ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ మూడో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఢిల్లీ క్యాపటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 9 పరుగుల తేడాతో విజయం అందుకుంది. 198 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
మిచెల్ మార్ష్ 63, ఫిల్ సాల్ట్ 59 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికి మిగతావారు విఫలం కావడంతో ఢిల్లీ చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో మయాంక్ మార్కండే రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, భువనేశ్వర్, అభిషేక్ శర్మ, అకిల్ హొసెన్‌లు తలా ఒక వికెట్ తీశారు.
18 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 163/6
18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.. అక్షర్ పటేల్ 14, రిపల్ పటేల్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మిచెల్ మార్ష్(63) ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు 125/4గా ఉంది
మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
198 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన మనీష్ పాండే అత్యంత పేలవంగా స్టంపౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీ మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
దంచుతున్న మార్ష్, పిలిప్ సాల్ట్.. ఢిల్లీ 97/1
ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దాటిగా ఆడుతుంది. 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. మార్ష్ 47, పిలిప్ సాల్ట్ 49 పరుగులతో ఆడుతున్నారు.
ఆరు ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 57/1
198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. పిలిప్ సాల్ట్ 36, మిచెల్ మార్ష్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Photo Credit : IPL Website
క్లాసెన్, అభిషేక్ శర్మ మెరుపులు.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 198
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ భారీస్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 53 పరుగులు నాటౌట్ తొలి అర్థసెంచరీతో మెరవగా.. అభిషేక్ శర్మ 36 బంతుల్లో 67 పరుగులతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.
17 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 162/6
17 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 28 పరుగులు చేసిన అబ్దుల్ సమద్ మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో కీపర్ పిలిప్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
13 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 120/5
13 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ ఐదు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ 8, క్లాసెన్ 17 పరుగులతో ఆడుతున్నారు.
Photo Credit : IPL Website
11 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 107/4
11 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ నాలుగు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 66, క్లాసెన్ 12 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు మార్క్రమ్ 8 పరుగులు వద్ద ఔట్ కాగా.. హ్యారీ బ్రూక్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
Photo Credit : IPL Website
అభిషేక్ శర్మ ఫిఫ్టీ.. ఎస్‌ఆర్‌హెచ్ 83/2
ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు. సిక్సర్‌తో ఫిఫ్టీ మార్క్ అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ రెండు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. అభిషేక్ 57, మార్క్రమ్ 8 పరుగులతో ఆడుతున్నారు.
ఆరు ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 62/2
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఆరు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 43, మార్క్రమ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Photo Credit : IPL Website
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా శనివారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్‌ఆర్‌హెచ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్‌కీపర్), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, అకేల్ హోసేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్
Meanwhile, in Delhi, @SunRisers win the toss & elect to bat first!
Who will come out victorious in the capital? 💬👇#DCvSRH #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/Jwsvh30otU
— JioCinema (@JioCinema) April 29, 2023
వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఎస్‌ఆర్‌హెచ్ ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి గాడిలో పడుతుందేమో చూడాలి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మూడో విజయంపై కన్నేసింది.
Comments
Please login to add a commentAdd a comment