Photo: IPL Twitter
ఐపీఎల్ చరిత్రలో ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తొలి ఓవర్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ తొలి స్థానంలో నిలిచాడు. భువీ తాను వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో ఇప్పటివరకు 24 వికెట్లు పడగొట్టాడు.
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌ను డకౌట్ చేయడం ద్వారా భువీ ఈ ఫీట్ సాధించాడు. భువనేశ్వర్ తర్వాత ట్రెంట్ బౌల్ట్(21 వికెట్లు) రెండో స్థానంలో, ప్రవీణ్ కుమార్ 15 వికెట్లతో మూడో స్థానంలో, సందీప్ శర్మ 13 వికెట్లతో నాలుగో స్థానంలో, 12 వికెట్లతో జహీర్ ఖాన్ ఐదో స్థానంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 53 పరుగులు నాటౌట్ తొలి అర్థసెంచరీతో మెరవగా.. అభిషేక్ శర్మ 36 బంతుల్లో 67 పరుగులతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.
Comments
Please login to add a commentAdd a comment