![Captain Markram Submits Wrong Teamsheet SRH Debutant Denied Chance - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/14/Aiden.jpg.webp?itok=Y5AinEY_)
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసినట్లే. శనివారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 182 పరుగుల భారీ స్కోరు చేసి కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. అభిషేక్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ ఎస్‌ఆర్‌హెచ్‌ను ముంచగా.. మిగతా బౌలర్లు కూడా అంతగా రాణించలేకపోయారు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ భారీ ఓటమిని మూటగట్టుకుంది.
అయితే మ్యాచ్‌కు ముందు మార్క్రమ్ చేసిన తప్పిదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతీ మ్యాచ్‌కు ముందు ఇచ్చే తుది జట్టు షీట్‌ను మార్క్రమ్ తప్పుగా ఇచ్చాడు. టాస్ సమయంలో చెప్పిన ఆటగాడి పేరు తుది జట్టులో లేకపోగా.. కనీసం సబ్‌స్టిట్యూట్‌గా కూడా లేకపోవడం గమనార్హం.
విషయంలోకి వెళితే.. వాస్తవానికి లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్ ద్వారా యంగ్ బౌలర్ సన్విర్ సింగ్ అరంగేట్రం చేయాల్సింది. మార్క్రమ్ కూడా టాస్ సమయంలో సన్విర్ సింగ్ ఐపీఎల్‌తో పాటు ఎస్‌ఆర్‌హెచ్ తరపున డెబ్యూ చేయనున్నట్లు పేర్కొన్నాడు. కానీ సన్వర్ సింగ్ పేరు ఆ తర్వాత తుది జట్టులో కనిపించలేదు. పొరపాటున అలా జరిగి ఉంటుందిలే అనుకుంటే.. అసలు ఫీల్డింగ్.. బ్యాటింగ్ ఇలా రెండు సమయాల్లోనూ అతను కనిపించలేదు. ఇక వివ్రాంత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు.
మాజీ క్రికెటర్.. ప్రస్తుతం ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా పనిచేస్తున్న స్కాట్ స్టైరిస్ ఈ తప్పిదాన్ని గుర్తించాడు. మార్క్రమ్ ఇచ్చిన తప్పుడు షీట్‌ను కెమెరా ముందు పెట్టాడు. ఆ షీట్‌లో సన్వర్ సింగ్ పేరు క్రాస్ చేసి నటరాజన్ పేరును పెట్టారు. ''ఒక ఆటగాడికి అరంగేట్రం అని చెప్పి ఇప్పుడు అతని పేరు కనిపించకపోవడం అనేది తప్పు. మ్యాచ్ అరంగేట్రం చేస్తున్నానన్న సంతోషం కాసేపు కూడా లేకుండా చేశారు. దీనికి మార్క్రమ్ బాధ్యత వహించాలి.'' అని పేర్కొన్నాడు.
మరో విశేషమేమిటంటే.. సన్వర్ సింగ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్ క్యాప్ అందుకున్నాడు. కానీ తుదిజట్టు సహా ఇంపాక్ట్ ప్లేయర్లలో ఎక్కడా అతని పేరు కనిపించలేదు. అయితే ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ సమయంలో నటరాజన్‌ను సన్వర్ సింగ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపించినట్లు తెలిసింది. అయితే గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సన్వర్ సింగ్ ఎస్‌ఆర్‌హెచ్ తరపున అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
These Clowns had submitted wrong teamsheet lmao 😭 pic.twitter.com/sti6OnBX2r
— . (@manisayzz) May 14, 2023
Comments
Please login to add a commentAdd a comment