Sunil Chhetri Becomes 4h Highest International Goal Scorer - Sakshi
Sakshi News home page

#SunilChhetri: హ్యాట్రిక్‌ గోల్స్‌తో రికార్డు.. టాప్‌-4లో సునీల్‌ ఛెత్రి

Published Thu, Jun 22 2023 7:00 AM | Last Updated on Thu, Jun 22 2023 8:20 AM

Sunil Chhetri Hat-trick-Become 4h-Highest International Goal-Scorer - Sakshi

భారత ఫుట్‌బాల్‌ స్టార్‌ సునీల్‌ ఛెత్రి అంతర్జాతీయ గోల్స్‌ పరంగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన క్రీడాకారుల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత జట్టు తరఫున 138వ మ్యాచ్‌ ఆడిన సునీల్‌ ఛెత్రి 90 గోల్స్‌ చేశాడు.

ఇక టాప్‌–3లో క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్‌–123 గోల్స్‌), అలీ దాయి (ఇరాన్‌–109 గోల్స్‌), మెస్సీ (అర్జెంటీనా–103 గోల్స్‌) ఉన్నారు.2005లో జూన్‌ 12న భారత సీనియర్‌ జట్టు తరఫున అరంగేట్రం చేసిన 38 ఏళ్ల సునీల్‌ ఛెత్రి తొలి గోల్‌ కూడా పాకిస్తాన్‌ జట్టుపైనే రావడం విశేషం.

దక్షిణాసియా ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు భారీ విజయంతో శుభారంభం చేసింది. పాకిస్తాన్‌ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో భారత్‌ 4–0 గోల్స్‌ తేడాతో  ఘనవిజయం నమోదు చేసింది. కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి (10వ, 16వ, 74వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్‌’ సాధించగా... మరో గోల్‌ను ఉదాంత సింగ్‌ (81వ ని.లో) అందించాడు.

1952 తర్వాత భారత ఫుట్‌బాల్‌ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్‌ కూడా ఇవ్వకపోవడం ఇదే ప్రథమం. శనివారం తమ తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్‌ ఆడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement