Batting failure
-
కెప్టెన్ అయ్యుండి బాధ్యతగా ఆడాల్సిన పని లేదా!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లోనూ అంతగా ఆకట్టుకోని హిట్‌మ్యాన్ తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ అదే చెత్త బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో 15 పరుగులు చేసిన రోహిత్ పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే ఇన్నింగ్స్‌ను కాస్త పాజిటివ్‌గానే ఆరంభించిన రోహిత్ అదే టెంపోను కంటిన్యూ చేయలేకపోయాడు. ఇక ఐసీసీ నాకౌట్స్‌లోనూ రోహిత్‌కు మంచి రికార్డు లేదు. ఇప్పటివరకు 12 సందర్భాల్లో ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ రెండు సెంచరీలు మినహా మిగతా 10సార్లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. కాగా రోహిత్ శర్మ పేలవ ఫామ్‌పై అభిమానులు మండిపడ్డారు. ''ఒక కెప్టెన్ అయ్యుండి బాధ్యతగా ఆడాల్సిన పని లేదా.. ఐసీసీ టైటిల్ కొట్టే చాన్స్ వచ్చింది.. సద్వినియోగం చేసుకోవాలి కాని చెడగొట్టొద్దు.. కెప్టెన్‌గా విఫలమయ్యావు.. ఫీల్డింగ్ చేయలేవు.. బ్యాటింగ్ చేయలేవు.. ఇంకెందుకు ఆడడం దండగ'' అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: సిరాజ్ అరుదైన ఘనత.. స్వదేశం కంటే విదేశాల్లోనే అదుర్స్ -
'ఆడడమే వ్యర్థమనుకుంటే బ్యాటింగ్‌లో ప్రమోషన్'
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఐదు పరుగులు మాత్రమే చేసి బెహండార్ఫ్ బౌలింగ్‌లో కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన హుడా 6.9 సగటుతో కేవలం 69 పరుగులు మాత్రమే చేశాడు. ఇలా ఫామ్‌లో లేని ఆటగాడు అసలు జట్టులో ఆడడమే వ్యర్థం. అలాంటిది కైల్ మేయర్స్ లాంటి స్టార్ ఓపెనర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేసి అతని స్థానంలో దీపక్ హుడాకు ఓపెనర్‌గా ప్రమోషన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్. అసలు కృనాల్ పాండ్యా ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నాడనేది అంతుచిక్కని ప్రశ్నలా మారింది. వాస్తవానికి కైల్ మేయర్స్ ఈ సీజన్లో మంచి బ్యాటింగ్ కనబరుస్తున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 361 పరుగులు చేసిన మేయర్స్ ఖాతాలో నాలుగు అర్థసెంచరీలు ఉన్నాయి. మేయర్స్ జోరుతో డికాక్ తుదిజట్టులోకి రాలేకపోయాడు. అయితే కేఎల్ రాహుల్ గాయంతో దూరమవ్వడంతో డికాక్‌కు అవకాశం వచ్చింది. ఇద్దరు కలిసి లక్నోకు రెండు మ్యాచ్‌ల్లో మంచి శుభారంబాలు అందించారు.ప్లేఆఫ్ కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మేయర్స్‌ను పక్కనబెట్టడం ఏంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అతనికి గాయం అనుకున్నా.. మరి కృనాల్ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేయడమేంటని వాపోయారు. ఈ నేపథ్యంలో పలు చెత్త రికార్డులు మూట గట్టుకున్నాడు. ఐపీఎల్లో 10 కంటే ఎక్కువ ఇన్నింగ్స్‌లు ఆడి అత్యంత చెత్త బ్యాటింగ్ యావరేజ్ మూటగట్టుకున్న ఆటగాడిగా హుడా నిలిచాడు. హుడా ఈ సీజన్లో 11 ఇన్నింగ్స్‌ల్లో 6.90 సగటు నమోదు చేశాడు. హుడా తర్వాత నికోలస్ పూరన్ 2021లో 7.73, 2016లో మళ్లీ దీపక్ హుడా 10.29, 2021లో ఇయాన్ మోర్గాన్ 11.08 సగటు నమోదు చేశారు. ఇక ఐపీఎల్లో దీపక్ హుడా తను ఎదుర్కొన్న తొలి 10 బంతుల వ్యవధిలో ఓటవ్వడం ఇది ఏడోసారి.. ఈ క్రమంలో సాహాతో కలిసి తొలి స్థానంలో ఉన్నాడు. ఆండ్రీ రసెల్, రోహిత్ శర్మ, సునీల్ నరైన్‌లు ఆరేసి సార్లు ఔటయ్యారు. Two in two for Behrendorff 🔥 Deepak Hooda fails yet again!#LSGvMI #IPL2023 #LucknowSuperGiants pic.twitter.com/8bkggkEvTK — OneCricket (@OneCricketApp) May 16, 2023 Ireland basher Deepak hooda in IPL 2023 Inning - 11 Run - 69 Average - 6 🤢 Strike rate - 89 🤧 this fraud played ahead of Shreyas Iyer in T20 worldcup 😶 pic.twitter.com/JjZ8ONzaMD — , (@AltofLeg) May 16, 2023 చదవండి: గుజరాత్ గెలిచినా.. నెహ్రాలో కనిపించని సంతోషం -
గుజరాత్ గెలిచినా.. నెహ్రాలో కనిపించని సంతోషం
గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా సోమవారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో జట్టు బ్యాటింగ్ ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో గిల్ సెంచరీ చేసినప్పటికి.. గుజరాత్ గెలిచినప్పటికి నెహ్రా మొహంలో మాత్రం సంతోషం కనిపించలేదు. అందుకు కారణం గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఆఖర్లో కుప్పకూలడమేనంట. తొలి ఇన్నింగ్స్ అనంతరం కెప్టెన్ పాండ్యాతో ఆశిష్ నెహ్రా డగౌట్లో నిలబడి సీరియస్‌గా చర్చించడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సాహా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్-సాయికిషోర్‌లు వేగంగా ఆడుతూ రెండో వికెట్‌కు 14 ఓవర్లలోనే 147 పరుగులు జోడించారు. వీరి దూకుడు చూసి గుజరాత్ స్కోరు ఈజీగా 220-240 మధ్య ఉంటుందని భావించారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. సెంచరీ కోసం గిల్ మెళ్లగా ఆడడం.. అదే సమయంలో చివరి ఆరు ఓవర్లలో కేవలం 41 పరుగులు మాత్రమే చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. అందులో నాలుగు వికెట్లు చివరి ఓవర్లో పోగొట్టుకోవడం గుజరాత్ బ్యాటింగ్ వీక్నెస్ను బయటపెట్టింది. ఇదే నెహ్రా కోపానికి కారణమయింది. గిల్ 58 బంతుల్లో సెంచరీ మార్క్ చేసి ఐపీఎల్లో తొలి సెంచరీ సాధించినప్పటికి నెహ్రా అభినందించకపోవడం కెమెరాలకు చిక్కింది. అంతేకాదు సాయికిషోర్, పాండ్యాలు ఔటయ్యాకా గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంపై నెహ్రా సీరియస్ అయ్యాడు. బ్యాటింగ్ విఫలంపై పాండ్యాతో చాలాసేపు చర్చించాడు. ఎందుకంటే నెహ్రా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకున్నాడు. ప్లేఆఫ్ చేరే క్రమంలో ప్రతీ మ్యాచ్ ముఖ్యం.. అందునా ఎస్ఆర్హెచ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు కాబట్టే నెహ్రా అంత ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన గుజరాత్ టైటాన్స్ సీజన్లో ప్లేఆఫ్‌లో అడుగుపెట్టింది. అయితే ఇలాంటి బ్యాటింగ్‌తో టైటిల్ కొట్టలేమని పాండ్యాతో నెహ్రా అన్నట్లు తెలిసింది. అయితే పాండ్యా కూడా తమ బ్యాటింగ్ ఫెయిల్యూర్‌పై దృష్టి పెడుతామని నెహ్రాకు వివరించినట్లు తెలుస్తోంది. pic.twitter.com/huFccqaJzy — ChhalRaheHainMujhe (@ChhalRahaHuMain) May 16, 2023 చదవండి: 'చెప్పి మరి సిక్సర్ కొట్టడం సంతోషంగా అనిపించింది' -
'మా కెప్టెన్ బ్యాటింగ్ విఫలం వెనుక సీక్రెట్ అదే!'
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ విజయాల బాటలో ఉన్నప్పటికి ఒక అంశం మాత్రం కలవరపరుస్తోంది. అదే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్. ఈ సీజన్లో రోహిత్ తన మార్క్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ 11 మ్యాచ్ లు ఆడిన రోహిత్.. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ ముంబై గెలిచినా.. రోహిత్ 7 పరుగులే చేశాడు. దీనికి తోడు గత ఐదు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఐదు ఓటములతో 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక రోహిత్ ఫామ్‌పై ముంబై బ్యాటర్ ఇషాన్ కిషన్ స్పందించాడు. హర్భజన్, సునీల్ గావస్కర్‌లతో జరిగిన సంభాషణలో.. మా కెప్టెన్ ప్లేఆఫ్స్ కోసం పరుగులు దాచిపెట్టాడని అందుకే ఆడడం లేదని పేర్కొన్నాడు. ఫామ్ లో లేని రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ లో ఎలా ఉంటున్నాడు? అతని ఆలోచనలు ఏంటి అని ఇషాన్‌ను అడిగారు. దీనిపై ఇషాన్ స్పందిస్తూ.. "తన ఫామ్‌పై కెప్టెన్ రోహిత్ కంగారు పడటం లేదు. ప్రాక్టీస్ సెషన్స్‌లో తన ప్రాసెస్ పై అతడు దృష్టిపెడుతున్నాడు. కానీ ఈ ఆటలో పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా ఇబ్బంది పడటం చూశాం. కానీ నాకు తెలిసి అతడు ప్లేఆఫ్స్ కోసం పరుగులు దాచి పెట్టుకున్నాడని అనిపిస్తోంది" అనడంతో గవాస్కర్, హర్బజన్‌లు నవ్వారు. ''నిజమే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం కూడా'' అని గవాస్కర్ అనడంతో.. ''అవును అది కూడా కరెక్టే'' అని ఇషాన్ పేర్కొనడం గమనార్హం. చదవండి: 'నేను చేసేది సరైనదే.. ఎక్కువగా పరిగెత్తించకండి' వివాదాస్పద ట్వీట్‌కు లైక్ కొట్టిన జడేజా.. లోలోపల బాధ నిజమేనా..? -
రోహిత్ శర్మ పేరిట అత్యంత చెత్త రికార్డు..
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఆర్సీబీతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 8 బంతుల్లో ఏడు పరుగులు చేసి హసరంగా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ ఐపీఎల్లో అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అవడం రోహిత్‌కు ఇదే తొలిసారి. ఈ సీజన్లో రోహిత్ గత ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా 2,3,0,0,7 పరుగులు చేశాడు. గతంలో 2017 ఐపీఎల్లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్ సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యాడు. తాజాగా తన చెత్త రికార్డును తానే బద్దలుకొట్టడం గమనార్హం. ఈ సీజన్లో రోహిత్ 11 మ్యాచ్‌లాడి 191 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒకే ఒక్క అర్థసెంచరీ నమోదు చేశాడు. చదవండి: ఆర్సీబీకి అచ్చిరాని మూడో స్థానం.. -
ఆర్సీబీకి అచ్చిరాని మూడో స్థానం..
ఐపీఎల్ 16వ సీజన్లో మూడో స్థానం బ్యాటింగ్ ఆర్సీబీకి అచ్చి రావడం లేదు. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఆర్సీబీ ఆటగాడు డకౌట్ లేదా పది పరుగుల లోపే వెనుదిరగడం గమనార్హం. ఇప్పటివరకు సీజన్లో ఆర్సీబీ పది మ్యాచ్‌లు ఆడగా.. వరుసగా ఏడుసార్లు మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ప్లేయర్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఆర్సీబీ తరపున మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్ రెండుసార్లు సున్న పరుగుల వద్ద ఔట్ కాగా, మహిపాల్ లామ్రోర్ కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక షాబాజ్ అహ్మద్ రెండుసార్లు రెండు పరుగులు చేసి ఔటవ్వగా.. అనూజ్ రావత్ 9,6 పరుగులు చేసి వెనుదిరిగాడు. అంతకముందు ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఈ స్థానంలో కోహ్లి ఎక్కువగా వచ్చేవాడు. అయితే కొన్నేళ్లుగా కోహ్లి ఓపెనర్‌గా వస్తుండడంతో మూడో స్థానంలో వస్తున్న బ్యాటర్లు విఫలమవుతూ వస్తున్నారు. అయితే కొంతమంది అభిమానులు.. ''ఏం చేద్దామంటవ్ మరి''.. మూడో స్థానం బ్యాటింగ్‌ను లేపేద్దామా'' అంటూ సరదాగా కామెంట్ చేశారు. చదవండి: క్యాచ్ డ్రాప్.. రోహిత్ కోపానికి అర్థముంది! -
ఏ స్థానంలో వచ్చినా అంతే.. విసుగెత్తిస్తున్నాడు!
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వైఫల్యం కొనసాగుతుంది. 13.25 కోట్లు పెట్టినందుకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే సెంచరీతో చెలరేగిన బ్రూక్ ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఓపెనర్ నుంచి ఐదో స్థానం వరకు బ్యాటింగ్ వచ్చినా అదే దారుణ ఆటతీరు కనబరుస్తున్నాడు. తాజాగా గురువారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ నాలుగో స్థానంలో వచ్చి డకౌట్ అయ్యాడు. అయితే ఇదే కేకేఆర్‌పై ఈ సీజన్లో సెంచరీ మార్క్ అందుకున్న బ్రూక్ ఈసారి మాత్రం పేలవంగా ఔట్ అయ్యాడు. స్పిన్ ఆడడంలో తన బలహీనతను మరోసారి బయటపెట్టాడు. అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు మరోసారి దొరికిపోయాడు. అనుకుల్ ఫుల్‌లెంగ్త్ డెలివరీ వేయగా.. బ్రూక్ అడ్డుకునే ప్రయత్నంలో ప్యాడ్లకు తాకింది. దీంతో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో సెంచరీ మినహా బ్రూక్ మిగతా 8 మ్యాచ్‌లు కలిపి 79 బంతులు ఎదుర్కొని 63 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. బ్రూక్ ఆటతీరుపై అభిమానులు మరోసారి ట్రోలింగ్‌కు దిగారు. ''ఏ స్థానంలో వచ్చినా అదే ఆటతీరు.. విసుగెత్తిస్తున్నాడు''.. ''ఆడించింది చాలు.. బెంచ్‌కు పరిమితం చేయడం మేలనుకుంటా'' అని కామెంట్ చేశారు. #HarryBrook feels like he conquered India again after making a 💯 on a flat track and made comments on the Indian fans, now he will get roasted based on his lean patch after that. A huge Kudos to #SRH team management who continue to buy these expensive foreign players who have… pic.twitter.com/N50bbUZbUS — Pichaa Paati (@Pichaa_paati) May 4, 2023 చదవండి: డెత్ ఓవర్లలో 'కింగ్' అనిపించుకుంటున్న రింకూ సింగ్ -
Mayank Agarwal: మారని ఆటతీరు.. ఏ స్థానంలో ఆడించినా అంతే!
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ దారుణ ఆటతీరు కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం సీఎస్కేతో మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా కాకుండా ఐదో స్థానంలో వచ్చాడు. కానీ ఏ స్థానంలో వచ్చినా తన ఆటతీరు మారదని మరోసారి నిరూపించాడు మయాంక్. నాలుగు బంతులెదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అసలు వికెట్ టు వికెట్ బౌలింగ్ చేసి జడేజా బౌలింగ్‌లో ఫ్రంట్‌ఫుట్ రావడమే తప్పు.. అలాంటి ధోని కీపర్‌గా ఉన్నప్పుడు అలా చేయడం ఇంకా పెద్ద తప్పు. క్షణం కూడా ఆలస్యం చేయని ధోని వికెట్లను ఎగురగొట్టేశాడు. కనీసం అంచనా లేకుండా ఫ్రంట్‌ఫుట్ షాట్‌కు యత్నించడం మయాంక్ ఆట ఎంత పేలవంగా ఉందనేది చూపించింది. ఓపెనర్‌గా విఫలమయ్యాడని ఫినిషర్ రోల్లో పంపిస్తే దానికి న్యాయం చేయలేకపోయాడు. వాస్తవానికి 2022 సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్ అయిన తర్వాత మయాంక్ అగర్వాల్ ఆట పూర్తిగా మసకబారుతూ వచ్చింది. పంజాబ్ కింగ్స్‌లో ఉన్నప్పుడు పరుగులు చేసిన మయాంక్ ఎస్ఆర్హెచ్లోకి వచ్చాకా తన బ్యాటింగ్‌నే పూర్తిగా మరిచిపోయాడు. అలాంటి మయాంక్‌పై ఎస్ఆర్హెచ్ కూడా రూ. 8.5 కోట్లు చెల్లించి తీసుకున్నప్పటికి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటివరకు మయాంక్ ఆరు మ్యాచ్‌లాడి 115 పరుగులు మాత్రమే చేశాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 48 పరుగులు చేసినప్పటికి చాలా బంతులు వృథా చేశాడు. అసలు ముందు మయాంక్‌ను కాదు అనాల్సింది.. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ను. తలా తోక లేకుండా జట్టును తయారు చేసింది. గత్యంతరం లేకనే మయాంక్ అగర్వాల్‌కు అవకాశం ఇస్తున్నారు. అయితే కనీసం రానున్న మ్యాచ్‌ల్లో ఆఖర్లో బ్యాటింగ్‌కు వస్తున్న అబ్దుల్ సమద్‌కు ప్రమోషన్ ఇచ్చి బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపితే బాగుంటుందేమో. ఇక మయాంక్ ఆటతీరుపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. మీరు ఒకసారి లుక్కేయండి. Speeds in #Chennai today: Duronto Express ⚡ Jaddu's sword⚡⚡ Dhoni's gloves ⚡⚡⚡#CSKvSRH #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @msdhoni pic.twitter.com/p7qtuEe9AI — JioCinema (@JioCinema) April 21, 2023 Ayindhi edho ayindhi oka vandha unchukoni migatha auction dabbulu icheyi @mayankcricket pic.twitter.com/Ve1EsOLfoL — వేటగాడు (@rao_4005) April 21, 2023 Bus lo iddharu rajinikanth lu undaga crease ela daatav ra @mayankcricket — King of the jungle (@tigersathhii) April 21, 2023 Every one down contender of Indian team is in academy these days... Tripathi and Hooda❤️🔥 Whereas Mayank Agarwal today came as finisher, finished his innings with 2 runs off 4 balls, consistency at its peak😍🔥 #CSKvSRH — TukTuk Academy (@TukTuk_Academy) April 21, 2023 చదవండి: సుందరానికి తొందరెక్కువ.. తప్పించుకోవడం కష్టం! -
PBKS Vs RCB: 'జట్టులో ఎందుకున్నాడో మరిచిపోయాడు.. గుర్తుచేయండి'
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కార్తిక్ ఐదు బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. సీజన్లో ఆరో మ్యాచ్ ఆడుతున్న కార్తిక్ వరుసగా 0,9,1*,0,28,7 పరుగులు చేశాడు. ఆరు మ్యాచ్‌లు కలిపి కేవలం 45 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. ఇందులో ఒక మ్యాచ్‌లో ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చి ఒక్క పరుగుతో నాటౌట్‌గా ఉన్నాడు.. కానీ మిగతా ఐదు మ్యాచ్‌ల్లో మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అసలు దినేశ్ కార్తిక్ ఆర్సీబీ జట్టులోకి వచ్చిందే ఫినిషర్ పాత్రలో. గత సీజన్లో 16 మ్యాచ్‌ల్లో 330 పరుగులు చేసి మంచి ఫినిషర్‌గా గుర్తింపు పొంది ఏకంగా టి20 వరల్డ్‌కప్‌లోనే చోటు దక్కించుకున్నాడు. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన కార్తిక్ పెద్దగా రాణించలేకపోయాడు. Photo: IPL Twitter కనీసం ఐపీఎల్లో అయినా తన ఫినిషర్ పాత్రను పోషిస్తాడనుకుంటే అదీ లేదు. సీఎస్కేతో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లో కార్తిక్ 14 బంతుల్లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పటికే డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌లు సుడిగాలి ఇన్నింగ్స్‌లతో చెలరేగి ఆర్సీబీని రేసులో ఉంచారు. కానీ స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన కార్తిక్ ఆరంభంలో దూకుడు ప్రదర్శించినప్పటికి చివరి వరకు నిలబడలేకపోయాడు. ఫినిషర్ అంటే చివరి వరకు నిలబడి మ్యాచ్‌ను పూర్తి చేయాలి. అది ఓటమి అయినా గెలుపు అయినా. కానీ కార్తిక్ ఆ సూత్రం మరిచిపోయాడు. టార్గెట్‌ను చేధించాలనే కోరికతో ధాటిగా ఆడే ప్రయత్నంలో వికెట్‌ను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఆర్సీబీ మ్యాచ్‌లో ఓటమి పాలయ్యింది. Photo: IPL Twitter తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ కార్తిక్ అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్‌లు 16 ఓవర్లలో 137/0తో మంచి ఫ్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఔటయ్యారు. ఈ దశలో ఆర్సీబీకి ఇంకా మూడు ఓవర్లు మిగిలే ఉన్నాయి. ఫినిషర్ అనేవాడు ఆఖర్లో తక్కువ ఓవర్లుంటే హిట్టింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ కార్తిక్ తాను ఫినిషర్ అన్న విషయమే మరిచిపోయి మెల్లిగా ఆడాడు. ఆడిన ఐదు బంతుల్లో ఏడు పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఒత్తిడి అంటే పర్లేదు.. కానీ తొలి ఇన్నింగ్స్‌లో అలా ఉండదు. ఒత్తిడి ఉండదు కాబట్టి వచ్చిన బ్యాటర్లు యథేచ్చగా బ్యాట్ ఝులిపించే అవకాశం ఉంటుంది. కానీ కార్తిక్ మాత్రం అలా చేయలేకపోయాడు. దీంతో అభిమానులు కార్తిక్‌పై ట్రోల్స్ వర్షం కురిపించారు. ''కార్తిక్ తన రోల్ ఏంటో మరిచిపోయినట్లున్నాడు.. గుర్తుచేయాల్సిన అవసరం వచ్చింది..'' అంటూ కామెంట్ చేశారు. Dinesh Karthik in this IPL 2023 be like 😅#RCBvsPBKS #IPL2O23 #DK pic.twitter.com/iXMKyWgBsz — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) April 20, 2023 Dinesh Karthik in IPL 2023- 0 (3) 🦆 9 (8) 1*(1) 0 (1) 🦆 28 (14) 7 (5) 45 Runs 32 Balls 140.63 SR 9 Average 5 Single Digit Scores#RCBvsPBKS — Melon Rusk 😎 (@CricCrazyRaj) April 20, 2023 -
టెస్టులాడేటోడిని ఐపీఎల్ ఆడిస్తే ఇలానే ఉంటుంది!
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఎస్ఆర్హెచ్ గేమ్ స్ట్రాటజీ ఎవరికి అంతుచిక్కదు. టి20లంటే వేగానికి మారుపేరు అన్న సంగతి పక్కనబెట్టి టెస్టులు ఆడే ఆటగాడికి కోట్ల రూపాయలు గుమ్మరించి జట్టులోకి తీసుకుంది. తీరా జట్టులోకి వచ్చాకా వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ దారుణంగా విఫలమైతే ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఆ బాధను హ్యారీ బ్రూక్ రూపంలో ఎస్ఆర్హెచ్ అనుభవిస్తుందని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్ రూ.13.25 కోట్లు పెట్టి ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్‌ను కొనుగోలు చేసింది. అయితే అంతకముందు టెస్టులో హిట్టింగ్ చేశాడన్న ఒక్క కారణంతో హ్యారీ బ్రూక్‌కు అన్ని కోట్లు తగలేసింది. టెస్టుల్లోనే హిట్టింగ్ చేశాడంటే టి20ల్లో ఇంకా ఎలా ఆడుతాడో అన్న పిచ్చి స్ట్రాటజీ ఎస్ఆర్హెచ్ను నవ్వుల పాలయ్యేలా చేసింది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ రాజస్తాన్ రాయల్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో బ్రూక్ పూర్తిగా విఫలమయ్యాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవాల్సిన సమయంలో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 21 బంతుల్లో ఎదుర్కొని కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సరే ఫస్ట్ మ్యాచులో ఏదో టెన్షన్ లో ఔట్ అయ్యాడు అనుకుంటే.. రెండో మ్యాచులో ఇంకా దారుణంగా ఔటయ్యాడు. లక్నోతో జరిగిన మ్యాచులో 4 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన హ్యారీ బ్రూక్ స్టంపౌట్ అవ్వడం ఆసక్తి కలిగించింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలానే ఆడేది అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. 13.25 కోట్లు ఖర్చు చేసిన హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ చూసి ఫ్యాన్స్ తీవ్ర నిరాశపడుతున్నారు. అయితే, నిజానికి బ్రూక్‌కు టెస్టు క్రికెట్లో నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలను వన్డేలు, టీ20ల్లో రిపీట్ చేయలేకపోయాడు. ఇప్పటి వరకు కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడిన బ్రూక్ 10 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు, మూడు అర్ధశతకాలు బాదాడు. ఇంగ్లండ్ తరఫున 20 టి20లను ఆడిన బ్రూక్ 372 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 26.57 మాత్రమే ఉన్నా స్ట్రైక్‌రేట్ మాత్రం 140కి దగ్గరగా ఉంది. భవిష్యత్తులోనైనా హ్యారీ బ్రూక్ తన ధరకు న్యాయం చేసి.. మంచి ఇన్నింగ్స్ లు ఆడతాడని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. చదవండి: Amit Mishra: స్టన్నింగ్ క్యాచ్.. వయసుతో పనేంటి? -
సూర్యకుమార్ వన్డే కెరీర్ ముగిసినట్లే!
ఆస్ట్రేలియాతో సిరీస్ ఓడిపోయినప్పటికి టీమిండియా మళ్లీ ఫుంజుకునే అవకాశం ఉంది. కానీ ఒక్క ఆటగాడి వన్డే కెరీర్ మాత్రం ప్రమాదంలో పడినట్లే. అతనే సూర్యకుమార్ యాదవ్. టి20ల్లో సూపర్‌స్టార్‌గా పేరు పొందిన సూర్యకుమార్ వన్డేల్లో మాత్రం ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో వరుసగా మూడు వన్డేల్లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి చెత్త ప్రదర్శన కనబరిచాడు. టి20ల్లో దూకుడుగా ఆడినప్పటికి బంతిని చూసి ఆడడం అతనికి అలవాటు. కానీ వన్డేలకు వచ్చేసరికి అతని బ్యాట్ మూగబోయింది. క్రీజులో నిలదొక్కుకునే సమయం కూడా ఇవ్వకుండా ప్రత్యర్థి బౌలర్లు అతన్ని పెవిలియన్ చేరుస్తున్నారు. వరుసగా మూడుసార్లు గోల్డెన్ డక్ అయ్యాడంటే వన్డేలకు సూర్య పనికిరానట్లే. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో సూర్య ఔటైన విధానం చూస్తే అసలు ఆడుతుంది సూర్యనేనా అన్న అనుమానం వచ్చింది. మూడుసార్లు తొలి బంతికే వెనుదిరిగాడు. శ్రేయాస్ అయ్యర్ లోటును తీరుస్తాడని సూర్యను వన్డేలకు ఎంపికచేస్తే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఇక రానున్న కాలంలో సూర్య వన్డేలు ఆడేది అనుమానమే. ఎందుకంటే ప్రస్తుతం సూర్యకుమార్ వయస్సు 32 ఏళ్లు. మహా అయితే మరో రెండేళ్లు ఆడొచ్చు. ఈ ప్రదర్శనతో అతను వన్డే వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికవడం కూడా అనుమానమే. అందుకే అభిమానులు కూడా సూర్యకుమార్‌పై దుమ్మెత్తిపోశారు. కొందరి కోసం టాలెంట్ ఉన్న ఆటగాళ్లను తొక్కేస్తున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్య కేవలం టి20 మెటిరీయల్ మాత్రమే.. సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చినా బాగుండేది.. కొద్దిరోజులయితే టి20ల్లో కూడా సూర్య భారంగా మారే అవకాశం ఉంది. అంటూ కామెంట్స్ చేశారు. WOW 😮 #INDvAUS pic.twitter.com/NL11tnLbBY — ESPNcricinfo (@ESPNcricinfo) March 22, 2023 One Golden Duck is enough to give you top tier respect in NBDC Department but you chose to score THREE back to back golden ducks, I repeat three golden ducks in a row, Take a bow for King Suryakumar Yadav🔥🙇♂️ #INDvAUS pic.twitter.com/RQV6mxVH6I — TukTuk Academy (@TukTuk_Academy) March 22, 2023 -
అన్నింటా విఫలం.. కెప్టెన్‌గా పనికిరాదా?
స్మృతి మంధాన.. టీమిండియా మహిళల క్రికెట్లో ఒక సంచలనం. దూకుడైన ఆటతీరుకు నిర్వచనంగా చెప్పుకునే మంధాన బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2023)లో మాత్రం నిరాశజనక ప్రదర్శన నమోదు చేసింది. పైగా స్టార్ క్యాంపెయినర్ హోదా కట్టబెట్టి వేలంలో ఆర్సీబీ.. భారత మహిళల జట్టులో అందరికంటే ఎక్కువగా రూ.3.40 కోట్లు మంధానపై గుమ్మరించి కొనుగోలు చేసింది. అంతేకాదు ఏదో చేస్తుందని చెప్పి ఆమెను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇలా కెప్టెన్ అయిందో లేదో ఒత్తిడిలో పడిన స్మృతి మంధాన బ్యాటర్‌గా, కెప్టెన్‌గా పూర్తిగా విఫలమయ్యింది. కెప్టెన్‌గా అనుభవలేమి ఆమెలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆర్సీబీ కెప్టెన్‌గా వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన మంధాన బ్యాటర్‌గానూ పూర్తిగా విఫలమైంది. ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయని ఈమె ఎనిమిది మ్యాచ్‌లు కలిపి 18.6 సగటుతో కేవలం 149 పరుగులు మాత్రమే చేసింది. ఇక కెప్టెన్‌గానూ ఆమె అంతగా సక్సెస్ కాలేకపోయింది. సోఫీ డివైన్ వల్ల ఒక మ్యాచ్.. రిచా ఘోష్ వల్ల మరొక మ్యాచ్ గెలిచిన ఆర్సీబీకి కెప్టెన్‌గా మంధాన చేసిందేమి లేదు. అందుకే వచ్చే సీజన్లో మంధానను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే మంచిదని చాలా మంది అభిప్రాయపడ్డారు. డబ్ల్యూపీఎల్‌లో కెప్టెన్‌గా నిరాశపరిచిన మంధాన భవిష్యత్తులో టీమిండియా వుమెన్ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాలను కూడా పోగొట్టుకుంది. కెప్టెన్సీ ఒత్తిడి లేకపోతేనే ఆమె బాగా ఆడతుంది అన్న ముద్రను మరింత సుస్థిరం చేసుకుంది. ఇన్నాళ్లు డబ్ల్యూపీఎల్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమైన మంధాన తాజాగా బౌలింగ్‌లోనూ దారుణ ప్రదర్శన ఇచ్చింది. రాక రాక బౌలింగ్‌కు వచ్చిన ఆమె ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఒక్క ఓవర్ వేసిన ఆమె ఓవర్‌ను కూడా పూర్తిగా వేయలేకపోయింది. ఐదు వైడ్లు వేసి ప్రత్యర్థి జట్టును గెలిపించింది. కేవలం మూడు బంతులు మాత్రమే సరిగ్గా వేసిన ఆమె మిగతా ఐదు బంతులు వైడ్లు వేయడం గమనార్హం. ఇక మంధానను విరాట్ కోహ్లితో కొంత మంది పోల్చారు. కోహ్లి కూడా తన తొలి ఐపీఎల్ సీజన్లో ఒక్క హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. ఆ తర్వాత సీజన్ నుంచి మాత్రం దుమ్మురేపే ప్రదర్శనతో సుస్థిరంగా పరుగులు సాధిస్తూ వచ్చాడు. మంధాన కూడా కోహ్లి లాగే తొలి సీజన్లో విఫలమైందని.. మలి సీజన్ నుంచి మాత్రం తన బ్యాటింగ్ పవర్ చూపిస్తుందని ఆమె అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. A season to forget for Smriti Mandhana. pic.twitter.com/shh9eGOTDg — Mufaddal Vohra (@mufaddal_vohra) March 21, 2023 Both Virat Kohli (IPL) and Smriti Mandhana (WPL) have failed to score a fifty in their inaugural season for RCB. 📸: IPL/WPL pic.twitter.com/K1Pu5CORHD — CricTracker (@Cricketracker) March 21, 2023 చదవండి: ఓటమితో ముగింపు.. ఆర్సీబీకి తప్పని నిరాశ -
సూర్యకుమార్ వన్డేలకు పనికిరాడా?
సూర్యకుమార్ యాదవ్.. టి20ల్లో ఐసీసీ నెం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. టి20 క్రికెట్లో అతన్ని ఆపే శక్తి ఏ బౌలర్‌కు లేదన్న తరహాలో రెచ్చిపోతుంటాడు. 2021 మార్చిలో టి20 ఆరంగ్రేటం తర్వాత ఒకటికి మూడు సెంచరీలు బాదిన సూర్యకుమార్ యాదవ్.. రెండేళ్లలో 13 హాఫ్ సెంచరీలు చేసి 46.52 సగటుతో 1675 పరుగులు చేశాడు. ఇది పొట్టి క్రికెట్లో అతని గణాంకాలు. కానీ వన్డే ఫార్మాట్‌కు వచ్చేసరికి మాత్రం సూర్యకుమార్ తేలిపోతున్నాడు. దూకుడుకు మారుపేరైన సూర్య వన్డేల్లో మాత్రం ఇమడలేకపోతున్నాడు. టి20ల్లో అరంగేట్రం చేసిన మూడు నెలల్లోనే అంటే 2021 జూలైలో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 21 వన్డే మ్యాచ్‌ల్లో 19 ఇన్నింగ్స్‌లు ఆడి 27.06 సగటుతో 433 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేల్లో అతని ఖాతాలో ఇప్పటివరకు కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో సూర్యకుమార్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. గత పది మ్యాచ్‌ల్లో సూర్య చేసిన స్కోర్లు వరుసగా 13, 9,8, 4, 34, 6, 4, 31, 14 , 0 పరుగులు చేశాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా ఫిఫ్టీ మార్క్ అందుకోలేకపోయిన సూర్య ఆరుసార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. వాస్తవానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి కానీ అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కానీ సూర్యకుమార్ యాదవ్‌కి చోటు లేదు. వన్డేల్లో నిలకడగా రాణిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో సూర్యకు చాన్స్ ఇచ్చారు. అయితే సూర్య మాత్రం 50 ఓవర్ల ఫార్మాట్లో తన ప్లాఫ్ షో కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇషాన్ కిషన్ పరిస్థితి అంతంతే.. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీ బాది లైమ్‌లైట్‌లోకి వచ్చాడు యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. అయితే ఆ తర్వాత అదే దూకుడును కొనసాగించలేకపోతున్నాడు. దీనికి తోడు గిల్ రాణిస్తుండడంతో ఇషాన్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. తాజాగా రోహిత్ శర్మ తొలి వన్డేకు దూరంగా ఉండడంతో ఇషాన్‌కు మరోసారి అవకాశమొచ్చింది. అయితే వచ్చిన చాన్స్‌ను ఇషాన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ కూడా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కి ఆడతారు. అంతేకాదు ఈ ఇద్దరూ ఒకే మ్యాచ్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశారు. టీ20ల్లో ఎలా ఉన్నా వన్డే ఫార్మాట్లోనూ ఒకేలా ఫెయిల్ అవుతూ వస్తున్నారు. చదవండి: IND Vs AUS 1st ODI: దూకుడు చూసి మూడొందలు అనుకున్నాం.. అబ్బే! IND Vs AUS: కోహ్లి వికెట్‌తో మిచెల్ స్టార్క్ అరుదైన ఫీట్ -
'మరో రెండు మ్యాచ్‌లు చూస్తారు.. తర్వాత తీసేయడమే'
ఆసియాకప్‌లోనూ టీమిండియా వైస్‌కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతుంది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్.. ఆ తర్వాత హాంకాంగ్‌తో మ్యాచ్‌లో 34 పరుగులు చేసినప్పటికి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో బ్యాటింగ్ విభాగంలో తీవ్ర పోటీ నెలకొంది. రానున్న టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని బెస్ట్ టీమ్‌ను తయారు చేయాలని భావిస్తున్న బీసీసీఐకి ఎవరికి జట్టులో చోటు కల్పించాలనేది సమస్యగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే కేఎల్ రాహుల్ మాత్రం పూర్ ఫామ్‌తో తన స్థానానికి ఎసరు తెచ్చుకునేలా ఉన్నాడు. ఇదే విషయమై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ మాట్లాడాడు. కేఎల్ రాహుల్ ఇలాగే ఆడితే ఒకటి.. రెండు మ్యాచ్‌లు చూస్తారు.. ఆ తర్వాత ఇక జట్టులోంచి తీసేయడమే జరుగుతుందన్నారు.''టీమిండియాలో ఇప్పుడు కాంపిటీషన్ తీవ్రంగా పెరిగిపోయింది. జింబాబ్వే పర్యటనలో, అంతకుముందు వెస్టిండీస్ పర్యటనలో శుబ్‌మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మెప్పించాడు. కాబట్టి ఏ ప్లేయర్ అయినా వరుసగా ఫెయిల్ అవుతూ ఉంటే అతను ఫామ్‌లోకి వచ్చేదాకా వెయిట్ చేసే పరిస్థితి లేదు. టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీలకు పెద్దగా సమయం కూడా లేదు. ఈ విషయాలను కేఎల్ రాహుల్ దృష్టిలో పెట్టుకోవాలి. అతనికి రెండు, మూడు మ్యాచుల సమయం మాత్రమే ఉంది. ఆ మ్యాచుల్లో కూడా అతను విఫలమైతే... సెలక్టర్లు, ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తారు. రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా.. ఇలా ఓపెనింగ్ స్లాట్ విషయంలో ఇప్పటికే టీమిండియా ప్రయోగాలు చేసింది. వీరితో పాటు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్ కూడా పోటీలో ఉన్నారు. కాబట్టి కేఎల్ రాహుల్ ఎంత త్వరగా ఫామ్‌లోకి వస్తే అంత బెటర్. ఒకవేళ ఇలాగే ఆడితే మాత్రం జట్టు నుంచి తీసేయడం ఖాయం'' అంటూ పేర్కొన్నాడు. సౌతాఫ్రికా టూర్ తర్వాత లంక, వెస్టిండీస్ టూర్లకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, గాయం కారణంగా స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి కూడా దూరమయ్యాడు. ఐపీఎల్ 2022 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌కి కెప్టెన్‌గా 616 పరుగులు చేసిన కేఎల్ రాహుల్, అదే ఫామ్‌ని అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగించలేకపోయాడు. గాయంతో సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌కి దూరమైన రాహుల్, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు దూరమయ్యాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సమయానికి కెఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకున్నా... కరోనా వచ్చి అతన్ని ఆడకుండా చేసింది. అనంతరం జింబాబ్వే వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి సక్సెస్ అయిన రాహుల్ బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. ప్రస్తుతం అదే చెత్త ఫామ్‌ను ఆసియాకప్‌లోనూ కొనసాగిస్తున్నాడు. చదవండి: సూపర్-4కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్.. గాయంతో జడేజా ఔట్ Asia Cup 2022: 'రోహిత్ శర్మ భయపడుతున్నాడు.. ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండడు' -
Virat Kohli: మారని ఆటతీరు.. వన్డే కెరీర్లో అత్యంత చెత్త రికార్డు
విరాట్ కోహ్లి ఫేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో బ్యాటింగ్‌లో కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. మూడు ఫోర్లతో మంచి టచ్‌లోనే కనిపించిన కోహ్లి మరోసారి ఆఫ్‌స్టంప్ బలహీనతను బయటపెట్టాడు. రీస్ టోప్లీ వేసిన గుడ్‌లెంగ్త్ డెలివరినీ అంచనా వేయడంలో పొరబడిన కోహ్లి ఫేలవమైన షాట్ ఆడి కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 17 పరుగుల వద్ద కోహ్లి కథ ముగిసింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో తొలి వన్డేకు దూరంగా ఉన్న కోహ్లి.. మిగిలిన రెండు వన్డేలు కలిపి 33 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే కోహ్లి తన వన్డే కెరీర్లోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. తాను వరుసగా ఆడిన చివరి ఐదు వన్డేల్లో కోహ్లి చేసిన పరుగులు 8,18,0,16,17. వరుసగా ఐదు వన్డేల్లో 20 పరుగులు ఒక్కసారి కూడా చేయకపోవడం కోహ్లికి ఇదే తొలిసారి. ఇంతకముందు ఎప్పుడు ఇలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదు. మారని ఆటతీరుతో విసిగిస్తున్నప్పటికి కోహ్లకి అటు అభిమానుల నుంచి.. తోటి ఆటగాళ్ల నుంచి మద్దతు మాత్రం బాగానే ఉంది. ప్రతీ ఒక్క బ్యాటర్‌కు బ్యాడ్‌ఫేజ్ ఉండడం సహజం.. కానీ కోహ్లి విషయంలో ఇంకా దారుణంగా ఉంది. కోహ్లి సెంచరీ చేసి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. 71వ సెంచరీ అందుకుంటాడని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులను మరోసారి నిరాశకు గురిచేసిన కోహ్లి.. సెంచరీ మాట పక్కనబెడితే ఫిప్టీ సాధించడానికి కూడా నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో కోహ్లి జట్టుకు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. చదవండి: రోహిత్‌ను కాదని కోహ్లి డైరెక్షన్లో సిరాజ్ బౌలింగ్.. ఫలితం! Liam Livingstone: అక్కడుంది లివింగ్‌స్టోన్.. 'కన్స్ట్రక్షన్ సైట్లోకి బంతి' -
ఓపెనర్‌గా వచ్చినా అదే ఆటతీరు.. పక్కన పెట్టాల్సిందేనా!
ఆర్సీబీ సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి విఫలమయ్యాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన పోరులో కోహ్లి ఓపెనర్‌గా వచ్చాడు. బ్యాటింగ్‌లో ప్రమోషన్ వచ్చినా.. పరుగులు చేయడంలో మాత్రం ఫెయిలయ్యాడు. ఆరంభంలోనే రెండు ఫోర్లు కొట్టి టచ్‌లోకి వచ్చినట్లు అనిపించినప్పటికి ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 9 పరుగులకే కోహ్లి తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. వాస్తవానికి తొలి ఓవర్లో బౌల్ట్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పంచుకున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన కోహ్లి ప్రసిధ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో షార్ట్‌పిచ్ అయిన నాలుగో బంతిని కోహ్లి చూసుకోకుండానే హిట్ చేశాడు. ఒక దిక్కు వెళుతుందనుకుంటే.. బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా బంతి వెళ్లింది. పరాగ్ ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు. కాగా ఈ సీజన్లో కోహ్లి ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు కలిపి 128 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లి అత్యధిక స్కోరు 47 కాగా.. సీజన్లో రెండుసార్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం విశేషం. కోహ్లి ఆటతీరుపై క్రికెట్ ఫ్యాన్స్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ఓపెనర్‌గా వచ్చిన ఆటతీరు మారలేదు.. ఏ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చినా అదే ఆటతీరు.. పక్కన పెట్టే సమయం ఆసన్నమైంది'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Kohli Golden Duck: మేము చూస్తున్నది కోహ్లిని కాదు.. ఇంకెవరో! pic.twitter.com/yRgM9yXP4E — James Tyler (@JamesTyler_99) April 26, 2022 Bro what happened to you @imVkohli 🥹 This guy used to score tons , now not even scoring 20+ runs 😭 — S◢thwik. (@viratesque_18) April 26, 2022 I think, this man is finished 🥲@imVkohli @BCCI #DineshKarthik #chahal pic.twitter.com/lLz5Wa2fhC — NITESH PAUL (@niteshpaul95) April 26, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఏందయ్యా ఈ ఆటతీరు.. పాక్‌తో మ్యాచ్ చాలా బెటర్
Fans Troll Team India Batting Failure Vs NZ.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. రోహిత్‌ను కాదని ఓపెనర్‌గా పంపిన ఇషాన్ కిషన్ 4 పరుగులే చేయగా.. ఫామ్‌లో ఉన్నాడని భావించిన రాహుల్ కూడా 18 పరుగులు చేసి ఔటయ్యాడు. చదవండి: IND Vs NZ: ఔట్ నుంచి తప్పించుకున్న రోహిత్.. రితికా శర్మ రియాక్షన్ ఇక వన్‌డౌన్‌లో వచ్చిన రోహిత్ శర్మ తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డప్పటికీ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. 14 పరుగులకే రోహిత్ పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అర్థసెంచరీతో రాణించిన కోహ్లి మరోసారి దానిని రిపీట్ చేయలేకపోయాడు. కేవలం తొమ్మిది పరుగులే చేసి సోథీ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పంత్ కూడా 12 పరుగులు చేసి మిల్నే బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. చదవండి: Mohammad Shahzad: టి20 క్రికెట్లో మహ్మద్ షెహజాద్ అరుదైన ఘనత దీంతో టీమిండియా టాపార్డర్ ఆటతీరుపై దారుణమైన ట్రోల్స్ మొదలయ్యాయి. అసలు ఆడుతుందా టీమిండియానేనా అన్నట్టుగా ఉంది.. ఐపీఎల్ మోజూ ఇంకా టీమిండియాకు పోనట్టుంది.. పాకిస్తాన్‌తో మ్యాచ్ చాలా బెటర్.. కనీసం పోరాడారు.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేశారు.. ఇంకేంటి మరి అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో కూడా ఓడిపోండి.. దరిద్రం వదులుతుంది అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. ప్రస్తుతం అభిమానులు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
ఏంటి మోర్గాన్.. జట్టు మొత్తం ఓకే.. మరి నీ పరిస్థితి!
KKR Captain Eoin Morgan Failure As Batsman.. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఐపీఎల్లో పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా మోర్గాన్ వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. ఐపీఎల్ తొలి అంచె పోటీల్లో అంతంతమాత్రమే ప్రదర్శన నమోదు చేసిన కేకేఆర్.. రెండో ఫేజ్‌లో మాత్రం దుమ్మురేపుతుంది. సెకండ్‌ఫేజ్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన కేకేఆర్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. ఇదే సమయంలో మోర్గాన్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా 7,8,0,2 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక గోల్డెన్ డక్ ఉండడం కూడా విశేషం. చదవండి: IPL 2021: షమీ సూపర్ త్రో.. డెబ్యూ మ్యాచ్‌లోనే రనౌట్ Courtesy: IPL Twitter అంతేగాక అశ్విన్‌తో మోర్గాన్ గొడవ ఐపీఎల్లో హైలెట్‌గా మారింది. తప్పు ఎవరిదన్నది పక్కనపెడితే.. వీరిద్దరి గొడవపై ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. కాగా మోర్గాన్ ఆటతీరుపై క్రికెట్ ఫ్యాన్స్ విపరీతమైన ట్రోల్స్ చేశారు. ముందు గొడవల పడడం ఆపి నీ ఆటతీరుపై దృష్టి పెట్టు.. ఏంటిది మోర్గాన్.. జట్టుకు నాయకత్వం వరకు బాగానే ఉంది.. కానీ నీ ఆట పరిస్థితి ఏంటి.. అంటూ కామెంట్స్ చేశారు. కేకేఆర్ ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠిలు కేకేఆర్‌కు మెరుపు ఆరంభాలనిస్తూ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఆఖరిలో ఓడిపోయింది. చదవండి: KL Rahul: అది క్లియర్‌గా ఔట్.. థర్డ్ అంపైర్‌పై మండిపడ్డ గంభీర్! Eoin Morgan in IPL 2021: Innings - 11. Runs - 109. Average - 10.90. Strike Rate - 100.92. Fifty plus score - 0. Thirty plus score - 1. Double digit scores - 2. Single digit scores - 9. — Mufaddal Vohra (@mufaddal_vohra) October 1, 2021 Eoin Morgan after facing one ball#KKRvsPBKS #IPL2021 pic.twitter.com/QhaF3PexM1 — King Soham 🇮🇳 (@Soham1706) October 1, 2021 -
'వైన్' వన్నె తగ్గుతోందా!
ధోని అనూహ్య వైఫల్యం ఒక్కో పరుగు కోసం శ్రమించిన బ్యాట్స్‌మన్ కెరీర్లో చేదు జ్ఞాపకంలాంటి ఇన్నింగ్స్ ధోనిని అంతగా అలా నిరాశా నిస్పృహలతో చూసి ఎన్నేళ్లయింది? ఎన్ని కీలక మ్యాచ్‌లు ఓడినా ముఖంలో ఎలాంటి భావాలు కనపడనీయకుండా స్థితప్రజ్ఞత కనబర్చే అతను ఒక్క వన్డే ఓటమికి ఇంతగా బాధ పడతాడా? నాలుగో వన్డే ముగిశాక ధోనిని చూస్తే ఇలాగే అనిపించింది. అవుటై వచ్చిన తర్వాత ప్యాడ్లు కూడా విప్పకుండా చివరి ఓవర్లో భారత్ పరాజయాన్ని చూస్తూ ఉండిపోవాల్సి రావడం అతను తన తప్పుగానే భావించి ఉంటాడా? అది తాను గెలిపించాల్సిన మ్యాచ్. కానీ తన వల్ల కాకపోవడం ఓటమికంటే ధోనిని ఎక్కువగా బాధించినట్లుంది. సహచరుడు కదిలిస్తే గానీ ఈ లోకంలోకి రాలేనంత పరధ్యానంలో అతను కనిపించాడు. 103 బంతులు ఆడితే గానీ ఒక ఫోర్ కొట్టలేని,108 బంతులకు గానీ అర్ధ సెంచరీ చేయలేని ధోనిని ఎప్పుడైనా చూశామా? రెండో మ్యాచ్ ఆడుతున్న అనామకుడు కెస్రిక్ విలియమ్స్ 22 బంతుల్లో ధోనిని సింగిల్ కూడా తీయకుండా ఆపడమేంటి? పేరు లేని ఇద్దరు స్పిన్నర్లు కలిపి వేసిన 68 బంతుల్లో ధోని 28 పరుగులు మాత్రమే చేయడమేంటి? దూకుడుకు మారుపేరైన ధోని స్వీప్ షాట్‌తో పరుగులు రాబట్టాలని ప్రయత్నించడం మీకు ఎప్పుడైనా గుర్తుందా? వయసుతో పాటు వన్నె పెరిగే వైన్లాంటివాడినని చెప్పుకున్న ధోని ఆట అనూహ్యం. మూత తీసిన వైన్‌లా అతనూ ‘ఎక్స్పైరీ డేట్’కు చేరువయ్యాడా అనే సందేహాలు ఈ ఇన్నింగ్స్ రేకెత్తించింది. సాక్షి క్రీడా విభాగం కాన్పూర్‌లో దక్షిణాఫ్రికాతో, లాడర్‌హిల్‌లో వెస్టిండీస్‌తో, హరారేలో జింబాబ్వేతో, తాజాగా నార్త్ స్టాండ్‌లో విండీస్‌తో... ధోని దాదాపు చివరి వరకు క్రీజ్‌లో ఉండి అతనిపై నమ్మకం ఉంచుకున్న సమయంలో గెలిపించలేక విఫలమైన ఇటీవలి మ్యాచ్‌లు ఇవి. మ్యాచ్‌ను ఫినిష్ చేయాలంటే ధోనినే అనిపించే స్థితి నుంచి ఇప్పుడు తడబడుతున్న తీరు... మారిన అతని ఆటకు అద్దం పడుతోంది. గతంలో ఇదే వెస్టిండీస్ గడ్డపై శ్రీలంతో చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు కావాల్సి ఉండగా మూడే షాట్లు 6, 4, 6తో అతను ముగించాడు. తీవ్ర ఒత్తిడితో ఉండే చివరి ఓవర్లలో మరో బ్యాట్స్‌మన్‌ను కూడా నమ్మకుండా తనపైనే నమ్మకముంచడం అతని ఆత్మవిశ్వాసానికి సంకేతంగా కనిపించేది. దాదాపు మూడేళ్ల క్రితం ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అంబటి రాయుడుకు స్ట్రైకింగ్ నిరాకరించిన ఘటన దీనికి చక్కటి ఉదాహరణ. పై మ్యాచ్‌లను చూస్తే ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికాపై 11 పరుగులు (బౌలర్ రబడ), జింబాబ్వేపై 8 పరుగులు (మద్జివా), విండీస్‌పై 8 పరుగులు (డ్వేన్ బ్రేవో) చేయడంలో ధోని విఫలమయ్యాడు. వేగానికి కళ్లెం... ఆదివారం మ్యాచ్ తర్వాత ధోని ఆటను అంచనా వేసేందుకు ప్రత్యేకమైన కారణం ఉంది. గెలిపించలేకపోయిన గత మ్యాచ్‌లలో ధోని చివర్లోనే బ్యాటింగ్‌కు వచ్చి ధనాధన్‌గా ముగించాల్సిన పరిస్థితిలో ఆడాడు. కానీ నాలుగో వన్డేలో అతను 13వ ఓవర్లోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. చాలా సేపు క్రీజ్‌లో గడిపిన తర్వాత కూడా పరిస్థితిని బట్టి ఆడలేకపోవడం అతని వైఫల్యాన్ని చూపిస్తోంది. ఈ విషయంలో పిచ్‌ను కూడా తప్పు పట్టలేం. గత మ్యాచ్‌లో ఇంతకంటే కఠినమైన వికెట్‌పై ధోని 78 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్‌లో అతను ఎంతో స్వేచ్ఛగా ఆడాడు. ధోని అనుభవాన్ని బట్టి చూస్తే 49వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి స్ట్రైకింగ్ కాపాడుకుంటారని అంతా భావించారు. కానీ పేలవ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరిగడంతో చివరి ఓవర్లో చేసేందుకు ఏమీ లేకపోయింది. తక్కువ వ్యవధిలో కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా అవుటైన తర్వాత కూడా ధోని బ్యాటింగ్‌లో దూకుడు పెంచలేకపోయాడు. స్వల్ప ఛేదనలో జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా విఫలమైనప్పుడు ధోనినే తప్పు పట్టడం సరైంది కాదనిపిస్తుంది. కానీ ఇలాంటి మ్యాచ్‌ల విజయాలతోనే తన పేరు అల్లుకుపోయి ఉందని... ఇది తాను కచ్చితంగా ఫినిష్ చేయాల్సిన మ్యాచ్ అని ధోనికి కూడా తెలుసు. అదే బాధ అతనిలో మ్యాచ్ తర్వాత కనిపించింది. చివరి వరకు ఉంటే చాలు నేను గెలిపించగలననేది ధోని తరచుగా చెప్పే మాట. కానీ ఈ మ్యాచ్‌లో ఆ నమ్మకం పని చేయలేదు. మున్ముందు ఎలా... ధోని బ్యాటింగ్‌లో లోపమేమీ లేదంటూ మ్యాచ్ ముగిశాక బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ మాజీ కెప్టెన్‌కు మద్దతు పలికారు. అయితే ఇప్పటికే ద్రవిడ్ స్థాయి వ్యక్తి ధోని, యువరాజ్ సింగ్‌ల పాత్రపై సందేహాలు వ్యక్తం చేయడంతో తాజా ప్రదర్శన కూడా చర్చకు కారణం కావడం ఖాయం. యువ ఆటగాడు రిషభ్ పంత్‌ను ఆడించాలని కూడా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ధోని ఫిట్నెస్ విషయంలో ఇప్పటికీ ఎవరికీ సందేహాలు లేకున్నా... అతను గతంలోలాగా బ్యాట్స్‌మన్‌గా కీలక పాత్ర పోషించలేకపోతున్నాడనేది వాస్తవం. ఈ విషయం కెప్టెన్ కోహ్లికి కూడా బాగా తెలుసు. 2019 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని జట్టును తీర్చిదిద్దుతున్నామని బీసీసీఐ గానీ, సెలక్టర్లు గానీ పదే పదే చెబుతున్నారు. వచ్చే రెండేళ్ల పాటు తనదైన టీమ్‌ను సిద్ధం చేసుకోవాలని కోహ్లి భావించడం సహజం. ఇప్పుడు అన్నింటా అతని హవా సాగుతోంది. తాజా ఫామ్ ప్రకారం అతని జట్టులో ధోని, యువీలకు చోటు దక్కడం అంత సులువు కాదు! ఈ మ్యాచ్ ప్రదర్శన ధోని భవిష్యత్తును నిర్దేశించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మ్యాచ్ తర్వాత ధోనిని చూస్తే అతను కూడా స్వయంగా ఆ దిశగా ఆలోచించే ఉంటాడని అనిపిస్తుంది. టెస్టుల నుంచి రిటైర్మెంట్, వన్డే కెప్టెన్సీ వదులుకోవడంలాగే మళ్లీ అతను ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటాడా చూడాలి! -
మేలుకుంటే మేలు!
రాహుల్ ద్రవిడ్ క్రికెట్ ఆడినంతకాలం టెస్టుల్లో అతనికి తుది జట్టులో ఎప్పుడైనా చోటు లేదా? మరి ద్రవిడ్ వారసుడిగా పేరు తెచ్చుకున్న పుజారాకు ఎందుకు తుది జట్టులో స్థానం దక్కడం లేదు? టెస్టు స్పెషలిస్ట్ అనే ముద్ర ఉన్నా విరాట్ కోహ్లి సమయం మొదలయ్యాక అతనెందుకు బెంచ్‌కే పరిమితమవుతున్నాడు? తొలి టెస్టులో బ్యాటింగ్ వైఫల్యం తర్వాతైనా కోహ్లి, రవిశాస్త్రి ఆలోచించాల్సిన విషయాలివి. - జట్టు ప్రయోజనాలే ముఖ్యం - పుజారాకు చోటిస్తే మంచిది - కోహ్లి, శాస్త్రిల ఆలోచన మారాలి ప్రతి కెప్టెన్‌కూ ఓ శైలి ఉంటుంది. కోహ్లి తన శైలి ఇలాగే ఉండబోతోందంటూ తేల్చేశాడు. టెస్టు మ్యాచ్‌లు గెలవాలంటే కచ్చితంగా ఐదుగురు బౌలర్లుండాలని కుండబద్దలు కొట్టాడు. ఐదుగురు బౌలర్లు, కీపర్ పోగా మిగిలిన స్థానాలు ఐదే. కాబట్టి ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌తో టెస్టు ఆడాలి. ఇందులో ఏ ఇద్దరు సెంచరీలు కొట్టినా సరిపోతుంది. శ్రీలంకతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇదే జరిగింది. కాబట్టి వెంటనే కోహ్లి ఆలోచన అద్భుతమంటూ మీడియా ఆకాశానికెత్తింది. కానీ రెండు రోజులు తిరిగేసరికి భ్రమలన్నీ తొలగిపోయాయి. 176 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 112 పరుగులకే కుప్పకూలిన వైనంతో భారత క్రికెట్‌కు పెద్ద షాక్ తగిలింది. సరైన అస్త్రాన్ని వదిలేసి... ఎవరైనా యుద్ధానికి వెళుతున్నప్పుడు తనకు అందుబాటులో ఉన్న అస్త్రాల్లో మెరుగైన వాటిని తీసుకెళ్లాలి. కానీ కోహ్లి మాత్రం టెస్టు క్రికెట్లో భారత్‌లో ఉత్తమ ఆటగాడని పేరు తె చ్చుకున్న పుజారా అనే అస్త్రాన్ని పూర్తిగా వదిలేశాడు. ఇక టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి తమ టాప్-5 బ్యాట్స్‌మెన్‌లో పుజారా లేడని బహిరంగంగానే తేల్చేశారు. నిజానికి పుజారాను పక్కన పెట్టడానికి కారణం అతను ఆడిన చివరి 11 టెస్టుల్లో సెంచరీ లేకపోవడం. అయితే ఈ 11 టెస్టుల్లో అతని సగటు రోహిత్ శర్మ సగటు కంటే మెరుగ్గా ఉండటం విశేషం. నిజానికి సెంచరీలే జట్టులో ఉండటానికి కొలమానమైతే రోహిత్ శర్మ తన అరంగేట్రంలో వరుసగా రెండు సెంచరీలు చేసిన తర్వాత మళ్లీ శతకం ఊసే లేదు. టెక్నిక్ బాగుండాలి టెస్టుల్లో మూడో నంబర్లో బ్యాటింగ్ చేసే ఆటగాడికి అద్భుతమైన టెక్నిక్ కావాలి. తొలి బంతికే ఓపెనర్ అవుటైతే వెంటనే బరిలోకి దిగాల్సి రావచ్చు. టెస్టుల్లో మూడో స్థానం అత్యంత కీలకం. ద్రవిడ్ ఉన్నంతకాలం తన టెక్నిక్‌తో ఈ స్థానంలో భారత్‌కు ఢోకా లేకుండా పోయింది. తన తర్వాత పుజారా కూడా ఆకట్టుకున్నాడు. పుజారా దగ్గర టెక్నిక్ ఉంది. రోహిత్ బ్యాటింగ్‌లో క్లాస్ ఉంటుంది గానీ టెక్నిక్ తక్కువ. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో తను సరిగా ఆడలేడనే విషయం పలుమార్లు స్పష్టమైంది. ఆస్ట్రేలియాలో లియోన్, ఇంగ్లండ్‌లో మొయిన్ అలీ, బంగ్లాదేశ్‌లో షకీబ్‌ల బౌలింగ్‌లో తన బలహీనతలన్నీ బయటపడ్డాయి. క్లాస్ శాశ్వతమే అయినా... క్రికెట్లో ప్రతిసారీ వినిపించే మాట ‘క్లాస్ శాశ్వతం. ఫామ్ కాదు’ అని. మరి పరుగులు సాధించలేకపోయే క్లాస్‌ని ఏ జట్టైనా ఎంత కాలం భరించగలుగుతుంది? రోహిత్ తన చివరి 19 ఇన్నింగ్స్‌లో కేవలం రెండు అర్ధసెంచరీలు మాత్రమే చేశాడు. ఈ అన్ని ఇన్నింగ్స్‌ల్లోనూ పరుగులు రాకపోవడం కంటే తను అవుటైన విధానం ఆశ్చర్యం కలిగించింది. ఆఫ్‌స్టంప్ బయట వెళ్లే బంతులను వెంటాడటం... ఫుట్‌వర్క్ సరిగా లేకపోవడం... షాట్లు ఆడటంలో బద్దకం చూపించడం.... ఈ మూడు లక్షణాలు తరచుగా కనిపిస్తున్నాయి. వన్డేల్లో అతను బ్యాటింగ్ చేస్తుంటే కళ్లార్పకుండా చూడాలనిపిస్తుంది. కానీ టెస్టుల్లో మాత్రం పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. కుదురుకుంటే సూపర్ నిజానికి రోహిత్ శర్మ టాలెంట్‌ను ఎవరూ తక్కువ అంచనా వేయరు. తను ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే పరుగులు ధారాళంగా, వేగంగా కూడా వస్తాయి. అయితే దీనికి పుజారా లాంటి క్రికెటర్‌ను పక్కనబెట్టడం కరెక్ట్ కాదు. ఓ క్రికెటర్‌కు కెప్టెన్ అండగా నిలబడటం నిజంగా హర్షించదగిన విషయమే. కోహ్లి కూడా రోహిత్ మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. అయితే తనకు అవకాశం ఇవ్వడం కోసం మరో మంచి ఆటగాడిని బలిపశువును చేయకూడదు. ‘రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడు. ఓ ఆటగాడు మ్యాచ్ విన్నర్ అని నమ్మితే అతను పరుగులు చేయకపోయినా అవకాశాలు ఇవ్వాలి’ అని తొలి టెస్టు తర్వాత కూడా కోహ్లి వ్యాఖ్యానించాడు. దీనర్థం రెండో టెస్టులోనూ రోహిత్ కొనసాగుతాడనే. వ్యూహాలు మార్చలేరా? టెస్టు గెలవాలంటే ఐదుగురు బౌలర్లు అవసరమనే వ్యూహం ఉపఖండం పిచ్‌లపై పెద్దగా వర్తించదు. ఏ విదేశీ జట్టు కూడా ఐదుగురు బౌలర్లతో భారత్‌లో, శ్రీలంకలో టెస్టులు ఆడదు. కారణం... ఇక్కడి స్పిన్ వికెట్లు. తొలి టెస్టులో శ్రీలంక కూడా ఇద్దరు స్పిన్నర్లతోనే ఆడింది. నిజానికి భారత్ తరఫున కూడా ఇద్దరు స్పిన్నర్లు మాత్రమే ప్రభావం చూపారు. అద్భుతమైన స్పిన్ ట్రాక్‌పై కూడా హర్భజన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ చెలరేగి ఆరు వికెట్లు తీస్తే... హర్భజన్ 8 ఓవర్లు మాత్రమే వేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్‌పై ప్రభావం కాస్త తగ్గినప్పుడు కూడా అశ్విన్ ఆరు వికెట్లు తీస్తే... హర్భజన్ విఫలమయ్యాడు. నిజానికి రోహిత్ పా ర్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్నర్‌గా ఉపయోగపడతాడు. కాబ ట్టి ఈ సిరీస్‌లో మిగిలిన టెస్టుల వరకైనా హర్భజన్‌ను పక్కకు పెట్టి అదనంగా బ్యాట్స్‌మన్‌ను తీసుకోవడం నయం. ఆలోటు బిన్నీ తీర్చగలడా..? భారత జట్టుకు మంచి ఆల్‌రౌండర్ లేని లోటు చాలాకాలంగా ఉంది. రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తాడనుకుంటే అతను జట్టులోకి రావడానికే కష్టపడుతున్నాడు. ఇక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క పిల్ తర్వాత మరొకరు రాలేదు. వన్డే ప్రపంచకప్‌లో పేస్ ఆల్‌రౌండర్‌గా బిన్నీని ఆస్ట్రేలియా తీసుకెళ్లినా ఒక్క మ్యాచ్ కూడా అవకాశం రాలేదు. ఇప్పుడు భారత జట్టు అకస్మాత్తుగా బిన్నీని పిలవడానికి కారణం... ఒక ఆల్‌రౌండర్ కావాలని కోరుకోవడమే. ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని మార్చలేక... ఒక బౌలర్‌ను తగ్గించి పేసర్‌ను తీసుకోవాలని భావించి ఉండొచ్చు. అయితే స్పిన్‌కు సహకరించే వికెట్లపై బౌలర్‌గా బిన్నీ ఏ మేరకు ప్రభావం చూపగలడనేది సందేహమే. ఒక్క టెస్టు ముగియగానే జట్టుతో పాటు ఉన్న ఆట గాళ్లను కాదని మరో క్రికెటర్ని పిలిపించిన సంప్రదాయం కూడా ఇంతకుముందు లేదు. -
'వాకా' వాకిట్లో బోల్తా!
