న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాలర్ బిజయ్ ఛెత్రి జాక్‌పాట్ కొట్టాడు. లాటిన్ అమెరికా క్లబ్‌కు ఆడే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. తద్వారా ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి భారతీయ ఫుట్‌బాలర్‌గా గుర్తింపు పొందనున్నాడు.
మణిపూర్‌కు చెందిన 22 ఏళ్ల బిజయ్‌తో ఉరుగ్వేకు చెందిన కొలోన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఒప్పందం చేసుకుంది. ఇంకా భారత సీనియర్ జట్టుకు ఆడని బిజయ్ 2016లో షిల్లాంగ్ లాజోంగ్ క్లబ్ తరఫున అరంగేట్రం చేశాడు.
ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్‌లో చెన్నైయన్ ఎఫ్‌సీ తరఫున ఆడుతున్న బిజయ్ గతంలో ఇండియన్ యారోస్, చెన్నై సిటీ, రియల్ కశ్మీర్, శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ తరఫున బరిలోకి దిగాడు.
Comments
Please login to add a commentAdd a comment