Fifa Rankings
-
తిరుగులేని అర్జెంటీనా
జ్యూరిక్: ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) పురుషుల టీమ్ ర్యాంకింగ్స్‌లో విశ్వవిజేత అర్జెంటీనా జట్టు వరుసగా రెండో ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించింది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు 1867.25 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. ఈ ఏడాది అర్జెంటీనా జట్టు కోపా అమెరికా కప్ టైటిల్ సాధించింది.ఇక ర్యాంకింగ్స్‌లో ఫ్రాన్స్ రెండో స్థానంలో, స్పెయిన్ మూడో స్థానంలో ఉన్నాయి. గత నవంబర్‌లో విడుదల చేసిన ర్యాంకింగ్స్ నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో తక్కువ మ్యాచ్‌లు జరగడంతో ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు లేవు.ఇందులో ఇంగ్లండ్, బ్రెజిల్, పోర్చుగల్, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ, జర్మనీ వరుసగా నాలుగు నుంచి 10వ ర్యాంక్ వరకు కొనసాగుతున్నాయి.ఈ ఏడాది అన్ని జట్లకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అంగోలా జట్టు 32 స్థానాలు ఎగబాకి 85వ ర్యాంక్‌లో నిలిచింది. భారత జట్టు ఒక స్థానం మెరుగుపర్చుకొని 126వ ర్యాంక్‌లో ఉంది. తదుపరి ర్యాంకింగ్స్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేస్తారు. -
ఫిఫా ర్యాంకింగ్స్.. టాప్-100లో భారత జట్టుకు చోటు
న్యూఢిల్లీ: ఐదేళ్ల విరామం తర్వాత భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్స్‌లో టాప్-100లో చోటు దక్కించుకుంది. క్రితంసారి ర్యాంక్‌లను ప్రకటించినపుడు సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత ఫుట్‌బాల్ జట్టు సరిగ్గా 100వ ర్యాంక్‌లో నిలిచింది. ఇటీవల దక్షిణాసియా చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకోవడంతో భారత జట్టు ఒక స్థానం మెరుగుపర్చుకొని 99వ ర్యాంక్‌లో నిలిచింది. 1996లో భారత జట్టు అత్యుత్తమంగా 94 ర్యాంక్‌ను దక్కించుకుంది. 2018 తర్వాత భారత్‌కు ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్‌లో కొనసాగుతుండగా.. ఫ్రాన్స్, బ్రెజిల్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. ఆసియా ర్యాంకింగ్స్‌లో జపాన్ (ప్రపంచ 20వ ర్యాంక్) టాప్‌లో ఉంది. ᴡᴇ ᴍᴀʀᴄʜ ᴏɴ 💪🏽💙 🇮🇳 climbed up to 9️⃣9️⃣ in the latest official @FIFAcom world ranking 👏🏽🤩#BlueTigers 🐯 #IndianFootball ⚽️ pic.twitter.com/wLMe4WjQuA — Indian Football Team (@IndianFootball) July 20, 2023 చదవండి: బ్రిజ్‌భూషణ్‌కు బెయిల్; ఏ ప్రాతిపదికన వారికి మినహాయింపు? -
FIFA Rankings: టైటిల్ సాధించి.. టాప్- 100లో.. 1996లో అత్యుత్తమంగా..
స్వదేశంలో ఇటీవల జరిగిన ఇంటర్ కాంటినెంటల్‌కప్ నాలుగు దేశాల టోర్నీలో టైటిల్ సాధించినందుకు భారత జట్టు ర్యాంకింగ్స్‌లో పురోగతి కనిపించింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) తాజా ర్యాంకింగ్స్‌లో సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత పురుషుల జట్టు సరిగ్గా 100వ స్థానంలో నిలిచింది. క్రితంసారి భారత్ 101వ ర్యాంక్‌లో నిలువగా... ఈసారి ఒక స్థానం మెరుగుపర్చుకుంది. 2019 ఫిబ్రవరి 7 తర్వాత భారత జట్టు మళ్లీ టాప్–100లోకి రావడం ఇదే తొలిసారి. 2019 ఫిబ్రవరిలో భారత్ 97వ ర్యాంక్‌లో నిలిచింది. ఆ తర్వాత భారత ర్యాంక్ పడిపోయింది. 1996లో భారత్ అత్యుత్తమంగా 94వ ర్యాంక్‌లో నిలిచింది. ప్రస్తుతం భారత జట్టు స్వదేశంలో జరుగుతున్న దక్షిణాసియా చాంపియన్‌షిప్‌లో బరిలో ఉంది. శనివారం జరిగే సెమీఫైనల్లో లెబనాన్ జట్టుతో టీమిండియా తలపడుతుంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... ఫ్రాన్స్ రెండో ర్యాంక్‌లో, బ్రెజిల్ మూడో ర్యాంక్‌లో ఉన్నాయి. -
FIFA Rankings: అర్జెంటీనా @ 1.. భారత్ @ 101
జ్యూరిక్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో విశ్వవిజేత అర్జెంటీనా జట్టు ఆరేళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. ఇటీవల పనామా, కురాసావ్ జట్లతో జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా గెలుపొందడంతో మెస్సీ బృందం రెండో స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకుంది. గత ఏడాది ఖతర్‌లో జరిగిన ప్రపంచకప్‌లో మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా 36 ఏళ్ల తర్వాత జగజ్జేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మొరాకోతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో బ్రెజిల్ ఓడిపోవడంతో ఆ జట్టు నంబర్‌వన్ ర్యాంక్ నుంచి రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంక్‌కు చేరుకుంది. మూడో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ రెండో స్థానానికి ఎగబాకింది. బెల్జియం నాలుగో ర్యాంక్‌లో, ఇంగ్లండ్ ఐదో ర్యాంక్‌లో ఉన్నాయి. భారత్ @ 101 గురువారం విడుదల చేసిన ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఐదు స్థానాలు పురోగతి సాధించి 101వ ర్యాంక్‌కు చేరుకుంది. స్వదేశంలో జరిగిన మూడు దేశాల టోర్నీలో కిర్గిజ్ రిపబ్లిక్, మయాన్మార్ జట్లపై గెలిచి విజేతగా నిలవడంతో ర్యాంకింగ్స్‌లో భారత్ ఎగబాకింది. 1994లో భారత్ అత్యుత్తమంగా 94వ ర్యాంక్‌లో నిలిచింది. -
భళా అర్జెంటీనా.. ఆరేళ్ల తర్వాత అగ్రస్థానం
ఫిఫా ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా ఆరేళ్ల తర్వాత మళ్లీ అగ్రస్థానాన్ని అధిరోహించింది. ఇటీవలే పనామా, కురాకోతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లలో విజయాలు అందుకున్న అర్జెంటీనా 1840. 93 పాయింట్లతో నెంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో మెస్సీ సేన ఆరేళ్ల తర్వాత అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక గతేడాది డిసెంబర్లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షటౌట్లో 4-2తో ఓడించి మూడోసారి విజేతగా నిలిచింది. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ తన కోరికను నెరవేర్చుకోవడంతో పాటు అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్ రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్ 1838.45 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. యుఇఎఫ్ఎ యూరో క్వాలిఫైయింగ్‌లో భాగంగా ఫ్రాన్స్.. నెదర్లాండ్స్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్లను ఓడించి ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఇక ఏడాది కాలంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న బ్రెజిల్.. ఫిఫా వరల్డ్‌కప్‌లో మొరాకో చేతిలో 2-1తో ఓడింది. ఆ తర్వాత బ్రెజిల్ ఆశించినంతగా ఆడలేక 1834.21 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. ఇక బెల్జియం 1792. 53 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 1792.43 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ 1731. 23 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. యూరోప్ దేశాలైన క్రొయేషియా, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ ఆరు నుంచి పది స్థానాల్లో నిలిచాయి. 🇦🇷🏆 World champions ✅ 🇦🇷🥇 Top of the #FIFARanking ✅ — FIFA World Cup (@FIFAWorldCup) April 6, 2023 -
‘ఫిఫా’ ఆర్జన రూ. 44 వేల కోట్లు
లండన్: ఈ జగతిని, జనాన్ని ఊపేసే క్రీడ ఫుట్‌బాల్. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న ఫుట్‌బాల్ ఆదాయం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ‘ఫిఫా’ రాబడి ఈసారి మరింత పెరిగింది. ఈ క్రీడాపాలక సంస్థ ఆర్జన 6.4 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ.44 వేల కోట్లకు పైమాటే! నగదు నిల్వలు కూడా 2.74 బిలియన్ డాలర్ల (రూ.19 వేల కోట్లు)కు పెరిగాయి. గతేడాదే ఫట్‌బాల్ ప్రపంచకప్ జరిగింది. ‘ఫిఫా’ ఆదాయవ్యయాలను ప్రపంచకప్ నాలుగేళ్ల సైకిల్‌ను బట్టి గణిస్తారు. బ్రెజిల్ ప్రపంచకప్ (2014) సైకిల్ ప్రకారం అప్పటి నగదు నిల్వలు 1.523 బిలియన్ డాలర్లు (రూ. 10 వేల కోట్లు). అయితే మొత్తం ఆదాయం 5.718 బిలియన్ డాలర్లు (రూ.40 వేల కోట్లు). ఈ నాలుగేళ్లలో ‘ఫిఫా’ ఆదాయం 4 వేల కోట్లు పెరిగింది. -
భారత్ 103వ స్థానానికి...
ప్రపంచ ఫుట్‌బాల్ (ఫిఫా) ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్–100లో చోటు కోల్పోయింది. గురువారం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో భారత్ ఆరు స్థానాలు దిగజారి 103వ ర్యాంక్‌లో నిలిచింది. ఆసియా ర్యాంకింగ్స్‌లో కూడా 18వ స్థానానికి పడిపోయింది. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో పేలవ ప్రదర్శనతో యూఏఈ, బహ్రెయిన్ల చేతుల్లో ఓడటమే అందుకు కారణం. 2022 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో పాల్గొనేందుకు భారత్ ర్యాంకు మెరుగు పడాల్సి ఉంది. ఇందు కోసం మున్ముందు పెద్ద జట్లతో భారత్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. 21 ఏళ్ల తర్వాత 2017లో తొలిసారి టాప్–100లో నిలిచింది.