స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు భారీ షాక్ తగిలింది. మెస్సీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను ఇతనిపై ఓ మ్యాచ్ నిషేధం పడింది. వివరాల్లోకి వెళితే.. పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ అయిన రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ అయిన అల్ నస్ర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. స్థానికంగా జరిగే ప్రో లీగ్‌లో భాగంగా అల్ నస్ర్.. రియాద్ క్లబ్ అయిన అల్ షబాబ్‌తో తలపడింది. ఈ మ్యాచ్ సందర్భంగా రొనాల్డో.. మెస్సీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.
🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨
— نواف الآسيوي 🇸🇦 (@football_ll55) February 25, 2024
تصرف كارثي جديد من كريستيانو رونالدو ضد جمهور الشباب بعد نهاية اللقاء!
😳😳😳😳😳 pic.twitter.com/Tzt632I20p
మెస్సీ అభిమానులను టార్గెట్ చేస్తూ జుగుప్సాకరమైన సంజ్ఞలు చేశాడు. రొనాల్డో ప్రవర్తనను సీరియస్‌గా తీసుకున్న లీగ్ నిర్వహకులు అతనిపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. అలాగే జరిమానా కింద 20000 సౌదీ రియాల్స్ కట్టాల్సిందిగా ఆదేశించారు. రొనాల్డో వికృత ప్రవర్తనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ ఉదంతంపై రొనాల్డో తాజాగా స్పందించాడు. యూరప్ దేశాల్లో ఇది కామనేనని సమర్ధించుకున్నాడు. కాగా, అల్ నస్ర్ క్లబ్ రెండున్నర సంవత్సరాల కాలానికి గాను రొనాల్డోతో రూ. 4400 కోట్ల మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment