ఐపీఎల్ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసిన సంగతి తెలిసిందే. శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే కెప్టెన్ డేవిడ్ వార్నర్ 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికి అతను స్లోగా ఆడడమే జట్టు ఓటమికి కారణమని కొందరు మాజీలు విమర్శలు వ్యక్తం చేశారు.ఈ విషయంలో భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఓ అడుగు ముందుకు వెళ్లి మరి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ విధంగా ఆడేటట్లయితే ఐపీఎల్‌కు రావాల్సిన అవసరం లేదని విమర్శించాడు.
"నేను చెప్పే మాటలు ఇప్పుడు వార్నర్‌ను హర్ట్ చేయవచ్చు. డేవిడ్ నువ్వు వింటున్నావుకుంటున్నా. దయచేసి బాగా ఆడు. 25 బంతుల్లో 50 పరుగులు ఎలా చేయాలో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను చూసి నేర్చుకో. అతడు 25 బంతుల్లోనే అర్ధశతకం చేశాడు. ఒకవేళ నీకు సాధ్యం కాకపోతే ఐపీఎల్‌కు వచ్చి నువ్వు ఆడాల్సిన అవసరం లేదు.
డేవిడ్ నువ్వు 55-60 పరుగులు చేసే బదులు 30 పరుగులలోపు ఔటైనా జట్టుకు పెద్దగా ఉండదు. బహుశా ఇంకా మెరుగ్గా ఆడి ఉండేది. త్వరగా ఔటవ్వడం వల్ల రోవ్‌మన్ పోవెల్, ఇషాన్ పోరెల్ లాంటి ఆటగాళ్లు అవకాశముండేది. వారు వచ్చే సమయానికి బంతులు మిగిలి లేవు. ఆ ప్లేయర్లు జట్టులో పెద్ద హిట్టర్లు." అని సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇక మ్యాచ్‌లో 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 142 పరుగులే చేయగలిగింది. ఫలితంగా రాజస్థాన్ 57 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ డేవిడ్ వార్నర్(65) అర్ధ శతకంతో ఆకట్టుకున్నప్పటికీ తన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. రాజస్థాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ చెరో 3 వికెట్లతో ఆకట్టుకోగా.. అశ్విన్ 2 వికెట్లతో రాణించాడు.
చదవండి: ధోని విలువైన పాఠాలు.. తర్వాతి మ్యాచ్ నుంచి బాదుడేనా!
Comments
Please login to add a commentAdd a comment