Photo: IPL TWitter
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఎస్‌ఆర్‌హెచ్ గేమ్ స్ట్రాటజీ ఎవరికి అంతుచిక్కదు. టి20లంటే వేగానికి మారుపేరు అన్న సంగతి పక్కనబెట్టి టెస్టులు ఆడే ఆటగాడికి కోట్ల రూపాయలు గుమ్మరించి జట్టులోకి తీసుకుంది. తీరా జట్టులోకి వచ్చాకా వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ దారుణంగా విఫలమైతే ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఆ బాధను హ్యారీ బ్రూక్ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్ అనుభవిస్తుందని చెప్పొచ్చు.
ఎస్‌ఆర్‌హెచ్ రూ.13.25 కోట్లు పెట్టి ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్‌ను కొనుగోలు చేసింది. అయితే అంతకముందు టెస్టులో హిట్టింగ్ చేశాడన్న ఒక్క కారణంతో హ్యారీ బ్రూక్‌కు అన్ని కోట్లు తగలేసింది. టెస్టుల్లోనే హిట్టింగ్ చేశాడంటే టి20ల్లో ఇంకా ఎలా ఆడుతాడో అన్న పిచ్చి స్ట్రాటజీ ఎస్‌ఆర్‌హెచ్‌ను నవ్వుల పాలయ్యేలా చేసింది.
ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ రాజస్తాన్ రాయల్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో బ్రూక్ పూర్తిగా విఫలమయ్యాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోవాల్సిన సమయంలో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 21 బంతుల్లో ఎదుర్కొని కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
సరే ఫస్ట్ మ్యాచులో ఏదో టెన్షన్ లో ఔట్ అయ్యాడు అనుకుంటే.. రెండో మ్యాచులో ఇంకా దారుణంగా ఔటయ్యాడు. లక్నోతో జరిగిన మ్యాచులో 4 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన హ్యారీ బ్రూక్ స్టంపౌట్ అవ్వడం ఆసక్తి కలిగించింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలానే ఆడేది అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. 13.25 కోట్లు ఖర్చు చేసిన హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ చూసి ఫ్యాన్స్ తీవ్ర నిరాశపడుతున్నారు.
అయితే, నిజానికి బ్రూక్‌కు టెస్టు క్రికెట్‌లో నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలను వన్డేలు, టీ20ల్లో రిపీట్ చేయలేకపోయాడు. ఇప్పటి వరకు కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడిన బ్రూక్ 10 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు, మూడు అర్ధశతకాలు బాదాడు. ఇంగ్లండ్ తరఫున 20 టి20లను ఆడిన బ్రూక్ 372 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 26.57 మాత్రమే ఉన్నా స్ట్రైక్‌రేట్ మాత్రం 140కి దగ్గరగా ఉంది. భవిష్యత్తులోనైనా హ్యారీ బ్రూక్ తన ధరకు న్యాయం చేసి.. మంచి ఇన్నింగ్స్ లు ఆడతాడని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment