మెస్సీ జట్టుకు షాకిచ్చిన రొనాల్డో టీమ్‌ | Cristiano Ronaldo Al Nassr Thrashes Lionel Messi Inter Miami Team In A Friendly Match | Sakshi
Sakshi News home page

మెస్సీ జట్టుకు షాకిచ్చిన రొనాల్డో టీమ్‌

Published Fri, Feb 2 2024 6:19 PM | Last Updated on Fri, Feb 2 2024 6:38 PM

Cristiano Ronaldo Al Nassr Thrashes Lionel Messi Inter Miami Team In A Friendly Match - Sakshi

ఇద్దరు ఫుట్‌బాల్‌ దిగ్గజాలు ప్రాతినిథ్యం వహిస్తున్న క్లబ్‌ల మధ్య నిన్న ఫెండ్లీ మ్యాచ్‌ జరిగింది. రియాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ, పోర్చుగల్‌ ఐకాన్‌ క్రిస్టియానో  రొనాల్డో ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంటర్‌ మయామీ (అమెరికా), అల్‌ నస్ర్‌ (సౌదీ అరేబియా) జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రొనాల్డో జట్టు అల్‌ నస్ర్‌.. మెస్సీ జట్టు ఇంటర్‌ మయామీపై 6-0 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది.

గాయం కారణంగా క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్‌ మొత్తంలో పాల్గొనలేదు. మెస్సీ మాత్రం కాసేపు అభిమానులను అలరించాడు. సమయ పరిమితి నిబంధన కారణంగా మెస్సీ గేమ్‌ చివర్లో కొద్ది నిమిషాలు మైదానంలో కనిపించాడు. రొనాల్డో, మెస్సీ ఆడకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉ‍న్న ఫుట్‌బాల్‌ అభిమానులు ఈ మ్యాచ్‌ను ఎంతో ఆసక్తిగా తిలకించాడు.

రొనాల్డో స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్‌ను వీక్షించాడు. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో రొనాల్డో, మెస్సీ ముఖాల్లోని హావభావాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. తమ ఆరాథ్య ఆటగాళ్లు మ్యాచ్‌ ఆడకపోయినా ఈ మ్యాచ్‌ను కొన్ని కోట్ల మంది తిలకించారు. ఈ మ్యాచ్‌లో అల్‌ నస్ర్‌ ఆటగాడు, బ్రెజిల్‌కు చెందిన టలిస్క హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించగా.. టెల్లెస్‌, ఆక్టేవియో, లాపోర్టే తలో గోల్‌ కొట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement