
షిల్లాంగ్: ఐ–లీగ్ జాతీయ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు ఐదో ‘డ్రా’ నమోదు చేసింది. నెరోకా ఎఫ్‌సీతో గురువారం జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి జట్టు 1–1తో ‘డ్రా’ చేసుకుంది.
నెరోకా తరఫున రోహిత్ (70వ ని.లో), శ్రీనిధి తరఫున డేవిడ్ కాస్టనెడా మునోజ్ (82వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 44 పాయింట్లతో రెండో స్థానంలో, మొహమ్మదాన్ స్పోర్టింగ్ 49 పాయింట్లో తొలి స్థానంలో ఉన్నాయి. శ్రీనిధి జట్టుకు టైటిల్ దక్కాలంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు మొహమ్మదాన్ స్పోర్టింగ్ జట్టు తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా ఓడిపోవాలి.
Comments
Please login to add a commentAdd a comment