Photo: IPL Twitter
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయమవంతమైన జట్టు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ఘనత ఆ జట్టు సొంతం. ఇప్పటివరకు ఫైనల్లో అడుగుపెట్టిన ఆరు సందర్భాల్లో ఐదుసార్లు టైటిల్‌ను గెలిచి కానీ వెళ్లలేదు. ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరుకోవడానికి మరో అడుగు దూరంలో ఉంది.
శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2లో గెలిస్తే ఏడోసారి ఫైనల్‌లో అడుగుపెట్టనుంది. అయితే గతంలో ముంబై ఇండియన్స్ ఆరుసార్లు ఫైనల్ చేరిన సందర్భాల్లో ఒక్కసారి మినహా మిగతా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఒకవేళ ఈసారి ఫైనల్‌కు వస్తే మాత్రం ముంబై ఆరోసారి విజేతగా నిలవడం గ్యారంటీ అని ఆ జట్టు అభిమానులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ చేసిన నెంబర్ సిగ్నల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ ఆడేందుకు హోటల్ రూం నుంచి బస్‌లో బయలుదేరిన సమయంలో.. ముంబై కెప్టెన్ రోహిత్ బస్సు కిటికీలోనుంచి అభిమానులను చూస్తూ ఆరు సంఖ్యను సిగ్నల్‌గా చూపిస్తూ ఈసారి కప్ మనదే అన్నట్లుగా సైగ చేశాడు. రోహిత్ అలా చూపించగానే ముంబై ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు.
ఈ సీజన్‌లో తొలి అంచె పోటీల్లో ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచి అసలు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ రెండో అంచె పోటీల్లో ముంబైకి ఎక్కడలేని బలం వస్తోంది. ఏ జట్టైనా ఆది నుంచి ఓటమలు ఎదురైతే డీలా పడడం చూస్తాం. కానీ ముంబై అలా కాదు.. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని రెండో అంచె పోటీల్లో వరుస విజయాలు సాధించి ఒక్కసారిగా ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. ఆర్‌సీబీ లక్నో చేతిలో ఓడిపోవడం.. అదే సమయంలో ముంబై ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలవడంతో నాలుగో జట్టుగా ప్లేఆఫ్‌లో అడుగుపెట్టింది.
ఇక ఎలిమినేటర్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ను 81 పరుగుల తేడాతో చిత్తు చేసి భారీ విజయాన్ని దక్కించుకొని క్వాలిఫయర్-2కు చేరుకుంది. అయితే క్వాలిఫయర్-2లో గుజరాత్‌ను ఓడించి ఫైనల్‌కు వచ్చిందా కప్ కొట్టకుండా మాత్రం పోదు. గత రికార్డులు కూడా అవే చెబుతున్నాయి. చూద్దాం మరి ముంబై ఇండియన్స్ ఆరోసారి కప్ కొడుతుందో లేదో..
Rohit Sharma gives signal to their fans, Hopefully 6th trophy loading 😌.#MIvsGT pic.twitter.com/LG88i1z8My
— 𝗥𝗼𝗵𝗶𝘁 𝗦𝗵𝗮𝗿𝗺𝗮 𝗙𝗮𝗻𝗰𝗹𝘂𝗯 (@LoyleRohitFan45) May 26, 2023
Comments
Please login to add a commentAdd a comment