indian footbal team
-
భారత ఫుట్‌బాల్ టీమ్ హెడ్ కోచ్‌గా మనోలో మార్క్వెజ్
భారత ఫుట్‌బాల్ టీమ్‌కు కొత్త కోచ్ వచ్చాడు. స్పెయిన్‌కు చెందిన మనోలో మార్క్వెజ్ను టీమ్ హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) శనివారం ప్రకటించింది. 55 ఏళ్ల మార్క్వెజ్ ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టీమ్ ఎఫ్‌సీ గోవాకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.అయితే 2024–25 సీజన్లో ఆయన ఇటు భారత జట్టుతో పాటు అటు ఎఫ్‌సీ గోవా కోచ్‌గా కూడా రెండు బాధ్యతలను నిర్వర్తిస్తారని ఏఐఎఫ్ఎఫ్ వెల్లడించింది. కోచ్‌గా యూఈఎఫ్ఏ ప్రొ లైసెన్స్ ఉన్న మార్క్వెజ్ పదవీకాలంపై ఫెడరేషన్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు.వియత్నాం, లెబనాన్లతో వచ్చే అక్టోబరులో జరిగే మూడు దేశాల టోర్నీనుంచి కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారు. 2020 నుంచి భారత్‌లో మార్క్వెజ్ కోచింగ్ కొనసాగుతోంది. ఎఫ్‌సీ గోవాకు కోచ్‌గా మారక ముందు ఐఎస్ఎల్లో ఆయన హైదరాబాద్ ఎఫ్సీకి కోచ్‌గా పని చేశారు.మార్క్వెజ్ నేతృత్వంలోనే 2021–22లో హైదరాబాద్ ఐఎస్ఎల్ చాంపియన్‌గా నిలవడం విశేషం. స్పెయిన్‌లో కోచ్‌గా మార్క్వెజ్ అపార అనుభవం ఉంది. పలు స్థానిక క్లబ్‌లతో పాటు లా లిగా జట్టు లాస్ పామాస్కు కూడా కోచ్‌గా పని చేశారు. -
FIFA Rankings: టైటిల్ సాధించి.. టాప్- 100లో.. 1996లో అత్యుత్తమంగా..
స్వదేశంలో ఇటీవల జరిగిన ఇంటర్ కాంటినెంటల్‌కప్ నాలుగు దేశాల టోర్నీలో టైటిల్ సాధించినందుకు భారత జట్టు ర్యాంకింగ్స్‌లో పురోగతి కనిపించింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) తాజా ర్యాంకింగ్స్‌లో సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత పురుషుల జట్టు సరిగ్గా 100వ స్థానంలో నిలిచింది. క్రితంసారి భారత్ 101వ ర్యాంక్‌లో నిలువగా... ఈసారి ఒక స్థానం మెరుగుపర్చుకుంది. 2019 ఫిబ్రవరి 7 తర్వాత భారత జట్టు మళ్లీ టాప్–100లోకి రావడం ఇదే తొలిసారి. 2019 ఫిబ్రవరిలో భారత్ 97వ ర్యాంక్‌లో నిలిచింది. ఆ తర్వాత భారత ర్యాంక్ పడిపోయింది. 1996లో భారత్ అత్యుత్తమంగా 94వ ర్యాంక్‌లో నిలిచింది. ప్రస్తుతం భారత జట్టు స్వదేశంలో జరుగుతున్న దక్షిణాసియా చాంపియన్‌షిప్‌లో బరిలో ఉంది. శనివారం జరిగే సెమీఫైనల్లో లెబనాన్ జట్టుతో టీమిండియా తలపడుతుంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... ఫ్రాన్స్ రెండో ర్యాంక్‌లో, బ్రెజిల్ మూడో ర్యాంక్‌లో ఉన్నాయి. -
హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు.. టాప్-4లో సునీల్ ఛెత్రి
భారత ఫుట్‌బాల్ స్టార్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ గోల్స్ పరంగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత జట్టు తరఫున 138వ మ్యాచ్ ఆడిన సునీల్ ఛెత్రి 90 గోల్స్ చేశాడు. ఇక టాప్–3లో క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–123 గోల్స్), అలీ దాయి (ఇరాన్–109 గోల్స్), మెస్సీ (అర్జెంటీనా–103 గోల్స్) ఉన్నారు.2005లో జూన్ 12న భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన 38 ఏళ్ల సునీల్ ఛెత్రి తొలి గోల్ కూడా పాకిస్తాన్ జట్టుపైనే రావడం విశేషం. దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో శుభారంభం చేసింది. పాకిస్తాన్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో భారత్ 4–0 గోల్స్ తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి (10వ, 16వ, 74వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించగా... మరో గోల్‌ను ఉదాంత సింగ్ (81వ ని.లో) అందించాడు. 1952 తర్వాత భారత ఫుట్‌బాల్ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా ఇవ్వకపోవడం ఇదే ప్రథమం. శనివారం తమ తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్ ఆడుతుంది. IND vs PAK sees RED in the first half 🤯 India vs Pakistan is never fully complete without the fireworks and heated emotions 💥#INDvPAKonFanCode #SAFFChampionship2023 pic.twitter.com/xJLZTmcrp5 — FanCode (@FanCode) June 21, 2023 A perfectly placed Penalty by Sunil Chhetri and he gets his hattrick😍😍 pic.twitter.com/i2knCtsiH8 — Shanu 🇦🇷 (@secureboy23) June 21, 2023 -
ఫుట్‌బాల్‌కు గుడ్ డేస్
హైదరాబాద్‌లో ఫుట్‌బాల్‌కు మళ్లీ మంచిరోజులు వస్తాయని భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా ఆశాభావం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్‌లో సనోఫీ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటైన వరల్డ్ ఆర్థరైటిస్ అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన భుటియా కొద్దిసేపు ‘సిటీప్లస్’తో ముచ్చటించాడు. అవి ఆయున మాటల్లోనే.. ‘హైదరాబాద్ నుంచి విక్టరీ అమల్‌రాజ్ వంటి మేటి ఫుట్‌బాల్ ఆటగాళ్లు భారత జట్టుతో పాటు వివిధ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించారు. ఇండియన్ సూపర్లీగ్తో (ఐఎస్ఎల్) ఈ సిటీలోనూ ఫుట్‌బాల్‌కు మళ్లీ క్రేజ్ వస్తుంది. హైదరాబాద్ అంటే నాకు చాలా అభిమానం. ఇక్కడి రుచులు నాకు చాలా నచ్చుతాయి.. కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఐఎస్ఎస్ లీగ్ ఫ్రాంచైజీల్లో క్రికెట్ స్టార్లు మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, బాలీవుడ్ నటులు జాన్ అబ్రహాం, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్ వంటి వారే భాగస్వాములుగా ఉండటం శుభపరిణామం. ఐపీఎల్ తరహాలోనే ఐఎస్ఎల్లోనూ మెరికల్లాంటి ప్లేయుర్స్ రాణించే అవకాశాలు ఉన్నాయి. క్రికెట్‌ను అమితంగా ఆరాధించే మనదేశంలో స్వయంగా క్రికెటర్లే ఫుట్‌బాల్ వైపు చూస్తున్నారంటే, యువత తప్పకుండా ఈ పరిణామంపై ఆలోచిస్తారు. అయితే, ఫుట్‌బాల్ ఆడే సమయంలో ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. గాయాల పట్ల అలసత్వం పనికిరాదు. నా కెరీర్లో ఇప్పటి వరకు ఆరుసార్లు మోకాలికి ఆపరేషన్లు జరిగాయి. నాలుగేళ్ల కిందట ఆర్థోపెడిక్స్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ సచిన్ యాదవ్ సలహాపై విస్కో సప్లిమెంటేషన్ తీసుకుంటుండటంతో ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటున్నా’. - వీఎస్