Photo: IPL Twitter
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో మరో అరుదైన రికార్డు అందుకున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణ ఆటతీరుతో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. అయితే వార్నర్‌కు బ్యాటింగ్ పరంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా నిలకడైన ప్రదర్శన కనబరిచాడు.
ఈ సీజన్‌లో కాస్త స్లోగా ఆడినప్పటికి 13 మ్యాచ్‌ల్లో 430 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో ఐదు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ చరిత్రలో 400 ప్లస్ పరుగుల మార్క్‌ను దాటడం వార్నర్‌కు ఇది తొమ్మిదోసారి కావడం విశేషం. ఈ ఘనతను సాధించిన నాలుగో ఆటగాడిగా వార్నర్ నిలిచాడు. ఇంతకముందు సురేశ్ రైనా, శిఖర్ ధావన్, కోహ్లిలు తొమ్మిది ఐపీఎల్ సీజన్లలో 400 ప్లస్ పరుగులు మార్క్‌ను అందుకోగా.. తాజాగా వార్నర్ వీరి సరసన చేరాడు.
Despite having a challenging season, Warner still reached the 400-run mark this session. He joined the list of Suresh Raina, Shikhar Dhawan, and Virat Kohli, becoming just the fourth hitter to do so for the ninth season. #DCvsPBKS pic.twitter.com/FcXcOrjcmf
— Vipin Tiwari (@vipintiwari952) May 17, 2023
Most 400+ runs in an IPL season:
— Johns. (@CricCrazyJohns) May 17, 2023
1) Raina - 9
2) Dhawan - 9
3) Kohli - 9
4) Warner - 9* pic.twitter.com/VK3v7CkobR
Comments
Please login to add a commentAdd a comment