోర్చుగల్ తరఫున ఇప్పటి వరకు 191 మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో 117 గోల్స్ సాధించి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. రొనాల్డోతోపాటు రాఫెల్ లియావో, బెర్నార్డో సిల్వా, రూబెన్ డయాస్ కీలక ఆటగాళ్లు. ఘనా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (2010). ‘ఫిఫా’ ర్యాంక్: 61. అర్హత ఎలా: ఆఫ్రికా క్వాలిఫయింగ్ మూడో రౌండ్ విజేత. ‘బ్లాక్ స్టార్స్’గా పేరున్న ఘనా నాలుగోసారి ప్రపంచకప్‌లో ఆడుతోంది. 2018 ప్రపంచకప్‌నకు అర్హత పొందలేకపోయిన ఘనా అంతకుముందు రెండు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశను దాటి ముందుకెళ్లింది. ఈసారి తమ గ్రూప్‌లోని మూడు జట్లు పటిష్టమైనవి కావడంతో ఘనా సంచలన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. డెనిస్ ఒడోయ్, లాంప్టె, కుడుస్, అబ్దుల్ రహమాన్ కీలక ఆటగాళ్లు. ఉరుగ్వే ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: చాంపియన్ (1930, 1950). ‘ఫిఫా’ ర్యాంక్: 14. అర్హత ఎలా: దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్‌లో మూడో స్థానం. నిలకడలేని ప్రదర్శనకు మారుపేరైన ఉరుగ్వే 14వసారి ప్రపంచకప్‌లో పోటీపడుతోంది. రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన మూడు జట్లలో ఒకటైన ఉరుగ్వే ఈసారి ఎంత దూరం వెళ్తుందనేది అంచనా వేయలేము. గోల్‌కీపర్ ఫెర్నాండో ముస్లెరా, కెప్టెన్ డీగో గోడిన్, మార్టిన్ సెసెరెస్, లూయిస్ స్వారెజ్, ఎడిన్సన్ కవానిలకు 100 కంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. సీనియర్లు సత్తా చాటుకుంటే ఉరుగ్వే జట్టుకు గ్రూప్ దశ దాటడం ఏమంత కష్టం కాబోదు. దక్షిణ కొరియా ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: నాలుగో స్థానం (2002). ‘ఫిఫా’ ర్యాంక్: 28. అర్హత ఎలా: ఆసియా క్వాలిఫయింగ్ మూడో రౌండ్ గ్రూప్ ‘ఎ’ రన్నరప్. ప్రపంచకప్‌లో ఆసియా నుంచి అత్యధికసార్లు బరిలోకి దిగిన జట్టు దక్షిణ కొరియా. ఇప్పటి వరకు 11 సార్లు పోటీపడిన కొరియా తాము ఆతిథ్యమిచ్చిన 2002 టోర్నీలో నాలుగో స్థానంలో నిలిచింది. ఏ ఆసియా జట్టుకైనా ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 1986 నుంచి ప్రతి ప్రపంచకప్‌నకు అర్హత పొందిన కొరియా 2002లో మినహా మిగతా అన్నిసార్లు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. స్టార్ ప్లేయర్ సన్ హెయుంగ్ మిన్ ఫామ్ కొరియా విజయావకాశాలను నిర్దేశిస్తుందనడంలో సందేహం లేదు. –సాక్షి క్రీడా విభాగం -
FIFA: 'మెస్సీ నా స్నేహితుడే కాదు'
లియోనల్ మెస్సీ.. క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేర్లు. ఆటలో ఎంత పేరు సంపాదించారో అభిమానంలోనూ అంతే. వీరిద్దరి గురించి ఫుట్‌బాల్ తెలియనివాళ్లకు కూడా ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఒకరు అర్జెంటీనా తరపున స్టార్‌గా వెలుగుతుంటే.. మరొకరు పోర్చుగల్ తరపున తన హవా కొనసాగిస్తున్నాడు. గోల్స్ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆటలో శత్రువులుగా ఉన్న వీళ్లకి బయట మాత్రం మంచి స్నేహం ఉంది. అయితే ఇద్దరికి తీరని కల ఒకటి ఉంది. అదే ఫిఫా వరల్డ్‌కప్. ఫుట్‌బాల్‌లో స్టార్లుగా వెలుగొందుతున్న వీళ్ల ఖాతాలో ఒక్క ఫిఫా టైటిల్ కూడా లేదు. అందుకే నవంబర్ 20 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని ఎలాగైనా తమ జట్టుకే అందించాలని ఈ ఇద్దరు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక అభిమానులు కూడా అర్జెంటీనా, పోర్చుగల్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగితే బాగుంటుందని.. మెస్సీ, రొనాల్డో ఎదురుపడితే ఆ మజానే వేరుగా ఉంటుందని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే క్రిస్టియానో రొనాల్డో తన చిరకాల మిత్రుడు మెస్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెస్సీ నాకు ఎప్పటికి మంచి మిత్రుడే.. వేరే దేశాలకు ఆడుతున్నా మా స్నేహం మాత్రం ఎప్పటిలాగే ఉంటుందని శుక్రవారం పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. "మెస్సీ ఒక అద్భుతమైన ప్లేయర్. అతన్ని చూస్తుంటే ఓ మ్యాజిక్‌లా అనిపిస్తుంది. ఓ వ్యక్తిగా మేము ఇద్దరం 16 ఏళ్లుగా ఫుట్‌బాల్ ఫీల్డ్‌ను పంచుకుంటున్నాం. ఒక్కసారి ఊహించుకోండి 16 ఏళ్లు. అందుకే అతనితో మంచి రిలేషన్షిప్ ఉంది. అతడు నా ఫ్రెండ్ అని చెప్పను. ఫ్రెండ్ అంటే ఇంటికి వస్తాడు. ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అతడు ఫ్రెండ్ కాదు కానీ టీమ్ మేట్లాంటి వాడు. మెస్సీ నా గురించి మాట్లాడే తీరు చూస్తే ఎప్పుడూ అతన్ని గౌరవిస్తాను. అంతెందుకు అతని భార్య లేదా నా భార్య అయినా కూడా వాళ్లు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటారు. వాళ్లు అర్జెంటీనాకు చెందిన వాళ్లు. నా గర్ల్‌ఫ్రెండ్‌ది కూడా అర్జెంటీనాయే. మెస్సీ గురించి ఏం చెబుతాం? గొప్ప వ్యక్తి. ఫుట్‌బాల్‌ను నాకంటే గొప్పగా ఆడతాడు" అంటూ తెలిపాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా.. సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్లతో కలిసి గ్రూప్-సిలో ఉంది. మరోవైపు పోర్చుగల్ మాత్రం ఉరుగ్వే, ఘనా, సౌత్ కొరియాలతో కలిసి గ్రూప్ హెచ్లో ఉంది. గ్రూప్ దశలో ఈ రెండుజట్లు తలపడే అవకాశం లేదు. నాకౌట్ దశలో మాత్రం ఎదురపడే చాన్స్ ఉంది. అయితే ఈ రెండు టీమ్స్ ఫైనల్ చేరి.. అక్కడ మెస్సీ, రొనాల్డో ముఖాముఖి తలపడితే చూడాలనుకుంటున్నట్లు ఫుట్‌బాల్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. చదవండి: FIFA: అందాల విందు కష్టమే.. అసభ్యకర దుస్తులు ధరిస్తే జైలుకే 'పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు' -
'పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు'
ఖతార్ వేదికగా నవంబర్ 20 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్‌కప్ సమరానికి అంతా సిద్ధమైంది. ఇప్పటికే వరల్డ్‌కప్‌లో పాల్గొననున్న జట్లన్నీ ఖతార్‌కు చేరుకున్నాయి. ఈసారి ఎవరో విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కూడా దేశం తరపున వరల్డ్‌కప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇటీవలే పియర్స్ మోర్గాన్ అనే బ్రిటిష్ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్‌తో పాటు ఆ జట్టు మేనేజర్ నాకు ద్రోహం చేశారంటూ ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా పియర్స్ మోర్గాన్ ఇంటర్య్వూ రెండో భాగం కూడా బయటికి వచ్చింది. ఇందులో రొనాల్డో చనిపోయిన తన కొడుకు గురించి తలచుకొని ఎమోషనల్ అయ్యాడు. విషయంలోకి వెళితే.. రొనాల్డో ప్రస్తుతం అర్జెంటీనాకు చెందిన మోడల్ జార్జినా రోడ్రిగ్జ్‌తో సహజీవనం చేస్తున్నాడు. వీరికి 2017లోనే ఒక కుమార్తె పుట్టింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ జంటకు కవలలు పుట్టారు. అయితే కవలల్లో అమ్మాయి బతకగా.. అబ్బాయి మాత్రం చనిపోయాడు. ఇది రొనాల్డోనూ చాలా బాధించింది. తనకు వారసుడు పుట్టాడనే ఆనందం అంతలోనే ఆవిరైందన్న బాధ రొనాల్డోలో స్పష్టంగా కనిపించింది. తాజాగా ఇదే విషయాన్ని రొనాల్డో పియర్స్ మోర్గాన్ ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. ''మనకు పిల్లలు పుట్టబోతున్నారని తెలిస్తే అంతా నార్మల్‌గా జరగాలని కోరుకుంటాం. కానీ పుట్టిన సమయంలో సమస్య తలెత్తి పురిట్లోనే బిడ్డ చనిపోతే ఎలా ఉంటుంది. ఆ బాధను నేను దగ్గరి నుంచి అనుభవించాను. ఈ విషయంలో నాకంటే జార్జినా ఎక్కువగా బాధపడడం సహజం. ఎందుకంటే మాతృత్వం అనేది చాలా గొప్పది. ఆ క్షణంలో అలా జరిగిపోయేసరికి మాకు చాలా క్లిష్టంగా అనిపించింది. నిజంగా ఆ సమయంలో మా జీవితంలో ఏం జరిగిందో కూడా కొంతకాలం అర్థం కాలేదు. నిజంగా నా కొడుకుకు పురిట్లోనే పోగొట్టుకోవడం చాలా బాధించింది. మా నాన్న చనిపోయిన రోజున ఎంత బాధపడ్డానో అదే బాధను నా కొడుకు చనిపోయిన రోజున అనుభవించాను. మనల్ని ద్వేషించే వాడికి కూడా ఈ కష్టం రాకూడదని ఆరోజు కోరుకున్నా'' అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ రెండు బాగాలుగా విడుదల చేశారు. ఈ బుధవారం, గురువారం రొనాల్డో ఫుల్ ఇంటర్య్వూ వీడియోను అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో వీక్షించొచ్చు "That moment was probably the most difficult moment that I have in my life." Cristiano Ronaldo opens up about the devastating death of his baby son, telling Piers Morgan: "We don't understand why it happened to us."@cristiano | @piersmorgan | @TalkTV | #PMU pic.twitter.com/tOba0WJpBf — Piers Morgan Uncensored (@PiersUncensored) November 15, 2022 చదవండి: Cristiano Ronaldo: 'ద్రోహం చేశారు'.. రొనాల్డో సంచలన వ్యాఖ్యలు -
'ద్రోహం చేశారు'.. రొనాల్డో సంచలన వ్యాఖ్యలు
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో పాటు జట్టు మేనేజర్ ఎరిక్ టెన్ హాగ్‌లు నాకు ద్రోహం చేశారంటూ పేర్కొన్నాడు. పియర్స్ మోర్గాన్ బ్రాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో ఈ వ్యాఖ్యలు చేశాడు. విషయంలోకి వెళితే.. గత నెలలో టోటెన్హమ్తో మ్యాచ్ సందర్భంగా రొనాల్డోనూ సబ్‌స్టిట్యూట్‌గా వెళ్లాలని మేనేజర్ టెన్ హగ్ పేర్కొన్నాడు. కానీ రొనాల్డో సబ్‌స్టిట్యూట్‌గా వెళ్లడానికి ఒప్పుకోలేదు. దీంతో టెన్ హగ్ రొనాల్డోను జట్టు నుంచి తప్పించాడు. ఆ తర్వాత చెల్సియా ట్రిప్‌కు రొనాల్డోను ఎంపిక చేయలేదు. అయితే దీని వెనుక కూడా టెన్ హగ్ హస్తం ఉన్నట్లు తెలిసింది. అప్పటినుంచి రొనాల్డో, టెన్ హగ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. తాజాగా పియర్స్ మోర్గాన్ ఇంటర్య్వూలోనూ రొనాల్డో ఇదే విషయాన్ని పేర్కొన్నాడు. ''వాళ్ల విషయంలో మోసం అనే పదం చాలా చిన్నది. ఎరిక్ టెన్ హాగ్‌తో పాటు క్లబ్‌కు చెందిన మరో ముగ్గురు కలిసి నన్ను దారుణంగా అవమానించారు. నాకు ద్రోహం చేసిన ఫీలింగ్ కలిగింది. అంతేకాదు మాంచెస్టర్ యునైటెడ్‌లో ఉండకూడదని కంకణం కట్టుకున్నారు. ఇప్పుడే కాదు గతేడాది కూడా ఇలాగే చేశారు. టెన్హగ్పై నాకు ఎలాంటి గౌరవం లేదు.. ఎందుకంటే ఆయనకు నాపై గౌరవం లేదు కాబట్టి.'' అంటూ పేర్కొన్నాడు. "I feel betrayed." EXCLUSIVE: Cristiano Ronaldo tells Piers Morgan he feels like he's being forced out of Manchester United in an explosive interview. 90 Minutes with Ronaldo. Wednesday and Thursday at 8pm on TalkTV.@cristiano | @piersmorgan | @TalkTV | #PMU pic.twitter.com/nqp4mcXHB0 — Piers Morgan Uncensored (@PiersUncensored) November 13, 2022 చదవండి: ఆసుపత్రిలో చేరిన క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ -
మూడో స్థానానికి ఎగబాకిన కోహ్లి
రన్ మెషీన్ విరాట్ కోహ్లికి సోషల్‌మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ లాంటి మాధ్యమాల్లో కోట్ల సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన అతను.. వీటి ద్వారా అదే స్థాయిలో ధనార్జన కూడా చేస్తున్నాడు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా కోహ్లి సంపాదిస్తున్నదెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ఒక్కో పోస్ట్‌కు దాదాపు 9 కోట్ల రూపాయలు అర్జిస్తున్నాడంటే నమ్మితీరాల్సిందే. Virat Kohli at No.3 in the world. He was the 3rd highest earning celebrity in 2021 on Instagram. He had earned 302.47 Crores. pic.twitter.com/CVce5YbE1D — CricketMAN2 (@ImTanujSingh) October 15, 2022 తాజాగా అతను ఇన్‌స్టా ద్వారా అత్యధికంగా సంపాదించే సెలబ్రిటీల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. 2021లో ఇన్‌స్టా ద్వారా అతను 36.6 మిలియన్ డాలర్లు అర్జించాడు. ఈ జాబితాలో స్టార్ ఫుట్‌బాలర్లు క్రిస్టియానో రొనాల్డో (85.2 మిలియన్ డాలర్లు), లియోనల్ మెస్సీ (71.9) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో 211 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న వారి జాబితాలో అతనిది 14వ స్థానం. ఈ జాబితా టాప్ 25లో ఆసియా ఖండం నుంచి కోహ్లి ఒక్కడే ఉండటం విశేషం. రొనాల్డో ఒక్క పోస్ట్‌కు 19 కోట్లు.. ఇన్‌స్టాలో 44 కోట్ల మంది ఫాలోవర్లు కలిగిన ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో.. తాను పెట్టే ఒక్కో పోస్ట్ ద్వారా ఏకంగా 19 కోట్లు అర్జిస్తున్నాడు. ఇది కోహ్లి ఒక్కో పోస్ట్ ద్వారా అర్జిస్తున్న సంపాదన కంటే రెండింతలు ఎక్కవ. మరో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ కూడా ఒక్కో పోస్ట్ ద్వారా 15 కోట్లు సంపాదిస్తున్నాడు. -
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. కోహ్లి శుభాకాంక్షలు, యువీని ఉతికి ఆరేసిన నెటిజన్లు
Cristiano Ronaldo 700th Goal: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్, ఆల్‌టైమ్ గ్రేట్ (GOAT) క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నిన్న (అక్టోబర్ 9) ఎవర్టన్తో జరిగిన మ్యాచ్‌లో గోల్ కొట్టడం ద్వారా.. ఫుట్‌బాల్ చరిత్రలో 700 గోల్స్ (క్లబ్ గేమ్స్‌లో) సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ అత్యధిక గోల్స్ (117) సాధించిన ఫుట్‌బాలర్‌గా కొనసాగుతున్న రొనాల్డో.. ఫుట్‌బాల్ సామ్రాజ్యాన్ని మకుటం లేని మహారాజుగా ఏలుతున్నాడు. ఇప్పటివరకు ఓవరాల్‌గా (క్లబ్ గోల్స్+అంతర్జాతీయ గోల్స్) 817 గోల్స్ సాధించిన రొనాల్డో.. భవిష్యత్తు తరాల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఓవరాల్‌గా అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రొనాల్డో తర్వాతి స్థానంలో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఉన్నాడు. మెస్సీ ఇప్పటివరకు క్లబ్స్ స్థాయిలో 691 గోల్స్, 90 అంతర్జాతీయ గోల్స్ కొట్టాడు. ఓవరాల్‌గా చూస్తే.. మెస్సీ రొనాల్డో కంటే 36 గోల్స్ వెనుకబడి ఉన్నాడు. Virat Kohli commented on Cristiano Ronaldo's Instagram post: "THE GOAT. #700" pic.twitter.com/OqTq8ocqsP — CRISTIANO ADDICTION (@craddiction) October 10, 2022 రొనాల్డో సాధించిన ఘనతకు యావత్ క్రీడా ప్రపంచం శుభాకాంక్షలు తెలుపుతుండగా.. భారత స్టార్ క్రికెటర్లు కూడా మేము సైతం అంటూ సోషల్‌మీడియా వేదికగా GOATకు విషెస్ తెలుపుతున్నారు. రొనాల్డోకు వీరాభిమాని అయిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఇన్‌స్టా వేదికగా "THE GOAT. #700" అని విష్ చేయగా.. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విటర్లో రొనాల్డోకు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే, యువీ తాను చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల నెట్టింట దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. King 👑 is back ! Form is temporary class is forever !!! @Cristiano welcome to 700 club ! No7 #GOAT𓃵 #legend siiiiiiiiiiii !!!!! @ManUtd — Yuvraj Singh (@YUVSTRONG12) October 9, 2022 ఎందుకంటే.. క్లబ్ స్థాయి ఫుట్‌బాల్‌లో రొనాల్డో 700 గోల్స్ చేసిన తొలి ఆటగాడు అయితే.. యువీ 700 గోల్స్ క్లబ్‌లోకి స్వాగతం అంటూ తన ట్వీట్లో పేర్కొన్నాడు. ఇలా ట్వీట్ చేయడంలో యువీ ఉద్దేశం ఏదైనా.. మిస్టేక్ స్పష్టంగా కనిపిస్తుండటంతో ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. -
ఇమిటేట్ చేయబోయి.. ఆస్పత్రి బెడ్ మీద పేషెంట్‌గా
పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గోల్ కొట్టినప్పుడల్లా ఒక సిగ్నేచర్ స్టెప్ ఇస్తూ ఉంటాడు. అదే 'సుయ్'(Siii) అనే సెలబ్రేషన్. సుయ్ సెలబ్రేషన్ ఎలా ఉంటుందంటే.. గోల్ కొట్టిన తర్వాత గాల్లోకి ఎగిరి ఆ తర్వాత వెనక్కి తిరిగి సుయ్ అని అరవడమే. అయితే ఒకరి సిగ్నేచర్ స్టెప్‌ను కాఫీ కొట్టాలని ప్రయత్నిస్తే కొన్నిసార్లు సక్సెస్ అవుతారు.. మరికొన్నిసార్లు విఫలమవుతారు. సక్సెస్ అయితే పర్వాలేదు.. కానీ విఫలమైతే నవ్వుల పాలవ్వడం ఖాయం. తాజాగా ఒక వ్యక్తికి అలాగే జరిగింది. రొనాల్డోకు వీరాభిమాని అయిన ఆ వ్యక్తి అతని సుయ్ సెలబ్రేషన్‌ను అనుకరిద్దామనుకున్నాడు.. కానీ కట్‌చేస్తే ఇప్పుడు ఆస్పత్రి బెడ్‌పై పేషెంట్లా పడి ఉన్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఎంత అభిమానం ఉన్నా మనకు రానిది ప్రయత్నించి లేని కష్టాలను కొనితెచ్చుకోవడం వంటిదే. విషయంలోకి వెళితే.. ఒక ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా రొనాల్డో అభిమాని బంతిని గోల్‌పోస్ట్‌కు తరలించాడు. ఆ తర్వాత రొనాల్డోను ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పట్టుజారిన అతను కిందపడ్డాడు. అయితే బరువంతా అతని ఎడమ కాలుపై పడడంతో లేవడానికి ఇబ్బంది పడ్డాడు. ఇది గమనించిన తోటి మిత్రులు ఆసుపత్రికి తరలించి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించారు. ట్రీట్మెంట్ తర్వాత ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఆ వ్యక్తి చేతిలో ఫిజ్జా, బీర్ కనిపించడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక క్రిస్టియానో రొనాల్డో తన ట్రేడ్‌మార్క్ సుయ్ అనే పదాన్ని 2013లో చెల్సియాతో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి ఉపయోగించాడు. అప్పటినుంచి రొనాల్డో సుయ్ సెలబ్రేషన్ బాగా పాపులర్ అయింది. కొంతకాలం క్రితం టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కూడా రొనాల్డో సుయ్ సెలబ్రేషన్ చేయడం అప్పట్లో వైరల్‌గా మారింది. The Siuuuu is not for everyone 😅 pic.twitter.com/YGFttQe1um — Joga Bonito (@ufcfooty) September 29, 2022 -
సునీల్ ఛెత్రికి ఫిఫా అరుదైన గౌరవం
ప్రపంచానికి క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ పరిచయం అక్కర్లేని పేర్లు. ఫుట్‌బాల్ క్రీడలో ఈ ఇద్దరు ఎవరికి వారే సాటి. ఆటలోనూ.. పాపులారిటీ విషయంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి(Sunil Chhetri)పై ఫిఫా(FIFA) డాక్యుమెంటరీ రూపొందించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినా మన దేశం మాత్రం గర్వపడేలా చేసింది. రొనాల్డో, మెస్సీల లాగా సునీల్ ఛెత్రి ఫిఫా వరల్డ్‌కప్‌లు ఆడింది లేదు.. ప్రధాన ఫుట్‌బాల్ క్లబ్స్‌కు కూడా పెద్దగా ప్రాతినిధ్యం వహించింది లేదు. మరి ఫిఫా ఎందుకు సునీల్ ఛెత్రి డాక్యుమెంటరీ రూపొందించాలనుకుంది. పాపులారిటీ విషయంలో ఈ భారత కెప్టెన్ మెస్సీ, రొనాల్డోలతో సరితూగకపోవచ్చు కానీ.. గోల్స్ విషయంలో మాత్రం వారి వెనకాలే ఉన్నాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ రికార్డు పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉంది. రొనాల్డో 117 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో అర్జెంటీనా స్టార్ మెస్సీ 90 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి ఉన్నాడు. సునీల్ 131 మ్యాచ్‌ల్లో 84 గోల్స్ చేశాడు. సునీల్ ఛెత్రి రొనాల్డో, మెస్సీలాగా ప్రపంచకప్‌లు ఆడకపోవచ్చు.. కానీ అతని ఆటతీరుతో ఒక స్టార్‌గా గుర్తింపు పొందాడు. ఈ ఒక్క కారణంతోనే ఫిఫా సునీల్ ఛెత్రిపై డాక్యుమెంటరీ తీయాలని అనుకుంది. ఎవరికి తెలియని సునీల్ ఛెత్రి పేరును డాక్యుమెంటరీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యతను స్వయంగా ఫిఫా తీసుకుంది. భారతదేశం నుంచి ఫుట్‌బాల్‌లో హీరోగా వెలుగొందుతున్న సునీల్ ఛెత్రి లాంటి స్ట్రైకర్ ఎలా ఉద్భవించాడు.. అతని ఆటతీరును పరిచయం చేస్తూ డాక్యుమెంటరీ కొనసాగుతుంది. ఈ డాక్యుమెంటరీకి కెప్టెన్ ఫెంటాస్టిక్(Captain Fantastic Series) అని పేరు పెట్టిన ఫిఫా ఇటీవలే మొదటి సీజన్ విడుదల చేసింది. అంతా ఊహించినట్లుగానే 'కెప్టెన్ ఫెంటాస్టిక్ సిరీస్' డాక్యుమెంటరీ సూపర్‌హిట్ అయింది. అయితే కొన్నాళ్ల క్రితం సునీల్ ఛెత్రిపై ఫిఫా ఒక డాక్యుమెంటరీ రూపొందించనుందంటూ వార్తలు వచ్చాయి. అయితే మొదట ఛెత్రి, అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని నమ్మలేదు. ఎందుకంటే ఫిఫా ఒక ఆటగాడిపై డాక్యుమెంటరీ రూపొందింస్తుందంటే కచ్చితంగా గొప్ప ఆటగాడు అయి ఉండాలి. ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లు లేదా ఫుట్‌బాల్‌లో గొప్ప ఆట ఆడిన ఆటగాళ్లపై మాత్రమే ఫిఫా డాక్యుమెంటరీలు రూపొందిస్తుంది. ఈ విషయంలో సునీల్ ఛెత్రి చాలా దూరంలో ఉన్నాడు. ప్రతి నాలుగేళ్లకోసారి ఉపఖండంలో జరిగే ఆసియా కప్‌లో మాత్రమే సునీల్ ఛెత్రి ఆడేవాడు. ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి గోల్స్ చేస్తూ ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ల జాబితాలోకి అడుగుపెట్టిన సునీల్ ఎదుగుదల కథను ఫిఫా ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రిపై డాక్యుమెంటరీ మొదలుపెట్టింది. You know all about Ronaldo and Messi, now get the definitive story of the third highest scoring active men's international. Sunil Chhetri | Captain Fantastic is available on FIFA+ now 🇮🇳 — FIFA World Cup (@FIFAWorldCup) September 27, 2022 -
బాక్సర్‌గా మారిన రొనాల్డో.. ఇదంతా దాని కోసమా!
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. ఫుట్‌బాలర్‌గా వెలుగొందుతున్న రొనాల్డో బాక్సర్‌గా దర్శనమిచ్చాడు. కండలు తిరిగిన దేహంతో బాక్సింగ్ రింగ్‌లో ఒక యోధుడిలా కనిపిస్తున్నాడు. ప్రత్యర్థితో తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా రొనాల్డో లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఫుట్‌బాలర్ కంటే బాక్సర్‌గానే రొనాల్డో బాగున్నాడంటూ అభిమానులు తెగ సంతోషపడిపోయారు. కానీ వారి ఆనందం కాసేపు మాత్రమే మిగిలింది. ఇదంతా ఒక యాడ్ కోసమని తెలియగానే ఫ్యాన్స్ నాలుక కరుచుకున్నారు. అవునండీ రొనాల్డో.. అండర్వేర్ దుస్తులకు సంబంధించిన ఒక యాడ్‌లో పాల్గొన్నాడు. సీఆర్ 7 బ్రాండ్ కలిగిన అండర్వేర్ యాడ్‌కు రొనాల్డో ప్రమోషన్ చేశాడు. ''బద్దకానికి వ్యతిరేకంగా నా పోరాటం ప్రారంభమైంది'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక రొనాల్డో ఫిట్‌నెస్‌కు పెట్టింది పేరు. మైదానంలో పాదరసంలా కదిలే రొనాల్డొ ఎనర్జీ వెనుక అతని ఫిట్నెస్ ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ప్రపంచంలో అత్యంత పాపులారిటీ కలిగిన ఆటగాడిగా పేరున్న రొనాల్డో ఇటీవలే ఆటకు తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ప్రతిష్టాత్మక ఫిఫా ర్యాంకింగ్స్‌లోనూ తొలిసారి టాప్-5లో చోటు దక్కించుకోలేకపోయాడు. అయినప్పటికి రొనాల్డోకు క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదని తాజా వీడియో నిరూపించింది. ఇక రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఫుట్‌బాల్ తర్వాత రొనాల్డోకు అత్యంత ఇష్టమైన క్రీడ ఎంఎంఏ(MMA-మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్). ఫుట్‌బాల్ కెరీర్ నుంచి తప్పుకున్న తర్వాత ఎంఎంఏ క్రీడలో పెట్టుబడులు పెడతానని రొనాల్డొ ఇదివరకే పేర్కొన్నాడు. కాగా తాను ఫుట్‌బాలర్ కాకపోయుంటే కచ్చితంగా మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం పొందేవాడినని రొనాల్డో ఒక సందర్భంలో తెలిపాడు. View this post on Instagram A post shared by CR7 (@cr7cristianoronaldo) చదవండి: సరికొత్త ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 319 కిలో మీటర్లు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి..? పిల్లలు జడుసుకుంటారు! -
రొనాల్డో చేసిన పనికి యువతి మొహం మాడిపోయింది!
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డొకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆటలో అతని విన్యాసాలు చూడాలని స్టేడియాలకు పోటెత్తుతుంటారు. అలా సెపరేట్ ఫ్యాన్ బేస్ కలిగిన రొనాల్డోతో ఫోటో దిగాలన్న ఆశ ఎవరికి ఉండదు చెప్పండి. తాజాగా తను అభిమానించే ఆటగాడితో సెల్ఫీ దిగాలని ఆరాపడింది ఒక అందమైన యువతి. కానీ రొనాల్డో ఆమెతో ఫోటో దిగేందుకు నిరాకరించి చేతిని అడ్డుపెట్టుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. యూఈఎఫ్ఏ యూరోప్ లీగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మాంచెస్టర్ యునైటెడ్, మొల్డోవన్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ 2-0తో విజయం సాధించింది. మాంచెస్టర్ యునైటెడ్ తరపున రొనాల్డో, జెడన్ సాంచోలు చెరో గోల్ కొట్టారు. తొలి సగం ముగిసేసరికి రొనాల్డో కొట్టిన గోల్‌తో మాంచెస్టర్ యునైటెడ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి హాఫ్ బ్రేక్‌టైంలో కాస్త చికాకుగా ఉన్న రొనాల్డో పెవిలియన్‌కు వెళ్తున్నాడు. ఇంతలో అక్కడున్న ఒక యువతి రొనాల్డోతో ఫోటో దిగాలని ఆశపడింది. కానీ రొనాల్డో అందుకు అభ్యంతరం చెబుతూ తన చేతిని అడ్డుపెట్టి వెళ్లిపోయాడు. దాంతో యువతి మొహం చిన్నబోయింది. A fan asked Ronaldo for a picture during the halftime of the United game but he refused to take it… pic.twitter.com/qYIRsvmtQU — LSPN FC (@LSPNFC_) September 15, 2022 చదవండి: 'రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం.. ఫెడ్డీ' ప్రైవేట్ లీగ్స్ మోజులో సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నాడు -
మెస్సీ, రొనాల్డోలకు ఊహించని షాక్..
ప్రస్తుత తరం ఫుట్‌బాల్ స్టార్లుగా వెలుగొందుతున్న లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలకు ఊహించని షాక్ తగిలింది. సోమవారం ప్రకటించిన ఫిఫా 23 అల్టిమేట్ టీమ్ పేరిట అత్యధిక రేటింగ్ కలిగిన స్టార్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఎప్పుడు టాప్‌లో ఉండే మెస్సీ, రొనాల్డోలు తొలిసారి కిందకు పడిపోయారు. మెస్సీ ఐదో స్థానంలో ఉండగా.. రొనాల్డో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. 23 మందితో ప్రకటించిన ఈ జాబితాలో అగ్రభాగం ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్‌కు ఆడుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. 23 మందిలో 11 మంది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌కు చెందిన వారు కాగా.. మిగతా 12 మంది వేర్వేరు ఫ్రాంచైజీల తరపున ఆడుతున్నారు. ఇక తొలి ఐదు స్థానాలకు 91 రేటింగ్ పాయింట్లే ఇచ్చినప్పటికి ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ప్రకటించారు. రియల్ మాడ్రిడ్‌కు చెందిన కరీమ్ బెంజెమా 91 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. బార్సిలోనాకు చెందిన రాబర్ట్ లెవాన్‌డోస్కీ(91 రేటింగ్ పాయింట్లు) రెండో స్థానంలో.. పారిస్ సెయింట్ జర్మన్(పీఎస్జీ)కు చెందిన కైలియన్ మేపీ(91 రేటింగ్) మూడో స్థానంలో.. మాంచెస్టర్ సిటీకి చెందని కెవిన్ డిబ్రూయోన్(91 రేటింగ్) నాలుగో స్థానంలో.. పీఎస్జీకి చెందిన లియోనల్ మెస్సీ(91 రేటింగ్) ఐదో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 90 రేటింగ్‌తో మహ్మద్ సాలా(లివర్‌పూల్), వర్జిల్ వాన్ డిజ్క్(లివర్ పూల్), క్రిస్టియానో రొనాల్డో(మాంచెస్టర్ యునైటెడ్) వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారు. అత్యధిక రేటింగ్ కలిగిన 23 స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ ►కరీమ్ బెంజెమా (రియల్ మాడ్రిడ్) - 91 రేటింగ్ ►రాబర్ట్ లెవాండోస్కీ (బార్సిలోనా) - 91 రేటింగ్ ►కైలియన్ మేపీ (పారిస్ సెయింట్-జర్మైన్) - 91 రేటింగ్ ►కెవిన్ డి బ్రూయ్నే (మాంచెస్టర్ సిటీ) - 91 రేటింగ్ ►లియోనెల్ మెస్సీ (పారిస్ సెయింట్-జర్మైన్) - 91 రేటింగ్ ►మొహమ్మద్ సలా (లివర్‌పూల్) - 90 రేట్ చేయబడింది ►వర్జిల్ వాన్ డిజ్క్ (లివర్‌పూల్) - 90 రేట్ చేయబడింది ►క్రిస్టియానో రొనాల్డో (మాంచెస్టర్ యునైటెడ్) - 90 రేటింగ్ ►తిబౌట్ కోర్టోయిస్ (రియల్ మాడ్రిడ్) - 90 రేటింగ్ ►మాన్యుయెల్ న్యూయర్ (బేయర్న్ మ్యూనిచ్) - 90 రేట్ చేయబడింది ►నేమార్ జూనియర్ (పారిస్ సెయింట్-జర్మైన్) - 89 రేటింగ్ ►హ్యూంగ్-మిన్ సన్ (టోటెన్హామ్ హాట్స్పుర్) - 89 రేట్ చేయబడింది ►సాడియో మనే (బేయర్న్ మ్యూనిచ్) - 89 రేట్ చేయబడింది ►జాషువా కిమ్మిచ్ (బేయర్న్ మ్యూనిచ్) - 89 రేట్ చేయబడింది ►కాసెమిరో (మాంచెస్టర్ యునైటెడ్) - 89 రేటింగ్ ►అలిసన్ (లివర్‌పూల్) - 89 రేట్ చేయబడింది ►హ్యారీ కేన్ (టోటెన్హామ్ హాట్స్పుర్) - 89 రేట్ చేయబడింది ►ఎడెర్సన్ (మాంచెస్టర్ సిటీ) - 89 రేటింగ్ ►గోలో కాంటే (చెల్సియా) - 89 రేటింగ్ ►జాన్ ఓబ్లాక్ (అట్లెటికో మాడ్రిడ్) - 89 రేట్ చేయబడింది ►ఎర్లింగ్ హాలాండ్ (మాంచెస్టర్ సిటీ) - 88 రేటింగ్ ►టోని క్రూస్ (రియల్ మాడ్రిడ్) - 88 రేటింగ్ ►మార్క్వినోస్ (పారిస్-సెయింట్ జర్మైన్) - 88 రేటింగ్ చదవండి: Ishwar Pandey: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ -
ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డోకు పోలీసుల వార్నింగ్..
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు చేదు అనుభవం ఎదురైంది. అభిమానితో దురుసుగా ప్రవర్తించిన కారణంగా పోలీసులు రొనాల్డోను హెచ్చరించారు. విషయంలోకి వెళితే.. గత ఏప్రిల్ 9న గూడిసన్ పార్క్ వేదికగా ఎవర్టన్ ఎఫ్‌సీ, మాంచెస్టర్ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో గాయపడ్డాడు. మ్యాచ్‌ను కూడా 1-0తో ఎవర్టన్ ఎఫ్‌సీ కైవసం చేసుకుంది. దీంతో మ్యాచ్ ఓడిపోయామన్న బాధలో పెవిలియన్ వెళ్తున్న రొనాల్డోను కొంత మంది తన ఫోన్ కెమెరాల్లో బందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవర్టన్ ఎఫ్‌సీ అభిమాని ఒకరు రొనాల్డోను ఫోటో తీయడానికి ప్రయత్నించగా.. చిర్రెత్తికొచ్చిన రొనాల్డో ఆవేశంతో అతని ఫోన్‌ను నేలకేసి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కాసేపటి తర్వాత సదరు వ్యక్తికి క్షమాపణ చెప్పాడు. ఎంత క్షమాపణ చెప్పినా రొనాల్డో చర్య తప్పిదమే. అందుకే బ్రిటీష్ పోలీసులు రొనాల్డో చర్యను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టారు. తాజాగా బుధవారం రొనాల్డోను హెచ్చరిస్తూ ఒక మెసేజ్ పంపారు. 37 ఏళ్ల రొనాల్డో ఉద్దేశపూర్వకంగానే ఒక అభిమానికి సంబంధించిన వస్తువుకు నష్టం కలిగించాడని మా విచారణలో తేలింది. దీనిపై రొనాల్డోను ప్రశ్నించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. వస్తువును ధ్వంసం చేసి క్రిమినల్ డ్యామేజ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు నిజమని తేలడంతో రొనాల్డోకు హెచ్చరికలు జారీ చేసినట్లు బ్రిటీష్ పోలీసులు తెలిపారు. Cristiano Ronaldo has been cautioned by police after knocking a phone from a supporter's hand at Everton in April. (🎥 @Evertonhub) pic.twitter.com/MY3vVjq5mm — ESPN FC (@ESPNFC) August 17, 2022 చదవండి: అథ్లెట్ స్వయంగా కూలీకి వెళితే తప్ప ఇల్లు గడవని స్థితి... అయినా అద్భుత విజయాలు Vijender Singh: 19 నెలలు గ్యాప్ వచ్చినా.. ఏ మాత్రం తగ్గని జోరు -
ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 'కింగే'.. ఒక్క పోస్టుకు ఎంత సంపాదిస్తున్నాడంటే?
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న సంగతి తెలిసిందే. కనీసం 50 పరుగులు చేయడానికి కూడా నానా తంటాలు పడుతున్న కోహ్లిని రెస్ట్ పేరుతో బీసీసీఐ విండీస్ టూర్‌కు పక్కనబెట్టింది. కోహ్లి 71వ శతకం కోసం అభిమానులు దాదాపు నాలుగేళ్లుగా కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తూనే ఉన్నారు. పరుగుల యంత్రంగా పేరు పొందిన కోహ్లి ప్రస్తుతం ఆటలో మెరవకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం దుమ్మురేపుతున్నాడు. కెప్టెన్సీతో పాటే ఫామ్ కూడా కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో క్రేజ్ మాములుగా లేదు. బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్, ఎండార్స్మెంట్స్ ద్వారానే గాక సోషల్ మీడియా ద్వారా కూడా కోట్లల్లో సంపాదిస్తున్నాడు. తాజాగా హోపర్క్ డాట్‌కామ్(hopperhq.com) చేపట్టిన సర్వేలో ఇన్స్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న జాబితాలో ఆసియా ఖండం నుంచి కోహ్లి తొలి స్థానంలో నిలిచాడు. ఆటలో కింగ్ అని పేరున్న కోహ్లి ఇన్‌స్టాలోనూ కింగ్‌గా మారిపోయాడని దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ఒక్క పోస్టుకు సంపాదిస్తున్న మొత్తం ($1,088,000) అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 8 కోట్ల 69 లక్షలు. ఇక కోహ్లీకి ఇన్స్టాగ్రామ్ లో 20 కోట్ల (200,703,169)కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే కోహ్లీ పెట్టే ఒక్క పోస్టు వాళ్లందరికీ చేరాల్సిందే. వాళ్ల నుంచి ఇతరులకు షేర్ అవుతుంది. అందుకే ఇన్స్టాగ్రామ్ కూడా కోహ్లి డబ్బులు బాగానే మూటజెప్పుతుంది. ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్నవారి జాబితాలో కోహ్లీ 14వ స్థానంలో ఉన్నాడు. అదీగాక ఈ జాబితాలో టాప్-25లో ఉన్న సెలబ్రిటీలలో ఆసియా ఖండం నుంచి కోహ్లీ ఒక్కడే ఉండటం గమనార్హం. ఈ జాబితాలో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో 44 కోట్ల (442,267,575) ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రొనాల్డో పెట్టే ఒక్క పోస్టుకు $2,397,000 పొందుతున్నాడు. అంటే కోహ్లీ కంటే రెండింతలు (సుమారుగా 18 కోట్లు) ఎక్కువ. మరో ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కూడా ఒక్క పోస్టు ద్వారా $1,777,000 ఆదాయం పొందుతున్నట్లు సర్వేలో తేలింది. చదవండి: బీసీసీఐ కొత్త పంథా.. ఆటగాళ్లకే కాదు అంపైర్లకు ప్రమోషన్ సరిగ్గా ఇదే రోజు.. విండీస్ గడ్డ మీద కోహ్లి డబుల్ సెంచరీ! అరుదైన రికార్డు -
కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రొనాల్డోకు కార్లంటే యమా క్రేజ్. తన ఇంట్లోనే దాదాపు అన్ని మోడల్స్‌కు సంబంధించిన కార్లను కలెక్షన్గా కలిగి ఉన్నాడు. తాజాగా రొనాల్డోకు సంబంధించిన కోట్ల విలువైన కారు అయింది. 1.8 యూరో మిలియన్(భారత కరెన్సీలో దాదాపు రూ. 14 కోట్ల 87 లక్షలు) డాలర్ల విలువ కలిగిన బుగట్టి వెయ్రోన్ సూపర్ కార్ మేజర్ యాక్సిడెంట్‌కు గురయ్యింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. సోమవారం స్పెయిన్‌లోని రొనాల్డో నివాసం ముందే కారు ప్రమాదం జరిగినట్లు తెలిసింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు మొదట రొనాల్డో కారులోనే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఫుట్‌బాల్ స్టార్ ప్రస్తుతం హాలిడే గడపడానికి తన ఫ్యామిలితో కలిసి ఒక ఐలాండ్‌లో ఉన్నట్లు తెలిసింది. కాగా రొనాల్డో కారును తన డ్రైవర్ తీసుకెళ్లాడని.. కారును కంట్రోల్ చేయడంలో పట్టు కోల్పోవడంతో రొనాల్డో ఇంటి ముందు ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కానప్పటికి.. కారు ముందు భాగం మాత్రం బాగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు కారును ఆటోగ్యారెజ్కు తరలించారు. ఏ ఇతర వాహనము కారును యాక్సిడెంట్ చేయలేదని.. డ్రైవర్ తనంతట తానుగానే పట్టు తప్పడంతో కారుకు యాక్సిడెంట్ అయిందని పేర్కొనడంతో అతనిపై కేసు నమోదు చేశారు. కాగా రొనాల్డో ఎంతో ఇష్టపడి కొనుకున్న కారు రిపేరుకు సంబంధించిన బిల్ పెద్దదిగానే ఉండనుందని అభిమానులు కామెంట్స్ చేశారు. Cristiano Ronaldo 's Bugatti Veyron suffered an accident on Monday morning in Mallorca. Apparently Cristiano was not inside the vehicle. [@UHmallorca] #mufc pic.twitter.com/WtG5crWWsd — The United Stand (@UnitedStandMUFC) June 20, 2022 చదవండి: Neeraj Chopra: భారత్ స్టార్ నీరజ్ చోప్రాకు తప్పిన పెను ప్రమాదం -
సునీల్ ఛెత్రీ అరుదైన రికార్డు.. మెస్సీకి రెండు అడుగుల దూరంలో
ఫుట్‌బాల్ స్టార్.. భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ అరుదైన ఘనత సాధించాడు. ఏఎప్సీ ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ ఛెత్రీ ఆట 45వ నిమిషంలో గోల్‌తో మెరిశాడు. ఈ గోల్ సునీల్ ఛెత్రీకి 84వ అంతర్జాతీయ గోల్ కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే హంగేరీ ఫుట్‌బాల్ దిగ్గజం ఫెరెన్క్ పుస్కాస్తో సమానంగా టాప్-5లో నిలిచాడు. పుస్కాస్ కూడా హంగేరీ తరపున 84 అంతర్జాతీయ గోల్స్ కొట్టాడు. ఇక టాప్ ఫోర్లో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(117 గోల్స్), ఇరాన్ స్టార్ అలీ దాయి (109 గోల్స్) రెండో స్థానంలో.. మొఖ్తర్ దహరి (89 గోల్స్) మూడో స్థానంలో.. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ 86 గోల్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక మెస్సీకి, సునీల్ ఛెత్రీకి మధ్య గోల్స్ వ్యత్యాసం రెండు మాత్రమే ఉండడం విశేషం. అంతర్జాతీయంగా ఎక్కువ గోల్స్ కొట్టిన టాప్-10 జాబితాలో రొనాల్డో, మెస్సీ, సునీల్ ఛెత్రీ, అలీ మొబ్కూత్(80 గోల్స్, యూఏఈ) మాత్రమే ప్రస్తుతం ఆడుతున్నారు. ఇక ఆసియా కప్ గ్రూప్-డి క్వాలిఫయర్స్‌లో భాగంగా హంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో ఘన విజయం అందుకుంది టీమిండియా. ఈ విజయంతో టేబుల్ టాపర్‌గా ఆసియా కప్ 2023 టోర్నీలో ఆడనుంది. ఈ మ్యాచ్‌కి ముందు టేబుల్ టాపర్‌గా ఉన్న హాంకాంగ్‌పై ఆది నుంచి భారత్ ఎదురుదాడికి దిగింది. ఆట రెండో నిమిషంలోనే గోల్ సాధించి, హంగ్ కాంగ్ని ఒత్తిడిలోకి నెట్టేసింది. ఆట ప్రారంభమైన రెండో నిమిషంలో అన్వర్ ఆలీ గోల్ సాధించి, భారత జట్టుకి 1-0 ఆధిక్యం అందించాడు. తొలి సగం ముగుస్తుందనగా ఆట 45వ నిమిషంలో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ గోల్ చేసి టీమిండియాను 2-0 ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత హాంకాంగ్ గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలను తిప్పి కొట్టిన భారత జట్టు.. ఆట 85వ నిమిషంలో మూడో గోల్ చేసింది. మన్వీర్ సింగ్ గోల్‌తో టీమిండియా ఆధిక్యం 3-0కి దూసుకెళ్లింది. నిర్ణీత సమయం అనంతరం ఇచ్చిన అదనపు సమయంలో ఆట 90+3వ నిమిషంలో ఇషాన్ పండిట గోల్ సాధించడంతో భారత జట్టు 4-0 తేడాతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. చదవండి: Asian Cup 2023: భారత ఫుట్‌బాల్ జట్టు కొత్త చరిత్ర.. వరుసగా రెండోసారి -
రొనాల్డోపై అత్యాచారం కేసు.. కోర్టు కీలక తీర్పు
ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు ఉన్న క్రేజ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలోనే అత్యధిక మంది అభిమానులున్న ఆటగాడిగా రొనాల్డో ఎప్పుడో చరిత్ర సృష్టించాడు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అత్యధిక ఫాలోవర్లతో రొనాల్డో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. మూడు పదుల వయసులోనూ తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదంటూ యువ ఆటగాళ్లతో పోటీ పడి మరీ సాకర్ గేమ్ లో దూసుకెళ్తున్నాడు. ఫుట్‌బాల్ కెరీర్లో ఎలాంటి మచ్చ లేకుండా సాగుతున్న రొనాల్డోకు వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక అత్యాచారం కేసు చాలా ఇబ్బంది పెడుతూ వచ్చింది. తాజాగా రొనాల్డోపై ఉన్న అత్యాచారం కేసులో అమెరికా కోర్టు కీలక తీర్పును వెలువరించింది. విషయంలోకి వెళితే.. 2009లో లాస్ వెగాస్ లోని ఒక హోటల్ లో తనపై రోనాల్డో అత్యాచారం చేసినట్లు కేత్రిన్ మోయెర్గా అనే మహిళ కోర్టులో కేసు వేసింది. దీనిపై గత కొన్నేళ్లుగా సుదీర్ఘ విచారణ జరిపిన లాస్ వెగాస్ కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. బాధితరాలు తరపున వాదనలు వినిపించిన లాయర్ సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయాడని 42 పేజీల తీర్పులో పేర్కొంది. అదే క్రమంలో రొనాల్డో అత్యాచార కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా క్రిస్టియానో రొనాల్డోకు భారీ ఊరట లభించింది. ఇక రొనాల్డో నాయకత్వంలోనే పోర్చుగల్ జట్టు ఇటీవలే ఈ ఏడాది ఖతర్ వేదికగా జరిగనున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ కు కూడా అర్హత సాధించిన సంగతి తెలిసిందే. వయసు రిత్యా చూస్తే రొనాల్డోకు ఇదే ఆఖరి ఫిఫా వరల్డ్‌కప్ కావొచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నేషన్స్ లీగ్‌లో పోర్చుగల్ జట్టుకు రొనాల్డో కెప్టెన్‌గాగా వ్యవహరిస్తున్నాడు. తనకు ఆఖరిదని భావిస్తున్న 2022 ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌ను ఎలాగైనా విజేతగా నిలపాలని రొనాల్డో అనుకుంటున్నాడు. అతని కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. చదవండి: బేస్‌బాల్ మ్యాచ్‌లో యువతి అర్థనగ్న ప్రదర్శన.. గెంటేసిన నిర్వాహకులు ఓవైపు భారత్, సౌతాఫ్రికా మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు.. వీడియో వైరల్ -
Virat Kohli: విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు.. తొలి ఇండియన్‌గా!
