
కొలంబొ: కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు టోర్నమెంట్‌లు రద్దయ్యాయి. ఇటీవలే కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో నిర్వహిస్తున్న ఐపీఎల్ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా మరో టోర్నీ చేరింది. శ్రీలంకలో జూన్‌లో జరగాల్సిన ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ రద్దయింది. శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్నందున టోర్నీ నిర్వహించడం అసాధ్యమని శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యాష్లే డిసిల్వా ప్రకటించారు.
రానున్న రెండేళ్లలో చాలా దేశాల క్రికెట్ బోర్డులు షెడ్యూళ్లు సిద్ధం చేసుకున్నందున.. 2023లో వన్డే వరల్డ్ కప్ తర్వాత దీన్ని తదుపరి నిర్వహించాలని డిసిల్వా సూచించారు. వాస్తవానికి ఆసియా కప్ టోర్నీ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉండేది. కానీ భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు లేకపోవడంతో ఈ టోర్నీని శ్రీలంకకు మార్చారు. అయితే తాజాగా అక్కడ కరోనా కేసులు పెరుగుతుండడంతో 10 రోజుల పాటు అంతర్జాతీయ విమానాలను నిషేధిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.
చదవండి: 'పో.. వెళ్లి బౌలింగ్ చేయ్ బ్రో'
Comments
Please login to add a commentAdd a comment