ముక్కోణపు టోర్నీ నుంచి భారత్ అవుట్ ఫైనల్ చేరని టీమిండియా చివరి లీగ్ మ్యాచ్‌లో ఓటమి 3 వికెట్లతో నెగ్గిన ఇంగ్లండ్ రాణించిన టేలర్, బట్లర్ వికెట్ కోల్పోకుండా 83 పరుగులు. భారత్‌కు లభించిన ఆరంభమిది. మరో 117 పరుగులకు మొత్తం టీమ్ పెవిలియన్ చేరిపోయింది. ఇది మన బ్యాటింగ్ వైఫల్యం. 66 పరుగులకే ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయింది. కానీ విజయం మాత్రం వారి పక్షాన నిలిచింది. ఇది మన బౌలర్ల నిలకడలేమి. అతి జాగ్రత్తతో మొదలై, ఆ తర్వాత తడబడుతూ సాగి, కాస్త నిర్లక్ష్యం కూడా తోడై భారత్ ఇన్నింగ్స్‌ను దెబ్బ తీస్తే... అనుభవం తక్కువైనా, కీలక సమయంలో ఆచితూచి ఆడి నెలకొల్పిన భాగస్వామ్యం ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు చేర్చింది. భారత్‌కు ఈ పర్యటనలో ఒక్క విజయమూ లేకుండా చేసింది. {పపంచకప్కు సన్నాహకం అంటూ హోరెత్తించిన టోర్నీ నుంచి భారత్ నిష్ర్కమించింది. నిజంగా అలసటో, ఓడినా పోయేదేముందని భావించారో మొత్తానికి మన జట్టు ఆట మాత్రం అన్ని రంగాల్లో తీసికట్టుగా అనిపించింది. స్పష్టత లేని బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ వైఫల్యం, జట్టు కూర్పులో సమస్య... ఇలా సమాధానం దొరకని శేష ప్రశ్నలతోనే మన సాధన ముగిసింది. ఇక నేరుగా ప్రపంచ కప్ బరిలోకి దిగడమే మిగిలింది. పెర్త్: ముక్కోణపు వన్డే టోర్నీలో భారత్ ఫైనల్ చేరడంలో విఫలమైంది. శుక్రవారం ఇక్కడి వెస్టర్న్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ (వాకా) మైదానంలో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. రెండు విజయాలతో 9 పాయింట్లు పొందిన ఇంగ్లండ్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో పోరుకు సిద్ధమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.1 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. రహానే (101 బంతుల్లో 73; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. శిఖర్ ధావన్ (65 బంతుల్లో 38; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఇంగ్లండ్ లక్ష్య ఛేదనలో కాస్త తడబడినా 46.5 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసి విజయాన్నందుకుంది. జేమ్స్ టేలర్ (122 బంతుల్లో 82; 4 ఫోర్లు), బట్లర్ (78 బంతుల్లో 67; 7 ఫోర్లు) ఆరో వికెట్‌కు 125 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బిన్నీకి 3 వికెట్లు దక్కాయి. ఓపెనింగ్ మినహా: ఘోరంగా విఫలమవుతూ వస్తున్న శిఖర్ ధావన్ ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో కాస్త నిలకడ ప్రదర్శించాడు. సున్నా వద్దే రనౌట్ నుంచి తప్పించుకున్న ధావన్, ఆ తర్వాత రహానేతో కలిసి ఎటువంటి సాహసాలు చేయకుండా జాగ్రత్తగా ఆడాడు. ఫలితంగా పవర్ ప్లేలో జట్టు 34 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే 21వ ఓవర్లో ధావన్‌ను అవుట్ చేసి వోక్స్ ఇంగ్లండ్‌కు బ్రేక్ ఇచ్చాడు. అంతే... ఆ తర్వాత ఏ దశలోనూ జట్టు ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. మళ్లీ మూడో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి (8), సురేశ్ రైనా (1)లను వరుస ఓవర్లలో అవుట్ చేసి మొయిన్ అలీ భారత్‌ను దెబ్బ తీశాడు. అంబటి రాయుడు (12) కూడా ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. మరోవైపు 71 బంతుల్లో రహానే అర్ధ సెంచరీ పూర్తయింది. ఇంగ్లండ్ బౌలర్లు చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. బెల్ అద్భుత క్యాచ్‌తో బిన్నీ (7), నిర్లక్ష్యంగా ఆడి జడేజా (5) అవుట్ కాగా, ధోని (17) వికెట్ల ముందు దొరికిపోయాడు.చివర్లో షమీ (18 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో స్కోరు 200కు చేరింది. కీలక భాగస్వామ్యం: స్వల్ప విజయలక్ష్యమే అయినా ఇంగ్లండ్‌కు విజయం సులువుగా దక్కలేదు. ఫామ్‌లో ఉన్న బెల్ (10)ను చక్కటి బంతితో మోహిత్ అవుట్ చేయగా, అక్షర్ బౌలింగ్‌లో అలీ (17) వెనుదిరిగాడు. ఈ దశలో స్టువర్ట్ బిన్నీ చెలరేగాడు. తాను వేసిన నాలుగు ఓవర్ల వ్యవధిలో అతను మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లం డ్‌ను ఇబ్బందుల్లో పడేశాడు. అయితే టేలర్, బట్లర్ భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. 21 పరుగుల వద్ద బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో రైనా వదిలేయడం వారికి కలిసొచ్చింది. గెలుపునకు చేరువగా వచ్చాక వీరిద్దరు అవుటైనా, ఇబ్బంది లేకుండా మరో 19 బం తులు ఉండగానే ఇంగ్లండ్ మ్యాచ్ సొంతం చేసుకుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) బట్లర్ (బి) ఫిన్ 73; ధావన్ (సి) బట్లర్ (బి) వోక్స్ 38; కోహ్లి (సి) రూట్ (బి) అలీ 8; రైనా (సి) వోక్స్ (బి) అలీ 1; రాయుడు (సి) బట్లర్ (బి) బ్రాడ్ 12; ధోని (ఎల్బీ) (బి) అండర్సన్ 17; బిన్నీ (సి) బెల్ (బి) ఫిన్ 7; జడేజా (సి) ఫిన్ (బి) బ్రాడ్ 5; పటేల్ (సి) బెల్ (బి) ఫిన్ 1; మోహిత్ (నాటౌట్) 7; షమీ (సి) బట్లర్ (బి) వోక్స్ 25; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (48.1 ఓవర్లలో ఆలౌట్) 200 వికెట్ల పతనం: 1-83; 2-103; 3-107; 4-134; 5-136; 6-152; 7-164; 8-164; 9-165; 10-200; బౌలింగ్: అండర్సన్ 9-1-24-1; వోక్స్ 9.1-1-47-2; బ్రాడ్ 10-1-56-2; ఫిన్ 10-0-36-3; అలీ 10-0-35-2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెల్ (ఎల్బీ) (బి) మోహిత్ 10; అలీ (సి) రాయుడు (బి) పటేల్ 17; టేలర్ (సి) బిన్నీ (బి) మోహిత్ 82; రూట్ (సి అండ్ బి) బిన్నీ 3; మోర్గాన్ (సి) ధావన్ (బి) బిన్నీ 2; బొపారా (సి) జడేజా (బి) బిన్నీ 4; బట్లర్ (సి) రాయుడు (బి) షమీ 67; వోక్స్ (నాటౌట్) 4; బ్రాడ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (46.5 ఓవర్లలో 7 వికెట్లకు) 201 వికెట్ల పతనం: 1-14; 2-40; 3-44; 4-54; 5-66; 6-191; 7-193; బౌలింగ్: బిన్నీ 8-0-33-3; మోహిత్ 10-1-36-2; షమీ 9-0-31-1; అక్షర్ పటేల్ 10-1-39-1; రవీంద్ర జడేజా 9.5-0-62-0.