Saff Cup football tournament
-
భారత్‌ను గెలిపించిన మునీరుల్
లలిత్పూర్ (నేపాల్): దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–20 చాంపియన్‌ప్‌లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సోమవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0 గోల్ తేడాతో భూటాన్‌ను ఓడించింది. భారత్ తరఫున మునీరుల్ మౌలా (37వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి అర్ధభాగంలోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్ చివరి వరకు దాన్ని కాపాడుకుంది. అయితే ఒత్తిడికి గురైన భూటాన్ ఆటగాళ్లు పదే పదే భారత ప్లేయర్లతో వాగ్వాదానికి దిగగా... మనవాళ్లు కూడా దీటుగా బదులిచ్చారు. దీంతో ఇద్దరు భారత ఆటగాళ్లు, ఓ భూటాన్ ప్లేయర్‌కి రిఫరీ ‘రెడ్ కార్డు’ చూపి మైదానం నుంచి బయటకు పంపాడు. ఫలితంగా ఆట 67వ నిమిషం తర్వాత భారత్ కేవలం తొమ్మిది మంది ప్లేయర్లతోనే ఆధిక్యాన్ని కాపాడుకోవం విశేషం. శుక్రవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో మాల్దీవులుతో భారత్ ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లో బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక జట్లున్నాయి. -
SAFF ఫుట్‌బాల్ ఛాంపియన్ భారత్.. 9వ సారి టైటిల్ కైవసం (ఫోటోలు)
-
చాంపియన్ భారత్
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్‌లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)లో తొమ్మిదోసారి భారత జట్టు చాంపియన్‌గా నిలి చింది. మంగళవారం జరిగిన ఫైనల్లో సునీల్ ఛెత్రి కెప్టెన్సీలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్’లో 5–4తో కువైట్ జట్టును ఓడించింది. కువైట్ పశి్చమ ఆసియా దేశమైనా పోటీతత్వం పెరగాలనే ఉద్దేశంతో దక్షిణాసియా టోరీ్నకి ఆ జట్టును ప్రత్యేకంగా ఆహా్వనించారు. లీగ్ దశలో కువైట్‌తో జరిగిన మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న భారత్ తుది పోరులో మాత్రం పైచేయి సాధించింది. ఆట 14వ నిమిషంలో అల్‌బలూషి గోల్‌తో కువైట్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 39వ నిమిషంలో లాలియన్జులా చాంగ్టే గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయలేకపోయాయి. అదనపు సమయంలోనూ స్కోరు సమంగానే ఉంది. దాంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ‘షూటౌట్’లో నిరీ్ణత ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. ఆరో షాట్లో భారత ప్లేయర్ మహేశ్ సింగ్ గోల్ చేయగా... కువైట్ ప్లేయర్ హజిహా కొట్టిన షాట్‌ను భారత గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ అడ్డుకోవడంతో టీమిండియా విజయం ఖాయమైంది. విజేతగా నిలిచిన భారత జట్టుకు 50 వేల డాలర్లు (రూ. 41 లక్షలు), రన్నరప్ కువైట్ జట్టుకు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 50 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 9: ‘శాఫ్’ చాంపియన్‌షిప్ ఇప్పటివరకు 13 సార్లు జరిగింది. భారత్ తొమ్మిదిసార్లు (1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021, 2023) టైటిల్ సాధించింది. 24: ‘శాఫ్’ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా సునీల్ ఛెత్రి అవతరించాడు. 23 గోల్స్‌తో అలీ అష్ఫాక్ (మాల్దీవులు) పేరిట ఉన్న రికార్డును 24 గోల్స్‌తో సునీల్ ఛెత్రి అధిగమించాడు. ‘షూటౌట్’ సాగిందిలా... భారత్ స్కోరు కువైట్ సునీల్ ఛెత్రి 4 10 అబ్దుల్లా 8 సందేశ్ జింగాన్ 4 21 అలోతైబి 4 లాలియన్జులా 4 32 ఆల్దెఫీరి 4 ఉదాంత సింగ్ 8 33 మహ్రాన్ 4 సుభాశ్ బోస్ 4 44 అల్ఖాల్ది 4 మహేశ్ సింగ్ 4 54 హజిహా 8 -
Football: ఫైనల్లో భారత్.. పెనాల్టీ షూటౌట్లో లెబనాన్‌పై గెలుపు
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)లో భారత జట్టు తొమ్మిదో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సునీల్ ఛెత్రి కెప్టెన్సీలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్’లో 4–2తో లెబనాన్ జట్టును ఓడించింది. మంగళవారం జరిగే ఫైనల్లో కువైట్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరో సెమీఫైనల్లో కువైట్ 1–0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. లెబనాన్‌తో జరిగిన సెమీఫైనల్లో నిర్ణీత సమయం వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. అదనపు సమయంలోనూ గోల్స్ నమోదు కాలేదు. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత్ తరఫున వరుసగా సునీల్ ఛెత్రి, అన్వర్ అలీ, మహేశ్ సింగ్, ఉదాంత సింగ్ గోల్స్ చేశారు. లెబనాన్ తరఫున మాతూక్ తొలి షాట్‌ను భారత గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నిలువరించాడు. ఆ తర్వాత వాలిద్, సాదిక్ గోల్స్ చేయగా... బదర్ కొట్టిన నాలుగో షాట్ బయటకు వెళ్లడంతో భారత విజయం ఖరారైంది. గతంలో భారత్ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021లలో విజేతగా నిలిచింది. -
రణరంగాన్ని తలపించిన భారత్-కువైట్ ఫుట్‌బాల్ మ్యాచ్
శాఫ్ ఛాంపియన్షిప్ 2023 ఫుట్‌బాల్ టోర్నీలో మరో మ్యాచ్ రణరంగాన్ని తలపించింది. కొద్ది రోజుల కిందట ఇదే టోర్నీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు బాహాబాహీకి దిగగా.. తాజాగా భారత్-కువైట్ మధ్య మ్యాచ్‌లో సేమ్ సీన్ రిపీటైంది. ఇరు జట్లకు చెందిన ముగ్గురికి రిఫరీ రెడ్ కార్డ్ జారీ చేశాడు. భారత కోచ్ ఇగోర్ స్టిమాక్, ఫార్వర్డ్ రహీమ్ అలీ, కువైట్‌కు చెందిన అల్ ఖలాఫ్ మార్చింగ్ ఆర్డర్లు పొందారు. 64వ నిమిషంలో భారత కోచ్‌కు ఎల్లో కార్డ్ (బంతిని పట్టుకుని ఆటకు ఆటంకం కలిగించాడు) ఇష్యూ చేయడంతో మొదలైన గొడవ చినికిచినికి గాలివానలా మారి ఇరు జట్ల ఆటగాళ్లు కొట్టుకునేంతవరకు తీసుకెళ్లింది. ఆట 10 నిమిషాల్లో ముగుస్తుందనగా.. భారత ఆధిక్యాన్ని (1-0) కాపాడే ప్రయత్నంలో భాగంగా భారత కోచ్ మైదానం వెలువల అత్యుత్సాహం కనబర్చాడు. దీంతో రిఫరి అతనికి రెడ్ కార్డ్ ఇష్యూ చేశాడు. How hot is it in Bengaluru? WTH is happening 🙈😂 pic.twitter.com/CMsBFesyNd — Akshata Shukla (@shukla_akshata) June 27, 2023 ఈ క్రమంలో భారత ఫార్వర్డ్ రహీమ్ అలీ తన టెంపర్‌ను కోల్పోయి కువైట్ ఆటగాడు అల్ ఖలాఫ్‌ను కిందకు తోసేశాడు. దీంతో అతనికి కూడా రెడ్‌కార్డ్ ఇష్యూ అయ్యింది. ఇది మనసలో పెట్టుకున్న అల్ ఖలాఫ్.. భారత ఆటగాడు సహల్ అబ్దుల్ సమద్‌ను నేలపైకి నెట్టడంతో గొడవ తీవ్రరూపం దాల్చింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. గొడవకు కారణమైన కువైట్ ఆటగాడికి కూడా రిఫరీ రెడ్‌కార్డ్ చూపించాడు. More chaos after Sahal is left in a heap as Kuwait try to get the ball back after a foul call. The coaching staff is involved in it as well before the ref breaks it up, but Rahim Ali is sent off! pic.twitter.com/owoXhieEfl — Anantaajith Raghuraman (@anantaajith) June 27, 2023 భారత్ సెల్ఫ్ గోల్.. మొదటి అర్ధభాగంలో సునీల్ ఛెత్రి గోల్ చేసి అందించిన ఆధిక్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. అదనపు సమయంలో భారత ఆటగాడు అన్వర్ అలీ సెల్ఫ్ గోల్ చేయడంతో మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో గోల్స్ డిఫరెన్స్ కారణంగా కువైట్ గ్రూప్ టాపర్‌గా నిలిచింది. భారత్ రెండో స్థానంలో సరిపెట్టుకుంది. కువైట్ ఆటగాళ్లు అత్యుత్సాహం.. భారత డగౌట్‌పై దాడి భారత్ సెల్ఫ్ గోల్‌తో మ్యాచ్ సమం అయ్యాక కువైట్ ఆటగాళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. భారత డగౌట్‌పై దాడి చేశారు. దీంతో రిఫరీ వారికి రెండు పసుపు కార్డులు జారీ చేశాడు. -
పసికూనపై ప్రతాపం.. సెమీస్‌లో భారత్
కఠ్మాండు (నేపాల్): దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్ (శాఫ్) చాంపియన్‌షిప్‌లో భారత్ వరుసగా రెండో విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 9–0 గోల్స్ తేడాతో పసికూనలైన మాల్దీవుల జట్టుపై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ (55వ ని.లో) ఒక గోల్... అంజు తమాంగ్ నాలుగు గోల్స్ (24వ ని.లో, 45+2వ ని.లో, 85వ ని.లో, 88వ ని.లో)... డాంగ్మే గ్రేస్ (53వ ని.లో, 86వ ని.లో) రెండు గోల్స్.. కష్మీనా (84వ ని.లో) ఒక గోల్ సాధించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో 13న బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. -
పాక్‌ను చిత్తు చేసిన భారత్
కఠ్మాండు (నేపాల్): ఆరోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో (శాఫ్) బరిలోకి దిగిన భారత జట్టు శుభారంభం చేసింది. పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున డాంగ్మే గ్రేస్ (23వ ని.లో), తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ (90+4వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... అంతకుముందు పాకిస్తాన్ జట్టు చేసిన సెల్ఫ్ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో ఈనెల 10న మాల్దీవులు జట్టుతో ఆడుతుంది. -
పీలే రికార్డును సమం చేసిన భారత స్టార్ ఫుట్‌బాలర్..
Sunil Chhetri Equals Pele Record: భారత ఫుట్‌బాల్ జట్టు సారథి సునీల్ ఛెత్రి అరుదైన రికార్డును సమం చేశాడు. శాఫ్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌లో గోల్ సాధించడం ద్వారా కెరీర్లో 77వ అంతర్జాతీయ గోల్ సాధించాడు. ఈ క్రమంలో ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు పీలే సరసన నిలిచాడు. పీలే 92 మ్యాచ్‌ల్లో 77 గోల్స్ సాధించగా, ఛెత్రి 123వ మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనతను సాధించాడు. మొత్తంగా అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో పీలే, అలీ మబ్కౌట్(యూఈఏ)తో కలిసి మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో 122 గోల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ 79 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఛెత్రి రికార్డు గోల్ సాధించి భారత్‌కు 1-0తేడాతో విజయాన్ని అందించాడు. చదవండి: దేశం కోసం ధోని.. మెంటార్‌గా ఎలాంటి ఫీజు వద్దన్న లెజెండ్ -
‘శాఫ్’ కప్ ఫైనల్లో భారత్‌కు షాక్
ఢాకా: దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌కు భంగపాటు ఎదురైంది. అందివచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడంలో విఫలమైన భారత జట్టు ఫైనల్లో 1–2తో మాల్దీవులు చేతిలో ఓడింది. గ్రూప్ దశలో 2–0తో మాల్దీవులను ఓడించిన భారత్ శనివారం జరిగిన తుదిపోరులో మాత్రం తడబడింది. ఆద్యంతం భారత్ ఆధిపత్యమే కొనసాగినా విజయం మాత్రం ప్రత్యర్థిని వరించింది. వచ్చిన కొద్దిపాటి అవకాశాలను చక్కగా వినియోగించుకున్న మాల్దీవులు రెండో సారి శాఫ్ కప్‌ను ఎగరేసుకుపోయింది. భారత్ తరఫున సుమీత్ పస్సీ (92వ ని.లో) ఏకైక గోల్ చేయగా... మాల్దీవులు తరఫున ఇబ్రహీం (19వ ని.లో), అలీ ఫసీర్ (66వ ని.లో) చెరో గోల్ చేశారు. ఈ టోర్నీలో అజేయంగా ఫైనల్ చేరిన భారత్ తుదిపోరులో సమన్వయ లోపంతో చతికిలపడింది. ఆట ఆరంభమైన ఐదో నిమిషంలోనే వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంది. నిఖిల్ అందించిన పాస్‌ను రంజన్ సింగ్ హెడర్ ద్వారా గోల్‌గా మలిచే ప్రయత్నం చేసినా అది సఫలం కాలేదు. 30వ నిమిషంలో ఫరూఖ్ గోల్‌పోస్ట్‌కు అతిసమీపంలో బంతిని దొరకబుచ్చుకున్నా నియంత్రణ కోల్పోయి దాన్ని వృథా చేశాడు. ఆ తర్వాత కూడా భారత్ దాడులను కొనసాగించినా మాల్దీవులు రక్షణ పంక్తి వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. ఇంజ్యూరీ టైంలో సుమీత్ గోల్ చేసినా అప్పటికే ఆలస్యమైంది. -
ఫైనల్లో భారత్
ఢాకా: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) కప్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు ఫైనల్ చేరింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 3–1తో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున మాన్వీర్ సింగ్ (49వ, 69వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... సుమీత్ పస్సీ (83వ ని.లో) ఓ గోల్ చేశాడు. పాక్ తరఫున హసన్ బషీర్ (88వ ని.లో) ఏకైక గోల్ కొట్టాడు. మరో సెమీఫైనల్లో మాల్దీవులు 3–0తో నేపాల్‌పై గెలిచింది. శనివారం జరుగనున్న తుదిపోరులో మాల్దీవులుతో భారత్ తలపడనుంది. -
భారత్ ప్రతీకార పోరు
నేడు అఫ్ఘానిస్తాన్‌తో ఫైనల్ * శాఫ్ కప్ ఫుట్‌బాల్ టోర్నీ * సాయంత్రం గం. 6.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం తిరువనంతపురం: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) టోర్నమెంట్ తుది పోరులో నేడు (ఆదివారం) భారత జట్టు అఫ్ఘానిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఓటమి లేకుండా కొనసాగుతున్న తమ జోరును తుది పోరులోనూ సాగించాలనే ఆలోచనలో భారత్ ఉంది. అయితే అఫ్ఘాన్ రూపంలో భారత్ ఈ మ్యాచ్‌లో గట్టి పోటీనే ఎదుర్కోబోతోంది. నేపాల్‌లో జరిగిన చివరి(2013) ఎడిషన్‌లో తమను ఓడించి చాంపియన్‌గా అవతరించిన అఫ్ఘాన్‌పై బదులు తీర్చుకునేందుకు ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ పోటీల్లో తీవ్రంగా నిరుత్సాహపరిచిన సునీల్ చెత్రి సేన ఈ విజయంతో అభిమానులను ఊరట పరచాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆరుసార్లు విజేతగా నిలిచిన భారత జట్టును ఆసియాలో రోజురోజుకూ పుంజుకుంటున్న అఫ్ఘాన్ జట్టు ఏమేరకు నిలువరిస్తుందో వేచి చూడాలి. స్వదేశంలో జరిగిన 2011 టోర్నీ ఫైనల్లో భారత్ 4-0తో అఫ్ఘాన్‌ను చిత్తు చేసింది. ఇందులో సునీల్ చెత్రి హ్యాట్రిక్‌తో రెచ్చిపోయాడు. అయితే రెండేళ్ల అనంతరం ఖాట్మండూలో జరిగిన శాఫ్ కప్ ఫైనల్లో అఫ్ఘాన్ జట్టు 2-0తో బదులు తీర్చుకుంది. అప్పటి జట్టులో ఉన్న ఆటగాళ్లలో చెత్రి, జేజే, రాబిన్ సింగ్, అర్నాబ్, సుబ్రతా పాల్ మాత్రమే ఇప్పుడున్నారు. చెత్రి, జేజే ఫామ్‌తో పాటు 18 ఏళ్ల చాంగ్టే ప్రదర్శన లాభిస్తోంది. మిడ్ ఫీల్డ్‌లో రౌలిన్ బోర్గెస్, లింగ్డో కీలకంగా ఉన్నారు. ఇదిలావుండగా అఫ్ఘాన్ జట్టును భారత్ తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కోచ్ స్టీఫెన్ కాన్స్టాంటైన్ ఇప్పటికే ఆ జట్టును ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఆ జట్టులోని 15 మంది ఆటగాళ్లలో చాలా మంది యూరప్‌లో ఆడినవారే. ఆసియా, యూరప్ ఆటగాళ్ల మధ్య చాలా తేడా ఉంటుందని, ఇది ఫలితంపై ప్రభావం చూపిస్తుందని కోచ్ భావిస్తున్నారు.