IPL 2023, MI Vs SRH: Rohit Sharma Overcome His Negativity One Inning Against SunRisers Hyderabad Match - Sakshi
Sakshi News home page

#RohitSharma: ఒక్క ఇన్నింగ్స్‌తో నెగెటివ్‌ మొత్తం చెరిపేసుకున్నాడు

Published Sun, May 21 2023 8:04 PM | Last Updated on Mon, May 22 2023 9:28 AM

Rohit Sharma Over-Comes His Negitivity One Innings Vs SRH Match - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ ప్రదర్శనపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా తన మార్క్‌ ఇన్నింగ్స్‌ ఒక్కటి కూడా ఆడలేదు. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు ముందు వరకు రోహిత్‌ 13 మ్యాచ్‌ల్లో 257 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క అర్థశతకం మాత్రమే ఉంది.

అయితే ఆదివారం(మే 21) ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో 56 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ ఆడడమే గాక ఒక్క ఇన్నింగ్స్‌తో తనపై ఉన్న నెగెటివ్‌కు చెక్‌ పెట్టాడు. ఇలాంటి ప్రదర్శనలు రోహిత్‌కు కొత్తేం కాదు. ఆడడం లేదు.. రోహిత్‌ పని అయిపోయింది అన్న ప్రతీసారి తన మార్క్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగి ఫామ్‌లోకి రావడం అతనికి అలవాటు. అయితే ఒక్కసారి హిట్‌మ్యాన్‌ ఫామ్‌లోకి వస్తే మాత్రం ఆపడం ఎవరి తరం కాదు అని ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. 

చదవండి: సెంచరీతో ముంబైని గెలిపించిన గ్రీన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement