Top-100
-
టాప్–100లోకి అనిరుధ్
న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో అనిరుధ్ తొమ్మిది స్థానాలు ఎగబాకి సరిగ్గా 100వ ర్యాంక్‌లో నిలిచాడు. గతవారం అమెరికాలో జరిగిన ‘హాల్ ఆఫ్ ఫేమ్’ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్)తో కలిసి ఆడిన అనిరుధ్ డబుల్స్‌లో సెమీఫైనల్ చేరుకోవడంతో అతని ర్యాంక్ మెరుగైంది. వెటరన్ రోహన్ బోపన్న ఒక స్థానం పడిపోయి ఎనిమిదో ర్యాంక్‌లో ఉండగా... యూకీ బాంబ్రీ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 60వ ర్యాంక్‌లో, సాకేత్ మైనేని నాలుగు స్థానాలు పురోగతి సాధించి 77వ ర్యాంక్‌లో నిలిచారు. జీవన్ నెడుంజెళియన్ 91వ ర్యాంక్‌లో, శ్రీరామ్ బాలాజీ 94వ ర్యాంక్‌లో ఉన్నారు. మరోవైపు సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సుమిత్ నగాల్ ఏకంగా 53 స్థానాలు ఎగబాకి 178వ ర్యాంక్‌లో నిలిచాడు. -
ఫిఫా ర్యాంకింగ్స్.. టాప్-100లో భారత జట్టుకు చోటు
న్యూఢిల్లీ: ఐదేళ్ల విరామం తర్వాత భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్స్‌లో టాప్-100లో చోటు దక్కించుకుంది. క్రితంసారి ర్యాంక్‌లను ప్రకటించినపుడు సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత ఫుట్‌బాల్ జట్టు సరిగ్గా 100వ ర్యాంక్‌లో నిలిచింది. ఇటీవల దక్షిణాసియా చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకోవడంతో భారత జట్టు ఒక స్థానం మెరుగుపర్చుకొని 99వ ర్యాంక్‌లో నిలిచింది. 1996లో భారత జట్టు అత్యుత్తమంగా 94 ర్యాంక్‌ను దక్కించుకుంది. 2018 తర్వాత భారత్‌కు ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్‌లో కొనసాగుతుండగా.. ఫ్రాన్స్, బ్రెజిల్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. ఆసియా ర్యాంకింగ్స్‌లో జపాన్ (ప్రపంచ 20వ ర్యాంక్) టాప్‌లో ఉంది. ᴡᴇ ᴍᴀʀᴄʜ ᴏɴ 💪🏽💙 🇮🇳 climbed up to 9️⃣9️⃣ in the latest official @FIFAcom world ranking 👏🏽🤩#BlueTigers 🐯 #IndianFootball ⚽️ pic.twitter.com/wLMe4WjQuA — Indian Football Team (@IndianFootball) July 20, 2023 చదవండి: బ్రిజ్‌భూషణ్‌కు బెయిల్; ఏ ప్రాతిపదికన వారికి మినహాయింపు? -
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: భారత్ హై జంప్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ లో ఈ ఏడాది భారత్ మెరుగైన స్థానాన్ని కొట్టేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్-2018 జాబితాను మంగళవారం సాయంత్రం ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. 190 దేశాలున్న ఈ జాబితాలో ఇండియా 100 స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది 130 స్థానంలో ఉన్న భారత్ బిగ్ జంప్ చేసింది. 30 స్థానాలు ఎగబాకి టాప్ -100లో చోటు దక్కించుకుంది. దక్షిణ ఆసియాలో టాప్ 100లో చోటు దక్కించుకున్న దేశంగా ఇండియా నిలిచిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. నిర్మాణాత్మక సంస్కరణలను చేపడుతున్న దేశంగా భారతదేశం నిలిచిందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొందని జైట్లీ వెల్లడించారు. 10 సూచికల్లో తొమ్మిందిటిలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుందని చెప్పారు. ముఖ్యంగా సంస్కరణల్లో టాప్ గా నిలిచింది. ఇన్సాల్వెన్సీ పరిష్కారంలో 136నుంచి 103ర్యాంక్‌కు ఎగబాకింది. విద్యుత్ కనెక్షన్ పొందడంలో 29వ ర్యాంకును దక్కించుకుందని, వ్యాపారం ఆరంభంలో, మైనార్టీ పెట్టుబడుదారుల రక్షణలో, ఆస్తుల నమోదులో పురోగతి సాధించింది. క్రెడిట్ పొందడంలో 44నుంచి 29ర్యాంకుకు చేరింది. పన్నుల చెల్లింపులో 172నుంచి 119 ర్యాంకును, ఆస్తుల నమోదులో మాత్రం క్షీణించింది. ప్రపంచ బ్యాంకు డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ 10 సూచికల ఆధారంగా ఈ ఇండెక్స్‌ను రూపొందిస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించడం, నిర్మాణ అనుమతి, విద్యుత్ పొందడం, ఆస్తిని నమోదు చేయడం, క్రెడిట్ పొందడం, మైనారిటీ పెట్టుబడిదారులను రక్షించడం, పన్నులు చెల్లించడం, సరిహద్దుల్లో ట్రేడింగ్, ఒప్పందాలను అమలు చేయడం, దివాలా తీర్మానం వీటిల్లోఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది ఆర్థికవేత్తలు, ఆడిటర్లు, సర్వే సంస్థల కృషితో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌ను ప్రపంచబ్యాంకు రూపొందిస్తుంది. వివిధ దేశాల్లో ఆర్థిక అభివృద్ధి, పరిపాలన, కార్మిక చట్టాల్లో చేపడుతున్న సంస్కరణలను అధ్యయనం చేస్తారు. కాగా 2001లో మొదటిసారిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌ను ప్రారంభించిన ప్రపంచబ్యాంకు 2003లో మొదటిసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్టును ప్రచురించింది. ప్రస్తుతం ఈ ఇండెక్స్‌లో ప్రపంచంలోని 190 దేశాలకు ర్యాంకులు ఇస్తుంది. -
టాప్-100లో ఆర్టీఏ యాప్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఆర్టీఏ ఎం-వాలెట్‌కు విశేష ఆదరణ లభించింది. కేవలం 48 గంటల్లోనే ఈ యాప్‌ను లక్షమంది డౌన్లోడ్ చేసుకున్నారు. ప్లేస్టోర్‌లో టాప్-100 యాప్స్‌లో ఎం-వాలెట్ ఒకటిగా నిలిచింది. అంతేకాదు, టాప్-100లో ఉన్న ప్రభుత్వ యాప్ ఇది ఒక్కటేనని మంత్రి కే టీఆర్ ట్వీట్ చేశారు. ఈ యాప్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు.