Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ రెండో విజయాన్నినమోదు చేసింది. శుక్రవారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 20 పరుగుల తేడాతో గెలిచింది. అయితే మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ గెలిచినప్పటికి చాలా లోపాలు ఉన్నాయి. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో బౌలింగ్ సంగతి పక్కనబెడితే ఎస్‌ఆర్‌హెచ్ ఫీల్డింగ్ మాత్రం దారుణంగా ఉందని చెప్పొచ్చు.
సులువైన క్యాచ్‌లు వదిలేయడంతో పాటు రనౌట్ చాన్స్‌లు కూడా మిస్ చేశారు. కేకేఆర్ ముందు 229 పరుగులు కష్టసాధ్యమైన లక్ష్యం ఉంది కాబట్టే ఎస్‌ఆర్‌హెచ్ గెలిచింది అనుకోవచ్చు. అటు ఇటుగా టార్గెట్ 200 ఉండుంటే మాత్రం ఎస్‌ఆర్‌హెచ్ కచ్చితంగా ఓడిపోయి ఉండేది. రానున్న మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్, బౌలింగ్ లాంటి అంశాల్లో మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది.
ఇక హ్యారీ బ్రూక్ సీజన్‌లో తొలి సెంచరీ నమోదు చేయడం.. కెప్టెన్ మార్క్రమ్ హఫ్ సెంచరీ చేయడం.. అభిషేక్ శర్మ మంచి స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం చూస్తుంటే ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్‌కు తిరుగుండదనిపిస్తుంది. మయాంక్ అగర్వాల్ గాడిలో పడితే ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనఫ్ మరింత పటిష్టంగా తయారవుతుంది. ఇదే జోష్‌ను వచ్చే మ్యాచ్‌ల్లోనూ కంటిన్యూ చూస్తే ఎస్‌ఆర్‌హెచ్ టైటిల్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Comments
Please login to add a commentAdd a comment