న్యూఢిల్లీ : కెరీర్ ప్రారంభంలో కోల్‌కతా మేటి క్లబ్ మోహన్ బగాన్ క్లబ్ తరఫున ఆడే సమయంలో ఒత్తిడి తట్టుకోలేక ఏడ్చేవాడినని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి గుర్తు చేసుకున్నాడు. ఒకానొక సమయంలో ఆటను వదిలేద్దామని కూడా అనుకున్నాడట! ఈ విషయాన్ని స్వయంగా అతనే చెప్పాడు. చివరకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇంతవరకు రాగలిగానని అన్నాడు. ‘ఆటలో తొలి ఏడాది బాగానే గడిచింది. అప్పుడే ప్రేక్షకులు నన్ను తమ అభిమాన ప్లేయర్ బైచుంగ్ భూటియాతో పోల్చేవారు. అంచనాలు అందుకోలేని సమయంలో తీవ్రంగా విమర్శించేవారు. దీంతో ఒత్తిడి పెరిగిపోయి చాలా సార్లు ఏడ్చేవాడిని. ఓసారైతే మా నాన్నను పిలిచి ఇక ఫుట్‌బాల్ ఆడలేనని చెప్పాను. స్వతహాగా క్రీడాకారులైన నా తల్లిదండ్రులు నాకు అండగా నిలిచారు’ అని 35 ఏళ్ల ఛెత్రి తెలిపాడు. 18 ఏళ్ల తన కెరీర్‌లో ఛెత్రి భారత్ తరఫున 72 గోల్స్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment