
సాక్షి, న్యూఢిల్లీ: భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెట్రి మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. చిన్ననాటి స్నేహితురాలైన సోనమ్ భట్టాచార్యను పెళ్లి చేసుకోనున్నాడు. గుర్గావ్‌లో సంగీత్ జరుపుకున్న ఈ జంట పెళ్లి డిసెంబర్ 4న కోల్‌కతాలో జరగనుంది.
రిసెఫ్షన్ డిసెంబర్ 24న బెంగళూరులో నిర్వహించనున్నారు. సోనమ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఇక సునీల్ చెట్రి ఇండియన్ సూపర్‌లీగ్-4 సీజన్‌లో బెంగళూరు ఎఫ్‌సీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment