లలిత్‌పూర్ (నేపాల్): దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–20 చాంపియన్‌ప్‌లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సోమవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0 గోల్ తేడాతో భూటాన్‌ను ఓడించింది. భారత్ తరఫున మునీరుల్ మౌలా (37వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
తొలి అర్ధభాగంలోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్ చివరి వరకు దాన్ని కాపాడుకుంది. అయితే ఒత్తిడికి గురైన భూటాన్ ఆటగాళ్లు పదే పదే భారత ప్లేయర్లతో వాగ్వాదానికి దిగగా... మనవాళ్లు కూడా దీటుగా బదులిచ్చారు.
దీంతో ఇద్దరు భారత ఆటగాళ్లు, ఓ భూటాన్ ప్లేయర్‌కి రిఫరీ ‘రెడ్ కార్డు’ చూపి మైదానం నుంచి బయటకు పంపాడు. ఫలితంగా ఆట 67వ నిమిషం తర్వాత భారత్ కేవలం తొమ్మిది మంది ప్లేయర్లతోనే ఆధిక్యాన్ని కాపాడుకోవం విశేషం. శుక్రవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో మాల్దీవులుతో భారత్ ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లో బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక జట్లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment