
జ్యూరిక్: ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) పురుషుల టీమ్ ర్యాంకింగ్స్‌లో విశ్వవిజేత అర్జెంటీనా జట్టు వరుసగా రెండో ఏడాదిని నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించింది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు 1867.25 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. ఈ ఏడాది అర్జెంటీనా జట్టు కోపా అమెరికా కప్ టైటిల్ సాధించింది.
ఇక ర్యాంకింగ్స్‌లో ఫ్రాన్స్ రెండో స్థానంలో, స్పెయిన్ మూడో స్థానంలో ఉన్నాయి. గత నవంబర్‌లో విడుదల చేసిన ర్యాంకింగ్స్ నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో తక్కువ మ్యాచ్‌లు జరగడంతో ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు లేవు.
ఇందులో ఇంగ్లండ్, బ్రెజిల్, పోర్చుగల్, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ, జర్మనీ వరుసగా నాలుగు నుంచి 10వ ర్యాంక్ వరకు కొనసాగుతున్నాయి.
ఈ ఏడాది అన్ని జట్లకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అంగోలా జట్టు 32 స్థానాలు ఎగబాకి 85వ ర్యాంక్‌లో నిలిచింది. భారత జట్టు ఒక స్థానం మెరుగుపర్చుకొని 126వ ర్యాంక్‌లో ఉంది. తదుపరి ర్యాంకింగ్స్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment