స్వదేశంలో ఇటీవల జరిగిన ఇంటర్ కాంటినెంటల్‌కప్ నాలుగు దేశాల టోర్నీలో టైటిల్ సాధించినందుకు భారత జట్టు ర్యాంకింగ్స్‌లో పురోగతి కనిపించింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) తాజా ర్యాంకింగ్స్‌లో సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత పురుషుల జట్టు సరిగ్గా 100వ స్థానంలో నిలిచింది. క్రితంసారి భారత్ 101వ ర్యాంక్‌లో నిలువగా... ఈసారి ఒక స్థానం మెరుగుపర్చుకుంది. 2019 ఫిబ్రవరి 7 తర్వాత భారత జట్టు మళ్లీ టాప్–100లోకి రావడం ఇదే తొలిసారి.
2019 ఫిబ్రవరిలో భారత్ 97వ ర్యాంక్‌లో నిలిచింది. ఆ తర్వాత భారత ర్యాంక్ పడిపోయింది. 1996లో భారత్ అత్యుత్తమంగా 94వ ర్యాంక్‌లో నిలిచింది. ప్రస్తుతం భారత జట్టు స్వదేశంలో జరుగుతున్న దక్షిణాసియా చాంపియన్‌షిప్‌లో బరిలో ఉంది. శనివారం జరిగే సెమీఫైనల్లో లెబనాన్ జట్టుతో టీమిండియా తలపడుతుంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... ఫ్రాన్స్ రెండో ర్యాంక్‌లో, బ్రెజిల్ మూడో ర్యాంక్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment