IPL 2023 MI Vs RCB: Rohit Sharma Sets Unwanted IPL Record Of Single Digits Score - Sakshi
Sakshi News home page

#RohitSharma: రోహిత్‌ శర్మ పేరిట అత్యంత చెత్త రికార్డు..

Published Tue, May 9 2023 10:32 PM | Last Updated on Wed, May 10 2023 10:30 AM

Rohit Sharma Break-Own-Worst Record Dismiss-Single Digits Last 5 Innings - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఆర్‌సీబీతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ 8 బంతుల్లో ఏడు పరుగులు చేసి హసరంగా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 

ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్‌ ఐపీఎల్‌లో అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం అవడం రోహిత్‌కు ఇదే తొలిసారి. ఈ సీజన్‌లో రోహిత్‌ గత ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా 2,3,0,0,7 పరుగులు చేశాడు.

గతంలో 2017 ఐపీఎల్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్‌ సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యాడు. తాజాగా తన చెత్త రికార్డును తానే బద్దలుకొట్టడం గమనార్హం. ఈ సీజన్‌లో రోహిత్‌ 11 మ్యాచ్‌లాడి 191 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒకే ఒక్క అర్థసెంచరీ నమోదు చేశాడు.

చదవండి: ఆర్‌సీబీకి అచ్చిరాని మూడో స్థానం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement