Ishan Kishan Quips Rohit Sharma Poor-Batting-Form Saved Runs-Play-Offs - Sakshi
Sakshi News home page

Ishan Kishan: 'మా కెప్టెన్‌ బ్యాటింగ్‌ విఫలం వెనుక సీక్రెట్‌ అదే!'

Published Thu, May 11 2023 7:10 PM | Last Updated on Thu, May 11 2023 11:37 PM

Ishan Kishan Quips Rohit Sharma Poor-Batting-Form Saved Runs-Play-offs - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ విజయాల బాటలో ఉన్నప్పటికి ఒక అంశం మాత్రం కలవరపరుస్తోంది. అదే జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫామ్‌. ఈ సీజన్‌లో రోహిత్‌ తన మార్క్‌ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ 11 మ్యాచ్ లు ఆడిన రోహిత్.. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు.

ఆర్సీబీతో మ్యాచ్లోనూ ముంబై గెలిచినా.. రోహిత్ 7 పరుగులే చేశాడు. దీనికి తోడు గత ఐదు మ్యాచ్‌ల్లో సింగిల్‌ డిజిట్స్‌కే పరిమితమయి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ 11 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఐదు ఓటములతో 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 

ఇక రోహిత్ ఫామ్పై ముంబై బ్యాటర్ ఇషాన్ కిషన్ స్పందించాడు. హర్భజన్, సునీల్ గావస్కర్‌లతో జరిగిన సంభాషణలో.. మా కెప్టెన్‌ ప్లేఆఫ్స్ కోసం పరుగులు దాచిపెట్టాడని అందుకే ఆడడం లేదని పేర్కొన్నాడు. ఫామ్ లో లేని రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ లో ఎలా ఉంటున్నాడు? అతని ఆలోచనలు ఏంటి అని ఇషాన్‌ను అడిగారు.

దీనిపై ఇషాన్ స్పందిస్తూ.. "తన ఫామ్‌పై కెప్టెన్‌ రోహిత్‌ కంగారు పడటం లేదు. ప్రాక్టీస్ సెషన్స్లో తన ప్రాసెస్ పై అతడు దృష్టిపెడుతున్నాడు. కానీ ఈ ఆటలో పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా ఇబ్బంది పడటం చూశాం. కానీ నాకు తెలిసి అతడు ప్లేఆఫ్స్ కోసం పరుగులు దాచి పెట్టుకున్నాడని అనిపిస్తోంది" అనడంతో గవాస్కర్‌, హర్బజన్‌లు నవ్వారు. ''నిజమే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం కూడా'' అని గవాస్కర్ అనడంతో.. ''అవును అది కూడా కరెక్టే'' అని ఇషాన్ పేర్కొనడం గమనార్హం. 

చదవండి: 'నేను చేసేది సరైనదే.. ఎక్కువగా పరిగెత్తించకండి'

వివాదాస్పద ట్వీట్‌కు లైక్‌ కొట్టిన జడేజా.. లోలోపల బాధ నిజమేనా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement