నేడు ఆఫ్గానిస్తాన్‌తో ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్
గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్న భారత్
భారత కెప్టెన్ సునీల్ ఛెత్రికి 150వ మ్యాచ్
గువాహటి: భారత ఫుట్‌బాల్ జట్టు ఇప్పుడు సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయిర్స్‌లో భాగంగా సౌదీ అరేబియాలో జరిగిన అఫ్గానిస్తాన్ హోం మ్యాచ్ ఒక్క గోల్ నమోదు కాకుండానే ‘డ్రా’గా ముగిసింది. ఇప్పుడు సొంత ప్రేక్షకుల మధ్య మంగళవారం జరిగే పోరులో భారత్ గోల్సే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18 చానెల్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
మరోవైపు భారత దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రికిది 150వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. 2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన సునీల్ ఛెత్రి... 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 93 గోల్స్ చేశాడు. భారత్ తరఫున 150 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడు ఛెత్రినే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 40 మంది మాత్రమే 150 మ్యాచ్‌ల మైలురాయిని తాకారు.
Comments
Please login to add a commentAdd a comment