Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఓటమిని కొనితెచ్చుకుంది. ఒక దశలో వికెట్ నష్టపోకుండా 112 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ ఈజీగా మ్యాచ్ గెలిచేస్తుందని అంతా భావించారు. అందుకు తగ్గట్లుగానే మిచెల్ మార్ష్, ఫిలిప్ సాల్ట్‌ల ఇన్నింగ్స్ కొనసాగింది.
స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ కావడం ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచింది. వీరి తర్వాత వచ్చిన ఏ ఆటగాడు కూడా కనీసం క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఫామ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌ను ఏడో స్థానంలో బ్యాటింగ్ పంపండం కూడా ఢిల్లీ ఓటమికి మరో కారణం. సాల్ట్ ఔటైన తర్వాత అక్షర్ పటేల్‌కు బ్యాటింగ్ ప్రమోషన్ ఇచ్చి నాలుగో స్థానంలో పంపి ఉంటే పరిస్థితి కచ్చితంగా వేరుగా ఉండేదే.
ఎందుకంటే ఆఖరిదశలోనూ అక్షర్ పటేల్ వేగంగా ఆడేందుకే ప్రయత్నించాడు. 14 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 29 పరుగులు చేసిన అక్షర్‌పటేల్ క్రీజులోకి వచ్చేసరికి ఓవర్లు తక్కువగా ఉన్నాయి. దీంతో అతను కూడా ఏం చేయలేకపోయాడు. ఒక రకంగా ఇది కెప్టెన్ వార్నర్ తప్పు.
ఫామ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌ను కాదని మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్‌లను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపించడం ఏంటో ఎవరికి అర్థం కాలేదు. ఈ సీజన్‌లో అక్షర్ పటేల్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 211 పరుగులు చేసిన అక్షర్ ఖాతాలో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇక బౌలింగ్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment