Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఏది కలిసిరాలేదు. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ కారణంగా టోర్నీ మొత్తానికే దూరమవడం ఢిల్లీని దారుణంగా దెబ్బకొట్టింది. ఒకవేళ పంత్ ఐపీఎల్ 16వ సీజన్ ఆడి ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి వేరుగా ఉండేదేమో.
Photo: IPL Twitter
మూడేళ్ల క్రితం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒక సంచలనం. పేరు మార్చుకున్న అనంతరం 2020లో ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆ తర్వాత 2021, 2022 సీజన్లలోనూ కనీసం ప్లేఆఫ్‌కు చేరుకుంది. అలాంటి ఢిల్లీ ఈ సీజన్‌లో ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగిన తొలి జట్టుగా నిలవడం ఆశ్చర్యపరిచింది. జట్టు మెంటార్‌గా వచ్చిన సౌరవ్ గంగూలీకి ఇది చేదు అనుభవం.
Photo: IPL Twitter
ఇక ఎస్‌ఆర్‌హెచ్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లిన వార్నర్ పంత్ గైర్హాజరీలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. కానీ జట్టును నడిపించడంలో మాత్రం విఫలమయ్యాడు. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే వార్నర్ నుంచి మంచి ప్రదర్శనే వచ్చినప్పటికి కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు.
ఎస్‌ఆర్‌హెచ్‌ను చాంపియన్‌గా నిలిపిన వార్నర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను కూడా అలాగే విజేతగా నిలుపుతాడేమోనని అంతా భావించారు. కానీ వార్నర్‌కు జట్టులో సహకరించేవారే కరువయ్యారు. వార్నర్, అక్షర్ పటేల్‌లు స్థిరంగా రాణించినప్పటికి మిగతావారి వైఫల్యం ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచింది. కెప్టెన్‌గా వార్నర్‌కు ఇది చేదు అనుభవం అని చెప్పొచ్చు.
Photo: IPL Twitter
ఎలాగూ సీజన్‌లో ప్లేఆఫ్ చేరడంలో విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే ఏడాది ఐపీఎల్‌లకు పంత్ సారధ్యంలో నూతనోత్సాహంతో సిద్దమవ్వాలని కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment