
ప్రపంచ ఫుట్‌బాల్ (ఫిఫా) ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్–100లో చోటు కోల్పోయింది. గురువారం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో భారత్ ఆరు స్థానాలు దిగజారి 103వ ర్యాంక్‌లో నిలిచింది. ఆసియా ర్యాంకింగ్స్‌లో కూడా 18వ స్థానానికి పడిపోయింది. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో పేలవ ప్రదర్శనతో యూఏఈ, బహ్రెయిన్‌ల చేతుల్లో ఓడటమే అందుకు కారణం. 2022 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో పాల్గొనేందుకు భారత్ ర్యాంకు మెరుగు పడాల్సి ఉంది. ఇందు కోసం మున్ముందు పెద్ద జట్లతో భారత్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. 21 ఏళ్ల తర్వాత 2017లో తొలిసారి టాప్–100లో నిలిచింది.