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి రికార్డులేమీ కొత్తకాదు. అయితే, ఈసారి ఆటలో కాకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇన్‌స్టాలో 200 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న మొదటి భారతీయ వ్యక్తిగా చరిత్రకెక్కాడు ఈ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు. అదే విధంగా ఫొటో, వీడియో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న క్రీడాకారుల జాబితాలో కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు. స్టార్ ఫుట్‌బాలర్లు క్రిస్టియానో రొనాల్డో 451 మిలియన్లు, లియోనల్ మెస్సీ 334 ఫాలోవర్లతో కోహ్లి కంటే ముందున్నారు. ఈ సందర్భంగా..‘‘ 200 మిలియన్ల మంది! నాకు మద్దతుగా నిలుస్తున్న ఇన్‌స్టా ఫ్యామిలీకి ధన్యవాదాలు’’ అంటూ ఫాలోవర్లను ఉద్దేశించి కోహ్లి ఓ వీడియో షేర్ చేశాడు. ఇందుకు స్పందించిన అభిమానులు.. ‘‘కంగ్రాట్స్ భాయ్.. మా గుండెల్లో నీ స్థానం ఎప్పుడూ పదిలం.. నువ్వు ఎల్లప్పుడూ మాకు కింగ్ కోహ్లివే’’ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన కోహ్లిని... ఆ తర్వాత బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ ఘోర పరాజయం నేపథ్యంలో టెస్టు సారథ్య బాధ్యతల నుంచి కోహ్లి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ దక్కగా.. కోహ్లి ఆటగాడిగా కొనసాగుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఫామ్‌లేమితో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నా అభిమాన గణాన్ని మాత్రం పెంచుకుంటూనే పోతున్నాడు ఈ ‘రన్ మెషీన్’! ఇక 177 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న సమయంలో కోహ్లి ఒక్కో పోస్టుకు 5 కోట్ల రూపాయల మేర ఆర్జిస్తున్నాడంటూ విశ్లేషకులు అంచనాలు వేసిన విషయం తెలిసిందే. చదవండి: ‘వారి విలువేమిటో బాగా తెలుసు’.. టీమిండియా టాప్–3పై ద్రవిడ్ వ్యాఖ్య View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) View this post on Instagram A post shared by Leo Messi (@leomessi) -
అర్జెంటీనా స్టార్ మెస్సీ కొత్త చరిత్ర.. 61 వ స్థానంలో కోహ్లి
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ అరుదైన ఘనత సాధించాడు. 2022 ఏడాదిలో అత్యధిక పారితోషికం తీసుకున్న అథ్లెట్‌గా మెస్సీ చరిత్ర సృష్టించాడు. బుధవారం ప్రకటించిన ఫోర్బ్స్ అథ్లెట్ జాబితాలో మెస్సీ తొలిస్థానంలో ఉండగా.. దిగ్గజ ఎన్బీఏ ఆటగాడు లెబ్రన్ జేమ్స్ రెండు, పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డో మూడో స్థానంలో ఉన్నాడు. మే 1, 2022 ముగిసేనాటికి మెస్సీ 131 మిలియన్ డాలర్ల పారితోషికం అందుకున్నాడు. ఇందులో 55 మిలియన్ డాలర్లు ఎండార్స్మెంట్ రూపంలో సంపాదించాడు. ఇక రెండో స్థానంలో ఉన్న ఎన్బీఏ ఆటగాడు లెబ్రన్ జేమ్స్ 121 మిలియన డాలర్ల పారితోషికం తీసుకోగా.. తర్వాత వరుసగా పోర్చుగల్ కెప్టెన్ రొనాల్డో(115 మిలియన్ డాలర్లు), బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్మర్(95 మిలియన్ డాలర్లు), మూడుసార్లు ఎన్బీఏ చాంపియన్ స్టీఫెన్ కర్రీ(92.8 మిలియన్ డాలర్లు)తో మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఎన్బీఏ ఆటగాడు కెవిన్ డురంట్(92 మిలియన్ డాలర్లు) ఆరో స్థానంలో ఉండగా.. స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్(90.7 మిలియన్ డాలర్లు) ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక చివరి మూడు స్థానాల్లో మెక్సికన్ బాక్సర్ కానెలో అల్వరెజ్(90 మిలియన్ డార్లు), ఏడుసార్లు సూపర బౌల్ చాంపియన్ టామ్ బ్రాడీ(83.9 మిలియన్ డాలర్లు), ఎన్బీఏ చాంపియన్ గియనిస్ (80.9 మిలియన్ డాలర్లు) ఉన్నారు. ఇక ఈ జాబితాలో టీమిండియా నుంచి విరాట్ కోహ్లి 33.9 మిలియన్ డాలర్లతో(31 మిలియన్ డాలర్లు ఎండార్స్మెంట్ రూపంలో) 61వ స్థానంలో ఉన్నాడు. కోహ్లి తప్ప మరే భారతీయ ఆటగాడు టాప్-100లో చోటు దక్కించుకోలేకపోయారు. ఇక ఈ ఫోర్బ్స్ జాబితాను ప్రతీ ఏడాది ప్రకటించడం ఆనవాయితీ. ఆటగాళ్ల వార్షిక సంపాదన, ఎండార్స్మెంట్, బోనస్, స్పాన్సర్షిప్ డీల్స్, లైసెన్స్ ఇన్కమ్ ద్వారా వివరాలను వెల్లడిస్తుంటారు. చదవండి: MS Dhoni: సినీరంగ ప్రవేశం చేయనున్న టీమిండియా మాజీ కెప్టెన్ The World’s 10 Highest-Paid Athletes 2022 https://t.co/MIB7ZF8u5I pic.twitter.com/ujPt4ny41s — Forbes (@Forbes) May 12, 2022 -
Christiano Ronaldo: వందో గోల్‌తో కుమారుడికి నివాళి
లండన్: ప్రముఖ ఫుట్‌బాలర్, మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డో ఇటీవల మరణించిన తన నవజాత శిశువుకు ఘనంగా నివాళులర్పించాడు. ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం ఆర్సెనల్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్ చేసిన రొనాల్డో.. తన చేతి వేలును ఆకాశం వైపుకు చూపిస్తూ తన బిడ్డను స్మరించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. రొనాల్డో భాగస్వామి జార్జీనా రోడ్రిగ్వెజ్ ఇటీవల కవలలకు (బాబు, పాప) జన్మనిచ్చింది. అయితే, బాబు పుట్టిన వెంటనే మరణించాడు. Cristiano Ronaldo dedicating his 100th Premier League goal to his baby boy who died. ❤🙏pic.twitter.com/EJ8KMtHAYt — The CR7 Timeline. (@TimelineCR7) April 23, 2022 ఇదిలా ఉంటే, ఆర్సెనల్‌పై చేసిన గోల్ రొనాల్డోకు ప్రీమియర్ లీగ్‌లో 100వ గోల్ కావడం విశేషం. ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఈ ఘనతను సాధించలేదు. ఈ మ్యాచ్‌లో రొనాల్డో గోల్ చేసినప్పటికీ మాంచెస్టర్ యునైటెడ్ ఓటమిపాలైంది. ఆర్సినల్ 3-1తో గెలుపొందింది. చదవండి: టీమిండియాలో చోటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హార్ధిక్ పాండ్యా -
రొనాల్డో ఇంట్లో తీవ్ర విషాదం..
Cristiano Ronaldo: ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతడి నవజాత కుమారుడు మరణించాడు. ఈ విషయాన్ని రొనాల్డో సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తమ జీవితాల్లో అత్యంత విషాదకరమైన రోజు అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు.. ‘‘మా చిన్నారి కుమారుడు మమ్మల్ని శాశ్వతంగా వదిలివెళ్లిపోయాడని చెప్పడానికి చింతిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి తల్లిదండ్రులు ఎలాంటి వేదనను అనుభవిస్తారో మా పరిస్థితి అలాగే ఉంది. ఈ క్షణంలో మా చిన్నారి కూతురు జననమే మాకు కాస్త ఊరటనిస్తోంది. మా పిల్లల విషయంలో శ్రద్ధ చూపుతూ వారిని కంటికి రెప్పలా కాచిన నర్సులు, డాక్టర్లకు ధన్యవాదాలు. ఇలాంటి కష్ట సమయంలో మా ప్రైవసీకి భంగం కలగకుండా వ్యవహరించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా చిన్నారి బాబూ.. నువ్వు దేవదూతవి. నిన్ను మేము ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం’’ అని తన సహచరి జార్జినా రోడ్రిగ్జ్‌తో కలిసి రొనాల్డో సంయుక్త ప్రకటన విడుదల చేశాడు. కాగా తాము మరోసారి తల్లిదండ్రులం కాబోతున్నామంటూ రొనాల్డో, జార్జినా గతేడాది అక్టోబరులో ప్రకటించిన సంగతి తెలిసిందే. కవలలు పుట్టబోతున్నారంటూ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో సోమవారం వారికి కవల పిల్లలు(ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) జన్మించారు. వీరిలో నవజాత కుమారుడు అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక రొనాల్డోకు ఇప్పటికే నలుగురు సంతానం. జార్జినాతో గతంలో ఓ కూతురు ఉండగా.. తాజాగా మరో కుమార్తె జన్మించింది. చదవండి: ‘అమ్మ చెప్పింది.. శ్రేయస్ అయ్యర్ నన్ను పెళ్లి చేసుకుంటావా?’ -
పుట్‌బాల్ ప్రపంచకప్‌కు పోర్చుగల్
లిస్బన్: తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్ టైటిల్‌ను సాధించేందుకు పోర్చుగల్ కెప్టెన్, విఖ్యాత ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు మరో అవకాశం లభించింది. ఈ ఏడాది నవంబర్–డిసెంబర్లలో ఖతర్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌కు పోర్చుగల్ జట్టు అర్హత పొందింది. బుధవారం జరిగిన యూరోపియన్ జోన్ ప్లే ఆఫ్ ఫైనల్లో పోర్చుగల్ 2–0 గోల్స్ తేడాతో నార్త్ మెసెడోనియా జట్టును ఓడించి ప్రపంచకప్ బెర్త్ సొంతం చేసుకుంది. పోర్చుగల్ తరఫున బ్రూనో ఫెర్నాండెజ్ (32వ, 65వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. రొనాల్డోకిది వరుసగా ఐదో ప్రపంచకప్ కానుంది. మరో ప్లే ఆఫ్ ఫైనల్లో పోలాండ్ 2–0తో స్వీడన్‌ను ఓడించి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఆఫ్రికా జోన్ నుంచి ఘనా, సెనెగల్, ట్యూనిషియా, మొరాకో, కామెరూన్ జట్లు కూడా ప్రపంచకప్ బెర్త్‌లు సంపాదించాయి. మొత్తం 32 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు 27 జట్లు అర్హత పొందాయి. జూన్ 14న జరిగే ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌ల అనంతరం మిగిలిన ఐదు బెర్త్‌లు ఖరారవుతాయి. మిగిలిన ఐదు బెర్త్‌ల కోసం రేసులో ఉన్న జట్లతో కలిపి శుక్రవారం ప్రపంచకప్ ‘డ్రా’ను విడుదల చేయనున్నారు. -
సంచలనం సృష్టిస్తున్న రొనాల్డో బహిరంగ స్నానం
సాధారణంగా సెలబ్రిటీలు ఏం చేసినా వార్తే. మరి అలాంటిది.. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో చేస్తే సంచలనంగా మారకుండా ఉంటుందా చెప్పండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా రొనాల్డోకు పేరు ఉంది. ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో.. మాంచెస్టర్ సిటీతో కీలక మ్యాచ్‌కు ముందు ఒక లైవ్ వీడియోనూ షేర్ చేశాడు. ఆ వీడియోలో రొనాల్డో బహిరంగంగా స్నానం చేయడం కనిపించింది. మాములుగానే రొనాల్డో ఏదైనా షేర్ చేస్తే విరగబడి చూసి అతని ఫ్యాన్స్.. లైవ్ వీడియో అంటే ఊరుకుంటారా. అయితే రొనాల్డో బహిరంగ స్నానం చూసి ఆశ్చర్యపోయినప్పటికి.. తమ ఆరాధ్య ఆటగాడు అలా కనిపించడంతో లైక్స్, కామెంట్స్ చేశారు. రొనాల్డో స్నానం చేస్తున్న సమయంలో దాదాపు 670,000 మంది లైవ్‌లో చూశారు. సూ.. లాఫింగ్ ఎమోజీలు.. జెండాలు ఇలా రకరకాల ఎమోజీలతో కామెంట్స్ చేస్తూ పోయారు. రొనాల్డో ఇలా చేయడం వెనుక సరైన కారణం తెలియదు గానీ.. ఇప్పుడు అతని బహిరంగ స్నానం మాత్రం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సీజన్లో మాంచెస్టర్ యునైటెడ్ తరపున 31 మ్యాచ్‌లాడిన రొనాల్డో 15 గోల్స్ కొట్టాడు. చదవండి: Shane Warne: దిగ్గజ ఫుట్‌బాలర్స్‌తో వార్న్‌కు దగ్గరి పోలికలు.. మరణం కూడా! Virat Kohli Jersey Gift: 12వ ఆటగాడికి జెర్సీ గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లి.. ఎవరా వ్యక్తి? Never would I have thought I’d be watching Cristiano Ronaldo have a shower on Instagram live half naked. pic.twitter.com/FJSLDKfVfz — Ziyad⚡️🇲🇦 (@mcfcziyad) February 28, 2022 -
అత్యంత పాపులర్ ఆటగాడిగా అరుదైన గౌరవం
టీమిండియా మెషిన్గన్గా పేరుపొందిన విరాట్ కోహ్లి అరుదైన గౌరవం పొందాడు. ఇటీవలే అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్న కోహ్లి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని తాజాగా మరోసారి నిరూపితమైంది. 2022 జనవరి నెలకుగాను భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాడిగా కోహ్లి అగ్రస్థానంలో నిలిచాడు. ఓర్మాక్స్ మీడియా జనవరి నెలకు గానూ అత్యంత పాపులర్ ఆటగాడు ఎవరనే దానిపై సర్వే నిర్వహించింది. చదవండి: Dhoni-Deepak Chahar: 'రిటైర్మెంట్ రోజు ధోని చెప్పిన మాట నిలబెట్టుకున్నా' ఆ సర్వేలో కోహ్లి తొలి స్థానంలో ఉండగా.. మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని రెండో స్థానం, ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉండడం విశేషం. వన్డేల్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్న కోహ్లి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వన్డే విభాగంలో రెండు.. టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానం.. టి20 ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్నాడు. ఇప్పటితరం ఆటగాళ్లలో అత్యంత టాలెంటెడ్ ప్లేయర్‌గా పేరుపొందిన కోహ్లి అంతేస్థాయిలో ప్రజాభిమానాన్ని చూరగొనడం సర్వేలో వెల్లడైంది. అందుకే కోహ్లి అగ్రస్థానం సంపాదించినట్లు ఓర్మాక్స్ వెల్లడించింది. ఇక మిగతా స్థానాల విషయానికి వస్తే.. నాలుగో స్థానంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిలిచాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికి దశాబ్దం కావొస్తున్న వేళ సచిన్‌ను ఇప్పటికి ఆరాధిస్తుండడం ప్రత్యేకత సంతరించుకుంది. క్రికెట్లో ఎవరు సాధించలేని.. ఇకపై ఎవరు అందుకోలేని ఘనతలు సాధించడమే కారణమని సర్వేలో తేలింది. ఐదు, ఆరు స్థానాల్లో ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్స్ క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీలు నిలవడం విశేషం. రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధు(బ్యాడ్మింటన్) ఏడో స్థానంలో నిలవగా.. సైనా నెహ్వాల్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక తొమ్మిదో స్థానంలో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉండగా.. పదో స్థానంలో ఇటీవలే టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సానియా మీర్జా ఉండడం విశేషం. చదవండి: Wriddiman Saha: బెదిరింపులు నిజమేనా?.. సాహాను వివరణ కోరనున్న బీసీసీఐ Ormax Sports Stars: Most popular sportspersons in India (Jan 2022) pic.twitter.com/N9hhYdPhIT — Ormax Media (@OrmaxMedia) February 21, 2022 -
గర్ల్‌ఫ్రెండ్ నుంచి ఖరీదైన గిఫ్ట్ అందుకున్న స్టార్ ఫుట్‌బాలర్
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన గర్ల్‌ఫ్రెండ్ నుంచి ఖరీదైన గిఫ్ట్‌ను బహుమతిగా అందుకున్నాడు. ఫిబ్రవరి 5న రొనాల్డో పుట్టినరోజు పురస్కరించుకొని రొనాల్డో గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగేజ్ రూ.1.2 కోట్ల విలువైన బ్లాక్ కాడిల్లాక్ ఎస్యూవీ మోడల్ కారును గిఫ్ట్‌గా అందించింది. గర్ల్‌ఫ్రెండ్ కారు ఇచ్చిన మరుక్షణమే రొనాల్డో అదే కారులో మాంచెస్టర్ యునైటెడ్ గ్రౌండ్‌కు వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోనూ జార్జినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. కార్లంటే పిచ్చి ఉన్న వ్యక్తికి ఒక మంచి గిఫ్ట్‌ను ఇవ్వడం సంతోషం కలిగించింది. నాకు ఒక మంచి భర్తను.. పిల్లలకు మంచి తండ్రిని రొనాల్డో రూపంలో అందించినందుకు దేవుడికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. రొనాల్డోను మించిన పర్ఫెక్షనిస్ట్ మరొకరు లేరు. తనే నాకు ఆదర్శం అంటూ ఎమెషనల్‌గా రాసుకొచ్చింది. కాగా సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 400 మిలియన్ల మార్క్‌ను టచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి వ్యక్తిగా రొనాల్డో రికార్డులెక్కాడు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు View this post on Instagram A post shared by Georgina Rodríguez (@georginagio) -
రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానొ రొనాల్డో పేరిట ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు ఉన్నాయి. మైదానంలో తన ఆటతో రికార్డులను సొంతం చేసుకునే రొనాల్డో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తాజాగా సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 400 మిలియన్ల మార్క్‌ను టచ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి వ్యక్తిగా రొనాల్డో రికార్డులెక్కాడు. చదవండి: Munich Air Disaster: ఫిబ్రవరి 6, 1958.. ఫుట్‌బాల్ చరిత్రలో అతి పెద్ద విషాదం అటు ఆటగానిగా.. ఇటు వ్యక్తిగా ఏ విధంగా చూసినా ఇన్‌స్టాగ్రామ్‌లో 400 మిలియన్ ఫాలోవర్ల సంఖ్య రొనాల్డోకు మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే రొనాల్డో తర్వాత రెండోస్థానంలో ఉన్న అమెరికన్ స్టార్ మోడల్ కైలీ జెన్నర్ ఫాలోవర్ల సంఖ్య 309. వీరిద్దరి మధ్య దాదాపు వంద మిలియన్లు తేడా ఉంది. ఈ మధ్యనే రొనాల్డో(ఫిబ్రవరి 5న) తన 37వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా గతేడాది సెప్టెంబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 230 మిలియన్గా ఉండేది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే తన ఫాలోయింగ్‌ను డబుల్ రేంజ్‌కు పెంచుకున్నాడు. గతేడాది 12 ఏళ్ల తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు రీఎంట్రీ ఇచ్చిన రొనాల్డో.. సూపర్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. అదే సమయంలోనూ సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌లోనూ తన ఫాలోవర్ల సంఖ్యను అంతకంతకూ పెంచుకుంటూ వెళుతున్నాడు. కాగా రొనాల్డో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 3,242 పోస్టులు చేశాడు.. విచిత్రమేంటంటే రొనాల్డో తాను ఫాలో అవుతున్న సంఖ్య 501 మాత్రమే. చదవండి: కోల్‌కతా థండర్‌బోల్ట్స్ ఉత్కంఠ విజయం -
'ఏంటో సిరాజ్.. నీ సెలబ్రేషన్స్‌తో భయపెడుతున్నావు'
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ వికెట్ పడిన ప్రతీసారి తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకోవడం గమనిస్తున్నాం. ఈ మధ్యన స్టార్ ఫుట్‌బాలర్ రొనాల్డోను గుర్తుకుతెస్తూ సిరాజ్ ''సూ'' అని అరవడం మొదలుపెట్టాడు. రొనాల్డో గోల్ కొట్టాకా వెనక్కి తిరిగి తన చేతులను పైకి లేపుతూ ఇలాగే చేసేవాడు. తాజాగా సిరాజ్ మరోసారి రొనాల్డోను గుర్తుకుతెస్తూ సెలబ్రేట్ చేసుకోవడం వైరల్‌గా మారింది. చదవండి: Yuzvendra Chahal: అదరగొట్టిన చహల్.. అత్యంత తక్కువ వన్డేల్లో వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఇన్నింగ్స్ మూడో ఓవర్ సిరాజ్ వేశాడు. విండీస్ ఓపెనర్ షైయ్ హోప్ ఆ ఓవర్లో రెండు, మూడు బంతులను ఆఫ్‌సైడ్ దిశగా బౌండరీలుగా మలిచాడు. దీంతో సిరాజ్ నాలుగో బంతిని కూడా అదే తరహాలో వేశాడు. అయితే హోప్ ఈసారి మిస్ చేశాడు. ఐతే బంతి అనూహ్యంగా స్వింగ్ అయి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని మిడిల్, లెగ్ స్టంప్‌లను ఎగురగొట్టింది. అంతే సిరాజ్ తనలోని రొనాల్డోను మరోసారి బయటికి తీశాడు. సూ అంటూ గట్టిగా అరుస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే సిరాజ్ సెలబ్రేషన్స్‌పై టీమిండియా ఫ్యాన్స్ వినూత్న రీతిలో స్పందించారు. ''నీ సెలబ్రేషన్స్ ఏంటో గానీ.. మమ్నల్ని భయపెడుతున్నావు.. రొనాల్డో సెలబ్రేషన్ చూసి బోర్ కొట్టింది.. కాస్త కొత్తగా ట్రై చేయ్'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Rohit Sharma: విండీస్‌తో వన్డే సిరీస్.. రోహిత్ ముంగిట అరుదైన రికార్డులు BOWLED! Mohammed Siraj gets the first breakthrough for #TeamIndia, Shai Hope gone for 8. #INDvsWI pic.twitter.com/r77hLDVRKe — Doordarshan Sports (@ddsportschannel) February 6, 2022 -
కుర్ర ప్లేయర్.. రూ. ఐదు కోట్లకుపైగా వాల్యూ.. ఏమా కథ?
ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు.. స్పోర్ట్స్‌లోనూ క్రిప్టో ప్రాధాన్యం పెరిగిపోతోంది ఇప్పుడు. ఆటగాళ్ల పేరిట ఎన్ఎఫ్టీ(నాన్ ఫంగిబుల్ టోకెన్)లకు ఫుల్ గిరాకీ ఉంటోంది. ఈ క్రమంలో ఒక యువప్లేయర్ ఎన్ఎఫ్టీకి సుమారు 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ డిమాండ్ పలకడం యావత్ క్రీడా రంగంలో చర్చకు దారితీసింది. విశేషం ఏంటంటే.. ఆ ఆటగాడి దరిదాపుల్లో ఏ దిగ్గజ ప్లేయర్ కూడా లేకపోవడం!. బోరష్యా డోర్ట్‌మండ్.. జర్మనీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ క్లబ్. ఈ క్లబ్‌కి చెందిన స్ట్రయికర్ ఎర్లింగ్ హాలాండ్ ‘డిజిటల్ కార్డు’ ఏకంగా 5, 11, 000 పౌండ్లకు అమ్ముడుపోయింది. మన కరెన్సీలో దీని విలువ రూ. 5 కోట్ల 13 లక్షలకు పైనే. విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా హయ్యెస్ట్ వాల్యూ దక్కించుకున్న క్రిస్టియానో రొనాల్డ్ యునిక్ ఐటెం ధర 2, 04, 000 పౌండ్లు. మన కరెన్సీలో రూ. 2 కోట్ల రూపాయలుగా మాత్రమే ఉంది. అంటే.. హాల్యాండ్ ఎన్ఎఫ్టీ డిజిటల్ స్పోర్ట్స్ ఐటెమ్స్‌లో ఇప్పటిదాకా అత్యంత విలువైన వస్తువుగా నిలిచిందన్నమాట. గత అక్టోబరులో DFL మరియు Sorareల భాగస్వామ్యంలో డిజిటల్ ప్లేయర్ఐటమ్స్ను ఎన్ఎఫ్టీల రూపంలో.. సోరేర్ ఫాంటసీ ఫుట్‌బాల్ గేమ్ ఆడడానికి అనుమతిస్తున్నారు. అందుకే తర్వాతి జనరేషన్ గేమర్స్.. ఈ ట్రేడింగ్‌పై విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎదురులేని ఎర్లింగ్ ఎర్లింగ్ బ్రాట్ హాల్యాండ్.. నార్వేజియన్ ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్. జర్మన్ బుండెస్లిగా క్లబ్ బోరష్యా డోర్ట్మండ్తో పాటు నార్వే నేషనల్ టీం తరపున ఆడుతున్నాడు. వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే కాగా.. ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రయికర్గానూ పేరుంది ఇతనికి. లీడ్స్(ఇంగ్లండ్)లో జన్మించిన ఎర్లింగ్.. తండ్రి అల్ఫ్ ఇంగె హాల్యాండ్ నుంచి సాకర్‌ను పుణికిపుచ్చుకున్నాడు. చిన్నవయసులోనే ఫుట్‌బాల్‌లోకి అడుగుపెట్టిన ఎర్లింగ్.. ఆ తర్వాత బ్రైన్ క్లబ్ తరపున 2016లో ప్రొఫెషనల్ కెరీర్ మొదలుపెట్టాడు. హ్యాండ్‌బాల్, గోల్ఫ్, ట్రాక్ అండ్ ఫీల్డ్‌లోనూ మంచి ఆటగాడు. ఐదేళ్ల వయసులో(2006) స్టాండింగ్ లాంగ్ జంప్‌లో 1.63 మీటర్లు దూకి.. ఏకంగా ప్రపంచ రికార్డును సైతం నెలకొల్పాడు ఎర్లింగ్. సోరారే ఫాంటసీ ఫుట్‌బాల్ గేమ్.. నిజ జీవితంలో ఆటగాళ్ల ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది. మ్యాచ్‌డేలో జరిగే పాజిటివ్ (గోల్స్, అసిస్ట్‌లు) లేదా నెగటివ్ (రెడ్ కార్డ్‌లు) ఈవెంట్ల ఆధారంగా ఒక్కో గేమ్‌కు 0 మరియు 100 పాయింట్ల మధ్య ఆటగాళ్లు సంపాదిస్తారు. ఐదుగురు ఆటగాళ్ళు ఒక జట్టుగా ఏర్పడి, ఇతర యూజర్లతో పోటీపడతారు. చదవండి: అంతరిక్షంలోకి యువరాజ్‌సింగ్ బ్యాట్..! తొలి వ్యక్తిగా రికార్డు..! -
గాలి పీల్చుకోవడానికి రూ.15 లక్షలు ఖర్చు చేసిన రొనాల్డో
అదేంటీ వాతావరణంలోని పుక్కిడికి దొరికే గాలిని పీల్చుకోవడానికి స్వేచ్ఛ ఉంది కదా! అంతేసి ఖర్చు ఎందుకు? దండగ కాకపోతే.. అనుకుంటున్నారా?. ఆ గాలికి చాలా ప్రత్యేకత ఉంటుంది మరి. ప్యూర్ ఎయిర్‌గా పేరున్న ఈ మెషిన్ కోసం సాకర్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో భారీగానే ఖర్చుపెట్టాడు. ఇంతకీ దాని ఖర్చెంతో.. ప్రత్యేకతలేంటో తెలుసా? హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ (HBOT) మెషిన్ ఖరీదు 15,000 పౌండ్లు. మన కరెన్సీలో 15 లక్షల రూపాయలపైనే. ఈ డివైజ్ ప్రత్యేకత ఏంటంటే.. ప్యూర్ ఆక్సిజన్‌ను రక్తంలోకి సరఫరా చేస్తుంది. తద్వారా రక్తపు ప్లాస్మాలోని దెబ్బతిన్న కణజాలం క్యూర్ అయిపోతుంది. ఫిట్‌నెస్‌కు మొదటి ప్రాధాన్యత ఇచ్చే 36 ఏళ్ల రొనాల్డో.. ఈ ఛాంబర్‌ను తన జిమ్ రూంలో ఈ మధ్యే ఏర్పాటు చేయించాడు. చిన్నచిన్నగాయాలకు సైతం మ్యాచ్‌లకు దూరం అయ్యే రొనాల్డ్.. ఇలాంటి హైటెక్ చికిత్సల ద్వారా తరచూ ఉపశమనం పొందుతాడట. వాస్తవానికి రొనాల్డో ఇలాంటి ఛాంబర్లను ఉపయోగించడం కొత్తేం కాదు. 2016లో యూరో ఫైనల్లో తగిలిన మోకాలి గాయం తర్వాత స్పానిష్ ఐల్యాండ్ ఇబిజాకు వెళ్లి.. ఇలాంటి ఛాంబర్‌లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. కానీ, యూకేలో అలాంటి మెషిన్లు దొరక్కపోవడంతో కొని.. చెషైర్‌లోని తన ఇంట్లో ఇన్స్టాల్ చేయించుకున్నాడు. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది 50 వేల పౌండ్లు ఖర్చు పెట్టి ఐస్ ఛాంబర్‌ను కొన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే రిచ్చెస్ట్ సాకర్ ప్లేయర్‌గా పేరున్న రొనాల్డోతో మామూలుగా ఉండదు మరి!. ఛాంబర్ ప్రత్యేకతలు చిన్న ఛాంబర్ లాంటి గది ఉంటుంది. డ్రైవింగ్ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ల కోసం రూపొందించినప్పటికీ.. రకరకాల జబ్బులు ఉన్నవాళ్లు తమకు నయం కావడానికి ఈ చికిత్సను ఆశ్రయిస్తుంటారు. ఈ లిస్ట్‌లో సెలబ్రిటీలు కూడా ఎక్కువ!. 1662లో ఓ ఫిజీషియన్ ఈ తరహా ఛాంబర్ ఒకటి స్వచ్ఛమైన ఆక్సిజన్ కోసం నిర్మించినట్లు ప్రచారంలో ఉంది. 1940లో మిలిటరీ డైవర్స్ కోసం అమెరికా దేశం HBOT ఎక్కువ స్థాయిలో తయారు చేయించింది. అనుమతులు పొందాకే వీటిని వాడాల్సి ఉంటుంది. HBOTలతో ఉపయోగాలే కాదు.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయట. అందుకే వీటిని వినియోగించేముందు కొన్ని పరీక్షలు కూడా నిర్వహిస్తుంటారు మరి!. ఎక్కువ మంది ఒకేసారి ఈ చికిత్స తీసుకునేందుకు ప్రత్యేక గదులను సైతం ఏర్పాటు చేయిస్తుంటారు. ఈ ట్రీట్మెంట్కు కాస్ట్ ఎక్కువగా ఉంటోంది. చదవండి: రొనాల్డోకు భారత్‌లో అరుదైన గౌరవం -
2021 నిజంగానే అపురూపం.. ఆటల్లో ఎన్నో అద్భుతాలు, మరెన్నో..
2021 సంవత్సరం ఈరోజుతో ముగుస్తుంది. కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్న 2021 సంవత్సరం.. క్రీడల్లో ఎన్నో మధురానుభూతులు.. మరిచిపోలేని విషయాలు.. జ్ఞాపకాలు.. నిరాశ.. ఆధిపత్యం.. వివాదాలు అందించింది. టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్ విజయం మొదలుకొని.. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకంతో భారతావని పులకించడం.. ఇంకా మరెన్నో అద్భుతాలు చోటు చేసుకున్న 2021 సంవత్సరం గురించి చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం తయారవుతోంది. మరి కాలగమనంలో కలిసి పోనున్న 2021 సంవత్సరంలో క్రీడల్లో జరిగిన ముఖ్య పరిణామాలను మరోసారి గుర్తుచేసుకుందాం. మనం దేశంలో ఎక్కువగా అభిమానించే క్రీడ.. క్రికెట్. మరి అలాంటి క్రికెట్‌తోనే 2021 ఏడాది జ్ఞాపకాలను ప్రారంభిద్దాం. -సాక్షి, వెబ్‌డెస్క్ ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి.. 2021 ఏడాదిని టీమిండియా ఘనంగా ఆరంభించింది. అప్పటికే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా బిజీగా గడుపుతోంది. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్‌బాల్ టెస్టులో టీమిండియా ఘోరమైన ఓటమి చవిచూసింది. 36 పరుగులకే ఆలౌటై దారుణ పరాజయం మూటగట్టుకుంది. దీంతో ఎన్నో అవమానాలు.. విమర్శలు మొదలయ్యాయి. దీనికి తోడూ తొలి టెస్టు తర్వాత వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి రావడం.. గాయాలతో కీలక ఆటగాళ్లు దూరం కావడం టీమిండియాను మరింత ఇబ్బందుల్లో పడేసింది. కోహ్లి గైర్హాజరీలో రహానే నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. మెల్బోర్న్ టెస్టులో టీమిండియా పడిలేచిన కెరటంలా సంచలన విజయం సాధించింది. రహానే జట్టును ముందుండి నడిపించాడు. ఆ తర్వాత సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమికి దగ్గరైంది. ఈ దశలో హనుమ విహారి.. రవిచంద్రన్ అశ్విన్‌లు ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పోరాడడం ప్రతీ ఒక్కరిలో స్పూర్తిని కలిగించింది. ఆసీస్ బౌలర్ల దెబ్బలు బాధిస్తున్నా.. వాటిని తట్టుకొని టీమిండియాను ఓటమి నుంచి తప్పించి డ్రాగా ముగించారు. ఇక ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ గాబా మైదానానికి రండి మీ పని పడతాం అంటూ సవాల్ విసిరాడు. అసలే గాబా మైదానం ఆస్ట్రేలియాకు స్వర్గధామం. 32 ఏళ్లుగా ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాకు అక్కడ ఓటమనేదే లేదు. బుమ్రా, షమీ లాంటి సీనియర్ పేసర్ల గైర్హాజరీలో సిరాజ్ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించాలి. ఇన్ని సవాళ్ల మధ్య బరిలోకి దిగిన టీమిండియా అద్భుతమే చేసి చూపెట్టింది. ఆ మ్యాచ్‌లో సిరాజ్, శార్దూల్, పంత్, సుందర్‌ల అసమాన పోరాట పటిమతో టీమిండియా అధ్బుత విజయాన్ని నమోదు చేసింది. అలా రహానే సారధ్యంలో టీమిండియా బోర్డ్ర్ గావస్క్ ట్రోఫీని 2-1 తేడాతో సొంతం చేసుకొని చారిత్రక విజయాన్ని అందుకుంది. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై వరుసగా రెండోసారి మట్టికరిపించడం అభిమానులను బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ సిరీస్ విజయం చరిత్రలో నిలిచిపోయింది. అలా 2021 ఏడాదిని టీమిండియా ఘనంగా ఆరంభించింది. స్వదేశంలో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి.. ఇక ఫిబ్రవరిలో ఇంగ్లండ్ నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత్ గడ్డపై అడుగుపెట్టింది. చెన్నై వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియాకు ఘోర ఓటమి. రూట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు తొలి టెస్టులో 227 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. దీంతో మళ్లీ విమర్శల పర్వం మొదలైంది. అయితే టీమిండియా మళ్లీ అదే చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో బెబ్బులిలా గర్జించింది. 317 పరుగులు భారీ తేడాతో ఇంగ్లండ్‌ను దెబ్బకు దెబ్బ తీసింది. ఇక అక్కడి నుంచి టీమిండియా ఇంగ్లండ్‌కు అవకాశం ఇవ్వలేదు మూడో టెస్టులో 10 వికెట్ల తేడాతో.. నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో గెలిచి 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ అశ్విన్‌తో పాటు అక్షర్ పటేల్‌కు మధురానుభూతిగా నిలిచిపోయింది. ఈ ఇద్దరు స్పిన్నర్లు ఒకరితో ఒకరు పోటీ పడుతూ వికెట్లు తీశారు. ఇక ఆ తర్వాత జరిగిన ఐదు టి20ల సిరీస్‌ను 3-2 తేడాతో.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ముగించింది. భారీ అంచనాలతో బరిలోకి.. ఓటములు స్వాగతం పలికాయి వరుస టెస్టు సిరీస్ విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021 ఏడాదిలో ఒక చేదు అనుభవం. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలిసారి నిర్వహించిన డబ్ల్యూటీసీ చాంపిన్‌షిప్ టైటిల్‌ను కివీస్ సొంతం చేసుకుంటే.. దానిని అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓటమి చవిచూసి అభిమానులను తీవ్ర నిరాశకు గురయ్యేలా చేసింది. ఇక టి20 ప్రపంచకప్ 2021 టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఊసురుమనిపించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూడడంతో అభిమానుల ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. కనీసం సెమీస్‌కు చేరకుండానే లీగ్ దశలోనే ఇంటిబాట పట్టడంతో టీమిండియా ఆటతీరును.. ఆటగాళ్లను దుమ్మెత్తిపోశారు. టీమిండియా క్రికెట్లో ఈ ప్రపంచకప్ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్‌లో ఆధిక్యం.. మళ్లీ ఫామ్‌లోకి డబ్య్లూటీసీ చాంపియన్‌షిప్ చేదు అనుభవాన్ని మైమరిపిస్తూ ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా విజృంభించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగు టెస్టుల్లో ఒక డ్రా, రెండు గెలిచిన టీమిండియా 2-1తో స్పష్టమైన ఆధిక్యంలోకి వచ్చింది. చివరి టెస్టును డ్రా చేసుకున్నా చాలు టీమిండియా మరో సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించడానికి. అయితే కరోనా కారణంగా ఐదో టెస్టు మ్యాచ్‌ను ఈసీబీ వాయిదా వేసింది. అయితే ఈ టెస్టు వాయిదాపై విభిన్న వాదనలు వినిపించాయి. ఇంగ్లండ్ సిరీస్ ఓటమి నుంచి తప్పించుకునేందుకే ఇలా చేసిందంటూ టీమిండియా ఫ్యాన్స్ గోల చేశారు. అయితే వచ్చే ఏడాది జూన్‌లో ఈ టెస్టు మ్యాచ్‌ను నిర్వహిస్తామని ఈసీబీ తెలపడంతో వివాదం సద్దుమణిగింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో గెలుచుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమికి కివీస్‌పై ప్రతీకారం తీర్చుకొని అభిమానులకు కాస్త ఊరట కలిగించింది. సౌతాఫ్రికా గడ్డపై అపరూప విజయం ఈసారి ఎలాగైనా సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ గెలవాలనే పట్టుదలతో అడుగుపెట్టిన టీమిండియా సెంచూరియన్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బాక్సింగ్ డే టెస్టుగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సౌతాఫ్రికాపై 113 పరుగుల తేడాతో గెలిచి ప్రొటీస్ గడ్డపై నాలుగో విజయాన్ని అందుకుంది. సెంచూరియన్‌లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని దక్షిణాఫ్రికాను మట్టికరిపించిన టీమిండియా విజయంతోనే ఏడాదిని ముగించడం విశేషం. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి గెలిచినా.. టీమిండియా కల సాకారమైనట్లే. కోహ్లి కెప్టెన్సీ వివాదం: ప్రశాంతంగా సాగిపోతున్న భారత్ క్రికెట్లో బీసీసీఐ, విరాట్ కోహ్లి మధ్య వివాదం 2021లో పెద్ద సంచలనం. టి20 ప్రపంచకప్ తర్వాత ఆ ఫార్మాట్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్నాడు. దీంతో రోహిత్ శర్మకు టి20 బాధ్యతలు అప్పగించింది. అయితే కొన్ని రోజుల తర్వాత వన్డే, టి20లకు వేర్వేరు కెప్టెన్లు ఉండడం మంచిది కాదని బీసీసీఐ అభిప్రాయపడింది. ఈ అంశంమే ఆ తర్వాత వివాదానికి దారి తీసింది. అందుకు అనుగుణంగా కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి రోహిత్‌ను వన్డే సారధిగా నియమించింది. ఈ విషయంలో కోహ్లికి ముందే సమాచారం ఇచ్చామని బీసీసీఐ తెలిపింది. సౌతాఫ్రికా టూర్‌కు బయలుదేరే ఒక్కరోజు ముందు కోహ్లి మీడియా ముందుకు బాంబు పేల్చాడు. వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయమై.. బీసీసీఐ తనకు గంటన్నర ముందు చెప్పిందని.. టి20 కెప్టెన్సీ నుంచి దిగిపోవద్దంటూ తననెవరు ఆపలేదని.. గంగూలీ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదంటూ కుండబద్దలు కొట్టాడు. దీంతో కోహ్లి-బీసీసీఐ వివాదం రచ్చగా మారింది. కోహ్లి వివాదంపై గంగూలీ కూడా మాట దాటవేస్తూ.. ఈ విషయాన్ని బీసీసీఐ చూసుకుంటుందని తెలపడం గమనార్హం. ఇంతలో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు బయలుదేరడంతో వివాదానికి తాత్కాలిక తెర పడింది. క్రికెట్లో సంచలనాలు, ఆధిపత్యం: ►2021 ఏడాదిలో క్రికెట్లో మరెన్నో సంచలనాలు నమోదయ్యాయి. టి20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియా లాంటి చిన్న దేశాలు అద్బుతాలు చేశాయి. ఇక ఆస్ట్రేలియా తొలిసారి పొట్టి ఫార్మాట్లో చాంపియన్‌గా అవతరించగా.. కివీస్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం చూపించింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో వరుసగా మూడు టెస్టుల్లోనూ విజయాలు అందుకొని 3-0 తేడాతో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ►ఈ ఏడాది టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ సంచలనం సృష్టించాడు. టీమిండియాతో జరిగిన ఒక టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఈ ఘనత ఇంతకముందు ఇద్దరి పేరిట మాత్రమే ఉంది. టీమిండియా లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జిమ్ లేఖర్లు మాత్రమే టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో పదికి 10 వికెట్లు తీశారు. తాజాగా ఎజాజ్ పటేల్ ఆ ఫీట్‌ను అందుకొని దిగ్గజాల సరసన నిలిచాడు. ఇక క్రికెట్ బతికున్నంతవరకు ఎజాజ్ పటేల్ పేరు చరిత్ర పుటల్లో నిలవడం ఖాయం. ►ఇక ఐపీఎల్ 2020లో చెత్త ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 2021 ఐపీఎల్ సీజన్లో మాత్రం దుమ్మురేపింది. కేకేఆర్‌తో జరిగిన ఫైనల్లో ధోని సేన 27 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగోసారి ఐపీఎల్ టైటిల్‌ను దక్కించుకుంది. ఓవరాల్‌గా అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టుగా( ముంబై ఇండియన్స్ ఐదుసార్లు తొలిస్థానం) సీఎస్కే రెండో స్థానంలో ఉంది. టోక్యో ఒలింపిక్స్.. ''బంగారు'' నీరజ్ చోప్రా.. భారతావని పులకించినవేళ కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరిగాయి. కోటి ఆశలతో బరిలోకి దిగిన భారత్.. ఈసారైనా మంచి ప్రదర్శనతో ఎక్కువ పతకాలు కొల్లగొడుతుందా లేక మన పద్దతిలో రెండు లేదా మూడు పతకాలు వస్తాయా అనే భావించారు. దీనికి తగ్గట్టుగానే రోజులు గడుస్తున్నాయి.. భారత అథ్లెట్లు మంచి ప్రదర్శన చేసినప్పటికి పసిడి పతకం మాత్రం రాలేదు. ఈసారి కూడా మనవాళ్లు స్వర్ణం లేకుండానే వెనుదిరుగుతారా అని అంతా అనుకున్నారు. కానీ అప్పుడే ఒక అద్భుతం చోటుచేసుకుంది. ఏ మాత్రం అంచనాలు లేని అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రోలో తొలిసారే ఈటెను ఏకంగా 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణం ఖరారు చేసుకున్నాడు. అతని దరిదాపుల్లోకి కనీసం ఒక్కరు కూడా రాలేకపోవడంతో బంగారు పతకం నీరజ్ చోప్రా వశమైంది. స్వతంత్ర భారతావనికి అథ్లెటిక్స్ విభాగంలో తొలి స్వర్ణం అందించడే గాకుండా వ్యక్తిగత విభాగంలో రెండో బంగారు పతకం.. అథ్లెటిక్స్‌లో తొలి పతకం సాధించిన నీరజ్ చోప్రా చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. అతని విజయంతో 130 కోట్ల భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగిపోయాయి. ఇక ఈసారి ఒలింపిక్స్‌లో ఎలాగైనా స్వర్ణం సాధిస్తాననే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన భారత మహిళ షట్లర్ పీవీ సింధు నిరాశపరిచినప్పటికి.. కాంస్యంతో మురిపించింది. భారత ఒలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు(2016లో రజతం) సాధించిన తొలి భారత మహిళ అథ్లెట్‌గా సింధు చరిత్ర సృష్టించింది. ఇక వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాభాయి చాను 49 కేజీల విభాగంలో రజతం సాధించి.. కరణం మళ్లీశ్వరీ తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం సాధించిన మహిళగా మీరాభాయి చరిత్ర లిఖించింది. మహిళల బాక్సింగ్ 49 కేజీల విభాగంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి కాంస్యం గెలిచిన లవ్లీనా బొర్హంగైన్ అందరికి ఆదర్శంగా నిలిచింది. ఇక రెజ్లింగ్‌లో రవికుమార్ దహియా రజతం.. భజరంగ్ పూనియా కాంస్యం గెలిచి రెజ్లింగ్‌లో మనకున్న పట్టను రెట్టింపు చేశారు. హాకీలో పూర్వ వైభవం.. ఒకప్పుడు ఒలింపిక్స్‌లో స్వర్ణయుగం చూసిన భారత హాకీ జట్టు ఆట క్రమంగా మసకబారుతూ వచ్చింది. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం అంచనాలుకు భిన్నంగా టీమిండియా హాకీ పరుషుల జట్టు రాణించింది. ఫైనల్‌కు చేరడంలో విఫలమైనప్పటికి 41 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలిచి హాకికి పునర్వైభవం తెచ్చింది. ఈ విజయంతో భారతీయ అభిమానుల గుండెలు ఉప్పొంగిపోయాయి. ఇక భారత మహిళల హాకీ జట్టు పోరాటం కూడా మరువలేనిది. ఒలింపిక్స్‌లో మహిళల హాకీ విభాగంలో నాలుగోస్థానంలో నిలిచినప్పటికి మన మహిళల పోరాటం అందరికి స్పూర్తిదాయకం. ఇక మొత్తంగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అద్వితీయ ప్రదర్శనతో మెప్పించింది. మొత్తం ఏడు పతకాలతో ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనతో పోటీలను ముగించడం విశేషం. ఇక టోక్యో వేదికగా జరిగిన పారా ఒలింపిక్స్‌లోనూ భారత పారాఅథ్లెట్లు దుమ్మురేపారు. ఐదు స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఇతర క్రీడల్లో వివాదాలు.. ►క్రికెట్‌లాగే ఇతర క్రీడల్లోనూ వివాదాలు చెలరేగాయి. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో(2008లో కాంస్యం, 2012లో రజతం) పతకాలతో మురిపించిన రెజ్లర్ సుశీల్ కుమార్ హత్యకేసులో ఇరుక్కోవడం సంచలనం రేపింది. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో సుశీల్ నేతృత్వంలో జరిగిన దాడిలో యువ రెజ్లర్ సాగర్ మృతి చెందడం కలకలం రేపింది. హత్య ఆరోపణలతో ప్రస్తుతం సుశీల్ కుమార్ తీహర్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. ►చైనా ప్రభుత్వ మాజీ అధికారి తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసిన చైనా టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి ఆచూకీ కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించింది. ఆమె జాడ కనిపెట్టాలంటూ క్రీడాలోకం గొంతెత్తింది. అయితే కొన్ని రోజులకు తాను సురక్షితంగానే ఉన్నానని.. పెంగ్ షువాయి మాట్లాడిని మాటలను వీడియో రూపంలో చైనా ప్రభుత్వం విడుదల చేయడం ఆశ్చర్యం కలిగించింది. అయితే దీనిలో నిజమెంత అనేది ఇప్పటికి తెలియరాలేదు. మరోవైపు పెంగ్ షువాయి ఆచూకీ కనిపెట్టాలని.. ఆమె చేసిన ఆరోపణల్లో నిజాలను తేల్చాలంటూ చైనా ప్రభుత్వాన్ని క్రీడాసంఘాలు డిమాండ్ చేశాయి. దీనికి తూడు పెంగ్ షువాయి కేసు విచారణను పారదర్శకంగా నిర్వహించాలఇ డిమాండ్ చేస్తు.. ఆ దేశంతో పాటు హాంకాంగ్‌లో డబ్ల్యూటీఏ(అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య) టోర్నీలను నిలిపివేసింది. విషాదాలు.. ►ప్రతీ ఏడాదిలాగే 2021లోనూ క్రీడల్లో విషాదాలు నెలకొన్నాయి. భారత అథ్లెటిక్స్‌లో చెరగని ముద్ర వేసిన ''ఫ్లయింగ్ సిఖ్'' మిల్కా సింగ్ ఈ ఏడాది జూన్‌లో కన్నుమూశారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో తృటిలో పతకం చేజార్చుకున్న మిల్కా సింగ్ మృతి పట్ల యావత్ దేశం విచారం వ్యక్తం చేసింది. ►1983 వన్డే ప్రపంచకప్ సాధించిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న యశ్పాల్ శర్మ ఈ ఏడాదే కన్నుమూశారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లి ఇంటికి వచ్చిన కాసేపటికే గుండెపోటుకు గురై మరణించారు. టీమిండియా తరపున యశ్పాల్ శర్మ 37 టెస్టులు, 42 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించారు. ►ఇక భారత హాకీ దిగ్గజాలు ఎంకే కౌషిక్, రవీందర్‌పాల్ సింగ్‌లు ఒకేరోజు కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆసియా క్రీడల బాక్సింగ్ చాంపియన్ డింకూ సింగ్ కూడా ఈ ఏడాదిలోనే కన్నుమూశారు. 2021లో చోటుచేసుకున్న మరిన్ని ముఖ్య విషయాలు: ►భారత్ మహిళల క్రికెట్‌కు గర్వంగా నిలిచిన మిథాలీ రాజ్ ఈ ఏడాది ఒక గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాటర్ నిలిచింది. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లు కలిపి మిథాలీ రాజ్ 321 మ్యాచ్‌ల్లో 10,454 పరుగులు సాధించింది. ►పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈ ఏడాదిలో ఒక సంచలనం నమోదు చేశాడు. ఫుట్‌బాల్ చరిత్రలో అంతర్జాతీయంగా అత్యధిక గోల్స్ చేసిన జాబితాలో రొనాల్డో తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు రొనాల్డో పోర్చుల్ తరపున 184 మ్యాచ్‌ల్లో 115 గోల్స్ చేశాడు. ఇక భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి.. అర్జెంటీనా స్టార్ మెస్సీతో కలిసి 80 అంతర్జాతీయ గోల్స్‌తో ఐదో స్థానంలో నిలవడం విశేషం. ►ఇక బ్యాడ్మింటన్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ అద్భుతం సృష్టించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత షెట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇదే టోర్నీలో లక్ష్యసేన్ కాంస్యం గెలవడం మరో విశేషం. ►జిమ్నాస్టిక్స్‌లో తనదైన ముద్ర వేసిన సిమోన్ బైల్స్ ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో మానసిక, ఆరోగ్య సమస్యలతో తప్పుకోవడం సంచలనం సృష్టించింది. అయితే ఆ తర్వాత బ్యాలెన్స్ బీమ్‌లో బరిలోకి దిగి కాంస్యం గెలిచింది.. ఇక క్రికెటర్లు బెన్ స్టోక్స్, క్రిస్‌గేల్.. మహిళల టెన్నిస్ స్టార్ నయామి ఓసాకా మానసిక ఒత్తిడితో కొంతకాలం ఆటకు బ్రేక్ తీసుకున్నారు. ►టెన్నిస్‌లో ఈ ఏడాది జకోవిచ్‌కు బాగా కలిసి వచ్చింది. ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లో జకోవిచ్ మూడు టైటిళ్లు సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్,ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌ను సొంతం చేసుకున్న జకోవిచ్ ఆఖరిదైన యూఎస్ ఓపెన్‌లో మాత్రం మెద్వదేవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. -
ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డోకు భారత్‌లో అరుదైన గౌరవం
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు విశ్వవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. అతని ఆటకు, క్రేజ్‌కు సెపరేట్ ఫ్యాన్‌బేస్ ఉంటుంది. వయసులో చిన్నవాడైనప్పటికి ఫుట్‌బాల్‌లో మాత్రం చాలా ఎదిగిపోయాడు. మైదానంలో పాదరసంలా కదిలే రొనాల్డో గోల్ కొడుతుంటే మనకు ఏదో జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. అంతలా ఇన్స్పైర్ చేస్తాడే కాబట్టే అతనికి కోట్లలో అభిమానులు ఉన్నారు. ఇక అతన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ఫుట్‌బాల్‌వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి రొనాల్డోకు మన ఇండియాలోనూ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే గోవాలోని పనాజీలో 410 కేజీల బరువు ఉన్న రొనాల్డో కాంస్య విగ్రహాన్ని గోవా మంత్రి మైకెల్ లోబో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనాజీలో రొనాల్డో విగ్రహం ఏర్పాటు వెనుక ఒక కారణం ఉందన్నారు.'' ఇండియాలో రొనాల్డో విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇక్కడి యువత రొనాల్డోను ఆదర్శంగా తీసుకొని ఫుట్‌బాల్‌లో మరింత ముందుకు పోవాలనేది తమ కోరిక. రోజు ప్రాక్టీస్‌కు వచ్చే యువత ఈ విగ్రహాంతో సెల్ఫీలు మాత్రమే దిగకుండా.. అతన్ని చూసి ఇన్స్పైర్ పొంది.. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కలగా పెట్టుకోవాలి. ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. ఫుట్‌బాల్ మైదానాల్లో ప్రాక్టీస్‌కు వచ్చే యువతకు అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత మాది'' అని చెప్పుకొచ్చారు. ఇక రొనాల్డో ప్రస్తుతం పోర్చుగల్ జట్టుతో పాటు మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. -
వికెట్ తీసిన ఆనందంలో సిరాజ్ ఏం చేశాడో తెలుసా!
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ రొనాల్డోను అనుకరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటి సిరాజ్ రొనాల్డోను అనుకరించడం ఏంటని డౌట్ పడొద్దు. విషయంలోకి వెళితే సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడుతున్న సిరాజ్ వాండర్ డుసెన్‌ను ఔట్ చేయడం ద్వారా ఆ గడ్డపై తొలి వికెట్ సాధించాడు. చదవండి: IND Vs SA: బుమ్రా స్టన్నింగ్ డెలివరీ.. అనవసరంగా గెలుక్కున్నాడు ఇన్నింగ్స్ 12.5 ఓవర్ ఐదో బంతిని డుసెన్ డిఫెన్స్ చేయబోయి స్లిప్‌లో ఉన్న రహానేకు క్యాచ్ ఇచ్చాడు. వికెట్ తీశానన్న ఆనందంలో సిరాజ్ ఒక్క నిమిషం రొనాల్డోగా మారిపోయాడు. గోల్ కొట్టిన ప్రతీసారి రొనాల్డో ఇచ్చే హవభావాలు ప్రతీ అభిమానిని ఆకట్టుకుంటుంది. తాజాగా సిరాజ్ కూడా అచ్చంగా రొనాల్డోను దింపేశాడు. మూడు యాంగిల్స్‌లో రొనాల్డో ఫోజును దించిన సిరాజ్‌కు సంబంధించిన ఫోటోను క్రిక్టాకర్ తన ట్విటర్లో షేర్ చేసింది. చదవండి: Test Player Of Year: 'టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' ఎవరు? రేసులో టీమిండియా స్పిన్నర్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికా టీ విరామ సమయానికి 109 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా బౌలర్లలో షమీ 2 వికెట్లు తీయగా.. సిరాజ్, బుమ్రా, శార్దూల్ తలా ఒక వికెట్ తీశారు. SIRAJ 🔥🔥 that celebration 💉🥵 pic.twitter.com/97fxWjhmn5 — FLICK. (@chirutha_18) December 28, 2021 -
'సంవత్సరాలు మారుతున్నాయి.. కానీ సేమ్ ఫీలింగ్'
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా '' డిసెంబర్ 25, 2018.. డిసెంబర్ 25, 2019''.. తాను జరుపుకున్న క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేశాడు.'' సంవత్సరాలు మారుతున్నాయి.. కానీ సేమ్ ఫీలింగ్.. అందరికి మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు'' అని పేర్కొన్నాడు. చదవండి: Naomi Osaka: 'ఇక నుంచి నన్ను అలా పిలవండి' ఇక సచిన్‌తో పాటు పలువురు క్రీడాకారులు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కూడా తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. '' మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు.. మీ జీవితాలు మంచి ఆరోగ్యంతో, సంతోషంతో, జాయ్‌గా సాగిపోవాలని కోరుకుంటున్నా'' అంటూ టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ట్వీట్ చేశాడు. Different years, same feeling! Merry Christmas everyone.🎄🎅 pic.twitter.com/9OjFy003CX — Sachin Tendulkar (@sachin_rt) December 25, 2021 De coração cheio, desejo a todos um Feliz Natal! 🎅🏻🙏🏽❤️ #blessed pic.twitter.com/yCOLAzuhf8 — Cristiano Ronaldo (@Cristiano) December 24, 2021 -
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధించబడే వ్యక్తుల జాబితాలో టీమిండియా కెప్టెన్..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధించబడే టాప్-20 పురుషుల జాబితాలో టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో పరుగుల యంత్రం కోహ్లి 18వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ(8వ స్థానం), క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(12వ స్థానం), బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్(14), బిగ్ బీ అమితాబ్(15) ఉన్నారు. 2021 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక YouGov సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో నిలువగా.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ రెండులో, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మూడో స్థానంలో నిలిచారు. World's Most Admired Men 2021 (1-10) 1. Barack Obama 🇺🇸 2. Bill Gates 🇺🇸 3. Xi Jinping 🇨🇳 4. Cristiano Ronaldo 🇵🇹 5. Jackie Chan 🇨🇳 6. Elon Musk 🇿🇦 7. Lionel Messi 🇦🇷 8. Narendra Modi 🇮🇳 9. Vladimir Putin 🇷🇺 10. Jack Ma 🇨🇳https://t.co/oBV8X1gh6E pic.twitter.com/IedkTP2d7c — YouGov (@YouGov) December 14, 2021 క్రీడాకారుల్లో కోహ్లితో పాటు దిగ్గజ ఫుట్‌బాలర్లు క్రిస్టియానో రొనాల్డో(4), లియోనెల్ మెస్సీ(7)లు ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. ఇక, మహిళల విభాగంలో అత్యంత ఆరాధించే ప్రముఖుల్లో అమెరికా మాజీ ప్రథమ మహిళ, బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా తొలి స్థానంలో నిలువగా.. హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ, క్వీన్ ఎలిజబెత్-2 వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా(10), మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్(13), ఇన్ఫోసిస్ ఛైర్పర్సన్ సుధా మూర్తి(14)లకు చోటు దక్కింది. YouGov సంస్థ ఈ జాబితాను మంగళవారం(డిసెంబర్ 14) విడుదల చేసింది. చదవండి: వన్డే కెప్టెన్సీపై కోహ్లి వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన బీసీసీఐ.. ముదురుతున్న వివాదం -
రొనాల్డో కొత్త చరిత్ర.. ఎవరికి అందనంత ఎత్తులో
Cristiano Ronaldo Histroy 801 Goal.. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్.. మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. తన కెరీర్లో రొనాల్డో 800వ గోల్ నమోదు చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్, ఆర్సినల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో ఈ ఘనత అందుకున్నాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో రెండు గోల్స్ నమోదు చేసిన రొనాల్డో 801 గోల్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో నిలవడం విశేషం. ఇప్పటివరకు అన్ని మ్యాచ్‌లు కలిపి 1138 వరకు ఆడిన రొనాల్డో.. క్లబ్ లీగ్స్ తరపున 485 గోల్స్, పోర్చుగల్ తరపున 115, కాంటినెంటల్‌లో 150, వివిధ మేజర్ కప్ టోర్నీల్లో 51 గోల్స్ సాధించాడు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో బాడీగార్డ్స్‌గా వ్యవహరిస్తున్నదెవరో తెలుసా! ఇక ఆఖరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ 3-2 తేడాతో ఆర్సినల్పై ఘన విజయాన్ని అందుకుంది. మాంచెస్టర్ యునైటెడ్ తరపున బ్రూనో ఫెర్నాండ్స్ ఆట 44వ నిమిషంలో, క్రిస్టియానో రొనాల్డో(ఆట 52వ నిమిషం, 70వ నిమిషంలో) గోల్స్ సాధించగా.. ఆర్సినల్ తరపున స్మిత్ రోవ్ ఆట 13వ నిమిషంలో.. ఓడీగార్డ్ ఆట 54వ నిమిషంలో గోల్ సాధించారు. 💯💯💯💯💯💯💯💯@Cristiano is out of this world 🌍#MUFC pic.twitter.com/UaQjnCUNH0 — Manchester United (@ManUtd) December 2, 2021 -
రొనాల్డో బాడీగార్డ్స్‌గా వ్యవహరిస్తున్నదెవరో తెలుసా!
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన రొనాల్డోకు విశ్వవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పోర్చుగల్ జాతీయ జట్టుతో పాటు.. మంచెస్టర్ యునైటెడ్ లీగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సాధారణంగా రొనాల్డో ఎక్కడికైనా వెళ్తున్నాడనే సమాచారం వస్తే చాలు.. వేల సంఖ్యలో అభిమానులు గూమికడతారు. మరి వారి నుంచి రొనాల్డోకు రక్షణ కల్పించడానికి బాడీగార్డులు అవసరం చాలా ఉంది. అయితే రొనాల్డోకు బాడీగార్డ్స్‌గా వ్యవహరిస్తున్న సెర్జియో, జార్జ్ల గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. చదవండి: Lieonal Messi: మెస్సీ చరిత్ర.. 34 ఏళ్ల వయసులో ఏడోసారి పోర్చుగల్‌కు చెందిన సెర్జియో, జార్జ్ ఇద్దరు కవల పిల్లలు. చిన్నప్పటి నుంచి సైన్యంలో పని చేయాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకు తగ్గట్లే.. భద్రతా విభాగంలో కీలక పదవులు నిర్వహించారు. ఆ తర్వాత ఇద్దరూ పోర్చుగల్ పోలీసు విభాగంలో చేరారు. పోర్చుగల్‌లో ప్రముఖులకు భద్రత.. బాధ్యత పోలీసులదే. అలా ఈ ఇద్దరు సోదరులు రొనాల్డో.. వారి కుటుంబానికి ముఖ్య భద్రతాధికారులుగా పని చేస్తున్నారు. రొనాల్డోతో తరుచూ బయట కనపడే ఈ ఇద్దరు అన్నదమ్ములు.. సూటు, బూటు వేసుకొని అందమైన మోడల్స్‌లాగా కనిపిస్తుంటారు. చాలా సాఫ్ట్‌గా కనిపించే అన్నదమ్ములు రొనాల్డోకు అన్ని వేళలా రక్షణగా ఉంటారు. ఎలాంటి స్థితిలో అయినా పోరాడే లక్షణాలు వీరిద్దరికి ఉన్నాయి. తమ తెలివి తేటలు ఉపయోగించి రక్షణ బాధ్యతలు చూస్తుంటారు. అందుకే రొనాల్డోకు వారిద్దరిపై అపారమైన విశ్వాసం ఉంటుంది. చదవండి: గోల్ కొట్టే అవకాశం.. ప్రత్యర్థి ఆటగాడికి గాయం -
రొనాల్డో గోల్ కొట్టలేదని ఏడ్చేసింది.. హత్తుకొని జెర్సీ గిఫ్ట్‌గా
Ronaldo Given Jersey As Gift To Irish Girl.. పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో క్రేజ్ ఎంతలా ఉంటుందో ప్రత్యేంగా చెప్పనవసరం లేదు. తాజాగా రొనాల్డో గోల్ కొట్టలేదని ఏడ్చిన చిన్నారిని హత్తుకొని జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చి అభిమానుల మనసు కొల్లగొట్టాడు. విషయంలోకి వెళితే.. ఫిపా వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా శుక్రవారం పోర్చుగల్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ఆధ్యంతం పోటాపోటీగా సాగడంతో నిర్ణీత సమయంలో ఇరుజట్లు ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాయి. చదవండి: FIFA 2022: ప్రపంచకప్‌కు బ్రెజిల్ అర్హత.. తొలి దక్షిణ అమెరికా జట్టుగా కాగా ఈ మ్యాచ్ చూడడానికి వచ్చిన ఐర్లాండ్ అమ్మాయి రొనాల్డోకు వీరాభిమాని. అయితే మ్యాచ్‌లో పోర్చుగల్ కెప్టెన్ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాడు. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్లోకి పరిగెత్తుకొచ్చిన ఆమె రొనాల్డొను పట్టుకొని ఏడ్చింది. రొనాల్డో ఆమెను హత్తుకొని ఓదార్చి తన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చి సంతోషపరిచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పోర్చుగల్ తన తర్వాతి మ్యాచ్‌ను సెర్బియాతో ఆడనుంది. చదవండి: Wrestrler Nisha Dahiya: 'నేను చనిపోలేదు.. అది ఫేక్ న్యూస్' @Cristiano con un niño después del partido. Cristiano le dio su camiseta a la chica fan de Irlanda después de tiempo completo. pic.twitter.com/w8ArtK6AyR — Elia M. V. (@emariahn) November 11, 2021 -
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన క్రిస్టియానో రొనాల్డొ..
Cristiano Ronaldo To Become Dad To Twins Again: స్టార్ ఫుట్‌బాలర్, పోర్చుగీస్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అభిమానులకు శుభవార్త చెప్పాడు. నాలుగోసారి తండ్రి కాబోతోన్నట్లు ప్రకటించాడు. మరోసారి కవలలకు తండ్రి కాబోతున్నానని సోషల్‌మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇప్పటికే ఈ స్టార్ ప్లేయర్‌కు నలుగురు పిల్లలు(క్రిస్టియానో రొనాల్డొ జూనియర్(11), ఈవా, మెటియో(కవలలు), అలానా మార్టినా(4)) ఉన్నారు. కాగా, తన భాగస్వామి జార్జినా రోడ్రిగ్జ్ గర్భవతి అని, కవలలు పుట్టబోతున్నారని రొనాల్డొ గురువారం ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు. చదవండి: టీమిండియాకు హెల్ప్ కావాలా..? నేను రెడీ అంటున్న 'జార్వో' View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) -
David Warner: వీటిని పక్కకు పెట్టొచ్చా.. రొనాల్డోకు మంచిదైతే నాకూ మంచిదే..
David Warner tries to do a Cristiano Ronaldo at presser Goes Viral: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. అక్టోబరు 28 నాటి మ్యాచ్‌లో 42 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్రపంచకప్ టోర్నీకి ముందు ఐపీఎల్-2021 సీజన్లో తనకు ఎదురైన చేదు అనుభవాలు, విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడని అభిమానులు సంబరపడుతున్నారు. అయితే, వార్నర్ మాత్రం ఫామ్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించని, బౌలర్లపై ఒత్తిడి పెంచి పరుగులు రాబట్టడంపైనే దృష్టి పెడతానని వ్యాఖ్యానించాడు. అది అస్సలు సాధ్యం కాదు ఈ మేరకు అర్ధ సెంచరీ సాధించిన వార్నర్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘విమర్శకుల నోళ్లు మూయించగలమా? అదైతే అస్సలు సాధ్యం కాదు. ఆటలో ఇవన్నీ సహజం. బాగా ఆడినపుడు ప్రశంసలు... అలా జరగని పక్షంలో విమర్శలు ఉంటాయి. అయితే, వీటన్నింటినీ పట్టించుకోకుండా... ముఖంపై చిరునవ్వు చెదరనీయకకుండా పూర్తి విశ్వాసంతో ముందుకు సాగాలి’ అని చెప్పుకొచ్చాడు. క్రిస్టియానోకు మంచిదైతే.. నాకూ మంచిదే కదా ఇక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భాగంగా వార్నర్ ప్రవర్తించిన తీరు ఆసక్తికరంగా మారింది. యూరో ఛాంపియన్షిప్ ప్రెస్ మీట్ సందర్భంగా పోర్చుగల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో.. తనకు ఎదురుగా ఉన్న కోక్ బాటిళ్లను పక్కకుపెట్టి, మంచి నీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన సంగతి తెలిసిందే. వార్నర్ సైతం గురువారం ఇదే తరహాలో వ్యవహరించాడు. ‘‘వీటిని పక్కకు పెట్టవచ్చా’’ అంటూ తన ముందున్న కోకా కోలా బాటిళ్లను తీసి కిందపెట్టాడు. అంతలోనే ఓ వ్యక్తి వచ్చి.. బాటిళ్లను టేబుల్ మీద పెట్టాల్సిందిగా సూచించాడు. ఇందుకు నవ్వుతూ సమాధానమిచ్చిన వార్నర్... ‘‘ఓహో అక్కడే పెట్టాలా.. సరే’’ అన్నాడు. ఆ తర్వాత... ‘‘ఒకవేళ క్రిస్టియానోకు ఇది మంచిదైతే.. నాకు కూడా మంచిదే’’అంటూ చమత్కరించాడు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆసీస్.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా రోనాల్డో కోక్ వీడియో తర్వాత కోకా కోలా కంపెనీకి భారీ స్థాయిలో నష్టం జరిగిన సంగతి తెలిసిందే. వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. చదవండి: టీమిండియా క్రికెటర్‌కు డబుల్ ధమాకా.. కవల పిల్లలు జననం pic.twitter.com/JXSFYWLKkr — Thakur (@hassam_sajjad) October 28, 2021 View this post on Instagram A post shared by ICC (@icc) -
ఐపీఎల్‌పై ఆసక్తి చూపుతున్న క్రిస్టియానో రొనాల్డో జట్టు..!
Manchester United Owners Interested To Bid For Two IPL New Franchises: ఐపీఎల్-2022లో పాల్గొనే రెండు కొత్త జట్ల కోసం బీసీసీఐ టెండర్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ప్రపంచంలోనే సంపన్నమైన ఫుట్‌బాల్ క్లబ్‌లలో ఒకటైన మాంచెస్టర్ యునైటెడ్.. కొత్త ఐపీఎల్ జట్లలో ఒక దాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం క్లబ్ యాజమాన్యమైన గ్లేజర్ కుటుంబం టెండర్ పత్రాలు సైతం కొనుగోలు చేసిందని సమాచారం. టెండర్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 20తో ముగినప్పటికీ.. సదరు క్లబ్ కోసం బీసీసీఐ చివరి తేదీని సైతం పొడిగించిందని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మాంచెస్టర్ క్లబ్ కొత్త ఐపీఎల్ జట్టును చేజిక్కించుకుంటే.. డబ్బుతో పాటు ఐపీఎల్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని బీసీసీఐ భావిస్తుంది. కాగా, స్టార్ ఫుట్‌బాలర్, పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కొత్త ఫ్రాంచైజీల రేసులో అహ్మదాబాద్, లక్నో, గౌహతి, కటక్, ఇండోర్, ధర్మశాల వంటి నగరాలు ముందు వరుసలో ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్, టోరెంట్ ఫార్మా, అరబిందో ఫార్మా, ఆర్పి-సంజీవ్ గోయెంకా గ్రూప్, హిందుస్థాన్ టైమ్స్ మీడియా, జిందాల్ స్టీల్ వంటి దేశీయ కంపెనీలు పోటీపడుతున్నాయి. వీటితో పాటు విదేశీ సంస్థలు కూడా టెండర్ల ప్రక్రియలో పాల్గొన వచ్చని బీసీసీఐ ప్రకటించిన నేపథ్యంలో మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ఐపీఎల్ కొత్త జట్ల కొనుగోలు రేసులో నిలిచినట్లు తెలుస్తోంది. చదవండి: సండే బిగ్ మ్యాచ్.. మీరు ఒత్తిడిలో? మరి నా పరిస్థితి! -
Cristiano Ronaldo: చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో..
Cristiano Ronaldo Creates History By Scoring 10th International Hat Trick: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా మంగళవారం లక్సెంబర్గ్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించి, తన జట్టును 5-0 తేడాతో గెలిపించాడు. ఈ క్రమంలో అతను అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక హ్యాట్రిక్ గోల్స్(10 సార్లు) సాధించిన తొలి ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా రొనాల్డో తన కెరీర్లో 58 హ్యాట్రిక్‌లు సాధించి, సమకాలీన ఫుట్‌బాలర్స్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. కాగా, రొనాల్డో ఈ ఏడాది పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో అత్యధిక మ్యాచ్‌లు(182), అత్యధిక గోల్స్(115), అత్యధిక అంతర్జాతీయ హ్యాట్రక్స్(10) వంటి రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. చదవండి: T20 World Cup 2021: ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై టీమిండియా జెర్సీ.. చరిత్రలో తొలిసారి -
‘పది హ్యాట్రిక్కుల’ మొనగాడు.. అదిరిపోయే డీల్
క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్ చరిత్రలో ఈ పేరు ఒక సంచలనం. కనివిని ఎరుగని రీతిలో పదిసార్లు ఇంటర్నేషనల్ హ్యాట్రిక్ గోల్స్ సాధించి సంచలనానికి తెర తీశాడు ఈ ఫుట్‌బాల్ మొనగాడు. యూరోపియన్ క్వాలిఫైయర్స్(UEFA Champions League) టోర్నీలో భాగంగా.. మంగళవారం పోర్చుగల్ తరపున రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో లగ్జెంబర్గ్ 5-0 తేడాతో చిత్తుగా ఓడింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ భారీ బిజినెస్ డీల్తోనూ వార్తల్లోకెక్కాడు మరి. సింగపూర్ వ్యాపారదిగ్గజం, వాలెన్షియా(స్పెయిన్) ఫుట్‌బాల్ క్లబ్ ఓనర్ పీటర్ లీమ్కి రొనాల్డోకి చాలాకాలంగా దోస్తీ ఉంది. గతంలో లిమ్‌కు చెందిన మింట్ మీడియా ద్వారా రొనాల్డో చిత్రాల వ్యాపారం కూడా జోరుగా సాగించింది. ఈ తరుణంలో జూజూజీపీ అనే అనే ప్లాట్‌ఫామ్ కోసం వీళ్లిద్దరూ మళ్లీ చేతులు కలిపారు. ఫుట్‌బాల్, టెక్నాలజీ, కమ్యూనికేషన్.. ఈ మూడింటి ఆధారంగా ఈ ప్లాట్‌ఫామ్ పని చేస్తుండడం విశేషం. ఇందుకోసం భారీగా రెమ్యునరేషన్ (తన ఏడాది సంపాదనలో 30 శాతం విలువ చేసే రెమ్యునరేషన్!) తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఇకపై ఫుట్బాల్ని జనాలు చూసే విధానం మారుతుంది’ అంటూ ఓ స్టేట్మెంట్ను జాయింట్‌గా రిలీజ్ చేశారు రొనాల్డో-లీమ్. పోర్చ్‌గల్ కెప్టెన్ అయిన 36 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో.. ఈమధ్య కాలంలో వరుస రికార్డులు సృష్టిస్తున్నాడు. కెరీర్ మొత్తంగా యాభై ఎనిమిదిసార్లు హ్యాట్రిక్ గోల్స్, పదిసార్లు ఇంటర్నేషనల్ హ్యాట్రిక్ గోల్స్ ఫీట్ సాధించాడు. అంతేకాదు ఫిఫా లెక్కల ప్రకారం.. 182 మ్యాచ్‌ల్లో 115 గోల్స్ సాధించి అత్యధిక గోల్స్ వీరుడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు సంపాదనలోనూ సమవుజ్జీగా భావించే అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీని దాటేసి.. 2021-22 సీజన్‌కు గాను ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫుట్‌బాలర్‌గా ఫోర్బ్స్ జాబితాలో నిలిచాడు. ఏడాదికి రొనాల్డో 922 కోట్ల రూపాయలు అర్జిస్తున్నట్లు ఫోర్బ్స్ గణాంకాలు చెప్తున్నాయి. Unlucky 😢 What a bicycle kick 😭#CristianoRonaldo #CR7 #bicyclekick pic.twitter.com/18EVZ34BWo — Habibulla Sonet (@HabibullaSonet) October 12, 2021 చదవండి: ఐస్‌బాత్‌లో రొనాల్డొ చిందులు.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే! -
ఐస్‌బాత్‌లో రొనాల్డొ చిందులు.. ధర 50వేల యూరోలు
Cristiano Ronaldo... క్రిస్టియానో రొనాల్డొ.. ఫుట్‌బాల్‌లో ఈ పేరుకున్న క్రేజ్ వేరు. 36 ఏళ్ల వయసులోనూ మంచి ఫిజిక్ మెయింటెన్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. మైదానంలో బరిలోకి దిగాడంటే పాదరసంలా కదులుతూ గోల్స్‌తో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాడు. తాజాగా ఈ పోర్చుగల్ స్టార్ 50వేల యూరోల విలువ(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.51 లక్షలు) కలిగిన ఐస్‌బాత్ టబ్‌లో చిందులు వేయడం వైరల్‌గా మారింది. ఒక ఐస్‌బాత్ టబ్‌కు ఇంత ధర అని మాత్రం ఆశ్చర్యపోకండి. రొనాల్డొ 36 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా కనిపించడానికి ఈ ఐస్‌బాత్ టబ్ ఒక కారణమట. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డొ ఘనత.. 13 ఏళ్ల తర్వాత ప్రఖ్యాత పత్రిక ది సన్ నివేదిక ప్రకారం.. తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి క్రియోథెరఫీ చాంబర్‌ను ఏర్పాటు చేసిన ఐస్‌బాత్ టబ్‌ను రొనాల్డొ ఇటలీ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నాడు. 50 వేల యూరోల విలువ కలిగిన ఈ ఐస్‌బాత్ స్పెషాలిటీ ఏంటంటే.. మానవ కణజాలం చికిత్స , పునరుద్ధరణకు సహాయపడటానికి -200C కంటే తక్కువ ఉష్ణోగ్రతను వర్తింపజేస్తుంది. కాగా ఐస్‌బాత్‌లో దిగాలంటే బేస్‌బాల్ ఆటలో ఉపయోగించే మిట్స్ ఆకారంలో ఉన్న దానిని ధరించాలి. ఆ తర్వాత క్రియో థెరఫీ చాంబర్లోకి లిక్విడ్ నైట్రోజన్‌ను పంపుతారు. ఆ లిక్విడ్ వ్యక్తి యొక్క శరీరాన్ని మొత్తం 3 నిమిషాల్లో కూల్ చేసేస్తుంది. ఈ సమయంలో శరీరం మొత్తం హాయిగా ఉంటూ మరింత ఫిట్నెస్ వచ్చేలా చేస్తుంది. ఈ చాంబర్లో ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉంటే ప్రమాదమని కొందరు హెచ్చరిస్తే.. మరికొందరు మాత్రం ఈ ఐస్‌బాత్ ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణను పెంచడంతో పాటురోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా రొనాల్డొ తన ఫిట్నెస్ను మెరుగుపరచుకోవడం కోసం అంత ధర కలిగిన ఐస్‌బాత్‌లో చిందులు వేయడం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే జూవెంటస్ నుంచి మాంచెస్టర్ యునైటెడ్‌కు మారిన రొనాల్డొ తాజాగా ప్రీమియర్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. చదవండి: Lionel Messi: స్టార్ ఫుట్‌బాలర్‌కు చేదు అనుభవం.. హోటల్ గదిలోకి చొరబడి..! -
రొనాల్డొ ఘనత.. 13 ఏళ్ల తర్వాత
Cristiano Ronaldo Won Premier League Player Of Month Award.. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డొ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సెప్టెంబర్ నెలకు గాను '' ప్రీమియర్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్'' అవార్డును దక్కించుకున్నాడు. మాంచెస్టర్ సిటీ డిఫెండర్ జోవో క్యాన్సెలో, చెల్సియా ఆంటోనియో రుడిగర్, న్యూకాజిల్‌కు చెందిన అలన్ సెయింట్-మాక్సిమిన్, లివర్‌పూల్ ఫార్వర్డ్ మొహమ్మద్ సలా, వాట్ఫోర్డ్ ఆటగాడు ఇస్మాయిలా సార్‌తో పోటీపడిన రొనాల్డో ఈ అవార్డు సాధించాడు. కాగా రొనాల్డొ ఖాతాలో ఇది ఐదో ప్రీమియర్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ కాగా అన్నీ మాంచెస్టర్ యునైటెడ్ తరపునే గెలవడం విశేషం. జువెంటస్ నుంచి మాంచెస్టర్ యునైటెడ్‌కు మారాకా రొనాల్డొ ఆరు మ్యాచ్‌ల్లో 5 గోల్స్ చేశాడు. ఈ ఐదింటిలో మూడు గోల్స్ సెప్టెంబర్ నెలలో వచ్చాయి. తన డెబ్యూ మ్యాచ్ న్యూ కాసిల్తో జరిగిన పోరులో రెండు గోల్స్ చేసిన రొనాల్డో ఆ తర్వాత ఓల్ గున్నార్ టీమ్‌తో జరిగిన పోరులో మరో గోల్‌తో మెరిశాడు. ఇంతకముందు రొనాల్డో 2006 నవంబర్, డిసెంబర్ నెలకు గాను.. ఆ తర్వాత 2008 జనవరి, మార్చి నెలకుగానూ రొనాల్డొ మాంచెస్టర్ యునైటెడ్ తరపున ఈ అవార్డు అందుకున్నాడు. తాజాగా 13 ఏళ్ల గ్యాప్ అనంతరం రొనాల్డొ మాంచెస్టర్ యునైటెడ్ తరపున అవార్డు గెలుచుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఆర్సెనల్ బాస్ మైకెల్ ఆర్టెటా సెప్టెంబర్ నెలకు గానూ మేనేజర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. Who else? ✨ Your @EASPORTSFIFA Player of the Month is: @Cristiano 🔴 ⚪️ ⚫️#PLAwards pic.twitter.com/tgkoLkiTuj — Premier League (@premierleague) October 8, 2021 -
డ్రా అనుకున్న దశలో సూపర్ గోల్.. షర్ట్ విప్పి రచ్చరచ్చ
Cristiano Ronaldo Stunning Goal.. పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డొ సూపర్ గోల్‌తో మెరిశాడు. మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డొ ఆట ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా గోల్‌తో మెరిసి జట్టుకు విజయం అందించాడు. అనంతరం షర్ట్ విప్పిన రొనాల్డొ గ్రౌండ్ మొత్తం కలియదిరుగుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. చాంపియన్స్‌లీగ్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా విల్లార్ రియల్‌తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ 2-1 తేడాతో గెలుపొందింది. కాగా ఆట 53వ నిమిషంలో పాకో అల్కాసర్ తొలి గోల్ కొట్టి యునైటెడ్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే ఏడు నిమిషాల వ్యవధిలో విల్లార్ రియల్ ఆటగాడు అలెక్స్ టెల్లిస్ గోల్ చేసి స్కోరును సమం చేశాడు. చదవండి: Viral Video: పారిస్ దద్దరిల్లింది.. పీఎస్జీ తరఫున తొలి గోల్ చేసిన మెస్సీ ఇక చివరివరకు మరో గోల్ రాకపోవడంతో మ్యాచ్ డ్రా అయితుందని అంతా భావించారు. విల్లార్ రియల్ గోల్‌కీపర్ యునైటెడ్ ఆటగాళ్లు గోల్ కొట్టకుండా చక్కగా నిలువరిస్తున్నాడు. అయితే రొనాల్డొ ఇక్కడే మ్యాజిక్ చేశాడు. 45 డిగ్రీల కోణంలో రొనాల్డొ హెడర్‌తో కొట్టిన బంతి నేరుగా గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. ఇంకేముంది రొనాల్డొ తన సంబరాలను షురూ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Incase you missed Ronaldo goal #MANVIL pic.twitter.com/Drel8Gpyqr — 🌟 VARANE🌟 (@Saif07799953) September 29, 2021 -
సంపాదనలో మెస్సీని దాటేశాడు.. ఏడాదికి 922 కోట్లు అర్జిస్తున్నాడు
న్యూజెర్సీ: 2021-22 సీజన్‌కు గాను ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డొ అత్యధికంగా ఏడాదికి 922 కోట్లు(125 మిలియన్ డాలర్లు) అర్జిస్తూ టాప్‌లో నిలిచాడు. ఇటీవలే జువెంటస్ క్లబ్‌ను వదిలి మాంచెస్టర్ యునైటెడ్‌కు బదిలీ అయిన సీఆర్7.. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ(811 కోట్లు)ని రెండో స్థానానికి నెట్టి టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. జీతభత్యాల ద్వారా 70 మిలియన్ డాలర్లు పొందే రొనాల్డొ.. కమర్షియల్ డీల్స్ రూపేనా మరో 55 మిలియన్ డాలర్లు జేబులో వేసుకుంటున్నాడు. మరోవైపు రొనాల్డొ సమవుజ్జీ అయిన మెస్సీ.. జీతం ద్వారా 75 మిలియన్ డాలర్లు, ఇతర ఎండార్స్మెంట్ల రూపేనా మరో 35 మిలియన్ డాలర్లు అర్జిస్తున్నాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాతి స్థానాల్లో బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్మార్(95 మిలియన్ డాలర్లు), టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్(90 మిలియన్ డాలర్లు), ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్(65 మిలియన్ డాలర్లు), ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్(70 మిలియన్ డాలర్లు) ఉన్నారు. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. మరో దేశానికి వలస -
మాంచెస్టర్‌లో కొత్త చరిత్ర.. రెండు పెద్ద తలలు ఇక్కడే
మాంచెస్టర్: ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ సిటీకి కొత్త కళ వచ్చింది. క్రీడల్లో వేర్వేరు ఆటలకు సంబంధించిన రెండు పెద్ద తలలు ఇక్కడ అడుగుపెట్టడంతో అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. విషయంలోకి వెళితే ఒకరు క్రికెట్లో మెషిన్‌గన్ అయితే.. మరొకరు ఫుట్‌బాల్‌లో కింగ్‌గా పేరుపొందారు. వారే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. మరొకరు పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో రెండు జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో నేటి నుంచి జరగనుంది. ఈ సందర్భంగా టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్‌ను ఆరంభించింది. చదవండి: T20 World Cup 2021: విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు ఇటీవలే 12 ఏళ్ల విరామం తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్లో చేరిన క్రిస్టియానో రొనాల్డో ఓల్డ్ ట్రాఫర్డ్లోనే న్యూకాసిల్ యునైటెడ్‌తో మ్యాచ్ ఆడనున్నాడు. ఈ సందర్భంగా లంకాషైర్ క్రికెట్ వినూత్న రీతిలో ట్వీట్ చేసింది. కోహ్లి, రొనాల్డోలు ఒక దగ్గరే ఉన్నారు. వారిద్దిర జాయింట్ ప్రాక్టీస్ సెషన్‌ను మీకు చూడాలని ఉందా అంటూ రాసుకొచ్చింది. దీనిపై మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ స్పందింస్తూ.. వన్ సిటీ.. టూ గోట్స్ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇక టీమిండియా ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. టీమిండియా ఈ మ్యాచ్ డ్రా చేసుకున్న సిరీస్ సొంతం అవుతుంది. అయితే ఇంగ్లండ్ మాత్రం చివరి టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. చదవండి: Messi VS Pele: 'నాకు అతనితో పోలికేంటి'.. దెబ్బకు దెబ్బ తీశాడు One city, two GOATs 😉 — Manchester United (@ManUtd) September 9, 2021 -
Cristiano Ronaldo: ప్రత్యర్ధి ఆటగాడి చెంప చెల్లుమనిపించాడు, ఆ తర్వాత..?
పోర్చుగల్: దిగ్గజ ఫుట్‌బాలర్, పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఫిఫా ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ చివరి నిమిషంలో రెండు గోల్స్ సాధించి తన జట్టును గెలిపించాడు. ఈ రెండు గోల్స్‌తో రొనాల్డో అంతర్జాతీయ గోల్స్ సంఖ్య 111కు చేరింది. దీంతో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇరాన్ దిగ్గజ ఆటగాడు అలీ దాయ్ (109)ను దాటి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. How is this not a red card for Mr Influencer Ronaldo?pic.twitter.com/jZcvvUME2g — Edmund 💉 (@EdmundOris) September 1, 2021 ఇదిలా ఉంటే, ఇదే మ్యాచ్‌లో రొనాల్డో చేసిన ఓ పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఆట ప్రారంభమైన 15వ నిమిషంలో పోర్చుగల్‌కు పెనాల్టీ లభించింది. ఈ పెనాల్టీ కిక్‌ను రొనాల్డో తీసుకున్నాడు. అయితే, బంతిని కిక్ చేయడానికి పొజిషన్లో పెట్టుకున్న సమయంలో ఐర్లాండ్ డిఫెండర్ ఓషియా దాన్ని కాలితో తన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన రొనాల్డో అతడి భుజంపై బలంగా కొట్టాడు. రొనాల్డో కొట్టిన దెబ్బకు ఓషియా కాసేపు ఓవరాక్షన్ చేశాడు. రొనాల్డోకు అంపైర్ రెడ్ కార్డ్ వస్తుందని నానా డ్రామా చేశాడు. అయితే ఈ తతంగాన్ని రిఫరి గమనించకపోవడంతో రొనాల్డో రెడ్ కార్డ్ బారి నుంచి తప్పించుకున్నాడు. ఒకవేళ రొనాల్డోకి రెడ్ కార్డు చూపించి ఉంటే.. అతను మైదానం వీడాల్సి వచ్చేది. అప్పుడు చివర్లో రెండు గోల్స్ కొట్టే అవకాశాం ఉండేది కాదు. కాగా, మైదానంలో ప్రత్యర్ధులపై ఇలా దురుసుగా ప్రవర్తించడం సీఆర్7కు కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగా అతను దాడులకు పాల్పడి మైదానం వీడాడు. రొనాల్డో దాడులు ఆటగాళ్ల వరకే పరిమితం అనుకుంటే పొరబడ్డట్టే. ఈ మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ రిఫరీలను కూడా వదిలిపెట్టలేదు. వారిపై కూడా దాడులకు దిగి అప్రతిష్టపాలయ్యాడు. చదవండి: అన్నీ మాకు సానుకూలాంశాలే, టీమిండియాను కచ్చితంగా ఓడిస్తాం..పాక్ కెప్టెన్ ధీమా -
రొనాల్డో సంచలనం.. ఫుట్‌బాల్‌లో కొత్త చరిత్ర
Cristiano Ronaldo.. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కొత్త చరిత్ర సృష్టించాడు. ఫుట్‌బాల్ చరిత్రలో దేశం తరపున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసి రొనాల్డో తొలిస్థానానికి దూసుకెళ్లాడు. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో భాగంగా బుధవారం రాత్రి రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో రెండు గోల్స్ చేయడం ద్వారా ఈ రికార్డును అందుకున్నాడు. ప్రస్తుతం ఫిపా లెక్కల ప్రకారం రొనాల్డో 180 మ్యాచ్‌లలో 111 గోల్స్‌తో టాపర్‌గా ఉన్నాడు. ఇరాన్‌కు చెందిన అలీ దాయ్ 149 మ్యాచ్‌లలోనే 109 గోల్స్ సాధించి రెండో స్థానంలో, మలేషియాకు చెందిన మొక్తర్ దహరి 142 మ్యాచ్‌లలో 89 గోల్స్‌తో మూడోస్థానంలో ఉన్నాడు. ఇదే మ్యాచ్ ద్వారా పోర్చుగల్ తరపున అత్యధిక మ్యాచ్‌లు (180) ఆడిన సెర్జియో రామోస్ రికార్డును రొనాల్డో సమం చేశాడు. చదవండి: మాంచెస్టర్ యునైటెడ్‌కు రొనాల్డో.. 12 ఏళ్ల తర్వాత ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మ్యాచ్ 15వ నిమిషంలో వచ్చిన పెనాల్టీని రొనాల్డో గోల్‌గా మలచలేకపోయాడు. అయితే 45వ నిమిషంలో ఐర్లాండ్ ఆటగాడు ఇగాన్ గోల్ చేసి జట్టుకు ఆధిక్యత తీసుకొని వచ్చాడు. రెండో అర్ద భాగంలో ఐర్లాండ్ గట్టి పోటీని ఇచ్చింది. పోర్చుగల్ జట్టు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా రొనాల్డో తన మ్యాజిక్‌ను చూపించాడు. ఆట 89వ నిమిషంలో క్రిస్టియానో రొనాల్డో హెడర్‌తో గోల్ కొట్టి పోర్చుగల్‌కు తొలి గోల్‌ను అందించాడు. అదననపు సమయం ఆట(90+6) నిమిషంలో రొనాల్డో మరో గోల్ కొట్టడంతో 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో ఆఖరి నిమిషాల్లో రెండు గోల్స్ చేసి 2-1తో పోర్చుగల్ విజయం సాధించింది. ఇక తన కెరీర్లో ఆఖరి 15 నిమిషాల్లో రొనాల్డో 33 గోల్స్ చేయడం విశేషం. ఇక రొనాల్డో ఇటీవలే 12 ఏళ్ల విరామం తర్వాత జూవెంటస్ క్లబ్ నుంచి మాంచెస్టర్ యునైటెడ్‌కు మారిన సంగతి తెలిసిందే. చదవండి: రొనాల్డో రికార్డ్‌ను బద్దలు కొట్టిన మెస్సీ.. Ronaldo has now scored the most international goals in history pic.twitter.com/sAnkKOB2pX — RedAlvin (@RedAlvin4) September 1, 2021 -
మాంచెస్టర్ యునైటెడ్‌కు రొనాల్డో.. 12 ఏళ్ల తర్వాత
Cristiano Ronaldo.. పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డొ 12 ఏళ్ల తర్వాత మాంచెస్టర్ యునైటెడ్‌కు తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు మాంచెస్టర్ యునైటెడ్ రెండేళ్ల కాలానికి గానూ 25 మిలియన్ యూరోస్కు(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 216 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది. 2018 నుంచి జూవెంటెస్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డొ బాలన్ డీఓర్ అండ్ చాంపియన్స్ లీగ్ టైటిల్లో జూవెంటస్ తరపున తన చివరి మ్యాచ్‌ను ఆడేశాడు. ఇక 18 ఏళ్ల వయసులో 2003లో మాంచెస్టర్ యునైటెడ్‌కు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన రొనాల్డొ 2009 వరకు ఆ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం 2009 నుంచి 2018 వరకు రియల్ మాడ్రిడ్‌కు ఆడాడు. 2018 నుంచి జూవెంటస్కు ఆడుతున్నాడు. ఇక రొనాల్డొ పోర్చుగల్ జట్టు తరపున 134 మ్యాచ్‌ల్లో 90 గోల్స్ సాధించాడు. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత గొప్ప ప్లేయర్లలో స్థానం సంపాదించిన రొనాల్డొ తన కెరీర్లో 32 టైటిల్స్ అందుకున్నాడు. దాదాపు పదకొండు వందలకు పైగా మ్యాచ్‌ల్లో ఆడిన రొనాల్డొ 780 గోల్స్ సాధించాడు. చదవండి: ENG Vs IND: మళ్లీ వచ్చేశాడు.. ప్యాడ్స్ కట్టుకొని కోహ్లి స్థానంలో -
ప్రెసిడెంట్ ఆడియో టేప్ లీక్.. రొనాల్డోపై తీవ్ర వ్యాఖ్యలు
లిస్బన్: క్రిస్టియానో రొనాల్డో ఆటతోనే కాదు.. తన మేనరిజంతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు. అయితే తాజాగా క్రిస్టియానో రొనాల్డో, మేనేజర్ జోస్ మౌరిన్హోలను రియల్ మాడ్రిడ్ అధ్యక్షుడు ఫ్లోరెంటినో పెరెజ్ ఎగతాళి చేసిన ఆడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ ఆడియోక టేపులో క్రిస్టియానో రొనాల్డో ఓ ఇడియట్, జబ్బు మనిషి అంటూ విమర్షించారు. ‘‘రొనాల్డో ఓ వెర్రివాడు. ఇడియట్, జబ్బు మనిషి. అందరూ అతడు సాధారణంగా ఉన్నాడు అనుకుంటారు. కానీ అతను చేయాల్సిన పనులు చేయరు. అతను ఏదో చేస్తాడని మీరు అనుకుంటారు. కానీ ఏమీ చేయడు.’’ అంటూ విమర్షించారు. మెండిస్‌కు , మేనేజర్ జోస్ మౌరిన్హో ఇద్దరికీ రొనాల్డోపై నియంత్రణ లేదు. వారిద్దరికీ చాలా అహంకారం ఉంది. డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు. మనం ఈ రోజు డబ్బులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దాంతో వారు గొప్ప వాళ్లుగా కనిపిస్తారు.’’ అంటూ పెరెజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
బీడీ ప్యాకెట్లపై రొనాల్డో, మెస్సీ చిత్రాలు: వైరల్
ఏదైనా ఓ వస్తువు మార్కెట్లో క్లిక్ కావాలంటే ముందుగా తట్టే ఆలోచన అడ్వర్టైజ్మెంట్. తినే ఆహారం నుంచి మనిషికి వినోదాన్ని పంచే సినిమా వరకు ప్రకటన చాలా ఉపయోగపడుతుంది. ఇక సెలబ్రిటీలు బ్రాండ్అంబాసిడర్గా ఉండే కంపెనీలు కోట్లు పోగేసుకుంటాయి. ఆ మధ్య కాలంలో క్రిస్టియానో రొనాల్డో ప్రెస్ మీట్లో కోక్ బాటిళ్లను పక్కకు జరిపి ‘మంచి నీళ్లే తాగాలంటూ..’ ఇచ్చిన పిలుపు.. కోలా బ్రాండ్‌కు ఊహించని స్థాయిలో నష్టాన్ని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా లియోనల్ మెస్సీ చిత్రంతో ఉన్న ఓ బీడీ ప్యాకెట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని ధూలియన్‌లో ఆరిఫ్ బీడీ ఫ్యాక్టరీ వీటిని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భారత ఐపీఎస్ అధికారి రూపీన్ శర్మ ‘‘ మెస్సీ ఫస్ట్ ఎండోర్స్మెంట్ ఇన్ ఇండియా’’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ‘‘మెస్సీ ఏజెంట్లు దీన్ని చూడరని, బీడీ కంపెనీ నుంచి రాయల్టీ కోసం క్లెయిమ్ చేయరని ఆశిస్తున్నాను. ఇది బెంగాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్ అయి ఉండాలి.’’ అంటూ కామెంట్ చేశాడు. అయితే కేవలం మెస్సీ చిత్రంతో ఉన్న బీడీ ప్యాకెట్‌నే కాదు. పోర్చుగీస్ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో బీడీ ప్యాకెట్ల చిత్రాలను కూడా నెటిజన్లు పంచుకున్నారు. Messi's first endorsement in India ☺️☺️☺️☺️☺️ pic.twitter.com/07vh7bTMwC — Rupin Sharma IPS (@rupin1992) July 13, 2021 And as expected, there is a competitor: #Ronaldo Beedi with the tagline "beware of duplicates". Now waiting for #Neymar beedi's appearance. @rupin1992 pic.twitter.com/jndFOUmnRI — উৎপল বৰপূজাৰী Utpal Borpujari (@UtpalBorpujari) July 13, 2021 -
రొనాల్డో రికార్డ్‌ను బద్దలు కొట్టిన మెస్సీ..
బ్రెసిలియా: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ అరుదైన రికార్డును నెలకొల్పాడు. పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉన్న ఫ్రీకిక్ గోల్స్ రికార్డును ఈ అర్జెంటీనా సంచలన ఫుట్‌బాలర్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా మొత్తం మూడు గోల్స్ చేయగా.. అన్నింటిలోనూ మెస్సీ భాగస్వామిగా ఉన్నాడు. తొలి రెండు గోల్స్‌లో బాల్‌ను పాస్ చేయడంలో కీలకపాత్ర పోషించిన మెస్సీ.. ఓ ఫ్రీకిక్‌ను గోల్‌గా మలచి అర్జెంటీనా లీడ్‌ను 3-0కు పెంచాడు. ఈ క్రమంలోనే రొనాల్డో రికార్డును మెస్సీ అధిగమించాడు. ఇప్పటివరకు రొనాల్డో ఫ్రీకిక్స్తో 57 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా, తాజాగా జరిగిన మ్యాచ్‌లో మెస్సీ 58వ సారి ఫ్రీకిక్ గోల్ సాధించి టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ప్రస్తుతానికి 76 గోల్స్ సాధించిన మెస్సీ.. మరొక్క గోల్ చేస్తే, అత్యధిక గోల్స్ సాధించిన సౌత్ అమెరికన్‌గా చరిత్ర పుటల్లో నిలుస్తాడు. ఈ జాబితాలో దిగ్గజ ఫుట్‌బాలర్, బ్రెజిల్ మాజీ కెప్టెన్ పీలే 77 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. -
ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు ప్రియాంక, కోహ్లి ఎంత తీసుకుంటున్నారో తెలుసా?
సెలబ్రిటీలకు ఆదాయ మార్గాలు అనేకం.. సినిమా స్టార్లు, క్రీడా ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ అందరూ తమ వృత్తులతో సమానంగా ఇతర మార్గాల ద్వారా లెక్కలేనంత సంపాదనను ఆర్జిస్తుంటారు. యాడ్స్, బిజినెస్, ప్రయోషన్స్తో కోట్లలో డబ్బులు కూడగట్టుకుంటారు. సెలబ్రిటీల ఫాలోవర్స్‌ను బట్టి వాళ్ల స్టేటస్ అంతకంతకూ పెరుగుతుంటుంది. అయితే సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సోషల్ మీడియా వేదికలపై చేసే పోస్ట్‌లతో కూడా భారీగా సంపాదిస్తారని మీకు తెలుసా? అవును తాజాగా హాపర్‌హెచ్‌క్యూ 2021 ఇన్స్టాగ్రామ్ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో అత్యధిక సంపాదన అందుకునే సెలబ్రిటీలెవరో ఇక్కడ తెలుసుకుందాం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో ఈ జాబితాలో టాప్‌లో నిలిచారు. ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న పోర్చుగల్ ఆటగాడు ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌కు 1,604,000 డాలర్లు (దాదాపు 11.9 కోట్లు) వసూలు చేస్తున్నాడు. గత సంవత్సరం తొలి స్థానంలో ఉన్న డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ స్టార్ డ్వేన్ జాన్సన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇతని తర్వాత డ్వేన్ అరియానా గ్రాండే, కైలీ జెన్నర్, సెలెనా గోమెజ్ 3,4,5 స్థానంలో ఉన్నారు. చదవండి: రాజమౌళికి చేదు అనుభవం.. ట్వీట్ వైరల్ విరాట్‌కోహ్లి ఇక ఈ లిస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లి19 స్థానంలో నిలిచాడు. ఇండియాలోనే అత్యధిక మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టు ద్వారా 6,80.000 డాలర్లు(దాదాపు5.08 కోట్లు) అందుకుంటున్నాడు. టాప్ 20లో ఉన్న ఏకైక ఇండియన్ సెలబ్రిటీ కూడా కోహ్లినే. ప్రియాంకా చోప్రా ఇక విరాట్ తర్వాత గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా 27వ స్థానంలో నిలిచింది. ఆమె ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్ ద్వారా 4,03,000 డాలర్లు(దాదాపు మూడు కోట్లు) సంపాదిస్తోంది. కాగా గతేడాది 19వ స్థానంలో ఉన్న ప్రియాంక ఈ ఏడాది 27 వ స్థానానికి పడిపోయారు. అయితే ప్రియాంక ఆదాయం గతేడాదితో పోలీస్తే పెరిగింది. మొత్తం 395 మంది సెలబ్రిటీలు ఉన్న లిస్ట్‌లో భారత్ నుంచి చోటు దక్కించుకున్న వారు వీరిద్దరే. -
UEFA EURO 2020: పోర్చు‘గల్లంతు’
సెవిల్లె (స్పెయిన్): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ పోర్చుగల్ జట్టు కథ ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బెల్జియం 1–0 గోల్ తేడాతో క్రిస్టి యానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టును ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. ఆట 42వ నిమిషంలో ఎడెన్ హజార్డ్ గోల్‌తో బెల్జియం ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఇటలీతో బెల్జియం ఆడుతుంది. సోమవారం జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 5–3తో క్రొయేషియాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
Euro Cup: పోర్చుగల్ ఔట్.. రొనాల్డో భావోద్వేగం
సెవిలా: యూరో కప్ 2020 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ పోర్చుగల్ అనూహ్యంగా వైదొలిగింది. ఆదివారం రాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలో 0-1 తేడాతో ఓటమిపాలై తమ అభిమానులను షాక్‌కు గురి చేసింది. 42వ నిమిషంలో థోర్గాన్ హజార్డ్ చేసిన గోల్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన బెల్జియం.. తర్వాత ప్రత్యర్థికి సమం చేసే అవకాశం ఇవ్వకుండా ఆటను ముగించింది. తమ జట్టు అనూహ్య రీతిలో టోర్నీ నుంచి వైదొలగడంతో స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం అసహనంతో తన ఆర్మ్ బ్యాండ్‌ను నేలకేసి కొట్టాడు. కెరీర్లో తన చివరి యూరో కప్‌లో ఆడిన రొనాల్డోకు ప్రిక్వార్టర్స్‌లోనే తన జట్టు ఇంటి దారి పట్టడం అస్సలు మింగుడు పడలేదు. Nahhh mannn, Possibly the last every time we see Ronaldo at the EUROS😢😢😢 pic.twitter.com/1aPQVOLr0F — Dhruvzzz (@dhruvzz8) June 27, 2021 కాగా, ఈ టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉన్న రొనాల్డో.. నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతే కాదు, టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. యూరో కప్‌లో అతను మొత్తం 14 గోల్స్ చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇదే టోర్నీలో ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించడం ద్వారా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్(109 గోల్స్) సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇరాన్‌కు చెందిన అలీ డేయీ(109 గోల్స్)తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ప్రిక్వార్టర్స్‌లో అతను ఒక్క గోల్ చేసుంటే తన జట్టును గట్టెక్కించడంతో పాటు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేవాడు. చదవండి: టీ20 ప్రపంచకప్ వేదిక మార్పు.. -
రికార్డుల బ్రాండ్ బాబు.. సంపాదనెంతో తెలుసా?
సెలబ్రిటీలను ఆరాధించడానికి.. అభిమానించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉండనక్కర్లేదు. నచ్చితే.. బ్లయిండ్‌గా ఫాలో అయిపోవడమే. ఫుట్‌బాల్ ఆటతోనే కాదు.. తన మేనరిజంతో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. అత్యధిక గోల్స్ రికార్డుకు అడుగు దూరంలో ఉన్న రొనాల్డో.. సోషల్ మీడియాలోనూ రికార్డుల బ్రేకర్ కూడా. వెబ్‌డెస్క్: సాకర్ వీరుడు రొనాల్డోకు ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య 92.4 మిలియన్లు. ఫేస్బుక్లో 148 మిలియన్ల ఫాలోవర్లు. ఇక ఈమధ్యే ఇన్‌స్టాలో 30 కోట్ల మిలియన్ ఫాలోవర్స్ రికార్డు దక్కించుకున్నాడు. కేవలం ఇన్‌స్టా అకౌంట్ ద్వారానే దాదాపు 2 మిలియన్ల పౌండ్ల ఆదాయం వెనకేసుకుంటున్నాడు. అతను వేసే ఒక్కో పోస్టుకి ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకుంటాడని తెలుస్తోంది(మోడల్ కైలీ జెన్నర్ పోస్ట్‌కి ఎనిమిది కోట్లకుపైనే). ఫుట్‌బాల్ ఆటగాళ్లలో అత్యధికంగా సంపాదిస్తున్న రెండో ఆటగాడు ఇతనే. మరో విశేషం ఏంటంటే.. లాక్డౌన్ టైంలోనూ అత్యధికంగా సంపాదించిన అథ్లెట్‌గా ఫోర్బ్స్ జాబితాలో నిలిచాడు. కాస్ట్లీ యవ్వారం ఈ జువెంటస్ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాడి.. విలాసాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఎప్పుడూ ఒకే తరహా డైట్‌ను ఫాలో అయ్యే 36 ఏళ్ల రొనాల్డో.. ఫిట్నెస్ విషయంలో అభిమానులకు ఆరాధ్యుడే. దుబాయ్ గ్లోబ్ సాకర్ అవార్డుల కార్యక్రమానికి రొనాల్డో ఒక రోలెక్స్ వాచీతో హాజరయ్యాడు. ఇక అభిమానులు ఊరుకుంటారా? దానిని స్కాన్ చేసి ధరెంతో కనుక్కునే ప్రయత్నం చేశాడు. రీసెంట్గా ఆ వాచీ కంపెనీ ‘స్విస్’.. దాని ధరెంతో ప్రకటించింది. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారుచేసిన వాచీ అది. అందులో 30 క్యారెట్ల వైట్ డైమండ్లు పొదిగిన ఆ వాచీ ఖరీదు 3,71,000 పౌండ్లు (మన కరెన్సీలో 3 కోట్ల 82 లక్షలపైనే) విలువ ఉందని ప్రకటించింది. పైగా ఇలాంటి పీస్ ఇప్పటివరకు ఈ ఫుట్‌బాల్ స్టార్ దగ్గర మాత్రమే ఉందని వెల్లడించింది. బ్రాండ్ బాబు రొనాల్డ్ బ్రాండ్ అంబాసిడరింగ్ వాల్యూ ఏటా దాదాపు 105 మిలియనల డాలర్లు అంటే ఆశ్చర్యం కలగకమానదు. అందులో నైక్ నుంచే 45 మిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నాడు. ఇక సొంతంగా సీఆర్7 బ్రాండ్ ఉంది. ఓవరాల్ ఆటగాళ్ల ఆదాయం జాబితాలో మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ కనోర్ మెక్‌గ్రెగోర్(180 మిలియన్ల డాలర్లు), లియోనెల్ మెస్సీ(130 మిలియన్ల డాలర్లు).. ఉండగా మూడో ప్లేస్‌లో రొనాల్డో 120 మిలియన్ల డాలర్లతో నిలిచాడు. చిరకాల ప్రత్యర్థి మెస్సీ కంటే టోటల్ ఆదాయంలో వెనుకంజలో ఉన్నప్పటికీ.. బ్రాండ్ ఆదాయంలో ఓ అడుగు ముందే ఉన్నాడు రొనాల్డో. ఫిబ్రవరి 5, 1985 సాంటో అంటోనియోలో పుట్టాడు రొనాల్డో. స్కూల్ ఎడ్యుకేషన్‌లో పెద్దగా చదువుకోని రొనాల్డో.. 17వ ఏట స్పోర్ట్స్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నాడు. ది సుల్తాన్ ఆఫ్ ది స్టెప్ఓవర్ బిరుదు అందుకున్నాడు. మెర్చ్ రొమిరో, గెమ్మా అటిక్సన్, ఇరినా షాయ్క్లతో డేటింగ్ చేసి.. మోడల్ జార్జినా రోడ్రిగుజ్ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు నలుగురు పిల్లలు. చదవండి: రొనాల్డో వల్లే కోకా కోలా 29వేల కోట్లు నష్టపోయిందా?.. అందులో నిజమెంత? -
ప్రి క్వార్టర్స్‌లో పోర్చుగల్, జర్మనీ
బుడాపెస్ట్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ పోర్చుగల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. జర్మనీ, ఫ్రాన్స్ జట్లు కూడా నాకౌట్ దశకు చేరాయి. గ్రూప్ ‘ఎఫ్’లో భాగంగా బుధవారం అర్ధరాత్రి పోర్చుగల్, ఫ్రాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. 31వ, 60వ నిమిషాల్లో అతను రెండు గోల్స్ సాధించాడు. ఫ్రాన్స్ జట్టులో కరిమ్ బెన్జిమా ఇంజూరి టైమ్ (45+2వ ని.)లో, 47వ నిమిషంలో రెండు గోల్స్ చేశాడు. ఇదే గ్రూప్‌లో ఉన్న జర్మనీ... హంగేరితో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌ను కూడా 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ఐదు పాయింట్లతో ఫ్రాన్స్ ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలవగా... నాలుగు పాయింట్లు సాధించిన జర్మనీ రెండో స్థానంలో నిలిచింది. పోర్చుగల్ కూడా 4 పాయింట్లు సాధించినప్పటికీ... జర్మనీ చేతిలో ఓడటంతో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. టోర్నీ నిబంధనల ప్రకారం గ్రూప్‌లో టాప్–2లో నిలిచిన జట్లు నేరుగా... మూడో స్థానంలో నిలిచిన 6 జట్ల నుంచి మెరుగైన నాలుగు టీమ్‌లు ప్రిక్వార్టర్స్‌కు చేరుకునే అవకాశం ఉంది. దాంతో పోర్చుగల్ కూడా నాకౌట్ దశకు అర్హత సాధించింది. శనివారం నుంచి ప్రిక్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. చరిత్రకు గోల్ దూరంలో రొనాల్డో ఫుట్‌బాల్ చరిత్రలో మరో రికార్డును తన పేరిట లిఖించుకోవడానికి పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గోల్ దూరంలో నిలిచాడు. యూరో కప్‌లో భాగంగా ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన రొనాల్డో... అంతర్జాతీయ ఫుట్‌బాల్ (దేశం తరఫున)లో ఇరాన్ ప్లేయర్ అలీ డయీ పేరిట ఉన్న అత్యధిక గోల్స్ (109) రికార్డును సమం చేశాడు. రొనాల్డో మరొక్క గోల్ సాధిస్తే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కుతాడు. -
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ఆ జాబితాలో నంబర్ వన్ స్థానం
బుడాపెస్ట్: యూరో కప్ 2020 ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ రికార్డు ఇరాన్‌కు చెందిన అలీ డేయీ(109 గోల్స్) పేరిట ఉండగా, బుధవారం జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో(109) రెండు గోల్స్ సాధించడంతో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. కాగా, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో చరిత్ర సృష్టించేందుకు రొనాల్డో కేవలం ఒక్క గోల్ దూరంలో ఉన్నాడు. ఈ జాబితాలో భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ 74 గోల్స్‌తో 11వ స్థానంలో ఉండగా, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీ 73 గోల్స్‌తో 12వ స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే, ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్ డ్రా కావడంతో పోర్చుగల్ నాకౌట్ దశకు ప్రవేశించింది. టోర్నీలో పోర్చుగల్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో రొనాల్డో చరిత్ర సృష్టించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాగా, ప్రస్తుత టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచిన రొనాల్డో.. టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడు కూడా కావడం విశేషం. యూరో కప్‌లో అతను మొత్తం 14 గోల్స్ చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. చదవండి: ICC Rankings: టాప్ ర్యాంక్‌కు దూసుకెళ్లిన జడేజా -
వాళ్లు జుట్టు కత్తిరించుకున్నా సంచలనమే!
సాక్షి, వెబ్‌డెస్క్: పబ్లిక్ ఫిగర్స్ (ప్రముఖులు)వేలకోట్ల వ్యాపార రంగాన్ని కనుసైగతో శాసిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుండు సూది నుంచి మొదలు అమ్మకాలు పుంజుకోవాలంటే వాళ్లు ఆయా బ్రాండ్ లతో ఒక్క చిన్న మూమెంట్ ఇస్తే చాలు. అమ్మకాలు తారా స్థాయికి చేరుకుంటాయి. వ్యతిరేకిస్తే అథోఃపాతానికి పడిపోతాయి. అందుకు ఉదాహరణే ఇటీవల జరిగిన ఓ సంఘటన. ప్రెస్ మీట్ లో పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో కోక్ బాటిళ్లను పక్కకు జరిపి ‘మంచి నీళ్లే తాగాలంటూ’ సైగ చేశారు. ఆ సైగతో కోలా బ్రాండ్ భారీ నష్టాల్ని చవిచూసింది. ఇలా ఒక్కరొనాల్డోనే కాదు గతంలో పలువురు ప్రముఖులు సింగల్ యాక్షన్ తో ఆయా కంపెనీలు వేలకోట్లు నష్ట పోయాయి. క్రిస్టియానో రొనాల్డో : ప్రెస్ మీట్ లో కోకా కోలా బాటినళ్లను పక్కనపెట్టి మంచినీళ్లు తాగండని పది సెకన్ల యాక్షన్ వల్ల ఆ కంపెనీకి ఊహించని రీతిలో డ్యామేజ్ జరిగింది. కోలా షేర్లు 56.17 డాలర్ల నుంచి 55.22 డాలర్లకు పడిపోవడంతో 4 బిలియన్ డాలర్లను నష్టపోయింది. ఎలాన్ మస్క్ : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గత నెల మే1న ఓ ట్వీట్ చేశారు. టెస్లాకార్లు కొనుగోలు చేయాలంటే బిట్ కాయిన్స్ ను అనుమతించబోమని ట్వీట్ లో పేర్కొన్నాడు. దీంతో బిట్ కాయిన్ వ్యాల్యూ 17శాతానికి పడిపోయింది. ట్వీట్ కు ముందు బిట్ కాయిన్ వ్యాల్యూ 54,819 డాలర్లు కాగా, ట్వీట్ తర్వాత 45,700 క్షీణించింది. సుచేతాదలాల్ : ప్రముఖ బిజినెస్ జర్నలిస్ట్ సుచేతాదలాల్. బిజినెస్ రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. 1992 లో స్టాక్ మార్కెట్ లో ‘హర్షద్ మెహతా’ కుంభకోణం గురించి ఒక్క ఆర్టికల్ రాసింది. ఆ ఒక్క ఆర్టికల్ తో మదుపర్లు స్టాక్ మార్కెట్ కా బచ్చన్ అని పిలుచుకునే హర్షద్ మెహతాను రోడ్డు కీడ్చారు. తాజాగా అదానీ గ్రూప్ గురించి డైరెక్ట్‌గా చెప్పకపోయినా విదేశీ సంస్థల పెట్టుబడులతో సెబీ నిఘా వ్యవస్థలు గుర్తించలేని స్థాయిలో మరో కుంభకోణం జరుగుతోందని ట్వీట్ చేశారు. అంతే.. ఆ ట్వీట్‌తో అదానీ గ్రూప్ వేలకోట్లు నష్టపోయింది. చదవండి: క్రెడిట్ కార్డ్ స్కోర్ బాగున్నా, లోన్ ఎందుకు రిజెక్ట్ అవుతుందో తెలుసా? కైలీ జెన్నర్ : నటి కిమ్ కర్దాషియన్ చెల్లెలు, ప్రముఖ కైలీ కాస్మోటిక్ ప్రాడక్ట్ అధినేత కైలీ జెన్నర్ 2018లో స్నాప్ చాట్ కొత్త లే అవుట్ తెచ్చింది. దీంతో నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కైలీ ఇకపై తాను స్నాప్‌చాట్‌ను ఉపయోగించడం లేదని తెలిపింది. ఆ ట్వీట్ తో కంపెనీకి స్టాక్ మార్కెట్లో 1.3 బిలియన్ డాలర్లును నష్టపోయింది. డేవిడ్ బెక్హాం : 1997లో డేవిడ్ బెక్హాం హెయిర్ స్టైలిష్ ప్రాడక్ట్‌కు చెందిన బ్రైల్ క్రీమ్ సంస్థతో ప్రమోషన్ కోసం 4 ఏళ్లపాటు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందం తరువాత డేవిడ్ బెక్హాం తన జుట్టును పూర్తిగా కత్తిరించుకోవడంతో బ్రైల్ క్రీమ్ అమ్మకాలు పడిపోయాయి. దీంతో ఆ కంపెనీ వేలకోట్ల నష్టాన్ని చవిచూసింది. షరాన్ స్టోన్: 2008లో ప్రముఖ ప్యాషన్ కంపెనీ డియోర్ అమెరికాకు చెందిన ప్రముఖ నటి షరాన్ స్టోన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఏడాది చైనాలో భూకంపం సంభవించి 68 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో 'బ్యాడ్ కర్మ' అంటూ స్టోన్ వ్యాఖ్యానించింది. అంతే డియోర్ కంపెనీ నష్టాల బాటపట్టింది. చైనాలో షరాన్ స్టోన్ సినిమాలపై నిషేధానికి గురయ్యాయి. -
కోకా కోలా వివాదం: ఫెవికాల్ అదిరిపోయే యాడ్, నెటిజన్లు ఫిదా!
యూరో ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ ప్రెస్ మీట్ సందర్భంగా పోర్చుగల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో.. తనకు ఎదురుగా ఉన్న కోక్ బాటిళ్లను చిరాకుగా పక్కనపెట్టి, మంచి నీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే. కొద్దిసేపటికే ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రొనాల్డో చేసిన ఈ చర్యతో కోకా కోలా కంపెనీ షేర్లు బోరుమన్నాయి. ఒక్కసారిగా కోకా కోలా షేర్లకు సుమారు 4 మిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఆసక్తికరమైన ప్రకటనల విషయానికి వస్తే తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న ఫెవికాల్, తాజాగా ఒక పోస్ట్‌ను ట్విటర్లో షేర్ చేసింది. రోనాల్డో కోకాకోలా బాటిళ్లను తొలగించే విషయంపై ఫెవికోల్ కంపెనీ ఇన్‌డైరక్ట్‌గా కోకాకోలాకు అదిరిపోయే సూచన చేసింది. ఫెవికాల్ తన ట్విటర్ పోస్ట్‌లో.. రొనాల్డో హజరైన ప్రెస్‌మీట్‌ను పోలి ఉన్న ఫోటోలో, కోకాకోలా బాటిళ్లకు బదులు ఫెవికోల్ డబ్బాలను ఏర్పాటు చేసింది. వీటిని ఎవరూ అక్కడి నుంచి తీయలేరు. అంతేకాకుండా కంపెనీ షేర్ విలువ కూడా పడిపోయేది (నా బాటిల్ హేటేగీ, నా వాల్యుయేషన్ ఘటేగి)కాదని.. సూచిస్తూ వ్యంగ్యంగా కోకాకోలాకు సూచించింది. కోకాకోలా బాటిళ్లు అక్కడి నుంచి తీయకుండా ఉండేందుకు ఫెవికాల్ అంటించి ఉంటే కోకాకోలాకు ఈ పరిస్ధితి వచ్చేదికాదని పేర్కొంది. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్‌ను చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఫెవికాల్ మార్కెట్ స్ట్రాటజీను చూసి నెటిజన్లు ఔరా..! అంటూ రిట్వీట్ చేస్తున్నారు. కాగా అప్పుడప్పుడు కొన్ని సందర్బాల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలపై ఫెవికోల్ వ్యంగ్యంగా జవాబిస్తూ తన మార్కెట్‌ను పెంచుకుంటుంది. Haye ni mera Coka Coka Coka Coka Coka#Euro2020 #Ronaldo #MazbootJod #FevicolKaJod pic.twitter.com/lv6YWrgfxB — Fevicol (@StuckByFevicol) June 17, 2021 Cristiano Ronaldo was angry because they put Coca Cola in front of him at the Portugal press conference, instead of water! 😂 He moved them and said "Drink water" 😆pic.twitter.com/U1aJg9PcXq — FutbolBible (@FutbolBible) June 14, 2021 చదవండి: బాటిల్సే కాదు.. ఏం ముట్టుకున్నా మోతే ఇక! -
రొనాల్డో ఎఫెక్ట్: ఇకపై బాటిల్స్ ముట్టుకుంటే..
క్రిస్టియానో రొనాల్డో వర్సెస్ కోకా కోలా బాటిల్ వ్యవహారం ఎన్నో పరిణామాలకు దారితీస్తోంది. ప్రెస్ మీట్లో కోక్ బాటిళ్లను పక్కకు జరిపి ‘మంచి నీళ్లే తాగాలంటూ..’ రొనాల్డ్ ఇచ్చిన పిలుపు.. కోలా బ్రాండ్‌కు ఊహించని స్థాయిలో నష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే రొనాల్డో చర్య తర్వాత మరికొందరు ఆటగాళ్లు.. అతన్నే అనుకరిస్తూ, అనుసరిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ ఫుట్‌బాల్ అసోషియేషన్స్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. ఇకపై ఆటగాళ్లు బాటిళ్లను జరపడం, పక్కనపెట్టడం చాలా చేష్టలకు పాల్పడితే జరిమానా తప్పదని హెచ్చరించింది. కేవలం బాటిళ్లలోనే కాదు.. స్పానర్లుగా వ్యవహరిస్తున్న కంపెనీల ప్రొడక్టుల విషయంలోనూ ఈ హెచ్చరిక వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘టోర్నమెంట్ నిర్వాహణ కోసం ఆయా బ్రాండ్లతో ఒప్పందాలు జరిగాయని ఆటగాళ్లు గమనించాలి. వాళ్ల భాగస్వామ్యంతోనే యూరప్ దేశాల్లో ఫుట్‌బాల్ పురోగతికి కృషి జరుగుతోందని గుర్తించాలి’ అని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది యూఈఎఫ్ఏ. ఇక పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో చర్యను పరోక్షంగా తప్పుబట్టిన టోర్నమెంట్ డైరెక్టర్ మార్టిన్ కల్లెన్.. ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పోగ్బా చేసిన పనిని కూడా పరోక్షంగానే సమర్థించాడు. మత విశ్వాసానికి ముడిపడిన అంశం కావడంతో ఆ విషయంలో అతన్ని(పోగ్బా) తప్పుబట్టలేమని పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్లకు జరిమానా విధించే విషయంలో యూఈఎఫ్ఏ నేరుగా జోక్యం చేసుకోదని, ఆయా ఆటగాళ్ల ఫుట్‌బాల్ ఫెడరేషన్లే చూసుకుంటాయని మార్టిన్ స్పష్టం చేశాడు. చదవండి: ప్లీజ్ ఇలాంటివి వద్దు-రొనాల్డో -
29వేల కోట్లు ఢమాల్! కోకా కోలా యాడ్ గుర్తుందా?
మంచి నీళ్లే తాగాలని.. కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ వద్దంటూ ఫేమస్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో చేసిన కామెంట్ కీలక పరిణామానికి దారితీసింది. రోనాల్డో వీడియో తర్వాత కోకా కోలా కంపెనీకి ఊహించని రీతిలో డ్యామేజ్ జరిగింది. యూరో ఛాంపియన్షిప్ ప్రెస్ మీట్ సందర్భంగా పోర్చుగల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో.. తనకు ఎదురుగా ఉన్న కోక్ బాటిళ్లను చిరాకుగా పక్కనపెట్టి, మంచి నీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాడు. వాటర్ బాటిల్ పైకెత్తి ‘అగ్వా’(పోర్చుగ్రీసు భాషలో మంచినీళ్లు అని అర్థం) అని కామెంట్ చేశాడు. తర్వాత ఈ వీడియో వైరల్ అయ్యింది. అయితే 36 ఏళ్ల రొనాల్డో కామెంట్ ఎఫెక్ట్ మార్కెట్‌పై దారుణంగా చూపెట్టింది. కోకా కోలా స్టాక్ ధరలు 1.6 శాతానికి పడిపోయి.. 238 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరింది. అంతకు ముందు కోకా కోలా విలువ 248 బిలియన్ల డాలర్లు ఉండింది. దీంతో 4 బిలియన్ల డాలర్లు(మన కరెన్సీలో 29 వేల కోట్ల దాకా) నష్టం వాటిల్లినట్లయ్యింది. కోకాకోలా రియాక్షన్ ఇక క్రిస్టియానో రొనాల్డో వ్యవహరించిన తీరుపై యూరో ఛాంపియన్షిప్ స్పానర్‌షిప్‌గా వ్యవహరిస్తున్న కోకాకోలా స్పందించింది. ‘ఎవరికి నచ్చిన డ్రింక్‌లు వాళ్లు తాగుతారు’ అని బదులిచ్చింది. ఎవరి టేస్ట్లు వాళ్లకు ఉంటాయి. అవసరాలను బట్టి ఎవరికి నచ్చిన డ్రింక్‌లు వాళ్లు తాగుతారు. అందులో తప్పేముంది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నీళ్లతో పాటు కోకా కోలా డ్రింక్‌లు కూడా సర్వ్ చేస్తున్నాం. అతని కంటే ముందు ఎంతో మంది ప్లేయర్లు కోక్ తాగం చూసే ఉంటారు అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. రొనాల్డో.. యాడ్ గుర్తుందా? ఇక ఇప్పుడు ఏ డ్రింక్‌ల పట్ల అయితే క్రిస్టియానో రొనాల్డో అయిష్టత, అసహ్యం కనబరిచాడో.. కొన్నేళ్ల క్రితం అదే కార్బొనేట్ సాఫ్ట్ డ్రింక్ కంపెనీకి ఒక యాడ్ చేశాడు. 2006లో 22 ఏళ్ల రొనాల్డో కోకా కోలా బ్రాండ్‌కు యాడ్ చేశాడు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ యాడ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. కొందరు రొనాల్డ్ తీరును తప్పుబడుతుండగా.. అభిమానులు మాత్రం ఆ వయసుకి రొనాల్డోకి అంత పరిణితి లేదని, అతని డైట్లో చాలా ఏళ్లుగా మార్పు వచ్చిందని గుర్తుచేస్తున్నారు. చదవండి: రొనాల్డో-మెస్సీ.. మధ్యలో మనోడు -
'ప్లీజ్ ఇలాంటివి వద్దు.. మంచినీరు మాత్రమే తాగండి'
అమ్‌స్టర్‌డామ్: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో 36 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తాడు. డైట్‌ను కచ్చితంగా ఫాలో అయ్యే రొనాల్డో తన ఆహారంలో కేలరీస్ ఎక్కువగా లభించే జంక్‌ఫుడ్ లేకుండా జాగ్రత్త పడతాడు. తాజాగా ఒక మీడియా సమవేశంలో తన ముందున్న కోకకోలా బాటిల్‌ను పక్కన పెట్టేసి ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దంటూ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. యూఈఎఫ్ఏ యూరోకప్ 2020లో భాగంగా రొనాల్డో జట్టు కెప్టెన్ హోదాలో కోచ్ ఫెర్నాండో సాంటోస్‌తో కలిసి మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. అయితే తాను కుర్చీలో కూర్చునేటప్పుడు టేబుల్‌పై కోకకోలా బాటిల్స్ కనిపించాయి. వెంటనే వాటిని చేతిలోకి తీసుకొని పక్కన పెట్టేసి.. '' ఇలాంటివి వద్దు.. మంచినీరు మాత్రమే తాగండి'' అంటూ వాటర్‌బాటిల్‌ను తన చేతిలో తీసుకొని చెప్పాడు. కోచ్ ఫెర్నాండోస్ రొనాల్డో ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు.. కానీ తర్వాత తన మాటలతో అర్థం చేసుకున్న అతను రొనాల్డొను అభినందించాడు. యూరోకప్ 2020లో భాగంగా పోర్చుగల్ గ్రూఫ్ ఎఫ్‌లో ఉంది. పోర్చుగల్‌తో పాటు జర్మనీ, ప్రాన్స్, హంగేరీ కూడా ఉండడంతో అంతా ఈ గ్రూఫ్‌ను ''గ్రూఫ్ ఆఫ్ డెత్''గా అభివర్ణిస్తున్నారు. కాగా 2016లో జరిగిన యూరోకప్‌లో రొనాల్డో ఆధ్వర్యంలోనే పోర్చుగల్ ఫ్రాన్స్‌ను ఫైనల్లో ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది. డిపెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న పోర్చుగల్ మరోసారి చాంపియన్‌గా నిలవాలని చూస్తుంది. 36 ఏళ్ల రొనాల్డోకిది వరుసగా ఆరో ‘యూరో’ చాంపియన్‌షిప్ కావడం విశేషం. కాగా రొనాల్డో అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పోర్చుగల్ తరపున ఇప్పటివరకు 104 గోల్స్ చేశాడు. మరో ఏడు గోల్స్ చేస్తే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఒక దేశం తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఇరాన్ మాజీ ప్లేయర్ అలీ దాయి (109 గోల్స్) పేరిట ఉంది. చదవండి: UEFA EURO 2020: నెదర్లాండ్స్ బోణీ 7 సెకన్లు.. 60 మీటర్ల దూరం.. ఏమా వేగం Cristiano Ronaldo was angry because they put Coca Cola in front of him at the Portugal press conference, instead of water! 😂 He moved them and said "Drink water" 😆pic.twitter.com/U1aJg9PcXq — FutbolBible (@FutbolBible) June 14, 2021 -
రొనాల్డో-మెస్సీ.. మధ్యలో మనోడు
రోనాల్డో -మెస్సీ.. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటూ ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కుమ్ములాడుకోవడం చూస్తుంటాం. కానీ, ఈ ఇద్దరిలో మధ్యలో గట్టి పోటీ ఇస్తూ ఇప్పుడు ఇంకొకడు వచ్చి దూరాడు. ఆ ఒక్కడు ఎవడో కాదు.. భారత ఫుట్‌బాల్ మాంత్రికుడు సునీల్ ఛెత్రి. దోహా: సోమవారం 2022 ఫిఫా వరల్డ్‌కప్, 2023 ఆసియా కప్ క్వాలిఫైయర్స్ టోర్నీలలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 2-0 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ రెండు గోల్స్ కూడా సునీల్ ఛెత్రినే కొట్టాడు. ఈ ఫీట్‌తో ప్రపంచంలో అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్‌బాల్ ఆటగాడిగా(ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ల) రెండో స్థానంలో నిలిచాడు ఛెత్రి. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉండగా(103)గోల్స్‌తో, రెండో స్థానంలో మొన్నటిదాకా అర్జెంటీనా స్టార్ లియోనాల్ మెస్సీ(72)గోల్స్‌తో ఉన్నాడు. ఇక బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించడం ద్వారా మొత్తం 74 గోల్స్‌తో ఛెత్రి మెస్సీని వెనక్కి నెట్టి రెండో ప్లేస్‌కి చేరాడు. ఇక ఆల్‌టైం హయ్యెస్ట్ టాప్ 10 గోలర్స్ లిస్ట్‌లో చేరడానికి ఛెత్రి మరొక గోల్(75) సాధిస్తే సరిపోతుంది. వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచుల్లో భారత్‌కి ఆరేళ్ల తర్వాత దక్కిన తొలి గెలుపు ఇదే. ఇప్పటికే భారత్ ఫిఫా ఆశలు చల్లారగా.. కేవలం చైనాలో జరగబోయే ఆసియా కప్ అర్హత కోసం భారత్ ఫుట్‌బాల్ ఆడుతోంది. ఇక మెస్సీ యాక్టివ్‌గా ఉండడంతో ఛెత్రి రికార్డు త్వరగానే కనుమరుగు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ టాప్ లిస్ట్‌లో చేరిన ఛెత్రికి ఇండియన్ సోషల్ మీడియా సలాం చెబుతోంది. ఇక ఈ రికార్డు ఫీట్‌ను 36 ఏళ్ల ఛెత్రి కూడా చాలా తేలికగా తీసుకోవడం విశేషం. చదవండి: భారత్ పరాజయం Goals speak louder than words 🙏#IndianFootball #NationalTeam #JB6 #WCQualifiers pic.twitter.com/u4iOUzKwGa — Indian Football Team for World Cup (@IFTWC) June 7, 2021 -
7 సెకన్లు.. 60 మీటర్ల దూరం.. ఏమా వేగం
ఫుట్‌బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో తమ ఫేవరెట్ ఆటగాడు బరిలో ఉన్నాడంటే ఇక ఫ్యాన్స్‌కు పండగే. ఫీల్డ్‌లో ఎందరు ఉన్నా.. అందరి కళ్లు తమ అభిమాన ఆటగానిపైనే ఉంటాయి. అలాంటి వారిలో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్లొ ఒకడు. అంతర్జాతీయ ఫుట్‌బాలర్‌గా ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా 36 ఏళ్ల వయసులోనూ తన రన్నింగ్ పవర్‌ను చూపించి ఎంత ఫిట్‌గా ఉన్నాడో చెప్పకనే చెప్పాడు. విషయంలోకి వెళితే.. శుక్రవారం స్పెయిన్, పోర్చుగల్ మధ్య అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డొ ఒక్క గోల్ కూడా కొట్టలేదు.. కానీ అభిమానులను మాత్రం ఎంటర్టైన్ చేశాడు. మ్యాచ్ డ్రాగా ముగుస్తుందన్న దశలో 87.29 నుంచి 87.36 టైమ్‌లైన్ మధ్యలో 7 సెకన్లలో రొనాల్డొ చిరుత మించిన వేగంతో ఒక గోల్‌పోస్ట్ బాక్స్ నుంచి మరో గోల్‌పోస్ట్ బాక్స్‌కు పరిగెత్తాడు. దీనిని చూసిన అభిమానులు రొనాల్డొను వహ్వా అనకుండా ఉండలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు ట్రెండింగ్‌గా మారింది. అయితే రొనాల్డొకు మ్యాచ్ మధ్యలో చాలాసార్లు బంతిని గోల్‌పోస్టులోకి పంపించే అవకాశం వచ్చినా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. ప్రస్తుతం జువెంటస్ క్లబ్‌తో పాటు పోర్చుగల్ జాతీయ జట్టుకు ఆడుతున్న రొనాల్డొ తన కెరీర్లో ఇప్పటివరకు అన్ని క్లబ్‌లు, అంతర్జాతీయ మ్యాచ్‌లు కలిపి దాదాపు 770కి పైగా గోల్స్ నమోదు చేశాడు. చదవండి: ఇటాలియన్ గ్రాండ్ ప్రిలో విషాదం.. మోటో3 రైడర్ మృతి 'రషీద్ పెళ్లెప్పుడు'.. ఎందుకు మీరు వస్తారా? 🇵🇹 Cristiano Ronaldo covered over 60 meters in 7 seconds. 36 years old 🤯pic.twitter.com/bRmRize8dF — Yellow Football (@YellowFootbal) June 4, 2021 -
Cristiano Ronaldo: ముంగిట ప్రపంచ రికార్డు
లిస్బన్: ప్రతిష్టాత్మక ‘యూరో కప్’ ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలో 26 మంది సభ్యులతో కూడిన పోర్చుగల్ జట్టు బరిలోకి దిగనుంది. యూరప్‌లోని 11 వేదికల్లో 24 జట్ల మధ్య జూన్ 11 నుంచి జూలై 11 వరకు ఈ టోర్నీ జరగనుంది. రొనాల్డో కెప్టెన్సీలోనే పోర్చుగల్ జట్టు 2016లో తొలిసారి ‘యూరో’ చాంపియన్‌గా అవతరించింది. 36 ఏళ్ల రొనాల్డోకిది వరుసగా ఆరో ‘యూరో’ చాంపియన్‌షిప్ కావడం విశేషం. రొనాల్డో మరో ఏడు గోల్స్ చేస్తే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఒక దేశం తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఇరాన్ మాజీ ప్లేయర్ అలీ దాయి (109 గోల్స్) పేరిట ఉంది. ఈసారి పోర్చుగల్ జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. గ్రూప్ ‘ఎఫ్’లో ప్రపంచ చాంపియన్ ఫ్రాన్స్, మాజీ విశ్వవిజేత జర్మనీ, హంగేరిలతో పోర్చు గల్ ఆడనుంది. ఈనెల 27న ‘యూరో’ కోసం పోర్చుగల్ సన్నాహాలు మొదలుపెట్టనుంది. చదవండి: French Open: మరో స్టార్ ప్లేయర్ దూరం -
వేలంలో రొనాల్డో ఆర్మ్బ్యాండ్కు రూ. 55 లక్షలు
బెల్గ్రేడ్: పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో రిఫరీ నిర్ణయంపై ఆగ్రహంతో మైదానంలో విసిరేసిన కెప్టెన్ ఆర్మ్‌బ్యాండ్ (చేతికి ధరించేది) 64 వేల యూరోల (రూ. 55 లక్షలు) ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2022 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా గత ఆదివారం పోర్చుగల్, సెర్బియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. అయితే ఆట అదనపు సమయంలో తాను కొట్టిన గోల్‌ను రిఫరీ నిరాకరించడంతో ఆగ్రహించిన రొనాల్డో... తన చేతికి ఉన్న నీలి రంగు ఆర్మ్‌బ్యాండ్‌ను విసిరేశాడు. అనంతరం ఆ బ్యాండ్‌ను తీసుకున్న ఫైర్ ఫైటర్ ఒక చారిటీ సంస్థకి అందజేశాడు. వాళ్లు దానిని ఆన్లైన్ వేలంలో ఉంచడంతో ఒక అభిమాని పెద్ద మొత్తంలో చెల్లించి సొంతం చేసుకున్నాడు. వేలం ద్వారా వచ్చిన డబ్బును వెన్నెముక వ్యాధితో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారి చికిత్స కోసం వినియోగిస్తామని ఆ చారిటీ సంస్థ తెలిపింది. -
క్రిస్టియానో రొనాల్డో కొత్త చరిత్ర
మిలాన్ (ఇటలీ): ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో రికార్డు సృష్టించాడు. ఇటలీ ప్రొఫెషనల్ లీగ్ సెరియెలో భాగంగా క్యాలియరి క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువెంటస్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 36 ఏళ్ల రొనాల్డో హ్యాట్రిక్ సాధించడంతో ఆ జట్టు 3–1తో గెలిచింది. ఈ మూడు గోల్స్‌తో అధికారికంగా గుర్తింపు పొందిన మ్యాచ్‌లలో రొనాల్డో చేసిన గోల్స్ సంఖ్య 770కు చేరుకుంది. దాంతో 767 గోల్స్‌తో బ్రెజిల్ దిగ్గజం పీలే పేరిట ఉన్న రికార్డు తెర మరుగైంది. రొనాల్డో తన కెరీర్లో పోర్చుగల్ తరఫున 120 గోల్స్ సాధించగా... ప్రొఫెషనల్ క్లబ్ జట్ల తరఫున 668 గోల్స్ నమోదు చేశాడు. తన రికార్డు బద్దలు కొట్టిన రొనాల్డోను పీలే సోషల్ మీడియా ద్వారా అభినందించాడు. -
పీలేను దాటిన క్రిస్టియానో రొనాల్డో...
ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ జట్టు కెప్టెన్, యువెంటస్ క్లబ్ (ఇటలీ) స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో రెండో స్థానానికి చేరుకున్నాడు. 757 గోల్స్‌తో ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ దిగ్గజం పీలేను మూడో స్థానానికి నెట్టిన రొనాల్డో 758 గోల్స్‌తో రెండో స్థానానికి ఎగబాకాడు. ఇటలీ ప్రొఫెషనల్ లీగ్ సెరియె ‘ఎ’లో భాగంగా ట్యూరిన్‌లో యుడినెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో యువెంటస్ 4–1తో గెలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు 756 గోల్స్‌తో మూడో స్థానంలో ఉన్న రొనాల్డో రెండు గోల్స్ చేసి పీలేను దాటి ముందుకెళ్లాడు. రొనాల్డో ప్రొఫెషనల్ లీగ్స్‌లో 656 గోల్స్... దేశం తరఫున ఆడుతూ 102 గోల్స్ చేశాడు. అందుబాటులో ఉన్న అధికారిక లెక్కల ప్రకారం అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో 759 గోల్స్‌తో జోసెఫ్ బికాన్ (చెక్ రిపబ్లిక్) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. మరో రెండు గోల్స్ చేస్తే రొనాల్డో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా కొత్త రికార్డు లిఖిస్తాడు. -
2020 ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాలర్‌గా లెవన్డౌస్కీ
జెనీవా: ప్రస్తుత ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లు ఎవరనగానే ఠక్కున లియోనల్ మెస్సీ లేదా క్రిస్టియానో రొనాల్డో పేరు చెప్పేస్తారు. కానీ ఇప్పుడు పోలాండ్ కెపె్టన్ రాబర్ట్ లెవన్డౌస్కీ పేరును కూడా గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకంటే 2020 ఏడాదికి ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అత్యుత్తమ ప్లేయర్‌గా లెవన్డౌస్కీ ఎంపికయ్యాడు. ఈ ఏడాది బయార్న్ మ్యూనిక్ జట్టు తరఫున 55 గోల్స్‌తో చెలరేగిన లెవన్డౌస్కీని ‘బెస్ట్ ప్లేయర్’ పురస్కారంతో ‘ఫిఫా’ గౌరవించింది. అతను ఈ అవార్డు కోసం మెస్సీ, రొనాల్డోలతో పోటీపడి విజేతగా నిలవడం విశేషం. గత 13 ఏళ్లలో మెస్సీ, రొనాల్డోకు దక్కకుండా ఫిఫా బెస్ట్ ప్లేయర్ పురస్కారం మరొకరిని వరించడం ఇది రెండోసారి మాత్రమే. 2018లో రియల్ మాడ్రిడ్ మిడ్‌ఫీల్డర్ లుకా మోడ్రిక్, తాజాగా రాబర్ట్ ఈ అవార్డును అందుకున్నారు. మహిళల విభాగంలో ఈ ఏడాది అత్యుత్తమ ప్లేయర్‌గా లూసీ బ్రాంజ్ (ఇంగ్లండ్) నిలిచింది. -
కోలుకున్న రొనాల్డో
ట్యూరిన్: సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నాడు. ఇటీవల ఈ దిగ్గజ స్ట్రయికర్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ట్యూరిన్‌లోని సొంతింట్లో చికిత్స తీసుకుంటూ ఐసోలేషన్‌కే పరిమితమయ్యాడు. 19 రోజుల తర్వాత పూర్తిగా కోలుకోవడంతో యువెంటస్ క్లబ్ సంతోషం వెలిబుచ్చింది. ‘రొనాల్డో కులుకున్నాడు. ఇక అతని ఐసోలేషన్ ముగిసింది. తాజా స్వాబ్ టెస్టులో నెగెటివ్ రిపోర్టు వచ్చింది’ జట్టు వర్గాలు తెలిపాయి. కోవిడ్ సోకడంతో యువెంటస్ క్లబ్ తరఫున గత మూడు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. సిరీ ‘ఎ’లో క్రొటోన్, వెరోనా జట్లతో, చాంపియన్స్ లీగ్‌లో బార్సిలోనాతో జరిగిన మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు. నేడు యువెంటస్... స్పెజియా క్లబ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో లేదంటే బుధవారం ఫెరెంక్వారోస్తో జరిగే మ్యాచ్‌లోనైనా అతను బరిలోకి దిగే అవకాశలున్నాయి. -
రొనాల్డో మళ్లీ ‘పాజిటివ్’
ట్యూరిన్ (ఇటలీ): మేటి ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డోను కరోనా వదలడం లేదు. అతనికి మూడోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ కోవిడ్–19 పాజిటివ్‌గా తేలాడు. చాంపియన్స్ లీగ్‌లో యువెంటస్ (ఇటలీ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ పోర్చుగల్ స్టార్ ఫార్వర్డ్‌కు మంగళవారం సాయంత్రం పరీక్షలు నిర్వహించగా అతనిలో ఇంకా వైరస్ లక్షణాలు ఉన్నాయని తేలింది. దాంతో బుధవారం రాత్రి చాంపియన్స్ లీగ్ గ్రూప్ ‘జి’లో భాగంగా స్టార్ ప్లేయర్ లయెనల్ మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తోన్న బార్సిలోనా క్లబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌కు రొనాల్డో దూరమయ్యాడు. రెండు వారాల క్రితం వైరస్ బారిన పడిన రొనాల్డో ప్రస్తుతం ఇటలీలో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. చదవండి: ‘కరోనా వైరస్’ ఓ పెద్ద మోసం: రొనాల్డో సోదరి -
‘కరోనా వైరస్’ ఓ పెద్ద మోసం: రొనాల్డో సోదరి
లిస్బన్ : దిగ్గజ పుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు కరోనా వైరస్ పాజిటివ్ రావటంపై అతడి సోదరి కతియా అవీరో అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా పేరిట ప్రపంచవ్యాప్తంగా పెద్ద మోసం జరుగుతోందని ఆమె ఆరోపించారు. గురువారం ఇన్స్టాగ్రామ్ వేదికగా కతియా స్పందించారు. వరుస పోస్టులతో తన అసహనాన్ని వెళ్లగక్కారు. ‘‘ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచాన్ని మేల్కొలిపే వ్యక్తని అంటే గనుక.. అతడు నిజంగా ఓ దేవదూతని చెబుతాను’’.. ‘‘నాతో పాటు కొన్ని వేల మంది ప్రజలు కరోనాను.. నిర్ధారణ పరీక్షలను.. తీసుకుంటున్న నివారణా చర్యలను నమ్ముతున్నారు. ఇది నేను నా జీవితంలో చూసిన అతి పెద్ద మోసం ’’ అని ఆమె పేర్కొన్నారు. (వైరల్ : రొనాల్డో నైటీ వేసుకున్నాడా? ) కాగా, రొనాల్డోకు కరోనా వైరస్ సోకిందని పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ మంగళవారం అధికారికంగా ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం స్వీడన్‌తో తలపడాల్సిన నేషన్స్ లీగ్ మ్యాచ్‌నుంచి సైతం ఆయన వైదొలిగారు. -
రొనాల్డో 'పాజిటివ్'
లిస్బన్: క్రీడా ప్రపంచంలోని మరో మేటి ప్లేయర్ కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు స్టార్ ఫార్వర్డ్, యువెంటస్ క్లబ్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దాంతో యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్ఏ) నేషన్స్ లీగ్ టోర్నీలో భాగంగా నేడు స్వీడన్‌తో జరిగే మ్యాచ్‌లో 35 ఏళ్ల రొనాల్డో పాల్గొనడం లేదని పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య తెలిపింది. ‘రొనాల్డోకు ఎలాంటి లక్షణాలు లేవు. ప్రస్తుతం అతను స్వీయనిర్బంధంలో ఉన్నాడు. రొనాల్డోతో కలిసి ప్రాక్టీస్ చేసిన జట్టు సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ ఫలితం వచ్చింది. వారందరూ స్వీడన్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగుతారు’ అని పోర్చుగల్ సమాఖ్య వివరించింది. ఐదుసార్లు ‘వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం పొందిన రొనాల్డో ఇటీవల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 100 గోల్స్ పూర్తి చేసుకొని అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో 101 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. 109 గోల్స్‌తో ఇరాన్ ప్లేయర్ అలీ దాయి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గతవారం నేషన్స్ లీగ్‌లో భాగంగా ఫ్రాన్స్‌తో 0–0తో ‘డ్రా’గా ముగిసిన మ్యాచ్‌లో... స్పెయిన్‌తో 0–0తో ‘డ్రా’గా ముగిసిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో రొనాల్డో పాల్గొన్నాడు. గతంలో ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్, బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెమార్, బాస్కెట్‌బాల్ స్టార్ కెవిన్ డురాంట్ కరోనా బారిన పడి కోలుకున్న వారిలో ఉన్నారు. -
రొనాల్డోకు కరోనా పాజిటివ్
లిస్బన్ : ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం నేషనల్ లీగ్ గేమ్స్ ఆడుతున్న కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే జట్టును వీడి హోంఐసోలేషన్‌కు వెళ్లినట్లు పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ పేర్కొంది. కాగా రొనాల్డొ కరోనా పాజిటివ్ అని తేలినా ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దీంతో అతను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడని ఫుట్‌బాల్ ఫెడరేషన్ తెలిపింది. మరోవైపు కరోనా బారిన పడిన రొనాల్డో త్వరగా కోలుకోవాలంటూ అతని అభిమానులు ప్రార్థిస్తున్నారు. కాగా రొనాల్డొ పోర్చుగల్ జట్టు తరపున 134 మ్యాచ్‌ల్లో 90 గోల్స్ సాధించాడు. -
వైరల్ : రొనాల్డో నైటీ వేసుకున్నాడా?
లిస్బన్ : క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన దిగ్గజ ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు. తాజాగా వెల్లడించిన ఫోర్బ్స్ జాబితాలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 11 కోట్ల 70 లక్షల డాలర్ల (దాదాపు రూ. 860 కోట్లు) ఆర్జనతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇటలీలో యువెంటస్ క్లబ్‌కు ఆడుతున్న రొనాల్డో వేతనం ద్వారా 70 కోట్ల డాలర్లు... ఎండార్స్మెంట్ల ద్వారా 47 కోట్ల డాలర్లు పొందుతున్నాడు.రొనాల్డో.. పోర్చుగల్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఫుట్‌బాల్ క్లబ్ లీగ్స్‌కు ఆడుతూ ప్రపంచవ్యాప్త అభిమానులను సంపాదించాడు. (చదవండి : 'రోహిత్ ఇది నాది.. వెళ్లి సొంత బ్యాట్ తెచ్చుకో') తాజాగా రొనాల్డో తన ట్విటర్లో ఒక ఫోటోను షేర్ చేశాడు. 2వేల పౌండ్ల( రూ. కోటి 80 లక్షలు) ధర కలిగిన లూయిస్ సిల్క్ డ్రెస్ సెట్ వేసుకొని.. దాదాపు 5.5 మిలియన్ పౌండ్ల(రూ. 40 కోట్లు) ధర పెట్టి కొనుగోలు చేసిన తన క్రూసింగ్ షిప్లో దిగిన ఫోటోను ట్విటర్లో పెట్టాడు. షిప్ బాల్కనీలో కూర్చొని సన్‌సెట్‌ను ఆస్వాధిస్తూ 'వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు రొనాల్డో పెట్టిన ఫోటోలపై నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నా అని క్యాప్షన్ పెట్టిన రొనాల్డో ముఖంలో మాత్రం ఆ సంతోషం కనబడటం లేదని నెటిజన్లు వాపోయారు. తన ముఖం చూస్తే ఏదో బాధతో కుమిలిపోతున్నట్లు కనిపిస్తుంది. ఫోటోకు ఫోజిచ్చినప్పుడు కనీసం నవ్వాలన్న సోయి కూడా రొనాల్డోకు లేదు.. ఇదేం ఎంజాయ్‌మెంటో మాకు అర్థం కావడం లేదు అంటూ కామెంట్లు పెట్టారు. రొనాల్డో ట్వీట్ చూసి కొంతమంది మరింత ముందుకెళ్లి.. 'ఇదేంటీ మమ్మీ.. రొనాల్డో నీ నైటీ ఎందుకు ఎందుకు వేసుకున్నాడు.. అచ్చం జైలు నుంచి పారిపోయిన ఖైదీలా కనిపిస్తున్నావు.. రొనాల్డో మా హార్ట్ బ్రేక్ చేశావు.. రొనాల్డో.. నీ డ్రెస్ సెన్స్ అస్సలు బాగాలేదు..' అంటూ వరుస ట్వీట్లతో ట్రోల్ చేశారు. What a beautiful 🌅🙏 pic.twitter.com/GvOCmoBKjt — Cristiano Ronaldo (@Cristiano) September 14, 2020