IPL 2023, SRH Vs KKR: Harry Brook Continues Failure In Batting, Fans Say Better Sit Dug Out - Sakshi
Sakshi News home page

#HarryBrook: ఏ స్థానంలో వచ్చినా అంతే.. విసుగెత్తిస్తున్నాడు!

Published Thu, May 4 2023 11:05 PM | Last Updated on Fri, May 5 2023 8:24 AM

Harry Brook Batting Failure Continues-Fans Says Better Sit-Dug-out - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ వైఫల్యం కొనసాగుతుంది. 13.25 కోట్లు పెట్టినందుకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే సెంచరీతో చెలరేగిన బ్రూక్‌ ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఓపెనర్‌ నుంచి ఐదో స్థానం వరకు బ్యాటింగ్‌ వచ్చినా అదే దారుణ ఆటతీరు కనబరుస్తున్నాడు. 

తాజాగా గురువారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్‌ నాలుగో స్థానంలో వచ్చి డకౌట్‌ అయ్యాడు. అయితే ఇదే కేకేఆర్‌పై ఈ సీజన్‌లో సెంచరీ మార్క్‌ అందుకున్న బ్రూక్‌ ఈసారి మాత్రం పేలవంగా ఔట్‌ అయ్యాడు. స్పిన్‌ ఆడడంలో తన బలహీనతను మరోసారి బయటపెట్టాడు. అనుకుల్‌ రాయ్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు మరోసారి దొరికిపోయాడు.

అనుకుల్‌ ఫుల్‌లెం‍గ్త్‌ డెలివరీ వేయగా.. బ్రూక్‌ అడ్డుకునే ప్రయత్నంలో ప్యాడ్లకు తాకింది. దీంతో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో సెంచరీ మినహా బ్రూక్‌ మిగతా 8 మ్యాచ్‌లు కలిపి 79 బంతులు ఎదుర్కొని 63 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. బ్రూక్‌ ఆటతీరుపై అభిమానులు మరోసారి ట్రోలింగ్‌కు దిగారు. ''ఏ స్థానంలో వచ్చినా అదే ఆటతీరు.. విసుగెత్తిస్తున్నాడు''.. ''ఆడించింది చాలు.. బెంచ్‌కు పరిమితం చేయడం మేలనుకుంటా'' అని కామెంట్‌ చేశారు.

చదవండి: డెత్‌ ఓవర్లలో 'కింగ్‌' అనిపించుకుంటున్న రింకూ సింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement