![Indian Football Team Enter-Top-100 FIFA Ranking List-1st-Time After 2018 - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/21/Sunil%5D.jpg.webp?itok=qSdpqQyb)
న్యూఢిల్లీ: ఐదేళ్ల విరామం తర్వాత భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్స్‌లో టాప్-100లో చోటు దక్కించుకుంది. క్రితంసారి ర్యాంక్‌లను ప్రకటించినపుడు సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత ఫుట్‌బాల్ జట్టు సరిగ్గా 100వ ర్యాంక్‌లో నిలిచింది. ఇటీవల దక్షిణాసియా చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకోవడంతో భారత జట్టు ఒక స్థానం మెరుగుపర్చుకొని 99వ ర్యాంక్‌లో నిలిచింది. 1996లో భారత జట్టు అత్యుత్తమంగా 94 ర్యాంక్‌ను దక్కించుకుంది.
2018 తర్వాత భారత్‌కు ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్‌లో కొనసాగుతుండగా.. ఫ్రాన్స్, బ్రెజిల్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. ఆసియా ర్యాంకింగ్స్‌లో జపాన్ (ప్రపంచ 20వ ర్యాంక్) టాప్‌లో ఉంది.
ᴡᴇ ᴍᴀʀᴄʜ ᴏɴ 💪🏽💙
— Indian Football Team (@IndianFootball) July 20, 2023
🇮🇳 climbed up to 9️⃣9️⃣ in the latest official @FIFAcom world ranking 👏🏽🤩#BlueTigers 🐯 #IndianFootball ⚽️ pic.twitter.com/wLMe4WjQuA
చదవండి: బ్రిజ్‌భూషణ్‌కు బెయిల్; ఏ ప్రాతిపదికన వారికి మినహాయింపు?
Comments
Please login to add a commentAdd a comment