Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో హ్యారీ బ్రూక్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో తొలి సెంచరీ నమోదు చేయడంతో పాటు డెబ్యూ ఐపీఎల్ ఆడుతున్న బ్రూక్‌కు ఇదే తొలి సెంచరీ. 55 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీ మార్క్ అందుకున్న హ్యారీ బ్రూక్ ఆటపై అన్నివైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
సెంచరీ మాట అటుంచితే ఒక్క విషయంలో మాత్రం బ్రూక్ వెనుకబడ్డాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో స్పిన్ ఆడడంలో తెగ ఇబ్బంది పడ్డాడు. పేస్ బౌలర్లను ఉతికారేసిన బ్రూక్ స్పిన్నర్ల బౌలింగ్‌లో మాత్రం కాస్త స్లోగా ఆడాడు. పేసర్ల బౌలింగ్‌లో అతని స్ట్రైక్‌రేట్ 258 ఉంటే.. స్పిన్నర్ల బౌలింగ్‌లో అతని స్ట్రైక్‌రేట్ 117గా ఉండడం గమనార్హం. ఒకవేళ వచ్చే మ్యాచ్‌ల్లో బ్రూక్ స్పిన్ ఆడడంపై దృష్టి పెడితే అతనికి తిరుగుండదు. ఎలాగూ పేసర్ల బౌలింగ్‌ను చీల్చిచెండాడుతున్నాడు.
ఇక హ్యారీ బ్రూక్‌కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. టెస్టు మ్యాచ్‌ల్లో మంచి రికార్డు ఉన్నప్పటికి ఒక్కసారి కుదురుకున్నాడంటే ఔట్ చేయడం చాలా కష్టం. పరిస్థితులు అలవాటు పడేవరకు ఏ క్రికెటర్‌కైనా పరుగులు చేయడం కాస్త ఇబ్బందే. హ్యారీ బ్రూక్ ఆ ఫేజ్‌ను అనుభవించాడు. ప్రస్తుతం దాని నుంచి బయటపడ్డాడు. ఫలితం.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో మెరిసి విమర్శకుల నోళ్లు మూయించాడు.
చదవండి: 'గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే ఇక్కడుంది.. అందరూ వెళ్లిపోయారు'
Comments
Please login to add a commentAdd a comment