Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ వైఫల్యం కొనసాగుతుంది. సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన ఎస్‌ఆర్‌హెచ్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే రోజురోజుకు ఎస్‌ఆర్‌హెచ్ ఆట దిగజారిపోతుంది. ఈ సీజన్‌లో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న జట్లను ఎస్‌ఆర్‌హెచ్ ఓడించలేదంటే ఒక అర్థం ఉంది.
కానీ సీజన్‌లో వరుసగా ఐదు ఓటములు చవిచూసి ఆఖరిస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో చేతిలోనే పరాభవం ఎదుర్కోవడం ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులను ఆశ్చర్యం కలిగించింది. వాస్తవానికి మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కంటే ఎస్‌ఆర్‌హెచ్ ఫెవరెట్‌గా కనిపించింది. ముందు బౌలింగ్ చేసి ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంతో అరె ఎస్‌ఆర్‌హెచ్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటుందిలే అని అంతా అనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన 145 పరుగుల సాధారణ లక్ష్యాన్ని అందుకోవడానికి ఎస్‌ఆర్‌హెచ్ కిందామీదా పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసి ఏడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. వాషింగ్టన్ సుందర్ ఆఖరి వరకు క్రీజులో ఉన్నప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి.. బ్యాటింగ్‌లో 15 బంతుల్లో 24 పరుగులతో రాణించి ఫామ్‌లోకి వచ్చాడంటూ ఊదరగొట్టినా ఉపయోగం లేకుండా పోయింది.
నిజానికి సీఎస్‌కేతో మ్యాచ్ సందర్భంగానే తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ అష్టకష్టాలు పడింది. అదే చెత్త బ్యాటింగ్‌ను సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై ప్రదర్శించింది. ధాటిగా ఆడిన హెన్రిచ్ క్లాసెన్‌ను మార్క్రమ్ కంటే ముందే పంపించి ఉంటే ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. ఒక రకంగా చేజేతులా ఎస్‌ఆర్‌హెచ్ ఓటమిని కొనితెచ్చుకుంది.
ఈ ఓటమిని జీర్ణించుకోలేని ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపించారు. ముఖ్యంగా ''ఎస్‌ఆర్‌హెచ్‌ను బ్యాన్ చేయండి'' అనేది ఎక్కువగా కనిపించింది.. ''ఇంత దారుణమా.. ఆఖరికి ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో కూడా ఓడారు'' అంటూ కామెంట్ చేశారు.
చదవండి: 'వార్నర్‌ను పక్కన పెట్టి అతడికి ఢిల్లీ కెప్టెన్సీ ఇవ్వండి'
Comments
Please login to add a commentAdd a comment