ATP Rankings: Anirudh Chandrasekar In Top 100 In Carrer - Sakshi
Sakshi News home page

టాప్‌–100లోకి అనిరుధ్‌

Published Tue, Jul 25 2023 5:57 AM | Last Updated on Mon, Jul 31 2023 7:26 PM

ATP Rankings: Anirudh Chandrasekar in top 100 in carrer - Sakshi

న్యూఢిల్లీ: అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌ తన కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో అనిరుధ్‌ తొమ్మిది స్థానాలు ఎగబాకి సరిగ్గా 100వ ర్యాంక్‌లో నిలిచాడు. గతవారం అమెరికాలో జరిగిన ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీలో విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ (భారత్‌)తో కలిసి ఆడిన అనిరుధ్‌ డబుల్స్‌లో సెమీఫైనల్‌ చేరుకోవడంతో అతని ర్యాంక్‌ మెరుగైంది.

వెటరన్‌ రోహన్‌ బోపన్న ఒక స్థానం పడిపోయి ఎనిమిదో ర్యాంక్‌లో ఉండగా... యూకీ బాంబ్రీ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 60వ ర్యాంక్‌లో, సాకేత్‌ మైనేని నాలుగు స్థానాలు పురోగతి సాధించి 77వ ర్యాంక్‌లో నిలిచారు. జీవన్‌ నెడుంజెళియన్‌ 91వ ర్యాంక్‌లో, శ్రీరామ్‌ బాలాజీ 94వ ర్యాంక్‌లో ఉన్నారు. మరోవైపు సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో సుమిత్‌ నగాల్‌ ఏకంగా 53 స్థానాలు ఎగబాకి 178వ ర్యాంక్‌లో నిలిచాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement