శాఫ్ ఛాంపియన్‌షిప్ 2023 ఫుట్‌బాల్ టోర్నీలో మరో మ్యాచ్ రణరంగాన్ని తలపించింది. కొద్ది రోజుల కిందట ఇదే టోర్నీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు బాహాబాహీకి దిగగా.. తాజాగా భారత్-కువైట్ మధ్య మ్యాచ్‌లో సేమ్ సీన్ రిపీటైంది. ఇరు జట్లకు చెందిన ముగ్గురికి రిఫరీ రెడ్ కార్డ్ జారీ చేశాడు. భారత కోచ్ ఇగోర్ స్టిమాక్, ఫార్వర్డ్ రహీమ్ అలీ, కువైట్‌కు చెందిన అల్ ఖలాఫ్ మార్చింగ్ ఆర్డర్‌లు పొందారు.
64వ నిమిషంలో భారత కోచ్‌కు ఎల్లో కార్డ్ (బంతిని పట్టుకుని ఆటకు ఆటంకం కలిగించాడు) ఇష్యూ చేయడంతో మొదలైన గొడవ చినికిచినికి గాలివానలా మారి ఇరు జట్ల ఆటగాళ్లు కొట్టుకునేంతవరకు తీసుకెళ్లింది. ఆట 10 నిమిషాల్లో ముగుస్తుందనగా.. భారత ఆధిక్యాన్ని (1-0) కాపాడే ప్రయత్నంలో భాగంగా భారత కోచ్ మైదానం వెలువల అత్యుత్సాహం కనబర్చాడు. దీంతో రిఫరి అతనికి రెడ్ కార్డ్ ఇష్యూ చేశాడు.
How hot is it in Bengaluru?
— Akshata Shukla (@shukla_akshata) June 27, 2023
WTH is happening 🙈😂 pic.twitter.com/CMsBFesyNd
ఈ క్రమంలో భారత ఫార్వర్డ్ రహీమ్ అలీ తన టెంపర్‌ను కోల్పోయి కువైట్ ఆటగాడు అల్ ఖలాఫ్‌ను కిందకు తోసేశాడు. దీంతో అతనికి కూడా రెడ్‌కార్డ్ ఇష్యూ అయ్యింది. ఇది మనసలో పెట్టుకున్న అల్ ఖలాఫ్.. భారత ఆటగాడు సహల్ అబ్దుల్ సమద్‌ను నేలపైకి నెట్టడంతో గొడవ తీవ్రరూపం దాల్చింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. గొడవకు కారణమైన కువైట్ ఆటగాడికి కూడా రిఫరీ రెడ్‌కార్డ్ చూపించాడు.
More chaos after Sahal is left in a heap as Kuwait try to get the ball back after a foul call. The coaching staff is involved in it as well before the ref breaks it up, but Rahim Ali is sent off! pic.twitter.com/owoXhieEfl
— Anantaajith Raghuraman (@anantaajith) June 27, 2023
భారత్ సెల్ఫ్ గోల్..
మొదటి అర్ధభాగంలో సునీల్ ఛెత్రి గోల్ చేసి అందించిన ఆధిక్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. అదనపు సమయంలో భారత ఆటగాడు అన్వర్ అలీ సెల్ఫ్ గోల్ చేయడంతో మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో గోల్స్ డిఫరెన్స్ కారణంగా కువైట్ గ్రూప్ టాపర్‌గా నిలిచింది. భారత్ రెండో స్థానంలో సరిపెట్టుకుంది.
కువైట్ ఆటగాళ్లు అత్యుత్సాహం.. భారత డగౌట్‌పై దాడి
భారత్ సెల్ఫ్ గోల్‌తో మ్యాచ్ సమం అయ్యాక కువైట్ ఆటగాళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. భారత డగౌట్‌పై దాడి చేశారు. దీంతో రిఫరీ వారికి రెండు పసుపు కార్డులు జారీ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment