రోనాల్డో -మెస్సీ.. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటూ ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కుమ్ములాడుకోవడం చూస్తుంటాం. కానీ, ఈ ఇద్దరిలో మధ్యలో గట్టి పోటీ ఇస్తూ ఇప్పుడు ఇంకొకడు వచ్చి దూరాడు. ఆ ఒక్కడు ఎవడో కాదు.. భారత ఫుట్‌బాల్ మాంత్రికుడు సునీల్ ఛెత్రి.
దోహా: సోమవారం 2022 ఫిఫా వరల్డ్‌కప్, 2023 ఆసియా కప్ క్వాలిఫైయర్స్ టోర్నీలలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 2-0 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ రెండు గోల్స్ కూడా సునీల్ ఛెత్రినే కొట్టాడు. ఈ ఫీట్‌తో ప్రపంచంలో అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్‌బాల్ ఆటగాడిగా(ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ల) రెండో స్థానంలో నిలిచాడు ఛెత్రి.
ప్రస్తుతం ఈ లిస్ట్‌లో క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉండగా(103)గోల్స్‌తో, రెండో స్థానంలో మొన్నటిదాకా అర్జెంటీనా స్టార్ లియోనాల్ మెస్సీ(72)గోల్స్‌తో ఉన్నాడు. ఇక బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించడం ద్వారా మొత్తం 74 గోల్స్‌తో ఛెత్రి మెస్సీని వెనక్కి నెట్టి రెండో ప్లేస్‌కి చేరాడు. ఇక ఆల్‌టైం హయ్యెస్ట్ టాప్ 10 గోలర్స్ లిస్ట్‌లో చేరడానికి ఛెత్రి మరొక గోల్(75) సాధిస్తే సరిపోతుంది.
వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచుల్లో భారత్‌కి ఆరేళ్ల తర్వాత దక్కిన తొలి గెలుపు ఇదే. ఇప్పటికే భారత్ ఫిఫా ఆశలు చల్లారగా.. కేవలం చైనాలో జరగబోయే ఆసియా కప్ అర్హత కోసం భారత్ ఫుట్‌బాల్ ఆడుతోంది. ఇక మెస్సీ యాక్టివ్‌గా ఉండడంతో ఛెత్రి రికార్డు త్వరగానే కనుమరుగు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ టాప్ లిస్ట్‌లో చేరిన ఛెత్రికి ఇండియన్ సోషల్ మీడియా సలాం చెబుతోంది. ఇక ఈ రికార్డు ఫీట్‌ను 36 ఏళ్ల ఛెత్రి కూడా చాలా తేలికగా తీసుకోవడం విశేషం.
చదవండి: భారత్ పరాజయం
Goals speak louder than words 🙏#IndianFootball #NationalTeam #JB6 #WCQualifiers pic.twitter.com/u4iOUzKwGa
— Indian Football Team for World Cup (@IFTWC) June 7, 2021
Comments
Please login to add a commentAdd a comment