కొలంబొ: క్రికెట్‌లో మిస్టరీ స్పిన్నర్ అనే పదం చాలాసార్లు వింటుంటాం. ఒక స్పిన్ బౌలర్ బంతిని వేర్వేరు తన చేతితో వివిధ యాంగిల్స్‌లో విడుదల చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను కన్‌ఫ్యూజ్ చేయడమే వీరి పని.. అందుకే ఇలాంటి వారిని మిస్టరీ స్పిన్నర్స్ అంటారు. అజంతా మెండిస్, సునీల్ నరైన్, సయీద్ అజ్మల్.. తాజగా వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్లుగా గుర్తింపు పొందారు. అన్‌ఆర్థడాక్స్ బౌలింగ్ వేరియేషన్‌తో క్యారమ్ బాల్, ఆఫ్ బ్రేక్ బంతులను వేస్తూ బ్యాట్స్‌మన్లను ముప్పతిప్పలు పెడుతుంటారు. మెండిస్(శ్రీలంక), నరైన్(వెస్టిండీస్) లాంటి ఆటగాళ్లు తమ బౌలింగ్‌తో రెండు మూడేళ్ల పాటు వారి జట్టులో కీలకపాత్ర పోషించారు. తాజాగా మెండిస్ తరహాలోనే శ్రీలంకకు మరో మిస్టరీ స్పిన్నర్ పుట్టుకొచ్చాడు. అతనే మహీష్ తీక్షణ.
చదవండి: బీసీసీఐదే తప్పు.. ధోనిని మెంటార్ చేయడం నిరాశపరిచింది
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే ద్వారా శ్రీలంక తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేసిన తీక్షణ తన మిస్టరీ బౌలింగ్‌తో 37 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. మ్యాచ్‌లో ఎక్కువగా క్యారమ్ బాల్స్, ఆఫ్ బ్రేక్ బంతులతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన తీక్షణ ఫలితాన్ని రాబట్టాడు. ఈ నేపథ్యంలో తీక్షణ బౌలింగ్ వేరియేషన్స్‌పై ఇంప్రెస్ అయిన ఒక అభిమాని అతని బౌలింగ్ యాక్షన్‌ను ట్విటర్‌లో షేర్ చేశాడు.
''తీక్షణ బౌలింగ్ చూస్తుంటే అతని చేతిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఒక క్యారమ్ బాల్ వేయడానికి మణికట్టును విభిన్న శైలిలో చూపించాడు. మన కాళ్లను ఎలా షేక్ చేస్తామో.. తీక్షణ తన చేతులను అలా చేస్తున్నాడు. అతని బౌలింగ్‌కు బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడడం ఖాయం'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇది చూసిన శ్రీలంక ప్రధాన కోచ్ మికీ ఆర్థర్ అభిమానికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ''నీ అనాలిసిస్‌కు కృతజ్ఞతలు.. ముందు మాకు వరల్డ్ కప్ ఉంది.. దయచేసి ప్రతీ విషయాన్ని భూతద్ధంలో చూడడం ఆపండి'' అంటూ కామెంట్ చేశాడు.
చదవండి: SL Vs SA: త్రో దెబ్బకు రనౌట్.. స్టంప్ మైక్ ఊడి వచ్చింది
కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన మహీష్ తీక్షణ శ్రీలంక టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు. అయితే లంక మొదట క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 17న నుంచి ఒమన్ వేదికగా జరగనున్న క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో పాల్గొననుంది.
Comments
Please login to add a commentAdd a comment