Sunil Chhetri
-
సునీల్ ఛెత్రి హ్యాట్రిక్
బెంగళూరు: స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి (8వ, 73వ, 90+8వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించడంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ ఏడో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో బెంగళూరు జట్టు 4–2 గోల్స్‌తో కేరళ బ్లాస్టర్స్‌పై గెలుపొందింది. భారత మాజీ కెపె్టన్ ఛెత్రి ఐఎస్ఎల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన పెద్ద వయసు్కడి (40 ఏళ్ల 126 రోజులు)గా రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో ఓగ్బచే (38 ఏళ్ల 96 రోజుల్లో) పేరిట ఉన్న ఈ రికార్డును ఛెత్రి తిరగరాశాడు. ర్యాన్ విలియమ్స్ (38వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. కేరళ బ్లాస్టర్స్ తరఫున జీసెస్ జిమెన్జ్ (56వ నిమిషంలో), ఫ్రెడ్డీ (67వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. నిర్ణీత సమయంలో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై ఐదుసార్లు దాడి చేసి అందులో నాలుగు గోల్స్ సాధించగా.. కేరళ బ్లాస్టర్స్ ఏడుసార్లు ప్రయతి్నంచి అందులో రెండు సార్లు మాత్రమే సఫలమైంది. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ 7 విజయాలు, 2 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 23 పాయింట్లు ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కేరళ జట్టు 11 పాయింట్లతో పట్టిక పదో స్థానంలో నిలిచింది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ 2–0 గోల్స్ తేడాతో చెన్నైయిన్ ఎఫ్‌సీపై గెలుపొందింది. ఈస్ట్ బెంగాల్ జట్టు తరఫున విష్ణు (54వ నిమిషంలో), జాక్సన్ సింగ్ (84వ నిమిషంలో) చెరో గోల్‌తో సత్తా చాటారు. -
బెంగళూరు ‘హ్యాట్రిక్’ గెలుపు
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. మోహన్ బగాన్ సూపర్ జెయింట్ క్లబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. బెంగళూరు తరఫున ఎడ్గర్ మెండెజ్ (9వ ని.లో), సురేశ్ సింగ్ (20వ ని.లో), భారత మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రి (51వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఐఎస్ఎల్ చరిత్రలో సునీల్ ఛెత్రికిది 64వ గోల్ కావడం విశేషం. ఈ గోల్‌తో ఐఎస్ఎల్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా సునీల్ ఛెత్రి అవతరించాడు. 63 గోల్స్‌తో బార్ట్ ఒగ్బెచె (నైజీరియా; హైదరాబాద్ ఎఫ్‌సీ) పేరిట ఉన్న రికార్డును సునీల్ ఛెత్రి అధిగమించాడు. శనివారం జరిగిన మరో మ్యాచ్‌లో ఒడిశా ఎఫ్‌సీ 2–1తో జంషెడ్పూర్ ఎఫ్‌సీ జట్టును ఓడించింది. గువాహటిలో నేడు జరిగే మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టుతో కేరళ బ్లాస్టర్స్ జట్టు తలపడుతుంది. -
సునీల్ ఛెత్రి వీడ్కోలు
కోల్‌కతా: రెండు దశాబ్దాలుగా భారత ఫుట్‌బాల్ ముఖచిత్రంగా ఉన్న సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 ఆసియా జోన్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గురువారం కువైట్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌ను సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకుంది.నిర్ణీత సమయంలోపు రెండు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. నాలుగో నిమిషంలో కువైట్ ప్లేయర్ ఈద్ అల్ రషీది కొట్టిన షాట్‌ను భారత గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నిలువరించాడు. అనంతరం 11వ నిమిషంలో అన్వర్ అలీ కొట్టిన హెడర్ షాట్ లక్ష్యాన్ని చేరలేకపోయింది. 48వ నిమిషంలో భారత ప్లేయర్ రహీమ్ అలీ ‘డి’ ఏరియాలోకి వెళ్లినా అతను కొట్టిన షాట్లో బలం లేకపోవడంతో బంతి నేరుగా కువైట్ గోల్‌కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు జట్లకు గోల్ చేసేందుకు ఒకట్రెండు అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాయి. భారత్ తన చివరి మ్యాచ్‌ను జూన్ 11న ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో ఆడనుంది. 2005లో జాతీయ సీనియర్ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన సునీల్ ఛెత్రి ఓవరాల్‌గా భారత్ తరఫున 151 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 94 గోల్స్ సాధించాడు. ఇందులో నాలుగు ‘హ్యాట్రిక్’లున్నాయి. జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాలర్స్ జాబితాలో ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 206 మ్యాచ్‌ల్లో 128 గోల్స్), అలీ దాయ్ (ఇరాన్; 149 మ్యాచ్‌ల్లో 109 గోల్స్); లయనెల్ మెస్సీ (అర్జెంటీనా; 180 మ్యాచ్‌ల్లో 106 గోల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. రికార్డుస్థాయిలో ఏడుసార్లు జాతీయ ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్ అవార్డు గెల్చుకున్న సునీల్ ఛెత్రికి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’ (2021లో)... అర్జున అవార్డు (2011లో), పద్మశ్రీ (2019లో) లభించాయి. -
భారత్ తరఫున చివరిసారి బరిలోకి సునీల్ ఛెత్రి... నేడు కువైట్‌తో భారత్ పోరు
ప్రపంచకప్ 2026 ఫుట్‌బాల్ టోర్నీ రెండో రౌండ్ ఆసియా జోన్ క్వాలిఫయర్స్‌లో భాగంగా నేడు కువైట్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే మూడో రౌండ్‌కు అర్హత పొందే అవకాశాలు మెరుగవుతాయి. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో రాత్రి 7 గంటల నుంచి జరగనున్న ఈ మ్యాచ్ భారత దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్లో చివరి మ్యాచ్ కానుంది. 2005లో తొలిసారి భారత సీనియర్ జట్టుకు ఆడిన 39 ఏళ్ల ఛెత్రి ఇప్పటి వరకు 150 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని 94 గోల్స్ సాధించాడు. జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాలర్స్ జాబితాలో ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 206 మ్యాచ్‌ల్లో 128 గోల్స్), అలీ దాయ్ (ఇరాన్; 149 మ్యాచ్‌ల్లో 109 గోల్స్); లయనెల్ మెస్సీ (అర్జెంటీనా; 180 మ్యాచ్‌ల్లో 106 గోల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఆసియా క్వాలిఫయర్స్ గ్రూప్ ‘ఎ’లో ప్రస్తుతం ఖతర్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత్, అఫ్గానిస్తాన్ జట్లు నాలుగు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. -
ఒకే ఒక్కడు.. పుట్‌బాల్ స్టార్ సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ ప్రకటన (ఫొటోలు)
-
Sunil Chhetri: భారత ఫుట్‌బాల్ దిగ్గజం కీలక ప్రకటన
భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు తొమ్మిది నిమిషాల నిడివితో కూడిన వీడియో సందేశం ద్వారా గురువారం ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫికేషన్ పోటీలో భాగంగా కువైట్‌తో జూన్ 6న జరిగే మ్యాచ్ తన కెరీర్లో చివరిదని సునిల్ ఛెత్రి తెలిపాడు. ‘‘గత 19 ఏళ్ల కాలంలో విధి నిర్వహణ, ఒత్తిడి.. సంతోషాలు.. ఇలా ఎన్నో భావోద్వేగాలను నెమరువేసుకుంటూనే వచ్చాను. దేశం కోసం నేను ఇన్ని మ్యాచ్‌లు ఆడతానని అస్సలు ఊహించలేదు. మంచో.. చెడో.. గత రెండున్నర నెలలుగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నా. ఈ అనుభూతి నాకు కొత్తగా ఉంది. కువైట్‌తో ఆడే మ్యాచ్ నా చివరి మ్యాచ్ అవుతుంది’’ అని సునిల్ ఛెత్రి భావోద్వేగానికి లోనయ్యాడు.రొనాల్డో, మెస్సీ తర్వాత..1984, ఆగష్టు 3న సికింద్రాబాద్‌లో జన్మించిన సునిల్ ఛెత్రి.. ప్రఖ్యాత మోహన్ బగాన్ క్లబ్ తరఫున 2002లో తన ఫ్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు.ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2005లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా జూన్ 12న భారత జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ ఆరంభించాడు. దాయాది జట్టుపై గోల్ కొట్టి ఖాతా తెరిచాడు. అనతికాలంలోనే భారత జట్టు కెప్టెన్‌గా ఎదిగాడు.మొత్తంగా తన ఇంటర్నేషనల్ కెరీర్లో సునిల్ ఛెత్రి 150 మ్యాచ్‌లలో 94 గోల్స్ సాధించాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ఫుట్‌బాలర్లలో క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగీస్), లియోనల్ మెస్సీ(అర్జెంటీనా) తర్వాత ఛెత్రినే అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా ఉండటం విశేషం. అందుకున్న పురస్కారాలు👉అర్జున అవార్డు👉పద్మశ్రీ👉ఖేల్‌రత్న👉ఏఐఎఫ్ఎఫ్ వార్షిక అత్యుత్తమ ఆటగాడిగా ఏడుసార్లు అవార్డు👉మూడుసార్లు ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు👉శాఫ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీచదవండి: Sunil Chhetri Life Story In Telugu: సికింద్రాబాద్‌లో పుట్టిన ఛెత్రీ.. కుటుంబ నేపథ్యం ఇదే! కెప్టెన్ ఫెంటాస్టిక్‌గా ఘనతలు -
చరిత్ర సృష్టించనున్న భారత కెప్టెన్.. తొలి ఇండియన్‌గా రికార్డు
గువాహటి: భారత ఫుట్‌బాల్ జట్టు ఇప్పుడు సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయిర్స్లో భాగంగా సౌదీ అరేబియాలో జరిగిన అఫ్గానిస్తాన్ హోం మ్యాచ్ ఒక్క గోల్ నమోదు కాకుండానే ‘డ్రా’గా ముగిసింది. ఇప్పుడు సొంత ప్రేక్షకుల మధ్య మంగళవారం జరిగే పోరులో భారత్ గోల్సే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18 చానెల్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మరోవైపు భారత దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రికిది 150వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. 2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన సునీల్ ఛెత్రి... 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 93 గోల్స్ చేశాడు. భారత్ తరఫున 150 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడు ఛెత్రినే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 40 మంది మాత్రమే 150 మ్యాచ్‌ల మైలురాయిని తాకారు. -
సికింద్రాబాద్‌లో పుట్టిన ఛెత్రీ.. ఫుట్‌బాల్ అంటే ప్రాణం! కెప్టెన్ ఫెంటాస్టిక్..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న క్రీడ ఫుట్‌బాల్. ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనకు లోకమంతా ఊగిపోతుంది. వ్యక్తిగత ఆర్జనలో, అభిమానంలో కూడా ఆటగాళ్ల స్థాయి ఆకాశమంత ఎత్తున ఉంటుంది. కానీ భారత్‌లో మాత్రం అంతా భిన్నం. ఫుట్‌బాల్ క్రీడకు కనీస గుర్తింపు లేకపోగా దేశం తరఫున ఆడే ఆటగాళ్ల పేర్లు కూడా ఎవరూ చెప్పలేని స్థితి. కానీ ఇలాంటి చోట కూడా తన ఆటతో భారత ఫుట్‌బాల్‌కు ఒకే ఒక్కడు చిరునామాగా మారాడు. జట్టు పరాజయాలు మాత్రమే ప్రధాన దృష్టిని ఆకర్షించే సమయంలో అతని ఆట గురించి అందరూ మాట్లాడుకునేలా చేయగలగడమే ఆ ఆటగాడి ఘనత. ఒక బలహీన జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ కూడా తన అసాధారణ ప్రదర్శనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలగడం అతనికే చెల్లింది. 18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఏ భారత ఆటగాడికీ సాధ్యం కాని ఘనతలు, రికార్డులతో చరిత్ర లిఖించిన ఆ ఆటగాడే సునీల్ ఛెత్రీ. మైదానంలో ఫార్వర్డ్‌గా, భారత జట్టు కెప్టెన్ హోదాలో ఛెత్రీ దాటిన మైలురాళ్లు ఎన్నో! 39 ఏళ్ల వయసులోనూ అమితోత్సాహంతో భారత జట్టును నడిపిస్తూ, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో వంద గోల్స్ కీర్తికి చేరువవుతూ అతను సాగిస్తున్న ప్రస్థానం అసాధారణం. భారత ఫుట్‌బాల్‌కు సంబంధించి మరో మాటలకు తావు లేకుండా ఆల్‌టైమ్ దిగ్గజం అనగలిగే ఆటగాడు ఛెత్రీ. ‘భారత ఫుట్‌బాల్ అభిమానులారా.. మీరంతా పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చి మాకు మద్దతు పలకండి. మైదానంలో ఫ్యాన్స్ అండగా ఉంటే విజయానికి కావలసిన ప్రేరణ లభిస్తుంది. మీరు ఆటకు మద్దతు పలికితేనే భారత్‌లో ఫుట్‌బాల్ స్థాయి పెరుగుతుంది!’ ఎక్కడైనా మనజట్టు కీలక మ్యాచ్ ఆడుతున్న సమయంలో ప్రతిసారీ కెప్టెన్ నుంచి ఇలాంటి విజ్ఞప్తి వస్తూ ఉంటుంది. ఆసియా చాలెంజ్ కప్.. శాఫ్ చాంపియన్‌షిప్.. ఇంటర్ కాంటినెంటల్ కప్.. ఇలా ఏ టోర్నీలో భారత్ ఆడినా సునీల్ ఛెత్రీ అభిమానులను ఉత్సాహపరచే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు తాను ఉన్న స్థితిలో అతనికి దీని వల్ల ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఫుట్‌బాల్‌పై అతనికి ఉన్న అమిత ప్రేమే అందుకు కారణం. భారత్‌లో ఆట స్థాయిని పెంచేందుకు అన్ని రకాలుగా తాము చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటని, అందులో తప్పేమీ లేదనేది అతని భావన. నిజంగానే ఛెత్రీ కారణంగానే గతంతో పోలిస్తే ఇటీవల భారత అభిమానులు కూడా జాతీయ జట్టు ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లపై, వాటి ఫలితాలపై ఆసక్తి చూపిస్తున్నారనేది వాస్తవం. ఫ్యాన్స్‌ను స్టేడియానికి రప్పించగల సత్తా ఒక్క ఛెత్రీకే ఉందనేది కూడా అన్నింటికి మించిన వాస్తవం. తల్లిదండ్రుల నుంచి.. భారత సైన్యంలో కోర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ (సీఈఎంఈ) ఒక భాగం. ఇందులో ఛెత్రీ తండ్రి ఆఫీసర్ హోదాలో పని చేసేవారు. ఆయన భారత ఆర్మీ జట్టు తరఫున ఫుట్‌బాల్ ఆడారు. తల్లి కూడా నేపాల్ ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దాంతో సహజంగానే ఫుట్‌బాల్.. ఛెత్రీ రక్తంలో ఉంది. తండ్రి సికింద్రాబాద్‌లో పని చేస్తున్న సమయంలో ఛెత్రీ పుట్టాడు. సికింద్రాబాద్ ఆర్మీ ఏరియా చుట్టూ ఉండే ఫుట్‌బాల్ వాతావరణం కూడా అతడిని బాగా ఆకర్షించింది. ఆ తర్వాత ఉద్యోగరీత్యా తండ్రి.. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్తూ ఉన్నా.. ఛెత్రీ మాత్రం ఫుట్‌బాల్‌ను వదిలిపెట్టలేదు. స్కూల్ స్థాయి నుంచే పోటీల్లో పాల్గొంటూ వచ్చిన అతను ఆటలో స్టార్ స్థాయికి చేరే వరకూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించాడు. ఢిల్లీలో కుర్రాడిగా స్థానిక లీగ్‌లలో ఆడుతున్నప్పుడు ఫార్వర్డ్ స్థానంలో అందరికంటే భిన్నంగా అద్భుత నైపుణ్యంతో దూసుకుపోయిన ఛెత్రీ ఆటతీరు నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) జట్లను ఆకర్షించింది. అదే అతని కెరీర్‌కు పునాది వేసింది. క్లబ్‌ల తరఫున సత్తా చాటి.. 18 ఏళ్ల వయసులో ఛెత్రీ తొలిసారి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లోకి అడుగు పెట్టాడు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కోల్‌కతాకు చెందిన మోహన్ బగాన్ క్లబ్ ఛెత్రీకి తొలి అవకాశం కల్పించింది. సీజన్లో ఆరు గోల్స్‌తో అతను సత్తా చాటాడు. టీమ్ ముందుకు వెళ్లకపోయినా ఛెత్రీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. దాంతో వరుసగా ఇతర క్లబ్‌ల దృష్టి అతనిపై పడింది. మోహన్‌బగాన్ తర్వాత జేసీటీ, ఈస్ట్ బెంగాల్, డెంపో, చిరాగ్ యునైటెడ్, చర్చిల్ బ్రదర్స్, ముంబై సిటీ, బెంగళూరు.. ఇలా భారత ఫుట్‌బాల్‌లో ప్రత్యేక విలువ ఉన్న, ప్రతిష్ఠాత్మక క్లబ్‌లు అన్నింటికీ ఛెత్రీ ప్రాతినిధ్యం వహించడం విశేషం. అమెరికాకు చెందిన కాన్సస్ సిటీ విజార్డ్స్ క్లబ్, పోర్చుగీస్‌కు చెందిన స్పోర్టింగ్ సీపీ క్లబ్ తరఫునా అతను ఆడాడు. ఎన్ఎఫ్ఎల్తో మొదలు పెట్టి ఐ లీగ్, మేజర్ లీగ్ సాకర్, లిగా ప్రొ, ఇండియన్ సూపర్ లీగ్‌లలో ఆడిన ఛెత్రీ 372 మ్యాచ్‌లలో బరిలోకి దిగి 175 గోల్స్‌తో ఆయా జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. జాతీయ స్థాయి టోర్నీ సంతోష్ ట్రోఫీలో ఛెత్రీ ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగాడు. రికార్డు ప్రదర్శనతో.. క్లబ్ స్థాయిలో ఛెత్రీ ప్రదర్శన జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టి పడేలా చేసింది. దాంతో 2004లో భారత అండర్–20 జట్టులోకి అతను ఎంపికయ్యాడు. నిలకడగా రాణించిన అతను దీనికి కొనసాగింపుగా భారత అండర్–23 టీమ్‌లో కూడా కీలక సభ్యుడిగా నిలిచాడు. 2005.. పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరం.. ఒక గొప్ప ఆటగాడిగా తొలి అడుగుకు వేదికగా నిలిచింది. భారత సీనియర్ జట్టుకు ఛెత్రీ తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు. పాకిస్తాన్‌తో జరిగిన ఈ పోరు డ్రాగా ముగియగా భారత్ తరఫున ఛెత్రీ ఏకైక గోల్ నమోదు చేశాడు. ఆ తర్వాత అతనే భారత ఫుట్‌బాల్‌కు పెద్ద దిక్కుగా మారాడు. టోర్నీ స్థాయి చిన్నదైనా, పెద్దదైనా ఛెత్రీ ఆటతోనే జట్టుపై ఆశలు, అంచనాలు. ఈ క్రమంలో తన నైపుణ్యంతో ఛెత్రీ అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు చెప్పుకోదగ్గ విజయాలు అందించాడు. ఆసియా చాలెంజ్ కప్ (ఒక సారి), శాఫ్ చాంపియన్‌షిప్ (4 సార్లు), నెహ్రూ కప్ (3 సార్లు), ఇంటర్కాంటినెంటల్ కప్ (2 సార్లు), ట్రై నేషన్ సిరీస్ (ఒక సారి).. ఈ టోర్నీల్లో భారత్‌ను విజేతగా నిలపడంతో ఛెత్రీతదే ప్రధాన పాత్ర. ఈ క్రమంలో భారత జట్టుకు ఎక్కువ సార్లు (145) ప్రాతినిధ్యం వహించిన, ఎక్కువ గోల్స్ (93) సాధించిన ఆటగాడిగా ఛెత్రీ నిలిచాడు. వరుస పురస్కారాలతో.. సుదీర్ఘ కాలంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఛెత్రీ ప్రదర్శన అతడిని సహజంగానే అందరికంటే అగ్రస్థానాన, భిన్నంగా నిలబెట్టింది. ఈ క్రమంలో పలు రికార్డులు, అవార్డులు అతని ఖాతాలో చేరాయి. ఏఐఎఫ్ఎఫ్ వార్షిక అత్యుత్తమ ఆటగాడి అవార్డును ఏడుసార్లు గెలుచుకున్న అతను ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మూడు సార్లు గెలుచుకున్నాడు. శాఫ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు సార్లు అతను ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలవగా, లీగ్‌లలో పెద్ద సంఖ్యలో గెలుచుకున్న అవార్డులు వీటికి అదనం. కేంద్ర ప్రభుత్వ పురస్కారాల్లో అర్జున, పద్మశ్రీలను అందుకున్న ఛెత్రీ.. ఖేల్‌రత్న గెలుచుకున్న తొలి ఫుట్‌బాలర్‌గా నిలిచాడు. భారత మాజీ ఆటగాడు సుబ్రతా భట్టాచార్య కుమార్తె సోనమ్ భట్టాచార్యను పెళ్లి చేసుకున్న ఛెత్రీకి ఈ ఏడాది ఆగస్టులో అబ్బాయి పుట్టాడు. భారత జట్టు అంతర్జాతీయ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో వందో స్థానానికి అటూ ఇటూగానే ఉంటూ వచ్చినా ఛెత్రీ ఆటను మాత్రం ఫిఫా ప్రత్యేకంగా గుర్తించింది. 2022 వరల్డ్ కప్‌కు ముందు ఛెత్రీపై ఫిఫా మూడు భాగాల ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించింది. ‘కెప్టెన్ ఫెంటాస్టిక్’ పేరుతో తయారు చేసిన ఈ డాక్యుమెంటరీలో ఛెత్రీ అద్భుత కెరీర్ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
Asian Games 2023: బంగ్లాదేశ్‌పై భారత్ విజయం.. నాకౌట్ ఆశలు సజీవం
చైనాలోని హాంగ్ఝౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023 పురుషుల ఫుట్‌బాల్ ఈవెంట్లో భారత్ బోణీ కొట్టింది. రౌండ్ ఆఫ్ 16కు (నాకౌట్) చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా.. బంగ్లాదేశ్‌పై 1-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ 85వ నిమిషంలో పెనాల్టీ షూటౌట్లో గోల్ కొట్టి భారత్‌ను గెలిపించాడు. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య చైనా చేతిలో 1-5 గోల్స్ తేడాతో ఓడి, నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న భారత్.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శక్తివంచన లేకుండా పోరాడి బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో చైనా, మయన్మార్‌లతో సమానంగా 3 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 24న మయన్మార్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే భారత్ నేరుగా రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధిస్తుంది. రౌండ్ ఆఫ్ 16కు ఎలా..? ఏషియన్ గేమ్స్ పురుషుల ఫుట్‌బాల్‌లో భారత్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్‌లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఈ పోటీల్లో గ్రూప్‌కు నాలుగు జట్ల చొప్పున మొత్తం 6 గ్రూప్‌లు ఉన్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-2లో ఉన్న జట్లతో పాటు మూడో స్థానంలో నిలిచే మరో నాలుగు అత్యుత్తమ జట్లు రౌండ్ ఆఫ్ 16కు చేరతాయి. భారత్ అవకాశాలు ఎలా..? గ్రూప్-ఏలో చైనా, మయన్మార్ జట్లు ఇప్పటివరకు ఆడిన ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించి, తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో చైనా చేతిలో ఓడి, రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచిన భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్ గ్రూప్-ఏలో ఆఖరి స్థానంలో నిలిచి, టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్ తదుపరి మయన్మార్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే, గ్రూప్‌లో రెండో స్థానానికి ఎగబాకి నేరుగా రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధిస్తుంది. -
చైనా చేతిలో చిత్తుగా...
హాంగ్జూ (చైనా): ఆసియా క్రీడల కోసం ఫుట్‌బాల్ జట్టునే పంపడం లేదని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటన...నేరుగా ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ కోచ్ లేఖ...చివరకు గ్రీన్ సిగ్నల్...అత్యుత్తమ ఆటగాళ్లను ఇవ్వలేమంటూ ఐఎస్ఎల్ జట్ల కొర్రీలు...ఆఖరి నిమిషంలో తృతీయ శ్రేణి జట్టు ఎంపిక...కనీసం టీమ్ జెర్సీలపై ఆటగాళ్ల పేర్లు కూడా రాసుకోలేని స్థితి... ఇన్ని అడ్డంకుల తర్వాత ఎట్టకేలకు భారత ఫుట్‌బాల్ జట్టు సోమవారం సాయంత్రం చైనా గడ్డపై అడుగు పెట్టింది. కనీసం ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ లేదు...16 గంటల్లోనే మ్యాచ్ బరిలోకి...సబ్స్టిట్యూట్లుగా దించేందుకు తగినంత మంది కూడా బెంచీపై లేరు... చివరకు ఊహించినట్లుగానే ప్రతికూల ఫలితం వచ్చింది. తొలి పోరులో ఆతిథ్య చైనా చేతుల్లో చిత్తుగా ఓడి నిరాశను మిగిల్చింది. అధికారికంగా ఆసియా క్రీడలు ఈ నెల 23నుంచి ప్రారంభం అవుతున్నా...కొన్ని ఈవెంట్లు ముందే మొదలైపోయాయి. గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో చైనా 5–1 గోల్స్ తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 1–1తో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా...రెండో అర్ధభాగంతో నాలుగు గోల్స్‌తో చైనా చెలరేగింది. చైనా తరఫున జియావో టియాని (17వ నిమిషం), డీ వీజన్ (51వ నిమిషం), టావో కియాగ్లాంగ్ (72వ నిమిషం, 75వ నిమిషం), హావో ఫాంగ్ (90+2వ నిమిషం)లో గోల్స్ సాధించారు. భారత్ తరఫున ఏకైక గోల్‌ను కనోలీ ప్రవీణ్ రాహుల్ (45+1వ నిమిషం) నమోదు చేశాడు. మ్యాచ్ ఆసాంతం ఇరు జట్ల మధ్య తీవ్ర అంతరం కనిపించింది. 86 నిమిషాలు మైదానంలో ఉన్నా కెప్టెన్ సునీల్ ఛెత్రి ఏమీ చేయలేక చూస్తుండిపోయాడు. జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు మొత్తం 90 నిమిషాలు ఫీల్డ్ ఉండటం పరిస్థితిని చూపిస్తోంది. భారత్ ఈ గ్రూప్‌నుంచి ముందంజ వేయాలంటే తర్వాతి మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, మయన్మార్‌లపై తప్పనిసరిగా గెలవాలి. కంబోడియాను ఓడించి... వాలీబాల్‌లో మాత్రం భారత్ గెలుపుతో శుభారంభం చేసింది. ఈ పోరులో భారత్ 3–0 (25–14, 25–13, 25–19) తేడాతో తమకంటే బాగా తక్కువ ర్యాంక్ గల కంబోడియాను ఓడించింది. గ్రూప్ ‘సి’లో తమ తదుపరి మ్యాచ్‌లో రేపు అత్యంత పటిష్టమైన కొరియాను భారత్ ఎదుర్కోనుంది. -
ఆసియా క్రీడలకు భారత ఫుట్‌బాల్ జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) క్లబ్ జట్లు తమ పంతం నెగ్గించుకున్నాయి. ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఎంపిక చేసిన పలువురు అగ్రశ్రేణి సీనియర్, జూనియర్ ఆటగాళ్లను ఐఎస్ఎల్ క్లబ్‌లు విడుదల చేయలేదు. 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో కెప్టెన్ సునీల్ ఛెత్రి మినహా మిగతా వారంతా అనుభవంలేని ఆటగాళ్లే ఉన్నారు. సునీల్ ఛెత్రితోపాటు సీనియర్ గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్, సందేశ్ జింగాన్లను ఏఐఎఫ్ఎఫ్ ఎంపిక చేసింది. ఆసియా క్రీడల కోసం గుర్‌ప్రీత్‌ను బెంగళూరు ఎఫ్‌సీ, సందేశ్‌ను గోవా ఎఫ్‌సీ విడుదల చేసేందుకు ఆసక్తి చూపలేదు. భారత జట్టు వెంట రెగ్యులర్ కోచ్ ఇగోర్ స్టిమాక్ వెళ్తారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఆసియా క్రీడల ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఈనెల 19న మొదలుకానుండగా... ఐఎస్ఎల్ పదో సీజన్‌కు ఈనెల 21న తెరలేస్తుంది. భారత ఫుట్‌బాల్ జట్టు: ధీరజ్ సింగ్, గుర్మీత్ సింగ్ సుమిత్ రాఠి, నరేందర్ గెహ్లోట్, అమర్జీత్ సింగ్, శామ్యూల్ జేమ్స్, కేపీ రాహుల్, అబ్దుల్ రబీ, ఆయుశ్ దేవ్, బ్రైస్ మిరిండా, అజ్ఫర్ నూరాని, రహీమ్ అలీ, విన్సీ బరెటో, సునీల్ ఛెత్రి, రోహిత్ దాను, గుర్కీరత్ సింగ్, అనికేత్ జాదవ్. -
SAFF ఫుట్‌బాల్ ఛాంపియన్ భారత్.. 9వ సారి టైటిల్ కైవసం (ఫోటోలు)
-
చాంపియన్ భారత్
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్‌లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)లో తొమ్మిదోసారి భారత జట్టు చాంపియన్‌గా నిలి చింది. మంగళవారం జరిగిన ఫైనల్లో సునీల్ ఛెత్రి కెప్టెన్సీలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్’లో 5–4తో కువైట్ జట్టును ఓడించింది. కువైట్ పశి్చమ ఆసియా దేశమైనా పోటీతత్వం పెరగాలనే ఉద్దేశంతో దక్షిణాసియా టోరీ్నకి ఆ జట్టును ప్రత్యేకంగా ఆహా్వనించారు. లీగ్ దశలో కువైట్‌తో జరిగిన మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న భారత్ తుది పోరులో మాత్రం పైచేయి సాధించింది. ఆట 14వ నిమిషంలో అల్‌బలూషి గోల్‌తో కువైట్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 39వ నిమిషంలో లాలియన్జులా చాంగ్టే గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయలేకపోయాయి. అదనపు సమయంలోనూ స్కోరు సమంగానే ఉంది. దాంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ‘షూటౌట్’లో నిరీ్ణత ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. ఆరో షాట్లో భారత ప్లేయర్ మహేశ్ సింగ్ గోల్ చేయగా... కువైట్ ప్లేయర్ హజిహా కొట్టిన షాట్‌ను భారత గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ అడ్డుకోవడంతో టీమిండియా విజయం ఖాయమైంది. విజేతగా నిలిచిన భారత జట్టుకు 50 వేల డాలర్లు (రూ. 41 లక్షలు), రన్నరప్ కువైట్ జట్టుకు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 50 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 9: ‘శాఫ్’ చాంపియన్‌షిప్ ఇప్పటివరకు 13 సార్లు జరిగింది. భారత్ తొమ్మిదిసార్లు (1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021, 2023) టైటిల్ సాధించింది. 24: ‘శాఫ్’ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా సునీల్ ఛెత్రి అవతరించాడు. 23 గోల్స్‌తో అలీ అష్ఫాక్ (మాల్దీవులు) పేరిట ఉన్న రికార్డును 24 గోల్స్‌తో సునీల్ ఛెత్రి అధిగమించాడు. ‘షూటౌట్’ సాగిందిలా... భారత్ స్కోరు కువైట్ సునీల్ ఛెత్రి 4 10 అబ్దుల్లా 8 సందేశ్ జింగాన్ 4 21 అలోతైబి 4 లాలియన్జులా 4 32 ఆల్దెఫీరి 4 ఉదాంత సింగ్ 8 33 మహ్రాన్ 4 సుభాశ్ బోస్ 4 44 అల్ఖాల్ది 4 మహేశ్ సింగ్ 4 54 హజిహా 8 -
FIFA Rankings: టైటిల్ సాధించి.. టాప్- 100లో.. 1996లో అత్యుత్తమంగా..
స్వదేశంలో ఇటీవల జరిగిన ఇంటర్ కాంటినెంటల్‌కప్ నాలుగు దేశాల టోర్నీలో టైటిల్ సాధించినందుకు భారత జట్టు ర్యాంకింగ్స్‌లో పురోగతి కనిపించింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) తాజా ర్యాంకింగ్స్‌లో సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత పురుషుల జట్టు సరిగ్గా 100వ స్థానంలో నిలిచింది. క్రితంసారి భారత్ 101వ ర్యాంక్‌లో నిలువగా... ఈసారి ఒక స్థానం మెరుగుపర్చుకుంది. 2019 ఫిబ్రవరి 7 తర్వాత భారత జట్టు మళ్లీ టాప్–100లోకి రావడం ఇదే తొలిసారి. 2019 ఫిబ్రవరిలో భారత్ 97వ ర్యాంక్‌లో నిలిచింది. ఆ తర్వాత భారత ర్యాంక్ పడిపోయింది. 1996లో భారత్ అత్యుత్తమంగా 94వ ర్యాంక్‌లో నిలిచింది. ప్రస్తుతం భారత జట్టు స్వదేశంలో జరుగుతున్న దక్షిణాసియా చాంపియన్‌షిప్‌లో బరిలో ఉంది. శనివారం జరిగే సెమీఫైనల్లో లెబనాన్ జట్టుతో టీమిండియా తలపడుతుంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... ఫ్రాన్స్ రెండో ర్యాంక్‌లో, బ్రెజిల్ మూడో ర్యాంక్‌లో ఉన్నాయి. -
హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు.. టాప్-4లో సునీల్ ఛెత్రి
భారత ఫుట్‌బాల్ స్టార్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ గోల్స్ పరంగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత జట్టు తరఫున 138వ మ్యాచ్ ఆడిన సునీల్ ఛెత్రి 90 గోల్స్ చేశాడు. ఇక టాప్–3లో క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–123 గోల్స్), అలీ దాయి (ఇరాన్–109 గోల్స్), మెస్సీ (అర్జెంటీనా–103 గోల్స్) ఉన్నారు.2005లో జూన్ 12న భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన 38 ఏళ్ల సునీల్ ఛెత్రి తొలి గోల్ కూడా పాకిస్తాన్ జట్టుపైనే రావడం విశేషం. దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో శుభారంభం చేసింది. పాకిస్తాన్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో భారత్ 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి (10వ, 16వ, 74వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించగా... మరో గోల్‌ను ఉదాంత సింగ్ (81వ ని.లో) అందించాడు. 1952 తర్వాత భారత ఫుట్‌బాల్ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా ఇవ్వకపోవడం ఇదే ప్రథమం. శనివారం తమ తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్ ఆడుతుంది. IND vs PAK sees RED in the first half 🤯 India vs Pakistan is never fully complete without the fireworks and heated emotions 💥#INDvPAKonFanCode #SAFFChampionship2023 pic.twitter.com/xJLZTmcrp5 — FanCode (@FanCode) June 21, 2023 A perfectly placed Penalty by Sunil Chhetri and he gets his hattrick😍😍 pic.twitter.com/i2knCtsiH8 — Shanu 🇦🇷 (@secureboy23) June 21, 2023 -
పాక్‌పై భారత్ ఘన విజయం.. మ్యాచ్ మధ్యలో ఆటగాళ్ల గొడవ
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో శుభారంభం చేసింది. పాకిస్తాన్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో భారత్ 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి (10వ, 16వ, 74వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించగా... మరో గోల్‌ను ఉదాంత సింగ్ (81వ ని.లో) అందించాడు.శనివారం తమ తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్ ఆడుతుంది. మ్యాచ్ మధ్యలో భారత్-పాక్ ఆటగాళ్ల గొడవ.. పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ మొరటుగా వ్యవహరించడంతో ఆయనకు మ్యాచ్ రిఫరీ ప్రజ్వల్ ఛెత్రి రెడ్ కార్డు చూపించి మైదానం బయటకు పంపించారు. భారత జట్టు రెండో గోల్ చేసిన తర్వాత పాక్ ప్లేయర్ అబ్దుల్లా ఇక్బాల్ త్రో ఇన్ చేయడానికి సిద్ధంకాగా స్టిమాక్ అబ్దుల్లా నుంచి బంతిని లాక్కున్నారు. స్టిమాక్ చర్యకు పాక్ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. రిఫరీ జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దడంతోపాటు స్టిమాక్‌కు రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపించి మ్యాచ్‌ను కొనసాగించారు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో కువైట్ జట్టు 3–1తో నేపాల్ జట్టును ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో లెబనాన్‌తో బంగ్లాదేశ్; మాల్దీవులుతో భూటాన్ తలపడతాయి. IND vs PAK sees RED in the first half 🤯 India vs Pakistan is never fully complete without the fireworks and heated emotions 💥#INDvPAKonFanCode #SAFFChampionship2023 pic.twitter.com/xJLZTmcrp5 — FanCode (@FanCode) June 21, 2023 -
Intercontinental Cup: భారత్‌ను గెలిపించిన ఛెత్రి
భువనేశ్వర్: ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–0 గోల్ తేడాతో వనుతూను ఓడించింది. భారత్ తరఫున ఏకైక గోల్‌ను కెప్టెన్ సునీల్ ఛెత్రి 81వ నిమిషంలో సాధించాడు. తొలి మ్యాచ్‌లో శుక్రవారం మంగోలియాను 2–0తో ఓడించిన భారత్ తమకంటే చాలా తక్కువ ర్యాంక్‌లో ఉన్న వనుతూపై విజయం సాధించేందుకు కూడా శ్రమించాల్సి వచ్చింది. తొలి అర్ధభాగంలో చాలా వరకు బంతిని తమ ఆదీనంలోనే ఉంచుకున్నా...గోల్ చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. మైదానంలో తన భార్య సోనమ్ మ్యాచ్‌ను తిలకిస్తుండగా...త్వరలో తండ్రి కాబోతున్న సంకేతాన్ని ఛెత్రి తన గోల్ సంబరంలో ప్రదర్శించాడు. రెండు విజయాల తర్వాత 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ తమ చివరి పోరులో గురువారం లెబనాన్‌తో తలపడుతుంది. చదవండి: IND vs WI: టీమిండియా విండీస్ టూర్ షెడ్యూల్ ఖరారు.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే? -
IPL 2023: కోహ్లితో సునిల్ ముచ్చట! స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన ఫుట్‌బాల్ దిగ్గజం
IPL 2023- Royal Challengers Bangalore: భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లను కలిశాడు. ఆర్సీబీ క్రికెటర్ల ప్రాక్టీస్ మ్యాచ్ చూసేందుకు వచ్చి.. తానూ అందులో భాగమయ్యాడు. డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా ఐపీఎల్-2023లో ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. 1430 రోజుల తర్వాత కరోనా ఆంక్షల నేపథ్యంలో 1430 రోజుల తర్వాత సొంతమైదానంలో ఆర్సీబీ మొదటి మ్యాచ్ ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ముంబైతో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్సీబీ ఆటగాళ్లంతా ప్రాక్టీసులో తలమునకలయ్యారు. ఈ నేపథ్యంలో భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి.. తన స్నేహితుడు, ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సహా ఇతర ఆటగాళ్లతో మమేకమయ్యాడు. ఇద్దరు దిగ్గజాలు ఒకేఫ్రేములో వారితో ముచ్చటిస్తూ.. కలిసి ప్రాక్టీసు చేస్తూ సందడి చేశాడు. ఈ క్రమంలో ఓ స్టన్నింగ్స్ క్యాచ్ కూడా అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆర్సీబీ ట్విటర్లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. కోహ్లి, ఛెత్రిని ఒకే ఫ్రేములో చూసిన అభిమానులు.. ‘‘ఇద్దరు దిగ్గజాలు ఒకేచోట.. చూడటానికి ఎంత బాగుందో!’’ అని మురిసిపోతున్నారు. కాగా స్టార్ ఫుట్‌బాలర్ అంతర్జాతీయ కెరీర్లో ఇటీవలే 85వ గోల్ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. క్రిస్టియానో రొనాల్డో, అలీ దాయి, లియోనల్ మెస్సీ, మొక్తార్ దాహరి తర్వాతి స్థానంలో నిలిచాడు. ఇక ఇండియన్ సూపర్‌లీగ్‌లో సునిల్ ఛెత్రి... బెంగళూరు ఎఫ్సీకి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2023: ప్లీజ్.. అతడిని తప్పించండి! ఒక్కడి వల్ల ఇన్ని అనర్థాలు! ఆ ‘మహానుభావుడేమో’.. WC 2023: చెలరేగిన మగల, బవుమా.. వెస్టిండీస్ పాలిట శాపంలా సౌతాఫ్రికా! ‘ప్రపంచకప్’ రేసులో.. Thank you @pumacricket for bringing the legend home! #PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #RCBxPuma pic.twitter.com/I87yvEDNYe — Royal Challengers Bangalore (@RCBTweets) April 1, 2023 -
సాధించాడు.. టాప్-5లో భారత్ ఫుట్‌బాల్ స్టార్
ఫుట్‌బాల్‌లో భారత్ వెలుగులు లేకపోయినప్పటికి జట్టు స్టార్ ఆటగాడు..కెప్టెన్ సునీల్ ఛెత్రి మాత్రం వ్యక్తిగతంగా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూనే ఉన్నాడు. తాజాగా ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో సునీల్ ఛెత్రి ఐదో స్థానానికి చేరుకున్నాడు. ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం కిర్గిజ్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్ కొట్టడం ద్వారా సునీల్ అంతర్జాతీయ కెరీర్లో 85వ గోల్ నమోదు చేశాడు. ఈ క్రమంలో హంగేరీకి చెందిన ఫెరెన్క్ ఫుకాస్(85 మ్యాచ్‌ల్లో 84 గోల్స్)ను అధిగమించి టాప్-5లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 133 మ్యాచ్‌లాడిన సునీల్ ఛెత్రి 85 గోల్స్ నమోదు చేశాడు. ఇక తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో- పోర్చుగల్(198 మ్యాచ్‌ల్లో 122 గోల్స్) ఉండగా.. రెండో స్థానంలో అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్), అలీ దాయి- ఇరాన్(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్) మూడో స్థానంలో, మొక్తర్ దహారి- మలేషియా(142 మ్యాచ్‌ల్లో 89 గోల్స్) నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఆతిథ్య భారత జట్టు విజేతగా నిలిచింది. మణిపూర్‌లో మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–0 గోల్స్ తేడాతో కిర్గిజ్ రిపబ్లిక్ జట్టుపై గెలిచింది. భారత్ తరఫున సందేశ్ జింగాన్ (34వ ని.లో), సునీల్ చెత్రి (84వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. సునీల్ చెత్రి కెరీర్లో ఇది 85వ గోల్ కావడం విశేషం. ఈ టోర్నీలో ఆడిన మరో జట్టు మయన్మార్‌పై తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0తో విజయం సాధించింది. ....aaaaand that's #85 for Sunil Chhetri.pic.twitter.com/eUu6QHeUdE — Shyam Vasudevan (@JesuisShyam) March 28, 2023 📈 Most International Goals: 🇵🇹 Cristiano Ronaldo 𝟭𝟮𝟬 🇮🇷 Ali Daei 𝟭𝟬𝟵 🇦🇷 Lionel Messi 𝟵𝟵 🇲🇾 Mokhtar Dahari 𝟴𝟵 🇮🇳 Sunil Chhetri 𝟴𝟱 🇭🇺 Ferenc Puskás 𝟴𝟰 Sunil Chhetri becomes 5th all-time International Goalscorer. 🇮🇳🔥#IndianFootall #SC11 #BlueTigers pic.twitter.com/O1rU0ulunz — IFTWC - Indian Football (@IFTWC) March 28, 2023 చదవండి: అదే 26 పరుగులు.. శాసించిన చివరి ఓవర్ -
ISL 2023: బెంగళూరును గెలిపించిన సునీల్ ఛెత్రి
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మొద టి సెమీ ఫైనల్ తొలి అంచెలో ముంబై సిటీ ఎఫ్‌సీపై బెంగళూరు ఎఫ్‌సీ పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 1–0 గోల్ తేడాతో ముంబైని ఓడించింది. మ్యాచ్ 79వ నిమిషంలో స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రి చేసిన ఏకైక గోల్‌తో బెంగళూరు విజేతగా నిలిచింది. అయితే ఈ గెలుపుతో బెంగళూరు ఫైనల్ చేరడం ఖాయం కాలేదు. ఇంటా, బయటా పద్ధతిలో ఒక సెమీస్ మ్యాచ్‌ను రెండు అంచెలుగా నిర్వహిస్తుండగా... ఇరు జట్లు ఆదివారం బెంగళూరులో జరిగే రెండో అంచె పోరులో మళ్లీ తలపడతాయి. మరో వైపు రెండో సెమీఫైనల్లో భాగంగా గురువారం హైదరాబాద్ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్ మధ్య గురువారం హైదరాబాద్‌లో తొలి అంచె మ్యాచ్ జరుగుతుంది. -
సునీల్ ఛెత్రికి ఫిఫా అరుదైన గౌరవం
ప్రపంచానికి క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ పరిచయం అక్కర్లేని పేర్లు. ఫుట్‌బాల్ క్రీడలో ఈ ఇద్దరు ఎవరికి వారే సాటి. ఆటలోనూ.. పాపులారిటీ విషయంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి(Sunil Chhetri)పై ఫిఫా(FIFA) డాక్యుమెంటరీ రూపొందించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినా మన దేశం మాత్రం గర్వపడేలా చేసింది. రొనాల్డో, మెస్సీల లాగా సునీల్ ఛెత్రి ఫిఫా వరల్డ్‌కప్‌లు ఆడింది లేదు.. ప్రధాన ఫుట్‌బాల్ క్లబ్స్‌కు కూడా పెద్దగా ప్రాతినిధ్యం వహించింది లేదు. మరి ఫిఫా ఎందుకు సునీల్ ఛెత్రి డాక్యుమెంటరీ రూపొందించాలనుకుంది. పాపులారిటీ విషయంలో ఈ భారత కెప్టెన్ మెస్సీ, రొనాల్డోలతో సరితూగకపోవచ్చు కానీ.. గోల్స్ విషయంలో మాత్రం వారి వెనకాలే ఉన్నాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ రికార్డు పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉంది. రొనాల్డో 117 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో అర్జెంటీనా స్టార్ మెస్సీ 90 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి ఉన్నాడు. సునీల్ 131 మ్యాచ్‌ల్లో 84 గోల్స్ చేశాడు. సునీల్ ఛెత్రి రొనాల్డో, మెస్సీలాగా ప్రపంచకప్‌లు ఆడకపోవచ్చు.. కానీ అతని ఆటతీరుతో ఒక స్టార్‌గా గుర్తింపు పొందాడు. ఈ ఒక్క కారణంతోనే ఫిఫా సునీల్ ఛెత్రిపై డాక్యుమెంటరీ తీయాలని అనుకుంది. ఎవరికి తెలియని సునీల్ ఛెత్రి పేరును డాక్యుమెంటరీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యతను స్వయంగా ఫిఫా తీసుకుంది. భారతదేశం నుంచి ఫుట్‌బాల్‌లో హీరోగా వెలుగొందుతున్న సునీల్ ఛెత్రి లాంటి స్ట్రైకర్ ఎలా ఉద్భవించాడు.. అతని ఆటతీరును పరిచయం చేస్తూ డాక్యుమెంటరీ కొనసాగుతుంది. ఈ డాక్యుమెంటరీకి కెప్టెన్ ఫెంటాస్టిక్(Captain Fantastic Series) అని పేరు పెట్టిన ఫిఫా ఇటీవలే మొదటి సీజన్ విడుదల చేసింది. అంతా ఊహించినట్లుగానే 'కెప్టెన్ ఫెంటాస్టిక్ సిరీస్' డాక్యుమెంటరీ సూపర్‌హిట్ అయింది. అయితే కొన్నాళ్ల క్రితం సునీల్ ఛెత్రిపై ఫిఫా ఒక డాక్యుమెంటరీ రూపొందించనుందంటూ వార్తలు వచ్చాయి. అయితే మొదట ఛెత్రి, అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని నమ్మలేదు. ఎందుకంటే ఫిఫా ఒక ఆటగాడిపై డాక్యుమెంటరీ రూపొందింస్తుందంటే కచ్చితంగా గొప్ప ఆటగాడు అయి ఉండాలి. ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లు లేదా ఫుట్‌బాల్‌లో గొప్ప ఆట ఆడిన ఆటగాళ్లపై మాత్రమే ఫిఫా డాక్యుమెంటరీలు రూపొందిస్తుంది. ఈ విషయంలో సునీల్ ఛెత్రి చాలా దూరంలో ఉన్నాడు. ప్రతి నాలుగేళ్లకోసారి ఉపఖండంలో జరిగే ఆసియా కప్‌లో మాత్రమే సునీల్ ఛెత్రి ఆడేవాడు. ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి గోల్స్ చేస్తూ ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ల జాబితాలోకి అడుగుపెట్టిన సునీల్ ఎదుగుదల కథను ఫిఫా ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రిపై డాక్యుమెంటరీ మొదలుపెట్టింది. You know all about Ronaldo and Messi, now get the definitive story of the third highest scoring active men's international. Sunil Chhetri | Captain Fantastic is available on FIFA+ now 🇮🇳 — FIFA World Cup (@FIFAWorldCup) September 27, 2022 -
‘‘ఏం సాధించారని ఫొటోలకు ఫోజులు? సిగ్గులేదా?’’
వైరల్: ఫొటోల ఫోజులకు కోసం మన నేతలు ఎంతగా తాపత్రయపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరైతే ప్రత్యేకంగా షూట్లతోనే కాలం గడిపేస్తుంటారు కూడా. తాజాగా డురాండ్ కప్ ఫైనల్ అనంతరం జరిగిన టోర్నీ బహుకరణలో జరిగిన పరిణామాలపై నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఆదివారం కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్, ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ మధ్య డురాండ్ కప్ ఫైనల్ జరిగింది. సునీల్ ఛెత్రి సారథ్యంలోని బెంగళూరు ఎఫ్‌సీ 2-1తో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం టోర్నీ బహుకరణ సమయంలో ఈ ఫుట్‌బాల్ దిగ్గజానికి ఘోర అవమానం జరిగింది. టోర్నీ బహుకరణ సమయంలో ఫొటోలు తీస్తుండగా.. సునీల్ ఛెత్రిని పక్కకు నెట్టేసి మరీ ఫోటోలకు ఫోజు ఇచ్చారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ లా గణేశన్. దీంతో ‘‘ఫుట్‌బాల్ దిగ్గజానికి కనీస మర్యాద ఇవ్వవా? సిగ్గులేదా?. ఏం సాధించారని ఫొజులు’’ అంటూ గవర్నర్‌ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ ట్వీట్లు చేస్తున్నారు పలువురు అభిమానులు. ఇది ఇక్కడితోనే ఆగలేదు. అది కాకతాళీయంగా అనుకున్నా మరో వీడియోలో.. మ్యాచ్ విక్టరీకి కారణమైన శివశక్తి నారాయణన్‌ను పక్కకు నెట్టేశారు హాజరైన మరో రాజకీయ నాయకుడు. దీంతో ఏం ఒరగపెట్టారని ఫొటోల కోసం అంత తాపత్రయమంటూ మండిపడుతున్నారు పలువురు నెటిన్స్. ఫుట్‌బాల్ అభిమానులే కాదు మరోవైపు ఆటగాళ్లు సైతం ఈ చర్యలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. Ladies & gentlemen, bringing you Shri La. Ganeshan, honorable Governor of West Bengal. #DurandCup The high-headedness is audacious. Not expected of a respectable figure, @LaGanesan. A public apology surely won't be too much to ask for. #IndianFootballpic.twitter.com/aEq4Yq6a6R — Debapriya Deb (@debapriya_deb) September 18, 2022 This is what happened with shivshakti minutes before Chhetri. pic.twitter.com/TZmLP93Sdj — Akansh (@AkanshSai) September 18, 2022 -
సునీల్ ఛెత్రీ అరుదైన రికార్డు.. మెస్సీకి రెండు అడుగుల దూరంలో
ఫుట్‌బాల్ స్టార్.. భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ అరుదైన ఘనత సాధించాడు. ఏఎప్సీ ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ ఛెత్రీ ఆట 45వ నిమిషంలో గోల్‌తో మెరిశాడు. ఈ గోల్ సునీల్ ఛెత్రీకి 84వ అంతర్జాతీయ గోల్ కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే హంగేరీ ఫుట్‌బాల్ దిగ్గజం ఫెరెన్క్ పుస్కాస్తో సమానంగా టాప్-5లో నిలిచాడు. పుస్కాస్ కూడా హంగేరీ తరపున 84 అంతర్జాతీయ గోల్స్ కొట్టాడు. ఇక టాప్ ఫోర్లో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(117 గోల్స్), ఇరాన్ స్టార్ అలీ దాయి (109 గోల్స్) రెండో స్థానంలో.. మొఖ్తర్ దహరి (89 గోల్స్) మూడో స్థానంలో.. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ 86 గోల్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక మెస్సీకి, సునీల్ ఛెత్రీకి మధ్య గోల్స్ వ్యత్యాసం రెండు మాత్రమే ఉండడం విశేషం. అంతర్జాతీయంగా ఎక్కువ గోల్స్ కొట్టిన టాప్-10 జాబితాలో రొనాల్డో, మెస్సీ, సునీల్ ఛెత్రీ, అలీ మొబ్కూత్(80 గోల్స్, యూఏఈ) మాత్రమే ప్రస్తుతం ఆడుతున్నారు. ఇక ఆసియా కప్ గ్రూప్-డి క్వాలిఫయర్స్‌లో భాగంగా హంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో ఘన విజయం అందుకుంది టీమిండియా. ఈ విజయంతో టేబుల్ టాపర్‌గా ఆసియా కప్ 2023 టోర్నీలో ఆడనుంది. ఈ మ్యాచ్‌కి ముందు టేబుల్ టాపర్‌గా ఉన్న హాంకాంగ్‌పై ఆది నుంచి భారత్ ఎదురుదాడికి దిగింది. ఆట రెండో నిమిషంలోనే గోల్ సాధించి, హంగ్ కాంగ్ని ఒత్తిడిలోకి నెట్టేసింది. ఆట ప్రారంభమైన రెండో నిమిషంలో అన్వర్ ఆలీ గోల్ సాధించి, భారత జట్టుకి 1-0 ఆధిక్యం అందించాడు. తొలి సగం ముగుస్తుందనగా ఆట 45వ నిమిషంలో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ గోల్ చేసి టీమిండియాను 2-0 ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత హాంకాంగ్ గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలను తిప్పి కొట్టిన భారత జట్టు.. ఆట 85వ నిమిషంలో మూడో గోల్ చేసింది. మన్వీర్ సింగ్ గోల్‌తో టీమిండియా ఆధిక్యం 3-0కి దూసుకెళ్లింది. నిర్ణీత సమయం అనంతరం ఇచ్చిన అదనపు సమయంలో ఆట 90+3వ నిమిషంలో ఇషాన్ పండిట గోల్ సాధించడంతో భారత జట్టు 4-0 తేడాతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. చదవండి: Asian Cup 2023: భారత ఫుట్‌బాల్ జట్టు కొత్త చరిత్ర.. వరుసగా రెండోసారి -
భారత ఫుట్‌బాల్ జట్టు కొత్త చరిత్ర.. వరుసగా రెండోసారి
ఆసియా కప్ 2023కి భారత ఫుట్‌బాల్ జట్టు క్వాలిఫై అయింది. మంగళవారం పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాలస్తీనా జట్టు 4-0 తేడాతో విజయం సాధించడంతో భారత్‌కు మార్గం సుగమమైంది. హాంకాంగ్‌తో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ అర్హత సాధించినట్లయింది. గ్రూప్ -డిలో భారత జట్టు 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. టాప్‌లో ఉన్న హంగ్‌కాంగ్‌కి, భారత జట్టుకి మధ్య ఒక పాయింట్ మాత్రమే తేడా. ఒకవేళ హాంకాంగ్‌తో మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికి ఆసియన్ కప్‌కు అర్హత సాధించనుంది. 1956లో ఆసియా కప్ ఆరంభం కాగా.. భారత జట్టు ఇప్పటిదాకా ఐదు సార్లు మాత్రమే అర్హత సాధించగలిగింది. 1964లో మొదటిసారి ఆసియా ఫుట్‌బాల్ కప్ ఆడిన భారత జట్టు.. ఆ తర్వాత 20 ఏళ్లకు అంటే 1984లో ఆసియాకప్‌లో ఆడింది. ఆ తర్వాత 37 ఏళ్ల పాటు ఆసియాకప్‌కు అర్హత సాధించని భారత్.. 2011లో మూడోసారి ఆసియాకప్ ఆడింది. ఇక 2019లో నాలుగోసారి అర్హత సాధించిన భారత్ ఫుట్‌బాల్ జట్టు 2023 ఆసియాకప్ సీజన్లో ఐదోసారి ఆడనుంది. 1964లో ఆసియా కప్ ఫైనల్ మినహా మరెన్నడూ భారత్ ఫుట్‌బాల్ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయచలేదు. 🥳 HERE WE COME 🥳 As Palestine 🇵🇸 defeat Philippines 🇵🇭 in Group 🅱️, the #BlueTigers 🐯 🇮🇳 have now secured back-to-back qualifications for the @afcasiancup 🤩#ACQ2023 🏆 #BackTheBlue 💙 #IndianFootball ⚽ pic.twitter.com/3aNjymWLSm — Indian Football Team (@IndianFootball) June 14, 2022 చదవండి: రూట్ సెంచరీ.. ఎవరు ఊహించని సర్ప్రైజ్! విషాదం.. క్రికెట్ ఆడుతూ కన్నుమూత -
నేషనల్ క్రికెట్ అకాడమీలో సందడి చేసిన సునీల్ ఛెత్రి.. వీడియో వైరల్
భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీని సందర్శించాడు. అక్కడ శిక్షణ పొందుతున్న యువ క్రికెటర్లతో ఛెత్రి కాసేపు ముచ్చటించాడు. ప్రస్తుతం ఎన్సీఏలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. ఫీల్డింగ్ డ్రిల్‌లో ఆటగాళ్లతో పాటు ఛెత్రి కూడా పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. "ఇండియన్ ఫుట్‌బాల్ కెప్టెన్, లెజెండ్ సునీల్ ఛెత్రి ఎన్సీఎను సందర్శించాడు. అతడు ఫీల్డింగ్ డ్రిల్‌లో అదరగొట్టాడు. నార్త్ ఈస్ట్, ప్లేట్ టీమ్‌లకు చెందిన ఆటగాళ్లతో జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడిగా తన అనుభవాన్ని పంచుకున్నాడు" అంటూ బీసీసీఐ పోస్ట్‌కి క్యాప్షన్ జతచేసింది. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం..! 🎥 NCA's Neighbour, Indian Football Captain and Legend, @chetrisunil11 dropping by on Sunday evening. 👏 👏 He had a delightful fielding competition and shared some learnings from his own incredible journey in Football with the boys from North East and Plate Teams. 👍 👍 pic.twitter.com/1O1Gx7F12K — BCCI (@BCCI) May 9, 2022 -
భారత్‌దే ‘శాఫ్’ ఫుట్‌బాల్ టైటిల్
మాలీ: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఎనిమిదోసారి విజేతగా నిలిచింది. నేపాల్ జట్టుతో శనివారం జరిగిన ఫైనల్లో సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత్ 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సునీల్ ఛెత్రి (49వ ని.లో), సురేశ్ సింగ్ (50వ ని.లో), అబ్దుల్ సమద్ (90వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్‌లో చేసిన గోల్‌తో సునీల్ ఛెత్రి ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆడుతున్న వారిలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో లయెనెల్ మెస్సీ (అర్జెంటీనా–80 గోల్స్)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానానికి చేరాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–115 గోల్స్) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. -
SAFF Championship: గెలిస్తేనే భారత్ ఫైనల్‌కు...
The South Asian Football Federation Championship Championship: దక్షిణాసియా (శాఫ్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఫైనల్‌కు చేరాలంటే నేడు మాల్దీవులు జట్టుతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు తప్పనిసరిగా గెలవాలి. ఓటమి లేదా ‘డ్రా’ చేసుకుంటే భారత్ ఇంటిదారి పడుతుంది. ప్రస్తుతం మాల్దీవులు, నేపాల్ ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా... భారత్ ఐదు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. టాప్–2 జట్లు మాత్రమే ఫైనల్‌కు చేరుతాయి. చదవండి: T20 World Cup 2021: మెంటార్‌గా ధోని ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదు.. IPL 2021: స్విమ్మింగ్‌ఫూల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల జల్సా.. -
భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ ‘డ్రా’
‘శాఫ్’ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం జరిగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. భారత్ తరఫున సారథి సునీల్ చెత్రీ 27వ నిమిషంలో గోల్ చేశాడు. చెత్రీకిది 76వ అంతర్జాతీయ గోల్ కాగా, బ్రెజిల్ దిగ్గజం పీలే గోల్స్ (77) రికార్డును సమం చేయడానికి చెత్రీ కేవలం ఒక్క గోల్ దూరంలో ఉన్నాడు. బంగ్లా ప్లేయర్ అరాఫత్ (74వ నిమిషంలో) గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. రోహిత్‌కు నిరాశ ఓస్లో (నార్వే): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ రోహిత్ (65 కేజీలు)కు చుక్కెదురైంది. కాంస్య పతకం కోసం సోమవారం జరిగిన బౌట్లో రోహిత్‌పై ‘విక్టరీ బై ఫాల్’ పద్ధతిన తుల్గాతుముర్ ఒచిర్ (మంగోలియా) గెలుపొం దాడు. మ్యాచ్‌లో రోహిత్ 4–10తో వెనుకబడి ఉన్న సమయంలో ఒచిర్ ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు తగిలించి కొన్ని క్షణాల పాటు పట్టి ఉంచాడు. దాంతో రిఫరీ ఒచిర్‌ను విజేతగా ప్రకటించాడు. వాస్తవానికి రోహిత్ ప్రిక్వార్టర్స్‌లో ఓడగా... అతడిని ఓడించిన జగిర్ ఫైనల్‌కు చేరాడు. దాంతో రెపీచేజ్ ద్వారా రోహిత్ కాంస్యం బరిలో నిలిచాడు. తొలి మ్యాచ్‌లో రోహిత్ 12–2తో సెలాహట్టిన్ (టర్కీ)పై నెగ్గాడు. మహిళల 55 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో భారత రెజ్లర్ పింకీ 6–8తో నినా హెమ్మర్ (జర్మనీ) చేతిలో ఓడి పసిడి పోరుకు దూరమైంది. అయితే రెపీచేజ్ పద్ధతి ద్వారా ఆమె కాంస్యం గెలిచే అవకాశం ఉంది. మరో భారత రెజ్లర్ సంగీతా ఫోగాట్ (62 కేజీలు) ప్రిక్వార్టర్స్‌లో... పురుషుల విభాగాల్లో సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు), సుశీల్ (70 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్‌ల్లో తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడారు. చదవండి: Dronavalli Harika: ఒలింపిక్ విజయంలాంటిదే.. నా భర్త అన్ని విధాలా అండగా నిలిచారు -
వారి మరణం ఆమోదయోగ్యం కాదు: సునీల్ ఛెత్రి
న్యూఢిల్లీ: తమిళనాడులో పోలీసుల కస్టడీలో మరణించిన జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్‌లకు న్యాయం జరగాలని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. ఇప్పటికే వారి మరణానికి న్యాయం జరగాలంటూ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. తాజాగా సునీల్ ఛెత్రి ట్వీట్ చేస్తూ.. జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ విషయంలో జరిగింది ఆమోదయోగ్యం కాదు. తిరిగి వారి ప్రాణాలను ఏదీ తిరిగి ఇవ్వలేదు. కనీసం వారి మరణానికైనా న్యాయం జరగాలి. అది ఒక బలమైన ఉదాహరణగా ఉండాలి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం స్పందిస్తూ ‘‘రక్షకులే అణచివేతదారులుగా మారినప్పుడు’’ అంటూ ట్వీట్ చేశారు. (‘సెల్’ కోసమే దాష్టీకమా?) తమిళనాడు తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సాత్తాన్‌కులానికి చెందిన జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్‌లు సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తుండేవారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేరళలో విధించిన లాక్డౌన్లో పరిమిత సమయానికి మించి షాపును తెరిచారనే ఆరోపణతో జూన్ 19న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వారు ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. పోలీసులు అడిగిన సెల్‌ఫోన్ ఇవ్వలేదనే జయరాజ్, బెనిక్స్లను అరెస్టు చేశారని, ఆ కక్ష్యతోనే లాఠితో అమానుషంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలతో మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారిపై దాడి చేసిన ఇద్దరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడులోని దుకాణదారులంతా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. (తండ్రీకొడుకుల అనూహ్య మరణం!) -
‘ ఆ విషయంలో దీపిక చాలా క్రూరం’
ముంబై: లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు ఇండస్ట్రీ జనాలు. కానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ చెత్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఎలెవన్ ఆన్ టెన్’ కార్యక్రమం ద్వారా అభిమానులతో ముచ్చటించారు. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో సునీల్ చెత్రీ ‘బ్యాడ్మింటన్‌లో మీరు ఎప్పుడైనా దీపికను ఓడించారా’ అని రణ్వీర్ను ప్రశ్నించాడు. అందుకు రణ్వీర్ తాను ‘త్రీ పాయింట్ చాంపియన్’ని అని చెప్పుకొచ్చాడు. అంటే 21 పాయింట్స్ సెట్లో రణ్వీర్ కేవలం మూడు పాయింట్స్ మాత్రమే సాధించానని తెలిపాడు. అంతేకాక బ్యాడ్మింటన్ కోర్టులో దీపిక చాలా క్రూరంగా ఉంటుందని.. తనను చాలా ఇబ్బంది పెడుతుందన్నాడు రణ్వీర్. (ఆట వాయిదా) అయితే ఇక మీదట తాను బాగా కష్టపడతానని.. కనీసం 10 పాయింట్లు అయినా సాధిస్తానని అభిమానులకు ప్రామిస్ చేశాడు రణ్వీర్. ఈ లైవ్ చాట్ షోలో దీపికా పదుకొనే కూడా కొన్ని సెకన్ల పాటు కనిపించింది. అనంతరం తన భర్తను ఉద్దేశించి ‘మీ మామగారి అకాడమీలో చేరి శిక్షణ పొందు’ అంటూ కామెంట్ చేసింది. దీపిక తండ్రి ప్రకాష్ పదుకొనే బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బ్యాడ్మింటన్ కోచింగ్ సెంటర్ స్థాపించి ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దీపిక, రణ్వీర్ ‘83’ చిత్రంలో కలిసి నటించారు. 1983లో భారతజట్టు మొదటిసారి క్రికెట్ వరల్డ్‌కప్ గెలిచిన మధుర సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఈ చిత్రానికి కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ పాత్రలో నటించారు రణ్వీర్ సింగ్. అలాగే కపిల్‌దేవ్ భార్య రోమీగా నటించారు రణ్వీర్ సింగ్ భార్య దీపికాపదుకోన్. ‘83’ సినిమాను తొలుత ఏప్రిల్ 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటించడానికి చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. (దీపికకు రణ్వీర్ భావోద్వేగ లేఖ!) -
'ఫుట్‌బాల్ వదిలేద్దామనుకున్నా'
న్యూఢిల్లీ : కెరీర్ ప్రారంభంలో కోల్‌కతా మేటి క్లబ్ మోహన్ బగాన్ క్లబ్ తరఫున ఆడే సమయంలో ఒత్తిడి తట్టుకోలేక ఏడ్చేవాడినని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి గుర్తు చేసుకున్నాడు. ఒకానొక సమయంలో ఆటను వదిలేద్దామని కూడా అనుకున్నాడట! ఈ విషయాన్ని స్వయంగా అతనే చెప్పాడు. చివరకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇంతవరకు రాగలిగానని అన్నాడు. ‘ఆటలో తొలి ఏడాది బాగానే గడిచింది. అప్పుడే ప్రేక్షకులు నన్ను తమ అభిమాన ప్లేయర్ బైచుంగ్ భూటియాతో పోల్చేవారు. అంచనాలు అందుకోలేని సమయంలో తీవ్రంగా విమర్శించేవారు. దీంతో ఒత్తిడి పెరిగిపోయి చాలా సార్లు ఏడ్చేవాడిని. ఓసారైతే మా నాన్నను పిలిచి ఇక ఫుట్‌బాల్ ఆడలేనని చెప్పాను. స్వతహాగా క్రీడాకారులైన నా తల్లిదండ్రులు నాకు అండగా నిలిచారు’ అని 35 ఏళ్ల ఛెత్రి తెలిపాడు. 18 ఏళ్ల తన కెరీర్లో ఛెత్రి భారత్ తరఫున 72 గోల్స్ చేశాడు. -
అవకాశం వస్తే ఆర్సీబీకే : సునీల్
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఫుట్‌బాల్ ఆడుతున్న క్రీడాకారుల్లో భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇంకా ఫుట్‌బాల్ ఆడుతున్న ఆటగాళ్ల పరంగా చూస్తే అత్యధిక అంతర్జాతీ గోల్స్ చేసిన జాబితాలో చెత్రీ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ క్రిస్టియానో పోర్చుగల్ స్టార్ రొనాల్డో(90) తొలి స్థానంలో ఉండగా, చెత్రీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకూ చెత్రీ 72 గోల్స్ సాధించాడు. ఇక మూడో స్థానంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ(70) ఉన్నాడు. కాగా, చెత్రీకి ఒక ఫుట్‌బాల్ కాక వేరే గేమ్స్ గురించి కూడా తెలుసు. ఈ విషయాన్ని ఇటీవలే చెత్రీ స్పష్టం చేశాడు. (మహ్మద్ కైఫ్ ట్వీట్‌పై మోదీ ఇలా..) దీనిలో భాగంగా చెత్రీకి ఎదురై క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చిట్‌చాట్‌లో ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి చెత్రీ తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘ మీరు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడాల్సి వస్తే దేనికి ఆడతారు’ అని అడగ్గా.. ‘నేను అవకాశం వస్తే ఆర్సీబీ తరఫున ఆడతా. నాకు విరాట్ కోహ్లి మంచి స్నేహితుడు కూడా’ అని సమాధానమిచ్చాడు. తాను బెంగళూరు వ్యక్తినని, దాంతో మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉందంటూ చెత్రీ పేర్కొన్నాడు. ‘ ఫుట్‌బాల్ కాకుండా మీ ఏ గేమ్‌ల్లో రొనాల్డో-మెస్సీలను ఓడించగలరు’ అని మరొక ప్రశ్న ఎదురుకాగా, ‘క్యారమ్స్‌లో వారిద్దర్నీ వాడిస్తా’ అని బదులిచ్చాడు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో చెత్రీ-అతని భార్య సోనమ్‌లు గృహ నిర్భందంలో ఉన్నారు. గత ఐదు రోజులుగా ఇంటిలోనే స్వీయ నిర్భందాన్ని పాటిస్తున్నామని చెత్రీ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన భార్యతో కలిసి వంట గదిలో ఆహార పదార్థాలను వండటాన్ని నేర్చుకుంటున్నట్లు చెత్రీ తెలిపాడు. (దిగ్గజ క్రికెటర్‌ను అవమానపరుస్తారా?) -
బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ
కోల్‌కతా: తమ చివరి మ్యాచ్‌లో ఆసియా చాంపియన్ ఖతర్‌ను నిలువరించిన భారత్ మరో మ్యాచ్‌కు సిద్ధమయింది. ప్రపంచకప్ క్వాలిఫ యర్స్‌లో భాగంగా నేడు ఇక్కడి సాల్ట్ లేక్ స్డేడి యంలో జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఖతర్‌తో మ్యాచ్‌కు దూర మైన స్టార్ సునీల్ ఛెత్రి తిరిగి జట్టులోకి రావ డం కలిసొచ్చే అంశం. బలాబలాల పరంగా చూస్తే భారత్ బంగ్లాదేశ్ కంటే ముందుంది. ప్రస్తుతం భారత్ 104వ ర్యాంకులో ఉండగా... బంగ్లాదేశ్ 207 ర్యాంకులో ఉంది. ఛెత్రి, బల్వంత్ సింగ్, మన్వీర్ సింగ్‌లతో కూడిన అటాకింగ్ చెలరేగితే భారత్‌కు విజయం ఖాయ మైనట్లే. వీరితో పాటు మిడ్‌ఫీల్డ్‌లో ఉదాంత సింగ్, ఆశికి కురునియన్ గోల్ చేసే అవకాశా లను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే భారత్‌ను డిఫెన్సు విభాగం కలవరపెడు తుంది. నేడు జరిగే మ్యాచ్‌కు డిఫెండర్ సందేశ్ జింగాన్ మోకాలి గాయంతో దూరం అయ్యా డు. ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో డిఫెన్సు లో అదరగొట్టిన భారత్ చివరి 9 నిమిషాల్లో చేతులెత్తేసి ప్రత్యర్థికి రెండు గోల్స్‌ను సమర్పిం చుకొని విజయాన్ని దూరం చేసుకుంది. భారత ఆటగాళ్లు అలసిపోవడమే దీనికి కారణం అని... వారి ఫిట్నెస్ను మెరుగుపరచాల్సిన అవసరం ఉందంటూ కోచ్ ఇగోర్ స్టిమాక్ తెలిపాడు. అయితే ఖతర్‌తో మ్యాచ్‌లో మాత్రం ఆకట్టు కుంది. ముఖ్యంగా ఛెత్రి గైర్హాజరీలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు ప్రత్యర్థి గోల్ చేసే అవకాశాలను సమ ర్థంగా అడ్డుకున్నాడు. వీరంతా సమిష్టిగా ఆడితే భారత్ ప్రపంచ కప్ ఆశలను సజీవంగా ఉంచు కున్నట్లే. ‘ ఇది ఛెత్రికి, బంగ్లాదేశ్‌కు మధ్య జరిగే మ్యాచ్ కాదు. భారత్‌కు బంగ్లాదేశ్‌కు మధ్య జరిగేది. నేను జట్టులో ఒక సభ్యుడిని మాత్ర మే. జట్టుకు విజయాన్ని అందించే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. మేమంతా ఒకటిగా... దేశం కోసం ఆడతాం.’ అని మ్యాచ్‌కు ముందు జరిగిన సమావేశంలో ఛెత్రి పేర్కొన్నాడు. భార త ఫుట్‌బాల్‌కు మక్కాగా భావించే కోల్‌కతాలో మ్యాచ్ జరుగుతుండటంతో... 45 వేల సామ ర్ధ్యం గల సాల్ట్‌లేక్ స్టేడియం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. -
‘పద్మశ్రీ’ హారిక
-
‘పద్మశ్రీ’ హారిక
అంతర్జాతీయ స్థాయిలో 19 ఏళ్లుగా భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తోన్న ఆంధ్రప్రదేశ్ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక కెరీర్లో మరో కలికితురాయి చేరింది. గ్రాండ్‌మాస్టర్ హారికకు కేంద్ర ప్రభుత్వ పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ లభించింది. 70వ గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో శుక్రవారం కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. క్రీడా విభాగంలో మొత్తం తొమ్మిది మందికి ఈ అవార్డులు రాగా... ఉత్తరాఖండ్‌కు చెందిన పర్వతారోహకురాలు బచేంద్రీ పాల్‌కు ‘పద్మభూషణ్’ దక్కింది. మిగతా ఎనిమిది మందిని ‘పద్మశ్రీ’ వరించింది. న్యూఢిల్లీ: క్రీడా ప్రపంచంలో తమ ప్రతిభాపాటవాలతో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలతో గౌరవించింది. వివిధ రంగాల నుంచి మొత్తం 112 మందికి ఈ అవార్డులు రాగా... క్రీడా విభాగం నుంచి తొమ్మిది మంది ఉన్నారు. మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రీ పాల్‌కు ‘పద్మ భూషణ్’ లభించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన 64 ఏళ్ల బచేంద్రీ పాల్ 1984లో మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించారు. గతేడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన రెజ్లర్ బజరంగ్ పూనియా... 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యుడు గౌతమ్ గంభీర్... భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి... ‘ట్రిపుల్ ఒలింపియన్’ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్... భారత కబడ్డీ జట్టు కెప్టెన్ అజయ్ ఠాకూర్లకు ‘పద్మశ్రీ’ అవార్డులు లభించాయి. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల టీమ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం దక్కడంలో 36 ఏళ్ల శరత్ కమల్ కీలకపాత్ర వహించాడు. 2016 కబడ్డీ ప్రపంచకప్ భారత్‌కు దక్కడంలో అజయ్ ఠాకూర్ ముఖ్యపాత్ర పోషించాడు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జన్మించిన సునీల్ చెత్రి జాతీయ పోటీల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తాడు. అంచెలంచెలుగా... ఆరేళ్ల ప్రాయంలో చెస్‌లో ఓనమాలు దిద్దుకున్న హారిక ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు అంతర్జాతీయ చెస్‌లో మేటి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 1991 జనవరి 12న గుంటూరులో జన్మించిన హారిక 2000లో స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్–10 బాలికల విభాగంలో రజతం గెలిచి వెలుగులోకి వచ్చింది. ఈ దశలో క్రీడా ప్రేమికులైన హారిక తల్లిదండ్రులు రమేశ్, స్వర్ణ తమ అమ్మాయికి మరింత మెరుగైన శిక్షణ ఇప్పించారు. కోచ్ ఎన్వీఎస్ రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటూ హారిక మరింత రాటుదేలింది. అనంతరం ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్–12 విభాగంలో రజత, కాంస్యాలు సాధించింది. 2006లో ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్–18 విభాగంలో స్వర్ణం... 2008 ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో పసిడి సాధించిన హారిక... 2009లో ఆసియా మహిళా చాంపియన్‌గా... 2010లో కామన్వెల్త్ చాంపియన్‌గా అవతరించింది. 2011లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందిన ఆమె వరుసగా మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2012, 2015, 2017) కాంస్య పతకాలను కూడా దక్కించుకుంది. 28 ఏళ్ల హారిక ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతున్న జిబ్రాల్టర్ అంతర్జాతీయ టోర్నమెంట్లో పాల్గొంటోంది. హారికకు ‘పద్మశ్రీ’ పురస్కారం రావడంపట్ల ఆమె తల్లిదండ్రులు రమేశ్, స్వర్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. క్రీడా పద్మాలు వీరే.. పద్మ భూషణ్: బచేంద్రీ పాల్ (ఉత్తరాఖండ్–పర్వతారోహణ) పద్మశ్రీ: ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్–చెస్); బజరంగ్ పూనియా (హరియాణా–రెజ్లింగ్); సునీల్ చెత్రి (తెలంగాణ–ఫుట్‌బాల్) గంభీర్ (ఢిల్లీ–క్రికెట్); ఆచంట శరత్ కమల్ (తమిళనాడు–టేబుల్ టెన్నిస్); బొంబేలా దేవి (మణిపూర్–ఆర్చరీ); ప్రశాంతి సింగ్ (ఉత్తరప్రదేశ్–బాస్కెట్‌బాల్); అజయ్ ఠాకూర్ (హిమాచల్‌ప్రదేశ్–కబడ్డీ) -
కేరళ వరదలు: 15 లక్షల సాయం ప్రకటించిన క్రికెటర్
తిరవనంతపురం : కేరళ వరద బాధితుల కోసం క్రీడాలోకం సైతం ముందుకు కదిలింది. కొందరు ఆటగాళ్లు విరాళాలు ప్రకటిస్తుండగా.. మరికొందరు బాధితులకు అండగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. ఐపీఎల్ స్టార్, భారత క్రికెటర్ సంజూ శాంసన్ రూ.15 లక్షల ఆర్ధిక సాయాన్నిప్రకటించాడు. అతని తరపున తన తండ్రి , సోదరుడు సీఎం పినరయి విజయన్ను కలిసి చెక్ అందజేశారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో శాంసన్ స్పందిస్తూ.. ‘పబ్లిసిటీ కోసం చేయలేదు. వరదల వల్ల నష్టపోయినవారికి సాయం అందుతుందని, నాలా ఇతరులు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తారని ఇలా చేశాను. నాకు పబ్లిసిటీ అవసరేం లేదు. నేను చేసిన పని ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సహాయ నిధికి విరాళాలు ఇచ్చేదానిపై అవగాహన కల్సించాల్సిన అవసరం ఎంతో ఉంది. చాలా మంది వారికి తోచి సాయం చేస్తున్నారు.’ అని శాంసన్ చెప్పుకొచ్చాడు. గత సీజన్ ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం కేరళ వరదలపై ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘కేరళలో పరిస్థితి మెరుగుపడాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న భారత ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ల సేవలకు హ్యాట్సాఫ్’ అంటూ కొనియాడాడు. హార్దిక్ పాండ్యా సైతం ప్రతి ఒక్కరు కేరళ ప్రజలకు తోచిన సాయం చేస్తూ అండగా నిలవాలని పిలుపునిచ్చాడు. భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీ సైతం సాయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. God’s own Country needs our help 🙏 I request everyone to do their bit to help our brothers and sisters in #Kerala - https://t.co/UzevVKSfvi pic.twitter.com/ZPi85imBG1 — hardik pandya (@hardikpandya7) August 17, 2018 Everyone in Kerala, please be safe and stay indoors as much as you can. Hope the situation recovers soon. Also, thanking the Indian army and NDRF for their incredible support in this critical condition. Stay strong and stay safe. — Virat Kohli (@imVkohli) August 17, 2018 -
సునీల్ చెత్రీ ఫేవరెట్ జట్లు ఇవే..
న్యూఢిల్లీ: సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ అందరి దృష్టి ఫిఫా ప్రపంచకప్‌పై ఉంది. ప్రపంచకప్‌లో ఏ ఏ జట్లు రాణిస్తాయోనని అంచనాలకు దిగుతున్నారు. ఈ క్రమంలో భారత్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి కూడా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో జర్మనీ, స్పెయిన్, బ్రెజిల్, ఫ్రాన్స్ జట్లు అత్యంత బలగా ఉన్నాయన్నాడు. కానీ ఈ జట్లతో పాటు ఇంగ్లండ్ జట్టును డార్క్ హర్స్గా చెత్రీ అభివర్ణించాడు. ఇంగ్లండ్ జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదని, కాబట్టి ఆ జట్టు తన సహజమైన ఆటతీరును ప్రదర్శించే అవకాశం ఉందని చెత్రీ తెలిపాడు. ఇదిలా ఉంచితే, అర్జెంటీన స్టార్ ఆటగాడు మెస్సీ గోల్స్ రికార్డును సమం చేయడంపై చెత్రీ సంతోషం వ్యక్తం చేశాడు. ‘నేను మెస్సీ అభిమానిని. అతన్ని గోల్స్ ను సమం చేయడం ఒక ఆటగాడిగా నాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే అతనితో నన్ను పోల్చడం సరికాదు. మెస్సీ ఒక దిగ్గజ ఆటగాడు’ అని చెత్రీ తెలిపాడు. -
మెస్సీ సరసన సునీల్ చెత్రీ...
ముంబై: స్వదేశంలో అద్భుత ఫామ్ కొనసాగించిన భారత ఫుట్‌బాల్ జట్టు ఇంటర్ కాంటినెంటల్ కప్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. కెన్యాతో ఆదివారం జరిగిన ఫైనల్లో కెప్టెన్ సునీల్ చెత్రీ డబుల్ గోల్స్ సాయంతో భారత్ 2–0తో విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో చెత్రీ అర్జెంటీనా స్టార్ మెస్సీ సరసన చేరాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్ ఆడుతున్న క్రీడాకారుల్లో అత్యధిక గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా మెస్సీతో జత కట్టాడు. మెస్సీ 124 మ్యాచ్‌ల్లో 64 గోల్స్ చేయగా... చెత్రీ 102 మ్యాచ్‌ల్లోనే 64 గోల్స్ సాధించాడు. ఈ జాబితాలో పోర్చుగల్ స్టార్ రొనాల్డో (150 మ్యాచ్‌ల్లో 81 గోల్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. విజయం అభిమానానికి అంకితం.. కెన్యాతో ఫైనల్లో విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకోవడంతో సునీల్ చెత్రీ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విజయం అభిమానులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. విశేషమైన అభిమానం తమపై చూపెట్టడంతో దక్కిన విజయంగా అభివర్ణించాడు. ఈ మేరకు తమ ఫుట్‌బాల్ మ్యాచ్‌లను ఆదరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ అభిమానం ఎప్పటికీ ఇలానే ఉండాలనే విన్నవించాడు. ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ భారత ఫుట్‌బాల్ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడండి. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్‌లకు సపోర్ట్ తెలిపే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆటలో వారి స్థాయిని మేం అందుకోలేకపోవచ్చు. మా మ్యాచ్‌కు వచ్చి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలని అనిపించొచ్చు. మేం కాదనట్లేదు, ఆ స్థాయిలో మా ఆట లేదనే విషయాన్ని కూడా ఒప్పుకుంటాం. కానీ ఆట పట్ల మా నిబద్ధత, ప్రేమతో మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాం’ అని తొలి మ్యాచ్ తర్వాత చెత్రీ ఆవేదన ఇది. చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్‌కు ముంబైలోని ఎరీనా స్టేడియం బోసిపోవడంతో చెత్రీ తన ఆవేదనతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. దాంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. చెత్రి ఆవేదనను అటు సెలబ్రెటీలతో పాటు అభిమానులు కూడా అర్ధం చేసుకోవడంతో భారత ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు భారీ మద్దతు దక్కింది. ఈ క్రమంలోనే కప్‌ను గెలవడం భారత్ ఫుట్‌బాల్‌లో మరింత జోష్‌ను నింపింది. -
భారత్ జోరుకు బ్రేక్
ముంబై: ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ టోర్నీలో భారత్ జోరుకు అడ్డుకట్ట పడింది. గురువారం ఇక్కడి ఎరీనా ఫుట్‌బాల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 2–1 గోల్స్‌తో సునీల్ చెత్రి సేనను ఓడించింది. భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను 47వ నిమిషంలో కెప్టెన్ సునీల్ చెత్రి సాధించాడు. మరో రెండు నిమిషాల్లోనే న్యూజిలాండ్ స్ట్రయికర్ డి జాంగ్ గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. నాలుగు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా మెసెస్ డైర్ (86వ నిమిషంలో) రెండో గోల్‌తో న్యూజిలాండ్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అదనపు ఐదు నిమిషాల్లో కూడా భారత్ మరో గోల్ చేయలేకపోయింది. దీంతో చెత్రి సేన ఫైనల్ చేరేందుకు ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ ఆరేసి పాయింట్లతో పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. శుక్రవారం చివరి లీగ్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ, కెన్యా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కెన్యా ఓడితే భారత్ నేరుగా ఫైనల్ చేరుతుంది. -
సునీల్ చెత్రీ ఎఫెక్ట్: టికెట్లు లేవ్
ముంబై: మొన్నటి వరకు అభిమానులు లేక వెలవెలబోయిన నగరంలోని ఎరీనా ఫుట్‌బాల్ స్టేడియం.. ఇప్పుడు కిటకిటలాడుతోంది. మ్యాచ్ చూద్దామంటే టికెట్లు కూడా దొరికే పరిస్థితి లేదు. ‘తిట్టండి కానీ మా మ్యాచ్‌లు చూడండి.. మైదానాలకు రండి’ అంటూ భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీ సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేసిన తర్వాత విశేషణ స్పందన లభిస్తోంది. ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి గం.8.00లకు భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్లన్నీ అప్పుడే అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని నిర్వహకులు తెలిపారు. దాంతో పాటు ఆదివారం ఫైనల్ మ్యాచ్‌కు సైతం టికెట్లు లేనట్లు వారు ప్రకటించారు. అంతకుముందు కెన్యాతో జరిగిన మ్యాచ్‌కు సైతం టికెట్లన్నీ అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. చైనీస్ తైపీతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత కెప్టెన్ సునీల్ చెత్రీ హ్యాట్రిక్ గోల్ సాధించడంతో భారత్ 5-0తో సునాయస విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌కు కేవలం 2500 మంది మాత్రమే హాజరుకావడంతో భారత కెప్టెన్ సునీల్ చెత్రీ ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ భారత ఫుట్‌బాల్ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడండి. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్‌లకు సపోర్ట్ తెలిపే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆటలో వారి స్థాయిని మేం అందుకోలేకపోవచ్చు. మా మ్యాచ్‌కు వచ్చి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలని అనిపించొచ్చు. మేం కాదనట్లేదు, ఆ స్థాయిలో మా ఆట లేదనే విషయాన్ని కూడా ఒప్పుకుంటాం. కానీ ఆట పట్ల మా నిబద్ధత, ప్రేమతో మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాం’ అని సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దాంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. చెత్రి ఆవేదనతో అటు సెలబ్రెటీలతో పాటు అభిమానులు కూడా అర్ధం చేసుకోవడంతో భారత ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు భారీ మద్దతు దక్కుతుంది. ఇదిలా ఉంచితే, వరుసగా రెండు విజయాలతో ఇప్పటికే ఫైనల్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకున్న భారత్.. మరో విజయంతో గ్రూప్ దశను ముగించాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే నేరుగా ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ కాని పక్షంలో గోల్స్ ఆధారంగా తుది బెర్తును భారత్ ఖాయం చేసుకునే అవకాశం ఉంది. భారత్‌తో పాటు.. ఫైనల్ రేసులో న్యూజిలాండ్, కెన్యా కూడా ఉన్నాయి. ఆ రెండు జట్లు ఒక్కో విజయం సాధించాయి. -
ఆట హిట్... అభిమానం సూపర్ హిట్
ముంబై: ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత్ వరుసగా రెండో విజయంతో ఫైనల్ చేరింది. నాలుగు దేశాల ఈ టోర్నీలో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 3–0తో కెన్యాపై జయభేరి మోగించింది. వందో మ్యాచ్ ఆడుతున్న భారత కెప్టెన్ సునీల్ చెత్రికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ప్రేక్షకులు ఇచ్చిన మద్దతుతో అతను చెలరేగాడు. మ్యాచ్‌లో రెండు గోల్స్ (68వ ని., 90+1వ ని.లో; ఇంజూరీ టైమ్) చేశాడు. మరో గోల్‌ను స్ట్రయికర్ జెజె లాల్‌పెఖువా (71వ ని.) సాధించాడు. తొలి అర్ధభాగం ముగిసేదాకా ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. ద్వితీయార్ధంలో భారత స్ట్రయికర్లు తమ దాడులకు పదునుపెట్టారు. ‘డి’ ఏరియాలో చెత్రిని ప్రత్యర్థి ఆటగాడు మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ భారత్‌కు పెనాల్టీ ఇచ్చాడు. దీన్ని చెత్రి 68వ నిమిషంలో విజయవంతంగా సాధించడంతో స్టేడియం ఒక్కసారిగా చెత్రి చెత్రి... కెప్టెన్ కెప్టెన్ అంటూ ఊగిపోయింది. తర్వాత నిమిషాల వ్యవధిలోనే గోల్స్ నమోదు కావడంతో భారత్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. నిండింది... అభిమానంతో: చెత్రి భావోద్వేగ వీడియో ప్రకటనతో మ్యాచ్‌కు ముందు రోజు సెలబ్రిటీలు స్పందిస్తే... మ్యాచ్ రోజు అభిమానులు హోరెత్తించారు. దీంతో ముంబై ఫుట్‌బాల్ ఎరెనా స్టేడియం సాకర్ ప్రియులతో నిండిపోయింది. కేవలం ముంబై నగరవాసులే కాదు... 70 కి.మీ. దూరంలో ఉన్న బద్లాపూర్ (థానే జిల్లా) పట్టణం నుంచి కూడా ప్రేక్షకులు రావడం విశేషం. -
ఫుట్ బాల్ మ్యాచ్: టికెట్లన్నీ సోల్డ్ ఔట్!
ముంబై : భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీ సోషల్ మీడియా వేదికగా ఆవేదనతో చేసిన విజ్ఞప్తికి విశేష స్పందన లభించింది. ఈ విన్నపంపై స్పందిస్తూ క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలు మైదానాలకు వెళ్లి ఫుట్‌బాల్ మ్యాచ్‌లు వీక్షించాలని అభిమానులను కోరారు. ఈ పిలుపుతో నేడు(సోమవారం) ముంబై ఎరీనా ఫుట్‌బాల్ మైదానంలో జరిగే మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో భాగంగా కెన్యాతో భారత్ ఈ మ్యాచ్ ఆడనుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ సునీల్ చెత్రి కెరీర్లో 100 వ మ్యాచ్ కావడం విశేషం. సుమారు 15వేల సీటింగ్ కెపాసిటీ గల ఈ మైదానంలో టికెట్లన్నీ అమ్ముడయ్యాయని నిర్వాహకులు తెలిపారు. చైనీస్ తైపీతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత కెప్టెన్ సునీల్ చెత్రి హ్యాట్రిక్ గోల్ సాధించడంతో భారత్ 5-0తో సునాయస విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌కు కేవలం 2500 మంది మాత్రమే హాజరుకావడంతో భారత కెప్టెన్ సునీల్ చెత్రీ ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ భారత ఫుట్‌బాల్ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడండి. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్‌లకు సపోర్ట్ తెలిపే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆటలో వారి స్థాయిని మేం అందుకోలేకపోవచ్చు. మా మ్యాచ్‌కు వచ్చి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలని అనిపించొచ్చు. మేం కాదనట్లేదు, ఆ స్థాయిలో మా ఆట లేదనే విషయాన్ని కూడా ఒప్పుకుంటాం. కానీ ఆట పట్ల మా నిబద్ధత, ప్రేమతో మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాం’ అని సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. నేటి మ్యాచ్ అనంతరం భారత్ జూన్ 7న న్యూజిలాండ్‌తో ఇదే మైదానంలో ఆడనుంది. This is nothing but a small plea from me to you. Take out a little time and give me a listen. pic.twitter.com/fcOA3qPH8i — Sunil Chhetri (@chetrisunil11) June 2, 2018 Please take notice of my good friend and Indian football skipper @chetrisunil11's post and please make an effort. pic.twitter.com/DpvW6yDq1n — Virat Kohli (@imVkohli) June 2, 2018 C'mon India... Let's fill in the stadiums and support our teams wherever and whenever they are playing. @chetrisunil11 @IndianFootball pic.twitter.com/xoHsTXEkYp — Sachin Tendulkar (@sachin_rt) June 3, 2018 -
సునీల్ చెత్రీ టాప్-5 గోల్స్ చూశారా?
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియాలో ఇప్పుడంతా ఫుట్ బాల్ మ్యాచ్‌ల గురించే చర్చ. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే ఫీఫా వరల్డ్ కప్-2018 ప్రారంభం కానుంది. అయితే ప్రపంచకప్ టోర్నీకి భారత్ అర్హత సాధించనప్పటికీ ఈ ఆటను ఆరాధించే అభిమానులున్నారు. స్టార్ ఆటగాళ్లతో ఐపీఎల్ తరహాలో ఇండియన్ సూపర్ లీగ్ పేరిట ఫుట్ బాల్ లీగ్‌ను సైతం నిర్వహించారు. అయితే ఈ లీగ్‌కు అనుకున్నంత ఆదరణ లభించలేదు. క్రికెట్‌ను పిచ్చిగా ఆరాధించే ఈ దేశంలో ఇప్పుడిప్పుడే ఇతర క్రీడలకు ఆదరణ లభిస్తోంది. ఇటీవల భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీ సోషల్ మీడియా వేదికగా ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ స్టేడియానికి వచ్చి మేం ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడండి’ అని ఆవేదనతో అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఈ విన్నపంపై దిగ్గజ క్రికెటర్లు సచిన్, కోహ్లిలు స్పందించి తమ మద్దతు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ అంశం చర్చనీయాంశం కావడంతో నెటిజన్లు సునీల్ చెత్రీ టాప్-5 గోల్స్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఆ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇటీవల జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో భాగంగా చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ సునీల్ చెత్రి హ్యాట్రిక్ గోల్స్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
సునీల్ చెత్రీ టాప్-5 గోల్స్ చూసేయండి
-
ఆ మ్యాచ్‌లకు రండి: సచిన్
హైదరాబాద్ : ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ స్టేడియానికి వచ్చి మేం ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడండి’ అని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి ఆవేదనతో పిలుపుచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లు ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు వెళ్లాలని తమ ఫాలోవర్లకు పిలుపునిచ్చారు. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం స్పందించారు. తన ట్విటర్ అకౌంట్ ద్వారా..‘కమాన్ ఇండియా.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఎక్కడ ఎప్పుడు జరిగిన వెళ్లి మన జట్లకు మద్దతిస్తూ.. మైదానాలను నింపేద్దాం’ అని పిలుపునిచ్చాడు. C'mon India... Let's fill in the stadiums and support our teams wherever and whenever they are playing. @chetrisunil11 @IndianFootball pic.twitter.com/xoHsTXEkYp — Sachin Tendulkar (@sachin_rt) June 3, 2018 ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ భారత ఫుట్‌బాల్ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడండి. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్‌లకు సపోర్ట్ తెలిపే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆటలో వారి స్థాయిని మేం అందుకోలేకపోవచ్చు. మా మ్యాచ్‌కు వచ్చి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలని అనిపించొచ్చు. మేం కాదనట్లేదు, ఆ స్థాయిలో మా ఆట లేదనే విషయాన్ని కూడా ఒప్పుకుంటాం. కానీ ఆట పట్ల మా నిబద్ధత, ప్రేమతో మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాం’ అని చెత్రీ అభిమానులను అభ్యర్థించాడు. -
నేను మ్యాచ్‌కు వెళతా.. మరి మీరు: కేటీఆర్
హైదరాబాద్: ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ స్టేడియానికి వచ్చి మేం ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడండి’ అని భారత కెప్టెన్ సునీల్ చెత్రి ఆవేదనతో పిలుపుచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెత్రీ అభ్యర్థన పట్ల భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన మంత్రి.. ‘నేను త్వరలోనే ఫుట్‌బాల్ గేమ్ చూసేందుకు వెళ్తున్నాను. మీ సంగతేంటి? అంటూ తన ఫాలోవర్లను ప్రశ్నించారు. చెత్రీ వీడియోను రీట్వీట్ చేయండి, అతడి సందేశాన్ని అందరికీ చేరవేయండి’ అని కేటీఆర్ కోరారు. మరొకవైపు భారత ఫుట్‌బాల్ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వెళ్లి చూడాలని కోహ్లి తన అభిమానులను ట్విట్టర్ ద్వారా కోరాడు. ఫుట్‌బాల్, క్రీడలను ఆదరించండని కోహ్లి పిలుపునిచ్చాడు. దేశంలో క్రీడా సంస్కృతి పెంపొందించాలని విరాట్ సూచించాడు. ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ భారత ఫుట్‌బాల్ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడండి. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్‌లకు సపోర్ట్ తెలిపే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆటలో వారి స్థాయిని మేం అందుకోలేకపోవచ్చు. మా మ్యాచ్‌కు వచ్చి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలని అనిపించొచ్చు. మేం కాదనట్లేదు, ఆ స్థాయిలో మా ఆట లేదనే విషయాన్ని కూడా ఒప్పుకుంటాం. కానీ ఆట పట్ల మా నిబద్ధత, ప్రేమతో మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాం’ అని చెత్రీ అభిమానులను అభ్యర్థించాడు. ప్రస్తుతం భారత ఫుట్‌బాల్ జట్టు 97వ స్థానంలో ఉంది. శుక్రవారం నాలుగు దేశాల టోర్నీ ప్రారంభం కాగా.. మొదటి మ్యాచ్‌లో 5-0 తేడాతో చైనీస్ తైపీపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌కి ఆదరణ కరువైంది. కేవలం 2569 మంది ప్రేక్షకులే ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. దీంతో ముంబైలోని ఫుట్‌బాల్ ఎరీనా స్టేడియం బోసిగా కనిపించింది. చెత్రీ హ్యాట్రిక్ గోల్స్‌తో జట్టును గెలిపించినప్పటికీ ప్రేక్షులెవరూ లేకపోవడం అతన్ని కలచి వేసింది. దాంతో సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను పంచుకున్నాడు. Now that’s an earnest appeal 👏 I am going to a football ⚽️ game soon. What about you guys? Retweet and spread the word pls https://t.co/Xd02l6xEpa — KTR (@KTRTRS) 3 June 2018 -
సునీల్ చెత్రి హ్యాట్రిక్
ముంబై: ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులంతా ‘ఫిఫా’ వరల్డ్ కప్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా... భారత ఫుట్‌బాల్ జట్టు దిగువ స్థాయి టోర్నీలో శుభారంభం చేసింది. ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో భాగంగా శుక్రవారం చైనీస్ తైపీతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5–0తో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో 3 పాయింట్లు చేరాయి. తన కెరీర్లో 99వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన స్టార్ స్ట్రయికర్, కెప్టెన్ సునీల్ చెత్రి హ్యాట్రిక్ గోల్స్ (14వ, 34వ, 62వ నిమిషాల్లో)తో ఈ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్... ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చెత్రితో పాటు ఉదంత సింగ్ (48వ ని.లో), ప్రణయ్ హల్దార్ (78వ ని.లో) చెరో గోల్ చేశారు. నాలుగు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ తదుపరి మ్యాచ్‌లో సోమవారం కెన్యాతో తలపడనుంది. -
డిసెంబర్ 4న భారత ఫుట్ బాల్ కెప్టెన్ పెళ్లి
సాక్షి, న్యూఢిల్లీ: భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెట్రి మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. చిన్ననాటి స్నేహితురాలైన సోనమ్ భట్టాచార్యను పెళ్లి చేసుకోనున్నాడు. గుర్గావ్లో సంగీత్ జరుపుకున్న ఈ జంట పెళ్లి డిసెంబర్ 4న కోల్‌కతాలో జరగనుంది. రిసెఫ్షన్ డిసెంబర్ 24న బెంగళూరులో నిర్వహించనున్నారు. సోనమ్ బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసింది. ఇక సునీల్ చెట్రి ఇండియన్ సూపర్‌లీగ్-4 సీజన్లో బెంగళూరు ఎఫ్సీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
64 ఏళ్ల తర్వాత...
యాంగాన్ (మయన్మార్): ఏఎఫ్సీ ఆసియా కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్‌లో భారత్ 1–0తో మయన్మార్‌పై విజయం సాధించింది. సునీల్ చెత్రి చివరి నిమిషంలో గోల్ చేసి జట్టును గెలిపించాడు. ఆట 90వ నిమిషంలో ఉదాంత సింగ్ అందించిన పాస్‌ను చెత్రి నేర్పుగా గోల్ పోస్ట్‌లోకి పంపి భారత శిబిరంలో సంతోషం నింపాడు. దీంతో భారత ఫుట్‌బాల్ జట్టు 64 ఏళ్ల తర్వాత మయన్మార్ గడ్డపై విజయం సాధించింది. 1953లో రంగూన్ (ఇప్పుడు యాంగాన్గా మార్చారు)లో జరిగిన నాలుగు దేశాల ఫుట్‌బాల్ టోర్నీలో భారత్ 4–2తో మయన్మార్‌ను ఓడించింది. ఆ తర్వాత 2013లో ఆడినా... భారత్‌కు 0–1తో ఓటమి ఎదురైంది. తదుపరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో భారత్ కిర్గిస్తాన్‌తో తలపడనుంది. మకావూలో జూన్ 13న ఈ పోరు జరుగనుంది. -
ఆ క్రెడిట్ కెప్టెన్ ఒక్కడిదే కాదు: కోచ్ రోకా
బెంగళూరు: తాము కేవలం ఒకే ఆటగాడి ప్రదర్శనపై ఎప్పూడు ఆధారపడి లేమని బెంగళూరు ఎఫ్‌సీ జట్టు కోచ్ అల్బర్ట్ రోకా స్పష్టంచేశాడు. స్టార్ ప్లేయర్, కెప్టెన్ సునీల్ ఛెత్రి రెండు అద్బుత గోల్స్ చేయడంతో బెంగళూరు జట్టు ఏఎఫ్ సీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆటగాళ్లు, టెక్నికల్ స్టాఫ్ అందరి శ్రమ ఇందులో దాగి ఉందన్నాడు. సెమిఫైనల్స్ లో డిఫెండింగ్ చాంపియన్ జోహర్ దరుల్ టాజిమ్ పై 3-1 గోల్స్ తేడాతో బెంగళూరు నెగ్గింది. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి వల్లే బెంగళూరు ఫైనల్ చేరిందని వస్తున్న కామెంట్లపై ఆ టీమ్ కోచ్ అల్బర్ట్ రోకా తీవ్రస్థాయిలో స్పందించాడు. ఏఎఫ్ సీ కప్ ఫైనల్లోకి ఓ భారత జట్టు ప్రవేశించడం ఇదే తొలిసారి. ఛెత్రి కెప్టెన్సీలో ఆటగాళ్లందరూ రాణించడం వల్ల బెంగళూరు నెగ్గిందనీ.. అంతేకానీ వన్ మ్యాన్ షో అని అనడం సరికాదని సూచించాడు. మరోవైఫు ఫైనల్స్ చేరిన ఇరాక్ జట్టు ఎయిర్ ఫోర్స్ ఎఫ్‌సీ ఈ టోర్నీలో 26 గోల్స్ చేసిందని, ముందు ఆ విషయంపై తమ జట్టు ఫోకస్ చేస్తోందని బెంగలూరు కోచ్ రోకా వివరించారు. -
భారత్‌కు పరాభవం
► గ్వామ్ చేతిలో 1-2తో ఓటమి ► ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్స్ టామునింగ్ (గ్వామ్) : ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టుకు అవమానకర ఓటమి ఎదురైంది. కనీసం 2 లక్షల జనాభా కూడా లేని గ్వామ్ అనే చిన్న దీవి జట్టుచేతిలో 1-2 తేడాతో భారత్ పరాజయం పాలైంది. మంగళవారం తమ దేశంలోనే జరిగిన ఈ మ్యాచ్‌లో ఏమాత్రం అంచనాలు లేని గ్వామ్ చెలరేగింది. గత గురువారం తుర్కెమెనిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ గ్వామా 1-0తో గెలిచింది. దీంతో తమ గ్రూప్ ‘డి’లో అగ్రస్థానం దక్కించుకుంది. ఆసియా నుంచి ఫుట్‌బాల్ ఆడుతున్న దేశాల్లో గ్వామ్ అతి చిన్నది. మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 141వ ర్యాంకులో ఉన్న భారత్‌కు ఇది వరుసగా రెండో పరాజయం. భారత్‌కన్నా 33 స్థానాలు వెనుకబడిన గ్వామ్ తరఫున బ్రెండన్ మెక్‌డొనాల్డ్ (38వ నిమిషంలో), ట్రావిస్ నిక్లా (62వ ని.) గోల్స్ చేయగా.. భారత్ నుంచి కెప్టెన్ సునీల్ చెత్రి ఇంజ్యూరీ సమయంలో (90+3) ఓదార్పు గోల్ చేశాడు. ఇది చెత్రికి 50వ అంతర్జాతీయ గోల్ కావడం విశేషం. తొలి మ్యాచ్‌లో ఒమన్ చేతిలో ఓడిన జట్టునే భారత కోచ్ బరిలోకి దించారు. అయితే ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసుకున్న భారత్ తగిన మూల్యం చెల్లించుకుంది. 38వ నిమిషంలో రియాన్ గై లాంగ్ పాస్‌ను అందుకున్న మెక్‌డొనాల్డ్ హెడ్ గోల్‌తో శుభారంభం అందించాడు. ద్వితీయార్ధంలో భారత్ తమ ఆటగాళ్లను మార్చినా ఆటతీరులో మార్పు రాలేదు. 62వ నిమిషంలో తన సోదరుడు షాన్ అందించిన పాస్‌ను నిక్లా గోల్ చేసి స్కోరును 2-0కి పెంచాడు. ఇక చిట్టచివర్లో చెత్రి గోల్‌తో భారత్ కాస్త పరువు నిలుపుకుంది. -
భారత్‌దే విజయం
పాక్‌తో ఫుట్‌బాల్ మ్యాచ్ బెంగళూరు: తొమ్మిదేళ్ల అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. రెండు మ్యాచ్‌ల్లో భాగంగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 1-0తో నెగ్గింది. 44వ నిమిషంలో రాబిన్‌సింగ్ భారత్ తరఫున గోల్ సాధించాడు. అయితే ఈ గోల్ నిజానికి కెప్టెన్ సునీల్ చెత్రి సాధించాడు. కార్నర్ నుంచి లాల్రిందికా రాల్టే ఇచ్చిన కిక్‌ను రాబిన్ అందుకుని ఫ్లిక్ చేయగా చెత్రి గోల్‌గా మలిచాడు. కానీ మ్యాచ్ కమిషనర్ అనూహ్యంగా ఈ గోల్‌ను రాబిన్ ఖాతాలో వేశారు. 69వ నిమిషంలో రాబిన్ రెండోసారి ఎల్లో కార్డ్‌కు గురి కావడంతో భారత్ పది మందితోనే ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ పాక్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని మ్యాచ్‌ను కాపాడుకుంది. బుధవారం రెండో మ్యాచ్ జరుగనుంది.