Asia cup tournment
-
నేటి నుంచి ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీ
దోహా: ప్రతిష్టాత్మక ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీ శుక్రవారం ఖతర్ రాజధాని దోహాలో మొదలవుతుంది. 24 జట్లు పోటీపడుతున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 10 వరకు జరుగుతుంది. మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘బి’లో భారత్, సిరియా, ఉజ్బెకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లున్నాయి. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఖతర్‌తో లెబనాన్ తలపడుతుంది. వాస్తవానికి ఈ టోర్నీ గత ఏడాది చైనాలో జరగాల్సింది. అయితే కోవిడ్ కారణంగా చైనా ఆతిథ్యం నుంచి తప్పుకోగా ఖతర్‌కు ఈ టోర్నీని కేటాయించారు. -
భారత్‌దే ఆసియా కప్.. ఫైనల్లో పాకిస్తాన్‌పై విజయం
సలాలా (ఒమన్): ఆద్యంతం తమ ఆధిపత్యాన్ని చాటుకున్న భారత హాకీ జట్టు ఆసియా కప్ జూనియర్ టోర్నమెంట్లో టైటిల్‌ను నిలబెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా గురువారం జరిగిన ఫైనల్లో 2–1 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున అంగద్‌బీర్ సింగ్ (13వ ని.లో), అరైజీత్ సింగ్ హుండల్ (20వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... పాకిస్తాన్ జట్టుకు అలీ బషారత్ (38వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. ఓవరాల్‌గా ఆసియా కప్ టైటిల్ నెగ్గడం భారత్‌కిది నాలుగోసారి. గతంలో భారత్ 2004, 2008, 2015లలో విజేతగా నిలిచింది. తాజా టైటిల్‌తో ఆసియా కప్‌ను అత్యధికంగా నాలుగుసార్లు నెగ్గిన జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. పాకిస్తాన్ మూడుసార్లు చాంపియన్‌గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియా 2–1తో మలేసియాపై గెలిచింది. ఆసియా కప్ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన భారత్, పాకిస్తాన్, కొరియా జట్లు ఈ ఏడాది డిసెంబర్లో కౌలాలంపూర్‌లో జరిగే జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. తాజా టోర్నీలో భారత్ సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచింది. టోర్నీ మొత్తంలో భారత్ 50 గోల్స్ సాధించి... కేవలం నాలుగు గోల్స్ సమర్పించుకుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత హాకీ జట్టుకు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అభినందించారు. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 2 లక్షలు నగదు పురస్కారం ప్రకటించారు. -
ఆసియా కప్ టోర్నీలో ఆడలేం: జై షా
ముంబై: మరోసారి మరో మాజీ క్రికెటరే బోర్డు పాలకుడయ్యారు. తొలి వన్డే ప్రపంచకప్ (1983) గెలిచిన టీమిండియా సభ్యుడు, 67 ఏళ్ల రోజర్ బిన్నీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తర్వాత మళ్లీ ఆటగాడే బోర్డు పగ్గాలు చేపట్టారు. మంగళవారం జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో పదవులన్నీ కూడా పోటీలేకుండానే నామినేషన్ వేసిన వాళ్లందరికీ దక్కాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ అభ్యర్థిపై ఎలాంటి చర్చ లేకుండానే బోర్డు ఏజీఎం పదవుల పంపకంతోనే ముగిసింది. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా మహిళల ఐపీఎల్‌ను ఆమోదించడం ఒక్కటే జరిగింది. ‘ఐసీసీకి వెళ్లే బోర్డు ప్రతినిధిపై, ఐసీసీ చైర్మన్‌గిరిపై ఏ నిర్ణయం తీసుకోలేదు. కేవలం ఎజెండాలోని అంశాలే ఏజీఎంలో చర్చించారు’ అని ఓ రాష్ట్ర సంఘం సభ్యుడొకరు తెలిపారు. కొత్త కార్యవర్గం: రోజర్ బిన్నీ (అధ్యక్షుడు), జై షా (కార్యదర్శి), రాజీవ్ శుక్లా (ఉపాధ్యక్షుడు), దేవ్జిత్ సైకియా (సంయుక్త కార్యదర్శి), ఆశిష్ షెలార్ (కోశాధికారి). ఐపీఎల్ చైర్మన్‌గా ధుమాల్ గంగూలీ నేతృత్వంలోని బోర్డులో ఇన్నాళ్లూ కోశాధికారిగా పనిచేసిన అరుణ్ ధుమాల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త చైర్మన్‌గా ఎన్నికయ్యారు. బ్రిజేశ్ పటేల్ స్థానంలో ఆయన్ని నియమించారు. ఎమ్‌కేజే మజుందార్‌ను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అమ్మాయిల ఐపీఎల్‌కు జై బోర్డు ఏజీఎంలో ఐపీఎల్ తరహా అమ్మాయిల లీగ్‌కు ఆమోదం లభించింది. వచ్చే ఏడాది మార్చిలో ఐదు జట్లతో మహిళల ఐపీఎల్ జరుగుతుంది. అయితే జట్లను ఎలా విక్రయించాలి, టోర్నీని ఏ విధంగా నిర్వహించాలనే అంశాలను కొత్త గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయిస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఏటా రూ. వేల కోట్లు పెరుగుదల ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు (బీసీసీఐ) నగదు నిల్వలు ఏటికేడు వేల కోట్లు పెరిగిపోతున్నాయి. మూడేళ్ల క్రితం పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఆధ్వర్యంలో ఉన్నపుడు రూ. 3,648 కోట్లుగా ఉన్న బోర్డు కోశాగారం ఇప్పుడు రూ. 9,629 కోట్లకు చేరింది. కేవలం మూడేళ్లలోనే రూ. 5,981 కోట్లు పెరిగాయి. దాదాపు 3 రెట్లు ఆదాయం పెరిగింది. అలాగే రాష్ట్ర సంఘాలకు వితరణ కూడా ఐదు రెట్లు పెంచారు. సీఓఏ జమానాలో రూ. 680 కోట్లు ఇస్తుండగా... ఇప్పుడది రూ.3,295 కోట్లకు పెరిగిందని కోశాధికారి పదవి నుంచి దిగిపోతున్న అరుణ్ ధుమాల్ ఏజీఎంలో ఖాతాపద్దులు వివరించారు. పాక్‌లో ఆడేదిలేదు వచ్చే ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా కప్ టోర్నీలో ఆడలేమని బోర్డు కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌కు ముందు వన్డే ఫార్మాట్లో ఆసియా ఈవెంట్ పాకిస్తాన్లో నిర్వహించనున్నారు. దీనిపై ఏజీఎంలో చర్చించిన నూతన కార్యవర్గం తటస్థ వేదికపైనే ఆడేందుకు మొగ్గు చూపింది. అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడైన జై షా బోర్డు నిర్ణయాన్ని వెలువరించారు. తటస్థ వేదికపై అయితేనే ఆసియా కప్ ఆడతామన్నారు. ఈ ఏడాది టి20 ఫార్మాట్లో శ్రీలంకలో జరగాల్సిన ఆసియా ఈవెంట్ సింహళ దేశం దివాళా కారణంగా యూఏఈలో నిర్వహించారు. పాక్‌లో జరిగే ఆసియాకప్‌లో టీమిండియా ఆడకపోతే... వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ కూడా ఆడబోదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఇక కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. క్రికెటర్ల గాయాలపై దృష్టి పెడతాం. ఆటగాళ్లు తరచూ గాయాలపాలయ్యే పరిస్థితుల్ని తగ్గిస్తాం. దీనికోసం అందుబాటులో ఉన్న అవకాశాల్ని పరిశీలించి, పరిస్థితిని మెరుగుపరుస్తాం. బెంగళూరు అకాడమీ (ఎన్సీఏ)లో డాక్టర్లు, ఫిజియోల బృందం ఈ పనిలో నిమగ్నమవుతాయి. దేశవాళీ పిచ్‌లను పోటీతత్వంతో ఉండేలా తీర్చిదిద్దుతాం. ఆస్ట్రేలియాలాంటి దేశాలకు దీటుగా పిచ్‌లను తయారు చేస్తాం. –రోజర్ బిన్నీ -
రొనాల్డో-మెస్సీ.. మధ్యలో మనోడు
రోనాల్డో -మెస్సీ.. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటూ ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కుమ్ములాడుకోవడం చూస్తుంటాం. కానీ, ఈ ఇద్దరిలో మధ్యలో గట్టి పోటీ ఇస్తూ ఇప్పుడు ఇంకొకడు వచ్చి దూరాడు. ఆ ఒక్కడు ఎవడో కాదు.. భారత ఫుట్‌బాల్ మాంత్రికుడు సునీల్ ఛెత్రి. దోహా: సోమవారం 2022 ఫిఫా వరల్డ్‌కప్, 2023 ఆసియా కప్ క్వాలిఫైయర్స్ టోర్నీలలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 2-0 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ రెండు గోల్స్ కూడా సునీల్ ఛెత్రినే కొట్టాడు. ఈ ఫీట్‌తో ప్రపంచంలో అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్‌బాల్ ఆటగాడిగా(ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ల) రెండో స్థానంలో నిలిచాడు ఛెత్రి. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉండగా(103)గోల్స్‌తో, రెండో స్థానంలో మొన్నటిదాకా అర్జెంటీనా స్టార్ లియోనాల్ మెస్సీ(72)గోల్స్‌తో ఉన్నాడు. ఇక బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించడం ద్వారా మొత్తం 74 గోల్స్‌తో ఛెత్రి మెస్సీని వెనక్కి నెట్టి రెండో ప్లేస్‌కి చేరాడు. ఇక ఆల్‌టైం హయ్యెస్ట్ టాప్ 10 గోలర్స్ లిస్ట్‌లో చేరడానికి ఛెత్రి మరొక గోల్(75) సాధిస్తే సరిపోతుంది. వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచుల్లో భారత్‌కి ఆరేళ్ల తర్వాత దక్కిన తొలి గెలుపు ఇదే. ఇప్పటికే భారత్ ఫిఫా ఆశలు చల్లారగా.. కేవలం చైనాలో జరగబోయే ఆసియా కప్ అర్హత కోసం భారత్ ఫుట్‌బాల్ ఆడుతోంది. ఇక మెస్సీ యాక్టివ్‌గా ఉండడంతో ఛెత్రి రికార్డు త్వరగానే కనుమరుగు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ టాప్ లిస్ట్‌లో చేరిన ఛెత్రికి ఇండియన్ సోషల్ మీడియా సలాం చెబుతోంది. ఇక ఈ రికార్డు ఫీట్‌ను 36 ఏళ్ల ఛెత్రి కూడా చాలా తేలికగా తీసుకోవడం విశేషం. చదవండి: భారత్ పరాజయం Goals speak louder than words 🙏#IndianFootball #NationalTeam #JB6 #WCQualifiers pic.twitter.com/u4iOUzKwGa — Indian Football Team for World Cup (@IFTWC) June 7, 2021 -
క్రికెట్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. కీలక టోర్నీ రద్దు
కొలంబొ: కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు టోర్నమెంట్లు రద్దయ్యాయి. ఇటీవలే కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో నిర్వహిస్తున్న ఐపీఎల్ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా మరో టోర్నీ చేరింది. శ్రీలంకలో జూన్‌లో జరగాల్సిన ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ రద్దయింది. శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్నందున టోర్నీ నిర్వహించడం అసాధ్యమని శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యాష్లే డిసిల్వా ప్రకటించారు. రానున్న రెండేళ్లలో చాలా దేశాల క్రికెట్ బోర్డులు షెడ్యూళ్లు సిద్ధం చేసుకున్నందున.. 2023లో వన్డే వరల్డ్ కప్ తర్వాత దీన్ని తదుపరి నిర్వహించాలని డిసిల్వా సూచించారు. వాస్తవానికి ఆసియా కప్ టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉండేది. కానీ భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు లేకపోవడంతో ఈ టోర్నీని శ్రీలంకకు మార్చారు. అయితే తాజాగా అక్కడ కరోనా కేసులు పెరుగుతుండడంతో 10 రోజుల పాటు అంతర్జాతీయ విమానాలను నిషేధిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: 'పో.. వెళ్లి బౌలింగ్ చేయ్ బ్రో' -
దాయాదిపై భారత్ విజయం
-
బంగ్లాదేశ్‌ను గెలిపించిన ముస్తఫిజుర్
అబుదాబి: ఆసియా కప్‌లో మరో సూపర్ పోరులో బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు చేయాల్సిన అఫ్గానిస్తాన్ నాలుగు పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఆఖరి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేసిన ముస్తఫిజుర్ బంగ్లాదేశ్ విజయాన్ని ఖాయం చేశాడు. బుధవారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం భారత్‌తో జరిగే ఫైనల్లో తలపడుతుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఇమ్రూల్ కైస్ (72; 6 ఫోర్లు), మహ్ముదుల్లా (74; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 126 పరుగులు జోడించారు. దీంతో బంగ్లా ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓడింది. ఇసానుల్లా (8), రహ్మత్ షా (1) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన అఫ్గానిస్తాన్‌ను ఓపెనర్ షహదత్ (53; 8 ఫోర్లు), హష్మతుల్లా (71; 5 ఫోర్లు) ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 63 పరుగులు జతచేశాక షహదత్ పెవిలియన్ చేరాడు. తర్వాత హష్మతుల్లాతో జోడీ కట్టిన కెప్టెన్ అస్గర్ (39; 2 ఫోర్లు) జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు. అయితే జట్టు స్కోరు 167 పరుగుల వద్ద అస్గర్, 192 పరుగుల వద్ద హష్మతుల్లా నిష్క్రమించడంతో అఫ్గాన్ ఆశలు ఆవిరయ్యాయి. -
కోహ్లి ఆడకపోతే ఎలా?
ముంబై: అంతర్జాతీయ క్రికెట్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్థాయి ఏంటో కొత్తగా చెప్పనవసరంలేదు. మ్యాచ్ ఫలితాలు ఎలా ఉన్నా అతను ఆడుతుంటే దేశం మొత్తం మ్యాచ్ చూడటం మాత్రం ఖాయం. ఇప్పుడతను సుదీర్ఘ షెడ్యూల్ నుంచి విశ్రాంతి కోరుకుంటూ ఆసియా కప్‌కు దూరమయ్యాడు. దాంతో ప్రసారకర్తలైన స్టార్ స్పోర్ట్స్ గుండెల్లో రాయి పడింది! అసలే అంతంత మాత్రం ఆదరణ ఉండే ఆసియా కప్‌లో కోహ్లిలాంటి స్టార్ కూడా లేకపోతే సహజంగానే రేటింగ్‌లపై ప్రభావం పడుతుందని స్టార్ భావిస్తోంది. ఇదే విషయంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి స్టార్ సంస్థ లేఖ రాసినట్లు సమాచారం. టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లు పూర్తి స్థాయి బలంతో బరిలోకి దిగితే భారత్ మాత్రం కోహ్లిని పక్కన పెట్టిందని... ఏసీసీతో తాము చేసుకున్న ఒప్పందాన్ని ఇది ఉల్లంఘించడమేనని ఆరోపించింది. గతంలో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నంత సేపు అద్భుతమైన రేటింగ్‌లు రావడం, అతను ఔట్ కాగానే పడిపోయిన విషయాన్ని కూడా స్టార్ గుర్తు చేసింది. భారీ మొత్తం చెల్లించి ఏసీసీతో ఎనిమిదేళ్ల కాలానికి స్టార్ ఒప్పందం కుదుర్చుకుంది. విరాట్‌కు విశ్రాంతినివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమతో పాటు టోర్నీతో సంబంధం ఉన్న అనేక సంస్థలకు వాణిజ్యపరంగా నష్టదాయకమని పేర్కొంది. అయితే దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘాటుగా స్పందించినట్లు తెలిసింది. ‘బీసీసీఐ అంతర్గత వ్యవహారాలతో స్టార్‌కు ఎలాంటి సంబంధం లేదు. మా సెలక్షన్ ప్రక్రియ విషయంలో వారి జోక్యం అనవసరం’ అని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు. యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో మంగళవారం హాంకాంగ్‌తో, ఆ తర్వాత బుధవారం పాకిస్తాన్‌తో తలపడుతుంది. -
సూపర్ ముష్ఫికర్
బంగ్లా బెబ్బులి శివాలెత్తింది. సింహళీయుల్ని చిత్తుచిత్తుగా ఓడించి ఆసియా కప్‌లో శుభారంభం చేసింది. మొదట వెటరన్ పేసర్ మలింగ పేస్ పదునుకు ఎదురొడ్డి నిలిచింది. బ్యాటింగ్‌లో ముష్ఫికర్ రహీమ్ సెంచరీ, మొహమ్మద్ మిథున్ అర్ధ సెంచరీతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను ఒడ్డున పడేస్తే... తర్వాత బౌలర్లు శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఆటల్ని సాగనివ్వలేదు. పది ఓవర్లలోపే 4 కీలక వికెట్లు తీశారు. 25 ఓవర్లకే 8 వికెట్లను పడేసి ఘోరపరాజయాన్ని ఖాయం చేశారు. దుబాయ్: ఆసియా కప్ మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగింది. మేటి జట్లకు మేం ఏమాత్రం తీసిపోమని బరిలో ఉన్న జట్లను హెచ్చరించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 137 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 49.3 ఓవర్లలో 261 పరుగుల వద్ద ఆలౌటైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ముష్ఫికర్ రహీమ్ (150 బంతుల్లో 144; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) ‘శత’క్కొట్టాడు. మొహమ్మద్ మిథున్ (68 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. సరిగ్గా ఏడాది తర్వాత వన్డే ఆడిన లసిత్ మలింగ 4 వికెట్లు తీశాడు. తర్వాత శ్రీలంక 35.2 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. దిల్రువాన్ పెరీరా చేసిన 29 పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోర్ కాగా, మొర్తజా, ముస్తఫిజుర్ రహమాన్, మెహిదీ హసన్ మిరాజ్ తలా 2 వికెట్లు తీశారు. ఈ టోర్నీలో భాగంగా నేడు జరిగే రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌తో పాకిస్తాన్ తలపడుతుంది. ముష్ఫికర్ భారీ సెంచరీ... లసిత్ మలింగ ధాటికి చెల్లాచెదురైన బంగ్లా ఇన్నింగ్స్‌కు ముష్ఫికర్ రహీమ్ మూలస్తంభంలా నిలిచాడు. తొలి ఓవర్ వరుస బంతుల్లో లిటన్ దాస్ (0), షకీబ్ (0)లను మలింగ డకౌట్ చేశాడు. తర్వాత ఓవర్లోనే ఓపెన్ తమీమ్ ఔట్ కాకుండానే క్రీజు నుంచి ఔటైపోయాడు. గాయంతో రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో 3 పరుగులకే టాపార్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌లో కూర్చున్నారు. ఈ దశలో రహీమ్, మొహమ్మద్ మిథున్లిద్దరు మలింగ పేస్‌కు ఎదురునిలిచి జట్టును ఆదుకున్నారు. 13 ఓవర్లలో జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. వీళ్లిద్దరు పాతుకుపోవడంతో మరో ఆరు ఓవర్లకే (19.3) వంద పరుగులు దాటింది. మిథున్ 52 (4 ఫోర్లు, 2 సిక్సర్లు) బంతుల్లో... ముష్ఫికర్ 67 (3 ఫోర్లు, 1 సిక్స్) బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అలా 25 ఓవర్ల దాకా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. జట్టు కుదుటపడిన దశలో మలింగ మళ్లీ బంగ్లాదేశ్‌ను కుదిపేశాడు. ఇన్నింగ్స్ 26వ ఓవర్లో ధాటిగా ఆడుతున్న మిథున్‌ను, తన తదుపరి ఓవర్లో మొసద్దక్ హొస్సేన్ (1)లను ఔట్ చేశాడు. దీంతో 142 పరుగులకే సగం (5) వికెట్లు కోల్పోయిన బంగ్లాను మరోసారి ముష్ఫికర్ చివరి వరుస బ్యాట్స్‌మెన్ అండతో నిలబెట్టాడు. మెహదీ హసన్ మిరాజ్ (15), కెప్టెన్ మొర్తజా (11), ముస్తఫిజుర్ రహమాన్ (10)లు చేసింది తక్కువ పరుగులే అయినా... ముష్ఫికర్ రహీమ్‌కు అండగా నిలిచారు. దీంతో అతను 123 (7 ఫోర్లు, 1 సిక్స్) బంతుల్లో శతకాన్ని పూర్తి చేశాడు. చివరి ఐదు ఓవర్లలో ముష్ఫికర్ శివమెత్తాడు. 229 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోగా... గాయంతో రిటైర్ట్‌హర్ట్ అయిన తమీమ్ క్రీజులోకి వచ్చాడు. నిజానికి అతను బ్యాటింగ్ చేయలేని స్థితిలో ఉన్నా... అతని అండతోనే ముష్ఫికర్ సిక్సర్లు, ఫోర్లతో కేవలం తొమ్మిది బంతుల్లోనే 32 పరుగులు జోడించాడు. జట్టు స్కోరు 261 పరుగుల వద్ద చివరి వికెట్‌గా నిష్క్రమించాడు. వాళ్లు కొడితే... వీళ్లేమో వరుస కట్టారు... ఆరంభం చెదిరినా.. బంగ్లా ఇన్నింగ్స్‌ను ఇద్దరంటే ఇద్దరే నిలబెట్టారు. కానీ ఆరంభం అదిరినా... శ్రీలంక ఇన్నింగ్స్‌ను ఏ ఒక్కరూ కాపాడలేకపోయారు. తరంగ సిక్స్, ఫోర్‌తో తొలి ఓవర్లో 13 పరుగులు, రెండో ఓవర్లో 9 పరుగులు వచ్చాయి కానీ చివరి బంతికి కుశాల్ మెండిస్ (0)ను ముస్తఫిజుర్ డకౌట్ చేశాడు. ఇక ఇక్కడి నుంచి లంక పతనం ప్రారంభమైంది. మరుసటి ఓవర్లోనే జోరు మీదున్న తరంగ, కాసేపటికే డిసిల్వా (0), ఇంకాస్త ముందుకెళ్లగానే కుశాల్ పెరీరా (11) పెవిలియన్ చేరడంతో 38 పరుగులకే 4 టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. ముస్తఫిజుర్, మొర్తజా, మిరాజ్ తలా ఒక చేయి వేయడంతో ఇదంతా 9.2 ఓవర్లకే జరిగిపోయింది. ఈ వికెట్ల పతనానికి స్వల్ప విరామం దొరికింది. మళ్లీ 17వ ఓవర్ నుంచే లంక కష్టాలు మొదటికొచ్చాయి. దీంతో వంద పరుగుల్లోపే 8 వికెట్లను కోల్పోయి పరాజయాన్ని ఖాయం చేసుకుంది. దిల్రువాన్ పెరీరా, లక్మల్ (20) నిలబడినా బంగ్లా బౌలర్లతో ఎంతోసేపు తలబడలేకపోయారు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ ఇక్బాల్ నాటౌట్ 2; లిటన్ దాస్ (సి) మెండిస్ (బి) మలింగ 0; షకీబుల్ (బి) మలింగ 0; ముష్ఫికర్ (సి) మెండిస్ (బి) తిసారా పెరీరా 144; మిథున్ (సి) దిల్రువాన్ పెరీరా (బి) మలింగ 63; మహ్మూదుల్లా (సి) డిసిల్వా (బి) అపొన్సో 1; హొస్సేన్ (సి) దిల్రువాన్ పెరీరా (బి) మలింగ 1; మెహదీ హసన్ (సి అండ్ బి) లక్మల్ 15; మొర్తజా (సి) తరంగ (బి) డిసిల్వా 11; రూబెల్ హొస్సేన్ ఎల్బీడబ్ల్యూ (బి) డిసిల్వా 2; ముస్తఫిజుర్ (రనౌట్) 10; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 261. వికెట్ల పతనం: 1–1, 2–1, 2–3, 3–134, 4–136, 5–142, 6–175, 7–195, 8–203, 9–229, 10–261. బౌలింగ్: మలింగ 10–2–23–4, లక్మల్ 10–0–46–1, అపొన్సో 9–0–55–1, తిసారా పెరీరా 7.3–0–51–1, దిల్రువాన్ పెరీరా 3–0–25–0, ధనంజయ డిసిల్వా 7–0–38–2, షనక 3–0–19–0. శ్రీలంక ఇన్నింగ్స్: తరంగ (బి) మొర్తజా 27; మెండిస్ ఎల్బీడబ్ల్యూ (బి) ముస్తఫిజుర్ 0; కుశాల్ పెరీరా ఎల్బీడబ్ల్యూ (బి) మెహదీ హసన్ 11; ధనంజయ డిసిల్వా ఎల్బీడబ్ల్యూ (బి) మొర్తజా 0; మాథ్యూస్ ఎల్బీడబ్ల్యూ (బి) రూబెల్ హొస్సేన్ 16; షనక (రనౌట్) 7; తిసారా పెరీరా (సి) రూబెల్ హొస్సేన్ (బి) మెహదీ హసన్ 6; దిల్రువాన్ పెరీరా (స్టంప్డ్) లిటన్ దాస్ (బి) మొసద్దక్ హొస్సేన్ 29; లక్మల్ (బి) ముస్తఫిజుర్ 20; అపొన్సో (సి) సబ్–నజ్ముల్ హొస్సేన్ (బి) షకీబ్ 4; మలింగ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (35.2 ఓవర్లలో ఆలౌట్) 124. వికెట్ల పతనం: 1–22, 2–28, 3–32, 4–38, 5–60, 6–63, 7–69, 8–96, 9–120, 10–124. బౌలింగ్: మష్రఫే మొర్తజా 6–2–25–2, ముస్తఫిజుర్ 6–0–20–2, మెహదీ హసన్ మిరాజ్ 7–1–21–2, షకీబ్ 9.2–0–31–1, రూబెల్ హొస్సేన్ 4–0–18–1, మొసద్దక్ హొస్సేన్ 3–0–8–1. 1: ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ (144). శ్రీలంక కీపర్ సంగక్కర (121; బంగ్లాదేశ్‌పై 2008లో) పేరిట ఉన్న రికార్డును రహీమ్ సవరించాడు. 6:ఆసియా కప్‌లో సెంచరీ చేసిన ఆరో వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్. గతంలో సంగక్కర నాలుగు సెంచరీలు చేయగా... రాహుల్ ద్రవిడ్, ధోని, ఉమర్ అక్మల్, అనాముల్ హక్ ఒక్కో సెంచరీ సాధించారు. 1: ఆసియా కప్ వన్డే టోర్నీలోని ఓ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లోని తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడటం ఇదే మొదటిసారి. 2: ఆసియా కప్ చరిత్రలో శ్రీలంకతో 13 సార్లు ఆడిన బంగ్లాదేశ్‌కు కేవలం ఇది రెండో గెలుపే. ఓవరాల్‌గా శ్రీలంకతో 45 వన్డేలు ఆడిన బంగ్లాదేశ్‌కిది ఏడో విజయం మాత్రమే. -
రోహిత్, ధోనిలపైనే భారత్ ఆశలు
గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా టి20 లీగ్‌లు వెల్లువెత్తడంతో క్రికెట్ అభిమానుల దృష్టిలో ఆసియా కప్ తన ప్రాభవం కోల్పోయింది. అయితే ఆసియా ఖండంలో అగ్ర జట్టుగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉండటంతో ఆటగాళ్లు ఇప్పటికీ ఈ టోర్నీని గెలుచుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. యువకులతో నిండిన భారత జట్టుకు సారథ్యం వహించి షార్జాలో జరిగిన తొలి ఆసియా కప్‌ను గెలిపించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈసారి షార్జాలో మ్యాచ్‌లు లేకపోయినా మళ్లీ యూఏఈలో టోర్నీ జరగడం సంతోషంగా ఉంది. ఒకప్పుడు షార్జాలో బెనిఫిట్ మ్యాచ్ జరిగినా కూడా యూఏఈ దద్దరిల్లేది. అలాంటి చోట ఒక్క మ్యాచ్ కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. ఆ విషయాన్ని పక్కన పెడితే వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌కు వార్మప్లాంటిది కాబట్టి ఈ టోర్నమెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ జట్టు ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే వారి సన్నాహాలు అంత మెరుగవుతాయి. వరల్డ్ కప్‌లోగా తమ లోపాలేమిటో తెలుసుకొని వాటిని సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఇంగ్లండ్‌తో పోలిస్తే యూఏఈలో వాతావరణం చాలా భిన్నంగా ఉంటుందనేది వాస్తవమే అయినా ఒక జట్టుగా తమ గురించి తెలుసుకునేందుకు మంచి అవకాశం లభిస్తుంది. ఏ ఆటగాడు ఒత్తిడిని అధిగమించగలడో, జట్టును నడిపించగల సత్తా లేనివాళ్లు ఎవరో కూడా గుర్తించవచ్చు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేత పాకిస్తాన్ ఇక్కడ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అత్యంత ఆకర్షణ కలిగిన వారి మాజీ కెప్టెన్ ఇప్పుడు దేశ ప్రధానిగా ఉన్న నేపథ్యంలో అతనికి ఆసియా కప్‌ను కానుకగా ఇవ్వాలని వారు భావిస్తుండవచ్చు. చండిమాల్ దూరం కావడంతో లంక బలహీనంగా మారగా, షకీబ్ ఫిట్నెస్ సమస్యలతో బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి భారత్ సంగతేమిటి? ఇంగ్లండ్‌లో అవమానకర రీతిలో ఓడిన తర్వాత జట్టులో ఎంతో బాధ దాగి ఉంది. అందువల్ల ఆసియా కప్‌ను గెలిచి తమ అభిమానులకు సాంత్వన కలిగించాలని వారు కోరుకుంటున్నారు. అయితే అది అంత సులువు కాదు. ప్రత్యర్థులకు భారత జట్టు లోపాలు, అనిశ్చితి గురించి బాగా తెలుసు కాబట్టి వాటిపైనే దాడి చేస్తారు. కెప్టెన్‌గా ముందుండి నడిపించాల్సిన అత్యుత్తమ వన్డే ఆటగాడు రోహిత్ శర్మపైనే జట్టు చాలా ఆధారపడుతోంది. రోహిత్‌కు అండగా నిలిచేందుకు, యూఈఏ ఎడారి ఎండల్లో కూడా సహనం కోల్పోకుండా చూసేందుకు ధోని కూడా ఉన్నాడు. తాజా సమస్యలను అధిగమించి పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు వీరిద్దరిదే ప్రధాన పాత్ర కానుంది. -
‘ఆసియా’ సమరం
చాన్నాళ్ల తర్వాత వన్డే సమరం... అందులోనూ తటస్థ వేదికపై! రెండు చిన్న జట్లు సహా బహుళ దేశాల ప్రాతినిధ్యం... ఉత్కంఠను పెంచే చిరకాల ప్రత్యర్థుల పోరు! నేటి నుంచే ఆసియా కప్! భారత్‌కు ఎంతగానో అచ్చొచ్చిన టోర్నీ! ...మరి ఎప్పటిలాగే టీమిండియా సత్తా చాటుతుందా? విజేతగా తిరిగొస్తుందా? దుబాయ్: ఆరు దేశాలు పాల్గొంటున్న ఆసియా కప్ వన్డే టోర్నీ దుబాయ్ వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానుంది. 14వ సారి (గతంలో 12 సార్లు వన్డే, ఒకసారి టి20) నిర్వహిస్తున్న ఈ కప్ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో బంగ్లాదేశ్ తలపడనుంది. ఆరు సార్లు విజేత, డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా తొలి మ్యాచ్‌ను అబుదాబిలో ఈ నెల 18న క్వాలిఫయర్ హాంకాంగ్‌తో ఆడనుంది. ఆ మరుసటి రోజే దాయాది పాకిస్తాన్‌తో కీలక సమరంలో రోహిత్ శర్మ బృందం అమీతుమీ తేల్చుకోనుంది. సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన అనంతరం విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఎంతకాలంగానో అస్థిరంగా ఉన్న మిడిలార్డర్ సమస్యను పరిష్కరించుకునేందుకు, ప్రపంచ కప్ కూర్పుపై అంచనాకు వచ్చేందుకు మన జట్టుకు ఈ టోర్నీ ఓ అవకాశంగా నిలవనుంది. తద్వారా మాజీ కెప్టెన్ ధోని ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలన్న విషయమూ స్పష్టమవుతుంది. రెండు గ్రూపులుగా... టోర్నీలో జట్లను పూల్ ‘ఎ’ (భారత్, పాకిస్తాన్, హాంకాంగ్), పూల్ ‘బి’ (శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్)గా వర్గీకరించారు. తమ గ్రూపుల్లో 1, 2 స్థానాల్లో నిలిచిన జట్లే సూపర్ ఫోర్ దశలో ఆడాల్సి ఉంటుంది. దీని ప్రకారం భారత్, పాక్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఎదురుపడే అవకాశం ఉంది. సంచలనాలేమీ లేకుంటే ఫైనల్లోనూ ఈ రెండు జట్లే అమీతుమీ తేల్చుకునేందుకు బరిలో దిగొచ్చు. బంగ్లాను లంక ఆపగలదా? బంగ్లాదేశ్... కొంతకాలంగా వన్డేలు, టి20ల్లో రాణిస్తూ స్థాయిని పెంచుకుంటోంది. ఇదే సమయంలో శ్రీలంక ఆటతీరు దిగజారింది. ఇటీవలి నిదహాస్ ట్రోఫీలో సొంతగడ్డపైనే లంకకు బంగ్లా షాకిచ్చింది. బ్యాటింగ్‌లో తమీమ్ ఇక్బాల్, ముష్ఫికర్, మహ్మదుల్లా, లిటన్ దాస్, బౌలింగ్‌లో కెప్టెన్ మష్రఫె మొర్తజా, ముస్తాఫిజుర్, రూబెల్ హుస్సేన్‌లతో జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. కీలక ఆల్‌రౌండర్ షకీబ్ హసన్‌కు తోడు, మెహదీ హసన్‌లతో స్పిన్ విభాగమూ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో శనివారం నాటి మ్యాచ్‌లోనూ మాథ్యూస్ సేనకు సవాలు తప్పదు. మరోవైపు లంక చండిమాల్ లేకుండానే బరిలో దిగుతోంది. పేసర్ లసిత్ మలింగ పునరాగమనం ఆశలు రేపుతోంది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్, సీనియర్ ఓపెనర్ తరంగ, డిక్వెలా, కుశాల్ మెండిస్ బ్యాటింగ్‌లో మూలస్తంభాలు. కుశాల్, తిసారా పెరీరా ద్వయం రాణిస్తే గెలుపుపై భరోసా పెట్టుకోవచ్చు. అయితే, కొంత పేస్‌కు సహకరించే దుబాయ్ పిచ్‌లపై బంగ్లా పేస్ త్రయాన్ని ఎదుర్కొనడం క్లిష్టమే. షెడ్యూల్ మార్చకుండానే... భారత్ రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి రావడంతో టోర్నీ షెడ్యూల్‌పై గత నెలలో తీవ్ర విమర్శలు వచ్చాయి. హాంకాంగ్‌తో వన్డే ఆడి... విశ్రాంతి లేకుండా, మరుసటి రోజే పాకిస్తాన్ వంటి ప్రత్యర్థితో తలపడటం సరికాదని వ్యాఖ్యలు వచ్చాయి. అయినా, షెడ్యూల్లో మార్పులేమీ లేకుండానే టోర్నీ ప్రారంభమవుతోంది. ఆసియా కప్ టోర్నీలో 12 సార్లు పోటీపడ్డ టీమిండియా ఆరుసార్లు విజేతగా నిలిచింది. శ్రీలంక ఐదు సార్లు, పాక్ రెండు సార్లు గెలుచుకున్నాయి. -
ఆసియా కప్‌లో హాంకాంగ్
కౌలాలంపూర్: ఆసియా కప్ ప్రధాన టోర్నీలో పాల్గొనే ఆరో జట్టుగా హాంకాంగ్ అర్హత సాధించింది. ఈ నెల 15 నుంచి యూఏఈలో జరిగే ఈ టోర్నీలో గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్లతో హాంకాంగ్ తలపడుతుంది.గురువారం ముగిసిన క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లో హాంకాంగ్ రెండు వికెట్ల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై విజయం సాధించింది. 24 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ అష్ఫాఖ్ అహ్మద్ (51 బంతుల్లో 79; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, ఎజాజ్ ఖాన్‌కు 5, నదీమ్ అహ్మద్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం హాంకాంగ్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయీస్ ప్రకారం 179 పరుగులుగా నిర్దేశించారు. హాంకాంగ్ 23.3 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు చేసి విజయాన్నందుకుంది. నిజాకత్ ఖాన్ (20 బంతుల్లో 38; 6 ఫోర్లు, సిక్స్), కార్టర్ (32 బంతుల్లో 33; ఫోర్, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. హాంకాంగ్ గతంలో 2004, 2008 ఆసియా కప్‌లలో పాల్గొంది. మరోవైపు గ్రూప్ ‘బి’లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లు ఉన్నాయి. -
మూడోసారి ఆసియా కప్ భారత్ సొంతం
-
మూడోసారి ఆసియా కప్ భారత్ సొంతం
ఢాకా : ఆసియా కప్ హాకీ-2017 టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం ఢాకా వేదికగా మలేసియాతో తలపడిన భారత్ హాకి జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయ భేరి మోగించింది. టోర్నీలో గ్రూప్ దశ నుంచి భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఫస్ట్ హాఫ్ మూడో నిమిషంలో రమణ్ దీప్ సింగ్ గోల్ చేయడంతో భారత్ ఖాతా తెరిచింది. అనంతరం 29వ నిమిషంలో లలిత్ ఉపాధ్యాయ్ మరో గోల్‌ను భారత్‌కు అందించారు. మైదానంలో మెరుపులా కదులుతున్న భారత ఆటగాళ్ల నుంచి బంతిని లాక్కునేందుకు మలేసియా స్ట్రైకర్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మలేసియా ఆటగాడు సహ్రిల్ సాబా 50వ నిమిషంలో ఆ జట్టుకు తొలి గోల్ అందించాడు. మిగిలిన సమయంలో మలేసియా ఆటగాళ్లను గోల్ చేయనివ్వకుండా భారత ప్లేయర్లు చేసిన ప్రయత్నాలు సఫలం చెందాయి. దీంతో భారత్ మూడో మారు ఆసియా విజేతగా నిలిచింది. లలిత్ ఉపాధ్యాయ్‌కు గోల్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, ఆకాశ్ దీప్ సింగ్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. -
పాకిస్తాన్‌ను మట్టికరిపించిన భారత్
ఢాకా : ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరింది. సెమీ ఫైనల్లో దయాది పాకిస్తాన్‌ను టోర్నీలో రెండోసారి మట్టికరిపించింది. గ్రూప్ దశను అజేయంగా ముగించిన భారత్ సెమీస్‌లో కూడా అదే జోరును కొనసాగించింది. సూపర్ ఫోర్లో భాగంగా శనివారం జరిగిన పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-0తో విజయ ఢంకా మోగించింది. మ్యాచ్ ఇలా.. ఫస్ట్ హాఫ్‌లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. దీంతో తొలి అర్థభాగంలో రెండు క్వార్టర్లలో ఎవరికీ పాయింట్లు దక్కలేదు. ఈ రెండు క్వార్టర్లలోనూ బంతిని పాకిస్తాన్ క్రీడాకారులు ఎక్కువ సమయం తమ అదుపులో ఉంచుకున్నారు. 39వ నిమిషంలో సత్భీర్‌సింగ్ అద్భుతంగా గోల్ చేసి భారత్‌ను 1-0తో ఆధిక్యంలో నిలిపాడు. దీంతో పాకిస్తాన్ ఆటగాళ్లు తడబడ్డారు. గోల్ చేయాలన్న ఆలోచనలో తప్పులు మీద తప్పులు చేశారు. దీంతో 41వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్ ప్రీత్ గోల్‌గా మలచి భారత్ ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు. మరు నిమిషమే లలిత్ బంతిని గోల్‌పోస్ట్‌లోకి నెట్టి ఇండియాకు మూడో గోల్ అందించాడు. 57వ నిమిషంలో గుర్జంత్‌సింగ్ గోల్ చేసి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. కాగా, ఆసియా కప్ ఫైనల్లో భారత్ మలేసియాతో తలపడనుంది. -
ప్రియ ప్రత్యర్థుల పోరు
స్టార్ స్పోర్ట్స్ 1లో మ. గం. 1.30నుంచి ప్రత్యక్ష ప్రసారం నేడు లంకతో భారత్ ఢీ జోరు మీదున్న ఇరు జట్లు ఆసియా కప్ వన్డే టోర్నీ ప్రపంచ వన్డే చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య జరిగినన్ని మ్యాచ్‌లు (143) మరే జట్ల మధ్య జరగలేదు. ప్రత్యర్థి బలాలు, బలహీనతల గురించి వారు ఆలోచించడం, వ్యూహాలు రచించడం అంటే చర్వితచర్వణమే. అభిమానులు ఎదురు చూసే మ్యాచ్‌ల జాబితాలో ఇది లేకున్నా...ఆసియాలో బలమైన ఈ టీమ్‌ల మధ్య మ్యాచ్‌ను కీలక పోరుగా చెప్పవచ్చు. జోరు మీదున్న విరాట్ కోహ్లి, లంక పేస్ ఆయుధం లసిత్ మలింగల ప్రదర్శన మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వీరిద్దరి మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఫతుల్లా: ఆసియా కప్ టోర్నీలో మొదటి మ్యాచ్‌లో విజయం సాధించి జోరు మీదున్న భారత్, మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. శుక్రవారం ఇక్కడ జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో కోహ్లి సేన, శ్రీలంకను ఎదుర్కొంటుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ సునాయాస విజయం సాధించగా...లంక జట్టు కొంత తడబాటుకు గురైనా పాక్‌ను ఓడించింది. ఆసియా కప్‌లో ఫైనల్‌కు వెళ్లాలంటే లంక, పాక్‌లతో మ్యాచ్‌లు భారత్‌కు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో లంకపై విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఓపెనర్లు నిలబడతారా... ఇటీవల భారత జట్టు సాధించిన విజయాలు, విరాట్ కోహ్లిని వేరు చేసి చూడలేం. అద్వితీయ ఫామ్‌తో అతను జట్టును గెలిపిస్తున్నాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రహానే కూడా చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అయితే కొన్నాళ్ల క్రితం ఆహా, ఓహో...అనిపించిన ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తోంది. అటు జంటగా గానీ, ఇటు వ్యక్తిగతంగా గానీ ఇద్దరూ రాణించలేకపోవడం జట్టును దెబ్బ తీస్తోంది. ఆరంభంలోనే వికెట్ పడిపోవడం, కోహ్లి ఆదుకోవడం నిత్యకృత్యంగా మారింది. ఇద్దరు ఓపెనర్లకు సమయం మించిపోతున్నట్లుగా చెప్పవచ్చు. ఇది ఇలాగే కొనసాగితే వీరిపై వేటు కూడా వేసే అవకాశం ఉంది. మరో వైపు గత మ్యాచ్‌లో రాయుడుకు పెద్దగా ఆడే అవకాశం రాలేదు కాబట్టి అతడినే కొనసాగిస్తే పుజారాకు మళ్లీ నిరాశ తప్పదు. బౌలింగ్‌లో మాత్రం భువనేశ్వర్, షమీ పర్వా లేదనిపించినా...వరుణ్ ఆరోన్ తీవ్రంగా నిరాశ పర్చాడు. అతడిని బంగ్లా బౌలర్లు సునాయాసంగా ఎదుర్కొన్నారు. వరుణ్ స్థానంలో తొలి సారి ఈశ్వర్ పాండేకు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. 2 మరో రెండు వికెట్లు తీస్తే అశ్విన్ వన్డేల్లో 100 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. 1 భారత్, శ్రీలంక మధ్య మొత్తం 143 వన్డేలు జరిగాయి. ఏ రెండు జట్ల మధ్య ఇన్ని మ్యాచ్‌లు జరగలేదు. వీటిలో భారత్ 78 గెలవగా, లంక 53 మ్యాచుల్లో నెగ్గింది. 1 మ్యాచ్ టై కాగా.. 11 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. పిచ్ ఫతుల్లా వికెట్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బ్యాట్స్‌మెన్‌పైనే భారం... మరో వైపు శ్రీలంక తొలి మ్యాచ్‌లో ఒక దశలో ఓటమికి చేరువైనా...మలింగ చలువతో గట్టెక్కింది. దాంతో ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టు కెప్టెన్ మాథ్యూస్ ఈ పేసర్‌నే నమ్ముకున్నాడు. అయితే భారత్‌పై మలింగ రికార్డు చెత్తగా ఉంది. అతని కెరీర్ సగటు 27 కాగా, భారత్‌పై అది 42గా ఉంది! సరిగ్గా రెండేళ్ల క్రితం హోబర్ట్‌లో సెంచరీతో చెలరేగిన విరాట్... మలింగ వేసిన 15 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో ఏకంగా 44 పరుగులు బాదాడు. పైగా గత మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసినా...ఆరంభంలో ప్రభావం చూపలేకపోయాడు. బంగ్లాతో వన్డేలో తిరిమన్నె సెంచరీతో చెలరేగగా, మాథ్యూస్ కూడా ఆకట్టుకున్నాడు. సీనియర్ బ్యాట్స్‌మన్ జయవర్ధనే విఫలమవుతున్నా...మరో సీనియర్ సంగక్కర సూపర్ ఫామ్ జట్టుకు కలిసి రానుంది. గత 10 వన్డేల్లో అతను ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలు చేశాడు. తిసార పెరీరా కూడా ఏ దశలోనైనా దూకుడుగా ఆడగలడు. బౌలింగ్‌లో కొత్త కుర్రాడు డిసిల్వతో పాటు సేననాయకే ఆకట్టుకున్నారు. అయితే మలింగ మినహా ఎవరికీ పెద్దగా అనుభవం లేకపోవడం ఆ జట్టు బలహీనత. కాబట్టి శ్రీలంక బ్యాటింగ్‌లో మెరిస్తేనే ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలదు. పాక్‌పై ఇప్పటికే గెలిచిన లంక ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే ఆ జట్టు ఫైనల్ అవకాశాలు మెరుగు పడతాయి. లంక ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. జట్ల వివరాలు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, రాయుడు, కార్తీక్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఆరోన్/పాండే. శ్రీలంక: మాథ్యూస్ (కెప్టెన్), కుషాల్ పెరీరా, తిరి మన్నె, సంగక్కర, జయవర్ధనే, చండీమల్, తిసార పెరీరా, డిసిల్వ, సేననాయకే, మలింగ, లక్మల్.