leonal messy
-
FIFA WC: ఆఖరి ఛాన్స్! క్రొయేషియా తక్కువేమీ కాదు! అదే జరిగితే మెస్సీ కూడా రొనాల్డోలాగే..
Argentina Vs Croatia- Lionel Messi- Doha: మెస్సీ మరోసారి అర్జెంటీనాను ఫైనల్‌కు చేరుస్తాడా? మోడ్రిచ్ వరుసగా రెండోసారి తమ జట్టును తుది పోరు వరకు తీసుకెళ్లగలడా? ఒకరు ఆల్‌టైమ్ గ్రేట్‌గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొని తన జట్టుకు బలంగా నిలవగా... మరోవైపు సమష్టితత్వాన్నే నమ్ముకొని ముందుకు సాగిపోయిన టీమ్ మళ్లీ అంచనాలను తలకిందులు చేయగలదా? ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ-2022లో మరో రసవత్తర సమరానికి సమయం ఆసన్నమైంది. సంచలనాలు కొత్త కాదు రెండుసార్లు విజేత అర్జెంటీనా, గత వరల్డ్‌కప్ ఫైనలిస్ట్ క్రొయేషియా మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ తొలి సెమీఫైనల్లో తలపడతాయి. 2014 వరల్డ్‌కప్‌లో మెస్సీ సారథ్యంలోనే అర్జెంటీనా ఫైనల్ చేరగా, మోడ్రిచ్ నాయకత్వంలోనే 2018లో క్రొయేషియా రన్నరప్‌గా నిలిచింది. అంచనాలు ఇప్పటికీ అర్జెంటీనాకు అనుకూలంగానే ఉండగా... క్రొయేషియాకు సంచలనాలు కొత్త కాదు. చెరోసారి.. అయితే! ఈ రెండు జట్లు గతంలో రెండుసార్లు ప్రపంచకప్‌లో లీగ్ దశలో ముఖాముఖిగా తలపడ్డాయి. 1998లో అర్జెంటీనా 1–0తో నెగ్గగా... 2018లో క్రొయేషియా 3–0తో గెలిచింది. నాకౌట్ దశలో మాత్రం తొలిసారి ఈ రెండు జట్లు ‘ఢీ’కొంటున్నాయి. స్టార్ ముందుండి నడిపిస్తుండగా... తన కెరీర్లో వరల్డ్‌కప్ లేని లోటును పూరించేందుకు, అభిమానుల దృష్టిలో మరో మారడోనాగా మారేందుకు మెస్సీకి ఇది చివరి చాన్స్. 35 ఏళ్ల వయసులో కూడా అతని అద్భుత ప్రదర్శన జట్టును సెమీస్ వరకు తీసుకొచ్చింది. సమకాలీన మేటి ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు సాధ్యం కానిది సాధించగలిగే అవకాశం మెస్సీ ముంగిట నిలిచింది. నిజానికి మెక్సికో, ఆస్ట్రేలియాలపై చేసిన గోల్స్‌తో పాటు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో నాహుల్ మొలినాకు మెస్సీ ఇచ్చిన రివర్స్ పాస్ మొత్తం వరల్డ్‌కప్‌లోనే హైలైట్‌గా నిలిచాయి. అయితే మెస్సీ మినహా ఇతర ఆటగాళ్లు అంతంతమాత్రంగానే రాణించారు. అల్వారెజ్, ఫెర్నాండెజ్, మ్యాక్ అలిస్టర్ ఫర్వాలేదనిపించినా ప్రపంచ స్థాయి ప్రదర్శన మాత్రం రాలేదు. ఇప్పటి వరకు అర్జెంటీనా ఆటలో ఆశించిన వేగం, కొత్తదనం కనిపించకపోయినా నడిచిపోయింది. కాస్త ఏమరుపాటుగా ఉన్నా కానీ సెమీస్ వేదికపై కాస్త ఏమరుపాటుగా ఉన్నా క్రొయేషియా మ్యాచ్‌ను లాగేసుకోగలదు. మెస్సీ మినహా ఇతర ఆటగాళ్లను కోచ్ స్కలోని ఎంత సమర్థంగా వాడుకుంటాడనేది కీలకం. గోల్‌కీపర్ మార్టినెజ్‌పై అదనపు బాధ్యత ఉంది. క్రొయేషియా గోల్ కీపర్ లివకోవిచ్ మెరుపు నైపుణ్యంతో టోర్నీని శాసిస్తున్న తీరు చూస్తే... ఒకవేళ మ్యాచ్ పెనాల్టీల వరకు వెళితే మాత్రం మార్టినెజ్ అత్యద్భుత ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. పోరాటతత్వమే బలంగా... బ్రెజిల్‌పై క్వార్టర్ ఫైనల్లో గెలిచిన తర్వాత చివరి వరకు ఓటమిని అంగీకరించని తమ పోరాటస్ఫూర్తి గుర్తించి క్రొయేషియా కోచ్ డాలిచ్ పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. గణాంకాల్లో అది కనిపించకపోయినా అదే వారి విజయ రహస్యమనేది వాస్తవం. సుదీర్ఘ సమయం పాటు బంతిని తమ అదుపులో ఉంచుకోగల మిడ్‌ఫీల్డర్లు మోడ్రిచ్, కొవాసిచ్, బ్రొజొవిచ్ జట్టు ప్రధాన బలం. దీనిని బద్దలు కొట్టాలంటే మెస్సీకి కూడా అంత సులువు కాదు. మ్యాచ్ సమంగా ఉన్న స్థితిలో దీనిని క్రొయేషియా కొనసాగిస్తే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. ఎందుకంటే ప్రధాన టోర్నీల్లో క్రొయేషియా ఆడిన గత 9 నాకౌట్ మ్యాచ్‌లలో 8 అదనపు సమయం వరకు వెళ్లాయి. ఆపై పెనాల్టీల ద్వారానే ఈ టోర్నీలో జపాన్‌పై, బ్రెజిల్‌పై జట్టు విజయం సాధించింది. అయితే అర్జెంటీనాతో పోలిస్తే జట్టులో దూకుడు తక్కువ. కెనడాపై మినహా మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఆ జట్టు 2 ఫీల్డ్ గోల్స్ మాత్రమే చేయగలిగింది. 2018 ఫైనల్లో ఆ జట్టు ఫ్రాన్స్‌కు తొలి 65 నిమిషాల్లోనే 4 గోల్స్ సమర్పించుకుంది. అంటే ఆరంభంలో ప్రత్యర్థి దాడి చేయగలిగితే క్రొయేషియా మళ్లీ కోలుకునే అవకాశాలు తక్కువ. అయితే గోల్‌కీపర్ లివకోవిచ్ ఈసారి కూడా అడ్డుగోడగా నిలవాలని టీమ్ కోరుకుంటోంది. గతంలో ఐదుసార్లు కాగా ప్రపంచకప్‌లో ఆరోసారి ఫైనల్ బెర్త్‌పై అర్జెంటీనా గురి పెట్టింది. గతంలో అర్జెంటీనా సెమీఫైనల్ చేరిన ఐదు పర్యాయాలు విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత పొందింది. క్రొయేషియా గెలిస్తే అర్జెంటీనాపై క్రొయేషియా గెలిస్తే వరుసగా రెండు ప్రపంచకప్‌లలో ఫైనల్ చేరిన నాలుగో యూరోప్ జట్టుగా నిలుస్తుంది. గతంలో ఇటలీ (1934, 1938), నెదర్లాండ్స్ (1974, 1978), జర్మనీ (1982, 1986, 1990) మాత్రమే ఈ ఘనత సాధించాయి. చదవండి: Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! క్రొయేషియాతో సెమీస్‌కు ముందు అర్జెంటీనాకు భారీ షాకిచ్చిన ఫిఫా Ranji Trophy: రంజీ సమరానికి సై.. బరిలో 38 జట్లు! ఫైనల్ ఎప్పుడంటే! IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్! ఆల్‌రౌండర్ అరంగేట్రం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Flashback ⏪ to when #ARG and #HRV met at the 2018 #FIFAWorldCup. These sides have met twice before on the big stage. Who will prevail tomorrow? pic.twitter.com/SHMSt84o1A — FIFA World Cup (@FIFAWorldCup) December 12, 2022 -
FIFA: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! మరీ ఇలాంటి ముగింపా?!
FIFA World Cup 2022- Cristiano Ronaldo: ఇద్దరక్కలు.. ఓ అన్న.. ఇంట్లో నాలుగో సంతానం. నిజానికి అప్పటికే పేదరికంలో మగ్గుతున్న కారణంగా ఆ తల్లి నాలుగో బిడ్డను కనకూడదు అనుకుంది. అబార్షన్ చేయించుకోవాలనుకుంది. కానీ, దేవుడు అలా జరుగనివ్వలేదు. ఆ బిడ్డ భూమ్మీద పడ్డాడు. ఎనలేని కీర్తిప్రతిష్టలు సంపాదించాడు. స్టార్ ఫుట్‌బాలర్‌గా ఎదిగి.. తల్లిని గర్వపడేలా చేశాడు. లెక్కకు మిక్కిలి అభిమానులు, లెక్కలేనంత డబ్బు! తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్నో రికార్డులు సాధించిన రారాజు.. మరీ ఇలా, ఇంత ఘోరంగా తన ప్రయాణం ముగిసిపోతుందని ఊహించి ఉండడు! ఇంతటి అవమానకర పరిస్థితుల్లో ‘ఆఖరి మ్యాచ్’ను ఆడాల్సి వస్తుందనే ఊహ కూడా కనీసం అతడి దరికి చేరి ఉండదు! కెరీర్లో ఒక్క ప్రపంచకప్ టైటిల్ అయినా ఉండాలని అతడు ఆశపడ్డాడు. అందుకు తను వందకు వందశాతం అర్హుడు కూడా! కానీ విధిరాత మరోలా ఉంది! నువ్వు ఎన్ని అంతర్జాతీయ గోల్స్ చేస్తేనేం? ఐదు ప్రతిష్టాత్మక బాలన్ డీఓర్ అవార్డులు గెలిస్తేనేం? ఎన్నెన్ని చాంపియన్స్ లీగ్ మెడల్స్ సాధిస్తేనేం? మూడు దేశాల్లో క్లబ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడివి అయితేనేం? ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఫుట్‌బాలర్‌గా నీరాజనాలు అందుకుంటేనేం? ఈ ఒక్క లోటు నిన్ను, నీ అభిమానులను జీవితాంతం వేదనకు గురిచేయడం ఖాయమన్నట్లుగా.. గుండెకోతను మిగిల్చింది. చిన్నపిల్లాడిలా అతడు వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు చూసి అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. ‘‘మరేం పర్లేదు రొనాల్డో.. నువ్వు ఎప్పటికీ మా దృష్టిలో చాంపియన్‌వే’’ అని పైకి చెబుతున్నా.. హృదయాంతరాల్లో గూడుకట్టుకుని ఉన్న బాధ వాళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు!- సాక్షి, వెబ్‌డెస్క్ తల్లితో రొనాల్డో వీళ్లకు ఉన్నంత పాపులారిటీ ఎవరికీ లేదు! నిజానికి ఆధునిక ఫుట్‌బాల్‌లో స్టార్లు ఎవరంటే ఠక్కున గుర్తుకువచ్చే పేర్లు.. లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. సాకర్ గురించి పెద్దగా తెలియనివాళ్లకు కూడా వీరి పేర్లు సుపరిచితమే అనడంలో సందేహం లేదు. కోట్లాది మంది అభిమానం చూరగొన్న.. చూరగొంటున్న మెస్సీ, రొనాల్డో ఆటలో తమకు తామే సాటి. తమకు తామే పోటీ. ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది మేటి ఫుట్‌బాలర్లు ఉన్నా వీరిద్దరికి దక్కినంత పాపులారిటీ మరెవరికి దక్కలేదనడం అతిశయోక్తి కాదు. గర్ల్‌ఫ్రెండ్, తమ పిల్లలతో ఇలా అదొక్కటే లోటు! చాంపియన్స్ లీగ్ సహా ఇతర క్లబ్ టోర్నీలలో తమదైన ఆట తీరుతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అర్జెంటీనా స్టార్ మెస్సీ, పోర్చుగల్ మేటి ఆటగాడు రొనాల్డో.. తమ కెరీర్లో ఎన్నెన్నో రికార్డులు సాధించారు. అరుదైన ఘనతలు తమ ఖాతాలో వేసుకున్నారు. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు.. ఎందులోనూ వీరికి లోటు లేదు. అయితే, విచిత్రంగా ఈ ఇద్దరు ఫుట్‌బాల్ స్టార్లు తమ కెరీర్లో జాతీయ జట్టు తరపున ఇప్పటి వరకు ఒక్క వరల్డ్‌కప్ టైటిల్ కూడా గెలవకపోవడం గమనార్హం. మెస్సీ, రొనాల్డో మెస్సీ ముందడుగు.. పాపం రొనాల్డో అర్జెంటీనా ఇప్పటి వరకు రెండు సార్లు(1978, 1986) ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడగా.. పోర్చుగల్ ఖాతాలో ఒక్క టైటిల్ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్‌కప్-2022లో ఈ ఇద్దరు కెప్టెన్లు తమ జట్లను ముందుకు నడిపి ఫైనల్లో తలపడితే చూడాలని, ఏ ఒక్కరు గెలిచినా చరిత్ర సృష్టించడం ఖాయమంటూ ఫుట్‌బాల్ అభిమానులు అంచనాలు వేశారు. అంతేగాక 37 ఏళ్ల రొనాల్డో, 35 ఏళ్ల మెస్సీ తమ కెరీర్లో ఇదే ఆఖరి ప్రపంచకప్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎవరో ఒకరికి ఈ ఏడాది టోర్నీ చిరస్మరణీయం కావాలని కోరుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌పై అర్జెంటీనా గెలుపుతో మెస్సీ చిరకాల కల నెరవేరేందుకు ముందుడుగు పడగా.. మొరాకో చేతిలో పోర్చుగల్ ఓటమితో రొనాల్డో వరల్డ్‌కప్ ప్రయాణానికి తెరపడింది. అరుదైన రికార్డు ఫిఫా ప్రపంచకప్-2022లో ఘనాతో ఆరంభ మ్యాచ్‌లో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడం ద్వారా రొనాల్డో తన ఖాతా తెరిచాడు. తద్వారా ఐదు ప్రపంచకప్‌లలోనూ గోల్ చేసిన ఏకైక ఆటగాడు రొనాల్డో. ఈ సాకర్ స్టార్ 2006 మొదలు 2010, 2014, 2018, 2022 ప్రపంచకప్‌లలో గోల్ చేశాడు. ఓవరాల్‌గా 8 గోల్స్ సాధించాడు. ఇక గ్రూప్- హెచ్లో ఉన్న పోర్చుగల్ ఈ మ్యాచ్‌లో 3-2తో విజయం సాధించింది. ఆ తర్వాత మాజీ చాంపియన్ ఉరుగ్వేను 2-0తో ఓడించింది. అనంతరం దక్షిణా కొరియా చేతిలో 2-1 ఓటమి పాలైనప్పటికీ గ్రూప్ టాపఱ్గా ఉన్న పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. అవమానకర రీతిలో.. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా దక్షిణా కొరియా ఆటగాడితో రొనాల్డో వాగ్వాదం వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ప్రిక్వార్టర్స్‌లో భాగంగా స్విట్జర్లాండ్‌తో కీలక మ్యాచ్‌లో కెప్టెన్, స్టార్ స్ట్రయికర్ అయిన రొనాల్డోను పక్కనపెట్టడం ఫ్యాన్స్ అవమానకరంగా భావించారు. ఈ మ్యాచ్‌లో అతడి స్థానంలో వచ్చిన యువ ప్లేయర్ గొంకాలో రామోస్ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరవగా.. స్విస్పై పోర్చుగల్ 6-1తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో స్విస్‌తో మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన రొనాల్డో క్వార్టర్స్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీసుకు డుమ్మా కొట్టినట్లుగా వార్తలు వచ్చాయి. అవమానం తట్టుకోలేకే ఇలా చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కీలక మ్యాచ్‌కు రొనాల్డోను పక్కనపెట్టడం పట్ల అతడి గర్ల్‌ఫ్రెండ్ జార్జినా కూడా అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేయగా.. 50 లక్షలకు పైగా మంది ఆ పోస్టును లైక్ చేసి రొనాల్డోకు మద్దతుగా నిలిచారు. అయినా, మేనేజ్మెంట్ తీరు మారలేదు. మొరాకోతో క్వార్టర్ మ్యాచ్ ఆరంభంలోనూ రొనాల్డోను ఆడించలేదు. 51 నిమిషంలో అతడిని సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా బరిలోకి దించింది. ఈ క్రమంలో తనకు గోల్ కొట్టే అవకాశం రాగా.. మొరాకో గోల్ కీపర్ అడ్డుపడటంతో రొనాల్డోకు నిరాశే మిగిలింది. సెమీస్, ఆపై ఫైనల్ చేరి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలన్న పోర్చుగల్ సారథి కల ఇలా ముగిసిపోయింది. నిజానికి 2014లో ఫైనల్ వరకు వచ్చిన మెస్సీ జట్టుకు ఆఖరి మెట్టుపై అదృష్టం కలసి రాలేదు. అయితే, రొనాల్డో అంత చేరువగా కూడా ఎప్పుడూ రాలేకపోయాడు. ఇప్పుడు కూడా అంతే! ఎంతటి మొనగాడు అయితేనేం?! 18 ఏళ్ల వయసులో ఫిఫా వరల్డ్‌కప్-2003లో తొలిసారిగా మెగా ఈవెంట్లో ఆడిన రొనాల్డోకు టైటిల్ లేకుండానే కెరీర్ ముగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఓ ప్రెస్మీట్లో కూల్‌డ్రింక్ బాటిల్‌ను పక్కకు జరిపి.. వాటర్ గ్లాస్ అందుకున్నందుకే సదరు కంపెనీ బ్రాండ్ వాల్యూ అమాంతం పడిపోయేంత ప్రభావం చూపగల.. పాపులర్ ఆటగాడు ఇలా ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని చిన్నపిల్లాలడిగా కన్నీటిపర్యంతం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు సగటు అభిమాని. ఎంతటి మొనగాడికైనా గడ్డుకాలం అంటే ఇలాగే ఉంటుందేమోననంటూ కామెంట్లు చేస్తున్నారు. -సుష్మారెడ్డి, యాళ్ల చదవండి: Saina Nehwal: తన మొహం కూడా చూడనంటూ పెదవి విరుపులు! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా.. Ishan Kishan: ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్ పోస్ట్ వైరల్! ఇంతకీ ఆమె ఎవరంటే! -
రొనాల్డో-మెస్సీ.. మధ్యలో మనోడు
రోనాల్డో -మెస్సీ.. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటూ ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కుమ్ములాడుకోవడం చూస్తుంటాం. కానీ, ఈ ఇద్దరిలో మధ్యలో గట్టి పోటీ ఇస్తూ ఇప్పుడు ఇంకొకడు వచ్చి దూరాడు. ఆ ఒక్కడు ఎవడో కాదు.. భారత ఫుట్‌బాల్ మాంత్రికుడు సునీల్ ఛెత్రి. దోహా: సోమవారం 2022 ఫిఫా వరల్డ్‌కప్, 2023 ఆసియా కప్ క్వాలిఫైయర్స్ టోర్నీలలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 2-0 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ రెండు గోల్స్ కూడా సునీల్ ఛెత్రినే కొట్టాడు. ఈ ఫీట్‌తో ప్రపంచంలో అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్‌బాల్ ఆటగాడిగా(ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ల) రెండో స్థానంలో నిలిచాడు ఛెత్రి. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉండగా(103)గోల్స్‌తో, రెండో స్థానంలో మొన్నటిదాకా అర్జెంటీనా స్టార్ లియోనాల్ మెస్సీ(72)గోల్స్‌తో ఉన్నాడు. ఇక బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించడం ద్వారా మొత్తం 74 గోల్స్‌తో ఛెత్రి మెస్సీని వెనక్కి నెట్టి రెండో ప్లేస్‌కి చేరాడు. ఇక ఆల్‌టైం హయ్యెస్ట్ టాప్ 10 గోలర్స్ లిస్ట్‌లో చేరడానికి ఛెత్రి మరొక గోల్(75) సాధిస్తే సరిపోతుంది. వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచుల్లో భారత్‌కి ఆరేళ్ల తర్వాత దక్కిన తొలి గెలుపు ఇదే. ఇప్పటికే భారత్ ఫిఫా ఆశలు చల్లారగా.. కేవలం చైనాలో జరగబోయే ఆసియా కప్ అర్హత కోసం భారత్ ఫుట్‌బాల్ ఆడుతోంది. ఇక మెస్సీ యాక్టివ్‌గా ఉండడంతో ఛెత్రి రికార్డు త్వరగానే కనుమరుగు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ టాప్ లిస్ట్‌లో చేరిన ఛెత్రికి ఇండియన్ సోషల్ మీడియా సలాం చెబుతోంది. ఇక ఈ రికార్డు ఫీట్‌ను 36 ఏళ్ల ఛెత్రి కూడా చాలా తేలికగా తీసుకోవడం విశేషం. చదవండి: భారత్ పరాజయం Goals speak louder than words 🙏#IndianFootball #NationalTeam #JB6 #WCQualifiers pic.twitter.com/u4iOUzKwGa — Indian Football Team for World Cup (@IFTWC) June 7, 2021 -
మెస్సీ ఈ సారైనా మెరిసేనా..
⇒'కోపా' టోర్నీపై కన్నేసిన మెస్సీ ⇒ఒక్క పెద్ద కప్ కూడా ⇒నెగ్గని అర్జెంటీనా స్టార్ ⇒నేటిరాత్రి ఫైనల్ లియోనల్ మెస్సీ.. పరిచయం అవసరం లేని పేరు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో అభిమానులను సంపాదించుకున్న ఫుట్‌బాల్ ఆటగాడు. ప్రస్తుతం జరుగుతున్న కోపా అమెరికా టోర్నీతో కెరీర్లో వందో అంతర్జాతీయ మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాడు. అయినా తన ఖాతాలో ఇప్పటివరకు ఒక్క పెద్ద టోర్నీ కూడా లేదు. ప్రపంచంలోనే గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న మెస్సీ.. కొంత మంది దృష్టిలో మాత్రం ఫుట్‌బాల్ చరిత్రలోనే గొప్ప ఆటగాడు. అటువంటి ఆటగాడికి ఇప్పుడు పెద్ద టోర్నీని నెగ్గే అవకాశం వచ్చింది. ఈ రోజు (శనివారం రాత్రి) జరిగే కోపా అమెరికా కప్‌లో చిలీపై నెగ్గి ఆ కల నెరవేర్చుకుంటాడో.. లేదో.. చూడాలి. 21 ఏళ్ల వయసులో ప్రపంచం దృష్టిలో పడి.. మరో నాలుగేళ్లకు ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో ఒకడిగా మారడం చాలా అరుదుగా జరుగుతుంది. మెస్సీ అలాగే చేసి చూపాడు. ఐదేళ్ల వయసులోనే ఫుట్‌బాల్ ఆడడం మొదలు పెట్టిన మెస్సీ కెరీర్ బార్సిలోనా క్లబ్లో మలుపు తిరిగింది. పెద్ద క్లబ్ కావడంతో తన ప్రతిభను చాటాడానికి అవకాశం లభించింది. అప్పటికే ప్రపంచాన్ని ఏలుతున్న రోనాల్డిన్హో ఆడుతున్న క్లబ్లో ఉండి కూడా అతని స్థాయి పేరు తెచ్చుకున్నాడు మెస్సీ. క్లబ్ స్థాయిలో అన్ని రికార్డులను వరుసపెట్టి బద్దలు కొడుతూ వస్తున్న మెస్సీకి ఉన్న అతి పెద్ద వెలితి.. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద కప్‌ను నెగ్గకపోవడం. ఈ రోజు జరిగే కోపా అమెరికా ఫైనల్లో నెగ్గి ఆ వెలితిని తీర్చుకోవాలని చూస్తున్నాడు. 11 ఏళ్ల వయసులో స్పెయిన్‌కు.. మెస్సీకి 11 ఏళ్ల వయసులో అరుదైన వ్యాధి వచ్చింది. అప్పటికే అతనాడుతున్న క్లబ్ వైద్య ఖర్చులు భరించలేమని చెప్పింది. మెస్సీ టాలెంట్ తెలుసుకున్న బార్సిలోనా మేనేజర్ అతనికి అవకాశం ఇచ్చాడు. మెస్సీ ప్రతిభ చూసి అప్పటికప్పుడు దగ్గర్లో కాగితం లేకపోవడంతో టిష్యూ పేపర్‌పై అతనితో ఒప్పందం రాసిచ్చాడు. బార్సిలోనా జూనియర్ జట్టులో అద్భుత ప్రదర్శన చేసి బార్సిలోనా జట్టుకు 17 ఏళ్ల వయసులో 2004లో ఎంపికయ్యాడు. ఇక బార్సిలోనా తరఫున అతడు అందుకోని అవార్డు లేదు, టైటిల్ లేదు. మొత్తం స్పెయిన్ క్లబ్ చరిత్రలోనే ఎక్కువ గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే చాంపియన్స్‌లీగ్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. సరిగ్గా పదిరోజుల కిందట పుట్టిన రోజు (జూన్ 24) జరుపుకున్న అతని వయసు ప్రస్తుతం 28 ఏళ్లే. స్పెయిన్‌కు ఆడే అవకాశమున్నా.. మెస్సీ చిన్నవయసులోనే స్పెయిన్‌కు వెళ్లడంతో ఆ దేశ పౌరసత్వం కూడా వచ్చింది. స్పెయిన్ అండర్-20 జట్టుకు ఆడే అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించి అర్జెంటీనానే ఎంచుకున్నాడు. 2005లో ఫిఫా అండర్-20 ప్రపంచకప్‌లో అర్జెంటీనా తరఫున పాల్గొని దాన్ని నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో గోల్డెన్ బూట్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డులు మెస్సీకే దక్కాయి. 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో అర్జెంటీనా బంగారు పతకం నెగ్గడంలోనే మెస్సీదే కీలక పాత్ర. తొలిమ్యాచే పీడకల.. 2005లో హంగేరీపై మ్యాచ్‌లో 63వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి తొలిసారి సీనియర్ జట్టుకు ఆడాడు. అయితే మరో రెండు నిమిషాలకే రెడ్ కార్డుకు గురై మైదానం వీడాడు. మ్యాచ్ అనంతరం అర్జెంటీనా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలో వెళితే ఒక మూలన కూర్చున్న మెస్సీ ఏడుస్తూ కనిపించాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా మూడు ప్రపంచకప్‌లు, రెండు కోపా అమెరికా టోర్నీల్లో పాల్గొన్నాడు. 2014లో ప్రపంచకప్ ఫైనల్.. అర్జెంటీనాకు ప్రపంచకప్‌లో అతిపెద్ద గండం జర్మనీ. ముఖ్యంగా మెస్సీ పాల్గొన్న 2006, 10, 14 టోర్నీలలో జర్మనీ చేతిలో ఓడిపోయే ఇంటిముఖం పట్టింది. 2014లో అయితే మెస్సీ కెప్టెన్‌గా ఉన్న అర్జెంటీనా ఫైనల్‌కు చేరినా జర్మనీని ఆపలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ టోర్నీలో మెస్సీకే బెస్ట్ ప్లేయర్ అవార్డు లభించింది. అలాగే 2007లో కోపా అమెరికా కప్ రన్నరప్‌గా నిలిచిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఈ రెండు సార్లు ట్రోఫీ అందుకోవడానికి దగ్గరగా వచ్చి భంగపడ్డాడు. ఒలింపిక్స్‌ను మినహాయిస్తే ఏ ఫుట్‌బాల్ జట్టైనా పాల్గొనే అతిపెద్ద టోర్నీలు మూడే ఉంటాయి. అవి ప్రపంచకప్, ఫిఫా కాన్ఫడరేషన్ కప్, మూడోది ఆ దేశం ఉండే జోన్లలో ఏర్పాటు చేసే కప్. ఉదా: యూరో కప్ (యూరోపియన్ దేశాలకు)/ కోపా అమెరికా (దక్షిణామెరికా దేశాలకు). ఒలింపిక్స్‌లో పెద్ద దేశాల జట్లు పాల్గొన్నా కేవలం ముగ్గురు మాత్రమే 23 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న ఆటగాళ్లు తుది జట్టులో ఆడాలి. ప్రస్తుతం జరుగుతున్న కోపా టోర్నీలో జమైకాతో జరిగిన మ్యాచ్‌తో మెస్సీ వందో మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాడు. ఇంకా 43 మ్యాచ్‌లు ఆడితే ఆ దేశం తరఫున అత్యధిక మ్యాచ్ ఆడిన ఆటగాడిగా నిలుస్తాడు. 46 గోల్స్‌తో ఆ దేశం తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాతో రెండు స్థానంలో నిలిచాడు. ఇంకో 10 గోల్స్ చేస్తే ఈ రికార్డును అందుకుంటాడు. ఈ రెండు రికార్డులను బద్దలుకొట్టడం మెస్సీకి పెద్ద కష్టం కాదు కానీ ట్రోఫీని నెగ్గడమే ప్రస్తుతం అతని ముందున్న పెద్ద లక్ష్యం. ఇది మెస్సీకే అర్జెంటీనా జాతీయ జట్టుకు కూడా ఎంతో అవసరం. ఒక్క మెస్సీసే కాదు మరో అర్జెంటీనా సూపర్ స్టార్ కార్లోస్ తెవెజ్కు కూడా పెద్ద కప్ నెగ్గలేదనే వెలతి ఉంది. ఎందుకంటే గత 22 ఏళ్లుగా అర్జెంటీనా జట్టు పెద్ద టైటిల్ నెగ్గలేదు. 1993లో కోపా అమెరికా నెగ్గడమే దాని చివరి అతి పెద్ద విజయం. ఈ సారి తమ కంటే కాస్త బలహీనమైన చిలీపై నెగ్గాలని ఆ జట్టు యోచిస్తోంది. ప్రస్తుతం స్టార్ ఆటగాళ్లు డి మరియా, అగ్వేరో (మారడోన అల్లుడు), హిగ్యుయెన్, లావెజ్జీ, మాషరానో, జబలేటాలతో కూడిన కూడిన మెస్సీ బృందం స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే కప్‌ను నెగ్గడం కష్టమేమి కాదు. -మన్నె కిశోర్.