Sunil Chettri
-
‘ఆ రోజు నేను ఏడుస్తూనే ఉంటా’
‘‘కఠిన శ్రమకోర్చే.. ఓ మంచి ఆటగాడిగా అందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలని మాత్రమే కోరుకుంటా. చూడటానికి చక్కగా కనిపించే హార్డ్ వర్కర్ ఉండేవాడని నన్ను గుర్తుంచుకుంటే చాలు’’ అని భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి అన్నాడు. అదే తాను ఇక్కడ విడిచి వెళ్తున్న జ్ఞాపకంగా మిగిలిపోవాలని పేర్కొన్నాడు.కాగా భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన విషయం తెలిసిందే. జూన్ 6న తన చివరి మ్యాచ్ ఆడబోతున్నానని 39 ఏళ్ల ఛెత్రి గురువారం ప్రకటించాడు.ప్రైవేట్, క్లబ్, ఫ్రాంచైజీ లీగ్‌లలో కొనసాగుతావచ్చే నెల 6న ప్రపంచకప్ ఆసియా జోన్ క్వాలిఫయర్స్‌లో భాగంగా కువైట్‌తో జరిగే మ్యాచే తన కెరీర్లో చివరిదని ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు.అయితే ప్రైవేట్, క్లబ్, ఫ్రాంచైజీ లీగ్‌లలో కొనసాగుతానని ఛెత్రి స్పష్టం చేశాడు. 2005లో అరంగేట్రం చేసిన ఈ స్టార్ ఫుట్‌బాలర్ దాదాపు రెండు దశాబ్దాల పాటు (19 ఏళ్లు) భారత జట్టుకు సేవలందించాడు. ఢిల్లీకి చెందిన ఆర్మీ అధికారి కేబీ ఛెత్రి, సుశీల దంపతులకు 1984, ఆగస్టు 3న సికింద్రాబాద్ (తెలంగాణ)లో జన్మించిన ఛెత్రి భారత ఫుట్‌బాల్‌లో అసాధారణ ఫార్వర్డ్ ఆటగాడిగా ఎదిగాడు. తదనంతరం నాయకత్వ పటిమతో విజయవంతమైన సారథి అయ్యాడు. భారత ఫుట్‌బాల్ చరిత్రలో చురుకైన దిగ్గజంగా వెలుగొందుతున్నాడు. ఆరోజు ఏడుస్తూనే ఉంటాఇక తన రిటైర్మెంట్ ప్రకటన నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సునిల్ ఛెత్రి.. ‘‘జూన్ 6న నేను రిటైర్ అవుతాను.. జూన్ 7 మొత్తం ఏడుస్తూనే ఉంటాను. జూన్ 8న కాస్త రిలాక్స్ అవుతాను. జూన్ 8 నుంచి బ్రేక్ తీసుకుని నా కుటుంబానికి సమయం కేటాయిస్తాను’’ అని తెలిపాడు.సునిల్ ఛెత్రి సాధించిన ఘనతలు 👉150 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన సునీల్ 94 గోల్స్ కొట్టాడు. భారత్ తరఫున టాప్ స్కోరర్ కాగా... ఓవరాల్‌గా ఫుట్‌బాల్ చరిత్రలో జాతీయ జట్టు తరఫున ఎక్కువ గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో టాప్–3లో ఉన్నాడు. క్రిస్టియానో రోనాల్డో (128 గోల్స్; పోర్చుగల్), మెస్సీ (106 గోల్స్; అర్జెంటీనా) తర్వాతి స్థానం మన ఛెత్రిదే! 👉మూడు సార్లు భారత జట్టు నెహ్రూ కప్ అంతర్జాతీయ టోర్నీ (2007, 2009, 2012) టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 👉దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) చాంపియన్‌షిప్‌లో భారత్ మూడు (2011, 2015, 2021) టైటిల్ విజయాలకు కృషి చేశాడు. 👉2008లో ఏఎఫ్సీ చాలెంజ్ కప్‌ను గెలిపించిన ఛెత్రి, ఏడుసార్లు ‘ఏఐఎఫ్ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచాడు. భారత్‌లోని ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్‌లైన ఈస్ట్ బెంగాల్, డెంపో, ముంబై సిటీ ఎఫ్‌సీ, బెంగళూరు ఎఫ్‌సీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయా జట్లకు లీగ్ ట్రోఫీలు అందించాడు.‘అతనో ఫుట్‌బాల్ శిఖరం’ భారత బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లి, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా తదితరులంతా ఛెత్రి ఘనతల్ని కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా వారంతా అతనొక రియల్ లెజెండ్‌గా కితాబిచ్చారు. బీసీసీఐ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సైతం ఛెత్రి సేవలకు సెల్యూట్ చేశాయి.నాకు ముందే తెలుసుఛెత్రి రిటైర్మెంట్ గురించి తనకు ముందే తెలుసన్నాడు క్రికెటర్ విరాట్ కోహ్లి. అతడిని చూసి తాను గర్వపడుతున్నానని.. ఏదేమైనా బాగా ఆలోచించిన తర్వాత సునిల్ ఛెత్రి ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. కాగా కోహ్లి, సునిల్ ఛెత్రి మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.చదవండి: IPLలో రూ. 20 లక్షలు.. అక్కడ అత్యధిక ధర! నితీశ్ రెడ్డి రియాక్షన్ ఇదే -
‘సర్.. నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)
-
Sunil Chhetri Love Story: ‘చిన్నపిల్లవి చదువుకో అని చెప్పాను.. కానీ నా మనసే వినలేదు’
భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి 39 ఏళ్ల వయసులో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఈ మేరకు .. గురువారం (మే 16) ప్రకటన విడుదల చేశాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్లో సునిల్ ఛెత్రి మొత్తంగా 150 మ్యాచ్‌లలో 94 గోల్స్ సాధించాడు. భారత ఫుట్‌బాల్ కెప్టెన్‌గానూ సునిల్ ఛెత్రి సేవలు అందించాడు.సునిల్ ఛెత్రి వ్యక్తిగత జీవితం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. అతడి లవ్‌స్టోరీ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. సునిల్ ఛెత్రి తన కోచ్, భారత మాజీ ఆటగాడు సుబ్రతా భట్టాచార్య కుమార్తె సోనం భట్టాచార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన ప్రేమ కథ గురించి సునిల్ ఛెత్రి గతంలో హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘నాకు అప్పుడు 18 ఏళ్లు. ఆమెకు 15 ఏళ్లు. వాళ్ల నాన్న గురించి అందరితో గొప్పగా చెప్పేవారు.ఆమె వాళ్ల నాన్న దగ్గరి నుంచి నా నా నెంబర్ దొంగతనం చేసి.. నాకు మెసేజ్‌లు పంపేది. ‘నేను సోనం.. నేను మీకు వీరాభిమానిని. మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను’ అని సందేశాలు పంపించేది.నాకు మాత్రం అప్పటికి తనెవరో తెలియదు. అయితే, ఆమె మాట్లాడే విధానం నచ్చి ఓ రోజు తనను కలవాలని నిర్ణయించుకున్నా. తనని చూడగానే ఇంత చిన్నపిల్లా నాకు మెసేజ్‌లు పంపేది అనుకున్నా. ‘నువ్వింకా చిన్నదానివి. వెళ్లి బుద్ధిగా చదువుకో’ అని చెప్పి వెళ్లిపోయా.అయితే, తన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం మాత్రం మానలేకపోయా. రెండున్నర నెలల తర్వాత మా కోచ్ ఫోన్ పనిచేయడం లేదని.. ప్రాబ్లం ఏమిటో చూడాలని నాకు ఇచ్చారు. అప్పుడు మా కోచ్ వాళ్ల కూతురి నంబర్, నాకు మెసేజ్‌లు చేసే అమ్మాయి నంబర్ ఒకేలా అనిపించింది.అప్పుడే నాకు అర్థమైంది తను మరెవరో కాదు మా కోచ్ కూతురేనని! వెంటనే సోనంకు కాల్ చేసి.. ఈ విషయం గురించి మీనాన్నకు తెలిస్తే నా కెరీర్ ముగిసిపోతుంది. ఇక చాలు అని చెప్పేశా.అప్పుడు సోనం నాకు సారీ చెప్పింది. అయితే, విధి రాత మరోలా ఉంది. తను నా మనసులో అలాగే ఉండిపోయింది. ఆమెతో మాట్లాడాలని, మెసేజ్ చేయాలని మా మనసు తహతహలాడేది. సీక్రెట్‌గా కలిసేవాళ్లం. నా బిజీ షెడ్యూల్ కారణంగా ఏడాదిలో రెండు మూడుసార్లు మాత్రమే నేరుగా కలిసేందుకు వీలయ్యేది.సినిమాకు వెళ్లి రెండు టికెట్లు కొని.. ఒకటి తనకోసం కౌంటర్ దగ్గరే వదిలేసి వెళ్తే తను వచ్చి తీసుకునేది. చాలా ఏళ్లపాటు అలాగే ప్రేమలో మునిగితేలాం.నా కెరీర్‌తో పాటు మా ప్రేమ కూడా ట్రాక్‌లో పడింది. సరైన వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.ఈ విషయం గురించి మా కోచ్‌తో మాట్లాడాలని నిర్ణయించుకున్నా. కానీ ధైర్యం చాల్లేదు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని ‘సర్.. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా’ అని చెప్పాను. ఆయన వెంటనే అవునా.. సరే అంటూ వాష్‌రూంలోకి వెళ్లిపోయారు. కాసేపటికి వచ్చి మాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు.ఆతర్వాత కొన్ని నెలలకు మా పెళ్లి జరిగింది. 13 ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. తనే నా ధైర్యం.సపోర్ట్ సిస్టం. ప్రతి అడుగులోనూ నా వెంటే ఉంటుంది. తను లేకుంటే నేను లేను. ఇప్పటికీ తను నాకు వీరాభిమానే!’’ అని సునిల్ ఛెత్రి తెలిపాడు. కాగా సునిల్- సోనం జంటకు 2023లో కుమారుడు జన్మించాడు. -
ఒక్క గోల్, ఒక్క పాయింట్ లేకుండానే ఓటమితో ముగించిన టీమిండియా
దోహా: ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సిరియాతో జరిగి న చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో సునీల్ ఛెత్రి నాయకత్వంలోని టీమిండియా 0–1 గోల్ తేడాతో ఓడిపోయింది. సిరియా తరఫున ఆట 76వ నిమిషంలో ఒమర్ ఖిరిబిన్ ఏకైక గోల్ చేసి తమ జట్టును గెలిపించాడు. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయకుండానే, ఒక్క విజయం కూడా లేకుండా ని్రష్కమించింది. తొలి మ్యాచ్‌లో భారత్ 0–2తో ఆస్ట్రేలియా చేతిలో, రెండో మ్యాచ్‌లో 0–3తో ఉజ్బెకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. ఏడు పాయింట్లతో ఆస్ట్రేలియా, ఐదు పాయింట్లతో ఉజ్బెకిస్తాన్ ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించాయి. -
ఫిఫా ర్యాంకింగ్స్.. టాప్-100లో భారత జట్టుకు చోటు
న్యూఢిల్లీ: ఐదేళ్ల విరామం తర్వాత భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్స్‌లో టాప్-100లో చోటు దక్కించుకుంది. క్రితంసారి ర్యాంక్‌లను ప్రకటించినపుడు సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత ఫుట్‌బాల్ జట్టు సరిగ్గా 100వ ర్యాంక్‌లో నిలిచింది. ఇటీవల దక్షిణాసియా చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకోవడంతో భారత జట్టు ఒక స్థానం మెరుగుపర్చుకొని 99వ ర్యాంక్‌లో నిలిచింది. 1996లో భారత జట్టు అత్యుత్తమంగా 94 ర్యాంక్‌ను దక్కించుకుంది. 2018 తర్వాత భారత్‌కు ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్‌లో కొనసాగుతుండగా.. ఫ్రాన్స్, బ్రెజిల్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. ఆసియా ర్యాంకింగ్స్‌లో జపాన్ (ప్రపంచ 20వ ర్యాంక్) టాప్‌లో ఉంది. ᴡᴇ ᴍᴀʀᴄʜ ᴏɴ 💪🏽💙 🇮🇳 climbed up to 9️⃣9️⃣ in the latest official @FIFAcom world ranking 👏🏽🤩#BlueTigers 🐯 #IndianFootball ⚽️ pic.twitter.com/wLMe4WjQuA — Indian Football Team (@IndianFootball) July 20, 2023 చదవండి: బ్రిజ్‌భూషణ్‌కు బెయిల్; ఏ ప్రాతిపదికన వారికి మినహాయింపు? -
రణరంగాన్ని తలపించిన భారత్-కువైట్ ఫుట్‌బాల్ మ్యాచ్
శాఫ్ ఛాంపియన్షిప్ 2023 ఫుట్‌బాల్ టోర్నీలో మరో మ్యాచ్ రణరంగాన్ని తలపించింది. కొద్ది రోజుల కిందట ఇదే టోర్నీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు బాహాబాహీకి దిగగా.. తాజాగా భారత్-కువైట్ మధ్య మ్యాచ్‌లో సేమ్ సీన్ రిపీటైంది. ఇరు జట్లకు చెందిన ముగ్గురికి రిఫరీ రెడ్ కార్డ్ జారీ చేశాడు. భారత కోచ్ ఇగోర్ స్టిమాక్, ఫార్వర్డ్ రహీమ్ అలీ, కువైట్‌కు చెందిన అల్ ఖలాఫ్ మార్చింగ్ ఆర్డర్లు పొందారు. 64వ నిమిషంలో భారత కోచ్‌కు ఎల్లో కార్డ్ (బంతిని పట్టుకుని ఆటకు ఆటంకం కలిగించాడు) ఇష్యూ చేయడంతో మొదలైన గొడవ చినికిచినికి గాలివానలా మారి ఇరు జట్ల ఆటగాళ్లు కొట్టుకునేంతవరకు తీసుకెళ్లింది. ఆట 10 నిమిషాల్లో ముగుస్తుందనగా.. భారత ఆధిక్యాన్ని (1-0) కాపాడే ప్రయత్నంలో భాగంగా భారత కోచ్ మైదానం వెలువల అత్యుత్సాహం కనబర్చాడు. దీంతో రిఫరి అతనికి రెడ్ కార్డ్ ఇష్యూ చేశాడు. How hot is it in Bengaluru? WTH is happening 🙈😂 pic.twitter.com/CMsBFesyNd — Akshata Shukla (@shukla_akshata) June 27, 2023 ఈ క్రమంలో భారత ఫార్వర్డ్ రహీమ్ అలీ తన టెంపర్‌ను కోల్పోయి కువైట్ ఆటగాడు అల్ ఖలాఫ్‌ను కిందకు తోసేశాడు. దీంతో అతనికి కూడా రెడ్‌కార్డ్ ఇష్యూ అయ్యింది. ఇది మనసలో పెట్టుకున్న అల్ ఖలాఫ్.. భారత ఆటగాడు సహల్ అబ్దుల్ సమద్‌ను నేలపైకి నెట్టడంతో గొడవ తీవ్రరూపం దాల్చింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. గొడవకు కారణమైన కువైట్ ఆటగాడికి కూడా రిఫరీ రెడ్‌కార్డ్ చూపించాడు. More chaos after Sahal is left in a heap as Kuwait try to get the ball back after a foul call. The coaching staff is involved in it as well before the ref breaks it up, but Rahim Ali is sent off! pic.twitter.com/owoXhieEfl — Anantaajith Raghuraman (@anantaajith) June 27, 2023 భారత్ సెల్ఫ్ గోల్.. మొదటి అర్ధభాగంలో సునీల్ ఛెత్రి గోల్ చేసి అందించిన ఆధిక్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. అదనపు సమయంలో భారత ఆటగాడు అన్వర్ అలీ సెల్ఫ్ గోల్ చేయడంతో మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో గోల్స్ డిఫరెన్స్ కారణంగా కువైట్ గ్రూప్ టాపర్‌గా నిలిచింది. భారత్ రెండో స్థానంలో సరిపెట్టుకుంది. కువైట్ ఆటగాళ్లు అత్యుత్సాహం.. భారత డగౌట్‌పై దాడి భారత్ సెల్ఫ్ గోల్‌తో మ్యాచ్ సమం అయ్యాక కువైట్ ఆటగాళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. భారత డగౌట్‌పై దాడి చేశారు. దీంతో రిఫరీ వారికి రెండు పసుపు కార్డులు జారీ చేశాడు. -
గొడవపడ్డ భారత్, నేపాల్ ఆటగాళ్లు.. తప్పు మనోడిదేనా!
శాఫ్ 2023 చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం భారత్, నేపాల్ మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. మొన్న పాక్‌తో మ్యాచ్ సమయంలోనూ గొడవ జరిగిన సంగతి తెలిసిందే. విషయంలోకి వెళితే.. ఆట 64వ నిమిషంలో ఇండియాకు చెందిన రాహుల్ బెకె, నేపాల్ మిడ్ ఫీల్డర్ బిమల్ గాత్రి మగర్లు హెడర్ షాట్ కోసం ప్రయత్నించారు. ఇద్దరు ఒకేసారి హెడర్‌కు ప్రయత్నించడంతో మగర్‌ను తాకి రాహుల్ నేలపై పడిపోయాడు. ఆ వెంటనే కోపంతో పైకి లేచిన రాహుల్ మగర్‌ను తోసేశాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఇద్దరు ఎక్కడా తగ్గకపోవడంతో గొడవ చిలికి చిలికి వానగాలిలా మారిపోయింది. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో ఒక నేపాల్ ఆటగాడు భారత్ ఆటగాడిని కాలర్ పట్టి కింద పడేశాడు. ఇక కొట్టుకుంటారేమో అన్న తరుణంలో సునీల్ ఛెత్రి మగర్‌ను దూరంగా తీసుకుపోయాడు. ఈ క్రమంలో మగర్ ఛెత్రీవైపు చూస్తూ తప్పందా అతనిదే అంటూ అరిచాడు. సునీల్ మాత్రం 'ప్లీజ్ కామ్‌డౌన్' అని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సునీల్ ఛెత్రీ సేన నేపాల్‌పై 2-0తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించింది. స్వదేశంలో భారత్‌కు ఇది వరుసగా 12వ విజయం కావడం విశేషం. మ్యాచ్‌లో 61వ నిమిషంలో సునీల్ ఛెత్రి భారత్‌కు తొలిగోల్ అందించగా.. నోరెమ్ మహేశ్ సింగ్ 70వ నిమిషంలో మరో గోల్ అందించాడు. ఆ తర్వాత భారత డిఫెండర్లు నేపాల్ ఆటగాళ్లను కట్టడి చేయడంతో ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. Crazy Fight among Players during India vs Nepal football match. This Aggressive Indian team is looking more dangerous. I'm liking it ❤️🔥❤️🔥pic.twitter.com/UjNnIKIm5t — Mukesh Chaudhary (@MukeshG0dara) June 24, 2023 Another fight, and now it's between India and Nepal🤣🤣#INDNEP #SAFFChampionship pic.twitter.com/ieGbQ1aV3F — BumbleBee 軸 (@itsMK_02) June 24, 2023 చదవండి: సెమీస్‌కు భారత్.. ప్రగల్బాలు పలికిన పాక్ లీగ్ దశలోనే ఇంటికి -
సెమీస్‌కు భారత్.. ప్రగల్బాలు పలికిన పాక్ లీగ్ దశలోనే ఇంటికి
బెంగళూరు: ‘శాఫ్’ చాంపియన్‌షిప్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్ ‘ఎ’లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సునీల్ ఛెత్రి సేన 2–0 గోల్స్‌తో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. శ్రీ కంఠీరవ స్టేడియంలో భారత జోరుకు ఎదురే లేకుండా పోయింది. తొలి అర్ధ భాగంలో నేపాల్ రక్షణ శ్రేణి చురుగ్గా ఉండటంతో గోల్ చేయలేకపోయిన భారత్ ద్వితీయార్ధంలోనే ఆ రెండు గోల్స్ చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి 61వ నిమిషంలో తొలి గోల్ సాధించగా, నోరెమ్ మహేశ్ సింగ్ 70వ నిమిషంలో గోల్ చేశాడు. మరోవైపు భారత డిఫెండర్లు నేపాల్ ఫార్వర్డ్‌ను ఎక్కడికక్కడ కట్టడి చేసి వారి దాడుల్ని సమర్థంగా అడ్డుకుంది. భారత ఆటగాళ్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా ఐదు షాట్లు కొడితే... నేపాల్ ఒక షాట్‌కే పరిమితమైంది. మ్యాచ్‌లో ఎక్కువసేపు బంతిని తమ ఆదీనంలోనే ఉంచుకొన్న భారత ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటల్ని సాగనివ్వలేదు. తాజా విజయంతో సొంతగడ్డపై భారత్ అజేయమైన రికార్డు 12 మ్యాచ్‌లకు చేరింది. 2019లో సెప్టెంబర్ 5న ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన భారత్ తర్వాత స్వదేశంలో ఏ జట్టు చేతిలోనూ ఓడిపోలేదు. అంతకుముందు ఇదే గ్రూపులో కువైట్ 2–0తో పాకిస్తాన్‌ను చిత్తు చేయడంతో కువైట్ కూడా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. 27న కువైట్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌తో గ్రూప్‌లో అగ్ర స్థానంలో నిలిచేది ఎవరో తేలుతుంది. నేపాల్, పాకిస్తాన్‌లు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టాయి. It's that m̶a̶n̶ legend once again!@chetrisunil11#SAFFChampionship pic.twitter.com/wx1eSk4Y5E— FanCode (@FanCode) June 24, 2023 2️⃣ goals in quick succession 🤩 India are through to the #SAFFChampionship2023 Semifinal 👏🏽💙#NEPIND ⚔️ #IndianFootball ⚽️ #BlueTigers 🐯 pic.twitter.com/ByzfjsKSZY— Indian Football Team (@IndianFootball) June 24, 2023 చదవండి: #CheteshwarPujara: 'ఆటగదరా శివ!'.. పుజారా ఎమోషనల్ పోస్ట్ -
భారత్‌పై ఫిఫా నిషేధం.. విషయం చేయి దాటిపోయిందన్న స్టార్ ఫుట్‌బాలర్
FIFA Ban Threat To AIFF: భారత ఫుట్‌బాలర్లంతా ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి సూచించాడు. ఈ విషయంపై ఆటగాళ్లు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని, ఇది మన చేతులు దాటిపోయిందని ఛెత్రి అన్నాడు. అఖిల భారత ఫుట్‌బాల్ సంఘం (ఏఐఎఫ్ఎఫ్) చాన్నాళ్లుగా అడ్‌హక్ కమిటీతో నడుస్తోంది. పూర్తిస్థాయి కార్యవర్గం లేకపోవడంతో, సంబంధం లేని (థర్డ్ పార్టీ) వ్యక్తుల జోక్యంతో భారత ఫుట్‌బాల్ కార్యకలాపాలు జరగడం ఇష్టపడని ‘ఫిఫా’ ఇటీవల నిషేధం విధిస్తామని హెచ్చరించింది. -
పీలే రికార్డును సమం చేసిన భారత స్టార్ ఫుట్‌బాలర్..
Sunil Chhetri Equals Pele Record: భారత ఫుట్‌బాల్ జట్టు సారథి సునీల్ ఛెత్రి అరుదైన రికార్డును సమం చేశాడు. శాఫ్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌లో గోల్ సాధించడం ద్వారా కెరీర్లో 77వ అంతర్జాతీయ గోల్ సాధించాడు. ఈ క్రమంలో ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు పీలే సరసన నిలిచాడు. పీలే 92 మ్యాచ్‌ల్లో 77 గోల్స్ సాధించగా, ఛెత్రి 123వ మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనతను సాధించాడు. మొత్తంగా అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో పీలే, అలీ మబ్కౌట్(యూఈఏ)తో కలిసి మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో 122 గోల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ 79 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఛెత్రి రికార్డు గోల్ సాధించి భారత్‌కు 1-0తేడాతో విజయాన్ని అందించాడు. చదవండి: దేశం కోసం ధోని.. మెంటార్‌గా ఎలాంటి ఫీజు వద్దన్న లెజెండ్ -
రొనాల్డో-మెస్సీ.. మధ్యలో మనోడు
రోనాల్డో -మెస్సీ.. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటూ ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కుమ్ములాడుకోవడం చూస్తుంటాం. కానీ, ఈ ఇద్దరిలో మధ్యలో గట్టి పోటీ ఇస్తూ ఇప్పుడు ఇంకొకడు వచ్చి దూరాడు. ఆ ఒక్కడు ఎవడో కాదు.. భారత ఫుట్‌బాల్ మాంత్రికుడు సునీల్ ఛెత్రి. దోహా: సోమవారం 2022 ఫిఫా వరల్డ్‌కప్, 2023 ఆసియా కప్ క్వాలిఫైయర్స్ టోర్నీలలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 2-0 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ రెండు గోల్స్ కూడా సునీల్ ఛెత్రినే కొట్టాడు. ఈ ఫీట్‌తో ప్రపంచంలో అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్‌బాల్ ఆటగాడిగా(ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ల) రెండో స్థానంలో నిలిచాడు ఛెత్రి. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉండగా(103)గోల్స్‌తో, రెండో స్థానంలో మొన్నటిదాకా అర్జెంటీనా స్టార్ లియోనాల్ మెస్సీ(72)గోల్స్‌తో ఉన్నాడు. ఇక బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించడం ద్వారా మొత్తం 74 గోల్స్‌తో ఛెత్రి మెస్సీని వెనక్కి నెట్టి రెండో ప్లేస్‌కి చేరాడు. ఇక ఆల్‌టైం హయ్యెస్ట్ టాప్ 10 గోలర్స్ లిస్ట్‌లో చేరడానికి ఛెత్రి మరొక గోల్(75) సాధిస్తే సరిపోతుంది. వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచుల్లో భారత్‌కి ఆరేళ్ల తర్వాత దక్కిన తొలి గెలుపు ఇదే. ఇప్పటికే భారత్ ఫిఫా ఆశలు చల్లారగా.. కేవలం చైనాలో జరగబోయే ఆసియా కప్ అర్హత కోసం భారత్ ఫుట్‌బాల్ ఆడుతోంది. ఇక మెస్సీ యాక్టివ్‌గా ఉండడంతో ఛెత్రి రికార్డు త్వరగానే కనుమరుగు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ టాప్ లిస్ట్‌లో చేరిన ఛెత్రికి ఇండియన్ సోషల్ మీడియా సలాం చెబుతోంది. ఇక ఈ రికార్డు ఫీట్‌ను 36 ఏళ్ల ఛెత్రి కూడా చాలా తేలికగా తీసుకోవడం విశేషం. చదవండి: భారత్ పరాజయం Goals speak louder than words 🙏#IndianFootball #NationalTeam #JB6 #WCQualifiers pic.twitter.com/u4iOUzKwGa — Indian Football Team for World Cup (@IFTWC) June 7, 2021 -
ఏంటి కోహ్లి.. ఫీజు ఒకేసారి చెల్లిస్తావా లేక ఈఎంఐల్లో కడతావా.. ?
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఫుట్‌బాల్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ పరుగుల యంత్రం.. సాకర్‌ను రెగ్యులర్ గా ఫాలో అవడమే కాకుండా..ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సహచర క్రికెటర్లతో కలిసి గేమ్ ను ఆస్వాధిస్తుంటాడు. అలాగే రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్స్‌లో కూడా ఫుట్‌బాల్‌తో వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తుంటాడు. సాకర్ కు వీరాభిమానిగా చెప్పుకునే కోహ్లీ.. ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో ఎఫ్‌సీ గోవా జట్టుకు సహ యజమానిగా ఉన్నాడు. కాగా , కోహ్లీ.. సాకర్ ఆడటంలో తనకున్న ప్రావీణ్యాన్ని తెలియజేస్తూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్టు చేశాడు. దీనికి 'యాక్సిడెంటల్ క్రాస్‌బార్ ఛాలెంజ్'అనే క్యాప్షన్ జోడించాడు. ఈ వీడియోలో కోహ్లీ కొట్టిన ఓ ఫ్రీ కిక్.. క్రాస్‌బార్‌కు తగిలి గోల్ పోస్ట్ ఆవలకు వెళ్ళింది. అయితే ఈ షాట్ కొట్టిన అనంతరం .. తనను తానే నమ్మడం లేదన్నట్లుగా కోహ్లీ తన హావభావాలు ప్రదర్శించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. . Saare coaching sessions ka ek hi invoice bheju, ya aasan kishton mein chukaoge, champ? 😉 https://t.co/i98I9a9Nmq — Sunil Chhetri (@chetrisunil11) May 25, 2021 ఈ వీడియో చూసిన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ కూడా కోహ్లీ ఫుట్‌బాల్ స్కిల్స్‌కు ఫిదా అయ్యాడు. తనకు గురు దక్షిణ చెల్లించాలని సరదగా కోరాడు. ఫీజు మొత్తాన్ని ఒకే చెల్లిస్తావా.. ? లేక ఈఎంఐ లేమైనా కావాలా.. ? అంటూ ఫన్నీ ట్వీట్ చేశాడు. దీనికి కోహ్లీ కూడా తనదైన శైలిలో స్పందించాడు. 'మీరు ఎంజాయ్ చేయండి కెప్టెన్' అంటూ రీట్వీట్ చేసాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. కాగా, సునీల్ ఛెత్రీ, కోహ్లీ చాలాకాలంగా మంచి స్నేహితులు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కోహ్లీ ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం ముంబైలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉన్నాడు. చదవండి: ప్రపంచ క్రికెట్లో వీళ్ళే మొనగాళ్లు.. వీళ్లతో చాలా కష్టం -
రూనీని వెనక్కునెట్టిన సునీల్ చెత్రి
కెరీర్లో 54వ గోల్ నమోదు న్యూఢిల్లీ: బెంగళూరులో జరుగుతున్న ఎఎఫ్సీ ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీ మరో ఘనత సాధించాడు. బుధవారం కిర్గిజిస్తాన్తో జరిగిన మ్యాచ్‌లో గోల్ చేసిన సునీల్ తన కెరీర్లో 54వ గోల్ నమోదు చేశాడు. తద్వారా ఇంగ్లండ్, మాంచెస్టర్‌ల ఆటగాడు వేనీ రూనీ(53)ని వెనక్కునెట్టి ప్రస్తుతం ప్రపంచంలో చురుకుగా ఉన్న ఆటగాళ్లలో అత్యధిక గోల్స్ సాధించిన నాలుగో ప్లేయర్‌గా సునీల్ నిలిచాడు. బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ తరఫున సునీల్ ప్రాతినిథ్యం వహిస్తాడు. స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ (58) , క్లిన్ట్ డెంప్సే (56) గోల్స్‌తో సునీల్ కన్నా ముందున్నారు. మొత్తం 73 గోల్స్‌తో సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో ఉన్నాడు.