స్మృతి మంధాన.. టీమిండియా మహిళల క్రికెట్‌లో ఒక సంచలనం. దూకుడైన ఆటతీరుకు నిర్వచనంగా చెప్పుకునే మంధాన బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2023)లో మాత్రం నిరాశజనక ప్రదర్శన నమోదు చేసింది. పైగా స్టార్ క్యాంపెయినర్ హోదా కట్టబెట్టి వేలంలో ఆర్‌సీబీ.. భారత మహిళల జట్టులో అందరికంటే ఎక్కువగా రూ.3.40 కోట్లు మంధానపై గుమ్మరించి కొనుగోలు చేసింది. అంతేకాదు ఏదో చేస్తుందని చెప్పి ఆమెను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
ఇలా కెప్టెన్ అయిందో లేదో ఒత్తిడిలో పడిన స్మృతి మంధాన బ్యాటర్‌గా, కెప్టెన్‌గా పూర్తిగా విఫలమయ్యింది. కెప్టెన్‌గా అనుభవలేమి ఆమెలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆర్‌సీబీ కెప్టెన్‌గా వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన మంధాన బ్యాటర్‌గానూ పూర్తిగా విఫలమైంది. ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయని ఈమె ఎనిమిది మ్యాచ్‌లు కలిపి 18.6 సగటుతో కేవలం 149 పరుగులు మాత్రమే చేసింది.
ఇక కెప్టెన్‌గానూ ఆమె అంతగా సక్సెస్ కాలేకపోయింది. సోఫీ డివైన్ వల్ల ఒక మ్యాచ్.. రిచా ఘోష్ వల్ల మరొక మ్యాచ్ గెలిచిన ఆర్‌సీబీకి కెప్టెన్‌గా మంధాన చేసిందేమి లేదు. అందుకే వచ్చే సీజన్‌లో మంధానను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే మంచిదని చాలా మంది అభిప్రాయపడ్డారు. డబ్ల్యూపీఎల్‌లో కెప్టెన్‌గా నిరాశపరిచిన మంధాన భవిష్యత్తులో టీమిండియా వుమెన్ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాలను కూడా పోగొట్టుకుంది. కెప్టెన్సీ ఒత్తిడి లేకపోతేనే ఆమె బాగా ఆడతుంది అన్న ముద్రను మరింత సుస్థిరం చేసుకుంది.
ఇన్నాళ్లు డబ్ల్యూపీఎల్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమైన మంధాన తాజాగా బౌలింగ్‌లోనూ దారుణ ప్రదర్శన ఇచ్చింది. రాక రాక బౌలింగ్‌కు వచ్చిన ఆమె ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఒక్క ఓవర్ వేసిన ఆమె ఓవర్‌ను కూడా పూర్తిగా వేయలేకపోయింది. ఐదు వైడ్లు వేసి ప్రత్యర్థి జట్టును గెలిపించింది. కేవలం మూడు బంతులు మాత్రమే సరిగ్గా వేసిన ఆమె మిగతా ఐదు బంతులు వైడ్లు వేయడం గమనార్హం.
ఇక మంధానను విరాట్ కోహ్లితో కొంత మంది పోల్చారు. కోహ్లి కూడా తన తొలి ఐపీఎల్ సీజన్‌లో ఒక్క హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. ఆ తర్వాత సీజన్ నుంచి మాత్రం దుమ్మురేపే ప్రదర్శనతో సుస్థిరంగా పరుగులు సాధిస్తూ వచ్చాడు. మంధాన కూడా కోహ్లి లాగే తొలి సీజన్లో విఫలమైందని.. మలి సీజన్ నుంచి మాత్రం తన బ్యాటింగ్ పవర్ చూపిస్తుందని ఆమె అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.
A season to forget for Smriti Mandhana. pic.twitter.com/shh9eGOTDg
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 21, 2023
Both Virat Kohli (IPL) and Smriti Mandhana (WPL) have failed to score a fifty in their inaugural season for RCB.
— CricTracker (@Cricketracker) March 21, 2023
📸: IPL/WPL pic.twitter.com/K1Pu5CORHD
Comments
Please login to add a commentAdd a comment